Friday, August 12, 2011
న్యూస్: 'రామదండు' పరిస్థితి ఏమిటి?
'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు' సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమెజ్ పొందిన స్థూలకాయ నటుడు కృష్ణుడు హీరోగా తన ప్రస్థానాన్ని ఎంతకాలం కొనసాగించ గలుగుతాడు? స్థూలకాయులు హీరోగా రాణించరనే నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ రెండు విజయాలు సాధించిన కృష్ణుడు వాటి తర్వాత వెనకడుగు వేశాడు. అతను హీరోగా నటించిన 'పప్పు', 'కోతిమూక', 'వైకుంఠపాళి', తాజాగా 'అమాయకుడు' సినిమాలు అటకెక్కాయి. ముఖ్యంగా 'కోతిమూక', 'అమాయకుడు' డిజాస్టర్‌గా నిలిచాయి. అందుకు ఆయా దర్శకులే (ఏవీయస్, భారతీ గణేశ్) ముఖ్య కారణమని చెప్పాలి. త్వరలో కృష్ణుడు 'నాకూ ఓ లవరుంది'లో హీరోగా కనిపించబోతున్నాడు. ఇదికాక పోయినేడాదే విడుదల కావలసిన 'రామదండు' అనే సినిమా ఇంతవరకూ అతీ గతీ లేకుండా ఆగిపోయి ఉంది. నరేష్‌తో రూపొందించిన 'దొంగల బండి' ద్వారా డైరెక్టర్‌గా పరిచయమైన వేగేశ్న సతీశ్ ఈ సినిమాకి దర్శకుడు. ఫుట్‌బాల్ నేపథ్యంలో ఈ సినిమాని అతను రూపొందించాడు. పిల్లలు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాలో కృష్ణుడు ఫుట్‌బాల్ కోచ్ పాత్రని చేశాడు. ఈ సినిమా ఎప్పుడు వెలుగు చూస్తుందోనని కృష్ణుడుతో పాటు అతని శ్రేయోభిలాషులంతా వెయిట్ చేస్తున్నారు. 'వినాయకుడు' సీరిస్‌తో తనకి దక్కిన సక్సెస్ గాలివాటం కాదనీ, హీరోగా సినిమాని క్యారే చేసే సత్తా తనకుందనీ అతను నిరూపించుకోవాలంటే వీటిలో ఓ సినిమా అయినా ఆడాలి. అది జరుగుతుందా?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment