Showing posts with label kv mahadevan. Show all posts
Showing posts with label kv mahadevan. Show all posts

Thursday, November 12, 2015

Synopsis of the movie UNDAMMA BOTTU PEDATHA (1968)

'ఉండమ్మా బొట్టుపెడతా' కథాంశం:

భూమిని నమ్ముకుని కాయకష్టం చేసి శ్రమించే దశరథరామయ్య (నాగయ్య) కుటుంబం ఒక సంవత్సరం పంటలు పుష్కలంగా పండించింది. అది గుర్తించిన ప్రభుత్వం ఆయనను 'కృషి పండిట్' బిదురుతో సత్కరించాలనుకుంది. ఆ బిరుదుకు తను అర్హుణ్ణి కాననీ, తన మనవరాలు లక్ష్మి అని చెబుతూ ఆయన తన కుటుంబ గాథను వివరిస్తాడు. ఆ కథ ప్రకారం...
దశరథరామయ్యకు నలుగురు కొడుకులు. పెద్ద కొడుకు శ్రీనివాసులు (నాగభూషణం) పేకాట మినహా మరో వ్యాపకంలేని వ్యక్తి. అతని భార్య తులశమ్మ (జానకి) మూఢభక్తి శిఖామణి. పత్రీ పుష్పాలతో దేవుణ్ణి కొలవడం తప్ప ఇల్లూ వాకిలీ చక్కదిద్దుకోవడం ఎరుగని ఇల్లాలు. రెండో కొడుకు వెంకటేశ్వర్లు (అర్జా జనార్దనరావు) కండబలంతో రౌడీగా బతుకుతూ, నిత్యం సారా మైకంతో భార్య శేషు (సూర్యకళ)పై పిడిగుద్దులు కురిపిస్తుంటాడు. పగలంతా మొగుడితో కీచులాటలాడి, తన్నులుతిని అదే ఊళ్లోని పుట్టింటికి పోవడం, రాత్రయ్యేసరికల్లా సింగారించుకుని మొగుడి పక్కలో చేరడం శేషు దినచర్య.
మూడో కొడుకు ఆంజనేయులు (చలం) మోజుపడి ఇంగ్లీష్ చదివిన అమ్మాయిని భార్యగా చేసుకొని, ఆమెకు బెడ్ కాఫీ అందిస్తూ వంటవాడిగా తయారైన మనిషి. ఆ భార్య సుమతి (మీనాకుమారి) అచ్చంగా కుమతి. మొగుణ్ణి వాజమ్మను చేసి దర్జా, దర్పం వెలిగిస్తూ ఉంటుంది. ఇక నాలుగో కొడుకు కృష్ణ (కృష్ణ) అవివాహితుడు. తన భాగానికొచ్చిన పొలాన్ని నమ్ముకొని తండ్రికి అండగా ఉన్న మంచివాడు.
బాధ్యత తెలీని కొడుకులూ, కోడళ్లతో అరాచకత్వం తాండవిస్తున్న ఇంటిని చూసి దశరథరామయ్య కుమిలిపోతుంటాడు. ఆ ఊళ్లోనే ఓ హరిదాసు (ధూళిపాళ) కుటుంబం ఉంటోంది. ఆయనకు ఒకే ఒక్క కూతురు లక్ష్మి (జమున). 'అడుగడుగున గుడివుంది, అందరిలో గుడివుంది' అని నమ్మిన యువతి. శుచి, శుభ్రం ఉన్న ఇంట్లోనే శ్రీ మహాలక్ష్మి కొలువుంటుందని ఆమె నమ్మకం.
హరిదాసు రోజూ ఊళ్లో భిక్షాటన చేసి, ఆ వచ్చిన బియ్యాన్ని పాపాయమ్మకు అమ్ముకుని, ఆ డబ్బు ఆమె వద్దే కూడబెడుతుంటాడు. ఆ డబ్బుతో కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనేది ఆయన సంకల్పం. పాపాయమ్మ (సూర్యకాంతం) పేరుకు తగినట్లే పాపాలపుట్ట. కాఫీ ఇడ్లీల దగ్గర్నుంచి 'రూపాయి సోడా' (సారా) దాకా ఆమె దగ్గర దొరుకుతాయి. ఎవరింట్లోనన్నా ఏ వస్తువైనా కనిపించలేదంటే అది పాపాయమ్మ ఇంట్లో తాకట్టుకు చేరివుంటుందని చెప్పుకుంటారు. లక్ష్మికి సంబంధం ఖాయం చేసుకున్న హరిదాసు తన డబ్బు కోసం పాపాయమ్మ దగ్గరకు వచ్చి అడుగుతాడు. ఆ డబ్బు ఇవ్వకపోగా హరిదాసే తన డబ్బు కాజేయడానికి తనను కొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆయనను అరెస్ట్ చేయిస్తుంది పాపాయమ్మ.
పీటలమీద పెళ్లి చెదిరిపోవడం, తన తండ్రి అపనిందకు గురికావడం భరించలేని లక్ష్మి ఆత్మహత్యకు పూనుకుంటుంది. ఆమెను కృష్ణ కాపాడతాడు. అదే ముహూర్తానికి లక్ష్మిని తనయింటి కోడలిగా చేసుకుంటాడు దశరథరామయ్య. ముష్టివాడి కూతుర్ని ఆ ఇంటి కోడల్ని చేసినందుకు పెద్ద కోడళ్లు ఈసడిస్తారు. అడుగడుగునా అవమానిస్తారు. తోడికోడళ్లు ఎలా ప్రవర్తించినా, ఆ ఇంటికి దీపంగా, భర్తకు నీడగా ఉంటూ వస్తుంది లక్ష్మి.
అరాచకత్వం, అపరిశుభ్రం తాండవిస్తున్న ఆ ఇంటినుండి శ్రీ మహాలక్ష్మి వెళ్లిపోతుండగా, ఆమెను అక్కడ నిలిపేందుకు ఆత్మత్యాగం చేసిన లక్ష్మి పేరంటాలై వెలుస్తుంది. ఆమె ఆత్మత్యాగంతో కళ్లు తెరిచిన ఆ కుటుంబం ఏకమై, అందరూ కష్టించి పనిచేసి, ఆ ఇంటిని సిరులతో కళకళలాడిస్తారు.

తారాగణం: కృష్ణ, జమున, గుమ్మడి, షావుకారు జానకి, ధూళిపాళ, సూర్యకాంతం, అంజలీదేవి, చలం, నాగభూషణం, నాగయ్య, అర్జా జనార్దనరావు, మీనాకుమారి, సూర్యకళ
సంగీతం: కె.వి. మహదేవన్
సమర్పణ: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: సి. సుందరం
దర్శకత్వం: కె. విశ్వనాథ్
బేనర్: బాబూ మూవీస్
విడుదల తేది: 28 సెప్టెంబర్ 1968

Monday, August 12, 2013

ఆనాటి సంగతి: వేటూరికి మహదేవన్ క్లాస్


ఎన్టీఆర్, జయప్రద, జయసుధ నటించిన 'అడవిరాముడు ' (1976) సినిమా చరిత్రను సృష్టించి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. సత్య చిత్ర సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకుడు. కె.వి. మహదేవన్ సంగీతం సమకూర్చగా వేటూరి రాసిన ప్రతి పాటా సూపర్ హిట్టే. వాటిలో 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ' పాట ఆ రోజుల్లో కోటి రూపాయల పాటగా పేరు తెచ్చుకుంది. వాడవాడలా మోగిపోయింది. ఆరింటిలో ఐదు పాటల్ని ఒకే తాళం.. త్రిశ్రంలో రాశారు వేటూరి. అందుకని ఆరో పాటనైనా చతురస్రంలో రాయమని ఆయనకు సూచించారు మహదేవన్. ఆరవది క్లైమాక్స్ పాట. వేటూరి రాసిన పాటను రాఘవేంద్రరావు ఓకే చేసి మహదేవన్ కు  ఇచ్చారు. అది మారు వేషాలతో సాగే పాట. మహదేవన్ కు సన్నివేశం చెప్పి పనిమీద వెళ్లిపోయారు రాఘవేంద్రరావు. పాట చూడగానే మహదేవన్ కోపంగా వేటూరిని చూస్తూ 'ఏం రాశావ్? చదువు' అన్నారు. 'చూడరా చూడరా సులేమాను మియ్యా' అని చదివారు వేటూరి. 'ఇది ఏం తాళం?' అని మహదేవన్ అడిగితే చతురస్రంలో రాశానన్నారు. తను పాడి వినిపించి 'ఇది చతురస్రమా?' అనడిగారు మహదేవన్. కాదన్నారు వేటూరి. తాళం మార్చి రాయమని ఆయనడిగితే ఎలా మార్చాలో వెంటనే వేటూరికి తెలియలేదు. ఇది గమనించిన మహదేవన్ ఇంకో రెండు 'చూడరా'లు తగిలిస్తే సరిపోతుందని చెప్పారు. దాంతో 'చూడర చూడర చూడర చూడర ఒక చూపూ సులేమాన్ మియా' అని తిరిగి రాశారు వేటూరి. అప్పుడది అవలీలగా చతురస్రంలో వచ్చింది. అందరూ విని ఊగిపోయారు.

Thursday, April 4, 2013

'స్త్రీ' (1973) రివ్యూ


ఆస్తులు, అంతస్థులు, అయినవాళ్లని కాదని ఆత్మీయత, అప్యాయత నిండిన మనసు కలిగిన ఓ ఆదర్శ వ్యక్తిని వివాహమాడి, జీవితంలో ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా ఎదురీదిన ఓ ధీరవనిత గాథ 'స్త్రీ'. కె. ప్రత్యగాత్మ రూపొందించిన ఈ చిత్రాన్ని శ్రీ పూర్ణా మూవీస్ బేనర్‌పై అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం. చంద్రశేఖర్ సంయుక్తంగా నిర్మిచారు.
ఈ సినిమాలో తల్లీ కూతుళ్లుగా చంద్రకళ ద్విపాత్రాభినయం హైలైట్. ఆడంబరం, అహంకారం లేని ఉత్తమురాలు తల్లి అయితే, అవే కూతురి లక్షణాలు. సమాజ శ్రేయస్సే తన శ్రేయస్సుగా తల్లి భావిస్తే, సొంత కోరికలు తీర్చుకోవడమే తన ధ్యేయంగా కనిపిస్తుంది కూతురు. ఈ రెండు పాత్రల్లోన్ని వ్యత్యాసాన్ని ప్రతి సన్నివేశంలో ప్రతిభావంతంగా ప్రదర్శించింది చంద్రకళ. చదువు, సంస్కారం ఉన్న ఉత్తమునిగా, నలుగురి కోసం పాటుపడే కార్మిక నాయకునిగా, తనను నమ్ముకొని వచ్చిన స్త్రీని చేరదీసి, అర్ధాంగిగా స్వీకరించిన గుణవంతునిగా కృష్ణంరాజు మంచి నటనని ప్రదర్శించాడు.
ధూళిపాళ, చంద్రమోహన్, రమణారెడ్డి, మాడా, వల్లం నరసింహారావు, కె.కె. శర్మ, వై.వి. రావు, రాళ్లపల్లి, శరత్‌బాబు, విజయభాను, సాయికుమారి, మమత, బేబీ గౌరి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
నిజానికి ఈ సినిమాకి అసలైన హీరో దర్శకుడు ప్రత్యగాత్మ. సన్నివేశాల కల్పన, వాటి చిత్రీకరణ, కథనం వంటి విషయాల్లో ఆయన పనితనం అడుగడుగునా గోచరిస్తుంది. మహదేవన్ సంగీతం, రావిశాస్త్రి సంభాషణలు, శేఖర్-సింగ్ సినిమాటోగ్రఫీ, బి.ఎన్. కృష్ణ కళా దర్శకత్వం ఈ సినిమాకి మంచి ఆకర్షణని తీసుకొచ్చాయి. అయితే దీనికి 'ఎ' సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారనేది అర్థం కాదు.

Saturday, December 1, 2012

అగ్నిపూలు (1981) - సమీక్ష


అత్యంత ప్రజాదరణ పొందిన యద్దనపూడి సులోచనారాణి నవల 'అగ్నిపూలు' ఆధారంగా అదే పేరుతో డి. రామానాయుడు నిర్మించిన సినిమాలో కృష్ణంరాజు, జయసుధ, జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు. కె. బాపయ్య దర్శకుడు. 'అగ్నిపూలు' కథలో భిన్న దృక్పథాలు, భిన్న వ్యక్తిత్వాలు ఉన్న పాత్రలెన్నో ఉన్నాయి. అన్ని పాత్రలకీ ప్రాముఖ్యం ఉంది. ఏ ఒక్క పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా రెండున్నర గంటల సినిమాగా దీన్ని తీర్చిదిద్దడంలో ఎంతో నేర్పు ప్రదర్శించాడు బాపయ్య.
రాజులు, రాజ్యాలు పోయినా దర్పం వదలని జమీందారు గోవింద వల్లభరాజా. ఆయన కుమారుడు శివప్రసాద్ అమెరికాలో ఉంటూ అక్కడే మేరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వారికి జానీ, బాబీ అనే ఇద్దరు పిల్లలు. భార్యా పిల్లలతో కలిసి తన ఇంటికి కొడుకు వస్తున్నాడని తెలిసి ఉగ్రుడైన వల్లభరాజా అతడికీ, తనకీ ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తాడు. ఆయన ఆస్తి మీద కన్నేసిన అల్లుడు విరూపాక్షి రాజా, కూతురు రాజేశ్వరి అగ్నికి ఆజ్యం పోస్తారు. ఇంటికి వచ్చిన శివప్రసాద్, మేరీలను ఔట్‌హౌస్‌లో ఉంచి అవమానిస్తారు. వల్లభరాజా చనిపోతే అతని మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతించరు.
కాలం గడిచి, విరూపాక్షి రాజా కూడా చనిపోతాడు. అతని కొడుకు కృష్ణ చైతన్య జమీందారీకి అధిపతి అవుతాడు. రుక్మిణి అనే అందాల భామను పెళ్లాడతాడు. ఒక ప్రమాదంలో రుక్మిణి అవిటిదవుతుంది. వల్లభరాజా భార్య అన్నపూర్ణ అభ్యర్థనపై శివప్రసాద్ పిల్లలు జానీ, బాబీలను ఇంటికి తీసుకొస్తారు. తన తల్లిదండ్రుల దారుణ మరణానికి కారకులైన విరూపాక్షి రాజా కుటుంబం మీద, ముఖ్యంగా కృష్ణ చైతన్య మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది జానీ. ఆమె చేష్టలు శాంత స్వభావుడైన కృష్ణ చైతన్యకు అర్థం కావు. జానీ దాచుకున్న డైరీ అతడికి దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది పతాక సన్నివేశాల్లో తెలుస్తుంది.
భిన్న దృక్పథాలు కలిగిని విరూపాక్షి రాజా, కృష్ణ చైతన్య పాత్రలు రెండింటినీ కృష్ణంరాజు ప్రశంసనీయంగా పోషించారు. ముఖ్యంగా విరూపాక్షి రాజాగా ఆయన నటన బాగా ఆకట్టుకుంటుంది. పగతో రగిలిపోయే జానీ పాత్రలో జయసుధ మరోసారి తన నటనా ప్రతిభను ప్రదర్శించింది. అవిటిదైన రుక్మిణిగా జయప్రద సమర్థవంతంగా నటించింది. ఆమె చేసిన సర్ప నృత్యం సినిమాకే హైలైట్. రాజేశ్వరిగా జయంతి పాత్ర పరిధి మేరకు బాగా చేసింది. సుధాకర్, నిర్మల, శ్రీధర్, గుమ్మడి, సత్యనారాయణ, సుమలత, సుభాషిణి, దిల్‌జిత్ వీర్ ఇతర పాత్రలు పోషించారు. శరత్‌బాబుకు మరికొన్ని డైలాగులు పెడితే బాగుండేది. అల్లు రామలింగయ్యపై చిత్రీకరించిన సన్నివేశాల ప్రయోజనం స్వల్పం.
జంధ్యాల మాటలు, ఆత్రేయ పాటలు, మహదేవన్ సంగీతం, వెంకట్ ఛాయాగ్రహణం సినిమాకి నిండుదనం తెచ్చాయి. మైసూరు లలితమహల్‌ను దర్శకుడు బాపయ్య చక్కగా వినియోగించుకున్నాడు. మొత్తానికి చక్కని నవలా చిత్రాన్ని చూసిన భావన ప్రేక్షకులకు కలుగుతుంది.

Wednesday, November 17, 2010

నేటి పాట: అవ్వా బువ్వా కావాలంటే (సోగ్గాడు)

చిత్రం: సోగ్గాడు (1975)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

ఆమె: అవ్వా బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయి
అతడు: అయ్యేదాకా ఆగావంటే, అవ్వైపోతావ్ అమ్మాయి
ఆమె: అయ్యో పాపం అత్తకొడుకని అడిగిన దిస్తానన్నాను
అతడు: వరుసా వావీ వుందికదా అని నేనూ ముద్దే అడిగాను
ఆమె: నాకూ యిద్దామని వుంది
అతడు: కానీ అడ్డేం వచ్చింది?
ఆమె: అంతటితో నువ్వాగుతావని నమ్మకమేముంది?
అతడు: బస్తీకెళ్లే మరదలుపిల్లా తిరిగొస్తావా మళ్లీ ఈలా
ఆమె: ఇంతకన్నా ఎన్నో ఎన్నో సొగసులు ఎదిగి వస్తాను
అతడు: ముడుపు కట్టుకుని తెస్తావా
ఆమె: మడి కట్టుకు నువ్వుంటావా
అతడు: ఈనగాచి నక్కలపాలు కాదని మాటిస్తావా?
ఆమె: పల్లెటూరి బావకోసం - పట్టా పుచ్చుకు వస్తాను
అతడు: పచ్చపచ్చని బ్రతుకే నీకు పట్టా రాసి యిస్తాను
ఆమె: కమతానికి నువ్వొస్తావా
అతడు: కామందుగ నువ్వుంటావా
ఆమె: శిస్తులేని, సేద్యం చేస్తానంటావా   ||అవ్వా||

Sunday, November 14, 2010

నేటి పాట: ఓ కుర్రవాడా వెర్రివాడా (పిచ్చిమారాజు)

చిత్రం: పిచ్చిమారాజు (1975)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: పి. సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ఆమె: ఓ కుర్రవాడా - వెర్రివాడా
ఎందుకిలా - నువ్వెందుకిలా
నన్నొదిలి యిలా పారిపోతావు

అతడు: ఓ కుర్రదానా - వెర్రిదానా
ఎందుకిలా -నువ్వెందుకిలా
నన్నొదలకిలా తరుముకొస్తావూ -

అతడు: నేలకి నింగికి కలవదమ్మా
నీకు నాకు పొత్తెపుడు కుదరదమ్మా

ఆమె: నింగిలోని వెన్నెలంత నేలకే సొంతము
నీకూ నాకూ ఉన్నది అదే బంధము   ||ఓ||

అతడు: చల్లగాలి ఊరుకోదు - పిల్లమనసు ఓర్చుకోదు
ఓర్చుకోనీ పిల్లదాన్ని ఓపలేను ఆపలేను

ఆమె: ఏం చేయమంటావు నన్ను
నన్నెలా వదలమంటావు నిన్ను    ||ఓ||

అతడు: అందాలతో నాకు బంధాలు వేయకు
పిచ్చివాణ్ణి మరీమరీ రెచ్చగొట్టకు

ఆమె: రెచ్చితే పిచ్చి ఎంతో ముచ్చటగ ఉంటుంది
ముచ్చటైన కౌగిట్లో పిచ్చి కుదిరిపోతుంది   ||ఓ||

Thursday, November 11, 2010

నేటి పాట: కలువకు చంద్రుడు యెంతో దూరం (చిల్లర దేవుళ్లు)

చిత్రం: చిల్లర దేవుళ్లు (1975)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

పల్లవి:
కలువకు చంద్రుడు యెంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
దూరమైన కొలది పెరుగును అనురాగం
విరహంలోనే వున్నది అనుబంధం    ||కలువకు||

చరణం 1:
నవ్వు నవ్వుకు తేడా వుంటుంది
నవ్వే అదృష్టం ఎవరికుంటుంది
ఏ కన్నీరైనా వెచ్చగ వుంటుంది
అది కలిమిలేములను మరిపిస్తుంది   ||కలువకు||

చరణం 2:
వలపుకన్నా తలపే తీయన
కలయికకన్నా కలలే తీయన
చూపులకన్నా యెదురుచూపులే తీయనా
నేటికన్నా రేపే తీయనా    ||కలువకు||

చరణం 3:
మనసు మనిషిని మనిషిగ చేస్తుంది
వలపా మనసుకు అందాన్నిస్తుంది
ఈ రెండూ లేక జీవితమేముంది
ఆ దేవుడికీ మనిషికీ తేడా ఏముంది   ||కలువకు||

Wednesday, November 10, 2010

నేటి పాట: నవ్వులు రువ్వే పువ్వమ్మా (గాజుల కిష్టయ్య)

చిత్రం: గాజుల కిష్టయ్య (1975)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

పల్లవి:
నవ్వులు రువ్వే పువ్వమ్మా - నీ
నవ్వులు నాకు ఇవ్వమ్మా
ఉన్న నాలుగునాళ్లూ నీలా
ఉండిపోతే చాలమ్మా

చరణం 1:
ఆకుల పయ్యెదలో నీ ఆడతనాన్ని దాచావు
రేకుల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు
ఆ ముసుగుతీసిన ముద్దుముఖాన
మొగ్గ సొగసే వుందమ్మా   ||నవ్వులు||

చరణం 2:
ఈ తోటమొత్తము కమ్మినవి - నీ
దోరవయసు అందాలు - ఈ
గాలి మత్తులో వున్నవి - నీ
కన్నె మనసులో కైపులు
నువ్వొలకబోసే ఒంపు సొంపులకు
ఒడిని పడతానుండమ్మా   ||నవ్వులు||

చరణం 3:
ఏ కొమ్మకు పూచావో
ఏ కమ్మని తేనెలు తెచ్చావో
ఏ పాటకు మురిసేవో
ఏ తేటికి విందులు చేసేవో
పాటగానో తేటిగానో
పదినాళ్లున్నా చాలమ్మా   ||నవ్వులు||

Monday, November 8, 2010

నేటి పాట: కసిగావుంది కసికసిగావుంది (ఎదురులేని మనిషి)

చిత్రం: ఎదురులేని మనిషి (1975)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

ఆమె: కసిగావుంది కసికసిగావుంది
          కలవక కలవక కలిసినందుకు కస్సుమంటుంది
          కసుక్కుమంటూ కాటేయ్ మంటుంది

అతడు: కసిగావుంది కసికసిగావుంది
           కలవక కలవక కలిసినందుకు కస్సుమంటుంది
           కసకస నిన్నూ నవిలేయ్ మంటుంది
                           
ఆమె: నీ ఛాతీ చూస్తే నిన్నరాతిరి గుర్తుకు వస్తూంది
          నీ కండలు చూస్తే గుండెనిండా గుబులే పుడుతూంది

అతడు: గుబులంతా నీ కళ్లల్లోనే గుబగుబమంటూంది
             అది కొత్త కొత్త కథలను రోజూ చెప్పక చెపుతూంది   ||కసిగా||

ఆమె: ఎంతకాలం నీకోసం ఎదురుచూస్తూ ఉండేది
          ఎదురు తిరిగే పరువాన్ని అదుపులోన ఉంచేది

అతడు: అదుపులోకి రానిదాన్ని వదులుకోవాలి
            వదులుకున్నా వదలనిదాన్ని అనుభవించాలి   ||కసిగా||

ఆమె: నీ అండలేక అందరికీ నే నలుసైపోయాను
          నువ్వుండగా ఏ మొనగాడు నా జోలికి రాలేడు

అతడు: అందుకేగా ఆడదానికో మగవాడుండాలి
            ఉంటే చాలదు అందుకు తగ్గ మగసిరి వుండాలి

Saturday, November 6, 2010

నేటి పాట: నీవు లేని నేను లేను (మంచి మనుషులు)

చిత్రం: మంచి మనుషులు (1974)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

అతడు: నీవు లేని నేను లేను
నేను లేక నీవు లేవు
నేనే నువ్వు - నువ్వే నేనూ
నేనూ నువ్వూ - నువ్వూ నేను లేనిచో
ఈ జగమే లేదు -

ఆమె: నీవు లేని నేను లేను
నేను లేక నీవు లేవు
నేనె నువ్వు - నువ్వే నేనూ
నేనూ నువ్వూ - నువ్వూ నేను లేనిచో
ఈ జగమే లేదు..

అతడు: తీగల్లో నువ్వూ నేనే అల్లుకొనేది
పువ్వుల్లో నువ్వు నేనె మురిసి విరిసేది
ఆమె: తెమ్మెరలో మనమిద్దరమె పరిమళించేది
తేనెకు మన ముద్దులే తీపిని ఇచ్చేది   ||నీవు లేని||

అతడు: నువ్వులేక వసంతానికి యవ్వన మెక్కడిది
ఆమె: నువ్వులేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిది
అతడు: సృష్టిలోని అణువు అణువులో ఉన్నామిద్దరము
ఆమె: జీవితాన నువ్వూ నేనై కలిశా మీదినము   ||నీవు లేని||

ఆమె: కొండల్లె నువ్వున్నావు నాకు అండగా
అతడు: మంచల్లె నువ్వున్నావు నాకు నిండుగా
ఆమె: ఎన్ని జన్మలైనా ఉందాము తోడు నీడగా
అతడు: నిన్నా నేడు రేపే లేని ప్రేమజంటగా   ||నీవు లేని||

Thursday, October 28, 2010

నేటి పాట: నవ్వుతూ బతకాలిరా (మాయదారి మల్లిగాడు)

చిత్రం: మాయదారి మల్లిగాడు (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

పల్లవి:
నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ
నవ్వుతూ చావాలిరా..
చచ్చినాక నవ్వలేవురా.. ఎందరేడ్చినా
బతికిరావురా.. తిరిగిరావురా.. అందుకే   ||నవ్వుతూ||                        
చరణం 1:
చంపేది ఎవడురా..
చచ్చేది ఎవడురా..
శివునాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదురా
కుడితే సావాలని వరమడిగిన చీమ
కుట్టీ కుట్టకముందె సస్తోంది సూడరా.. అందుకే   ||నవ్వుతూ||
చరణం 2:
బతికుండగా నిన్ను ఏడిపించినోళ్లు
నువ్వు సస్తె ఏడుత్తారు దొంగనాయాళ్లు
అది నువ్వు సూసేదికాదు - నిను కాసేదికాదు
నువ్వు పోయినా నీ మంచి సచ్చిపోదురా..
ఒరె సన్నాసీ నవ్వరా.. అందుకే   ||నవ్వుతూ||
చరణం 3:
వున్నాడురా దేవుడు
వాడు ఒస్తాడురా తమ్ముడు..
ఎప్పుడు?
అన్నాయం జరిగినపుడు - అక్కరమం పెరిగినపుడు
వస్తాడురా.. సచ్చినట్టు వస్తాడురా.. అందుకే   ||నవ్వుతూ||

Wednesday, October 27, 2010

నేటి పాట: ఆకలుండదు దాహముండదు (మంచివాడు)

చిత్రం: మంచివాడు (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

పల్లవి:
అతడు: ఆకలుండదు - దాహముండదు నిన్ను చూస్తుంటె
ఆమె: వేరే ఆశ వుండదు ధ్యాస వుండదు నువ్వు తోడుంటె
అతడు: మల్లెలుండవు - వెన్నెలుండవు నీ నవ్వే లేకుంటె
ఆమె: మనసు వుండదు - మమత వుండదు నీ మనిషిని కాకుంటె                          
అతడు: వయసులో ఈ పోరువుండదు నీ వలపే లేకుంటే
ఆమె: వలపు ఇంత వెచ్చగుండదు నీ ఒడిలో కాకుంటే   ||ఆకలుండదు||
చరణం 1:
అతడు: పొద్దు గడిచేపోతుంది - నీ నడక చూస్తుంటె
ఆమె: ఆ నడక తడబడిపోతుంది - నీ చూపు పడుతుంటె
అతడు: ఆకు మడుపులు అందిస్తూ నువ్వు వగలుపోతుంటె
ఆమె: ఎంత ఎరుపో అంత వలపని నేనాశపడుతుంటె   ||ఆకలుండదు||
చరణం 2:
అతడు: తేనెకన్న తీపికలదని - నీ పెదవే తెలిపింది
ఆమె: దానికన్న తీయనైనది నీ ఎదలో దాగుంది
అతడు: మొదటిరేయికి తుదేలేదని నీ ముద్దే కొసరింది
ఆమె: పొద్దు చాలని ముద్దులన్నీ నీ వద్దే దాచింది
           ఆ ముద్దే మిగిలింది   ||ఆకలుండదు||

Sunday, October 24, 2010

నేటి పాట: చెంగావి రంగు చీర (బంగారుబాబు)

చిత్రం: బంగారుబాబు (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

ఆమె: ఛీ.. ఛీ.. ఛీ..

అతడు: ఛా.. ఛా.. ఛా..
             చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
             దాని జిమ్మదియ్య అందమంతా చీరలోనే వున్నది

ఆమె: చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
           దాని జిమ్మదియ్య కొంగు కొంగు కలిపి చూడమన్నది

అతడు: మెరుపల్లె వచ్చింది నా యింటికి - నన్ను
              మెల్లంగ దించింది ముగ్గులోనికి

ఆమె: తలదాచుకొమ్మని తావిస్తినీ - పిల్ల
            దొరికింది చాలనీ ఇల్లాల్ని చేస్తివి..   ||చెంగావి||

అతడు: ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి - దాంతో
              వెర్రెత్తిపోయింది కుర్రవాడికి

ఆమె: పిచ్చివాడనే పేరుచాటున మాటువేసినావు
           పిల్లదాని పెదవిమీద కాటు వేసినావు...   ||చెంగావి||

అతడు: సరి.. సరి.. సరి..

ఆమె: సరసంలో పడ్డాడు యిన్నాళ్లకి - అబ్బో
           సంగీతం వచ్చిందీ బుజ్జిబాబుకి

అతడు: తెరచాటు తొలిగింది పరువానికి - అది
               పరవళ్లు తొక్కుతూ పాడింది నేటికి...   ||చెంగావి||

Friday, October 22, 2010

నేటి పాట: మబ్బులు రెండు భేటీ అయితే (దేశోద్ధారకులు)

చిత్రం: దేశోద్ధారకులు (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

ఆమె: మబ్బులు రెండు భేటీ అయితే మెరుపే వస్తుంది
అతడు: మనసులు రెండు పేచీ పడితే వలపే పుడుతుంది
ఆమె: మూడు ముళ్లూ పడతాయంటె సిగ్గే మొగ్గలు వేస్తుంది
అతడు: ఆ మొగ్గలు పూచీ మూడు రాత్రులు తీయని ముద్రలు వేస్తాయి
             కన్నులు నాలుగు కలిశాయంటే పున్నమి వెన్నెల కాస్తుంది
ఆమె: ఆ వెన్నెల నాలుగు వారాలైనా తరగని వెలుగై వుంటుంది
           అయిదోతనమే ఆడజన్మకు అన్ని వరాలను మించింది
అతడు: ఆ వరాన్ని తెచ్చిన మగువే మగనికి ఆరో ప్రాణం అవుతుంది
             అడుగులు ఏడూ నడిచామంటే అనుబంధం పెనవేస్తుంది
ఆమె: ఆ అనుబంధం ఏడేడు జన్మలకు వీడనిబంధం అవుతుంది   ||మబ్బులు||                             

Thursday, October 21, 2010

నేటి పాట: చీకటి వెలుగుల రంగేళీ (విచిత్రబంధం)

చిత్రం: విచిత్రబంధం (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

పల్లవి:
చీకటి వెలుగుల రంగేళీ
జీవితమే ఒక దీపావళి - మన
జీవితమే ఒక దీపావళి
అందాల ప్రమిదల ఆనందజ్యోతుల
ఆశల వెలిగించు దీపాలవెల్లి    ||చీకటి||                        
చరణం 1:
అక్కయ్య కన్నుల్లో మతాబులు
ఏ చక్కని బావకో జవాబులు
మాటల్లో వినిపించు చిటపటలు
ఏ మనసునో కవ్వించు గుసగుసలు    ||చీకటి||
చరణం 2:
అల్లుళ్లు వస్తారు అత్తవారిళ్లకు
మరదళ్లు చేస్తారు మర్యాద వాళ్లకు
బావ బావ పన్నీరు - బావను పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు - వీసెడు గుద్దులు గుద్దేరు    ||చీకటి||
చరణం 3:
అమ్మాయి పుట్టింది అమాసనాడు
అసలైన గజదొంగ అవుతుంది చూడు
పుట్టినరోజున దొరికాడు తోడు
పున్నమినాటికి అవుతాడు జోడు    ||చీకటి||

Wednesday, October 13, 2010

నేటి పాట: నిన్న మొన్న రేకువిప్పిన (బడిపంతులు)

చిత్రం: బడిపంతులు (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

అతడు: నిన్న మొన్న రేకువిప్పిన లేతమొగ్గా
నీకు ఇంతలోనే నన్ను చూస్తే అంత సిగ్గా

ఆమె: నిన్న మొన్న రెక్కలొచ్చిన గండు తుమ్మెదా
నీకు అంతలోనే నన్ను చూస్తే ఇంత తొందరా

అతడు: పరికిణీలు కట్టినప్పుడు లేని సొగసులు
నీ పైటకొంగు చాటున దోబూచులాడెను

ఆమె: పసితనాన ఆడుకున్న తొక్కుడు బిళ్లలు
నీ పరువానికి నేర్పినవీ దుడుకు కోర్కెలు   ||నిన్న||

అతడు: పాలబుగ్గలు పూచె లేత కెంపులు
వాలు చూపులందు దోచె వయసు జోరులు

ఆమె: చిరుత నవ్వులు ఒలికె చిలిపితనాలు
చిన్ననాటి చెలిమితీసె వలపుదారులు    ||నిన్న||

అతడు: ఇన్నాళ్లూ కళ్లుకళ్లు కలిపి చూస్తివి
ఇప్పుడేం రెప్పలలా రెపరెపన్నవి

ఆమె: ఇన్నాళ్లూ నీ కళ్లు వూరుకున్నవి
ఇపుడేవేవో మూగబాస లాడుచున్నవి   ||నిన్న||                      

Saturday, October 9, 2010

నేటి పాట: నువ్వు నేను ఏకమైనామూ (కొడుకు కోడలు)

చిత్రం: కొడుకు కోడలు (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

నువ్వూ - నేనూ ఏకమైనామూ -
ఇద్దరము, మనమిద్దరము ఒక లోకమైనాము
లోకమంతా ఏకమైనా - వేరు కాలేము, వేరు కాలేము -

అతడు: కళ్లు నాలుగు కలిపి మనము ఇల్లు కడదాము
ఆమె: అందులో మన చల్లచల్లని వలపు దీపం నిలుపుకుందాము
అతడు: పసిడి మనసుల పట్టెమంచం వేసుకుందాము
ఆమె: అందులో మన పడుచుకోర్కెల మల్లెపూలు పరుచుకుందాము   ||నువ్వు||

అతడు: చెలిమితో ఒక చలువ పందిరి వేసుకుందాము
ఆమె: కలల తీగల అల్లిబిల్లిగ అల్లుకుందాము
అతడు: ఆ అల్లికను మన జీవితాలకు పోల్చుకుందాము
ఆమె: ఏ ప్రొద్దుగాని వాడిపోని పువ్వులవుదాము -    ||నువ్వు||

అతడు: లేత వెన్నెల చల్లదనము - నువ్వు తెస్తావు
ఆమె: అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు
అతడు: సూర్యచంద్రులు లేని జగతిని సృష్టి చేద్దాము
ఆమె: అందులో ఈ సృష్టికెన్నడు లేని సొగసు మనము తెద్దాము    ||నువ్వు||                  

Monday, October 4, 2010

నేటి పాట: చేయీ చేయీ తగిలింది (కొడుకు కోడలు)

చిత్రం: కొడుకు కోడలు (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

అతడు: చేయీ చేయీ తగిలింది
హాయి హాయిగా వుంది

ఆమె: పగలు రేయిగా మారింది
పరువం వురకలు వేసింది     ||చేయీ||

అతడు: నీ వలపే తలుపును తట్టింది - నా
మనసుకు మెలుకువ వచ్చింది - నా
వయసుకు గడియను తీసింది

ఆమె: నీ పిలుపే లోనికి రమ్మంది
నా బిడియం వాకిట ఆపింది
నా సిగ్గే ముగ్గులు వేసిందీ    ||చేయీ||

అతడు: సిగ్గుతో నీవు నిలుచుంటే -
నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే
ఊపిరాడక నా మనసు
వుక్కిరి బిక్కిరి అయ్యింది -

ఆమె: వాకిట నేను నిలుచుంటే
ఆకలిగా నువు చూస్తుంటే
ఆశలు రేగి నా మనసు
అటు ఇటు కాక నలిగిందీ -    ||చేయీ||

ఆమె: నీ చూపే మెత్తగ పాకింది
నా చుట్టూ మత్తును చల్లింది
నిను చూస్తూ వుంటే చాలంది

అతడు: నీ సొగసే నిలవేసింది
నా మగసిరికీ సరితూగిందీ -
నా సగమును నీకు ఇమ్మందీ -    ||చేయీ||                

Friday, October 1, 2010

నేటి పాట: అనగనగా ఒక రాజు (ఆత్మబంధువు)

చిత్రం: ఆత్మబంధువు
రచన: సి. నారాయణరెడ్డి
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

ఆమె: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
అతడు: ఊహూ
ఆమె: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న    ||రాజు||   ||అనగనగా||
అతడు: ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువు సంధ్యలుండి గూడ చవటలయ్యారు
వట్టి చవటలయ్యారు
ఆమె: ||అనగనగా||
అతడు: పడక మీద తుమ్మముళ్లు పరచెనొక్కడు
అయ్యో ఇంటి దీపమార్పివేయ నెంచెకొక్కడు
తల్లీదండ్రులు విషమని తలచెనొక్కడు   ||తల్లీదండ్రులు||
పడుచు పెళ్లామె బెల్లమని భ్రమసెనొక్కడూ... భ్రమసెనొక్కడూ
ఆమె: ||అనగనగా||
అతడు: కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ
ప్రేమయనే పాలుపోసి పెంపు చేసెను   ||కొడుకులతో||
ఆమె: కంటిపాపకంటే ఎంతో గారవించెనూ   ||కంటిపాప||
దాని గుండెలోన గూడుకట్టి ఉండసాగెను.. తానుండసాగెను
అతడు: నాది నాది అనుకున్నది నీది కాదురా   ||అనగనగా||
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా   ||నాది నాది||
కూరిమి గలవారంతా కొడుకులేనురా   ||కూరిమి||
జాలిగుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా.. కుక్కమేలురా
అతడు + ఆమె: ||అనగనగా||                

Tuesday, September 28, 2010

నేటి పాట: కృషి ఉంటే మనుషులు (అడవిరాముడు)




చిత్రం: అడవిరాముడు (1977)
రచన: వేటూరి
సంగీతం: కె.వి. మహదేవన్                            
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బృందం

సాకీ:
మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ
పల్లవి:
కృషి ఉంటే మనుషులు
రుషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు
చరణం 1:
అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి
అతి భయంకరుడు యమకింకరుడు
అడవి జంతువులపాలిటి అడుగో అతడే వాల్మీకి
పాలపిట్టల జంట వలపు తేనెల పంట
పండించుకుని పరవశించి పోయేవేళ
ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు
ఒక పక్షిని నేలకూల్చాడు
జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ
తన కంటిలో పొంగ మనసు కరకంగ
ఆ శోకంలో ఒక శ్లోకం పలికే
ఆ చీకటి ఎదలో దీపం వెలిగే
కరకు బోయడే అంతరించగా 
కవిగా అతడు అవతరించగా
మనిషి అతనిలో మేల్కొన్నాడు
కడకు మహర్షే అయినాడు
నవరసభరితం రాముని చరితం
జగతికి అతడు పంచిన అమృతం
ఆ వాల్మీకి మీవాడు మీలోనో ఉన్నాడు
అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు
అందుకే    ||కృషి ఉంటే||
చరణం 2:
ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం
తిరుగులేని దీక్షకీ అతడే ప్రాణం
కులం తక్కువని విద్యనేర్పని
గురువు బొమ్మగా మిగిలాడు
బొమ్మ గురువుగా చేసుకుని
బాణ విద్యలో పెరిగాడు
హుటాహుటిని ద్రోణుడపుడు
తటాలుమని తరలివచ్చి
పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు
ఎదుట నిలిచిన గురుని పాదమంటి
ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు
బొటనవ్రేలివ్వమనె కపటి ఆ ద్రోణుడు
వల్లెయనె శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు
ఎరుకలవాడు అయితేనేమి
గురికలవాడే మొనగాడు
వేలునిచ్చి తన విల్లును విడిచి
వేలుపుగా ఇల వెలిగాడు
అందుకే    ||కృషి ఉంటే||

చరణం3:
శబరీ.. ఇంతకాలము వేచినది
ఈ పిలుపుకే శబరి
ఆశ కరువిడి అడుగు తడబడి
రామపాదము కన్నది
వంగిపోయిన నడుముతో
నగుమోము చూడగలేక అపుడు
కనుల నీరిడి ఆ రామపాదము
కడిగినది శబరి
పదముల ఒరిగినది శబరి
ప్రేమ మీరగ రాముడప్పుడు
శబరి తల్లి కనులు తుడిచి
కోరికోరి శబరి కొరికిన
దోరపండ్లను ఆరగించె
ఆమె ఎంగిలి గంగ కన్న
మిన్నగ భావించిన
రఘురాముడెంతటి ధన్యుడో
ఆ శబరిదెంతటి పుణ్యమో
ఆమె ఎవ్వరో కాదు సుమా
ఆడపడుచు మీ జాతికి
జాతిరత్నములు ఎందరెందరో
మీలో కలరీ నాటికీ
అడివిని పుట్టి పెరిగిన కథలే
అఖిల భారతికి హారతులు
నాగరికతలో సాగు చరితలో
మీరే మాకు సారథులు
అందుకే    ||కృషి ఉంటే||