Showing posts with label jai sreeram. Show all posts
Showing posts with label jai sreeram. Show all posts
Thursday, June 28, 2012
'జై శ్రీరామ్' అంటున్న ఉదయ్‌కిరణ్
ఉదయ్‌కిరణ్ హీరోగా 5 స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తేళ్ల రమేశ్ నిర్మిస్తున్న చిత్రానికి 'జై శ్రీరామ్' అనే టైటిల్ ఖరారు చేశారు. బాలాజీ ఎన్. సాయి దర్శకుడు. 'ఈ రోజుల్లో' ఫేమ్ రేష్మా నాయిక. మంగళవారం ఈ సినిమా యూనిట్ సభ్యుల మధ్య కేక్ కోసి జన్మదినం జరుపుకున్నారు ఉదయ్‌కిరణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఈ సినిమా నా జీవితంలో పెద్ద మైలురాయి అవుతుందని గట్టి నమ్మకం. నటుడిగా నాలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించే సినిమా. పన్నెండేళ్ల నుంచీ నేను మోస్తున్న 'లవర్ బాయ్' ట్యాగ్‌ను పక్కనపెట్టి చేస్తున్న సినిమా'' అన్నారు.
మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిథి వాసు మాట్లాడుతూ "ఫస్ట్‌లుక్‌కు మంచి ప్రశంసలొచ్చాయి. హీరోగా ఉదయ్‌కి ఇది కమ్‌బ్యాక్ ఫిల్మ్. దర్శకుడు బాలాజీ బాగా తీస్తున్నాడు'' అని చెప్పారు. దర్శకుడు బాలాజీ ఎన్. సాయి మాట్లాడుతూ "త్రేతాయుగంలోని రాముడికి ఎలాంటి గుణాలున్నాయో, అలాంటి గుణాలున్నవాడే మా హీరో. ఈ దేశం కోసం ఓ పోలీసాఫీసర్ ఏం చేశాడన్నది ప్రధానాంశం. ఉదయ్ నాలుగైదు గెటప్స్‌లో కనిపిస్తాడు'' అని చెప్పారు. ఉదయ్‌తో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాననీ, ఇందులో తన పాత్రలో రెండు కోణాలుంటాయనీ రేష్మా తెలిపారు. నిర్మాత తోట రమేశ్ మాట్లాడుతూ డైరెక్టర్ చెప్పిన కథ బాగా నచ్చిందనీ, టైటిల్‌కు మంచి స్పందన వచ్చిందనీ అన్నారు. చిత్రంలో ఐదు పాటలున్నాయనీ, ఇప్పటికే ఓ పాటను తీశారనీ సంగీత దర్శకుడు డాకే చెప్పారు. తాగుబోతు రమేశ్ మాట్లాడుతూ తాను వినోదాన్ని పంచే పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా నటిస్తున్నానన్నారు.
చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ, నాగినీడు, గిరిధర్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శివ-మురళి, కళ: భాస్కరరాజు, స్టంట్స్: డ్రాగన్ ప్రకాశ్, డాన్స్: రఘు, సహ నిర్మాత: ఎన్.సిహెచ్. రాజేశ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బాలాజీ ఎన్. సాయి.
Subscribe to:
Posts (Atom)
