నారా రోహిత్ కథానాయకుడిగా, చైతన్య దంతులూరి దర్శకుడిగా పరిచయమైన 'బాణం' సినిమా జనాదరణ పొందలేకపోయినా విమర్శకుల్ని మెప్పించింది. భ్రష్టుపట్టిపోయిన ఈ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలని భావించే ఒక యువకుని కథ ఈ సినిమా. ఆ క్రమంలో అతడు ఎలాంటి అడ్డంకుల్ని ఎదుర్కొన్నాడు, ఆ అడ్డంకుల్ని చట్టం పరిధిలో ఎలా పరిష్కరించాడనేది ప్రధానాంశం. సమాజాన్ని ఆలోచింపజేసే సినిమా. 'కలవరమాయె మదిలో' ఉత్తమ తృతీయ చిత్రంగా అవార్డు గెలుచుకోవడం ఆశ్చర్యపరిచే విషయం. ఇటు జనాన్నీ, అటు విమర్శకుల్నీ మెప్పించలేకపోయిన ఈ బోరింగ్ ఫిల్మ్ నంది జ్యూరీని ఆకట్టుకోవడం విశేషమే. ఎప్పటికైనా ఎ.ఆర్. రెహమాన్ సంగీతంలో పాటలు పాడే అవకాశాన్ని చేజిక్కించుకోవాలని ఆశించే ఓ ఔత్సాహిక గాయని కథ ఈ సినిమా.
విమర్శలెదుర్కొన్న 'ఉత్తమ నటుడు'
ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా 'మగధీర'ని మించిన సినిమా ఇంకేముంటుంది? దీన్ని తప్పుపట్టే వాళ్లయితే లేరు. ఇదే సినిమా మరో ఎనిమిది అవార్డుల్ని గెలుచుకుని సత్తా చాటింది. 'మగధీర' సరికొత్త బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించడానికి ప్రధాన కారణమైన ఎస్.ఎస్. రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా ఎంపికవడమూ సబబే. ఇదే సినిమాకి సమకూర్చిన నృత్యాలతో జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డుని గెలుచుకున్న శివశంకర్, జాతీయ స్థాయిలో స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు పొందిన కమల్ కణ్ణన్ లకే ఆ అవార్డులనివ్వడం మినహా జ్యూరీకి చేసేదేముంటుంది? అలాగే ఉత్తమ ఎడిటరుగా కోటగిరి వెంకటేశ్వరరావు, కళా దర్శకుడిగా రవీందర్, శబ్దగ్రాహకుడిగా రాధాకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనరుగా రమా రాజమౌళికి అవార్డులు ప్రకటించారు. వీటికి అదనంగా కథానాయకుడు రాంచరణ్ కి స్పెషల్ జ్యూరీ అవార్డు(!)ని ప్రకటించారు. ఇలా రాంచరణ్ కి జ్యూరీ అవార్డు ప్రకటించి, దాసరి నారాయణరావుని ఉత్త నటుడిగా ఎంపికచేయడం విమర్శకి తావిచ్చింది. చిరంజీవి - రాంచరణ్ అభిమానులు సహజంగానే ఇందులో రాజకీయం ఉందని ఆరోపించారు. దాసరికి ఈ అవార్డుని ప్రకటిస్తారని విమర్శకులు సహా ఎవరూ ఊహించలేదు. 'మేస్త్రి'లో పాలకొల్లు అనే పాత్రలో జీవించినందుకు గాను ఆయనకు జ్యూరీ ఈ అవార్డుని అందించిందనుకోవాలి. గమనించదగ్గ సంగతేమంటే, ఈ సినిమాలో పాలకొల్లు ప్రస్తుత ప్రభుత్వ విధానాల మీద విరుచుకుపడతాడు. సినిమా ప్రారంభంలో ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితమనీ, ఎవర్నీ ఉద్దేశించినవి కాదనీ చెప్పినా, చిరంజీవిని లక్ష్యంగా చేసుకునే, ఆయన్ని విమర్శించడానికే ఈ సినిమా తీశారని అంతా భావించారు. అలాంటి సినిమాలో నటించిన ఆయనకు ఉత్తమ నటుడి అవార్డునివ్వడం చాలామందికి మింగుడుపడని సంగతి. (ఇంకావుంది)
Showing posts with label banam. Show all posts

Saturday, October 23, 2010
Friday, October 22, 2010
ఫోకస్: 'నంది' లీలలు! (1వ భాగం)
అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో అవార్డుల్ని ఎంపిక చేయడం అంత సులువైన పని కాదు. అయితే అసలు సిసలు సినిమా ప్రియులు, అవార్డులు గెలుచుకోగల అవకాశం ఎవరికుంటుందో ఊహించగలుగుతారు. ఆ ఊహకు భిన్నంగా ఫలితాలు వచ్చినప్పుడు విస్మయానికి గురవుతారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డుల విషయంలో వాళ్లు విస్మయపడే సందర్భాలే ఎక్కువ. నిరుడు విమర్శకుల్ని సంతృప్తిపరచిన నంది అవార్డుల జ్యూరీ ఈ ఏడాది పాతబాటనే అనుసరిస్తూ విమర్శకులకు ఎక్కువ పని కల్పించింది. 2009 సంవత్సరానికి జ్యూరీ ప్రకటించిన అవార్డుల్ని చూసి, 'ఇవేం అవార్డులు?' అనుకోనివాళ్లు బాగా తక్కువ.
జ్యూరీని మెప్పిస్తే చాలు!
ఉత్తమ చిత్రం అవార్డు విషయంలో ప్రజాదరణ పొందిన సినిమాల్ని లెక్కలోకి తీసుకోకూడదనీ, సమాజానికి ప్రయోజనకరమైన ఇతివృత్తంతో తీసిన సినిమాల్నే లెక్కలోకి తీసుకోవాలనీ జ్యూరీ నిర్ణయించుకున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఉత్తమ చిత్రంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ అవార్డుల్ని గెలుచుకున్న సినిమాల్లో ఒక్కటి కూడా ప్రేక్షకుల ఆదరణకు నోచుకున్న సినిమా లేదు. ఉత్తమ ప్రథమ చిత్రంగా బంగారు నందిని గెలుచుకున్న 'సొంత ఊరు'ని గానీ, ద్వితీయ చిత్రంగా నిలిచిన 'బాణం'ని గానీ, తృతీయ చిత్రం అవార్డుని పొందిన 'కలవరమాయె మదిలో'ని గానీ థియేటర్లలో చూసిన ప్రేక్షకులు బాగా తక్కువ. వీటిలో తొలి రెండు సినిమాలు విషయపరంగా, కథపరంగా విమర్శకుల్ని ఆకట్టుకున్నాయి.
'కలవరమాయె మదిలో' సినిమా ప్రేక్షకుల్నే కాదు, విమర్శకుల్నీ మెప్పించలేకపోయింది. అయితేనేం జ్యూరీని మెప్పించిందన్న మాట. పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన 'సొంత ఊరు' సినిమా సెజ్ ల వల్ల ఎలాంటి విపరిణామాలు జరుగుతాయనే సంగతిని రుద్ర అనే ఓ కాటికాపరి దృష్టికోణం నుంచి తీసిన చక్కని సినిమా అనడంలో సందేహం లేదు. అయితే నెగటివ్ క్లైమాక్స్ ఈ సినిమాలో ప్రధానంగా కనిపించే లోపం. దేవుడు అని అందరూ పిలిపించుకునేవాడు ఊరివాళ్లందర్నీ మభ్యపెట్టి వాళ్ల భూముల్ని అమ్ముకునేట్లు చేసి, ఊరిని ఎడారిలా మార్చేస్తుంటే చూసి సహించలేని రుద్ర ఆఖర్లో అతణ్ణి అంతం చేస్తాడు. ఆ హత్యకు కారణమేమిటనే నిజాన్ని జనం గ్రహించేట్లు చేసి, తమ ఊరిని కాపాడుకోవడానికి వాళ్లు నడుం బిగించినట్లు చూపిస్తే అర్థవంతంగానూ, ఔచిత్యంగానూ ఉండేది. కానీ జనం సత్యాన్ని గ్రహించకుండా దేవుణ్ణి చంపిన రుద్రపై ఆగ్రహించి, అతణ్ణి చంపేస్తారు. అంటే ఈ సినిమా ద్వారా దర్శకుడు సమాజానికి ఏం చెప్పదలచుకున్నాడు? మంచి పనుల్ని జనం అర్థం చేసుకోలేరు, మంచి చేసినవాళ్లనే చంపేస్తారు.. అనే ఒక తప్పుడు అభిప్రాయం ఇచ్చినట్లే కదా. అవార్డుకు ఎంపికయ్యే సినిమా ఈ తరహాలో ఉండకూడదు. ఇదే సినిమాకి మరో మూడు అవార్డులు లభించాయి. ఉత్తమనటి, క్యారెక్టర్ నటుడు, సంభాషణల రచయిత అవార్డులు దీనికి దక్కాయి. వీటిలో ఉత్తమ నటి అవార్డు మరీ విస్మయకరం. మల్లి అనే వేశ్య పాత్రలో నటించిన కొత్తమ్మాయి తీర్థని ఆ అవార్డుకు ఎంపికచేశారు. ఆమె ఎలా నటించిందో సగటు సినిమా ప్రియుడికైతే అసలే తెలీదు. జ్యూరీకి తెలిస్తే చాలుగా! రుద్ర పాత్రని ప్రతిభావంతంగా పోషించిన ఎల్బీ శ్రీరామ్ క్యారెక్టర్ నటునిగా అవార్డుని గెలుచుకోవడమే కాక, సంభాషణల రచయిత గానూ అవార్డుని పొందారు. (ఇంకావుంది)

Wednesday, October 13, 2010
సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (చివరి భాగం)
కథనమే కాదు కథా ముఖ్యమే
సరే, ఇక్కడ మనం ప్రస్తావిస్తున్న చిన్న చిత్రం అంటే చెత్త సినిమా కాదు, 'బి' గ్రేడ్ సినిమా అంతకంటే కాదు. చిన్న సినిమా పేరుతో వచ్చే 'బి' గ్రేడ్ సినిమాల వల్లే వాటికి చెడ్డ పేరు వచ్చింది. కానీ ఇక్కడ చిన్న సినిమా అంటే 'ఆనంద్', 'హ్యాపీడేస్', 'వినాయకుడు', 'గమ్యం' లాంటి నవ్య సినిమాలు. బడ్జెట్ పరంగానే అవి చిన్న సినిమాలు కానీ, భారీ బడ్జెట్ తో తీసిన ఎన్నో స్టార్ల సినిమాల కంటే అవి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు. మనం చెప్పుకుంటోంది అలాంటి చిన్న, మంచి సినిమాల గురించి. మల్టీప్లెక్స్ విప్లవం మొదలైన కాలంలో ఇక భవిష్యత్ అంతా స్వతంత్ర సినిమాదే అనే అభిప్రాయం కలిగిందనేది నిజం. అయితే అది అనుకున్నంత వేగంగా జరగడం లేదనేదీ వాస్తవం. కారణం కథలో కంటే కథనంలోనే ఎక్కువ కొత్తదనం కనిపిస్తుండటం. థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లో వీడియోల్లోనూ, టీవీల్లోనూ సినిమాలు చూడటం మొదలుపెట్టిన వాళ్లు కూడా ఇప్పుడు కనీసం వారాంతాల్లోనైనా సినిమా హాళ్లకు రావాలనుకుంటున్నారు. ఈ తరహా ప్రేక్షకులకి కొత్త తరహా కథలు, కథనాలు కావాలి. స్వతంత్ర సినిమా దర్శకులకి కావలసింది ఇదే. 'తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి విడుదల చేస్తే చాలు - శాటిలైట్, వీడియో హక్కులతో పెట్టుబడి అంతా వచ్చేస్తుంది' అనే అభిప్రాయంతో కొంతమంది దర్శకులు కథ, కథనాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా సినిమాలు తీసి, చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఈ ధోరణిని మార్చుకుని హద్దుల్ని చెరిపేసే రీతిలో కష్టపడి పనిచేసి, కొత్తదనంతో సినిమాలు తీయకపోతే నవ్య సినిమాకి ఈరోజు ఉన్న మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నవాళ్లు అవుతారు.
ఇవాళ విలక్షణమైన కథ, కథనాలతో తీస్తున్న దర్శకులు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువమందే ఉండటం తెలుగు సినిమాకి సంబంధించి శుభపరిణామం. వాళ్లు తీసే నాణ్యమైన సినిమాల సంఖ్య ఏడాదికి పది మించగలిగితే స్టార్లు సైతం తమ అభిప్రాయాల్ని మార్చుకుని, ఆ దర్శకులతో పనిచేయాలని ఉవ్విళ్లూరుతారు. శేఖర్ కమ్ముల ఈమధ్య రూపొందించిన 'లీడర్' సినిమాని గానీ, కొత్త దర్శకుడు చైతన్య దంతులూరి తీసిన 'బాణం'ని గానీ, దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'ప్రస్థానం'ని గానీ స్టార్ వాల్యూ ఉన్న నటులు చేసినట్లయితే పెద్ద హిట్లయ్యేవి. అయితేనేం, వాటి ద్వారా ఆ దర్శకుల ప్రతిభ బయటపడింది. వాటి వల్ల ఇద్దరు ముగ్గురు ప్రతిభావంతులైన నటులు పరిచయమై, భవిష్యత్ మీద ఆశలు రేకెత్తించారు. ఇదే స్పిరిట్ తో స్వతంత్ర సినిమా దర్శకులు ముందుకు అడుగేయాలి. తెలుగులో మంచి సినిమాలకు కొదవలేదనే పేరు వచ్చే అవకాశం ఉంది వాళ్ల వల్లనే. (అయిపోయింది)

Subscribe to:
Posts (Atom)