Showing posts with label srikanth. Show all posts
Showing posts with label srikanth. Show all posts
Friday, September 26, 2014
Thursday, December 19, 2013
Saturday, November 23, 2013
Thursday, July 5, 2012
దసరాకు 'లక్కీ'
శ్రీకాంత్, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం 'లక్కీ'. జ్యోత్సారెడ్డి సమర్పిస్తున్నారు. రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతోంది. హరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాజరాజేశ్వరి శ్రీనివాస్‌రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ "చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొనగా కథానాయకుడు శ్రీకాంత్ ఇంటికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించాం. తదుపరి షెడ్యూల్ జూలై 6నుంచి 20 వరకు జరుగుతుంది. దసరాకు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది'' అని అన్నారు.
బ్రహ్మానందం, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీయస్, ఎం.ఎస్.నారాయణ, చలపతిరావు, చిట్టిబాబు, రఘుబాబు, కృష్ణభగవాన్, తిరుపతి ప్రకాష్, నల్లవేణు, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, ధన్‌రాజ్, జయసుధ, రోజా, సన, గీతాసింగ్, హేమ, రత్నాసాగర్, రమ్య, శ్రీలలిత తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: పడాల శివసుబ్రహ్మణ్యం, సంగీతం: సాయి కార్తీక్, పాటలు: భాస్కరభట్ల, కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, కూర్పు: నాగిరెడ్డి, ఫైట్స్: నందు, కళ: కె.వి.రమణ, కొరియోగ్రఫీ: భానోదయ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముదిగొండ వెంకటేష్.
Saturday, June 30, 2012
'ఆల్ ది బెస్ట్' చెప్పండి
శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి, లక్కీ శర్మ కీలక పాత్రల్లో నటించిన 'ఆల్ ది బెస్ట్' ఈ నెల 29న విడుదల కానుంది. సుధా సినిమా పతాకంపై సాంబశివరావు నిర్మించారు. గుమ్మడి రవీంద్రబాబు సమర్పిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని నిర్మాతల మండలి హాలులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు జె.డి.చక్రవర్తి మాట్లాడుతూ "ఇది ముమ్మాటికీ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన వినోదాత్మక చిత్రం. శ్రీకాంత్ లేకుంటే నేను ఈ సినిమాను ఊహించి ఉండేవాడిని కాదు. ప్రేక్షకులు మాకు 'ఆల్ ది బెస్ట్' చెప్పాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. " వన్ బై టు, ఎగిరే పావురమా చిత్రాల్లో నేను, చక్రి కలిసి నటించాం. ఇందులో ఫ్రెండ్స్‌గా నటించాం. ఒకరికొకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ కథను నడిపిస్తాం. ఇ.వి.వి., కృష్ణారెడ్డి తరహా చిత్రమిది'' అని శ్రీకాంత్ చెప్పారు. "సినిమా చాలా బాగా వచ్చింది. 29న విడుదల చేస్తున్నాం'' అని నిర్మాత తెలిపారు. మంచి పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉందని రఘుబాబు, బ్రహ్మాజీ చెప్పారు.
Friday, November 18, 2011
అప్పుడు 'లవకుశ'.. ఇప్పుడు 'శ్రీరామరాజ్యం'
అందరి కళ్లూ ఇప్పుడు 'శ్రీరామరాజ్యం' మీదే. గురువారం (17) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఇటు సినీ వర్గాల్లో, అటు సామాన్య ప్రజానీకంలో అమితాసక్తి వ్యక్తమవుతోంది. 'శ్రీకృష్ణార్జున విజయం' (1996) తర్వాత నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న పౌరాణిక చిత్రం ఇదే. ఉత్తరరామ చరిత్ర ఆధారంగా తండ్రీ కొడుకులు సి. పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వంలో రూపొందిన 'లవకుశ'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీసు ఫలితం తెలుగులో తిరిగి పౌరాణిక చిత్రాల రూపకల్పనపై ప్రభావం చూపబోతోంది. ఈ చిత్రం విజయం సాధిస్తే మరిన్ని పౌరాణిక చిత్రాల నిర్మాణానికి ఊతం లభిస్తుందని విశ్లేషకులు నమ్ముతున్నారు.
ఈ సందర్భంగా అఖండ విజయం సాధించిన మునుపటి చిత్రంతో, ప్రస్తుత చిత్రాన్ని పోల్చడం సహజం. 26 కేంద్రాల్లో విడుదలైన 'లవకుశ' అన్ని కేంద్రాల్లోనూ వంద రోజులు ఆడి, తెలుగులో రూ. కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా (టిక్కెట్ రేట్లు పావలా నుంచి ఒక రూపాయి ఉన్న కాలంలో) రికార్డు పుటలకెక్కింది. 18 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ జనాభా మూడు కోట్లు కాగా, ఈ చిత్రాన్ని 1.98 కోట్ల మంది చూసినట్లు అంచనా. అలాంటి 'లవకుశ'లో సీతారాములుగా అంజలీదేవి, నందమూరి తారకరామారావు ఎంత గొప్ప స్థాయిలో రాణించారో, అభినవ సీతారాములుగా ఎంతగా నీరాజనాలు అందుకున్నారో అప్పటి జనానికి తెలుసు. ముఖ్యంగా శ్రీరామునిగా ఎన్టీఆర్ రూపం జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది 'లవకుశ'లో ఆయన పోషించిన ఆ పాత్రతోనే.
త్రేతాయుగంలో శ్రీరాముడు ఇలాగే ఉండేవాడేమోనని భ్రమించే రీతిలో ఆయన జనాన్ని సమ్మోహహితుల్ని చేశారు. ఇప్పుడు ఆ పాత్రని బాలకృష్ణ ఎలా చేశారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. రూపపరంగా చూస్తే, ఎన్టీఆర్ వంటి సమ్మోహనశక్తి లేకపోయినా ఆయన తర్వాత రాముని పాత్రలో ఇమడ గలిగేది బాలకృష్ణే అనే అభిప్రాయం సర్వత్రా ఉంది. శ్రీరాముని రూపంలోని బాలకృష్ణ స్టిల్స్ ఆ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి. 'లవకుశ'లో సీతగా అంజలీదేవి ప్రభావమూ అసామాన్యమైనదే. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా ఒదిగిపోయారు. లక్ష్మణుడు తనని అడవులకు పంపిన కారణం తెలిశాక ఆమె పలికించిన కరుణ రసం ఎప్పటికీ మన హృదయాల్ని తాకుతూనే ఉంటుంది. ఇక పతాక సన్నివేశాల్లో ఆమె అభినయం అపూర్వమనే చెప్పాలి. అలాంటి పాత్రను ఇప్పుడు నయనతార చేయడమే ఒక విచిత్రం. తన కాలానికి అంజలి గొప్పనటిగా అప్పటికే పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ నయనతార తెలుగు నటి కాదు. తెలుగు భాష సరిగా తెలీదు కూడా. అయినా ప్రచార చిత్రాల్లో సీతగా ఆమె ఆహార్యం చక్కగా ఉంది. ఇప్పటికే 'సింహా' చిత్రంలో బాలకృష్ణ, నయనతార జంట ప్రేక్షకుల్ని అలరించింది. అప్పటివరకు గ్లామర్ రోల్స్‌కి పేరుపొందిన నయనతార ఆ సినిమాల్లో చీరల్లో హుందాగా కనిపించిన తీరే ఇప్పుడు సీత పాత్రకు ఎంపిక చేసేందుకు దోహదం చేసింది. అంజలిని ఆమె ఏ తీరున మరిపిస్తుందన్నది చూడాల్సిందే.
ఇక చిత్రంలో కీలకమైంది లక్ష్మణుని పాత్ర. మునుపటి చిత్రంలో ఆ పాత్రని కాంతారావు అమోఘంగా పోషించారు. సీతను అడవులకు పంపాలని శ్రీరాముడు నిర్ణయించినప్పుడు, ఆ బాధ్యత తనమీదే పడ్డప్పుడు కాంతారావు ప్రదర్శించిన నటన అత్యుత్తమం. ఇప్పుడు ఆ సన్నివేశాల్లో శ్రీకాంత్‌ని మనం చూడబోతున్నాం. ఆయన ఓ పౌరాణిక పాత్రను పోషించడం ఇదే ప్రథమం. వాల్మీకిగా చిత్తూరు నాగయ్యను చూసిన కళ్లతో అక్కినేని నాగేశ్వరరావును చూడటం అపురూపం. నటులుగా ఇద్దరూ ఏ స్థాయి నటులో మనకు తెలిసిందే.
ఇదంతా తెరమీద మనం చూడబోయే వ్యవహారం కాగా తెరవెనుక దర్శకత్వాన్ని ప్రస్తావించుకోవడం సందర్భోచితం. 'లవకుశ'ను తలపెట్టింది సి. పుల్లయ్య. అయితే అకస్మాత్తుగా సినిమా మధ్యలో ఆయన మరణించడంతో ఆ బాధ్యతను గొప్పగా నెరవేర్చారు ఆయన కుమారుడు సి.ఎస్. రావు. అలా తండ్రీకొడుకులు ఒక పౌరాణిక చిత్రరాజాన్ని తెలుగు దేశానికి అందిస్తే, ఇప్పుడు ఆ పని నిర్వహించింది ఇప్పటికే ఎన్నో కళాఖండాల్ని అందించిన బాపు. సహచరుడు ముళ్లపూడి వెంకటరమణ ఈ సినిమా మధ్యలో అర్ధంతరంగా స్వర్గస్తులైతే, ఒంటిగానే తాననుకున్న రీతిలో 'శ్రీరామరాజ్యం'ను తీర్చిదిద్దారు బాపు. ఎనభై ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఏకాగ్రతతో ఈ చిత్రాన్ని ఆయన మలచిన తీరుకు ఆ సినిమా యూనిట్ అంతా జేజేలు పలుకుతున్నారు.
దీంతో పాటు సంగీతాన్నీ ప్రస్తావించుకోవాలి. 'లవకుశ' విజయంలో ఘంటసాల సంగీత బాణీలకూ ప్రత్యేక స్థానముంది. 'శ్రీరామరాజ్యం'కు ఆ బాధ్యతని అత్యంత సమర్ధంగా నిర్వహించారు ఇళయరాజా. ఇవన్నీ ఒకెత్తయితే పౌరాణికాలు తియ్యాలంటేనే బెంబేలెత్తే ఈ రోజుల్లో ఖర్చుకు వెరవకుండా, భారీ రిస్కుకు దడవకుండా ఈ సినిమాని నిర్మించి అందరి దృష్టినీ ఆకర్షించారు యలమంచిలి సాయిబాబా. ఇన్ని విశేషాలున్న 'శ్రీరామరాజ్యం' ఏ రీతిన ఆడుతుందో, 'లవకుశ'ను ఎంతగా మరిపిస్తుందో వేచి చూడాల్సిందే.
Sunday, September 18, 2011
ఇంటర్వ్యూ: 'శ్రీరామరాజ్యం' నిర్మాత సాయిబాబు
'శ్రీరామరాజ్యం'కు శ్రీకారం ఎలా జరిగింది?
- ఓ ఆదివారం మధ్యాహ్నం రామసాయిమందిరం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. రాముడు గురించి సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న భావన అప్పుడే వచ్చింది. వెంటనే నా స్నేహితుడిని రమ్మని కబురుపెట్టాను. ఐదు నిమిషాల్లో వచ్చాడు. విషయం చెప్పగానే వెంటనే ముళ్ళపూడి రమణగారితో మాట్లాడించారు. వెంటనే బయలుదేరి చెన్నై వెళ్ళాం. మరుసటి రోజు బాపు-రమణగార్లను కలిశాం. అక్కడి నుంచి ఇళయరాజాగారిని కలిశాం. 'శ్రీరామరాజ్యం' శ్రీకారం చుట్టుకున్న వైనమిది.
ఇప్పటి రోజుల్లో పౌరాణికమంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. అనుకున్న బడ్జెట్‌లో తీయగలిగారా?
- మెరుపులాంటి ఆలోచన రావడమే తరువాయిగా అన్నీ హుటాహుటిన కుదిరాయి. ఈ చిత్రం పరిధి విస్తృతమైంది కాబట్టి ద్విభాషా చిత్రంగా తెరకెక్కించమని చాలా మంది సలహా ఇచ్చారు. సీత పాత్రకు ముందు మేం మాధురీదీక్షిత్‌ను సంప్రదించాం. తెలుగు, హిందీల్లో చిత్రీకరిస్తేనే నటిస్తానని చెప్పింది. కానీ ద్విభాషా చిత్రమంటే తెలుగుతనం మరుగునపడే ప్రమాదముంది. పలు చోట్ల రాజీపడాలి. సంగీతం నుంచి సన్నివేశాల వరకు ఎక్కడో ఏదో అడ్డు తగులుతూనే ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే బడ్జెట్ గురించి ఆలోచించలేదు. సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రామాయణాన్ని తెరకెక్కించాలన్నదే నా సంకల్పం అని బాపుగారితో చెప్పాను.
'లవకుశ' అని గాక 'శ్రీరామరాజ్యం' అనే టైటిల్ పెట్టడంలో ఉద్దేశం?
- ముళ్ళపూడివారు కొన్ని హిందీ పౌరాణిక చిత్రాల పేర్లు చెబుతూ మధ్యలో 'శ్రీరామరాజ్య్' అని అన్నారు. 'శ్రీరామరాజ్యం'... పేరు చాలా బాగుంటుంది కదా. మన చిత్రానికి ఆ పేరే ఖరారుచేసుకుందాం అనుకున్నాం. నెల్లోపే పాటల రికార్డింగ్ పనులు కూడా మొదలయ్యాయి.
జొన్నవిత్తులతోనే అన్ని పాటలూ రాయించారెందుకు?
- 'అందరి బంధువయ భద్రాచల రామయ్యా...' అని జొన్నవిత్తుల అంతకుముందే ఓ పాట రాశారు. అంతకన్నా సరళంగా ఇంకెవరు రాయగలరు? అనిపించింది. అందుకే ఆయనతో అన్ని పాటలూ రాయించాం. ఇళయరాజాగారి బాణీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మా పాటల్ని ఇవాళ యువతే ఎక్కువగా ఇష్టపడుతోంది. అంత తాజాదనం గుబాళిస్తోంది గీతాల్లో.
చిత్రంలో మీకు బాగా నచ్చిన సన్నివేశం?
- మొదటి రోజు బాలకృష్ణగారు షూటింగ్‌లో ఉన్నారు. నేను కారు దిగి వెళ్తున్నాను. సీతాదేవిని భూదేవి తనతో తీసుకెళ్లే సన్నివేశమది. ముఖంలో పలు భావాలను పలికిస్తూ నటించాలి. దూరం నుంచి బాలకృష్ణ నటన చూస్తే చాలా ముచ్చటేసింది. ఆ తర్వాత ఆయన ఎన్ని సన్నివేశాలు చేసినా, నేను చూసినా... నాకు నచ్చింది తొలి సన్నివేశమే.
సీతారాములుగా నయనతార, బాలకృష్ణ నటన గురించి ఏం చెబుతారు?
- పూర్తిగా పాత్రలో లీనమై నటించే నటుడు బాలయ్య. ఈ చిత్రంలో నటించినన్నాళ్ళూ ఆయనలో ఏదో తేజస్సు కనిపించేది. అది దినదినప్రవర్ధమానమైనట్టు అనిపించింది. రాముడి పాత్రలో ఆయన్ని చూసిన కొంతమంది యువకులు 'అచ్చం రామారావుగారిలా ఉన్నారు కదా' అనడం స్వయానా నేనే విన్నాను. చాలా ఆనందమనిపించింది. అంతే భక్తి శ్రద్ధలతో నయనతార నటించింది. సీత పాత్ర చేసినన్నాళ్ళూ తను శాకాహారమే తీసుకుంది. ఏరోజూ గుడికెళ్ళకుండా సెట్‌కు రాలేదు. నేను చూసిన వారందరిలోకీ నయనతార గొప్ప వ్యక్తిత్వమున్న అమ్మాయి. తన వృత్తికి పూర్తి న్యాయం చేసే తరహా మనిషి.
వాల్మీకి పాత్రని చేయడానికి అక్కినేని గారు అంత సులువుగా ఒప్పుకున్నారా?
- అసలు ఈ చిత్రాన్ని ఎందుకు తీయాలనిపించింది అని ఆయన అడిగారు. 'ప్రతి మనిషికీ ఓ తృప్తి ఉంటుంది. ఈ సినిమా తీస్తే నేను తృప్తిగా ఉంటాను. రామాయణాన్ని ఎవరూ మర్చిపోకూడదు. రామచరిత్రలో లేనిది లేదు. ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ముల సఖ్యత, సుపరిపాలన, ఈర్ష్యా ద్వేషాలకు అతీతంగా మసలడం.. అంటూ అన్ని విషయాలు అందులో ఇమిడి ఉన్నాయి. విశ్వం ఉన్నంతకాలం రాముడుంటాడని నా నమ్మకం ' అని చెప్పాను. పెద్దాయన పాత్రను చేయడానికి అంగీకరించారు. వాల్మీకి పాత్రకు వందశాతం సరిపోయారు.
మిగతా పాత్రధారుల గురించి చెబుతారా?
- తక్కువ సన్నివేశాల్లో కనిపించినా జనకుడి పాత్రలో మురళీమోహన్ అచ్చుగుద్దినట్టు సరిపోయారు. లక్ష్మణుడి పాత్రకు శ్రీకాంత్ అయితే బాగుంటుందని అనుకున్నాం. చానాళ్ళు ఆయన కాల్షీటు కుదరలేదు. కానీ ఆఖరినిమిషంలో శ్రీకాంత్ కూడా మా యూనిట్‌లో కలవడం ముదావహం. లవకుశుల నుంచి... ప్రతి పాత్రధారీ ఈ చిత్రంలో చాలా గొప్పగా చేశారు.
సాంకేతికంగా ఈ సినిమా ఎలా ఉంటుంది?
- నేననుకున్నట్టు బాపుగారు కావ్యంలాగా తీర్చిదిద్దారు. ముళ్ళపూడివారి కథాకథనాల్ని తెరమీద అద్భుతంగా ఆవిష్కరించారు. సాంకేతికంగా ఎక్కడా వెనకడుగేయలేదు. షూటింగ్ జరిగిన 85 రోజులూ జిమ్మీజిప్ మా దగ్గరే ఉంది. నాలుగు ప్రత్యేకమైన సెట్‌లు వేశాం. ఏ ఫ్రేమ్ చూసినా చాలా గొప్పగా, కనులపండువగా ఉంటుంది. పాటలను అత్యంత సౌందర్యవంతంగా తెరకెక్కించారు బాపుగారు. ఆద్యంతం భారీతనంతో తీర్చిదిద్దాం.
సినిమాని ఎప్పుడు విడుదల చేస్తున్నారు?
ప్రస్తుతం నేపథ్యసంగీతం పనులు జరుగుతున్నాయి. హంగేరి రాజధాని బుడాఫెస్ట్‌లో ట్రాక్ మిక్సింగ్ కార్యక్రమాలు త్వరలో ఉంటాయి. హంగేరి నుంచి ఎనిమిది మంది సభ్యులు ఇప్పుడున్న రీరికార్డింగ్ బృందంతో త్వరలో కలుస్తారు. మరోవైపు గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తి కావచ్చాయి. ఇక డీఐ, డీటీయస్ పనులున్నాయి. వాటిని కూడా ముగించి అక్టోబర్ లోపు చిత్రాన్ని ప్రేక్షకులకు కనువిందు చేయాలనుకుంటున్నాం.

Friday, September 9, 2011
ప్రివ్యూ: దేవరాయ
శ్రీకాంత్ డ్యూయల్ రోల్ చేస్తున్న సినిమా 'దేవరాయ'. సోషియో ఫాంటసీగా తయారవుతున్న ఈ సినిమాలో దొరబాబుగా, విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలుగా రెండు పాత్రల్ని శ్రీకాంత్ చేస్తున్నారు. కిరణ్ జక్కంశెట్టితో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నానికృష్ణ దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. "15వ శతాబ్దానికి చెందిన శాసనాల ఆధారంగా తయారు చేసుకున్న కథ ఇది. కొంత కల్పితం ఉంటుంది. కథ వినగానే చేయగలనా? అని అనుమానం వచ్చింది. 'శ్రీ రామరాజ్యం' చేశాక నమ్మకం కుదిరింది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. పీరియాడికల్ సినిమా ఇది'' అని చెప్పారు శ్రీకాంత్.
ఈ చిత్రానికి చక్రి సంగీత దర్శకుడు. "దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కృష్ణదేవరాయను గుర్తుకుతెద్దామనే ఈ సినిమా చేస్తున్నాం. దేవరాయలోని త్యాగం, దానం కలిస్తే ఈ పాత్రవుతుంది. గోదావరి గలగలలకు, విజయనగర వైభవానికి ముడిపెడుతున్నాం'' అని దర్శకుడు చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా: పూర్ణ, నృత్యాలు: శివశంకర్, ఫైట్స్: రవివర్మ, కళ: జె.కె., మాటలు: వీరబాబు బాసిన, స్క్రీన్‌ప్లే: రవిరెడ్డి మల్లు, సమర్పణ: నానిగాడి సినిమా, బేనర్: సన్‌రే ఇంటర్నేషనల్ సినిమా.

Tuesday, August 2, 2011
టర్నింగ్ పాయింట్: చంద్రబోస్
"నేను గాయకుణ్ణి కావాలనుకొని, సొంతంగా కొన్ని పాటలు రాసి వాటిని పాడుకునేవాణ్ణి. నా ఫ్రెండ్ ఒకతను వాటిని చూసి, అవి బాగున్నాయనీ, గేయ రచయితగా కెరీర్‌ని మలచుకుంటే బాగుంటుందనీ అభిప్రాయపడ్డాడు. అప్పుడు కొత్తగా సినిమాని ప్లాన్ చేసిన డైరెక్టర్ ముప్పలనేని శివను కలిశాం. ఆ తర్వాత ఆ సినిమాని నిర్మిస్తున్న గొప్ప నిర్మాత డి. రామానాయుడు గారినీ, దానికి సంగీత దర్శకురాలైన ఎం.ఎం. శ్రీలేఖనూ కలిశాం. ఆమె నాకో ట్యూన్ ఇచ్చింది. ఆ సినిమా శ్రీకాంత్ హీరోగా నటించిన 'తాజ్‌మహల్'. అప్పుడు నేను రాసిన పాట 'మంచుకొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో..'. ఆ అనుభవాన్ని మాటల్లో వర్ణించలేను. నా తొలి సినిమాలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర వంటి గేయ రచయితల సరసన నాకూ చోటు లభించిండం నాకు దక్కిన గొప్ప భాగ్యం. నేను బాగా అభిమానించే బాలు, చిత్ర నా పాటల్ని పాడారు. అదో గొప్ప అనుభవం.
ఆ తర్వాత నా జీవితంలో మరో టర్నింగ్ పాయింట్ చోటు చేసుకుంది. నేను రాసిన ఓ పాట షూటింగ్ సందర్భంగా సంజీవయ్య పార్క్‌కి వెళ్లా. అక్కడ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేస్తున్న మూవ్‌మెంట్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఆమె పేరు సుచిత్ర. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె నా భార్య అయ్యింది.
ఇప్పుడు గేయ రచయితగా నా కెరీర్‌లో 16వ యేడు నడుస్తోంది. ఈ కాలంలో చాలా అవార్డులే సంపాదించా. నా కెరీర్ ఎంతో సంతృప్తికరంగా, సంతోషకరంగా కొనసాగుతోంది. అయితే దాని వెనుక ఎంతో శ్రమ ఉన్నదనేది మరచిపోకూడదు."

న్యూస్: 'హీరో అజయ్' అనిపించుకుంటాడా?
విలన్ పాత్రలతో పాపులరై తర్వాత హీరోలుగా మారి, పేరు తెచ్చుకున్నవాళ్లు టాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, గోపీచంద్ వంటివాళ్లు అందుకు మంచి ఉదాహరణ. ఆ కోవలోనే హీరో కావాలని తపిస్తున్న నటుడు అజయ్. 'హీరో అజయ్' అనే పేరును ఖాయం చేసుకోవాలనేది అతడి చిరకాల వాంఛ. అయితే ఇప్పటివరకు అతడి కల నెరవేరలేదు. విలన్ పాత్రలతో 'విక్రమార్కుడు' నుంచే ప్రేక్షకుల మెప్పు పొందిన అతడు హీరోగా 'ఆ ఒక్కడు', 'సారాయి వీర్రాజు', 'వైకుంఠపాళి' వంటి సినిమాలు రూపొందాయి. కానీ హీరోగా అతడికి బ్రేక్ రాలేదు. ఆ మూడు సినిమాలూ ప్రేక్షకుల్ని మెప్పించలేక పోవడమే దీనికి కారణం. 'ఆ ఒక్కడు'లో అతడికంటే హీరోయిన్ మధురిమ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం. 'సారాయి వీర్రాజు' పూర్తిగా అతడి పాత్రమీదే ఆధారపడిన సినిమా అయినా ఆ కథ మనవాళ్లకి నచ్చలేదు. ఇక 'వైకుంఠపాళి'లో ముగ్గురు హీరోల్లో అతను ఒకడు. మిగతా ఇద్దరు కృష్ణుడు, రణధీర్. ఆ ఇద్దరితో పోల్చితే అజయ్ పాత్రకే ప్రాధాన్యత ఎక్కువైనా ఈ థ్రిల్లర్ ఆడియన్స్‌ని థ్రిల్ చేయలేక పోయింది. అయితే అతడు హీరో కాకపోయినా హీరో కంటే ఎక్కువ ప్రశంసల్ని తెచ్చిన సినిమా 'విరోధి'. నీలకంఠ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కంటే ఎక్కువగా మావోయిస్ట్ రోల్‌లో గొప్పగా రాణించాదు అజయ్. కానీ ఏం లాభం. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాకొట్టింది. అతడి సినిమాలు ఇలా ఒక్కొక్కటే ఫ్లాపవతూ రావడంతో అతడితో సినిమాలు తియ్యాలని ప్లాన్ చేసుకున్న డైరెక్టర్లు, నిర్మాతలు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా కొంత కాలం తర్వాతైనా అజయ్ హీరోగా నిలదొక్కుకుంటాడని అతని శ్రేయోభిలాషులు నమ్ముతున్నారు. వారి నమ్మకం నిజమవుతుందా?
Wednesday, July 27, 2011
న్యూస్: తండ్రి లాగే రామునిగా బాలయ్య అలరిస్తాడా?
వరుసగా ఏడు ఫ్లాపుల తర్వాత వచ్చిన సూపర్ హిట్ మూవీ 'సింహా'తో జూలు విదిల్చాడు నందమూరి బాలకృష్ణ. తన పని అయిపోయిందని జరుగుతున్న ప్రచారానికి ఆ సినిమాతో జవాబిచ్చాడు. అయితే ఆ వెంటనే వెటరన్ డైరెక్టర్ దాసరి నారాయణరావు 150వ సినిమా 'పరమవీరచక్ర' చేసి పొరబాటు చేశాడు. ప్రేక్షకులు ఆ సినిమాని నిర్ద్వంద్వంగా తిరస్కరించినా ఇప్పటికీ అది తన దృష్టిలో గొప్ప సినిమానే అని గొప్పలు చెబుతూనే ఉన్నారు దాసరి. దాని సంగతి పక్కన పెడితే ఇప్పుడు బాలకృష్ణ మూడు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో బాపు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం' ప్రధానమైంది. ఎన్టీఆర్ ఒకప్పటి చిత్రరాజం 'లవకుశ' ఆధారంగా కొద్దిపాటి మార్పులు చేర్పులతో ఈ సినిమా తీస్తున్నారు. దివంగత ముళ్లపూడి వెంకటరమణ సంభాషణలు రాసిన ఈ చిత్రంలో రామునిగా బాలకృష్ణ నటిస్తుంటే, ఆయన సరసన సీతగా అందాల తార నయనతార నటించడం విశేషం. సూపర్‌హిట్ మూవీ 'సింహా' తర్వాత వారు కలిసి పనిచేసిన సినిమా కావడంతో ఈ జోడీ తప్పకుండా మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. తన చివరి కాల్షీట్ రోజు నయనతార ఈ సినిమా సెట్స్ మీద భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఇందులో వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణునిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్ నటిస్తుండటంతో సినిమాకి స్టార్ వాల్యూ కూడా ఏర్పడింది. ఇది కాక పరుచూరి మురళి డైరెక్షన్‌లో తయారవుతున్న సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు బాలకృష్ణ. ఇటీవలే సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ నిర్దేశకత్వంలో 'హర హర మహదేవ' సినిమా మొదలైంది. ఈ సినిమాలతో, ముఖ్యంగా 'శ్రీరామరాజ్యం'తో బాలయ్య తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తాడని ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు నెరవేరుతాయా?
Friday, July 22, 2011
న్యూస్: ఛార్మి 'మంత్రం' పారడం లేదు!
లేడీ ఓరియంటెడ్ మూవీ 'మంత్ర' తర్వాత ఛార్మి హీరోయిన్‌గా నటించిన ఏ తెలుగు సినిమాని ప్రేక్షకులు ఆదరించారు? ప్చ్.. ఏమీ లాభం లేదు. 'మంత్ర' (2007) తర్వాత ఛార్మి వైభవం మసకబారుతూ వచ్చింది. ఈ మధ్యలో ఆమె బాపు దర్శకత్వంలో 'సుందరకాండ', వి. ఈశ్వరరెడ్ది దర్శకత్వంలో 'మనోరమ', కొత్తవాడైన రమణ దర్శకత్వంలో 'సై ఆట', 'మంత్ర' ఫేం తులసీరాం దర్శకత్వంలో 'మంగళ', ప్రేంరాజ్ డైరెక్ట్ చేసిన 'నగరం నిద్రపోతున్న వేళ' వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఆమెకి కమర్షియల్ సక్సెస్‌ని అందించలేదు. కొద్ది రోజుల తేడాతో ఇటీవల వచ్చిన 'నగరం నిద్రపోతున్న వేళ', 'మాయగాడు' సినిమాలు రెండూ ప్రేక్షకుల నుంచి కనీసపు స్పందన కరువవడంతో డిజాస్టర్ అయ్యాయి. గుడ్డిలో మెల్ల ఏమంటే పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో అమితాబ్‌తో కలిసి నటించిన హిందీ సినిమా 'బుడ్డా.. హోగా తేరా బాప్' ఆమెకి బాలీవుడ్‌లో కాస్త గుర్తింపును తెచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్టయ్యిందంటూ మీడియా మొదట్లో తెగ హడావుడి చేసినా, వారాంతం తర్వాత చూసుకుంటే కలెక్షన్లు బాగా డౌనయ్యాయి. ఏదేమైనా దానికి పెట్టిన పెట్టుబడి మాత్రం వచ్చేసింది. ప్రస్తుతం ఛార్మి శ్రీకాంత్ సరసన 'సేవకుడు' చిత్రంలో నటిస్తోంది. దీనికి వి. సముద్ర దర్శకుడు. ఈ సినిమా కూడా ఆడకపోతే ఛార్మిని పట్టించుకునేవాళ్లు కరువైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Thursday, July 14, 2011
న్యూస్: మంచి రచయితని మిస్సవుతున్న టాలీవుడ్
డైరెక్టర్‌గా పోసాని కృష్ణమురళికి ఊహించని ఓటమి 'దుశ్శాసన'. శ్రీకాంత్‌తో ఇదివరకు తీసిన 'ఆపరేషన్ దుర్యోధన' పెట్టుబడిపై మంచి ఆదాయం తీసుకొచ్చి నిజమైన హిట్టవడంతో 'దుశ్శాసన' కూడా అలాగే పెద్ద విజయం సాధిస్తుందని అతను ఆశించాడు. కానీ ఆ సినిమా విడుదల చేయడమే నిర్మాతకి తలకి మించిన భారమైంది. హీరో శ్రీకాంత్ రూ. 20 లక్షలిచ్చి ఆదుకోబట్టి సరిపోయింది. రాజకీయ, పోలీసు వ్యవస్థల మీదా, సమాజం మీదా తనకున్న అక్కసునీ, కోపాన్నీ సినిమాల ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నించే పోసాని రచయితగా ఎంతగా సక్సెస్ అయ్యాడో, దర్శకుడిగా మారినప్పట్నించీ అంతగా విమర్శల్నీ, వివాదాల్నీ మూటగట్టుకుంటూ వచ్చాడు. తను హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన 'మెంటల్ కృష్ణ' ఆయన మానసిక పరిస్థితికి అద్దం పట్టింది. ఆ సినిమాకి కొద్దో గొప్పో డబ్బులు రావచ్చు గాక, కానీ ఆ తర్వాత నుంచీ ఆయన నటించిన సినిమాల్ని కానీ, ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్ని కానీ జనం పట్టించుకోవడం మానేశారు. రాజకీయాల్లోకి వచ్చి నిజాయితీపరుడని కీర్తిస్తూ చిరంజీవి పార్టీలో చేరిన ఆయన గత ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీకి పోటీచేసి ఘోరంగా ఓడిపోయాడు. ఇప్పుడు అదే చిరంజీవిని పెద్ద అవినీతిపరుడని విమర్శిస్తూ ఉన్నవాళ్లలో జగన్మోహనరెడ్డి బెటరంటూ వైయెస్సార్ కాంగ్రెస్స్ పార్టీలో చేరిపోయాడు. ఇలా స్థిరమైన అభిప్రాయమంటూ లేని ఆయన మునుముందు ఏం చేసినా జనం వినే స్థితి కానీ, చూసే స్థితి కానీ కనిపించడంలేదు. మొత్తానికి సినీ పరిశ్రమ ఓ మంచి రచయిత సేవల్ని మిస్సవుతోందని చెప్పవచ్చు.
Monday, July 11, 2011
న్యూస్: హిట్టు కోసం తొమ్మిదేళ్లుగా నిరీక్షణ!
త్రివిక్రం దర్శకుడిగా పరిచయమైన 'నువ్వే నువ్వే' (2002) తర్వాత హీరో తరుణ్‌కి ఇంతవరకు చెప్పుకోదగ్గ మరో హిట్ దక్కకపోవడం ట్రాజెడీ. తప్పకుండా హిట్టవుతాయనకున్న 'నవ వసంతం', 'భలే దొంగలు', 'శశిరేఖా పరిణయం' సినిమాలు కూడా అతనికి హేండిచ్చాయి. వీటిలో మొదటి దాన్ని ఆర్.బి. చౌదరి నిర్మిస్తే, రెండోది బాలీవుడ్ సూపర్ హిట్ 'బంటీ ఔర్ బబ్లీ'కి రీమేక్. ఇక మూడోదాన్ని డైరెక్ట్ చేసింది కృష్ణవంశీ. 'శశిరేఖా పరిణయం' వచ్చి రెండేళ్లయినా ఇంతవరకు తరుణ్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. విమలా రామన్ జతగా అతను నటించిన 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి' చిత్రం 2010లోనే విడుదల కావాల్సి ఉండగా ఇప్పటికీ జనం మధ్యకు రాలేకపోయింది. 2011లోనూ రెండుసార్లు విడుదల తేదీ ప్రకటించినా ఆ పని చేయలేకపోయారు నిర్మాతలు. ఈ సినిమాకి ఇద్దరు నిర్మాతలు, వారిలో ఒకరు సుప్రీం మ్యూజిక్ అధినేత రాజు హర్వాణీ కాగా, మరొకరు సినీ జర్నలిస్టు అయిన గోగినేని శ్రీనివాస్. ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ సవ్యంగా నడవలేదు. మొదట డైరెక్టర్‌గా పెట్టుకున్న వి.ఎన్. ఆదిత్య నిర్మాతలతో పొసగక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దాంతో తమిళుడైన కన్మణితో ఈ సినిమాని పూర్తి చేశారు నిర్మాతలు. చివరిగా మే 27న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు వారు ప్రకటించారు. కానీ ఆ రోజున ఈ సినిమా రిలీజ్ కాలేదు. తిరిగి ఇప్పటివరకు ఈ సినిమా పరిస్థితి ఏంటో తెలీదు. ఇందులో తరుణ్, విమల హాట్ హాట్ బాత్ రూం సీన్‌లో నటించినట్లు నిర్మాతలు విడుదల చేసిన స్టిల్స్ వల్ల తెలుస్తోంది. తెరమీద ఆ సీన్లని తిలకించే అవకాశం ప్రేక్షకులకి ఎప్పుడొస్తుందో మరి. ఈ సినిమా సంగతి అలా ఉంచితే ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు తరుణ్. వాటిలో ఒకటి శ్రీకాంత్ కాంబినేషన్‌తో చేస్తున్న 'అనుచరుడు' కాగా, మరోటి శ్రీహరి కాంబినేషన్‌తో చేస్తున్న 'యుద్ధం'. ఈ సినిమాలైనా సకాలంలో విడుదలై, తరుణ్‌కి మంచి కెరీర్‌ని ఇస్తాయో, లేదో చూడాలి.
Monday, July 4, 2011
న్యూస్: శ్రీకాంత్‌కి మళ్లీ నిరాశే
శ్రీకాంత్ ఆశలు మరోసారి వమ్మయ్యాయి. తప్పకుండా విజయం సాధించడంతో పాటు నటుడిగా తనకి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుందని భావించిన 'విరోధి' సినిమాకి ప్రేక్షకులు కరువవడం అతణ్ణే కాదు సినీ వర్గాల్నే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఎందుకటే ఆ సినిమాకి డైరెక్టర్ ప్రతిభావంతుడిగా పేరుపొందిన నీలకంఠ. కమర్షియల్‌గా పెద్ద హిట్టు కాకపోయినా క్లాస్ ఆడియెన్స్‌నీ, విమర్శకుల్నీ మెప్పిస్తుందని చాలామంది అనుకున్నారు. అయితే మేకా మీడియా బేనర్‌పై శ్రీకాంత్ తమ్ముడు అనిల్ నిర్మించిన ఈ సినిమా రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యిందని చెప్పాలి. సగటు ప్రేక్షకుడినే కాక మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌నీ ఈ సినిమా మెప్పించలేకపోతోంది. దాంతో దీనికి పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసినట్లే. అంతే కాదు జర్నలిస్టుగా నటించిన శ్రీకాంత్ కంటే నక్సలైటుగా నటించిన అజయ్‌కే ఎక్కువ పేరొచ్చింది. కరెక్టుగా చెప్పాలంటే ఇది శ్రీకాంత్ సినిమా అని కాకుండా అజయ్ సినిమా అనే అంటున్నారు. ప్రధాన స్రవంతి సినిమా విధానంలో గాక కొత్త ధోరణిలో నీలకంఠ చేసిన ప్రయోగం ఎక్కువమందిని ఆకట్టుకోలేక పోతోంది. నక్సలిజం దారి తప్పిపోయిందని 'విరోధి'తో చెప్పాలని ఆయన యత్నించాడు. దానికి ఆయన ఎంచుకున్న స్క్రీన్‌ప్లే బోర్ కొట్టించింది. అందుకే ఈ సినిమా పట్ల ఎక్కువమంది ఆసక్తి కనపర్చడం లేదు.
2007లో 'ఆపరేషన్ దుర్యోధన', 'యమగోల.. మళ్లీ మొదలైంది' తర్వాత శ్రీకాంత్‌కి ఇంతవరకు మరో హిట్టు దక్కలేదు. 'మైఖేల్ మదన కామరాజు' నుంచి మొదలుకుని 'విరోధి' దాకా వరుసగా ఎనిమిది సినిమాలు అటకెక్కాయి. వీటిలో కృష్ణవంశీ డైరెక్షన్‌లో నటించిన 100వ సినిమా 'మహాత్మా' కూడా ఉంది. 'విరోధి' ఫ్లాపవడంతో శ్రీకాంత్ తన పాత్రల విషయంలో పునరాలోచించుకుంటే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. శ్రీహరి తరహాలో ఓ వైపు హీరో పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు అవకాశమున్న ఇతర పాత్రల్ని చేసుకుంటే బెటర్ అనేది వారి అభిప్రాయం.

Saturday, July 2, 2011
న్యూస్: తెలుగు తెరపై మరో యమధర్మరాజు
తెలుగు తెరమీద మరో యమధర్మరాజు కనిపించబోతున్నాడు. ప్రేక్షకుల మనసుల్లో యమధర్మరాజు అనగానే మొదట మెదిలే వ్యక్తి కైకాల సత్యనారాయణ. 'యమగోల' సినిమా నుంచి ఆ పాత్రని సత్యనారాయాణే చేయాలనే అభిప్రాయం బలపడింది. అదివరకు 'సతీ సావిత్రి'లో యమునిగా ఎన్‌టీ రామారావు విశ్వరూపాన్ని మనం చూశాం. అయినా ఆయన ఎక్కువ సినిమాల్లో ఆ పాత్రపోషణ చేయలేదు. అందువల్ల సత్యనారాయణకు తెలుగుతెర యమునిగా కీర్తి దక్కింది. అయితే ఆయనకు వయసు మళ్లినందున ఇతరులకు ఆ పాత్ర చేసే అవకాశాలు కలుగుతున్నాయనుకోవాలి. 'యమదొంగ'లో మోహన్‌బాబుకు ఆ పాత్ర చేసే అవకాశం కల్పించాడు డైరెక్టర్ రాజమౌళి. అందుకు తగ్గట్లుగానే తన విలక్షణ నటనతో, డైలాగ్ డెలివరీతో యముని పాత్రను బాగా అభినయంచి చూపారు మోహన్‌బాబు.
ఆ తర్వాత 'యమగోల.. మళ్లీ మొదలైంది' సినిమాలో సీనియర్ యమునిగా సత్యనారాయణ నటిస్తే, కుర్ర యమునిగా శ్రీకాంత్ పర్వాలేదనిపించుకున్నాడు. ఈ మధ్యే 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' సినిమాలో యముని పాత్రని వెటరన్ యాక్టర్ జయప్రకాశ్‌రెడ్డి తనదైన శైలిలో రక్తి కట్టించాడు.
ఇక ఇప్పుడు ఆ పాత్రని పోషించే అవకాశం శ్రీహరికి వచ్చింది. ఓవైపు హీరోగా, మరోవైపు కేరక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న ఆయన సాయిరాం శంకర్ హీరోగా నటించే ఓ సినిమాలో యమధర్మరాజు పాత్రని చేయబోతున్నాడు. ఇదివరకు 'వేడుక' అనే సినిమాని డైరెక్ట్ చేసిన జితేందర్ ఈ సినిమాకి దర్శకుడు. ముమైత్‌ఖాన్‌తో 'పున్నమినాగు'ని నిర్మించిన జి. విజయకుమార్ గౌడ్ ఈ సినిమాకి నిర్మాత. అమెరికా నేపథ్యంలో కథ నడవడం ఈ సోషియో ఫాంటసీ ప్రత్యేకత. అంటే ఇప్పటివరకు మన తెలుగు నగరాల్లో, గ్రామాల్లో మాత్రమే హల్‌చల్ సృష్టించిన యమధర్మరాజు ఈ సినిమాలో అమెరికాలో ఆ పని చేయబోతున్నాడు. ఇంకో సంగతేమంటే చాలా గ్యాప్ తర్వాత ఎన్నారై బ్యూటీ పార్వతీ మెల్టన్ ఇందులో నాయికగా సాయిరాం సరసన నటించబోతోంది. ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో వస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలు కాబోతోంది. ఇందులో యమునిగా శ్రీహరి ఏవిధంగా రాణిస్తాడో చూడాల్సిందే.

Monday, June 27, 2011
Tuesday, June 7, 2011
Tuesday, May 24, 2011
ఇంటర్వ్యూ: పోసాని కృష్ణమురళి
"జనం కోసం నాయకులు బతకాలని చెబుతూ 'దుశ్శాసన'లో హీరో ఓ సిస్టమ్ పెడతాడు. ఇప్పటి వ్యవస్థ ప్రక్షాళనకి ఈ సినిమాలో నేను పరిష్కారం చూపించా. ఓ మాటలో చెప్పాలంటే 'దుశ్శాసన' నా ఆత్మ'' అని చెప్పారు. పోసాని కృష్ణమురళి. శ్రీకాంత్, సంజన జంటగా లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మురళీకృష్ణ నిర్మించిన 'దుశ్శాసన' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ నెల 27న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించీ, అందులోని రాజకీయ అంశాల గురించీ విపులంగా మాట్లాడారు పోసాని. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
రాజకీయ నాయకుల్లో ఎవరైతే ప్రజాస్వామ్య విలువల్ని వలువల్లా లాగేస్తున్నారో వారే నా సినిమాలో 'దుశ్శాసన'. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి రాజకీయ నాయకులకి ఉండే సౌకర్యాలేవీ సామాన్య జనానికి ఉండవు. ఏ మంత్రి లేదా ఎమ్మెల్యే ఇంట్లో కరెంటు సమస్య కానీ, నీటి సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య కానీ ఉండదు. ఇవన్నీ జనానికి ఉంటాయి. దీన్ని ప్రశ్నించి, "మీకు ఉండే సౌకర్యాలన్నీ మాకూ ఇవ్వండిరా'' అని డిమాండ్ చేసే ఓ కామన్ మ్యాన్ కథ ఈ సినిమా. ఏ పనులు చేస్తామని పదవులు చేపట్టారో ఆ పనులు ఎందుకు చెయ్యడం లేదని అడిగే పాత్రలో శ్రీకాంత్ బాగా చేశాడు. అర్జెంటీనా ఉద్యమకారుడు చేగువేరా అంటే నీతికీ, నిజాయితీకీ, పోరాటానికీ, ధైర్యానికీ ప్రతీక. అందుకే శ్రీకాంత్ పాత్రకి ఆ లుక్ ఇచ్చా. అంతకుమించి చేగువేరాకీ, నా సినిమాకీ ఎలాంటి సంబంధమూ లేదు.
వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లను
ఇవాళ రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారుతున్నారు. తమకి అడ్డు వచ్చినవాళ్లని అడ్డు తొలగించుకోడానికి వెనుకాడటం లేదు. ఇలా అడుగుతున్నానని నన్ను ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. ఈ సంగతి మా కుటుంబానికి కూడా చెప్పా. నేను తప్పు చెయ్యనని మా వాళ్ల నమ్మకం. అందుకే వాళ్లు నాకు అడ్డురారు. నేను ఎవరి వ్యక్తిగత విషయాల జోలికీ వెళ్లను. వ్యక్తిగతంగా వాళ్లేం చేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ జనంలోకి వస్తేనే అడుగుతా. 'దుశ్శాసన'లో జనం కోసం నాయకులు బతకాలని చెబుతూ హీరో ఓ సిస్టమ్ పెడతాడు. ఇప్పటి వ్యవస్థ ప్రక్షాళనకి ఈ సినిమాలో నేను పరిష్కారం చూపించా. ఓ మాటలో చెప్పాలంటే 'దుశ్శాసన' నా ఆత్మ.

అందుకే పాలిటిక్స్
నా ఉద్దేశంలో జనజీవన స్రవంతిలో కలవాల్సింది మావోయిస్టులు కాదు. రాజకీయ నాయకులే. మావోయిస్టులు అన్ని సౌకర్యాల్నీ వదులుకుని అడవుల్లో జనం కోసం బతుకుతున్నారు. జనం మధ్య ఉంటూనే జనానికి దూరంగా బతుకుతోంది ఈ రాజకీయ నాయకులే. నక్సలైట్లు ఊరికే పుట్టడం లేదు. ఈ రాజకీయ వ్యవస్థవల్లే పుడుతున్నారు. చెప్పీ చెప్పీ ఏమీ ప్రయోజనం ఉండకపోవడంతో విసిగిపోయి నక్సలైట్లుగా మారుతున్నారు. అందుకే పాలిటిక్స్ గురించి ఎంత ఎక్కువ చెబితే అంత మంచిదనే ఉద్దేశంతో నా సినిమాల్లో రాజకీయ అంశాల్ని ప్రస్తావిస్తూ వస్తున్నావ్యక్తిగత విషయాల్లోకి వెళ్లను
ఇవాళ రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారుతున్నారు. తమకి అడ్డు వచ్చినవాళ్లని అడ్డు తొలగించుకోడానికి వెనుకాడటం లేదు. ఇలా అడుగుతున్నానని నన్ను ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. ఈ సంగతి మా కుటుంబానికి కూడా చెప్పా. నేను తప్పు చెయ్యనని మా వాళ్ల నమ్మకం. అందుకే వాళ్లు నాకు అడ్డురారు. నేను ఎవరి వ్యక్తిగత విషయాల జోలికీ వెళ్లను. వ్యక్తిగతంగా వాళ్లేం చేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ జనంలోకి వస్తేనే అడుగుతా. 'దుశ్శాసన'లో జనం కోసం నాయకులు బతకాలని చెబుతూ హీరో ఓ సిస్టమ్ పెడతాడు. ఇప్పటి వ్యవస్థ ప్రక్షాళనకి ఈ సినిమాలో నేను పరిష్కారం చూపించా. ఓ మాటలో చెప్పాలంటే 'దుశ్శాసన' నా ఆత్మ.
బిజినెస్ సమస్య లేదు
పోసాని వల్ల ఏ నిర్మాతా నాశనం కాడు. పోసాని సినిమా అంటే కొనేవాళ్లు ఇంకా ఉన్నారు. నేను తీసేది తక్కువ బడ్జెట్‌తో కావడం వల్ల బిజినెస్ సమస్య నా సినిమాలకు లేదు. 'దుశ్శాసన' అన్ని ప్రాంతాలకూ అమ్ముడుపోయింది. జేపీ నీతిమంతుడే కానీ...
రాజకీయాల్లో స్థిరమైన నిర్ణయాలు ఉండవు. జనం ఎప్పుడూ ఏదో ఒక పార్టీకే ఎందుకు ఓట్లేయడం లేదు. ఒకసారి ఓ పార్టీని గెలిపించే వారు ఆ పార్టీ ప్రభుత్వం బాగా పనిచేస్తేనే మళ్లీ దానికి ఓటేస్తారు. లేదంటే వేరే పార్టీని ఎన్నుకుంటారు. నేను కూడా అంతే. ఏ నాయకుడైనా బాగా చేస్తుంటే మెచ్చుకుంటా. పొరపాట్లు చేస్తే తిడతా. మొన్న చంద్రబాబునీ, నిన్న చిరంజీవినీ అలాగే మెచ్చుకున్నా, తర్వాత తిట్టా. ఇవాళ రాజకీయ నాయకుల్లో 99 శాతం అవినీతిపరులే. అవినీతికి పాల్పడని రాజకీయ నాయకుల్ని ఓ ముగ్గుర్ని చూపించండి. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో అవినీతి అనివార్యమైపోయింది. రాజకీయ నాయకులతో పాటు ప్రజలూ అవినీతి గురించి మాట్లాడే హక్కు కోల్పోయారు. లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ నీతిమంతుడు. అయితే ఇవాళ నీతి ఒక్కటే సరిపోదు. దానితో పాటు సమర్థతా, బలమూ కావాలి. జె.పి.కి ఆ బలం లేదు. ఉన్నవాళ్లలో సమర్థుడు అనిపించబట్టే వై.ఎస్. జగన్మోహనరెడ్డికి మద్దతు పలుకుతున్నా.
Friday, September 3, 2010
Movies: Market downfall for Srikanth

ఎన్ని సినిమాలు చేసినా కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్న నటుడు శ్రీకాంత్. హీరోగా ఉండి వంద సినిమాలు పూర్తి చేసుకున్నా అతని సినిమాలకి మార్కెట్ పెరగకపోగా క్రమేపీ తరుగుతూ వస్తోంది. కృష్ణవంశీ డైరెక్షన్లో ఎంతో గ్రాండుగా అతను నటించిన 100వ చిత్రం 'మహాత్మా' సైతం బాక్సాఫీస్ వద్ద నిరాశని కలిగించింది. మూడేళ్ల క్రితం వచ్చిన 'ఆపరేషన్ దుర్యోధన', 'యమగోల.. మళ్లీ మొదలైంది' సినిమాలు కాస్త ఆడేసరికి శ్రీకాంత్ రోజులు మొదలయ్యాయని చాలామంది భావించారు. కానీ ఆ తర్వాత వచ్చిన మైఖెల్ మదన కామరాజ్, నగరం, కౌసల్య సుప్రజ రామ, మహాత్మ సినిమాలు వరుసగా ఫెయిలయ్యాయి. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది.
ప్రస్తుతం అతను 'రంగ ది దొంగ', 'సేవకుడు' సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. వీటిలో 'రంగ ది దొంగ' సినిమాకి డైరెక్టర్ జీవీ అలియాస్ జి.వి. సుధాకర్ నాయుడు. విలన్ పాత్రలతో జనానికి పరిచయమైన జీవీ డైరెక్టరుగా మారి తీసిన తొలి సినిమా 'హీరో' (నితిన్ హీరో) ప్రేక్షకుల కళ్లని బైర్లు కమ్మించింది. 'రంగ ది దొంగ' డైరెక్టరుగా అతనికి రెండో సినిమా. తొలి సినిమా మిగిల్చిన చేదు అనుభవాన్ని మర్చిపోవాలనే కసితో ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. విమలా రామన్ హీరోయినుగా నటిస్తున్న ఈ సినిమాలో అన్ని రకాల మసాలాలు ఉన్నాయి. చూద్దాం.. ఈ సినిమాతోనైనా శ్రీకాంత్, జీవీ సక్సెస్ అవుతారో, లేదో..
Subscribe to:
Posts (Atom)