ఏవీఎస్ తర్వాత మరో హాస్యనటుడు డైరెక్టర్ అవతారం ఎత్తాడు. అయితే అతను మరీ జూనియర్. కానీ తన హాస్య నటనతో మంచి పేరే సంపాదించుకున్నాడు. అతను కిశోర్. దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'వెన్నెల' సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసి, ఆ సినిమా పేరుతో 'వెన్నెల' కిశోర్‌గా పాపులర్ అయిన అతడు. ఇప్పుడు అదే సినిమా సీక్వెల్‌తో డైరెక్టర్‌గా పరిచయమవుతుండటం విశేషం. తెలుగులో ప్రస్తుతం సీక్వెల్ సీజన్ నడుస్తోంది. 'గాయం 2', 'మనీ మనీ మోర్ మనీ' తర్వాత ఇప్పుడు 'వెన్నెల'కి సీక్వెల్ తయారవుతోంది. చిత్రమేమంటే ఈ సినిమాకి కిశోర్ 'వెన్నెల 2' అని గాక, 'వెన్నెల 1 1/2' (వెన్నెల వన్ అండ్ హాఫ్) అని పేరు పెట్టడం. 'లవ్ ప్లస్ లాఫ్ హోల్ క్యూబ్ మైనస్ లాజిక్' అనేది ట్యాగ్‌లైన్.
"నేను పరిచయమైన 'వెన్నెల'కి సీక్వెల్‌తో డైరెక్టర్ని కావడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులు ఊహించని ఎన్నో ఆశ్చర్యాలు ఇందులో ఉంటాయి. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తీస్తున్నా. హైదరాబాద్‌తో పాటు అమెరికా, బ్యాంకాక్, స్విట్జర్లాండ్‌లలో షూటింగ్ జరుపుతాం. చిత్రసీమలోని పేరుపొందిన కమెడియన్లందరూ ఇందులో ఉన్నారు. హీరో హీరోయిన్ల పేర్లని తర్వాత తెలియజేస్తాం" అని చెప్పాడు కిశోర్. ఈ సినిమాని జీఆర్ 8 ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై వాసు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'గాయం 2', 'మనీ మానీ మోర్ మనీ' సినిమాలు ఫ్లాపైన నేపథ్యంలో ఈ కామెడీ సీక్వెల్ ఎలా ఆడుతుందో చూడాల్సిందే.
Showing posts with label avs. Show all posts
Showing posts with label avs. Show all posts
Saturday, September 3, 2011
Friday, August 12, 2011
న్యూస్: 'రామదండు' పరిస్థితి ఏమిటి?
'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు' సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమెజ్ పొందిన స్థూలకాయ నటుడు కృష్ణుడు హీరోగా తన ప్రస్థానాన్ని ఎంతకాలం కొనసాగించ గలుగుతాడు? స్థూలకాయులు హీరోగా రాణించరనే నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ రెండు విజయాలు సాధించిన కృష్ణుడు వాటి తర్వాత వెనకడుగు వేశాడు. అతను హీరోగా నటించిన 'పప్పు', 'కోతిమూక', 'వైకుంఠపాళి', తాజాగా 'అమాయకుడు' సినిమాలు అటకెక్కాయి. ముఖ్యంగా 'కోతిమూక', 'అమాయకుడు' డిజాస్టర్‌గా నిలిచాయి. అందుకు ఆయా దర్శకులే (ఏవీయస్, భారతీ గణేశ్) ముఖ్య కారణమని చెప్పాలి. త్వరలో కృష్ణుడు 'నాకూ ఓ లవరుంది'లో హీరోగా కనిపించబోతున్నాడు. ఇదికాక పోయినేడాదే విడుదల కావలసిన 'రామదండు' అనే సినిమా ఇంతవరకూ అతీ గతీ లేకుండా ఆగిపోయి ఉంది. నరేష్‌తో రూపొందించిన 'దొంగల బండి' ద్వారా డైరెక్టర్‌గా పరిచయమైన వేగేశ్న సతీశ్ ఈ సినిమాకి దర్శకుడు. ఫుట్‌బాల్ నేపథ్యంలో ఈ సినిమాని అతను రూపొందించాడు. పిల్లలు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాలో కృష్ణుడు ఫుట్‌బాల్ కోచ్ పాత్రని చేశాడు. ఈ సినిమా ఎప్పుడు వెలుగు చూస్తుందోనని కృష్ణుడుతో పాటు అతని శ్రేయోభిలాషులంతా వెయిట్ చేస్తున్నారు. 'వినాయకుడు' సీరిస్‌తో తనకి దక్కిన సక్సెస్ గాలివాటం కాదనీ, హీరోగా సినిమాని క్యారే చేసే సత్తా తనకుందనీ అతను నిరూపించుకోవాలంటే వీటిలో ఓ సినిమా అయినా ఆడాలి. అది జరుగుతుందా?
Sunday, June 27, 2010
KOTHIMOOKA: Fourth Trial for AVS


దర్శకుడిగా నిలదొక్కుకోవాలని తపిస్తున్న నటుడు ఏవీయస్, ఆ దిశగా నాలుగో యత్నం చేస్తున్నారు. భారీకాయుడు కృష్ణుడు హీరోగా, బ్యూటీ గర్ల్ శ్రద్ధా ఆర్య హీరోయిన్‌గా ఆయన 'కోతిమూక' డైరెక్ట్ చేశారు. తులసి పూజిత ఫిలిమ్స్ బ్యానర్‌పై వెంకట్ జగదీష్ అనే నూతన నిర్మాత ఈ ఫిలింని నిర్మిస్తున్నారు.
కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ పొందిన ఏవీయస్ 'సూపర్ హీరోస్'తో డైరెక్టర్‌గా తన జర్నీ ప్రారంభించారు. ఆ సినిమాలో బ్రహ్మానందం, ఆయనా టైటిల్ రోల్స్ చేశారు. రామానాయుడు నిర్మించిన ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత తనే సొంతంగా 'ఓరి నీప్రేమ బంగారం గానూ' అనే సినిమాని ఆయన తీశారు. సూపర్ హిట్ ఫిల్మ్ 'నిన్నే పెళ్లాదతా'లో 'ఎటో వెళ్లిపోయింది మనసు' పాటతో పాపులర్ అయిన సింగర్ రాజేశ్‌ని ఈ సినిమాతో ఆయన హీరోగా పరిచయం చేశారు. కానీ ఆ సినిమా కూడా ఆయనకు కమర్షియల్‌గా అసంతృప్తినే మిగిల్చింది. ఈసారి నలుగురు మిత్రుల కథకి కాస్త సందేశాన్ని మేళవించి 'రూంమేట్స్' సినిమాని డైరెక్ట్ చేశారు ఏవీయస్. కొన్ని వర్గాల నుంచి ప్రశంసలు పొందినప్పటికీ ఈసారీ సక్సెస్ రుచి చూడలేకపోయారు. దాంతో తనలోని దర్శకుడికి మూడున్నరేళ్లు విరామం ఇచ్చిన ఆయన ఇప్పుడు 'కోతిమూక'తో మరోసారి పరీక్షకి సిద్ధమయ్యారు.
'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు' సినిమాలతో కొత్త తరహా హీరోగా స్థూలకాయుడైన కృష్ణుడు సక్సెస్ కావడంతో అతణ్ణే హీరోగా పెట్టి 'కోతిమూక' రూపొందించారు ఏవీయస్. "కోతి అంటూ హేళనగా చూస్తారు కానీ, ఆ కోతులే లంకకు వారధి కట్టాయనీ, శ్రీరామునికి ఘనవిజయం చేకూర్చి పెట్టాయనీ రామాయణం చెబుతుంది. అలాగే మా చిత్రంలోని కోతిమూక కూడా ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తుంది" అని తెలిపారు ఏవీయస్. అందుగు తగ్గట్లే టైటిల్‌కి 'నాట్ ఓన్లీ కామెడీ' అనే ట్యాగ్ లైన్‌ని ఉపయోగించారు. ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఏవీయస్ విజయాన్ని సాధించడం ఖాయమని స్టార్ కమెడియన్ బ్రహ్మానందం సహా ఆ సినిమాకి పనిచేసిన వాళ్లంతా గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెట్టించిన బలంతో, గట్టి పట్టుదలతో ఏవీయస్ చేసిన ఈ ప్రయత్నం ఫలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జూలై 9న 'కోతిమూక' మనముందుకు వస్తోంది.
Subscribe to:
Posts (Atom)

