Showing posts with label jayant. Show all posts
Showing posts with label jayant. Show all posts
Saturday, November 26, 2011
'పంజా' దెబ్బ ఎలా ఉంటుంది?
'తీన్‌మార్' తర్వాత పవన్ కల్యాణ్ 'పంజా' దెబ్బ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 9న ఈ సినిమా రావడం ఖాయమైంది. త్రివిక్రం డైరెక్షన్‌లో చేసిన 'జల్సా' వంటి సూపర్‌హిట్ తర్వాత ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ చేసిన 'కొమరం పులి' అట్టర్‌ఫ్లాపవగా, జయంత్ సి. పరాంజీ డైరెక్షన్‌లో చేసిన 'తీన్‌మార్' బిలో యావరేజ్‌గా మాత్రమే నడించింది. దీంతో 'పంజా' మీద ఆయనా, ఆయన అభిమానులూ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమాలో డాన్ వేషంలో గడ్డంపెంచి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు పవన్. తమిళంలో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విష్ణువర్ధన్ ఈ సినిమాతో తెలుగుకు పరిచయమవుతున్నాడు. 'పంజా'ని అతను చాలా స్టైలిష్‌గా తీస్తున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అజిత్‌ని 'బిల్లా'గా అతను చూపించిన తీరు ఇందుకు నిదర్శనం. ఈ సినిమాలో పవన్ సరసన ఇద్దరు కొత్తమ్మాయిలు మాజీ మిస్ ఇండియా సారా జేన్ డయాస్, ముంబై మోడల్ అంజలీ లావణియా కనిపించబోతున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందించగా చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి రాసిన పాటలు నవంబర్ 19న మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఈ సినిమాతో పాత రికార్డులు బద్దలై, కొత్త రికార్డులు నమోదవుతాయనీ, పవన్ 'పంజా' దెబ్బ ఏమిటో అందరికీ తెలుస్తుందనీ ఆయన ఫాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
Friday, September 9, 2011
న్యూస్: 'లవ్ 4 ఎవర్' అంటున్న దర్శకుడు
డైరెక్టర్ జయంత్ సి. పరాంజీ బలమతా ప్రేమకథలే. 'ప్రేమించుకుందాం రా' నుంచి ఈ సంగతిని మనం గ్రహించవచ్చు. ఆయన పెళ్లి సైతం అచ్చం సినిమా ప్రేమ పెళ్లి తరహాలోనే జరిగింది. అప్పటికే మరొకరితే నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని ప్రేమించి, ఆమె కాళ్లమీద ఆమె నిలబడేట్లు చేసి, ఆమె పెద్దల్ని ఒప్పించి పెళ్లిచేసుకున్నాడు జయంత్. నిజ జీవితంలో ప్రేమ విషయంలో సాధించిన ఆ విజయం ఆయన ఆత్మ విశ్వాసాన్ని ఎన్నో రెట్లు పెంచింది. ప్రేమ కథలు తీయడంలో ఆయనలోని సాధికారతకి ఇదే కారణమనాలి. పవన్ కల్యాణ్‌తో చేసిన చివరి సినిమా 'తీన్‌మార్' తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? తర్వాతి సినిమా కోసం ఆయనేమీ ఆదుర్దా పడటం లేదు. ఆయనకి హీరో ముఖ్యం కాదు. స్క్రిప్ట్ 100 శాతం సంతృప్తి కలిగించడమే ముఖ్యం. 2007లో వచ్చిన 'శంకర్‌దాదా జిందాబాద్' తర్వాత నాలుగేళ్లకు 'తీన్‌మార్' వచ్చింది. రెండు పెద్ద సినిమాల మధ్య ఆయన ఎందుకింత గ్యాప్ తీసుకున్నట్లు? తన వద్దకు వచ్చిన స్క్రిప్టులు నచ్చకపోవడమే అనేది ఆయన సమాధానం. అయితే 'తీన్‌మార్' కంటే ముందే ఆయన మరో ప్రాజెక్టు మీద పనిచేశాడు. ఆ సినిమా పేరు 'లవ్ 4 ఎవర్'. అంతా కొత్తవాళ్లతో తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని ఆయన రూపొందించాడు. ఇందులో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోనే ఓ ఐటం సాంగ్ కూడా చేసింది. 'తీన్‌మార్' ఆఫర్ రావడంతో ఆ చిన్న సినిమాని తాత్కాలికంగా పక్కనపెట్టాడు జయంత్. ఎప్పుడో షూటింగ్ పూర్తయిన 'లవ్ 4 ఎవర్'కి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి త్వరలో రిలీజ్ చేయాలని ఆయన భావిస్తున్నాడు. చెప్పుకోవాల్సిన ఇంకో సంగతేమంటే పవన్ కల్యాణ్‌తో ఆయన మరో సినిమా చేసే అవకాశం. వినోదాత్మక ప్రేమకథతో ఈ చిత్రాన్ని తీయాలని జయంత్ భావిస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ మీద ఆయన పనిచేస్తున్నాడు. అన్నీ కుదిరితే వచ్చే యేడాది ఈ సినిమాకి సంబంధించిన వివరాలు బయటకు రావచ్చు.
Wednesday, July 13, 2011
న్యూస్: 'పవర్' చూపిస్తాడా?
పవన్ కల్యాణ్ 'జల్సా' తర్వాత మళ్లీ అంత హిట్ ఎప్పుడిస్తాడు? ఆయన్ని అభిమానించేవాళ్లు ఎదురుచూస్తున్నది దీని కోసమే. 'పులి' సినిమా డిజాస్టర్ కావడమే కాక, దాని నిర్మాత శింగనమల రమేశ్‌ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ హిట్ 'లవ్ ఆజ్ కల్'కి రీమేక్‌గా ఎంతో హైప్‌తో జయంత్ సి. పరాన్జీ డైరెక్షన్‌లో వచ్చిన 'తీన్‌మార్' సినిమా ఆశించిన రీతిలో ఆడియన్సుని ఆకట్టుకోవడంలో విఫలమైంది. అందువల్ల ఇప్పుడు పవన్ చేస్తున్న సినిమాల మీదే అందరి దృష్టి ఉంది. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఇద్దరిలో ఒకరైన పవన్ ఈ యేడాది చివరలో 'ద షాడో' (టైటిల్ మారవచ్చు)గా రాబోతున్నాడు. దీని డైరెక్టర్ విష్ణువర్ధన్. తెలుగువాడైనప్పటికీ తమిళంలోని హాట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న విష్ణువర్ధన్ రూపొందిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. నీలిమా నగేశ్, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాజీ మిస్ ఇండియా సారా జేన్ డయాస్, ముంబై మోడల్ అంజలీ లావణియా హీరోయిన్లు. యువన్‌శంకర్ రాజా మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమా మాఫియా నేపథ్యంలో నడిచే ఓ గ్యాంగ్‌స్టర్ కథ. 'లవ్ ఆజ్ కల్' తర్వాత మరో హిందీ హిట్ సినిమా 'దబాంగ్'కి రీమేక్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు పవన్. 'గబ్బర్ సింగ్' పేరుతో రూపొందే ఈ సినిమాని నటుడు గణేశ్‌బాబు నిర్మించనుండగా, హరీశ్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇవికాక యేసుక్రీస్తుపై సింగీతం శ్రీనివాసరావు రూపొందిస్తున్న పేరుపెట్టని సినిమాలో పవన్ ఓ ప్రత్యేక పాత్రని చేస్తున్నాడు. ఇందులో ప్రధాన పాత్రలన్నిట్నీ బాల తారలు చేస్తున్నారు. ఇది కమర్షియల్ సినిమా కాదు కాబట్టి ఈ సినిమాని మినహాయిస్తే.. 'ద షాడో', 'గబ్బర్‌సింగ్' సినిమాలతో పవన్ కల్యాణ్ తన 'పవర్'ని చూపిస్తాడని ఆశించొచ్చు.
Subscribe to:
Posts (Atom)


