Showing posts with label shruti haasan. Show all posts

Wednesday, August 26, 2015
Sunday, August 2, 2015
Friday, September 26, 2014
Thursday, July 10, 2014
Sunday, June 8, 2014
Saturday, January 4, 2014
Saturday, November 30, 2013
Monday, November 25, 2013
Saturday, November 23, 2013
Tuesday, July 9, 2013
Monday, June 4, 2012
పవన్‌కల్యాణ్ షో గబ్బర్‌సింగ్
"ఒన్‌మ్యాన్ షో 'గబ్బర్‌సింగ్'. పవన్‌కళ్యాణ్ కాకుండా మరొకర్ని 'గబ్బర్‌సింగ్'గా ఊహించలేను. అన్ని రికార్డుల్నీ క్రాస్‌చేసి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్‌వన్ సినిమా అయ్యింది'' అని చెప్పారు బండ్ల గణేశ్. పవన్‌కల్యాణ్ హీరోగా హరీశ్‌శంకర్ డైరెక్ట్ చేసిన 'గబ్బర్‌సింగ్'ను ఆయన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సందర్భంగా తమ సంస్థ కార్యాలయంలో మాట్లాడారు గణేశ్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
కల్యాణ్ దేనికీ ఎగ్జయిట్ అవరు. సినిమా చూశాక ఆయన నోటినుంచి వచ్చిన ఒకే మాట 'బాగుంది' అని. రికార్డుల గురించీ, కలెక్షన్ల గురించీ ఒక్కసారీ అడగలేదు. మానవ అనుబంధాలకీ, మోరల్స్‌కీ నిలబడే మనిషి కల్యాణ్. సినిమాలో 'రౌడీలతో అంత్యాక్షరి' ఎపిసోడ్ ఆలోచన కల్యాణ్‌ది. అది మినహాయిస్తే 'దబాంగ్'లో లేని సన్నివేశాలు కానీ, ఇతర మార్పులు కానీ అన్నీ హరీశ్‌వే. చాలా గొప్పగా చేశాడు. హరీశ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు 'అతను చెప్పినట్లు తీస్తే ఇండస్ట్రీ రికార్డులు కొడుతుంది' అన్నాడు మా అన్నయ్య శివబాబు. అది నిజమైంది. హరీశ్ స్క్రిప్టు తయారుచేసిన విధానం, అతని డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, శ్రుతీహాసన్ పాత్ర వంటివి కూడా ఈ సినిమా విజయంలో తమ వంతు పాత్ర నిర్వహించాయి.
నా జీవితమే లేదు
'గబ్బర్‌సింగ్'ను తానే సొంతంగా నిర్మిస్తానని ప్రకటించిన తర్వాత నాకివ్వడం నా అదృష్టం. పవన్‌కల్యాణ్ ఎప్పటికీ నాకు వ్యసనమే. ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆయన రెమ్యూనరేషన్ ఎంతనేది మేం మాట్లాడుకోలేదు. చరణ్ పెళ్లయ్యాక విజయోత్సవ సభ పెడదామనుకుంటున్నా. దానికి కల్యాణ్ ఒప్పుకోవాలి. త్వరలో ఆయనతో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడనేది ఆయనతో మాట్లాడాక చెబుతా. చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న నన్ను నిర్మాతని చేసింది పవన్‌కల్యాణ్. ఆయన లేకపోతే నిర్మాతగా నా జీవితమే లేదు.
భయమేస్తోంది
నేనెవరికీ బినామీని కాను. ఇప్పటికే దీనిపై వచ్చిన ప్రచారాన్ని ఖండించా. ఓవర్‌నైట్ ప్రొడ్యూసర్‌ని అయ్యేప్పటికి ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. సినిమా హిట్ కాకపోతే నిర్మాత పరిస్థితి ఘోరం. అందుకని హిట్ సినిమానే తియ్యాలి. 'తీన్‌మార్'తో హిట్ రాలేదని భయపడ్డ నేను 'గబ్బర్‌సింగ్' హిట్‌తో ఇంకా భయమేస్తోంది. రాబోయే సినిమా ఇంకెంత బాగా తియ్యాలనేదే ఆ భయం. తెరపై ఇక నటించాలని నేను అనుకోవడం లేదు. మాస్ నుంచి వచ్చినవాణ్ణి కాబట్టి మాస్ ఎంటర్‌టైనర్స్ అంటేనే ఎక్కువ ఇష్టం.
పెద్ద సినిమాలే చేస్తా
చిన్న సినిమాలు తీసే గట్స్ నాకు లేవు. అందరు అగ్ర హీరోలతోటి పెద్ద సినిమాలే చేస్తా. నేనెవరితో పనిచేసినా, అదే భక్తితో ఆ సినిమా సూపర్‌హిట్ కావాలనే లక్ష్యంతోనే పనిచేస్తా. నేను పవన్‌కల్యాణ్ భక్తుణ్ణయినా, అందరితో బాగుంటా. అందరితో సినిమాలు చేస్తా. అందరితో చెయ్యమని కల్యాణ్ కూడా చెప్పారు. ఎన్టీఆర్, శ్రీను వైట్ కాంబినేషన్ సినిమా 'బాద్‌షా' సినిమా షెడ్యూలు జూన్ 15 నుంచి ఉంటుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. కృష్ణానగర్‌లో నేనూ, పూరి జగన్నాథ్ కలిసి తిరిగాం. 'గబ్బర్‌సింగ్' హిట్‌కి తను ఎంతో ఆనందపడ్డాడు. అక్టోబర్ నుంచి ఆయన డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నా. హీరో ఎవరనేది ఆయనే చెబుతాడు.

Saturday, June 2, 2012
ఆల్బమ్ రూపోందించే పనిలో ఉన్నా
'నాకెంతో ఇష్టమైన వ్యాపకం సంగీతం. గతంలో సంగీతాన్ని అందించినప్పటికీ త్వరలో స్వయంగా ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేయబోతున్నాను. ప్రస్తుతం ఆ పనిలో ఉన్నాను' అని అంటున్నారు కమల్‌హాసన్ గారాలపట్టి శ్రుతి హాసన్. శాంసంగ్ సంస్థ రూపొందించిన శాంసంగ్ గెలాక్సీ ఎస్-3 మొబైల్ ఫోన్‌ను నగరంలో ఆవిష్కరించటానికి ప్రత్యేకంగా విచ్చేశారు ఆమె. నగరంలో ఈ మొబైల్‌ను కొనుగోలు చేసిన మొదటి 10 మందికి వాటిని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ 'గబ్బర్ సింగ్' హిట్ తరువాత తాను చేయబోయే సినిమాపై జాగ్రత్త వహిస్తున్నానని చెప్పారు.
Thursday, December 22, 2011
బిగ్ స్టోరీ: బాలీవుడ్ పొమ్మంది.. టాలీవుడ్ రమ్మంది!!
రెండు దశాబ్దాల నుంచీ తెలుగులో పరభాషా హీరోయిన్‌లే రాజ్యం చేస్తున్నారని మనకు తెలుసు. కన్నడ నటి సౌందర్యను మినహాయిస్తే మిగిలినవాళ్లలో ఎక్కువమంది బాలీవుడ్ తిరస్కారానికి గురై అక్కడి నుంచి వచ్చినవాళ్లే కావడం గమనార్హం. నిన్న మొన్నటిదాకా తెలుగు తెరపై నగ్మా, అంజలా ఝవేరీ, సిమ్రాన్, సోనాలీ బెంద్రే, ఆర్తీ అగర్వాల్, శ్రియ, రీమాసేన్, జెనీలియా ఓ వెలుగు వెలగగా ఇప్పుడు కాజల్ అగర్వాల్, తమన్నా, హన్సిక, శ్రుతిహాసన్ రాణులుగా చలామణీ అవుతున్నారు.
ఎనభైల చివర్లో బాలీవుడ్ భామల్ని నిర్మాతలు తెలుగులోకి తీసుకు రావడమనే ట్రెండ్ మొదలైంది. దాంతో పాటే హీరోయిన్‌కూ, వ్యాంప్‌కూ మధ్య ఉండే గీత చెరిగిపోయి, హీరోయిన్‌లో వ్యాంప్ మిళితమైపోయింది. వ్యాంప్ వేసే పొట్టి దుస్తులు హీరోయిన్ వొంటిమీదకు చేరాయి. హీరో సరసన ఓ 'ఆడబొమ్మ'గా రూపుదాల్చిందామె. 'కలియుగ పాండవులు' (1986)తో ఖుష్బూ, 'కిరాయి దాదా' (1987)తో అమల, 'సామ్రాట్' (1987)తో సోనం టాలీవుడ్‌కు పరిచయమై బాలీవుడ్ నుంచి హీరోయిన్ల దిగుమతి అనే ధోరణికి తెరతీశారు. అప్పట్నించీ టాలీవుడ్‌లో బాలీవుడ్ తారల ప్రవాహం మొదలైంది. 'ఖయామత్ సే ఖయామత్ తక్' సినిమాతో దేశవ్యాప్తంగా యువతరంలో గుబులురేపిన జుహీ చావ్లా 'ముగ్గురు కొడుకులు' (1988)లో నటించి, తెలుగు ప్రేక్షకుల ఆదరణని చూరగొంది. రాజీవ్ రాయ్ డైరెక్షన్‌లో వచ్చిన బాలీవుడ్ సినిమా 'విశ్వాత్మ'తో హీరోయిన్‌గా పరిచయమైనా, ప్రేక్షకుల గుర్తింపుపొందని దివ్య భారతి 'బొబ్బిలి రాజా' సినిమాతో టాలీవుడ్‌లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తమ తొలి హిందీ సినిమాల్లో పేరు తెచ్చుకోకముందే తెలుగులో ప్రీతీ జింటా 'ప్రేమంటే ఇదేరా'తో, అమీషా పటేల్ 'బద్రి'తో తెలుగులో సక్సెస్ సాధించారు. వీరిలో కొంతమంది తారలు అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ రాణించగా, కొంతమంది తారలు బాలీవుడ్‌లో ఫయిలై, తెలుగులో టాప్ స్టార్లుగా రాణిస్తూ వచ్చారు. పర్ఫార్మెన్స్ కంటే గ్లామర్, ఎక్స్‌పోజింగ్ హీరోయిన్‌కు ప్రాథమిక అర్హత కావడంతో కొత్త ధోరణికి ద్వారాలు తెరుచుకున్నాయి. దివ్యభారతి తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా నగ్మా పేరు తెచ్చుకుంది. సల్మాన్‌ఖాన్ సరసన 'బాజీ' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆమె 'పెద్దింటల్లుడు' (1991) చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి కనిపించింది. 'కిల్లర్', 'ఘరానా మొగుడు' (1992) సినిమాలతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. అప్పట్నించీ బాలీవుడ్ భామలకు తెలుగులో మరింత గిరాకీ.
మధుబాల, అంజలా ఝవేరీ, సాక్షి శివానంద్, సిమ్రాన్, రీమాసేన్, శ్రియ, ఆర్తీ అగర్వాల్ వంటివాళ్లు తెలుగు తెరకు పరిచయమై వరుస అవకాశాలు పొందుతూ వచ్చారు. హిందీలో 'తేరే మేరే సప్నే' తర్వాత సరైన అవకాశాలు రాని సిమ్రాన్ తమిళంలో సక్సెస్ సాధించి, తెలుగులో 'కలిసుందాం రా' (2000) వంటి సూపర్ హిట్ సినిమాతో తారాపథానికెగసింది.
ఇక 'ఇష్టం' వంటి ఫ్లాప్ సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించిన శ్రియ 'సంతోషం' హిట్టయ్యాక వెనుతిరిగి చూడలేదు. కానీ బాలీవుడ్‌లో స్థానం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సోనాలీ బెంద్రేకు హిందీలో 'సర్ఫరోష్' మినహా చెప్పుకోవడానికి మరో సినిమా ఏదీ లేదు. కానీ తెలుగులో తొలిసారి 'మురారి' సినిమాలో నటించాక ఆమెకు ఇక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది. ఒక్క 'పలనాటి బ్రహ్మనాయుడు' తప్పితే ఆమె నటించిన తెలుగు సినిమాలన్నీ విజయం సాధించాయి.
'చిత్రం', 'మనసంతా నువ్వే' సినిమాల్లో మంచి పాత్రలు చేసి, యువతరాన్ని ఉర్రూతలూగించిన రీమాసేన్ అనంతరం సెక్స్ సింబల్‌గా పేరు తెచ్చుకుంది. ఫర్దీన్‌ఖాన్ సరసన ఆమె చేసిన హిందీ సినిమా 'హం హో గయే ఆప్కే' డిజాస్టర్ కావడంతో బాలీవుడ్‌లో ఆమెకు చోటు లభించలేదు. హిందీలో 'పాగల్‌పన్'తో తెరంగేట్రం చేసిన ఆర్తీ అగర్వాల్‌కు మరో బాలీవుడ్ అవకాశం అందని ద్రాక్షే అయింది. కానీ తెలుగులో చేసిన తొలి సినిమా 'నువ్వు నాకు నచ్చావ్'తో ఇక్కడి యువత ఆరాధ్య తారగా మారింది. ఇప్పుడు వీళ్లంతా కళా విహీనమైతే వారి స్థానాల్లో జెనీలియా, కాజల్ అగర్వాల్, హన్సిక, తమన్నా, శ్రుతిహాసన్ వచ్చారు.
'తుఝే మేరీ కసం'తో జెనీలియా, 'క్యూన్.. హో గయా నా'తో కాజల్ అగర్వాల్, 'ఆప్ కా సురూర్'తో హన్సిక, 'చాంద్ సా రోషన్ చెహ్రా'తో తమన్నా, 'లక్'తో శ్రుతిహాసన్ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అయితే ఆ సినిమాల తర్వాత వారికి అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో దక్షిణాదివైపు చూపు సారించారు. తెలుగులో వరుస అవకాశాలతో యూత్ ఐకాన్స్‌గా మారిపోయారు. ఈ అయిదుగురిలో కాజల్, తమన్నా చక్కని అవకాశాలతో అగ్ర నాయిక రేసులో దూసుకుపోతున్నారు. జెనీలియాకు పదేళ్ల తర్వాత బాలీవుడ్ ఛాన్సులు తలుపు తడుతున్నాయి. కమలహాసన్ కూతురు శ్రుతిహాసన్‌కు ఇప్పుడిప్పుడే అగ్ర హీరోలతో పనిచేసే అవకాశాలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆమె టాప్ స్టార్‌గా అవతరించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
బాలీవుడ్ నుంచి ఇంతమంది వెల్లువగా వస్తుంటే, మన తెలుగు తారల సంగతేంటి? సహజంగానే ఈ పరభాషా తారలతో మనవాళ్లు పోటీపడలేక పోతున్నారు. ఇంకోవిధంగా చెప్పాలంటే మన హీరోలే వాళ్లకు తమ సరసన చోటు కల్పించేందుకు ముందుకు రావడం లేదు. అందువల్లే తెలుగమ్మాయిలు అర్చన, మాధవీలత, స్వాతి, బిందుమాధవి కెరీర్ 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్నట్లు ఉంది. తెలుగులో రాణిస్తున్న ఉత్తర భారతీయ అమ్మాయిలు బాలీవుడ్‌లో రాణించలేకపోతుంటే, మన తెలుగు తారలు తెలుగులోనే కాదు ఇంకెక్కడా కూడా రాణించలేక పోతున్నారు. ఇద్దరి మధ్యా కనిపిస్తున్న తేడా అదే.
Saturday, November 19, 2011
ఇంటర్‌వ్యూ: సిద్ధార్థ్
కుర్రాళ్లు కాలేజీ ఎగ్గొట్టి 'ఓ మై ఫ్రెండ్' చూస్తున్నారు
"యువతకి ఈ సినిమా బాగా ఎక్కేసింది. కాలేజీకి ఎగ్గొట్టి మరీ చూస్తున్నారు'' అని చెప్పారు సిద్ధార్థ్. ఆయన హీరోగా వేణుశ్రీరామ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు, శిరీశ్, లక్ష్మణ్ నిర్మించిన 'ఓ మై ఫ్రెండ్' ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
'బొమ్మరిల్లు'లాంటి సినిమా తర్వాత దిల్‌రాజు బేనర్‌లో నేను చేసిన సినిమా కాబట్టి కచ్చితంగా అంచనాలుంటాయి. డైరెక్టర్ వేణు నా కోసం రెండేళ్లు ఎదురుచూశాడు. అంతకాలం ఎదురు చూడాలంటే గట్స్ ఉంటాలి. ప్రధాన పాత్రకు నేనే కావాలని నా మీద నమ్మకం పెట్టాడు. రాజు కూడా నాతోనే దీన్ని తీయాలనుకున్నాడు. ఇది ఒక హీరో సినిమా కాదు. నాలుగు కేరక్టర్ల సినిమా. నిజమైన స్నేహం, నిజమైన ప్రేమ గురించి దీనిలో చెప్పాం. దాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
ఫ్యామిలీల్లోకి వెళ్లాలి
యువతకి ఈ సినిమా బాగా ఎక్కేసింది. కాలేజీకి ఎగ్గొట్టి మరీ చూస్తున్నారు. హైదరాబాద్‌లో ఐదు థియేటర్లకు వెళ్లి చూశాం. ఎక్కువగా కనిపించింది కాలేజీ కుర్రాళ్లే. ఇక ఈ సినిమా వెళ్లాల్సింది ఫ్యామిలీల్లోకి. అది కూడా జరుగుతుంది. ప్రస్తుతం వాళ్లు కూడా థియేటర్లలో కనిపిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ రెవెన్యూపరంగా సంతోషంగా ఉన్నారు.
20 నిమిషాలే బలం
కొత్తగా ఈ సినిమాలో ఏముంది అనేవాళ్లకి నా సమాధానం ఒక్కటే. ప్రపంచంలో ఏడు కథలే ఉన్నాయంటారు. ఎవరు చెప్పినా వాటిలోంచి తిప్పితిప్పి చెప్పాల్సిందే. ఈ సినిమాకి సంబంధించి చివరి 20 నిమిషాలే బలం. అలాంటి క్లైమాక్స్‌ని ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ తియ్యలేదు. వేణు ఓ సున్నితమైన పాయింట్ బాగా డీల్ చేయగలిగాడు. స్నేహితులుగా ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి చివరివరకు తమ అనుబంధాన్ని అలాగే కొనసాగించలేరా... అనే పాయింట్‌ని గొప్పగా చెప్పారు. ఇప్పటివరకు తెరమీద ప్రకాశ్‌రాజ్, నేను తండ్రీకొడుకులుగా బాగా సరిపోయాం. ఈ సినిమాలో నా తండ్రిగా తనికెళ్ల భరణి బ్రహ్మండంగా చేశారు. క్లైమాక్స్‌లో ఆయన సంభాషణలు చెప్పిన విధంగానీ, ఆయన హావభావాలు కానీ అత్యుత్తమం.
లక్కీ గర్ల్ హన్సిక
నేను, నవదీప్, శ్రుతిహాసన్ మొదటే ఫైనలైజ్ అయినా హన్సిక ఆ పాత్రకి చివరగా ఎంపికైంది. ఆమెకి ఈ ఏడాది తెలుగులో 'కందిరీగ', తమిళంలో 'వేలాయుధం' వంటి హిట్స్ వచ్చాయి. ఆమె ఈ సినిమాకి లక్కీ అవుతుందనుకున్నా. అలాగే అయ్యింది. శ్రుతి, నవదీప్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
నాలుగు భాషా చిత్రాలు
2012 నాకు మరపురాని సంవత్సరం కాబోతోంది. నాలుగు భాషలు - తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్‌లో నా సినిమాలు రాబోతున్నాయి. హిందీలో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో చేస్తున్న 'చష్మే బద్దూర్', ఇంగ్లీష్‌లో దీపా మెహతా డైరెక్షన్‌లో చేస్తున్న 'విండ్స్ ఆఫ్ చేంజ్' వచ్చే ఏడాది రాబోతున్నాయి. దీపాతో పనిచేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ఆమె పర్‌ఫెక్షనిస్ట్. బుకర్ ఆఫ్ బుకర్స్‌గా ప్రశంసలు పొందిన సల్మాన్ రష్డీ నవల 'మిడ్‌నైట్ చ్రిల్డన్' ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో నిడివి పరంగా పెద్దది కాకపోయినా కథకి కీలకమైన పాత్ర చేస్తున్నా.

Monday, November 14, 2011
ఇక్కడ పవన్, అక్కడ శింబు!
ఒకే హిందీ సినిమా రెండు భాషల్లో ఒకేసారి రీమేక్ అవుతున్న సన్నివేశం ఇది. గతంలో ఎన్టీఆర్, ఏఏన్నార్‌ల కాలంలో హిందీ సినిమాలు ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయ్యేవి. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ చేస్తుంటే, తమిళంలో శివాజీ గణేశన్ లేదా జెమినీ గణేశన్ ఆ సినిమాలు చేసేవాళ్లు. ఇప్పుడు హిందీలో సల్మాన్‌ఖాన్ సూపర్ హిట్ సినిమా 'దబాంగ్' ఒకేసారి ఇటు తెలుగు, అటు తమిళంలో రీమేక్ అవుతోంది. తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా చేస్తుంటే, తమిళంలో శింబు చేస్తున్నాడు. కాకపోతే తెలుగుకంటే తమళ సినిమా చాలా ముందుగా వచ్చేస్తోంది. అవును. శింబు, రిచా గంగోపాధ్యాయ్ జంటగా నటిస్తున్న ఆ సినిమా 'ఓస్తి' ఈ నవంబర్‌లోనే రిలీజవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్స్ బయటకు వచ్చేశాయి. 'దబాంగ్'లో మలైకా అరోరాఖాన్ చేసిన ఐటం సాంగ్‌ని ఇందులో మల్లికా షెరావత్ చేయడం విశేషం. ధరణి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పట్ల తమిళ సినీ, ట్రేడ్ వర్గాలు అమితాసక్తి కనపరుస్తున్నాయి. తమిళంతో పోలిస్తే తెలుగు 'గబ్బర్‌సింగ్' షూటింగ్ నెమ్మదిగా నడుస్తోంది. దీని ఫస్ట్‌లుక్ చాలా కాలం క్రితమే వచ్చినా పవన్ కల్యాణ్ 'పంజా' ప్రాజెక్టుతో బిజీ కావడం 'గబ్బర్‌సింగ్'ని ఆలస్యం చేస్తోంది. ఇందులో పవన్ సరసన నాయికగా శ్రుతిహాసన్ నటిస్తుండగా 'మిరపకాయ్' ఫేం హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా 2012లో విడుదల కానున్నది. ఈ సినిమాలు ఆడే తీరుని బట్టి తెలుగు, తమిళుల క్రియేటివిటీ ఏమిటో తేలనున్నది.
Wednesday, November 9, 2011
'ఓ మై ఫ్రెండ్' మరో 'వసంతం'?
సిద్ధార్థ్, శ్రుతిహాసన్ సినిమా 'ఓ మై ఫ్రెండ్' కథ గురించి ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఆసక్తికరమైన కథనాలు వెలువడుతున్నాయి. వేణు శ్రీరాంను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కాగా ఈ సినిమా ఇదివరకు చిరంజీవి హీరోగా వచ్చిన 'ఇద్దరు మిత్రులు', వెంకటేశ్ హీరోగా వచ్చిన 'వసంతం' సినిమాల తరహాలో ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 'ఇద్దరు మిత్రులు'లో చిరంజీవి, సాక్షి శివానంద్ మిత్రులుగా నటిస్తే, చిరంజీవి సరసన నాయికగా రమ్యకృష్ణ నటించింది. సాక్షికి జోడీగా సురేశ్ కనిపించాడు. అలాగే 'వసంతం' చిత్రంలో వెంకటేశ్, కల్యాణి స్నేహితులుగా నటిస్తే, వెంకటేశ్ సరసన ఆర్తీ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. కల్యాణికి జోడీగా ఆకాశ్ కనిపించాడు. ఇప్పుడు 'ఓ మై ఫ్రెండ్' సినిమాలో సిద్ధార్థ్, శ్రుతి జంటగా గాక, స్నేహితులుగా నటించారని గట్టిగా వినిపిస్తోంది. అంటే సిద్ధార్థ్‌కి జోడీగా హన్సిక, శ్రుతికి జోడీగా నవదీప్ కనిపించనున్నారనేది ప్రచార సారాంశం. ఇదే నిజమైతే ఇప్పటికే 'ఇద్దరు మిత్రులు', 'వసంతం' సినిమాల్ని చూసిన జనం 'ఓ మై ఫ్రెండ్'ని బాగా రిసీవ్ చేసుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా 'ఇద్దరు మిత్రులు' సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు కూడా. ఏదేమైనా కొద్ది రోజుల్లోనే 'ఓ మై ఫ్రెండ్' కథ గురించి జరుగుతున్న ప్రచారం నిజమో, కాదో తేలిపోనున్నది.
Friday, November 4, 2011
రివ్యూ: సెవెన్త్ సెన్స్
ఒక కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే అంతకుముందు ఆ కాంబినేషన్‌లో వచ్చిన గొప్ప సినిమాతో పోలిక తేవటం చాలా సహజం. అదే పని ఇప్పుడు 'సెవెన్త్ సెన్స్' విషయంలో జరుగుతోంది. సూర్య, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన మునుపటి సినిమా 'గజిని'తో 'సెవెన్త్ సెన్స్'ని పోల్చి గట్టిగా పెదవి విరుస్తున్నారు ఇటు ప్రేక్షకులూ, అటు విమర్శకులూ. ఓ ప్రేమకథకి ప్రతీకారం అనే అంశాన్ని జోడించి అప్పటివరకు భారతీయ తెరపై రానివిధంగా మురుగదాస్ ప్రెజేంట్ చేసిన 'గజిని' సినిమా ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసింది. అందులో సూర్య, అసిన్ ప్రదర్శించిన అభినయాలు మన కళ్ల ముందు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అదే సూర్య ఇప్పుడు 'సెవెన్త్ సెన్స్'లోనూ చాలా బాగా నటించాడు. కానీ ఆ నటనకి ప్రయోజనం అంతగా లేకుండా పోయింది. కారణం మురుగదాస్ ఫ్లాట్ అండ్ బోరింగ్ స్క్రిప్ట్. 'గజిని' హిట్టవటంలో ఎంటర్‌టైన్‌మెంట్ పాత్ర ఎంతో ఉంది. 'సెవెన్త్ సెన్స్'లో లోపించింది అదే.
క్రీ.శ. 6వ శతాబ్దం నాటి సన్నివేశాల్ని ప్రశంసనీయంగా చిత్రించిన మురుగదాస్ వర్తమాన కాలానికి వచ్చేసరికి స్క్రిప్టుపై పట్టు కోల్పోయాడు. యుద్ధ కళల్లోనే కాక ప్రకృతి వైద్యంలోనూ అసామాన్యుడైన బోధిధర్ముడు (సూర్య) చీనా దేశంవెళ్లి అక్కడ విపత్తులో ఉన్న ఓ గ్రామ ప్రజల్ని ఓ ప్రాణాంతక అంటువ్యాధి నుంచి రక్షించడమే గాక, వారికి ఆత్మరక్షణ కోసం యుద్ధ కళల్నీ నేర్పుతాడు. వారికి దేవుడిగా మారతాడు. కొన్నేళ్ల తర్వాత భారతదేశానికి తిరిగి రావాలని అతడనుకుంటే, అక్కడి పెద్దలు మరో రకంగా తలుస్తారు. అతడి దేహం అక్కడే ఉంటే ఎలాంటి వ్యాధులూ వారి దరిచేరవని భావించిన వాళ్లు అతడికి ఆహారంలో విషమిస్తారు. అది తెలిసి కూడా వాళ్ల కోరిక మన్నించి, ఆ ఆహారాన్ని భుజించి తనువు చాలిస్తాడు బోధిధర్ముడు. అప్పటివరకు ఆ సన్నివేశాల్ని చక్కగా తీసి, మనల్ని ఆ కాలానికి తీసుకుపోయాడు దర్శకుడు. ఆ తర్వాత కథ వర్తమానానికి వస్తుంది. ప్రఖ్యాతి చెందిన బాంబే సర్కస్‌లో అరవింద్ (సూర్య) ఓ కళాకారుడు. అతడిని వెతుక్కుంటూ శుభా శ్రీనివాస్ (శ్రుతిహాసన్) అనే ఓ జెనటిక్ స్టూడెంట్ అక్కడికి వచ్చి, అరవింద్‌తో పరిచయం పెంచుకుంటుంది. అరవింద్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆమె తనవద్దకు వచ్చింది తనమీద పరిశోధనలు చేయడానికి అని తెలిసి కుమిలిపోతాడు. శుభ అతడికి తన పరిశోధనలోని ప్రయోజనాన్ని అతడికి తెలియజేస్తుంది. 6వ శతాబ్దం నాటి బోధిధర్ముడి డీఎన్ఏని దానితో సరిపోలే అతడి వంశానికే చెందిన వ్యక్తి డీఎన్ఏతో కలిపితే మరో బోధిధర్ముడు తయారవుతాడనీ, అంతుచిక్కని ఎన్నో వ్యాధుల్ని అప్పుడు నయం చేసి, ఆరోగ్యవంతమైన భారతావనిని సృష్టించవచ్చనీ చెబుతుంది. అతడి డీఎన్ఏ బోధిదర్ముడి డీఎన్ఏతో మ్యాచ్ అవుతునందనే సంగతీ చెబుతుంది. మరోవైపు చైనా ప్రభుత్వం ఇండియా మీద 'ఆపరేషన్ రెడ్' అనే ప్రయోగాన్ని చేసేందుకు డాంగ్‌లీ అనే మార్షల్ ఆర్ట్స్ నిపుణుణ్ణి నియమిస్తుంది. 6వ శతాబ్దంలో బోధిధర్ముడు ఏ ప్రాణాంతక వ్యాధిని నయంచేశాడో, ఆ వ్యాధి వైరస్‌తో భారతదేశాన్ని ఛిన్నాభిన్నంచేసి, దాని మందుని తామే భారతదేశానికి అందజేసి, తద్వారా ఈ దేశాన్ని లొంగదీసుకోవాలనేది దాని ప్లాన్. అందుకు శుభ చేసే పరిశోధన వారికి అడ్డుగా నిలుస్తుంది. ఆమె వల్ల బోధిధర్ముడి శక్తిసామర్థ్యాలు మళ్లీ వస్తే తమ కష్టమంతా వేస్టవుతుందని ఆమెనీ, అరవింద్‌నీ కూడా చంపమని డాంగ్‌లీని ఆదేశిస్తుంది చైనా ప్రభుత్వం. ఇండియాలోని ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి ఓ వీధికుక్కలో ప్రాణాంతక వైరస్‌ని ప్రవేశపెడతాడు డాంగ్‌లీ. శుభని వెంటాడతాడు. ఎన్నో హత్యలు చేస్తాడు. బోధిధర్ముడు ఒకప్పుడు మంచి కోసం వినియోగించిన వశీకరణ విద్యని చెడుకోసం ఉపయోగిస్తాడు. చిత్రంగా అతడు ఎంతమందిని చంపినా మీడియాకి గానీ, ప్రభుత్వానికి గానీ అదేమీ పట్టనట్లే కనిపిస్తుంది సినిమాలో. సినిమాలో ఇది కొట్టొచ్చినట్లు కనిపించే లోపం. ఇవాళ ఎక్కడ ఎంత చిన్న సంఘటన జరిగినా మీడియాలో అది ఎంత త్వరగా వచ్చేస్తుందో తెలిసిందే. అట్లాంటిది డాంగ్‌లీ విచక్షణా రహితంగా వరుసపెట్టి పదుల సంఖ్యలో మనుషుల్నీ, పోలీసుల్నీ చంపుకు పోతుంటే మనకి ఓ మీడియా ఉన్నట్లు కానీ, ఓ రాజకీయ వ్యవస్థ ఉన్నట్లు కానీ, ఆ వ్యవస్థలు ఈ హత్యలపై గగ్గోలు పెడుతున్నట్లు కానీ ఎక్కడా ఈ సినిమాలో కనిపించదు.
ఈ సంగతలా ఉంచితే డాంగ్‌లీ ప్రవేశపెట్టిన వైరస్ ద్వారా వ్యాప్తి చెందిన భయంకరమైన వ్యాధిని అదుపుచేసి, డాంగ్‌లీని అంతం చేయడానికి అరవింద్‌కి బోధిధర్ముడి డీఎన్ఏని కలపడానికి శుభ చేసే ప్రయత్నం ఫలించిందా? డాంగ్‌లీ ఆ ప్రయోగాన్ని అడ్డుకోలేదా? అనేది క్లైమాక్స్.
'గజిని' కంటే 'సెవెన్త్ సెన్స్' నాలుగురెట్లు బెటర్‌గా ఉంటుందని స్వయంగా సినిమా విడుదలకు ముందు మురుగదాస్ ఊదరగొట్టడంతో ఈ సినిమాపై అంచనాలు అసాధారణమై పోయాయి. అందుకు తగ్గట్లు సినిమా ఉంటే ఫర్వాలేదు. కానీ అలా లేకపోవడమే ఈ సినిమా కొంపముంచింది. సినిమాలో వినోదం పాలు దాదాపు మృగ్యం కావడంతో సగటు ప్రేక్షకుడు ఈ సినిమాని ఎంజాయ్ చేయడం కష్టం. సర్కస్ కంపెనీలో అరవింద్ మిత్రుడైన మరగుజ్జు నటుడి పాత్ర మరీ చిన్నదైపోవడం, సెకండాఫ్‌లో అతడి పాత్రని ఉన్నట్లుండి విరమించడం సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ని దెబ్బతీసింది.
సినిమా మొత్తంలో ఆకట్టుకునేది తొలి 15 నిమిషాలు, చివరి 40 నిమిషాల ఆట మాత్రమే. మిగతా సినిమా అంతా బోరింగే అని చెప్పాలి. స్వతహాగా హారిస్ జయరాజ్ మ్యూజిక్ బాగుంటుందనే నమ్మకాన్ని ఈ సినిమాలోని పాటలు పోగొట్టాయి. ఏ ఒక్క పాటా ఆకట్టుకునే రీతిలో లేదు. మరీ ముఖ్యంగా శుభ తనని ప్రేమించడంలేదనీ, ఆమె పరిశోధన కోసం తనని పావులా వాడుకున్నదనీ తెలిశాక అరవింద్ పాడే విషాదపు పాట చికాకు కలిగిస్తుంది. ఆ పాటని తీసేస్తే ప్రేక్షకుల పరిస్థితి కొంత మెరుగవుతుంది. నేపథ్య సంగీతం మాత్రం బాగీ చేశాడు హారిస్. ఇప్పటికే బ్రూస్‌లీ, జాకీ చాన్, జెట్‌లీ, టొనీ జా వంటి సుప్రసిద్ధ మార్షల్ ఆర్ట్స్ నటులు చేసిన మెరుపు వేగపు మార్షల్ ఆర్ట్స్ ఫైట్లు చూసిన మనకు ఇందులో పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్లు ఏమంత గొప్పగా అనిపించలేదు. కుంగ్‌ఫు ఫైట్లు చేయడానికి సూర్య ఎంతో కష్టపడ్డట్లు తెలుస్తున్నది కానీ అవి అంతగా అకట్టుకోలేదు. ఇక డాంగ్‌లీ పాత్రలో హాంగ్‌కాంగ్ ఫైట్‌మాస్టర్ జానీ ట్రీ గుయెన్ బాగున్నాడు కానీ అతని మేనరిజమ్స్ 'టెర్మినేటర్'లోని విలన్ పాత్రని గుర్తుకు తెచ్చింది. బోధిధర్మునిగా, అరవింద్‌గా సూర్య తనదైన శైలిలో చక్కగా పోషించాడు. అతని హావభావాలు అతనెంతటి ప్రతిభావంతుడైన నటుడో చెబుతాయి. శుభ పాత్రలో శ్రుతిహాసన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సూర్య, శ్రుతి మధ్య రొమాంటిక్ యాంగిల్ ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో చెప్పుకోదగ్గది రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ. ఆద్యంతం తన కెమెరా పనితనాన్ని అతను ప్రదర్శించాడు. మన ప్రాచీన అంశాల్లో ఎంతో సైన్స్ ఉన్నదనీ, వాటిని సైన్స్‌గా బోధించకపోవడం వల్ల వాటిని కేవలం మూఢనమ్మకాలుగా భావించే పరిస్థితి ఉన్నదనీ, ఇది పోవాలనీ ఈ సినిమా ద్వారా చెప్పే యత్నం చేశాడు

Thursday, October 27, 2011
న్యూస్: 'ఓ మై ఫ్రెండ్' మీదే సిద్ధు ఆశలు!
2006లో వచ్చిన 'బొమ్మరిల్లు' తర్వాత సిద్ధార్థ్‌కి చెప్పుకోదగ్గ సినిమా ఏది? ఏదీ లేదు. ఈ మధ్య కాలంలో అతను చేసిన సినిమాలు - 'ఆట' (యావరేజ్), 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' (యావరేజ్), 'ఓయ్' (డిజాస్టర్), 'బావ' (డిజాస్టర్), 'అనగనగా ఓ ధీరుడు' (ఫ్లాప్), '180' (యావరేజ్). ఇదీ అతడి ప్రస్థానం. తెలుగు హీరో అనిపించుకోడానికి ఏడేళ్లు పట్టిందని ఈమధ్య ఇంటర్వ్యూల్లో అతడు చెప్పాడు కానీ మన వాళ్లెవరూ అలా ఫీలవుతున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగులో కోల్పోయిన ఇమేజ్‌ని తిరిగి తెప్పించుకోడానికి అతను కష్టపడుతున్నాడు. దిల్ రాజు రూపంలో అతగాడికి ఓ మంచి ఫ్రెండ్ దొరకడం అతడు చేసుకున్న భాగ్యం. అందుకే 'ఓ మై ఫ్రెండ్' సినిమాని సిద్ధార్థ్‌తో తీస్తున్నాడు రాజు. వేణు శ్రీరాం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ 'క్లోజ్ ఫ్రెండ్' శ్రుతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటించారు. నవదీప్ మరో కీలక పాత్ర చేశాడు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ రాజ్ మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమా ఆడియో అక్టోబర్ 15న రిలీజైంది. పాటలు బాగానే ఉన్నాయని సంగీత ప్రియులు చెబుతున్నారు. ఈ సినిమాతో మరోసారి 'బొమ్మరిల్లు' మేజిక్‌ని రిపీట్ చేస్తానని నమ్ముతున్నాడు సిద్ధు. నిజానికి అది అతడికి చాలా అవసరం కూడా. ఎందుకంటే 'ఓ మై ఫ్రెండ్' కూడా ఆడకపోతే తెలుగులో అతడి కెరీర్ నిజంగా కష్టాల్లో చిక్కుకున్నట్లే. నవంబర్లోనే ఈ సినిమా రిలీజవుతున్నందున అతడి భవిష్యత్ ఏమిటో అప్పుడు తేలనున్నది.
Saturday, September 24, 2011
న్యూస్: సంచలనాలకి సిద్ధం 'సెవెన్త్ సెన్స్'!
సూర్య, మురుగదాస్ కాంబినేషన్‌లో మరో సినిమా అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? అసాధారణంగా! ఇప్పుడు ''సెవెన్త్ సెన్స్' విషయంలో అలాంటి అంచనాలే నెలకొన్నాయి. ఇదివరకు ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'గజిని' సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. మొదట తమిళంలో, తర్వాత తెలుగులో ఘన విజయం సాధించిన ఆ సినిమా ఆ తర్వాత అమీర్‌ఖాన్ హీరోగా హిందీలో రీమెక్ అయ్యి బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. ఇప్పుడు సూర్య, మురుగదాస్ కలిసి 'సెవెన్త్ సెన్స్'ని సృష్టించారు. తమిళంలో ఈ సినిమా పేరు '7ఆం అరివు'. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సూర్య మూడు భిన్న గెటప్పుల్లో కనిపించనున్నాడు. తెలుగు వెర్షన్‌కి 'చూడని అవతారం' అనే ట్యాగ్‌లైన్‌ని ఉపయోగిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాని లక్ష్మీగణపతి ఫిలింస్ సంస్థ అధినేత బి. సుబ్రమణ్యం అందిస్తున్నాడు. సూర్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ అంటే సుమారు 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణమవుతోంది.
"ఎనిమిది నెలలు రిసెర్చ్ చేసి ఈ చిత్రకథ తయారుచేశాను. 'గజని' కంటే నాలుగైదు రెట్లు బాగుంటుంది. సినిమాలో ప్రారంభంలో వచ్చే పది నిముషాల కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం" అని మురుగదాస్ తెలిపాడు. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి స్క్రిప్ట్‌తో ఇంతవరకు సినిమా రాలేదనీ, 'గజిని' తర్వాత అంతకంటే బెటర్ స్క్రిప్ట్ కోసం మురుగదాస్ శ్రమించి 'సెవెన్త్ సెన్స్'ని తయారుచేశాడనీ సూర్య చెప్పాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం.. 'గజిని'కి మ్యూజిక్ అందించిన హారిస్ జయరాజ్ ఈ సినిమాకీ సంగీత బాణీలు సమకూర్చాడు. అటు తమిళ్, ఇటు తెలుగులో సినిమాని దీపావళికి రిలీజ్ చేయాలని సంకల్పించారు.
జానీ ట్రి గుయేన్, అభినయ, అవినాశ్, గిన్నిస్ పక్రు, అశ్విన్ కాకుమాను, ధన్య బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా గొప్పగా వుంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ సినిమా ఓపెనింగ్స్ దక్షిణాదిలో 'రోబో' ఓపెనింగ్స్‌ని మించి ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఆ సినిమా బాక్సాఫీసు రికార్డుల్ని అధిగమించే అవకాశం ఈ సినిమాకి ఉటాయని చాలామంది నమ్ముతున్నారు.

Sunday, September 4, 2011
ప్రివ్యూ: గబ్బర్‌సింగ్
పవన్ కల్యాణ్ హీరోగా 'గబ్బర్‌సింగ్' అనే టైటిల్‌తో సినిమా అంటేనే అదో ఇంటరెస్ట్ క్రియేట్ అవుతోంది. పవన్ వంటి స్టైలిష్ యాక్టర్‌కి 'గబ్బర్‌సింగ్" అనే ఫుల్ మాస్ టైటిల్ ఎలా యాప్ట్ అవుతుందనేది చాలామందికి పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఇప్పటికే బాలీవుడ్‌లో కండల వీరుడు సల్మాన్‌ఖాన్ నటించగా సూపర్‌హిట్టయిన 'దబాంగ్'కి రీమేక్. మొదట 'షాక్' తిని, తర్వాత 'మిరపకాయ్'తో తేరుకున్న హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌పై బండ్ల గణేశ్ నిర్మిస్తున్నాడు. "సల్మాన్ బాడీలాంగ్వేజ్‌కు అనుగుణంగా తెరకెక్కిన 'దబాంగ్' హిందీలో ఎంత సూపర్‌హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్‌కు తగ్గట్టు, ఆయన మేనరిజానికి తగ్గట్టుగా చాలా మార్పులు చేసి పూర్తి స్థాయి మాస్ క్యారక్టర్‌తో ఫుల్ మీల్స్‌గా సిద్ధం చేస్తున్నాం. 'గబ్బర్ సింగ్' పవన్ అభిమానులు ఆశించే విధంగా ఉంటుంది. అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఫైట్స్ ఇంతకుముందెన్నడూ రాని విధంగా కొత్త కోణంలో ఉంటాయి'' అని చెప్పాడు హరీశ్.
పొల్లాచ్చి, మహాబలేశ్వర్, పంచ్‌గని, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'జల్సా' వంటి సూపర్ మ్యూజికల్ హిట్ తర్వాత పవన్‌కల్యాణ్‌తో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పనిచేస్తున్న సినిమా ఇది. పవన్ సరసన శ్రుతిహాసన్ నాయిక.
కోట శ్రీనివాసరావు, అజయ్, అభిమన్యు సింగ్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, అలీ, మాస్టర్ సాయినాగన్, నాగినీడు, సత్యం రాజేష్, రావు రమేష్, మాస్టర్ ఆకాష్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, వేగేశ్న సతీష్, సినిమాటోగ్రఫీ: జయనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కళ: బ్రహ్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్.

Subscribe to:
Posts (Atom)