Showing posts with label parvathi melton. Show all posts
Showing posts with label parvathi melton. Show all posts
Monday, June 25, 2012
స్విట్జర్లాండ్‌లో 'శ్రీమన్నారాయణ'
నందమూరి బాలకృష్ణ హీరోగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ సంస్థ రవికుమార్ చావలి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'శ్రీమన్నారాయణ' చిత్రం షూటింగ్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది.
షూటింగ్ వివరాలను నిర్మాత రమేష్ పుప్పాల వెల్లడిస్తూ 'ఈ నెల 18న ప్రారంభమైన షూటింగ్ 28 వరకూ జరుగుతుంది. మలేషియాలో ఒక పాట, ఫైట్ తీశాం. ఇవి రెండూ బాగా వచ్చాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్, ఇటలీలో రెండు పాటలను చిత్రీకరిస్తున్నాం, దీంతో చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. జూలైలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి, ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. బాలకృష్ణగారితో 'శ్రీమన్నారాయణ' వంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు, అభిమానులు బాలయ్యబాబు నుంచి ఆశించే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి' అన్నారు.
పార్వతీమెల్టన్, ఇషాచావ్లా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయకుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణభగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, ఫొటోగ్రఫీ: సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాత: పుప్పాల రమేష్, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.
Saturday, January 28, 2012
ప్రివ్యూ: యమహో యమః
యమధర్మరాజుగా శ్రీహరి తొలిసారిగా నటిస్తున్న చిత్రం 'యమహో యమః'. సాయిరాం శంకర్, పార్వతీ మెల్టన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. జి.వి.కె. ఆర్ట్స్ బేనర్‌పై జి. విజయ్‌కుమార్ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జితేందర్ వై. దర్శకుడు.
"తొలిసారి యముడిగా బరువైన పాత్ర చేస్తున్నా. ఇది అసాధారణ స్క్రిప్ట్. బాగా నవ్వించే సినిమా. ఇదివరకు మహామహులు పోషించిన ఈ పాత్రని బాగా చేసి, నన్ను నేను నిరూపించుకోవడానికి కృషిచేస్తున్నా" అని శ్రీహరి చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ విశేషం దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ గెస్ట్ కేరక్టర్ చేయడం.
హీరో సాయిరాం మాట్లాడుతూ "యమునిగా శ్రీహరి చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుకు మార్కెట్‌లో మంచి క్రేజ్ వచ్చింది. అమెరికా వెళ్లిన ఓ కుర్రాడికీ, అక్కడకు వచ్చిన యమునికీ మధ్య జరిగే కథ ఇది" అని చెప్పాడు. ఈ సినిమాతో తనకు కచ్చితంగా బ్రేక్ వస్తుందని అతను ఆశిస్తున్నాడు. పార్వతీ మెల్టన్ అమెరికాలో ఉండే తెలుగమ్మాయి పాత్రని చేస్తోంది. "ఇంతవరకు మన ప్రాంతంలోనే అలరిస్తూ వచ్చిన యముడు అమెరికాలో అడుగుపెడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో అల్లిన కథ ఇది" అని దర్శకుడు జితేందర్ తెలిపాడు.
ఈ సినిమాతో మహతిగా పేరు మార్చుకున్న బొంబాయ్ భోలే సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో అలీ, భరత్, కోవై సరళ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల, చిర్రావూరి, సినిమాటోగ్రఫీ: భరణి కె. ధరన్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, ఫైట్స్: రాం-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జితేందర్ వై.
Friday, September 16, 2011
న్యూస్: హీరోయిన్లకు 'మా' నోటీసులు
ఇప్పటివరకు తమ సంఘంలో సభ్యత్వం తీసుకోని కొంతమంది హీరోయిన్లకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నోటీసులు జారీ చేసింది. ముంబైతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి చోట్ల నుంచి పలువురు తారలు తెలుగు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో కొంతమంది 'మా'లో సభ్యత్వం తీసుకోకుండానే నటిస్తూ వస్తున్నారు. వీరివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మాతలు వారిపై 'మా'కు ఫిర్యాదు చేసినా, వారు తమ సభ్యులు కాకపోవడంతో 'మా' ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినా వారు సభ్యత్వం తీసుకోకపోవడంతోనే సుమారు 14 మంది హీరోయిన్లకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వారిలో చాలాకాలం నుంచే తెలుగు సినిమాల్లో నటిస్తున్న త్రిష, జెనీలియా, తమన్నాతో పాటు ఇటీవలి కాలంలో క్రేజ్ పొందిన సమంత, నిత్యమీనన్, పార్వతీ మెల్టన్ వంటి తారలు ఉన్నారు. సెప్టెంబర్ 30లోగా వీరు సభ్యత్వం తీసుకోకపోతే అక్టోబర్ 1 నుంచి వారికి సహకరించకూడదని 'మా' నిర్ణయించింది.
Wednesday, August 10, 2011
న్యూస్: యముడైనా గట్టెక్కిస్తాడా?
కెరీర్‌లో ఒక్క హిట్టూలేని హీరో సాయిరాం శంకర్. టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడైన సాయిరాం '143' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. జగన్నాథ్ స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీసుని గెలవలేకపోయింది. ఆ తర్వాత సాయిరాం 'హలో ప్రేమిస్తారా', 'వాడే కావాలి', 'డేంజర్', 'బంపర్ ఆఫర్' సినిమాల్లో హీరోగా నటించాడు. వీటిలో 'బంపర్ ఆఫర్' హిట్టవుతున్నట్లే కనిపించి, ఫ్లాప్‌గా తేలింది. 'డేంజర్'కి కృష్ణవంశీ డైరెక్టర్ అయినా ప్రయోజనం లేకపోయింది. వీటితో పాటు రవితేజ సినిమా 'నేనింతే'లో హీరో అభిమానిగా సాయి నటించాడు. ఇవేవీ అతని కెరీర్‌కు దోహదం చేయలేదు. కాగా అతను హీరోగా మరో సినిమా తెరకెక్కుతోంది. దాని పేరు 'యమహో యమహ'. 'ఇన్ అమెరికా' అనేది ట్యాగ్‌లైన్. ఇది సోషియో ఫాంటసీ కావడం గమనార్హం. ఇందులో యమధర్మరాజు పాత్రని శ్రీహరి చేస్తుండటం విశేషం. ఆయన ఆ పాత్రని పోషించడం ఇదే ప్రథమం. ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర అంశం సాయి సరసన పార్వతీ మెల్టన్ నటిస్తుండటం. పవన్ కల్యాణ్ సినిమా 'జల్సా' తర్వాత ఆమె మళ్లీ తెలుగు సినిమాలో నటించడం ఇదే. 'వేడుక' ఫేం జితేందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 20 నుంచి అమెరికాలో జరగనున్నది. యమధర్మరాజు ఉంటే ఆ సినిమా హిట్టే అనే సెంటిమెంట్‌ని సినీ జనం గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి ఈ సినిమా అయినా విజయం సాధించి సాయి కెరీర్‌కి ప్రయోజనం చేకూరుస్తుందేమో చూడాలి.
Wednesday, August 25, 2010
Wednesday, August 18, 2010
Subscribe to:
Posts (Atom)














