మిగతా దర్శకులంతా సేఫ్ జోన్‌లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీస్తూ ఎక్కువమంది ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి తాపత్రపడుతుంటే అతను మాత్రం తనకు నచ్చిన మార్గంలో జీవిత వాస్తవికతని ప్రతిబింబించే సినిమాలు తీస్తూ ముందుకు నడుస్తున్నాడు. కేవలం మూడే మూడు సినిమాలతో టాలీవుడ్‌లోనే కాక, మొత్తం భారతీయ చిత్రసీమలోనే అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల జాబితాలో చేరిపోయాడు. అతను జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అంటే ఏమితో 'గమ్యం', 'వేదం' సినిమాలతో చూపించిన అతను 'వేదం' తమిళ రీమేక్ 'వానం'తో తమిళ ప్రేక్షకుల్నీ ఆకట్టుకున్నాడు. ఆ సినిమా చూస్తున్న తమిళ ప్రేక్షకులు థియేటర్లలో లేచి నిల్చుని చప్పట్లు కొడుతూ తమ అభిమానాన్ని ప్రదర్శించకుండా ఉండలేకపోయారంటే అతని దర్శకత్వ ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవాల్సిందే. ఈ సినిమాలో అతను హీరోలనీ చూపలేదు, విలన్లనీ చూపలేదు. తప్పుడు మార్గంలో పోయే మనిషి కొన్ని సంఘటనలతో ఎలా మంచివాడిగా మారతాడో ఎంతో కన్విన్సింగ్‌గా అందులో చూపించాడు క్రిష్. ఈ సినిమాని హిందీలో తీసి, మరింతమందికి చేరువయ్యే అవకాశమున్నా అలా వచ్చిన ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడు. కానీ ఈ సినిమా తమిళ హక్కులు కొన్న హీరో శింబు హిందీ సినిమానీ డైరెక్ట్ చేయాల్సిందిగా అతన్ని కోరుతున్నాడు.
తెలుగుకంటే తమిళ ప్రేక్షకుల్నే ఎక్కువగా 'వేదం' ఆకట్టుంది. ఆ ఇద్దరి మధ్య పోలికల్ని తెలియజేస్తూ "ఓ సీన్‌లో ముసలాయన సొమ్ముని దొంగిలించిన అల్లు అర్జున్ తిరిగి దాన్ని అతనికి తిరిగివేస్తాడు. ఆ సీను చూసి తెలుగువాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే సీనుని తమిళంలో శింబు చేశాడు. ఆ సీను చూసి తమిళులు చప్పట్లు కొట్టి, ఈలలు వేశారు. మనవాళ్లకీ, తమిళులకీ సినిమాని అర్థం చేసుకోవడంలో ఉన్న తేడా అది" అని చెప్పాడు క్రిష్.
ఇప్పటిదాకా తన సినిమాల కోసం గ్రామాల్లో, మురికివాడల్లో ఎక్కువగా తిరిగిన క్రిష్ ఈసారి పట్టణ, పోష్ లొకేషన్లలో సినిమా తీయాలనుకుంటున్నాడు. "నా తర్వాతి సినిమాలో భారీ ఫైట్లు, సెట్లు ఉంటాయి" అని అతను తెలిపాడు. ఓ వైపు సామాజిక వాస్తవికతని చూపిస్తూ, మరోవైపు మానవ భావోద్వేగాల్ని గొప్పగా సెల్యులాయిడ్ మీద మలచగలిగే నేర్పు ఉన్న ఈ డైరెక్టర్ ఇప్పుడు తన తర్వాతి స్క్రిప్టు మీద పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఆ సినిమా కూడా అతణ్ణి కచ్చితంగా వార్తల్లో నిలుపుతుందన్నది నిఖార్సయిన నిజం.
Showing posts with label vedam. Show all posts

Thursday, August 18, 2011
Friday, August 5, 2011
న్యూస్: మంచి సినిమాలకే నందులు!
గతంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకే ఎక్కువ అవార్డుల్ని కట్టబెడుతూ వచ్చిన నంది అవార్డుల జ్యూరీ గత యేడాది నుంచీ అర్థవంతమైన, మంచి చిత్రాలకు అవార్డులనిస్తూ 'నంది'కి గౌరవాన్ని కల్పిస్తోంది. 2010 సంవత్సరానికి దర్శకుడు ఎన్. శంకర్ ఆధ్వర్యంలోని జ్యూరీ ప్రకటించిన అవార్డులు ఈ సంగతిని స్పష్టం చేశాయి. ఈసారి ఉత్తమ అవార్డులు మూడూ విమర్శకుల ప్రశంసల్ని పొందిన సినిమాలకే రావడం గమనార్హం. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క ప్రధాన పాత్రలు పోషించగా క్రిష్ డైరెక్ట్ చేసిన 'వేదం' ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుగుకోగా, 2009 సంవత్సరంలో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని పొందిన 'సొంత ఊరు' దర్శకుడు పి. సునీల్‌కుమార్‌రెడ్డి మత్స్యకారుల దయనీయ జీవితాన్ని ఆవిష్కరించిన 'గంగపుత్రులు' ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సునీల్‌కుమార్‌రెడ్డికే ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కడం గమనార్హం. ఇక తృతీయ ఉత్తమ చిత్రంగా సాయికుమార్, శర్వానంద్, సందీప్ నటించగా దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'ప్రస్థానం' నిలిచింది. ప్రజాదరణ పొందిన చిత్రంగా నిజంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన రాజమౌళి చిత్రం 'మర్యాద రామన్న'ని జ్యూరీ ఎంపిక చేసింది. గతంలో ఈ కేటగిరీలో చాలా చోట్ల అసలు రిలీజే కాని 'పెళ్లాం పిచ్చోడు' అనే రాజేంద్రప్రసాద్ సినిమాని ఎంపిక చేసిన సంగతి జ్ఞాపకం చేసుకుంటే జ్యూరీ ఈసారి ఎంత వాస్తవికంగా పనిచేసిందో అర్థమవుతుంది. అలాగే సకుటుంబంగా చూడదగ్గ ఉత్తమ చిత్రం అవార్డుని చంద్రసిద్ధార్ట్ డైరెక్ట్ చేసిన 'అందరి బంధువయ'కు ప్రకటించారు. సమాజంలో నైతికత, మానవత్వం ముఖ్యమని చెప్పిన ఈ సినిమాని విమర్శకులు ఎంతగానో అభిమానించారు. ఇక జాతీయ సమగ్రతా చిత్రంగా బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణరావు రూపొందించిన 'పరమవీరచక్ర'కు ఇచ్చారు.
వ్యక్తిగత అవార్డుల విషయానికొస్తే ఉత్తమ నటుడి అవార్డు బాలకృష్ణకు దక్కింది. 2001 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 'నరసింహనాయుడు' పాత్ర పోషణకు గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న ఆయన మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆ అవార్డును పొందడం విశేషమే. 'పరమవీరచక్ర'కు కాకుండా, చాలా కాలం తర్వాత ప్రేక్షకాభిమానాన్ని పొందిన 'సింహా'లో చేసిన రెండు పాత్రలకు గాను ఈ అవార్డు ఆయనకు లభించడం గమనార్హం. 2011 సంక్రాంతికి విడుదలైనా, 2010లోనే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన 'అలా మొదలైంది'లో అద్భుతంగా అభినయించిన నిత్యమీనన్ ఉత్తమ నటిగా ఎంపికవగా, ఆ చిత్రాన్ని జన రంజకంగా మలిచిన నందినీరెడ్డి ఉత్తమ తొలిచిత్ర దర్శకురాలిగా నిలిచింది. 'సింహా"కి చక్కని సంగీతాన్నిచ్చిన చక్రి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. తొలి చిత్రమే అయినా 'మర్యాద రామన్న'లో విశేషంగా రాణించిన నాగినీడు ఉత్తమ విలన్‌గా అవార్డును అందుకోనున్నారు. ఇలా అనేక అవార్డులు పారదర్శకంగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

Monday, July 25, 2011
న్యూస్: మనోజ్ కెరీర్‌కి ప్రేక్షకులు ఊ కొడతారా?
ఇప్పటివరకు హీరోగా ఎనిమిది సినిమాల్లో నటించిన మంచు మనోజ్ కెరీర్‌లో ఎన్ని హిట్లున్నాయి? సరిగ్గా చెప్పాలంటే ఒక్కటే. అది 'బిందాస్'. 2010 మొదట్లో వీరు పోట్ల తొలిసారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిజానికి మరింత హిట్టవ్వాల్సింది కానీ నాలుగు వారాల తర్వాత కలెక్షన్లు తగ్గిపోయాయి. అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద అప్పటికే మంచి వసూళ్లను అది రాబట్టింది. క్రిష్ డైరెక్షన్‌లో నటించిన 'వేదం' అందరి ప్రశంసలూ పొందింది కానీ కమర్షియల్‌గా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అందులో వివేక్ చక్రవర్తి పాత్రలో మనోజ్ నటనని విమర్శకులు మెచ్చారు. మొదట్లోనే డైలాగ్ డిక్షన్‌లో స్పష్టత సాధించిన మనోజ్ హావభావాల్లోనూ పరిణతి కనపర్చాడు. హీరోగా తొలి సినిమా 'దొంగ దొంగది'లోనే తన నటనతో అతను ఆకట్టుకున్నాడు. మరైతే అతనికి ఎందుకు హిట్లు దక్కడం లేదు? ఎంచుకుంటున్న సబ్జెక్టులే అందుకు కారణం. ఆఖరుకి కె. రాఘవేంద్రరావు వంటి గొప్ప సీనియర్ డైరెక్టర్ కూడా పాత చింతకాయ సబ్జెక్టుతోటే 'ఝుమ్మంది నాదం' తీయడంతో పాటలు తప్ప మరేమీ ఆకట్టుకోక ఆ సినిమా ఫ్లాపయ్యింది. ఈ నేపథ్యంలో మనోజ్ రెండు రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా', రెండు 'మిస్టర్ నోకియా'. మొదటి సినిమాని శేఖర్ రాజా అనే కొత్త దర్శకుడు తీస్తుంటే, రెండే సినిమాని 'అసాధ్యుడు' (కల్యాణ్‌రాం హీరో), 'జంక్షన్' (పరుచూరి రవిబాబు హీరో) వంటి సూపర్ డిజాస్టర్లను రూపొందించిన అనిల్‌కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. అనిల్‌కృష్ణ ఈ సినిమాకి తన పేరుని 'అని' అంటూ మార్చుకున్నాడు. ఫెయిల్యూర్లు వచ్చిన వాళ్లెందుకు పేరు మార్చుకుంటారో తెలిసిందే కదా. ఈ సినిమాలతో అయినా కమర్షియల్ హీరోగా మనోజ్ తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకో గలుగుతాడా?
Wednesday, November 10, 2010
ఇంటర్వ్యూ: అనుష్క
నాగార్జునకి జోడీగా 'రగడ'లో నటిస్తూ, వెంకటేశ్ ప్రధాన పాత్ర చేస్తోన్న 'నాగవల్లి'లో టైటిల్ రోల్ చేస్తోన్న బెంగళూరు భామ అనుష్క చెప్పిన సంగతులు..
'రగడ'లో మూడోసారి నాగ్‌తో కలిసి నటిస్తున్నందుకు హ్యాపీ. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ని డైరెక్టర్ వీరు పోట్ల బాగా మలిచాడు. నాగ్, నేనూ ప్రేక్షకుల్ని అలరిస్తామనే గట్టి నమ్మకం నాకుంది. నాది గ్లామర్‌తో పాటు నటనకు కూడా అవకాశం వున్న పాత్ర. 'నాగవల్లి'లో టైటిల్ రోల్ చేయడం ఇంకా హ్యాపీ. ఇప్పటికే నా మాతృభాష కన్నడలో పెద్ద హిట్టయిన సినిమా ఇది. 'అరుంధతి', 'వేదం' సినిమాల తర్వాత అంత పేరు తెచ్చే సినిమా.
దేవుణ్ని నమ్ముతా
నేను దేవుణ్ని నమ్ముతా. దేవత పాత్రల్లో రమ్యకృష్ణలో కనిపించే తేజస్సు నాకు చాలా ఇష్టం. ఆమె ఆ పాత్రలు చేసినప్పుడు డైనమిజం కనిపిస్తుంది. నాకు మాత్రం ఎప్పుడో ఒక రోజు దేవుణ్ని నిజంగా చూడాలని వుంది. 'పంచాక్షరి' షూటింగ్ జరుగుతున్నప్పుడు చూడ్డానికి వచ్చిన ఓ మహిళని అమ్మవారు పూనింది. ఇలాంటివన్నీ చూసినప్పుడు నమ్మకం కలుగుతుంది. ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించా. కానీ అన్నీ బాగా ఉన్న సినిమా నేను డబ్బింగ్ చెప్పడంవల్ల ఇబ్బందుల్లో పడటం నాకిష్టం లేదు. 'వేదం'లో సరోజ పాత్రకి కూడా రెండు రోజులు డబ్బింగ్ చెప్పా. కానీ రాజమండ్రి యాస నాకు రాలేదు. అందుకే మానుకున్నా. భవిష్యత్తులో మాత్రం తప్పకుండా ప్రయత్నిస్తా.
జనాలు నవ్వుతారు
సాంకేతికపరంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. మనం పాత్ర గురించి మాత్రం మాట్లాడుతుంటాం. కానీ ప్రేక్షకులు గ్రాఫిక్స్ బాగాలేవనీ, కెమెరా యాంగిల్ కరెక్ట్ కాదనీ అంటున్నారు. అంత ముందంజలో వున్నారు వాళ్లు. మంచి స్క్రిప్టు లేకుండా నేను పైట్లు, యాక్షన్ చేస్తే చూసి నవ్వుతారు. మంచి కథ కుదిరితే నేను విజయశాంతిలా ఫైట్లు చేయడానికి సిద్దమే. కాకపోతే ప్రతిదానికీ శిక్షణ అవసరం. ప్రతి చిత్రంలోనూ నేను చేసే తప్పుల్ని గుర్తుంచుకుంటా. తదుపరి చిత్రంలో ఆ తప్పును సవరించుకుంటా.
ఎత్తుపల్లాలు తప్పవు
'విక్రమార్కుడు' విజయం సాధించేవరకు నన్ను ఏదో అభద్రతాభావం వెంటాడేది. కానీ ఇప్పుడు దాన్నుంచి బయటపడ్డా. నా సినీ ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించినట్లు భావిస్తున్నా. ఈ పరిశ్రమలో ఎత్తుపల్లాలు తప్పవు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నా. బాలీవుడ్ నుంచి ఒకరిద్దరు కథలు వినిపించారు. అవి లేడీ ఓరిఎంటెడ్ స్టోరీలు. ఓపిగ్గా విన్నా కానీ నాకు పెద్దగా నచ్చలేదు. నచ్చిన కథ దొరికే వరకు హిందీకి వెళ్లను. నాకు తెలుగులో బాగానే ఉంది.
ప్రణాళిక తెలీదు
ఫలానా విధంగా వుండాలని నేనెప్పుడూ ప్రణాళిక వేసుకోలేదు. వచ్చినదాన్ని వచ్చినట్లు స్వీకరిస్తున్నా. గత ఐదేళ్లలో ఎప్పుడూ ఖాళీగా లేను. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నా. ఏది జరిగినా మన మంచికే అనుకుంటా. కారణం లేకుండా ఏదీ జరగదన్నది నేను నమ్మిన సిద్ధాంతం.

Sunday, October 10, 2010
సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (1వ భాగం)
గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్లు ఒక్కొక్కటే మూతపడుతూ పట్టణాలు, నగరాల్లో మల్టీప్లెక్సుల సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు సినిమా నిర్మాణ ఫార్ములా క్రమేపీ మార్పుకు గురవుతోంది. 'స్టార్ మేనియా' ఇప్పటికీ కొనసాగుతున్నా కొత్త తరహా కథాకథనాలతో వస్తున్న సినిమాలు సైతం కొద్దో గొప్పో ఆదరణ పొందుతున్నాయి, 'మంచి సినిమా'గా పేరు తెచ్చుకుంటున్నాయి. చంద్రసిద్ధార్థ్, శేఖర్ కమ్ముల, రవిబాబు, దేవా కట్టా, సాయికిరణ్ అడివి, క్రిష్, చైతన్య దంతులూరి, మధుర శ్రీధర్ వంటి దర్శకులు మంచి సినిమా పట్ల ఆశలు రేకెత్తిస్తున్నారు.
'ఆ నలుగురు' ఆదర్శం
ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన 'ఆ నలుగురు' సినిమా ఈ నవ్య పంథాకు మార్గదర్శకంగా నిలిచిందని చెప్పాలి. చంద్రసిద్ధార్థ్ రూపొందించిన ఆ సినిమా 2004 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందడమే కాక, ఉత్తమ నటునిగా రాజేంద్రప్రసాద్ కీ, ఉత్తమ క్యారెక్టర్ నటునిగా కోట శ్రీనివాసరావుకీ అవార్డులు సంపాదించి పెట్టింది. అన్నింటికీ మించి ఆ సినిమాని చెప్పుకోదగ్గ రీతిలో ప్రేక్షకులు సైతం ఆదరించారు. తన సినీ జీవితంలో 'ఆ నలుగురు' సినిమా ఓ మైలురాయి లాంటిదని రాజేంద్రప్రసాద్ గర్వంగా చెప్పుకోవడమే ఈ సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతుంది. తన సంపాదనలో సగాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించే ఓ దినపత్రిక సంపాదకుడు రఘురామ్ తన మనసుకు విరుద్ధమైన పని చేయాల్సి వస్తే ఎలాంటి సంఘర్షణకు గురవుతాడు, అతడు చినిపోయాక కూడా అతని ఆత్మ ఎంతగా క్షోభిస్తుందనే అంశాన్ని హృద్యంగా చిత్రించిన విధానం అందరి ప్రశంసల్నీ పొందింది. మంచి సినిమా దర్శకుడిగా చంద్రసిద్ధార్థ్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే అతను కేవలం మంచి సినిమా దర్శకుడే కాదు, 'స్వతంత్ర సినిమా' దర్శకుడు కూడా. 'స్టార్' విలువ మీద ఆధారపడకుండా, నిర్మాత వత్తిళ్లకు తలొగ్గకుండా, తనేం తీయదలచుకున్నాడో, దాన్ని అందంగా, నాణ్యంగా సెల్యులాయిడ్ మీద చిత్రించేవాడూ, మార్కెట్లు, వర్తమాన ధోరణులు, అభిప్రాయాలు, ప్రేక్షకుల అంచనాలు, అమలులో ఉన్న సినిమా రూపకల్పన విధానాల ప్రభావం లేకుండా తీసేవాడూ స్వతంత్ర సినిమా దర్శకుడు అని సూత్రీకరిస్తాడు బాలీవుడ్ లో 'రఘు రోమియో' చిత్ర రూపకర్త రజత్ కపూర్. ఆ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో వచ్చిన 'హైదరాబాద్ బ్లూస్', 'మాన్సూన్ వెడ్డింగ్', 'సత్య', 'ఝంకార్ బీట్స్', 'దేవ్ డి', 'హరిశ్చంద్రాచ్చి ఫ్యాక్టరీ', 'ఖర్గోష్' వంటి సినిమాలు స్వతంత్ర సినిమా జెండాని నిలబెట్టేందుకు ఉపకరించాయి. వాటి తరహాలోనే తెలుగులో 'ఆనంద్', 'హ్యాపీడేస్', 'ఎ ఫిల్మ్ బై అరవింద్', 'వినాయకుడు', 'మంత్ర', 'అనసూయ', 'గమ్యం', 'బాణం', 'విలేజ్ లో వినాయకుడు', 'లీడర్', 'ప్రస్థానం', 'అందరి బంధువయ', 'వేదం' వంటి సినిమాలు మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. వీటిలో చాలావాటికి ప్రేక్షకాదరణ కూడా ఉండటం ఇక్కడ గమనించాల్సిన అంశం. (ఇంకావుంది)

Subscribe to:
Posts (Atom)