Showing posts with label chandra siddharth. Show all posts
Showing posts with label chandra siddharth. Show all posts
Saturday, February 1, 2014
Monday, September 26, 2011
బిగ్ స్టోరీ: 'నాయిక' రంగుల జీవితం!
చిత్రసీమ అంటే రంగుల ప్రపంచమని అందరికీ తెలుసు. ఇక్కడి తారల జీవితాలు ఎలా ఉంటున్నాయో, తరచూ చూస్తూనే ఉన్నాం. వెండితెరపై సూపర్‌స్టార్లుగా వెలిగిన తారామణుల్లో కొంతమంది జీవితాలు అర్ధంతరంగా ఆగిపోతే, ఎంతోమంది జీవితాలు దయనీయంగా ముగిసిపోయాయి. అలాంటి తారల నిజ జీవితాలు వెండితెరపై ఆవిష్కృతమైతే... వాటికంటే రసభరిత చిత్రాలూ, హృదయాల్ని ద్రవింపజేసే కథలూ మరేముంటాయి! అయితే అలాంటి వాస్తవిక గాథా చిత్రాలు తెలుగులో రావడం అరుదు. ఇతర భాషల్లోనే అలాంటి చిత్రాలు రూపొందుతుండటమనేది వాస్తవిక దృశ్యం. ఇవాళ అలాంటి రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. వాటిలో ఒకటి ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చలకూ, విమర్శలకూ తావిస్తున్న హిందీ చిత్రం 'ద డర్టీ పిక్చర్' కాగా, మరొకటి మలయాళంలో రూపొందుతున్న 'నాయిక'
శృంగార తారగా ఓ తరాన్ని తన ఒంపుసొంపులు, వొంటి విరుపులతో ఊపేసిన మత్తుకళ్ల సుందరి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ద డర్టీ పిక్చర్'. ఇందులో స్మిత పాత్రని విద్యాబాలన్ పోషిస్తుండటం ఓవైపు ఆసక్తినీ, మరోవైపు వివాదాన్నీ రేపుతోంది. ఐటం సాంగ్స్‌లో నర్తించడం ద్వారానే కాక, వ్యాంప్ పాత్రలతోనూ స్మిత ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ శృంగార కెరటం కేవలం 36 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకుని, అర్ధంతరంగా తనువు చాలించడం అందర్నీ కలచివేసింది. అలాంటి ఆమె జీవితాన్ని డైరెక్టర్ మిలన్ లూథ్రియా తెరకెక్కిస్తుండగా, తల్లీకూతుళ్లు శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2 స్మిత జయంతికి ఈ సినిమాని విడుదల చేసేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, తుషార్ కపూర్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్మిత జీవితంలోని ముగ్గురు పురుషుల పాత్రల్ని వాళ్లు చేస్తున్నారు. స్మిత రూపానికీ, విద్యా బాలన్ ఆకారానికీ అసలు పోలికే లేదనీ, స్మితకి ప్రధానాకర్షణ అయిన మత్తు కళ్లు కానీ, వంపుసొంపుల విన్యాసాలు కానీ విద్యాబాలన్‌లో లేవనీ, అలాంటప్పుడు ఆమె ఎలా ఆ పాత్రకి న్యాయం చేస్తుందనే వ్యాఖ్యలు విమర్శకుల నుంచి వస్తున్నాయి. అయితే వీటినేమీ పట్టించుకోకుండా ఏక్తా కపూర్, మిలన్ లూథ్రియా తమ పని తాము చేసుకుపోతున్నారు. అన్ని ప్రశ్నలకీ తమ సినిమానే సమాధానం చెబుతుందనేది వారి అభిప్రాయం. ఈ సినిమా స్క్రిప్టుని రజత్ అరోరా సమకూర్చాడు.
ఇక దక్షిణాదిన ఆసక్తిని కలిగిస్తున్న మరో చిత్రం 'నాయిక'. మలయాళంలో ఈ సినిమాని జయరాజ్ రూపొందిస్తున్నాడు. కేవలం రాష్ట్ర స్థాయి అవార్డుల్నే కాక జాతీయ, అంతర్జాతీయ అవార్డుల్ని కూడా సొంతం చేసుకున్న జయరాజ్ తీస్తున్నందువల్లే 'నాయిక' పట్ల అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తెలుగు తార అయివుండీ, మలయాళ సినిమాల ద్వారానే మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా 'ఊర్వశి' అవార్డును పొందిన శారద జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారని ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ఇది శారద జీవితంపై తీస్తున్నట్లుగానే వార్తలు చలామణీ అవుతున్నాయి. ఈ వర్తల్ని శారద స్వయంగా ఖండించారు. అయితే ఈ చిత్రంలో ఆమె స్వయంగా తన నిజ జీవిత పాత్రను చేస్తుండటం విశేషం. ప్రధాన కథలో ఆమె పాత్ర కూడా వస్తుంది. మరైతే ప్రధాన కథ ఎవరిది? ఒకప్పుడు మలయాళ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపి, అర్ధంతరంగా సినిమాల నుంచి మాయమైన ఓ తార జీవితం ఈ చిత్రం. ఆ తార ఎవరంటే... షీలా! తెలుగులోనూ ఆమె నటించింది. అదీ అల్లాటప్పా హీరోలతో కాదు. 'నేనే మొనగాణ్ణి'లో ఎన్టీఆర్‌తో, 'విచిత్ర కుటుంబం'లో శోభన్‌బాబుతో నటించింది షీలానే. అందాలరాశి అయిన ఆమె అకస్మాత్తుగా సినిమాల నుంచి విరమించుకుంది. అలాంటి ఆమె పాత్రని తెరమీద ఆవిష్కరిస్తున్న తార పద్మప్రియ. ఆమె కూడా తెలుగులో ఆర్పా పట్నాయక్ సోదరిగా 'శీను వాసంతి లక్ష్మి'లో, చంద్రసిద్ధార్థ్ రూపొందించిన 'అందరి బంధువయ'లో శర్వానంద్ జోడీగానూ నటించింది. 'నాయిక'లో జయరాం హీరోగా నటిస్తుంటే, మమతా మోహన్‌దాస్ ఓ కీలక పాత్రను చేస్తోంది. అర్ధంతరంగా మాయమైన 'నాయిక'ను అన్వేషించే పాత్రలో ఆమె కనిపించబోతోంది.
తెలుగులో ఇదివరకు తారల జీవితాలు ఎలా ఉంటాయో దాసరి నారాయణరావు రూపొందించిన 'శివరంజని', వంశీ డైరెక్ట్ చేసిన 'సితార' సినిమాలు చూపించాయి. అయితే ఇవి నిజ జీవిత కథలు కావు. 'శివరంజని'లో టైటిల్ పాత్ర చేసిన జయసుధ జీవితంలోని కొన్ని ఘట్టాలున్నాయని అంటారు కానీ ఆ సినిమా పూర్తిగా ఆమె కథైతే కాదు. ఇక 'సితార' చిత్రానికి ఆధారం వంశీ స్వయంగా రాసిన 'మహల్లో కోయిల' నవల. ఆ మధ్య వర్థమాన తార ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మరణించిన తర్వాత ఆమె పేరుమీద సత్యారెడ్డి ఓ సినిమా తీశారు కానీ అది ఆమె జీవిత కథ కాదు. ఓ సంఘటనని ఆధారం చేసుకుని రూపొందించిన సినిమానే.
ఏదేమైనా పైకి కనిపించినట్లు సినీ తారల జీవితాలు రంగుల మయం కాదనీ, కలల వెన్నంటే కష్టాలూ, కన్నీళ్లూ, వ్యధలూ ఉంటాయనీ 'ద డర్టీ పిక్చర్', 'నాయిక' చిత్రాలు మనకి చూపించబోతున్నాయి. కాకపోతే వాటిలో హిందీ సినిమా ఎక్కువ కమర్షియల్ కోణంలో తయారవుతుంటే, మలయాళ చిత్రం వాస్తవికతే ప్రధానంగా తయారవుతోంది. ప్రేక్షకులు వాటికి ఎలా స్పందిస్తారో చూడాలి.
Friday, August 5, 2011
న్యూస్: మంచి సినిమాలకే నందులు!
గతంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకే ఎక్కువ అవార్డుల్ని కట్టబెడుతూ వచ్చిన నంది అవార్డుల జ్యూరీ గత యేడాది నుంచీ అర్థవంతమైన, మంచి చిత్రాలకు అవార్డులనిస్తూ 'నంది'కి గౌరవాన్ని కల్పిస్తోంది. 2010 సంవత్సరానికి దర్శకుడు ఎన్. శంకర్ ఆధ్వర్యంలోని జ్యూరీ ప్రకటించిన అవార్డులు ఈ సంగతిని స్పష్టం చేశాయి. ఈసారి ఉత్తమ అవార్డులు మూడూ విమర్శకుల ప్రశంసల్ని పొందిన సినిమాలకే రావడం గమనార్హం. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క ప్రధాన పాత్రలు పోషించగా క్రిష్ డైరెక్ట్ చేసిన 'వేదం' ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుగుకోగా, 2009 సంవత్సరంలో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని పొందిన 'సొంత ఊరు' దర్శకుడు పి. సునీల్‌కుమార్‌రెడ్డి మత్స్యకారుల దయనీయ జీవితాన్ని ఆవిష్కరించిన 'గంగపుత్రులు' ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సునీల్‌కుమార్‌రెడ్డికే ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కడం గమనార్హం. ఇక తృతీయ ఉత్తమ చిత్రంగా సాయికుమార్, శర్వానంద్, సందీప్ నటించగా దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'ప్రస్థానం' నిలిచింది. ప్రజాదరణ పొందిన చిత్రంగా నిజంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన రాజమౌళి చిత్రం 'మర్యాద రామన్న'ని జ్యూరీ ఎంపిక చేసింది. గతంలో ఈ కేటగిరీలో చాలా చోట్ల అసలు రిలీజే కాని 'పెళ్లాం పిచ్చోడు' అనే రాజేంద్రప్రసాద్ సినిమాని ఎంపిక చేసిన సంగతి జ్ఞాపకం చేసుకుంటే జ్యూరీ ఈసారి ఎంత వాస్తవికంగా పనిచేసిందో అర్థమవుతుంది. అలాగే సకుటుంబంగా చూడదగ్గ ఉత్తమ చిత్రం అవార్డుని చంద్రసిద్ధార్ట్ డైరెక్ట్ చేసిన 'అందరి బంధువయ'కు ప్రకటించారు. సమాజంలో నైతికత, మానవత్వం ముఖ్యమని చెప్పిన ఈ సినిమాని విమర్శకులు ఎంతగానో అభిమానించారు. ఇక జాతీయ సమగ్రతా చిత్రంగా బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణరావు రూపొందించిన 'పరమవీరచక్ర'కు ఇచ్చారు.
వ్యక్తిగత అవార్డుల విషయానికొస్తే ఉత్తమ నటుడి అవార్డు బాలకృష్ణకు దక్కింది. 2001 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 'నరసింహనాయుడు' పాత్ర పోషణకు గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న ఆయన మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆ అవార్డును పొందడం విశేషమే. 'పరమవీరచక్ర'కు కాకుండా, చాలా కాలం తర్వాత ప్రేక్షకాభిమానాన్ని పొందిన 'సింహా'లో చేసిన రెండు పాత్రలకు గాను ఈ అవార్డు ఆయనకు లభించడం గమనార్హం. 2011 సంక్రాంతికి విడుదలైనా, 2010లోనే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన 'అలా మొదలైంది'లో అద్భుతంగా అభినయించిన నిత్యమీనన్ ఉత్తమ నటిగా ఎంపికవగా, ఆ చిత్రాన్ని జన రంజకంగా మలిచిన నందినీరెడ్డి ఉత్తమ తొలిచిత్ర దర్శకురాలిగా నిలిచింది. 'సింహా"కి చక్కని సంగీతాన్నిచ్చిన చక్రి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. తొలి చిత్రమే అయినా 'మర్యాద రామన్న'లో విశేషంగా రాణించిన నాగినీడు ఉత్తమ విలన్‌గా అవార్డును అందుకోనున్నారు. ఇలా అనేక అవార్డులు పారదర్శకంగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
వ్యక్తిగత అవార్డుల విషయానికొస్తే ఉత్తమ నటుడి అవార్డు బాలకృష్ణకు దక్కింది. 2001 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 'నరసింహనాయుడు' పాత్ర పోషణకు గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న ఆయన మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆ అవార్డును పొందడం విశేషమే. 'పరమవీరచక్ర'కు కాకుండా, చాలా కాలం తర్వాత ప్రేక్షకాభిమానాన్ని పొందిన 'సింహా'లో చేసిన రెండు పాత్రలకు గాను ఈ అవార్డు ఆయనకు లభించడం గమనార్హం. 2011 సంక్రాంతికి విడుదలైనా, 2010లోనే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన 'అలా మొదలైంది'లో అద్భుతంగా అభినయించిన నిత్యమీనన్ ఉత్తమ నటిగా ఎంపికవగా, ఆ చిత్రాన్ని జన రంజకంగా మలిచిన నందినీరెడ్డి ఉత్తమ తొలిచిత్ర దర్శకురాలిగా నిలిచింది. 'సింహా"కి చక్కని సంగీతాన్నిచ్చిన చక్రి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. తొలి చిత్రమే అయినా 'మర్యాద రామన్న'లో విశేషంగా రాణించిన నాగినీడు ఉత్తమ విలన్‌గా అవార్డును అందుకోనున్నారు. ఇలా అనేక అవార్డులు పారదర్శకంగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
Sunday, October 10, 2010
సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (1వ భాగం)
గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్లు ఒక్కొక్కటే మూతపడుతూ పట్టణాలు, నగరాల్లో మల్టీప్లెక్సుల సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు సినిమా నిర్మాణ ఫార్ములా క్రమేపీ మార్పుకు గురవుతోంది. 'స్టార్ మేనియా' ఇప్పటికీ కొనసాగుతున్నా కొత్త తరహా కథాకథనాలతో వస్తున్న సినిమాలు సైతం కొద్దో గొప్పో ఆదరణ పొందుతున్నాయి, 'మంచి సినిమా'గా పేరు తెచ్చుకుంటున్నాయి. చంద్రసిద్ధార్థ్, శేఖర్ కమ్ముల, రవిబాబు, దేవా కట్టా, సాయికిరణ్ అడివి, క్రిష్, చైతన్య దంతులూరి, మధుర శ్రీధర్ వంటి దర్శకులు మంచి సినిమా పట్ల ఆశలు రేకెత్తిస్తున్నారు.
'ఆ నలుగురు' ఆదర్శం
ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన 'ఆ నలుగురు' సినిమా ఈ నవ్య పంథాకు మార్గదర్శకంగా నిలిచిందని చెప్పాలి. చంద్రసిద్ధార్థ్ రూపొందించిన ఆ సినిమా 2004 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందడమే కాక, ఉత్తమ నటునిగా రాజేంద్రప్రసాద్ కీ, ఉత్తమ క్యారెక్టర్ నటునిగా కోట శ్రీనివాసరావుకీ అవార్డులు సంపాదించి పెట్టింది. అన్నింటికీ మించి ఆ సినిమాని చెప్పుకోదగ్గ రీతిలో ప్రేక్షకులు సైతం ఆదరించారు. తన సినీ జీవితంలో 'ఆ నలుగురు' సినిమా ఓ మైలురాయి లాంటిదని రాజేంద్రప్రసాద్ గర్వంగా చెప్పుకోవడమే ఈ సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతుంది. తన సంపాదనలో సగాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించే ఓ దినపత్రిక సంపాదకుడు రఘురామ్ తన మనసుకు విరుద్ధమైన పని చేయాల్సి వస్తే ఎలాంటి సంఘర్షణకు గురవుతాడు, అతడు చినిపోయాక కూడా అతని ఆత్మ ఎంతగా క్షోభిస్తుందనే అంశాన్ని హృద్యంగా చిత్రించిన విధానం అందరి ప్రశంసల్నీ పొందింది. మంచి సినిమా దర్శకుడిగా చంద్రసిద్ధార్థ్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే అతను కేవలం మంచి సినిమా దర్శకుడే కాదు, 'స్వతంత్ర సినిమా' దర్శకుడు కూడా. 'స్టార్' విలువ మీద ఆధారపడకుండా, నిర్మాత వత్తిళ్లకు తలొగ్గకుండా, తనేం తీయదలచుకున్నాడో, దాన్ని అందంగా, నాణ్యంగా సెల్యులాయిడ్ మీద చిత్రించేవాడూ, మార్కెట్లు, వర్తమాన ధోరణులు, అభిప్రాయాలు, ప్రేక్షకుల అంచనాలు, అమలులో ఉన్న సినిమా రూపకల్పన విధానాల ప్రభావం లేకుండా తీసేవాడూ స్వతంత్ర సినిమా దర్శకుడు అని సూత్రీకరిస్తాడు బాలీవుడ్ లో 'రఘు రోమియో' చిత్ర రూపకర్త రజత్ కపూర్. ఆ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో వచ్చిన 'హైదరాబాద్ బ్లూస్', 'మాన్సూన్ వెడ్డింగ్', 'సత్య', 'ఝంకార్ బీట్స్', 'దేవ్ డి', 'హరిశ్చంద్రాచ్చి ఫ్యాక్టరీ', 'ఖర్గోష్' వంటి సినిమాలు స్వతంత్ర సినిమా జెండాని నిలబెట్టేందుకు ఉపకరించాయి. వాటి తరహాలోనే తెలుగులో 'ఆనంద్', 'హ్యాపీడేస్', 'ఎ ఫిల్మ్ బై అరవింద్', 'వినాయకుడు', 'మంత్ర', 'అనసూయ', 'గమ్యం', 'బాణం', 'విలేజ్ లో వినాయకుడు', 'లీడర్', 'ప్రస్థానం', 'అందరి బంధువయ', 'వేదం' వంటి సినిమాలు మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. వీటిలో చాలావాటికి ప్రేక్షకాదరణ కూడా ఉండటం ఇక్కడ గమనించాల్సిన అంశం. (ఇంకావుంది)
'ఆ నలుగురు' ఆదర్శం
ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన 'ఆ నలుగురు' సినిమా ఈ నవ్య పంథాకు మార్గదర్శకంగా నిలిచిందని చెప్పాలి. చంద్రసిద్ధార్థ్ రూపొందించిన ఆ సినిమా 2004 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందడమే కాక, ఉత్తమ నటునిగా రాజేంద్రప్రసాద్ కీ, ఉత్తమ క్యారెక్టర్ నటునిగా కోట శ్రీనివాసరావుకీ అవార్డులు సంపాదించి పెట్టింది. అన్నింటికీ మించి ఆ సినిమాని చెప్పుకోదగ్గ రీతిలో ప్రేక్షకులు సైతం ఆదరించారు. తన సినీ జీవితంలో 'ఆ నలుగురు' సినిమా ఓ మైలురాయి లాంటిదని రాజేంద్రప్రసాద్ గర్వంగా చెప్పుకోవడమే ఈ సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతుంది. తన సంపాదనలో సగాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించే ఓ దినపత్రిక సంపాదకుడు రఘురామ్ తన మనసుకు విరుద్ధమైన పని చేయాల్సి వస్తే ఎలాంటి సంఘర్షణకు గురవుతాడు, అతడు చినిపోయాక కూడా అతని ఆత్మ ఎంతగా క్షోభిస్తుందనే అంశాన్ని హృద్యంగా చిత్రించిన విధానం అందరి ప్రశంసల్నీ పొందింది. మంచి సినిమా దర్శకుడిగా చంద్రసిద్ధార్థ్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే అతను కేవలం మంచి సినిమా దర్శకుడే కాదు, 'స్వతంత్ర సినిమా' దర్శకుడు కూడా. 'స్టార్' విలువ మీద ఆధారపడకుండా, నిర్మాత వత్తిళ్లకు తలొగ్గకుండా, తనేం తీయదలచుకున్నాడో, దాన్ని అందంగా, నాణ్యంగా సెల్యులాయిడ్ మీద చిత్రించేవాడూ, మార్కెట్లు, వర్తమాన ధోరణులు, అభిప్రాయాలు, ప్రేక్షకుల అంచనాలు, అమలులో ఉన్న సినిమా రూపకల్పన విధానాల ప్రభావం లేకుండా తీసేవాడూ స్వతంత్ర సినిమా దర్శకుడు అని సూత్రీకరిస్తాడు బాలీవుడ్ లో 'రఘు రోమియో' చిత్ర రూపకర్త రజత్ కపూర్. ఆ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో వచ్చిన 'హైదరాబాద్ బ్లూస్', 'మాన్సూన్ వెడ్డింగ్', 'సత్య', 'ఝంకార్ బీట్స్', 'దేవ్ డి', 'హరిశ్చంద్రాచ్చి ఫ్యాక్టరీ', 'ఖర్గోష్' వంటి సినిమాలు స్వతంత్ర సినిమా జెండాని నిలబెట్టేందుకు ఉపకరించాయి. వాటి తరహాలోనే తెలుగులో 'ఆనంద్', 'హ్యాపీడేస్', 'ఎ ఫిల్మ్ బై అరవింద్', 'వినాయకుడు', 'మంత్ర', 'అనసూయ', 'గమ్యం', 'బాణం', 'విలేజ్ లో వినాయకుడు', 'లీడర్', 'ప్రస్థానం', 'అందరి బంధువయ', 'వేదం' వంటి సినిమాలు మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. వీటిలో చాలావాటికి ప్రేక్షకాదరణ కూడా ఉండటం ఇక్కడ గమనించాల్సిన అంశం. (ఇంకావుంది)
Thursday, September 23, 2010
రివ్యూ: చంద్రసిద్ధార్థ్ - టాబు సినిమా 'ఇదీ సంగతి!'

సీనియర్ జర్నలిస్టు, రచయిత కె.ఎన్.వై. పతంజలి కొన్నేళ్ల క్రితం ‘నువ్వే కాదు’ అనే నవలిక రాశారు. డబ్బు మనుషుల్ని ఎలాంటి నైచ్యానికి దిగజారుస్తుందనేది అందులోని ప్రధానాంశం. అందులో వివాదాస్పద అంశాలూ వున్నాయి. ఒక రంగమని కాకుండా న్యాయ వ్యవస్థ, మీడియా వ్యవస్థల్లోనూ అవినీతి ఎలా పేరుకు పోయిందో పతంజలి అందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. దాన్ని వెండితెర మీదకు తీసుకు రావాలనే ఆలోచన దర్శకుడు చంద్రసిద్ధార్థకు కలిగింది. ‘ఇదీ సంగతి!’ అంటూ చిత్రానువాదం చేశారు. అయితే జీవిత వాస్తవికత ఒక్కోసారి ఎంతటి ఉత్కంఠతనీ, భీతినీ కలిగిస్తుందో, అంత చేదునీ ఇస్తుంది. ‘ఇదీ సంగతి!’ మన మనసుల్ని యథాతధంగా ఆవిష్కరించింది. కానీ మనలోని నెగటివ్ అంశాల్ని ఒప్పుకునే ధైర్యం ఎంతమందికుంటుంది? అందుకే అది చేదు మాత్ర అయిపోయింది. ఎలాగంటే..
కథ:
ముంబై ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు యాక్సిడెంట్ అవుతుంది. దాన్ని కవర్ చేయడానికి వెళ్లిన ప్రజా పత్రిక క్రైమ్ రిపోర్టర్ సత్యమూర్తి (అబ్బాస్)కి అక్కడ చనిపోయిన వాళ్ల దగ్గర్నించి కొంతమంది ఏది కనపడితే అది దోచుకోవడం చూసి తనతో పాటు వచ్చిన ఫోటోగ్రాఫర్ (సునీల్)తో కలిసి తానూ దొరికినకాడికి దొచుకుంటాడు. అతడికి దొరికిన ఎర్ర సూట్‌కేస్‌లో 500 కోట్ల రూపాయల విలువచేసే వజ్రాలుంటాయి. అయితే అతడికి ఆ సంగతి తెలీకముందే అతడి భార్య స్వరాజ్యలక్ష్మి (టాబు) వాటిని దాచేస్తుంది. తను తెచ్చిన సూట్‌కేస్‌లో కోట్ల రూపాయల విలువచేసే వజ్రాలున్నాయని తెలిసిన సత్యమూర్తి వాటికోసం చూస్తే అవి కనిపించవు. ఆ సూట్‌కేస్‌లో బట్టలు తప్ప వజ్రాల్లాంటివేవీ లేవని స్వరాజ్యం చెబుతుంది. నిజమే అనుకుంటాడు సత్యమూర్తి. భర్తకి వాటి గురించి చెబితే వాటిని తనకు చెందకుండా చేస్తాడనేది స్వరాజ్యం భయం. ఆ వజ్రాలు సాక్షాత్తూ ప్రధాన మంత్రివి. ఆ స్థాయి వ్యక్తికి చెందిన వజ్రాలు విమానంలో కాకుండా, రైలుబండిలో ఎందుకు రవాణా అవుతున్నాయి? అసలు అవి ప్రధానివనే సంగతి లోకానికి తెలుసా? వాటివల్ల సత్యమూర్తి కుటుంబం ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుంది? స్వరాజ్యలక్ష్మి అత్యాశ చివరికి ఎటువంటి పరిణామాలకు దారి తీసింది? అనే ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.
కథనం:
మనిషిలోని డార్క్‌నెస్‌ని ఆకర్షణీయంగా చెప్పడం అంత తేలికైన సంగతి కాదు. డబ్బనేది మనిషిని ఎంత నైచ్యానికీ, దుర్మార్గానికీ లోను చేస్తుందో ‘ఇదీ సంగతి!’ బాగా ఆవిష్కరించిందనడంలో సందేహం లేదు. అయితే ఆ చెప్పడంలో ఆకర్షణీయత లోపించడమే ఆ సినిమాకు ప్రతికూలంగా మార్చింది. ముంబై ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురై, అందులోని ప్రయాణీకులు చాలామంది శవాలుగా మారి, మరెంతో మంది క్షతగాత్రులై కళ్లముందు కనిపిస్తుంటే సాధారణంగా హృదయాలు అవిసిపోతాయి. వారికి సాయం చేయాలన్న తపన కలుగుతుంది. దానికి రెండో కోణం.. అందినకాడికి దోచుకోవాలనే దుర్బుద్ధి కలగడం. ఇలాంటివి జరుగుతున్నాయని మనం చాలా సందర్భాల్లో వింటున్నాం. చదువుతున్నాం. ఈ సినిమాలో మనం దాన్ని ప్రత్యక్షంగా చూస్తాం. సత్యమూర్తి, ఫోటోగ్రాఫర్ కలిసి శవాలనుంచి ఆభరణాలు వొలుచుకోవడం వంటిని జలదరింపజేస్తుంది. ఇలాంటివే అనేక ఊహకందని సన్నివేశాలు ఈ సినిమాలో వున్నాయి. దొంగతనానికి గురైన వజ్రాల్ని కనిపెట్టడానికి దొంగలతో పొలీసు అధికారులు సమావేశం ఏర్పాటు చేసి, వాటాల గురించి మాట్లాడుకోవడం.. దొంగలకీ, పోలీసులకీ మధ్యవర్తిగా ఒక మాజీ న్యాయమూర్తి వ్యవహరించడం, అలా మధ్యవర్తిగా వుండేందుకు ఆయనా వాటా అడగడం.. వూళ్లోని ఇళ్లలో దొంగతనం చేయడానికి దొంగలకి పోలీసులే వ్యానుని ఏర్పాటు చేయడం.. ఆ వ్యానులో దొంగలతో పాటు మాజీ న్యాయమూర్తి కూడా ప్రయాణించడం.. వంటివి ఆ తరహా సన్నివేశాలు.
ఈ సినిమాలో సెంట్రల్ క్యారెక్టర్లు రెండు. సత్యమూర్తి, స్వరాజ్యలక్ష్మి. ఇద్దరూ డబ్బు మనుషులే. నేటి జర్నలిస్టులు ఎలాంటి బ్రోకర్ పనులు చేస్తున్నారనేందుకు సత్యమూర్తి పాత్ర నిదర్శనం. సహజంగానే ఆ పాత్ర మీడియా వ్యక్తులకి నచ్చదు. అతను శవాలని దొచుకు తెస్తే, అతన్నే దోచుకోవాలని అతని భార్య స్వరాజ్యలక్ష్మి భావిస్తుంది. వంటినిండా నగలు పెట్టుకుని తిరగాలనీ, కోటి రూపాయల ఖరీదు చేసే కారులో తిరగాలనీ, లంకంత ఇంటిలో కాపురముండాలనీ.. ఆమె కలలు కంటూ వుంటుంది. దొరికిన వజ్రాలతో అవి సమకూర్చుకోవచ్చనుకుంటుంది. కానీ వాటి గురించి పోలీసులు ఆరా తీస్తుండడం, మీడియాలో కథనాలు వస్తుండడంతో వాటిని కాపాడుకోవడానికి ఆమెపడే ఆదుర్దా సహేతుకమే. తన భర్త ప్రమాదంలో చిక్కుకున్నాక గానీ ఆమెకు తన తప్పు తెలిసిరాలేదు. అందుకే స్వార్థం స్థానంలో తన భర్తని కాపాడుకోవాలనే తపన ఆమెలో కలిగింది. వజ్రాలకంటే తన భర్తే తనకు ముఖ్యమనే విచక్షణ కలిగింది. తన మునుపటి ప్రశాంత జీవితం కావాలనే స్పృహ కలిగింది. ఆ పాత్రని దర్శకుడు చక్కగా మలిచాడు. డబ్బాశ ఒక స్త్రీని ఎలాంటి పనులకు పురికొల్పుతుందనే దానికి స్వరాజ్యలక్ష్మి నిలువెత్తు నిదర్శనం. పోలీస్ ఇన్‌స్పెక్టర్ దగ్గర్నుంచి ప్రధాన మంత్రి దాకా వజ్రాల కోసం చేసే పనులు ‘ఔరా’ అనిపిస్తాయి. అయితే అన్నీ నెగటివ్ పాత్రలు కావడమే ‘ఇదీ సంగతి!’కి కమర్షియల్ పరంగా ప్రతికూలంగా మారింది. సన్నివేశాల్ని దేనికి దానికి విడిగా చూసినప్పుడు బాగా వున్నట్లనిపిస్తాయి. పాత్రలు చెప్పే డైలాగులు మెప్పిస్తాయి. కానీ అన్నిటినీ కలిపి చూసినప్పుడు వెలితిగా తోస్తుంది. క్లైమాక్స్ కూడా అసంపూర్ణంగా ఆగినట్లు తోస్తుంది. కొన్ని పాత్రలు చివరకు ఏమయ్యాయనే సంగతిని దర్శకుడు ప్రేక్షకుడి ఊహకే వదిలేశాడు. సత్యమూర్తి కుటుంబాన్ని చంపాలనుకున్న డిఐజి (చలపతిరావు), అతని బావమరిది (రాజా రవీంద్ర), మంచివాడిగా నటిస్తూ వజ్రాలు కాజేయాలనుకున్న లాయర్ చందర్రావు (బ్రహ్మాజీ), మాజీ న్యాయమూర్తి (మేల్కోటే), ఇన్‌స్పెక్టర్ సూర్రెడ్డి (సూర్య) పాత్రలను దర్శకుడు అర్ధంతరంగా ముగించేశాడు. అందుకే క్లైమాక్స్ అసంతృప్తి కలిగిస్తుంది.
పాత్రధారుల అభినయం:
స్వరాజ్యలక్ష్మి పాత్రని టాబు ఉన్నత స్థాయిలో పోషించింది. ఆ పాత్రలోని రకరకాల ఎమోషన్స్‌ని బాగా పలికించింది. డబ్బాశ కలిగిన మధ్యతరగతి గృహిణిగా, చివరకు కనువిప్పు కలిగి వజ్రాలకంటే తన భర్తే తనకు ముఖ్యమనుకునే సగటు స్త్రీగా ఆమె అభినయం మెచ్చతగ్గది. ఒక పాటలోనూ, కొన్ని సన్నివేశాల్లోనూ దర్శకుడు ఆమెలోని గ్లామర్ కోణాన్నీ చూపించాడు. క్రైమ్ రిపోర్టర్ సత్యమూర్తిగా అబ్బాస్ కూడ మెరుగైన నటని ప్రదర్శించాడు. చాలా రోజుల తర్వాత అతడికి నటనను చూపించే పాత్ర లభించింది. అబ్బాస్ వెంటవుండే ఫోటోగ్రాఫర్‌గా సునీల్ మెప్పించాడు. అతనికి భార్యగా హేమను చూపించడం నప్పలేదు. ఆమె అతనికి అక్కలా కనిపించింది. కళావర్ కింగ్ అనే దొంగ పాత్రలో రాజా ఆశ్చర్యపరుస్తాడు. ఆ తరహా మాస్ పాత్రకి అతను సూట్ కాడని స్పష్టమైంది. అతని పాత్ర ముగిసే తీరు చూశాక అతని పట్ల మనకు జాలి కలుగుతుంది. ఇన్‌స్పెక్టర్ సూర్రెడ్డిగా సూర్య, లాయర్ చందర్రావుగా బ్రహ్మాజీ పాత్రోచితంగా నటించారు. ప్రధానమంత్రిగా కోట శ్రీనివాసరావు నటనకు మనం వంక చెప్పేదేముంది! కానీ ప్రధానిగా అతను పరిచయమయ్యే సన్నివేశాలు ఆ స్థాయికి తగ్గట్లు లేవు. చలపతిరావు, మేల్కోటే, రాజారవీంద్ర ఓకే.
టెక్నీషియన్ల పనితనం:
కథతో పాటు ఈ సినిమాకి మాటల్ని కూడా పతంజలే రాశారు. సన్నివేశాలకు తగ్గట్లు ఆయన కలం చురుగ్గా సంభాషణలు పలికించింది. వ్యవస్థ మీద ఆయన విసిరిన చెణుకులు, వ్యంగ్యాస్త్రాలు చప్పట్లు కొట్టేలా చేస్తాయి. చాలా సన్నివేశాలకు ఆయన సంభాషణలే టానిక్. పాటలకు నూతన సంగీత దర్శకుడు జాన్ పి. వర్గి బాగానే బాణీలిచ్చాడు. టైటిల్ సాంగ్‌లో వచ్చే బాణీలు మెచ్చదగ్గ రీతిలో వున్నాయి. అనూప్ నేపథ్య సంగీతం ఎఫెక్టివ్‌గా వుంది. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాల్లోని వాతావరణానికి తగ్గట్లు లైటింగ్ వుపయోగించి సన్నివేశాలకు గాఢతని తెచ్చాడు.
బలాలు, లోపాలు:
కథాంశంలోని నవ్యత, టాబు పాత్ర, ఆమె నటన, పతంజలి సంభాషణలు, సంగీతం, రీ రికార్డింగ్, సినిమాటోగ్రఫీ బలాలు. అన్నీ నెగటివ్ పాత్రలు కావడం, సీరియస్‌నెస్ ఎక్కువై ఆహ్లాదాన్ని కలిగించే సన్నివేశాలు లేకపోవడం, కమర్షియాలిటీని మిస్సవడం, కథనంలో స్పీడు లేకపోవడం, క్లైమాక్స్ అసంపూర్ణంగా వుండడం.. లోపాలు. సీరియస్ సినిమాల్ని ఇష్టపడే వాళ్లని మాత్రమే ఈ సినిమా సంతృప్తిపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Wednesday, July 7, 2010
Lakshmi Prasanna as an evil force

విలక్షణ నటునిగా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నటుడు మోహన్‌బాబు ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్ హీరోలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె లక్ష్మీప్రసన్న సైతం తెరంగేట్రం చేస్తుండటం తాజా విశేషం. సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఇంకా పేరు పెట్టని సినిమాలో లక్ష్మీప్రసన్న ఒక కీలక పాత్రని పోషిస్తున్నారు.
సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా కమల్‌హాసన్ కుమార్తె శ్రుతీహాసన్ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతోంది. తొలిగా 'బొమ్మలాట' అనే బాలల సినిమాని రూపొందించి, ఆ సినిమాతో జాతీయ అవార్డుని సైతం సాధించిన ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ తొలి కమర్షియల్ సినిమాని కె. రాఘవేంద్రరావుకి చెందిన ఎబోడ్ సంస్థతో పాటు ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ సంయుక్తంగా నిర్మిస్తుండటం మరో విశేషం.
భారీ బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ ఎడ్వంచరస్ ఫిలింగా ఈ సినిమా తయారవుతోంది. అంగ రాజ్యం నేపథ్యంలో నడిచే ఒక తొమ్మిదేళ్ల బాలిక జీవిత పయనం ఈ సినిమా కథ. ఆ బాలిక పాత్రని పలు హిందీ, తెలుగు సినిమాల్లో నటించి అవార్డులు పొందిన బాల నటి శ్రియాశర్మ పోషిస్తోంది. అద్భుత శక్తులు కలిగిన ఆ బాలిక ఒక దుష్టశక్తి నుంచి అంగరాజ్యాన్ని కాపాడేందుకు చేసే అన్వేషణ ఆసక్తి దాయకంగా ఉంటుంది. బాలికకు సాయం చేసే పాత్రలో సిద్ధార్థ్, అతని ప్రేయసిగా శ్రుతీహాసన్ కనిపిస్తారు.
ఇప్పటికే టెలివిజన్‌లో 'లక్ష్మీ టాక్ షో' ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న లక్ష్మీప్రసన్న ఈ సినిమాతో పూర్తి స్థాయి నటిగా మారుతున్నారు. ఆమె పాత్ర ఏమిటన్నది దర్శక నిర్మాతలు గోప్యంగా ఉంచుతున్నప్పటికీ, ఒక మాంత్రికురాలి తరహాలో నెగటివ్ రోల్‌ని ఆమె చేస్తున్నట్లు యూనిట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో లక్ష్మీప్రసన్న అమెరికన్ టీవీ సీరిస్ 'లాస్‌వేగాస్'లోనూ నటించిన సంగతి గమనార్హం.
Wednesday, June 16, 2010
Future awaits for 'Jessie'
యువతని "జెస్సీ తెలుసా?" అని అడిగి చూడండి. "ఎందుకు తెలీదు. అందుకే కదా కార్తీక్ (నాగచైతన్య) 'ఏమాయ చేసావె' అన్నాడు" అంటారు ఠక్కున. అంతలా జెస్సీ పాత్రతో ఆకట్టుకుంది, అలరించింది మృదుమధురంగా కనిపించే సమంత. అక్కినేని నాగేశ్వరరావు అంతటాయన్ని కూడా తన అభినయంతో మెప్పించిన ఆమె ఇప్పుడు ఒకదాని వెంట ఒకటిగా క్రేజీ హీరోల సినిమాల్లో ఎంపికవుతూ, తోటి తారలకు అసూయ రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఎన్‌టీఆర్ సరసన రెండో నాయికగా 'బృందావనం'లో నటిస్తున్న ఆమె మరో రెండు పెద్ద సినిమాల్లో నాయికగా ఎంపికైంది. వాటిలో మొదటిది అగ్ర కథానాయకుడు మహేశ్ సరసన కావడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. అలాగే 'బొమ్మరిల్లు' హీరో సిద్ధార్థ్‌తో దిల్ రాజు నిర్మించనున్న చిత్రంలోనూ ఆమె నాయికగా ఎంపికైంది. వేణు శ్రీరాం అనే దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నాడు. ఇలా క్రేజీ ప్రాజెక్టుల్లో నటించే అవకాశాలు పొందుతున్న సమంత పూర్వీకులు తెలుగువాళ్లే అయినా తల్లి మలయాళీ కావడం, పుట్టిందీ, పెరిగిందీ చెన్నైలో కావడం వల్ల తెలుగు తెలీకుండా పెరిగింది. చెన్నైలోని స్టేరీ మెల్లా కాలేజీలో బీకాం చదివేప్పుడు ఆమెకి మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో ఓ తమిళ సినిమాలోనూ నాయికగా ఎంపికై, డైరెక్టర్ గౌతం మీనన్ దృష్టిలో పడింది. మొదట సినిమాల్లో చెయ్యడానికి వెనుకాడి, చివరికి 'ఏమాయ చేసావె'తో పరిచయమయ్యింది. దాంతో ఆమె దశే తిరిగింది. రాత్రికి రాత్రే యువతరం ఆరాధ్య తారగా మారింది. అందుకు తగ్గట్లుగా పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తుండటంతో భవిష్యత్ టాప్ హీరోయిన్ ఆమే అంటున్నాయి సినీ వర్గాలు. ఇక కాజల్ అగర్వాల్ జాగ్రత్తగా ఉండాల్సిందే!
Subscribe to:
Posts (Atom)


