'కల్చర్' అనే ఇంగ్లీష్ మాటకు సమానార్థకమైన దాన్నిగా 'సంస్కృతి'ని మనం వాడుతున్నాం. అమరకోశంలో ఈ శబ్దం లేదు. బ్రౌణ్యంలో ఇది కనిపించదు. 'శబ్ద రత్నాకరం', 'శబ్దార్థ చంద్రిక'లను దీనికోసం వెదకడం వృథాశ్రమ. 'సూర్యరాయాంధ్ర నిఘంటువు', 'వావిళ్ల నిఘంటువు'లో ఈ పదానికి చోటు దక్కలేదు. అయితే అన్నింటిలోనూ 'సంస్కృతము' కనిపిస్తుంది. ఈ మాటకు శబ్ద రత్నాకరమిచ్చే అర్థం విశేష్యంగా 'దేశభాష', అన్య విశేషణంగా - చక్కగా జేయబడినది, చక్కజేయబడినది, అలంకరించబడినది, వ్యాకరణ శిక్షితమైనది, పక్వము చేయబడినది, శ్రేష్ఠమైనది - అని. ఈ విశేషణాల్లో కొన్ని 'కల్చర్'కు వర్తిస్తాయి కాబట్టే, 'సంస్కృతము' నుంచి వచ్చిన ఈ కొత్త పదం 'సంస్కృతి' వేగంగా సర్వజనామోదం పొంది, బహుళ వ్యాప్తిలోకి వచ్చింది. తెలుగులోనే కాక హిందీ, బెంగాలీ వంటి ఇతర భాషల్ల్లోనూ ఇది విశేష ప్రచారంలో ఉంది.
'కల్చర్' అనే మాటను షేక్‌స్పియర్, మిల్టన్, బైరన్, షెల్లీ వంటి పూర్వ ఆంగ్ల కవులెవరూ ఉపయోగించలేదు. ఎన్. బెయిలీ 1736లో ప్రచురించిన తన ఇంగ్లీష్ డిక్షనరీలో 'కల్చర్'కు సేద్యాన్ని ప్రధానార్థంగా పేర్కొని, ఉత్తమ వాద్యంతో మానసిక వికాసానికి, దాన్ని పర్యాయపదంగా ప్రయోగించవచ్చని సూచించాడు. సంస్కృతి అనే ఇప్పటి అర్థాన్ని 'కల్చర్'కు కల్పించినవారిలో అమెరికన్ రచయిత ఆర్.డబ్ల్యు. ఎమర్సన్, బ్రిటీష్ రచయిత మాథ్యూ ఆర్నాల్డ్ అగ్రగణ్యులు. ఈ ఇద్దరూ 19వ శతాబ్దానికి చెందినవారే.
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ వివరణ ప్రకారం 'కల్చర్'కు మొదట్లో ఉన్న అర్థం 'టిల్లేజ్' (సేద్యం) అని మాత్రమే. ఫ్రెంచి అకాడమీ వాళ్లు తమ నిఘంటువులో 'కల్చర్' అనే పదాన్ని లలిత కళల పట్ల, మానసిక వికాషం పట్ల ఆసక్తి అనే వివరణతో 1762లో తొలిసారిగా ప్రవేశపెట్టారు. మానవ నాగరికత చరిత్రను 'ద స్టోరీ ఆఫ్ సివిలైజేషన్' పేరుతో ప్రతిభావంతంగా రాసిన రాసిన అమెరికన్ రచయిత విల్ డూరాంట్ వివరణ ప్రకారం మొదట్లో 'కల్చర్' అనేది వ్యక్తమైంది 'అగ్రికల్చర్' రూపంలోనే.
Showing posts with label culture. Show all posts
Showing posts with label culture. Show all posts
Sunday, October 2, 2011
Friday, September 30, 2011
సంస్కృతి: భాష, సంస్కృతి ఒకటేనా?
భాషపై మనకున్న ప్రేమ, గౌరవం కొద్దీ సంస్కృతికి అదే విధానమని చెప్పడం సరైంది కాదు. భాషా ప్రభావం సంస్కృతిపై ఎక్కువగానే పడుతుంది. కాని, అంతమాత్రం చేత భాషే సంస్కృతి కాదు. భాషకే కాక, భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు సైతం సంస్కృతి స్వరూప స్వభావాల నిర్ణయంలో తగినంత ప్రాధాన్యం ఉంటుంది. భారతీయ సంస్కృతిపై ఇక్కడి హిమాలయాల, ఇక్కడి మహానదుల ప్రభావం స్పష్టం. సింధు, గంగా, యమునలకు జన్మస్థానం హిమాలయాలే. హరప్ప, మొహంజోదారోలు, ఇంద్రప్రస్థ, పాటలీపుతలు, వారణాసి, ప్రయాగలు, ఢిల్లీ, ఆగ్రాలు - ఆ నదీ తీరాలలోనో, వాటి లోయల్లోనో విలసిల్లిన మన జాతీయ సంస్కృతీ కేంద్రాలు. బౌద్ధ శిల్పకళ మహోన్నత శిఖరాల్ని అందుకున్నది కృష్ణానదీ పరిసరాల్లో. ఆంధ్ర మహాభారత రచన శ్రీకారం చుట్టుకుంది గోదావరి గట్టున. 'ఓం తత్సత్'ని రాసింది పెన్నానది ఒడ్డున. విజయనగర సామ్రాజ్య సంస్థాపన జరిగింది తుంగభద్ర తీరాన.
భాషాప్రభావానికి సంస్కృతి కొంతవరకు లోనవుతుంది కాబట్టి భాషకు, సంస్కృతికి భేదమే లేదనడం కరక్టేనా? భాషనే సంస్కృతిగా పేర్కొనడం భాష గురించీ, సంస్కృతి గురించీ మనకేమీ తెలీదని చాటుకోవడమే! ఒకరి భాష మరొకరికి పట్టుబడినట్లు, ఒకరి సంస్కృతి మరొకరికి సంక్రమించదు. బ్రిటీష్ వాళ్లు రెండు శతాబ్దాలపాటు మనదేశాన్ని పాలించడంతో మనలో చాలామందికి ఇంగ్లీసు భాషతో పరిచయమేర్పడింది. చాలామంది అందులో పండితులయ్యారు కూడా. అయినంత మాత్రాన బ్రిటీష్ సంస్కృతి మన వారసత్వమైందా?
సంస్కృతి అంటే భాష కాదు సరికదా, కొందరు చెబుతున్నట్లు అది ఆధ్యాత్మిక సంబంధమైందీ కాదు. అదే అయితే ఆధ్యాత్మిక దృష్టిలేనివాళ్లని సంస్కృతీ విహీనులనవలసి వస్తుంది. అప్పుడు నిరీశ్వరవాదులైన మార్క్స్, ఏంగెల్స్ వారసులైన కమ్యూనిస్టులందరూ సంస్కృతిలేనివాళ్లని చెప్పాల్సి వస్తుంది. అది తప్పు కాదా? ఆధ్యాత్మిక ప్రపంచానికి సంస్కృతిని పరిమితం చేయడం భాషకు మారుగా మతానికి, లేదా, దార్శనికానికి దాన్ని ఓ పర్యాయపదం చేయడమే అవుతుంది.
భాషకు భిన్నమైనట్లే మతానికీ, దార్శనికానికీ సైతం సంస్కృతి భిన్నం. జీవితానికున్న విస్తృతి, దానికున్న వైవిధ్యం, దానిలో ప్రస్ఫుటమవుతూ ఉండే విలక్షణత్వం సంస్కృతికీ ఉంటుంది. అందువల్లనే సంస్కృతిని నిర్వచించడం కష్టం.

Thursday, August 26, 2010
Society: Reality Shows - A Bad Phase

రియాలిటీ షోల పేరిట పిల్లల చేత చేయిస్తున్న నృత్యాలు హద్దు మీరుతున్నాయనడంలో సందేహం లేదు. దీనిని పిల్లలను కళారంగంలో ప్రోత్సహించడంగా చెప్పుకోవడమూ సబబుగా లేదు. ఈ కార్యక్రమాలలో పాల్గొనేదే పన్నెండేళ్ల లోపు పిల్లలు. వీరి చేత అసభ్య నృత్యాలు చేయించడమే అభ్యంతరకరం. చిన్నారి బాలిక హావ భావాలు ఒలికిస్తూ ఒళ్ళు విరుస్తూ ఒక మగాడి చూట్టూ ఎగరడం, అతడి ఒళ్ళో చేరి అసభ్య విన్యాసాలు చేయడం వంటి జుగుప్సాకర రీతిలో ఈ కార్యాక్రమాలు సాగుతున్నాయి. ఉల్లాసంగా సాగాల్సిన బాలల కళా కార్యక్రమాన్ని పోటీ సంస్కృతి మరింత అమానుషంగా మార్చింది. పోటీలో నెగ్గడం కోసం పిల్లల చేత వయసుకు మించిన, కటువైన మాటలు మాట్లాడిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిక కావడం మాత్రమే కళా నైపుణ్యానికి గీటురాయి కాదనీ, వీరు చిన్న పిల్లలు కనుక అందరికీ ఎంతో భవిష్యత్తు ఉందనీ బోధించాలి. కానీ తిరస్కృతులైన బాలలు, వారి తల్లిదండ్రులు కంటతడి పెట్టడాన్ని బాదాకరమైన రీతిలో చూపిస్తున్నారు. దీనివల్ల కార్యక్రమం రక్తికడుతుందని నిర్వాహకులు భావిస్తున్నట్టుంది. కానీ ఈ క్రమంలో బాలలు అనుభవించే క్షోభను వారు గుర్తించడం లేదు. జుగుప్సాకర చేష్టలు పిల్లల చేత చేయించడం, వారి హావభావాలను, విన్యాసాలను 'పెద్దలు' ప్రశంసించడం - బాల వీక్షకులపై కూడా ప్రభావం చూపుతుంది. స్త్రీని భోగవస్తువుగా చూపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పసికూనల చేత కూడా అసభ్య నృత్యాలు చేయించడం భావ్యం కాదు. ఆ ఆటపాటలకు అర్థమేమిటో ఆ పిల్లలకూ తెలీదు. ఇతరుల వినోదం కోసం వారు తైతక్కలాడవలసి వస్తున్నది.
అసభ్య విన్యాసాలైనా, శాస్త్రీయ నృత్యమైనా పిల్లలకు వారి వయసుకు మించి నేర్పడం కూడా అభ్యంతరకరమే. తల్లిదండ్రులు తమ చదువు సంద్యలపై, కళానైపుణ్యంపై గొప్పగా చెప్పుకోవడం కోసం పిల్ల్లకు కఠోర శిక్షణ ఇప్పించడం బాలల హక్కులను హరించడమే. జంతువుల చేత సర్కస్ ఫీట్లు చేయించడం కూడా నేరమని భావిస్తున్న కాలంలో చిన్నపిల్లల చేత ఇంతగా విన్యాసాలు చేయించడం వికృత వినోదమే.
Subscribe to:
Posts (Atom)