Showing posts with label pawan kalyan. Show all posts
Showing posts with label pawan kalyan. Show all posts
Monday, November 9, 2015
Friday, October 16, 2015
Wednesday, September 30, 2015
Sunday, May 31, 2015
Pandaga Chesko (2015) Movie Review
తెలుగు సినిమా ఎదగడం లేదని ఎంత మొత్తుకుంటే ఏం లాభం? జాతీయ సినిమా యవనికపై తెలుగు సినిమా స్థాయి ఇంతగా దిగజారిపోతోందనే ఆవేదన పట్టేదెవరకి? అవే మూస కథలు, అవే మూస పాత్రలు, అవే మూస సన్నివేశాలు తెరపై దాడిచేస్తుంటే తట్టుకోలేక తలలు పట్టుకొని, తిట్టుకుంటూ హాలు బయటకు వచ్చే సగటు ప్రేక్షకుణ్ణడిగినా చెబుతున్నాడు - ‘ఎన్ని సినిమాలని చూస్తామండీ. అవే సీన్లు, అవే డైలాగులు. కొత్తగా ఒక్క సీనన్నా లేదండీ’ అని. అందుకు అసలు సిసలు ఉదాహరణగా వచ్చింది ‘పండగ చేస్కో’. ఈ సినిమా చూసినవాళ్లలో ఎవరు పండగ చేసుకున్నారో తెలీదు కానీ, దీనికి పెట్టిన ప్రతి పైసా ‘దండగ’ అనేవాళ్లే ఎక్కువ. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారబ్బా! అనే ఆశ్చర్యం కలిగితే తప్పేమీ లేదు. ఎందుకంటే ఇది ఫక్తు ‘ఎ’ టైపు సినిమా. తెరమీద 70 శాతం సన్నివేశాలకు మించి ‘కామ’ రసం ప్రవహిస్తూనే ఉంటుంది మరి! చాలా పాత్రలు ‘కామం’తో దహించుకుపోతూ కనిపిస్తుంటాయి. హీరో సహా చాలామంది డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు డైలాగులతో ‘రచ్చ రచ్చ’ చేసేస్తుంటారు. ఒకట్రెండు డైలాగులని సెన్సార్ వాళ్లు ‘మ్యూట్’ చేసినా, ఎక్కువ శాతం బూతుల్ని అలాగే ఉంచేశారు.
ఈ దండగమారి సినిమా చూస్తున్నంత సేపూ అనేక తెలుగు సినిమాల సన్నివేశాలు, పాత్రలు మన మనసులో మెదులుతుంటాయి. ఒకట్రెండు సినిమాల పేర్లయితే ప్రస్తావించవచ్చు. తెలుగులో విడుదలయ్యే ప్రతి నాలుగు ‘కమర్షియల్ ఎంటర్‌టైనర్స్’లో మూడు సినిమాలు ఇదే తరహాలో ఉంటున్నవే. ఈ సినిమా ఇతివృత్తం చెబితే నిజమేనని ఎవరైనా తలాడిస్తారు. పోర్చుగల్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి యజమాని అయిన కార్తీక్ పోతినేని (రామ్)ది పూర్తిగా బిజినెస్ మైండ్. అలాంటి మైండ్‌సెట్టే ఉన్న అనుష్క (సోనాల్ చౌహాన్) అనే ఇంకో వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా నిశ్చితార్థం కూడా చేసుకుంటాడు. కానీ పాతికేళ్ల క్రితం పుట్టింటితో వేరుపడిన తల్లి (పవిత్రా లోకేశ్) ఫ్లాష్‌బ్యాక్ తెలిసి హైదరాబాద్‌కు వస్తాడు. తనెవరో చెప్పకుండా మేనమామ (సంపత్) ఇంట్లోనే ఉండి, ఆయన కూతురైన దివ్య (రకుల్‌ప్రీత్ సింగ్)తో పెళ్లికి ఆమోదం పొందుతాడు. చివరకు విడిపోయిన అన్నా చెల్లెళ్లను కలుపుతాడు. ఇది చదివాక వెంటనే గుర్తొచ్చే సినిమా ‘అత్తారింటికి దారేది’. అందులో హీరో పవన్‌కల్యాణ్ తనెవరో చెప్పకుండా మేనత్త ఇంటికి వస్తాడు. ఇందులో హీరో రామ్ మేనమామ ఇంటికి వస్తాడు. అంతే తేడా. అంటే ఈ సినిమాకు ‘పండగ చేస్కో’ అని కాకుండా ‘మామగారింటికి దారేది’ అని పెట్టినా సరిపోతుంది. ఇక ఎప్పట్లాగే హీరోకీ, హీరోయిన్ ఫ్యామిలీకీ మధ్య ‘దాగుడుమూతలాట’ షురూ. ఈ మధ్య కాలంలో ఈ తరహా దాగుడుమూతలు లేని సినిమాలేవో వేళ్లమీద లెక్కించవచ్చు. అదనంగా ఇందులో ఇంకో పాత్రని ప్రవేశపెట్టారు. అది సాయిరెడ్డి (సాయికుమార్) పాత్ర. ఈ పాత్ర క్లైమాక్స్‌లో సెంటిమెంట్‌కు బాగా పనికొచ్చింది. చివరలో సెంటిమెంట్ రసం పావుగంట సేపు ప్రవహించేసరికి కళ్లలో నీళ్ల బదులు రక్తం కారుతుందంతే! ఈ సినిమాకి సంబంధించి ‘గట్టి’గా చెప్పుకోవాల్సింది నాలుగు డోసులెక్కువగా ఉండే ‘కామ’ రసం గురించే. అనుష్క అనే కేరక్టర్‌ని చూసినప్పుడల్లా ‘వీకెండ్ వెంకట్రావు’ (బ్రహ్మానందం) ఒళ్లు చిమచిమలాడిపోతూ ఉంటుంది. ఓసారి అతణ్ణి చూసి కార్తీక్ అననే అంటాడు - ‘ఏంటండీ కళ్లల్లో కామరసం అలా కారిపోతోంది’ అని. అంటే అనుష్క కనిపించిందంటే చాలు, వెంకట్రావు కళ్లతోటే ఆమె అందాన్ని ‘జుర్రేసుకుంటూ’ (ఈ పదం వాడినందుకు క్షమించాలి) ఉంటాడు. ప్రతిసారీ అతడి కళ్లు కామరసాన్ని కార్చేస్తుంటే కుటుంబ ప్రేక్షకులు ఆ జుగుప్సను భరించలేక ఎంత ఇబ్బందిగా కుర్చీల్లో కదులుతుంటారో ఊహించుకోవాల్సిందే. వెంకట్రావు ఒక్కడే అలా ప్రవర్తిస్తున్నాడనుకునేరు. హీరోయిన్ ముగ్గురు బాబాయిలు (రఘుబాబు, బ్రహ్మాజీ, శ్రవణ్) ఇరవై ఏళ్ల నుంచీ భార్యలకు దూరంగా ఉండాల్సి వచ్చి, ఆ తర్వాత ఒకసారి వాళ్లు తమ వచ్చేసరికి ‘తట్టుకోలేక’, కామ (‘శృంగారం’ కాదు) పీడితులైన పురుషుల్లాగా, వాళ్లమీద పడిపోతూ ఉంటారు. వాళ్ల హావభావాలు, మాటలు ఎంత ‘పచ్చి’గా ఉంటాయో చెప్పలేం, ‘ఇంగితం’ అనేది ఒకటి మనలో ఇంకా ఉంది కాబట్టి.
స్త్రీ పాత్రలపై చిన్నచూపు
దర్శకుడికి స్త్రీల పట్ల సదవగాహన లేదోమో అనిపిస్తుంటుంది, సినిమా చూస్తున్నంత సేపూ. సోనాల్ చౌహాన్ చేసిన అనుష్క పాత్రను డబ్బు యావ తప్ప మానవత్వం ఏమిటో తెలీని ఓ మృగం తరహాలో చిత్రీకరించాడు. హీరో కార్తీక్‌ను పెళ్లాడాలనుకున్న ఆమె చివరకు రూ. 3 వేల కోట్ల కోసం పక్కా రౌడీ అయిన అభిమన్యుసింగ్‌ను పెళ్లాడటం ఎంత ఫూలిష్‌గా ఉంటుందో! బద్ధ శత్రువుల్లాగా ఉండే తండ్రినీ, మావయ్యనీ కలపాలనే ఉద్దేశంతో వాళ్లకు కనిపించకుండా అజ్ఞాతంలో ఓ ఫేస్‌బుక్ ఫ్రెండ్ అయిన స్వాతి (తేజస్విని) ఇంట్లో ఉండే హీరోయిన్ దివ్య ‘గ్రీన్ ఆర్మీ’ పేరుతో ఉద్యమాన్నే నడపడం చూసి ముక్కుమీదే కాదు, ‘ఇంకెక్కడైనా’ వేలు పెట్టేసుకోవచ్చు. ఛ.. ఈ దండగ సినిమా చూశాక మనక్కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తున్నాయ్ బాబోయ్. మొక్కల కోసం, పచ్చదనం కోసం దివ్య చేసే ఉద్యమాన్ని టీవీలు ప్రసారం చేస్తున్నా, ఆమె ఎక్కడుందో పాపం.. వాళ్ల నాన్నకూ, మావయ్యకూ తెలీదు. చిత్రమేమంటే స్వాతి ఇంట్లో ఉన్నంత సేపే ‘గ్రీన్ ఆర్మీ’ ఉద్యమాన్ని నడుపుతుంది దివ్య. తమ ఇంటికి వచ్చేస్తే ఆ ‘గ్రీన్’ సంగతి మచ్చుకి కూడా ఆమెకు జ్ఞాపకముండదు. ఇక ఆమె చేసే ఉద్యమమంటే మన హీరోకు ఎంత చులకనో! మొక్కలనూ, పిచుకలనూ ఎంత తక్కువచేసి మాట్లాడుతుంటాడో! ఇక దివ్య ఫ్రెండ్ స్వాతి పాత్రను దర్శకులు మలిచిన తీరు మరీ ఘోరం. ఎవరికి పడితే వాళ్లకు పడిపోతుందని ఆమెని ప్రేమించిన కొండయ్య (వెన్నెల కిశోర్) మాత్రమే కాదు, ఆమెను కన్న తండ్రి ఎమ్మెస్ నారాయణా తెగ బాధపడితుంటారు. ఆమెను ఒంటరిగా వదిలేస్తే కష్టమని డైరెక్టుగానే చెప్పేస్తుంటారు. సినిమా మొదట్లో హీరోకు ఓ చెల్లెల్ని చూపించారు. మధ్యలో ఆమె పాత్ర ఉన్నదనే విషయం మర్చిపోయారు.
కార్తీక్ కేరక్టర్‌లో రామ్ ‘ఓవరాక్షన్’ చేసేశాడు. ‘అండరాక్టింగ్’ చేయాల్సిన చోట కూడా ‘నేను వెనక్కి తగ్గేది లేదు’ అన్నట్లుగా అతి నాటకీయత ప్రదర్శించాడు. చాలా సన్నివేశాల్లో.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఐదు నిమిషాల పైగా డైలాగులు, హావభావాల విషయంలో పవన్‌కల్యాణ్‌ను మక్కీకి మక్కీ అనుకరించేశాడు (‘అత్తారింటికి దారేది’లో రైల్వే స్టేషన్‌లో మేనత్త నదియా వద్ద పవన్‌కల్యాణ్ చెప్పే డైలాగులు గుర్తున్నాయి కదూ). రామ్ దెబ్బకు ఓవరాక్టింగ్‌కు పెట్టింది పేరైన సాయికుమార్ సైతం డౌనైపోయాడు. దివ్యగా హీరోయిన్ పాత్రలో రకుల్‌ప్రీత్ క్యూట్‌గా ఉంది. సినిమాలో కాస్త చూడబుద్ధేసిన ముఖం ఆమెదే. తన పరిధిలో ఆ పాత్రను బాగానే చేసింది. హీరోయిన్ తండ్రిగా సంపత్, మేనమామగా సాయికుమార్, హీరో తల్లిదండ్రులుగా పవిత్రా లోకేశ్, రావు రమేశ్ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. సోనాల్ చౌహాన్ పాత్రనూ, ఆ పాత్రలో ఆమె అభినయాన్నీ భరించలేం. ఎమ్మెస్ నారాయణ వంటి హాస్యనటుణ్ణి డబుల్‌మీనింగ్ డైలాగుల కోసం ఉపయోగించుకోవడం బాధని కలిగిస్తుంది. ‘వీకెండ్ వెంకట్రావు’ పాత్రలో కామరసాన్ని బీభత్సంగా కురిపించేసి, ఆ పాత్రను పూర్తిగా ‘పెద్దలకు మాత్రమే’గా మార్చేశాడు బ్రహ్మానందం. కొండయ్య పాత్రలో అమాయకత్వాన్ని పండించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు వెన్నెల కిశోర్.
సాంకేతిక వర్గంలో ఎక్కువ మార్కులు పడేది సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణానికే. సినిమా ఎలా ఉన్నా ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉందంటే అది కెమెరా పనితనం వల్లే. తమన్ డప్పు సంగీతంలో కొత్తగా వినిపించిన బాణీలేమీ లేవు. పాటలు ఎంత రిచ్‌గా తీసినా, వినసొంపుగా లేవు. టైటిల్ సాంగ్ వచ్చేసరికి ప్రేక్షకులు రిలీఫ్ కోసం కుర్చీల్లోంచి లేస్తున్నారు. వెలిగొండ శ్రీనివాస్ రాసిన పాచిపోయిన కథకు, కోన వెంకట్ డబుల్ మీనింగ్, ‘అడల్ట్’ డైలాగులు తోడై, ఈ సినిమాను కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉండాల్సిన సినిమాగా చేశాయ్.
ట్యాగ్‌లైన్ : డబ్బు ‘దండగ’ చేస్కో..
- ఆంధ్రజ్యోతి డైలీ, 30 మే 2015
Sunday, December 28, 2014
Saturday, October 18, 2014
Saturday, July 19, 2014
Thursday, July 10, 2014
Wednesday, July 2, 2014
Cinema: Interview with Actor Venkat
తెలుగు చిత్రసీమను బాగు చెయ్యాలి: వెంకట్
"ప్రజలకు మంచి చేయడానికి ఎలా రాజకీయాల్లోకి వచ్చారో, అలాగే తెలుగు చిత్రసీమను బాగు చెయ్యడానికి పవన్‌కల్యాణ్ నడుం బిగించాలని కోరుకుంటున్నా. ఆయనొక్కరే ఏమైనా చెయ్యగలరనిపిస్తోంది. ఈ విషయంపై మాట్లాడేందుకు ఆయన్ని కలవాలనుకుంటున్నా'' అని చెప్పారు వెంకట్. 'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ' వంటి హిట్ సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన చక్కని నటునిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, కొంతకాలంగా ఆయనకు సరైన అవకాశాలు లేకుండా పోయాయి. కొంత విరామంతో ఇప్పుడు ప్రేమ్ మూవీస్ పతాకంపై ప్రేమ్‌కుమార్ పట్రా సమర్పిస్తోన్న 'ఆ ఐదుగురు' చిత్రంలో ఐపీఎస్ ఆఫీసర్‌గా శక్తిమంతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్ జేసన్ గూడూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా పత్రికలవారితో వెంకట్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...ఒక ఐపీఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రయి, సమాజాన్ని మార్చడానికి ఏం చేశాడనేది 'ఆ ఐదుగురు'లోని ప్రధానాంశం. ముఖ్యమంత్రయ్యాక ఆయన నెక్స్‌ట్ జనరేషన్ ఫోర్స్ (ఎన్.జి.ఎఫ్.) అనే ఓ దళాన్ని ఏర్పాటుచేస్తాడు. నలభైమంది సభ్యుల ఆ బృందానికి శిక్షణనిచ్చే ఐపీఎస్ ఆఫీసర్‌గా నేను నటించాను. సీఎంగా వాసు అనే కొత్త నటుడు చేశారు. నలభై మంది బృందంలోని వాళ్లే 'ఆ ఐదుగురు'. మిగతా 35 మంది పాత్రలను నిజమైన పోలీసులే చేశారు. ఈ సినిమాలో నటించడానికి 'అప్పా' (ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ)లో రెండు నెలలపాటు శిక్షణ పొందాను. కాగా ఇందులోని డాక్టర్ పైపుల అనే పాత్రలో చిత్ర సమర్పకులు ప్రేమ్‌కుమార్ పట్రా కామెడీని పంచబోతున్నారు. ఇది యువతకు మార్గదర్శకం చూపించే సినిమా. మంచి సినిమాలు రావట్లేదని ఎప్పుడూ వాపోతూ ఉంటాం. కానీ మంచి సినిమాలు వచ్చినప్పుడు చూస్తున్నామా? ఇది కచ్చితంగా మంచి సినిమా. కమర్షియల్ అంశాలు మేళవించిన మంచి సినిమా.
ఆశాభావంతో ఉన్నా
పోలీసాఫీసర్‌గా నటించడం నాకిదే మొదటిసారి. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలతో పోలిస్తే ఇందులో నా లుక్ డిఫరెంట్. నిజ జీవితంలో ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉంటారో నా పాత్రను అలా చూపించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ అందాల పోటీకి నేను, అస్మితా సూద్ జడ్జీలుగా వెళ్లాం. అందులో మమ్మల్ని చూసిన ప్రేమ్‌కుమార్ గారు ఈ సినిమాలోని కీలక పాత్రలు మేం సరిపోతామని భావించి, మాకు ఈ కేరక్టర్స్‌ని ఇచ్చారు. నా శాయశక్తులా ఆ పాత్రకు న్యాయం చేయడానికి కృషి చేశా. నా శరీరాకృతిని దృఢంగా మలచుకున్నా. స్టంట్స్‌ని డూప్‌లేకుండా చేసే క్రమంలో పై నుంచి కిందపడ్డాను. వెన్నెముక గాయంతో మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నా. ఫలితంగా సినిమా షూటింగ్‌కు అంతరాయం కలిగింది. నా కోసం నిర్మాత ఓపిక వహించారు. 'ఆ ఐదుగురు' విడుదల కోసం ఎదురు చూస్తున్నా. విడుదలయ్యాక నాకు మంచి ఆఫర్లు వస్తాయనే ఆశాభావంతో ఉన్నా. సోలో హీరో కంటే ఇద్దరు, ముగ్గురు హీరోలుంటే సినిమాలు చెయ్యాలనుకుంటున్నా. ఇదివరకు నేను చేసిన అలాంటి సినిమాలు మంచి హిట్టయ్యాయి.ప్రొడక్షన్ అంటేనే భయం
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో పరిస్థితి బాగా లేదు. నిర్మాతలకు మేలు చేకూర్చే వాతావరణం ఇవాళ ఇండస్ట్రీలో అసలు లేదు. సినిమాలు తీసినా డిస్ట్రిబ్యూషన్ చాలా కష్టమైపోతోంది. గతంలో నేను ఓ సినిమాని ప్రొడ్యూస్ చేశాను. ఇవాళ ప్రొడక్షన్ అంటేనే భయమేస్తోంది. కొత్త నిర్మాతలు వస్తున్నా నిజాయితీగా సినిమాలు తీసే నిర్మాతలు తక్కువ. సినిమా నిర్మాణంలో ప్రొఫెషనలిజం తక్కువగా కనిపిస్తోంది. మోజు కోసమో, గ్లామర్ కోసమో వచ్చేవాళ్లే ఎక్కువ కనిపిస్తున్నారు. అలాగే మన సూపర్‌స్టార్ల సినిమాలను కూడా తమిళనాడులో ఎందుకు చూడరో, వాళ్ల సినిమాలను మనమెందుకు చూస్తున్నామో ఆలోచించాలి.విలన్‌గా చేస్తా
నేను ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నా. నెగటివ్ కేరక్టర్లూ చేస్తా. అయితే 'ఈగ'లో సుదీప్ చేసినటువంటి విలన్ కేరక్టర్ అయితేనే. అంటే కథకు ఆ పాత్ర కీలకంగా ఉండాలి.- ఆంధ్రజ్యోతి డైలీ, 2 జూలై 2014
Wednesday, June 18, 2014
Friday, January 3, 2014
Wednesday, January 1, 2014
Monday, December 16, 2013
Saturday, December 14, 2013
Monday, July 8, 2013
Friday, May 31, 2013
Monday, July 2, 2012
'గబ్బర్‌సింగ్' విజయం పవన్‌కల్యాణ్‌కే అంకితం
పవన్‌కల్యాణ్ హీరోగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తాను నిర్మించిన 'గబ్బర్‌సింగ్' చిత్రం శుక్రవారంతో 306 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుందని బండ్ల గణేశ్ చెప్పారు. సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ "మా కెరీర్‌కి అర్థం చెప్పిన చిత్రం 'గబ్బర్‌సింగ్'. 81 సంవత్సరాల తెలుగు చిత్ర పరిశ్రమలో మా సినిమా నెంబర్‌వన్‌గా నిలవడం మా అదృష్టం. మలేషియాలో యాభై రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా ఇదే. ఈ సినిమా ఇంత హిట్టవడానికి హీరో పవన్‌కల్యాణ్ కారణం. మూడో చిత్రమైనా అద్భుతంగా డైరెక్ట్ చేసి, మాటలు రాసిన హరీశ్ శంకర్, తన కెరీర్‌లోనే బెస్ట్ ఆల్బమ్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్, మిగతా టెక్నీషియన్లు, ఆర్టిస్టులు కూడా ఈ విజయంలో భాగమే. జూలై తొలివారంలో భారీ స్థాయిలో అభిమానుల మధ్య యాభై రోజుల వేడుక చేయబోతున్నాం'' అని చెప్పారు.
దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ "నేను తీసిన 'మిరపకాయ్' కంటే ముందే పవన్ కల్యాణ్‌కు సబ్జెక్ట్ చెప్పా. అప్పుడు చేయడానికి కుదరలేదు. కానీ నాతో సినిమా చేస్తానని మాటిచ్చిన ఆయన ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయిన 'గబ్బర్‌సింగ్'ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. నేను మంచి స్క్రిప్టు రాసినా సినిమా ఇంత పెద్ద హిట్టవడానికి కారణం పవన్ కల్యాణ్ పవర్. చేతి మణికట్టు విరిగినా, వెన్నునెప్పి బాధిస్తున్నా లెక్కచెయ్యకుండా మిగతా షూటింగ్‌ని పూర్తిచేశారు. ఆయన అంకితభావానికి ప్రతిఫలం దక్కింది. అందుకే ఈ విజయం పవన్ కల్యాణ్‌కే అంకితం. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా తెలుగులో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది'' అని తెలిపారు.
Monday, June 4, 2012
పవన్‌కల్యాణ్ షో గబ్బర్‌సింగ్
"ఒన్‌మ్యాన్ షో 'గబ్బర్‌సింగ్'. పవన్‌కళ్యాణ్ కాకుండా మరొకర్ని 'గబ్బర్‌సింగ్'గా ఊహించలేను. అన్ని రికార్డుల్నీ క్రాస్‌చేసి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్‌వన్ సినిమా అయ్యింది'' అని చెప్పారు బండ్ల గణేశ్. పవన్‌కల్యాణ్ హీరోగా హరీశ్‌శంకర్ డైరెక్ట్ చేసిన 'గబ్బర్‌సింగ్'ను ఆయన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సందర్భంగా తమ సంస్థ కార్యాలయంలో మాట్లాడారు గణేశ్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
కల్యాణ్ దేనికీ ఎగ్జయిట్ అవరు. సినిమా చూశాక ఆయన నోటినుంచి వచ్చిన ఒకే మాట 'బాగుంది' అని. రికార్డుల గురించీ, కలెక్షన్ల గురించీ ఒక్కసారీ అడగలేదు. మానవ అనుబంధాలకీ, మోరల్స్‌కీ నిలబడే మనిషి కల్యాణ్. సినిమాలో 'రౌడీలతో అంత్యాక్షరి' ఎపిసోడ్ ఆలోచన కల్యాణ్‌ది. అది మినహాయిస్తే 'దబాంగ్'లో లేని సన్నివేశాలు కానీ, ఇతర మార్పులు కానీ అన్నీ హరీశ్‌వే. చాలా గొప్పగా చేశాడు. హరీశ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు 'అతను చెప్పినట్లు తీస్తే ఇండస్ట్రీ రికార్డులు కొడుతుంది' అన్నాడు మా అన్నయ్య శివబాబు. అది నిజమైంది. హరీశ్ స్క్రిప్టు తయారుచేసిన విధానం, అతని డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, శ్రుతీహాసన్ పాత్ర వంటివి కూడా ఈ సినిమా విజయంలో తమ వంతు పాత్ర నిర్వహించాయి.
నా జీవితమే లేదు
'గబ్బర్‌సింగ్'ను తానే సొంతంగా నిర్మిస్తానని ప్రకటించిన తర్వాత నాకివ్వడం నా అదృష్టం. పవన్‌కల్యాణ్ ఎప్పటికీ నాకు వ్యసనమే. ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆయన రెమ్యూనరేషన్ ఎంతనేది మేం మాట్లాడుకోలేదు. చరణ్ పెళ్లయ్యాక విజయోత్సవ సభ పెడదామనుకుంటున్నా. దానికి కల్యాణ్ ఒప్పుకోవాలి. త్వరలో ఆయనతో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడనేది ఆయనతో మాట్లాడాక చెబుతా. చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న నన్ను నిర్మాతని చేసింది పవన్‌కల్యాణ్. ఆయన లేకపోతే నిర్మాతగా నా జీవితమే లేదు.
భయమేస్తోంది
నేనెవరికీ బినామీని కాను. ఇప్పటికే దీనిపై వచ్చిన ప్రచారాన్ని ఖండించా. ఓవర్‌నైట్ ప్రొడ్యూసర్‌ని అయ్యేప్పటికి ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. సినిమా హిట్ కాకపోతే నిర్మాత పరిస్థితి ఘోరం. అందుకని హిట్ సినిమానే తియ్యాలి. 'తీన్‌మార్'తో హిట్ రాలేదని భయపడ్డ నేను 'గబ్బర్‌సింగ్' హిట్‌తో ఇంకా భయమేస్తోంది. రాబోయే సినిమా ఇంకెంత బాగా తియ్యాలనేదే ఆ భయం. తెరపై ఇక నటించాలని నేను అనుకోవడం లేదు. మాస్ నుంచి వచ్చినవాణ్ణి కాబట్టి మాస్ ఎంటర్‌టైనర్స్ అంటేనే ఎక్కువ ఇష్టం.
పెద్ద సినిమాలే చేస్తా
చిన్న సినిమాలు తీసే గట్స్ నాకు లేవు. అందరు అగ్ర హీరోలతోటి పెద్ద సినిమాలే చేస్తా. నేనెవరితో పనిచేసినా, అదే భక్తితో ఆ సినిమా సూపర్‌హిట్ కావాలనే లక్ష్యంతోనే పనిచేస్తా. నేను పవన్‌కల్యాణ్ భక్తుణ్ణయినా, అందరితో బాగుంటా. అందరితో సినిమాలు చేస్తా. అందరితో చెయ్యమని కల్యాణ్ కూడా చెప్పారు. ఎన్టీఆర్, శ్రీను వైట్ కాంబినేషన్ సినిమా 'బాద్‌షా' సినిమా షెడ్యూలు జూన్ 15 నుంచి ఉంటుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. కృష్ణానగర్‌లో నేనూ, పూరి జగన్నాథ్ కలిసి తిరిగాం. 'గబ్బర్‌సింగ్' హిట్‌కి తను ఎంతో ఆనందపడ్డాడు. అక్టోబర్ నుంచి ఆయన డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నా. హీరో ఎవరనేది ఆయనే చెబుతాడు.

Saturday, June 2, 2012
'గబ్బర్‌సింగ్'పై రజనీకాంత్ ప్రశంసలు
విడుదలైన అన్ని చోట్లా సూపర్‌హిట్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్' సినిమాని పర్ఫెక్ట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ అభివర్ణించారు. పవన్‌కళ్యాణ్ 'గబ్బర్‌సింగ్'గా అదరగొట్టేశాడని రజనీ ప్రశంసించారు. గత బుధవారం లోకల్ డిస్ట్రిబ్యూటర్ తరపున చెన్నయ్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక ప్రదర్శనలో రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో సహా 'గబ్బర్‌సింగ్' చిత్రాన్ని వీక్షించారు. సినిమా ఆద్యంతం రజనీ బాగా ఎంజాయ్‌చేశారట. సినిమా ముగిసిన అనంతరం పవన్‌కళ్యాణ్‌కి ప్రత్యేకంగా ఫోన్‌చేసి అభినందించినట్లు తెలిసింది. కాగా, 'గబ్బర్‌సింగ్' ఆంధ్రాలో మాత్రమే కాకుండా, తమిళనాడులో కూడా హిట్ చిత్రంగా నిలిచింది.
Thursday, December 8, 2011
బిగ్ స్టోరీ: కొత్త అవతారం!
ఎన్నడూ లేనివిధంగా తెలుగు కథానాయకులు మూకుమ్మడిగా కొత్తదనం కోసం సిన్సియర్‌గా ప్రయత్నిస్తున్నారు. ఇదివరలో అడపాదడపా మాత్రమే మన హీరోలు కొత్త రూపంతో ప్రేక్షకుల ముందుకు ప్రత్యక్షమయ్యేవారు. ఇప్పుడు అలా కాదు. దాదాపు ప్రతి హీరో మూస పాత్రల నుంచి బయటపడి, కొత్త రూపంతో, కొత్త పాత్రతో ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. హిందీ, తమిళ, మలయాళ చిత్రాలతో పోలిస్తే తెలుగు చిత్రాల్లో ప్రయోగాలు తక్కువ, కొత్తదనం తక్కువ, వాస్తవికత తక్కువ... అనే అభిప్రాయం స్థిరపడిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే హీరోల దృక్పథాల్లో మార్పు వస్తోంది. దర్శకులు కమర్షియల్ కథల్లోనే కొద్దిగానైనా కొత్తదనం ఉండే పాత్రల చిత్రణ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా తెలుగు హీరోలు కొత్త రూపాలతో దర్శనమిస్తున్నారు.
పవన్ కల్యాణ్
ఈ నెల 9న వస్తున్న 'పంజా' చిత్రం పట్ల అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. కారణం, అది పవన్ కల్యాణ్ చిత్రం కావడం, అందునా ఆయన ఇదివరకెన్నడూ కనిపించని రీతిలో గడ్డంతో కనిపిస్తుండటం. తెలుగువాడైనప్పటికీ చెన్నైలో స్థిరపడి తమిళ చిత్రాలతో పాపులర్ అయిన విష్ణువర్ధన్ ఈ సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్‌గా పరిచయమవుతున్నాడు. స్టయిలిష్ టేకింగ్‌తో సినిమాలు రూపొందిస్తాడనే పేరున్న విష్ణు స్టయిలిష్ హీరోగా పేరున్న పవన్‌ను ఇప్పుడు 'పంజా'లో మాఫియా గ్యాంగ్ మెంబర్ జయదేవ్ పాత్రలో గడ్డంతో కొత్తగా చూపిస్తున్నాడు. ఈ కొత్త రూపంలో పవన్ మరింత స్టయిల్‌గా, సరికొత్త అందంతో కనిపిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
నాగార్జున
సమకాలీన హీరోలతో పోలిస్తే భిన్నమైన రూపాలతో ఎక్కువగా కనిపిస్తూ వస్తున్న హీరో నాగార్జున. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' పాత్రలతో మెప్పించిన ఆయన ఇప్పుడు తెలంగాణ పోరాట యోధుడు 'రాజన్న'గా ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి వి. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన మెలితిప్పిన మీసం, పొడవాటి కేశాలు, నుదుటన పొడవాటి తిలకం, మెడలో కండువాతో కొత్త రూపంతో కనిపిస్తున్నారు. స్వాతంత్య్ర పూర్వ కాలం నాటి నేపథ్యంతో తయారైన ఈ సినిమా నాగార్జున కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రం కాబోతోంది.
బాలకృష్ణ
ప్రయోగాలంటే నందమూరి బాలకృష్ణకు ఎంతో ప్రియం. 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' చిత్రాలు అందుకు మంచి ఉదాహరణలు. వాటితో పాటు కొన్ని చారిత్రక పాత్రలు, పౌరాణిక పాత్రలూ ఆయన ధరించారు. మొన్నటికి మొన్న 'సింహా'గా పొడవాటి బుర్ర మీసాలతో కనిపించి, ఆ పాత్రలో గొప్పగా రాణించిన ఆయన నిన్నటికి నిన్న 'శ్రీరామరాజ్యం'లో శ్రీరాముని పాత్రను అద్భుతంగా పోషించి, నేటి కాలంలో పౌరాణిక పాత్రలకు తను మినహా మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించారు. ఇప్పుడు జనవరిలో రాబోతున్న 'అధినాయకుడు' చిత్రంలో తాత, తండ్రి, మనవడుగా త్రిపాత్రాభినయం చేస్తూ ప్రేక్షక లోకంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తి కంబైన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ముఖ్యంగా తాత గెటప్‌లో బాలకృష్ణ ఆహార్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
రాజశేఖర్
భావోద్వేగపూరిత పాత్రలకు పెట్టింది పేరైన రాజశేఖర్ తన కెరీర్‌లో 'ఓంకారం', 'శేషు' వంటి చిత్రాల్లో వైవిధ్య పాత్రలు పోషించారు. తాజాగా ఆయన 'అర్జున'లో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం. కన్మణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్యనారాయణ అనే సామాన్య రైతుగా రాజశేఖర్ కనిపించబోతున్నారు. కొడుకు అర్జున్ సాయంతో సమాజానికి ఆయన ఏం చేంశాడనేది ఇందులోని ప్రధానాంశం. సూర్యనారాయణ పాత్రలో రాజశేఖర్ ప్రదర్శించే భావోద్వేగాలు సినిమాకి హైలైట్ అంటున్నారు.
జగపతిబాబు
కుటుంబ కథాచిత్రాల నాయకుడిగా పేరుపొందిన జగపతిబాబు ఆ ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలనెన్నింటినో పోషించారు. 'గాయం', 'హోమం' వంటివి అందుకు ఉదాహరణలు. ఇప్పుడు 'క్షేత్రం' చిత్రంలో ఆయన చేస్తున్న వీరనరసింహ రాయలు అనే పాత్ర అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మెలి తిప్పిన పొడవాటి బుర్ర మీసాలతో ఆయన కొత్తగా, భిన్నంగా కనిపిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జగపతిబాబు పాత్ర ప్రత్యేకాకర్షణ అనేది దర్శకుడు టి. వేణుగోపాల్ మాట.
రాజేంద్రప్రసాద్
పేరుకి హాస్య చిత్రాల కథానాయకుడే అయినా తన సుదీర్ఘ సినీ జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఆల్‌రౌండర్ అనిపించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్. 'ఎర్ర మందారం', 'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాషి' వంటి చిత్రాలు ఆయన నటనా వైదుష్యానికి నిదర్శనాలు. ఇటీవలే 'క్విక్‌గన్ మురుగన్'గా ప్రపంచ ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఇప్పుడు 'డ్రీమ్' చిత్రంలో సరికొత్త గెట ప్‌తో ఆకట్టుకుంటున్నారు. నూతన దర్శకుడు భవానీ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రంతో రాజేంద్రప్రసాద్ భిన్నమైన హెయిర్ స్టయిల్‌తో మరో ప్రయోగం చేస్తున్నారు.
రానా
ప్రయోగాలకు సీనియర్లే కాదు కుర్ర హీరోలు కూడా సై అంటున్నారు. అనేకమంది నేటి తరం హీరోలు సినిమా సినిమాకీ రూపం మార్చుకుంటూ వస్తుంటే తనూ అదే దారిలో పయనిస్తున్నానంటున్నారు రానా. 'లీడర్', 'నేను నా రాక్షసి' చిత్రాల్లో గడ్డంతో ఓ రకంగా కనిపించిన ఆయన ఇప్పుడు 'నా ఇష్టం' చిత్రంలో షేవ్ చేసిన గడ్డం, మీసంతో కొత్త రూపంతో కనిపించబోతున్నారు. జెనీలియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రకాశ్ తోలేటి దర్శకుడు.

Subscribe to:
Posts (Atom)