Showing posts with label rajamouli. Show all posts
Showing posts with label rajamouli. Show all posts
Sunday, November 1, 2015
Thursday, October 29, 2015
Nani gains momentum
నాని రేంజ్ పెరిగింది
'భలే భలే మగాడివోయ్'తో కెరీర్‌లోని 13 సినిమాల్లో 6వ విజయాన్ని అందుకున్నాడు నాని. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తొలి వారానికి ప్రపంచవ్యాప్తంగా రూ. 14 కోట్లు వసూలు చేసి, అందర్నీ ఆశ్చర్యపర్చింది. నాని కెరీర్‌లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ హిట్ 'ఈగ'. రాజమౌళి డైరెక్టర్ కావడం, భారీ బడ్జెట్‌తో, భారీ ప్రమోషన్‌తో రావడం వల్ల, దాని క్రెడిట్ మొత్తం రాజమౌళికే వెళ్లింది. పైగా అందులో నానిది దాదాపు స్పెషల్ అప్పీరెన్స్ అని చెప్పాలి. కానీ 'భలే భలే మగాడివోయ్' సినిమాకి సంబంధించి డైరెక్టర్ మారుతితో పాటు నానికి కూడా క్రెడిట్ దక్కింది. మతిమరుపు లక్కీ కేరక్టర్‌లో బాగా రాణించి, దాదాపు సినిమానంతా తన భుజాలపై మోశాడు నాని. ఈ సినిమాతో అతని విమర్శకులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మునుపటి సినిమా 'ఎవడే సుబ్రమణ్యం' కూడా మంచి పేరు తెచ్చినా, ఆర్థికంగా లాభాలు తేలేదు. ఇప్పుడు ఇటు ప్రశంసలు, అటు లాభాలు దక్కడంతో బిజినెస్ సర్కిల్స్‌లో నాని స్థాయి పెరిగింది. దీని విజయంతో.. సబ్జెక్టుల విషయంలో నాని మరింత శ్రద్ధ చూపితే రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి 'బ్యాంకబుల్ స్టార్'గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.Thursday, September 3, 2015
Friday, October 10, 2014
Friday, August 26, 2011
న్యూస్: 'పిల్ల జమీందార్'కి బిజినెస్ లేదు!
తెలుగులో ఇటు 'సెగ', తమిళంలో అటు 'వెప్పం' రెండూ ఫట్టయ్యాక ఇప్పుడు నాని తర్వాతి సినిమాపై అందరి దృష్టి మళ్లింది. ప్రస్తుతం అతను రాజమౌళి డైరెక్షన్‌లో 'ఈగ', కొత్త దర్శకుడు అశోక్ తీస్తున్న 'పిల్ల జమీందార్'లో హీరోగా నటిస్తున్నాడు. వీటిలో ముందుగా రాబోతోంది 'పిల్ల జమీందార్'. ఈ సినిమాలో నాని సరసన హరిప్రియ, బిందుమాధవి హీరోయిన్లు. ఆ ఇద్దరూ సాధారణ తారలే కావడం గమనార్హం. భూమిక నిర్మించిన ఫ్లాప్ సినిమా 'తకిట తకిట' ద్వారా హరిప్రియ పరిచయం కాగా, నాలుగైదు సినిమాలు చేసినా ఒక్కటీ హిట్టులేని తార 'బిందుమాధవి'. ఇలాంటి తారలతో నటిస్తున్నందువల్ల ఈ సినిమా పట్ల బిజినెస్ వర్గాలు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీ శైలేంద్ర సినిమాస్ బేనర్‌పై డి.ఎస్. రావు ఈ సినిమా నిర్మిస్తున్నారు. "జమీందారుగా నటిస్తున్న నాగినీడు ('మర్యాద రామన్న' ఫేం), ఆయన మనవడు 'పిల్ల జమీందార్'గా నటిస్తున్న నాని మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి' అని ఆయన చెప్పారు.
ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన సంగతేమంటే అవసరాల శ్రీనివాస్ ఓ కీలక పాత్ర చేస్తుండటం. 'అష్టా చెమ్మా' ద్వారానే నాని, శ్రీనివాస్... ఇద్దరూ పరిచయమయ్యారు. తిరిగి వాళ్లు కలిసి చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే నాని వ్యవహార శైలి పట్ల సినీ వర్గాలు పెదవి విరుస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'పిల్ల జమీందార్' హిట్టయితేనే అతనికి విలువ. లేదంటే ఇబ్బందే.

Thursday, August 11, 2011
ఇంటర్వ్యూ: గేయ రచయిత అనంత శ్రీరాం
"అన్ని రకాల పాటల్లో నాకు శృంగారమంటే ఎక్కువ ఇష్టం. భక్తి పాటని ఎంతగా ఆస్వాదిస్తానో ఎరోటిక్ సాంగ్ రాసేప్పుడు అంతగా ఆస్వాదిస్తా'' అని చెప్పారు యువ గేయ రచయిత అనంత శ్రీరామ్. అతి చిన్న వయసులోనే పాటల రచయితగా చిత్రరంగ ప్రవేశం చేసిన ఆయన అతి తక్కువ కాలంలో అగ్రశ్రేణి గేయ రచయితల్లో ఒకరిగా ఎదిగారు. అన్ని రకాల పాటల్లోనూ ప్రతిభ చూపిస్తున్న ఆయన 'తెలుగమ్మాయి' కోసం రాసిన 'కత్తిలాంటి కుర్రవాడు కళ్లుతిరిగి పడ్డాడు' పాట శ్రోతల నాలుకల మీద నర్తిస్తోంది. చిత్రసీమలో తన ప్రస్థానంతో పాటు గేయ రచనా రంగం గురించి తన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు అనంత శ్రీరామ్. అవేమిటో ఆయన మాటల్లోనే...
నా అనుభవం, అవగాహన మేరకు చిత్రసీమలో గౌరవం, ప్రోత్సాహం, తక్కువ వత్తిడి ఉన్నది గీత రచనా రంగంలోనే. పాట హిట్టయితే సాహిత్యాన్ని చూస్తున్నారు. తద్వారా రచయితకి పేరు వస్తోంది. పాట ఫ్లాపయితే పట్టించుకోరు కాబట్టి వచ్చే నష్టమేమీ ఉండదు. నెల నెలా ఎంతో కొంత ఆదాయం వస్తుంది. మామీద పుకార్లు ఉండవు. క్రేజ్ లేకపోయినా గౌరవం, ఆప్యాయత ఉంటుంది. సౌకర్యవంతమైన రంగం. మిగతా వాటితో పోలిస్తే పోటీ తక్కువ ఉన్న రంగం ఇదే.
ఈ రంగంలో నిరుద్యోగం లేదు
తెలుగు సినిమా రంగంలో ఏడాదికి కనీసం 200 సినిమాలు నిర్మాణమవుతున్నాయి. ఒక్కో సినిమాలో సగటున ఐదు పాటలుంటాయనుకుంటే ఆ అన్ని సినిమాల్లో కలిపి వెయ్యి పాటలుంటాయి. బాగా డిమాండ్ ఉన్న రచయిత నెలకి పది పాటలు, అంటే సంవత్సరానికి 120 పాటలు రాస్తాడు. అలాంటి వాళ్లు నలుగురు ఉన్నారనుకుంటే వాళ్లు రాసేది 480 పాటలు. ఇంకా 520 పాటలు రాసే అవకాశం మిగతా వాళ్లకి ఉంది. సంవత్సరానికి 20 చొప్పున వేసుకున్నా ఇంకో 25 మందికి ఇక్కడ అవకాశం ఉంది. నాకు తెలిసి ఈ రంగంలో నిరుద్యోగం అయితే ఉండదు. ఇక్కడ క్రేజ్‌ని బట్టి, హిట్టుని బట్టి రెమ్యూనరేషన్ ఉంటుంది. పాట రాయడం రాకుండా ఛాన్స్ ఇవ్వమంటే ఇవ్వరు కదా. సామాన్య ప్రజ్ఞాపాటవాలుంటే ఈ రంగంలో ఉపాధి దొరుకుతుంది.
ఊరికే కష్టపెట్టరు
దేవిశ్రీకి పాట నచ్చితే మొదటి వెర్షన్‌కే ఓకే చేసేస్తారు. తనకి కావాలనుకున్నది రాకపోతే 20వ వెర్షన్ అయినా రాయిస్తారు. రచయితని ఊరికే కష్టపెట్టరు. ఆ విషయం అర్థం చేసుకోలేకపోతేనే రచయితకి ఇబ్బంది వస్తుంది తప్పితే కావాలని చెయ్యరు. రాజమౌళి 'యమదొంగ'లో 'నూనూగు మీసాలోడు' పాటని వెంటనే ఓకే చేశారు. అదే 'మర్యాద రామన్న' విషయానికొస్తే 'తెలుగమ్మాయీ..' పాటని ఓకే చెయడానికి 40 రోజులు పట్టింది.
ఓటమిగా భావించేవాణ్ణి
'100% లవ్' సినిమాలో రెండు సన్నివేశాలకి కష్టపడి రాసినా ఓకే అవ్వలేదు. కానీ కష్టపడినందుకు గీతా ఆర్ట్స్ నుంచి డబ్బులు వచ్చేశాయి. ఇట్లాంటివి కెరీర్ మొదట్లో జరిగినప్పుడు బాధపడేవాణ్ణి. దాన్ని ఓటమిగా భావించేవాణ్ణి. అప్పుడు అంత అనుభవం ఉండకపోవడం, మనసు సున్నితంగా ఉండటం కారణం. ఎప్పుడైనా ఏదైనా పాట ఓకే చెయ్యకపోయినా, ఆ తర్వాత అదే దర్శకుడు, అదే సంగీత దర్శకుడు తర్వాత నా చేత రాయించుకున్న సందర్భాలున్నాయి. అందువల్ల ఇప్పుడు ఇలాంటివాటికి మనస్తాపం చెందడం లేదు.
కీరవాణితో ఎక్కువ సౌకర్యం
సంగీత దర్శకుల్లో కీరవాణి గారితో ఎక్కువ సౌకర్యంగా ఫీలవుతా. రచయితకి ఆయన బాగా స్వేచ్ఛనిస్తారు. నాచేత ముందు పాట రాయించి, ఆ తర్వాత ఆయన బాణీలు కట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 'యమదొంగ'లో 'రబ్బరు గాజులు..' పాటని నేను రాస్తే, దానికి ఆయన ట్యూన్ కట్టారు. నాకైతే మొదట పాట రాయడమే హాయనిపిస్తుంది. ట్యూన్‌కి పాట రాయడంలోనే కొంచెం వత్తిడి అనిపిస్తుంది. అన్ని రకాల పాటల్లో నాకు శృంగారమంటే ఎక్కువ ఇష్టం. భక్తి పాటని ఎంతగా ఆస్వాదిస్తానో ఎరోటిక్ సాంగ్ రాసేప్పుడు అంతగా ఆస్వాదిస్తా. నా తొలి చిత్రం 'కాదంటే ఔననిలే'లో 'కర్రా బిళ్లా..' పాట నచ్చి చిరంజీవి గారు 'స్టాలిన్' కోసం 'పరారే పరారే..' పాట రాయించుకున్నారు.
ఆయన ఆరాధ్య రచయిత
ఎప్పటికీ నా ఆరాధ్య రచయిత సీతారామశాస్త్రి గారే. నన్ను పాటలు రాయడానికి ఉసిగొల్పింది ఆయన సాహిత్యమే. 'సిరివెన్నెల', 'స్వాతికిరణం', 'స్వర్ణ కమలం' పాటలు నన్ను బాగా ప్రభావితం చేశాయి.
అది పేరు తెస్తుంది
ఈ సంవత్సరం 'మిస్టర్ పర్‌ఫెక్ట్' మంచి హిట్టయింది. రానున్న 'తెలుగమ్మాయి'లో 'కత్తిలాంటి కుర్రవాడు కళ్లుతిరిగి పడ్డాడు' పాట పేరు తెస్తుందని అనుకుంటున్నా. నాగచైతన్య చిత్రం 'దడ' రిలీజవుతోంది. నాగార్జునగారి సినిమా 'రాజన్న', రాజమౌళి సినిమా 'ఈగ', ఎన్టీఆర్ - సురేందర్‌రెడ్డి సినిమా 'ఊసరవెల్లి', వెంకటేశ్ - గోపీచంద్ మలినేని సినిమా, శేఖర్ కమ్ముల సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', దేవా కట్టా చిత్రం 'ఆటోనగర్ సూర్య'కి పాటలు రాస్తున్నా.

Friday, August 5, 2011
న్యూస్: మంచి సినిమాలకే నందులు!
గతంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకే ఎక్కువ అవార్డుల్ని కట్టబెడుతూ వచ్చిన నంది అవార్డుల జ్యూరీ గత యేడాది నుంచీ అర్థవంతమైన, మంచి చిత్రాలకు అవార్డులనిస్తూ 'నంది'కి గౌరవాన్ని కల్పిస్తోంది. 2010 సంవత్సరానికి దర్శకుడు ఎన్. శంకర్ ఆధ్వర్యంలోని జ్యూరీ ప్రకటించిన అవార్డులు ఈ సంగతిని స్పష్టం చేశాయి. ఈసారి ఉత్తమ అవార్డులు మూడూ విమర్శకుల ప్రశంసల్ని పొందిన సినిమాలకే రావడం గమనార్హం. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క ప్రధాన పాత్రలు పోషించగా క్రిష్ డైరెక్ట్ చేసిన 'వేదం' ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుగుకోగా, 2009 సంవత్సరంలో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని పొందిన 'సొంత ఊరు' దర్శకుడు పి. సునీల్‌కుమార్‌రెడ్డి మత్స్యకారుల దయనీయ జీవితాన్ని ఆవిష్కరించిన 'గంగపుత్రులు' ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సునీల్‌కుమార్‌రెడ్డికే ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కడం గమనార్హం. ఇక తృతీయ ఉత్తమ చిత్రంగా సాయికుమార్, శర్వానంద్, సందీప్ నటించగా దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'ప్రస్థానం' నిలిచింది. ప్రజాదరణ పొందిన చిత్రంగా నిజంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన రాజమౌళి చిత్రం 'మర్యాద రామన్న'ని జ్యూరీ ఎంపిక చేసింది. గతంలో ఈ కేటగిరీలో చాలా చోట్ల అసలు రిలీజే కాని 'పెళ్లాం పిచ్చోడు' అనే రాజేంద్రప్రసాద్ సినిమాని ఎంపిక చేసిన సంగతి జ్ఞాపకం చేసుకుంటే జ్యూరీ ఈసారి ఎంత వాస్తవికంగా పనిచేసిందో అర్థమవుతుంది. అలాగే సకుటుంబంగా చూడదగ్గ ఉత్తమ చిత్రం అవార్డుని చంద్రసిద్ధార్ట్ డైరెక్ట్ చేసిన 'అందరి బంధువయ'కు ప్రకటించారు. సమాజంలో నైతికత, మానవత్వం ముఖ్యమని చెప్పిన ఈ సినిమాని విమర్శకులు ఎంతగానో అభిమానించారు. ఇక జాతీయ సమగ్రతా చిత్రంగా బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణరావు రూపొందించిన 'పరమవీరచక్ర'కు ఇచ్చారు.
వ్యక్తిగత అవార్డుల విషయానికొస్తే ఉత్తమ నటుడి అవార్డు బాలకృష్ణకు దక్కింది. 2001 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 'నరసింహనాయుడు' పాత్ర పోషణకు గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న ఆయన మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆ అవార్డును పొందడం విశేషమే. 'పరమవీరచక్ర'కు కాకుండా, చాలా కాలం తర్వాత ప్రేక్షకాభిమానాన్ని పొందిన 'సింహా'లో చేసిన రెండు పాత్రలకు గాను ఈ అవార్డు ఆయనకు లభించడం గమనార్హం. 2011 సంక్రాంతికి విడుదలైనా, 2010లోనే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన 'అలా మొదలైంది'లో అద్భుతంగా అభినయించిన నిత్యమీనన్ ఉత్తమ నటిగా ఎంపికవగా, ఆ చిత్రాన్ని జన రంజకంగా మలిచిన నందినీరెడ్డి ఉత్తమ తొలిచిత్ర దర్శకురాలిగా నిలిచింది. 'సింహా"కి చక్కని సంగీతాన్నిచ్చిన చక్రి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. తొలి చిత్రమే అయినా 'మర్యాద రామన్న'లో విశేషంగా రాణించిన నాగినీడు ఉత్తమ విలన్‌గా అవార్డును అందుకోనున్నారు. ఇలా అనేక అవార్డులు పారదర్శకంగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

Tuesday, July 26, 2011
న్యూస్: 'తెలుగమ్మాయి' వచ్చేదెప్పుడు?
ఆరేళ్ల క్రితమే టాలీవుడ్‌కు 'ధన 51' ద్వారా పరిచయమైనా ఈ మధ్యే వచ్చిన రాజమౌళి సినిమా 'మర్యాద రామన్న' తోటే పాపులర్ అయిన తార సలోని. ఆ సినిమా తర్వాత అవకాశాలు పోటెత్తుతాయనీ, టాప్ హీరోల సరసన నటించే ఛాన్సులు వస్తాయనీ ఊహించిన ఆమెకి నిరాశే ఎదురైంది. గుడ్డిలో మెల్ల అన్నట్లు 'తెలుగమ్మాయి' అనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో టైటిల్ పాత్ర చేసే అవకాశం దక్కించుకుంది తెలుగు మాట్లాడ్డం రాని ఈ ఉత్తరాది అమ్మాయి. 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', 'ఆదివారం ఆడవాళ్లకు సెలవు' చిత్రాల దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. రాజకీయ నాయకుడు, ఒకప్పటి నిర్మాత చేగొండి హరిరామజోగయ్య నిర్మాణ సారథిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఓ అమ్మాయి, నలుగురు అబ్బాయిల మధ్య నడిచే కథతో తయారైంది. ఆ నలుగురు అబ్బాయిల్లో యశ్వంత్, విక్రం (ఎమ్మెస్ నారాయణ కొడుకు) ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయి నెల రోజుల పైనే అయిన ఈ సినిమాని జూన్‌లోనే విడుదల చేయాలని మొదట నిర్మాతలు భావించారు. అయితే బిజినెస్ వర్గాల నుంచి ఎలాంటి స్పందనా, ప్రోత్సాహమూ రాలేదు. చివరికి శాటిలైట్ హక్కుల కోసమూ ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఈ నెల 24న ఆడియో ఫంక్షన్ని ఆర్భాటంగా జరిపి బయ్యర్లని ఆకట్టుకోవాలని ప్లాన్ చేశారు. తద్వారా ఆగస్టు తొలి వారంలో సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ల ఆశలు నెరవేరతాయా? బయ్యర్లు రాకపోతే సొంతంగా విడుదల చేయని పరిస్థితి ఏర్పడినట్లే. అందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారో, లేదో? ఈ సినిమాతోనన్నా మరికొన్ని ఛాన్సులు దక్కించుకోవాలని చూస్తున్న సలోని ఆశలు నెరవేరుతాయా?
Saturday, July 23, 2011
న్యూస్: 'ది బిజినెస్ మ్యాన్'కి రంగం సిద్ధం
రెండో బాలీవుడ్ సినిమా 'బుడ్డా.. హో గయా తేరా బాప్' (తొలి సినిమా 'బద్రి'కి రీమేక్ అయిన 'షర్త్') తర్వాత మహేశ్‌తో రెండో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ కాంబినేషన్‌లో తొలిగా వచ్చిన 'పోకిరి' బాక్సాఫీసు వద్ద ఇండస్ట్రీ రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ తెలుగు సినిమా 40 కోట్ల రూపాయలు పైగా వసూలు చేయడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత రాజమౌళి, రాంచరణ్ కాంబినేషన్ మూవీ 'మగధీర' ఏకంగా దానికి రెట్టింపు వసూళ్లను సాధించి యావద్భారతీయ చిత్రసీమనే అబ్బురపరిచిన సంగతి మనకు తెలుసు. ప్రస్తుతానికి వస్తే మహేశ్‌తో జగన్ తీయబోతున్న 'ది బిజినెస్‌మ్యాన్' బిజినెస్ వర్గాల్లో హాట్ ప్రాజెక్ట్‌గా మారింది. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'ద గన్స్ డోన్ట్ నీడ్ అగ్రిమెంట్' అనే ట్యాగ్‌లైన్ ఉపయోగిస్తున్నారు. ఇందులో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొలిసారిగా మహేశ్‌తో జతకట్టబోతోంది. నిజానికి మొదట ఆ పాత్రకి ఇలియానా, శ్రుతిహాసన్ పేర్లు వినిపించినా, చివరకి కాజల్‌కి ఆ ఛాన్స్ దక్కింది. తమన్ మ్యూజిక్ అందించే ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలు కాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ మాఫియా బ్యాక్‌డ్రాప్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. దీనితో పాటు రవితేజతో 'ఇడియట్ 2'ని కూడా తీయబోతున్నాడు జగన్.
Subscribe to:
Posts (Atom)