Showing posts with label neelakanta. Show all posts
Showing posts with label neelakanta. Show all posts
Sunday, August 28, 2011
న్యూస్: కమలినికి కొత్త అవకాశాల్లేవ్!
బెంగాలీ భామ కమలినీ ముఖర్జీ ప్రాభవం టాలీవుడ్‌లో దాదాపు అంతరించినట్లే కనిపిస్తోంది. 'ఆనంద్', 'స్టైల్', 'గోదావరి', 'గమ్యం', 'గోపి గోపిక గోదావరి' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా సన్నిహితమైన ఆమె ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. వాటిలో 'పోలీస్ పోలీస్', 'మా అన్నయ్య బంగారం', 'నాగవల్లి', లేటెస్టుగా 'విరోధి' వంటివున్నాయి. అందంకంటే అభినయాన్నే ఎక్కువ నమ్ముకున్న ఆమెకి టాప్ హీరోలతో చేసే అవకాశాలు రాలేదు. వెంకటేశ్ సినిమా 'నాగవల్లి' చేసినా అది ఆయన సరసన హీరోయిన్ పాత్ర కాదు. నీలకంఠ డైరెక్ట్ చేసిన 'విరోధి'లో ఆమెది పేరుకు హీరోయిన్ పాత్రయినప్పటికీ మరీ చిన్న పాత్ర కావడం, పైగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలవడం వల్ల ఆమెకి ఏమాత్రం ప్రయోజనం కలగలేదు. ప్రస్తుతం ఆమె నటించిన 'రామాచారి' సెప్టెంబరులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఒకే పాజిటివ్ అంశం 'గోపి గోపిక గోదావరి' తర్వాత వేణు, ఆమె కలిసి నటించడం. వాళ్ల కలయికలోని తొలి సినిమా హిట్టవడం వల్ల 'రామాచారి'కి అది ప్లస్ అవుతుందని నిర్మాత, దర్శకుడు భావిస్తున్నారు. అయితే ఇంతవరకు దానికి బిజినెస్ జరగకపోవడం గమనార్హం. అందుకే ఆగస్టులోనే రిలీజ్ కావలసిన ఆ సినిమా సెప్టెంబరుకి వాయిదా పడింది. ఈ సినిమా ఆడితేనే కమలినికి టాలీవుడ్‌లో మరో అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
Tuesday, August 2, 2011
న్యూస్: 'హీరో అజయ్' అనిపించుకుంటాడా?
విలన్ పాత్రలతో పాపులరై తర్వాత హీరోలుగా మారి, పేరు తెచ్చుకున్నవాళ్లు టాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, గోపీచంద్ వంటివాళ్లు అందుకు మంచి ఉదాహరణ. ఆ కోవలోనే హీరో కావాలని తపిస్తున్న నటుడు అజయ్. 'హీరో అజయ్' అనే పేరును ఖాయం చేసుకోవాలనేది అతడి చిరకాల వాంఛ. అయితే ఇప్పటివరకు అతడి కల నెరవేరలేదు. విలన్ పాత్రలతో 'విక్రమార్కుడు' నుంచే ప్రేక్షకుల మెప్పు పొందిన అతడు హీరోగా 'ఆ ఒక్కడు', 'సారాయి వీర్రాజు', 'వైకుంఠపాళి' వంటి సినిమాలు రూపొందాయి. కానీ హీరోగా అతడికి బ్రేక్ రాలేదు. ఆ మూడు సినిమాలూ ప్రేక్షకుల్ని మెప్పించలేక పోవడమే దీనికి కారణం. 'ఆ ఒక్కడు'లో అతడికంటే హీరోయిన్ మధురిమ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం. 'సారాయి వీర్రాజు' పూర్తిగా అతడి పాత్రమీదే ఆధారపడిన సినిమా అయినా ఆ కథ మనవాళ్లకి నచ్చలేదు. ఇక 'వైకుంఠపాళి'లో ముగ్గురు హీరోల్లో అతను ఒకడు. మిగతా ఇద్దరు కృష్ణుడు, రణధీర్. ఆ ఇద్దరితో పోల్చితే అజయ్ పాత్రకే ప్రాధాన్యత ఎక్కువైనా ఈ థ్రిల్లర్ ఆడియన్స్‌ని థ్రిల్ చేయలేక పోయింది. అయితే అతడు హీరో కాకపోయినా హీరో కంటే ఎక్కువ ప్రశంసల్ని తెచ్చిన సినిమా 'విరోధి'. నీలకంఠ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కంటే ఎక్కువగా మావోయిస్ట్ రోల్‌లో గొప్పగా రాణించాదు అజయ్. కానీ ఏం లాభం. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాకొట్టింది. అతడి సినిమాలు ఇలా ఒక్కొక్కటే ఫ్లాపవతూ రావడంతో అతడితో సినిమాలు తియ్యాలని ప్లాన్ చేసుకున్న డైరెక్టర్లు, నిర్మాతలు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా కొంత కాలం తర్వాతైనా అజయ్ హీరోగా నిలదొక్కుకుంటాడని అతని శ్రేయోభిలాషులు నమ్ముతున్నారు. వారి నమ్మకం నిజమవుతుందా?
Monday, July 4, 2011
న్యూస్: శ్రీకాంత్‌కి మళ్లీ నిరాశే
శ్రీకాంత్ ఆశలు మరోసారి వమ్మయ్యాయి. తప్పకుండా విజయం సాధించడంతో పాటు నటుడిగా తనకి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుందని భావించిన 'విరోధి' సినిమాకి ప్రేక్షకులు కరువవడం అతణ్ణే కాదు సినీ వర్గాల్నే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఎందుకటే ఆ సినిమాకి డైరెక్టర్ ప్రతిభావంతుడిగా పేరుపొందిన నీలకంఠ. కమర్షియల్‌గా పెద్ద హిట్టు కాకపోయినా క్లాస్ ఆడియెన్స్‌నీ, విమర్శకుల్నీ మెప్పిస్తుందని చాలామంది అనుకున్నారు. అయితే మేకా మీడియా బేనర్‌పై శ్రీకాంత్ తమ్ముడు అనిల్ నిర్మించిన ఈ సినిమా రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యిందని చెప్పాలి. సగటు ప్రేక్షకుడినే కాక మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌నీ ఈ సినిమా మెప్పించలేకపోతోంది. దాంతో దీనికి పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసినట్లే. అంతే కాదు జర్నలిస్టుగా నటించిన శ్రీకాంత్ కంటే నక్సలైటుగా నటించిన అజయ్‌కే ఎక్కువ పేరొచ్చింది. కరెక్టుగా చెప్పాలంటే ఇది శ్రీకాంత్ సినిమా అని కాకుండా అజయ్ సినిమా అనే అంటున్నారు. ప్రధాన స్రవంతి సినిమా విధానంలో గాక కొత్త ధోరణిలో నీలకంఠ చేసిన ప్రయోగం ఎక్కువమందిని ఆకట్టుకోలేక పోతోంది. నక్సలిజం దారి తప్పిపోయిందని 'విరోధి'తో చెప్పాలని ఆయన యత్నించాడు. దానికి ఆయన ఎంచుకున్న స్క్రీన్‌ప్లే బోర్ కొట్టించింది. అందుకే ఈ సినిమా పట్ల ఎక్కువమంది ఆసక్తి కనపర్చడం లేదు.
2007లో 'ఆపరేషన్ దుర్యోధన', 'యమగోల.. మళ్లీ మొదలైంది' తర్వాత శ్రీకాంత్‌కి ఇంతవరకు మరో హిట్టు దక్కలేదు. 'మైఖేల్ మదన కామరాజు' నుంచి మొదలుకుని 'విరోధి' దాకా వరుసగా ఎనిమిది సినిమాలు అటకెక్కాయి. వీటిలో కృష్ణవంశీ డైరెక్షన్‌లో నటించిన 100వ సినిమా 'మహాత్మా' కూడా ఉంది. 'విరోధి' ఫ్లాపవడంతో శ్రీకాంత్ తన పాత్రల విషయంలో పునరాలోచించుకుంటే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. శ్రీహరి తరహాలో ఓ వైపు హీరో పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు అవకాశమున్న ఇతర పాత్రల్ని చేసుకుంటే బెటర్ అనేది వారి అభిప్రాయం.
2007లో 'ఆపరేషన్ దుర్యోధన', 'యమగోల.. మళ్లీ మొదలైంది' తర్వాత శ్రీకాంత్‌కి ఇంతవరకు మరో హిట్టు దక్కలేదు. 'మైఖేల్ మదన కామరాజు' నుంచి మొదలుకుని 'విరోధి' దాకా వరుసగా ఎనిమిది సినిమాలు అటకెక్కాయి. వీటిలో కృష్ణవంశీ డైరెక్షన్‌లో నటించిన 100వ సినిమా 'మహాత్మా' కూడా ఉంది. 'విరోధి' ఫ్లాపవడంతో శ్రీకాంత్ తన పాత్రల విషయంలో పునరాలోచించుకుంటే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. శ్రీహరి తరహాలో ఓ వైపు హీరో పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు అవకాశమున్న ఇతర పాత్రల్ని చేసుకుంటే బెటర్ అనేది వారి అభిప్రాయం.
Subscribe to:
Posts (Atom)


