Showing posts with label krishnamraju. Show all posts
Showing posts with label krishnamraju. Show all posts
Thursday, April 4, 2013
'స్త్రీ' (1973) రివ్యూ
ఆస్తులు, అంతస్థులు, అయినవాళ్లని కాదని ఆత్మీయత, అప్యాయత నిండిన మనసు కలిగిన ఓ ఆదర్శ వ్యక్తిని వివాహమాడి, జీవితంలో ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా ఎదురీదిన ఓ ధీరవనిత గాథ 'స్త్రీ'. కె. ప్రత్యగాత్మ రూపొందించిన ఈ చిత్రాన్ని శ్రీ పూర్ణా మూవీస్ బేనర్‌పై అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం. చంద్రశేఖర్ సంయుక్తంగా నిర్మిచారు.
ఈ సినిమాలో తల్లీ కూతుళ్లుగా చంద్రకళ ద్విపాత్రాభినయం హైలైట్. ఆడంబరం, అహంకారం లేని ఉత్తమురాలు తల్లి అయితే, అవే కూతురి లక్షణాలు. సమాజ శ్రేయస్సే తన శ్రేయస్సుగా తల్లి భావిస్తే, సొంత కోరికలు తీర్చుకోవడమే తన ధ్యేయంగా కనిపిస్తుంది కూతురు. ఈ రెండు పాత్రల్లోన్ని వ్యత్యాసాన్ని ప్రతి సన్నివేశంలో ప్రతిభావంతంగా ప్రదర్శించింది చంద్రకళ. చదువు, సంస్కారం ఉన్న ఉత్తమునిగా, నలుగురి కోసం పాటుపడే కార్మిక నాయకునిగా, తనను నమ్ముకొని వచ్చిన స్త్రీని చేరదీసి, అర్ధాంగిగా స్వీకరించిన గుణవంతునిగా కృష్ణంరాజు మంచి నటనని ప్రదర్శించాడు.
ధూళిపాళ, చంద్రమోహన్, రమణారెడ్డి, మాడా, వల్లం నరసింహారావు, కె.కె. శర్మ, వై.వి. రావు, రాళ్లపల్లి, శరత్‌బాబు, విజయభాను, సాయికుమారి, మమత, బేబీ గౌరి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
నిజానికి ఈ సినిమాకి అసలైన హీరో దర్శకుడు ప్రత్యగాత్మ. సన్నివేశాల కల్పన, వాటి చిత్రీకరణ, కథనం వంటి విషయాల్లో ఆయన పనితనం అడుగడుగునా గోచరిస్తుంది. మహదేవన్ సంగీతం, రావిశాస్త్రి సంభాషణలు, శేఖర్-సింగ్ సినిమాటోగ్రఫీ, బి.ఎన్. కృష్ణ కళా దర్శకత్వం ఈ సినిమాకి మంచి ఆకర్షణని తీసుకొచ్చాయి. అయితే దీనికి 'ఎ' సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారనేది అర్థం కాదు.
Saturday, December 1, 2012
అగ్నిపూలు (1981) - సమీక్ష
అత్యంత ప్రజాదరణ పొందిన యద్దనపూడి సులోచనారాణి నవల 'అగ్నిపూలు' ఆధారంగా అదే పేరుతో డి. రామానాయుడు నిర్మించిన సినిమాలో కృష్ణంరాజు, జయసుధ, జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు. కె. బాపయ్య దర్శకుడు. 'అగ్నిపూలు' కథలో భిన్న దృక్పథాలు, భిన్న వ్యక్తిత్వాలు ఉన్న పాత్రలెన్నో ఉన్నాయి. అన్ని పాత్రలకీ ప్రాముఖ్యం ఉంది. ఏ ఒక్క పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా రెండున్నర గంటల సినిమాగా దీన్ని తీర్చిదిద్దడంలో ఎంతో నేర్పు ప్రదర్శించాడు బాపయ్య.
రాజులు, రాజ్యాలు పోయినా దర్పం వదలని జమీందారు గోవింద వల్లభరాజా. ఆయన కుమారుడు శివప్రసాద్ అమెరికాలో ఉంటూ అక్కడే మేరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వారికి జానీ, బాబీ అనే ఇద్దరు పిల్లలు. భార్యా పిల్లలతో కలిసి తన ఇంటికి కొడుకు వస్తున్నాడని తెలిసి ఉగ్రుడైన వల్లభరాజా అతడికీ, తనకీ ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తాడు. ఆయన ఆస్తి మీద కన్నేసిన అల్లుడు విరూపాక్షి రాజా, కూతురు రాజేశ్వరి అగ్నికి ఆజ్యం పోస్తారు. ఇంటికి వచ్చిన శివప్రసాద్, మేరీలను ఔట్‌హౌస్‌లో ఉంచి అవమానిస్తారు. వల్లభరాజా చనిపోతే అతని మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతించరు.
కాలం గడిచి, విరూపాక్షి రాజా కూడా చనిపోతాడు. అతని కొడుకు కృష్ణ చైతన్య జమీందారీకి అధిపతి అవుతాడు. రుక్మిణి అనే అందాల భామను పెళ్లాడతాడు. ఒక ప్రమాదంలో రుక్మిణి అవిటిదవుతుంది. వల్లభరాజా భార్య అన్నపూర్ణ అభ్యర్థనపై శివప్రసాద్ పిల్లలు జానీ, బాబీలను ఇంటికి తీసుకొస్తారు. తన తల్లిదండ్రుల దారుణ మరణానికి కారకులైన విరూపాక్షి రాజా కుటుంబం మీద, ముఖ్యంగా కృష్ణ చైతన్య మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది జానీ. ఆమె చేష్టలు శాంత స్వభావుడైన కృష్ణ చైతన్యకు అర్థం కావు. జానీ దాచుకున్న డైరీ అతడికి దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది పతాక సన్నివేశాల్లో తెలుస్తుంది.
భిన్న దృక్పథాలు కలిగిని విరూపాక్షి రాజా, కృష్ణ చైతన్య పాత్రలు రెండింటినీ కృష్ణంరాజు ప్రశంసనీయంగా పోషించారు. ముఖ్యంగా విరూపాక్షి రాజాగా ఆయన నటన బాగా ఆకట్టుకుంటుంది. పగతో రగిలిపోయే జానీ పాత్రలో జయసుధ మరోసారి తన నటనా ప్రతిభను ప్రదర్శించింది. అవిటిదైన రుక్మిణిగా జయప్రద సమర్థవంతంగా నటించింది. ఆమె చేసిన సర్ప నృత్యం సినిమాకే హైలైట్. రాజేశ్వరిగా జయంతి పాత్ర పరిధి మేరకు బాగా చేసింది. సుధాకర్, నిర్మల, శ్రీధర్, గుమ్మడి, సత్యనారాయణ, సుమలత, సుభాషిణి, దిల్‌జిత్ వీర్ ఇతర పాత్రలు పోషించారు. శరత్‌బాబుకు మరికొన్ని డైలాగులు పెడితే బాగుండేది. అల్లు రామలింగయ్యపై చిత్రీకరించిన సన్నివేశాల ప్రయోజనం స్వల్పం.
జంధ్యాల మాటలు, ఆత్రేయ పాటలు, మహదేవన్ సంగీతం, వెంకట్ ఛాయాగ్రహణం సినిమాకి నిండుదనం తెచ్చాయి. మైసూరు లలితమహల్‌ను దర్శకుడు బాపయ్య చక్కగా వినియోగించుకున్నాడు. మొత్తానికి చక్కని నవలా చిత్రాన్ని చూసిన భావన ప్రేక్షకులకు కలుగుతుంది.
Thursday, May 24, 2012
టర్నింగ్ పాయింట్: రమాప్రభ
నేను సినిమాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు. మాది మధ్య తరగతి కుటుంబం. నేను ఊటీ, చెన్నైలో పెరిగాను. మా పిన్ని వాళ్లతో ఉండటం వల్ల వాళ్లతో పాటు తిరిగాను. దాంతో నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. మా బాబాయి ఆకస్మిక మరణంతో మా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. దాంతో బతకడం కోసం నేను సినిమాల్లోకి వచ్చా. క్లాసికల్ డాన్సర్‌గా స్టేజీ మీద నేనిచ్చిన ఓ ప్రదర్శన చూసిన డైరెక్టర్ ప్రత్యగాత్మ తన 'చిలకా కోరింక' (1966) సినిమాలో హీరో కృష్ణంరాజు చెల్లెలిగా చేసే ఛాన్స్ ఇచ్చారు.
అందులో నేను పద్మనాభం సరసన చేశా. అప్పటికే గొప్ప కమెడియన్ అయిన ఆయన నన్ను తన జోడీగా ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండలేను. అప్పట్లో ఆయనా, గీతాంజలి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. నిజానికి పద్మనాభం నన్ను బాగా ప్రోత్సహించారు. ఆ తర్వాత నేనెక్కువగా రాజబాబు సరసన నటించాను. చలం, రమకృష్ణ, శోభన్ బాబు, కృష్ణ వంటి ఎంతోమంది హీరోల సినిమాల్లో చేసిన నేను ఒక్క రాజబాబుతోటే 100 సినిమాల దాకా చేశా. తను నాకు మంచి స్నేహితుడు.
నా పరిమితులేమిటో నాకు తెలుసు. నా ముఖం గానీ, నా ఫ్రేంవర్క్ గానీ గ్లామర్‌ని కురిపించలేవనీ, అందువల్ల హీరోయిన్‌గా నేను పనికిరాననీ తెలుసు. అందుకే కమెడియన్ల సరసనా, కేరక్టర్ ఆర్టిస్టుగా సెటిలయ్యా. దాంతో భిన్నమైన కేరక్టర్లు చేయగలిగా. ఇన్నేళ్లపాటు ఫీల్డులో ఉండగలిగా.
Saturday, September 24, 2011
ప్రివ్యూ: రెబల్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రెబల్'లో ప్రధాన హీరోయిన్‌గా అనుష్క ప్లేస్‌లో తమన్నా చేస్తున్న సంగతిని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెండు షెడ్యూళ్లు చేసే వరకు హీరోయిన్‌గా అనుష్క నటించింది. అయితే డైరెక్టర్ రాఘవ లారెన్స్‌తో ఆమెకు విభేదాలు రావడంతో ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. ఈ విషయంలో అనుష్క తరపున హీరో నాగార్జున సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఫిలింనగర్‌లో ప్రచారంలోకి వచ్చింది. ఇందులో నిజమెంతున్నా అనుష్క తప్పుకుని ఆమె స్థానంలో తమన్నా రావడమనేది నిజం. రెండో హీరోయిన్‌గా పొడుగుకాళ్ల సుందరి దీక్షా సేథ్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌తో పాటు వైజాగ్, బ్యాంకాక్‌లోనూ జరుగుతోంది. ఈ సినిమాలో తొలిసారిగా ప్రభాస్ తండ్రిగా కృష్ణంరాజు నటిస్తుండటం విశేషం.
"ప్రభాస్, తమన్నా తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో ప్రభాస్ అందిస్తున్న సహకారం ఎప్పటికీ మరచిపోలేం. ఆయన కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ ఫిల్మ్. లారెన్స్ ఏ విషయంలోనూ రాజీపడకుండా కచ్చితంగా సూపర్‌హిట్ తీయాలన్న పట్టుదలతో ఈ చిత్రం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. టైటిల్‌కు తగ్గట్లుగా పవర్‌ఫుల్ సబ్జెక్టుతో 'రెబల్' రూపొందుతోంది'' అని చెప్పారు శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న జె. భగవాన్, జె. పుల్లారావు.
ఈ సినిమాలో తన రూపం వైవిధ్యంగా ఉంటుందని హీరో ప్రభాస్ తెలిపాడు. "టైటిల్‌కు తగ్గట్లుగా ఈ సినిమా స్టైలిష్‌గా, మాస్‌గా ఉంటుంది. షూటింగ్ చేస్తున్నప్పుడే మంచి కిక్ ఇస్తున్న ఈ చిత్రాన్ని లారెన్స్ అసాధారణంగా తీస్తున్నాడు'' అని ఆయన చెప్పాడు.
బ్రహ్మానందం, ముఖేష్‌రుషి, కెల్లీ దోర్జీ, సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, అలీ, చలపతిరావు, జయప్రకాశ్‌రెడ్డి, సుప్రీత్, జీవా తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: 'డార్లింగ్' స్వామి, సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, ఫైట్స్: రాం-లక్ష్మణ్, కళ: ఎ.ఎస్. ప్రకాశ్, కథ, కొరియోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్.
"ప్రభాస్, తమన్నా తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో ప్రభాస్ అందిస్తున్న సహకారం ఎప్పటికీ మరచిపోలేం. ఆయన కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ ఫిల్మ్. లారెన్స్ ఏ విషయంలోనూ రాజీపడకుండా కచ్చితంగా సూపర్‌హిట్ తీయాలన్న పట్టుదలతో ఈ చిత్రం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. టైటిల్‌కు తగ్గట్లుగా పవర్‌ఫుల్ సబ్జెక్టుతో 'రెబల్' రూపొందుతోంది'' అని చెప్పారు శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న జె. భగవాన్, జె. పుల్లారావు.
ఈ సినిమాలో తన రూపం వైవిధ్యంగా ఉంటుందని హీరో ప్రభాస్ తెలిపాడు. "టైటిల్‌కు తగ్గట్లుగా ఈ సినిమా స్టైలిష్‌గా, మాస్‌గా ఉంటుంది. షూటింగ్ చేస్తున్నప్పుడే మంచి కిక్ ఇస్తున్న ఈ చిత్రాన్ని లారెన్స్ అసాధారణంగా తీస్తున్నాడు'' అని ఆయన చెప్పాడు.
బ్రహ్మానందం, ముఖేష్‌రుషి, కెల్లీ దోర్జీ, సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, అలీ, చలపతిరావు, జయప్రకాశ్‌రెడ్డి, సుప్రీత్, జీవా తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: 'డార్లింగ్' స్వామి, సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, ఫైట్స్: రాం-లక్ష్మణ్, కళ: ఎ.ఎస్. ప్రకాశ్, కథ, కొరియోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్.
Tuesday, August 23, 2011
న్యూస్: అప్పుడు తమ్ముడు, ఇప్పుడు అన్న!
తమ్ముడు ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకుడిగా ఓ వెలుగు వెలిగి, తర్వాత దర్శకుడిగా 'అందమైన మనసులో', 'బ్రోకర్' సినిమాలు తీసి ఫెయిలైతే, ఇప్పుడు అన్న మెగాఫోన్ పట్టుకుని పరీక్షకు సిద్ధమయ్యాడు. అతని పేరు గౌతం పట్నాయక్. గౌతంని చూస్తే ఆర్పీ కంటే చిన్నవాడిగా కనిపిస్తాడు చూపులకి. ఇప్పుడతను 'కెరటం' అనే సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. ఆగస్టు 26న రిలీజవుతున్నఈ సినిమా ద్వారా ప్రభాస్ కజిన్, కృష్ణంరాజు మరదలి కుమారుడు సిద్ధార్థ రాజ్‌కుమార్ హీరోగా పరిచయమవుతున్నాడు. కన్నడంలో పెద్ద హిట్టయిన 'జోష్' కి ఈ సినిమా రీమేక్. ఆ సినిమాని నిర్మించిన ఎస్వీ బాబు ఈ సినిమాకీ నిర్మాత. గమనించాల్సిన సంగతేమంటే ఆర్పీ పట్నాయక్ డైరెక్టర్‌గా పరిచయమైన 'అందమైన మనసులో' నిర్మాత కూడా ఆయనే. ఇప్పుడు ఆర్పీ అన్న గౌతంని కూడా ఆయనే డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్నారు. "ఈ సినిమాలో హీరో టెన్త్ క్లాసులోనే ప్రేమలోపడి, పరీక్ష ఫెయిలవుతాడు. ఆ తర్వాత అతను ఎలా ఎదిగాడన్నది ఆసక్తికరం. ప్రేమ కోసం తమ తల్లిదండ్రుల్నీ, చదువునీ, కెరీర్‌నీ పాడుచేసుకోవద్దనేది ఈ సినిమా చెప్పే సారాంశం. ఆకర్షణలో పడి స్నేహితులతో సహా సర్వం పోగొట్టుకున్న ఓ అబ్బాయి కథ ఇది. క్లైమాక్స్ రియలిస్టిక్‌గా, హృదయాల్ని తడిచేసే విధంగా ఉంటుంది" అని ఈ సినిమా గురించి చెప్పాడు గౌతం. 'కెరటం'లో హీరోయిన్లుగా కొత్తమ్మాయిలు రాకుల్, ఐశ్వర్య నటించగా, హీరో తండ్రి పాత్రని సీనియర్ డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు పోషించడం విశేషం. నిజానికి 'జోష్' చూసి తెలుగు రీమేక్ హక్కులు తీసుకోవాలని ఆయన అనుకున్నారు. అయితే ఒరిజినల్ నిర్మాతే తెలుగు రీమేక్ చేయడంతో, అందులో తనకి బాగా నచ్చిన హీరో తండ్రి పాత్ర చేసి, ఆ రకంగా సంతృప్తిచెందారు. మొత్తానికి ఈ సినిమాతో గౌతం పట్నాయక్ కెరీర్ 'కెరటం'లా దూసుకుపోతుందా?
Tuesday, August 2, 2011
న్యూస్: 'హీరో అజయ్' అనిపించుకుంటాడా?
విలన్ పాత్రలతో పాపులరై తర్వాత హీరోలుగా మారి, పేరు తెచ్చుకున్నవాళ్లు టాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, గోపీచంద్ వంటివాళ్లు అందుకు మంచి ఉదాహరణ. ఆ కోవలోనే హీరో కావాలని తపిస్తున్న నటుడు అజయ్. 'హీరో అజయ్' అనే పేరును ఖాయం చేసుకోవాలనేది అతడి చిరకాల వాంఛ. అయితే ఇప్పటివరకు అతడి కల నెరవేరలేదు. విలన్ పాత్రలతో 'విక్రమార్కుడు' నుంచే ప్రేక్షకుల మెప్పు పొందిన అతడు హీరోగా 'ఆ ఒక్కడు', 'సారాయి వీర్రాజు', 'వైకుంఠపాళి' వంటి సినిమాలు రూపొందాయి. కానీ హీరోగా అతడికి బ్రేక్ రాలేదు. ఆ మూడు సినిమాలూ ప్రేక్షకుల్ని మెప్పించలేక పోవడమే దీనికి కారణం. 'ఆ ఒక్కడు'లో అతడికంటే హీరోయిన్ మధురిమ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం. 'సారాయి వీర్రాజు' పూర్తిగా అతడి పాత్రమీదే ఆధారపడిన సినిమా అయినా ఆ కథ మనవాళ్లకి నచ్చలేదు. ఇక 'వైకుంఠపాళి'లో ముగ్గురు హీరోల్లో అతను ఒకడు. మిగతా ఇద్దరు కృష్ణుడు, రణధీర్. ఆ ఇద్దరితో పోల్చితే అజయ్ పాత్రకే ప్రాధాన్యత ఎక్కువైనా ఈ థ్రిల్లర్ ఆడియన్స్‌ని థ్రిల్ చేయలేక పోయింది. అయితే అతడు హీరో కాకపోయినా హీరో కంటే ఎక్కువ ప్రశంసల్ని తెచ్చిన సినిమా 'విరోధి'. నీలకంఠ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కంటే ఎక్కువగా మావోయిస్ట్ రోల్‌లో గొప్పగా రాణించాదు అజయ్. కానీ ఏం లాభం. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాకొట్టింది. అతడి సినిమాలు ఇలా ఒక్కొక్కటే ఫ్లాపవతూ రావడంతో అతడితో సినిమాలు తియ్యాలని ప్లాన్ చేసుకున్న డైరెక్టర్లు, నిర్మాతలు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా కొంత కాలం తర్వాతైనా అజయ్ హీరోగా నిలదొక్కుకుంటాడని అతని శ్రేయోభిలాషులు నమ్ముతున్నారు. వారి నమ్మకం నిజమవుతుందా?
Sunday, July 31, 2011
న్యూస్: తండ్రీకొడుకులుగా కృష్ణంరాజు, ప్రభాస్ రాణిస్తారా?
కృష్ణంరాజు, ప్రభాస్ తొలిసారి తండ్రీకొడుకులుగా వెండితెర మీద ఆవిష్కృతం కాబోతున్నారు. అవును. ప్రభాస్ హీరోగా చిత్రరంగంలో అడుగుపెట్టిన తొమ్మిదేళ్ల తర్వాత ఆ ఇద్దరూ తండ్రీ కొడుకుల పాత్రల్ని అభినయించ బోతున్నారు. ఆ సినిమా 'రెబెల్'. దాన్ని రూపొందిస్తోంది రాఘవ లారెన్స్. శ్రీ బాలాజీ సినీ మీడియా బేనర్‌పై జె. భగవాన్, జె. పుల్లారావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. ఆ ఇద్దరూ 'బిల్లా'లో మొదటిసారి కలిసి నటించిన సంగతి తెలిసిందే. అయితే అందులో వారికి ఎలాంటి బంధుత్వమూ లేదు. ప్రభాస్ టైటిల్ రోల్ చేస్తే, కృష్ణంరాజు పోలీసాఫీసర్ పాత్రని చేశారు. 'బిల్లా' ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు ఈ పెదనాన్న, కుమారుల్ని తండ్రీ కొడుకులుగా చూపించే ఛాన్స్‌ని దక్కించుకున్నాడు లారెన్స్. అతను చెప్పిన కథ, పాత్రలు ఆ ఇద్దరికీ బాగా నచ్చినందునే ఆ పాత్రల్ని చేయడానికి వారు అంగీకరించారు. ఇప్పటివరకు ఆ తరహా పాత్రలు వచ్చినా స్క్రిప్టులు నచ్చనందునే వారు చేయలేదు. తెరమీద తండ్రీకొడుకులుగా చేసే సినిమా ప్రతిష్ఠాత్మకంగా ఉండాలనీ, తప్పనిసరిగా హిట్టవ్వాలనీ ఆశించడం వల్లే, సరైన సబ్జెక్ట్ కోసం వారు ఎదురు చూస్తూ వచ్చారు. ఇప్పటికి వారు ఆశించిన సబ్జెక్ట్ దొరికింది. మాస్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో తండ్రి సెంటిమెంట్ ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం. ఇందులో ప్రభాస్ సరసన ఇద్దరు నాయికలు - అనుష్క, దీక్షాసేథ్ నటిస్తున్నారు. నాగార్జునతో చేసిన 'డాన్' తర్వాత లారెన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. మరి కృష్ణంరాజు, ప్రభాస్‌ని ప్రేక్షకులు ఏ రీతిలో ఆదరిస్తారన్నది ఆసక్తికరం.
Monday, June 27, 2011
Tuesday, August 31, 2010
Movies: Pawan Kalyan's film launched in Jerusalem

పవన్ కల్యాణ్ ముఖ్య పాత్రధారిగా సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు రూపొందించే సినిమా మంగళవారం (ఆగస్టు 31) జెరూసలేంలో లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఆదిత్య ప్రొడక్షన్స్ బానరుపై కొండా కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు చిత్రసీమలోనే తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెరూసలేం నుంచి మీడియాతో మాట్లాడారు పవన్ కల్యాణ్. "ప్రేమతత్త్వం బోధించే, సమాజానికి మంచి సందేశాన్నిచ్చే ఈ సినిమాలో నటించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. చిన్నప్పుడు మిషనరీ స్కూలులో చదువుకునేప్పుడే జీసస్ అంటే ఆరాధనా భావం ఏర్పడింది. ఈమధ్య మా అబ్బాయి కిందపడితే మోకాలికి గాయమయ్యింది. అదిచూసి నాకే దెబ్బ తగిలినట్లు బాధపడ్డా. అలాంటిది తన కళ్లముందు ఎదిగిన కుమారుణ్ని చిత్రహింసలు పెడుతుంటే మేరీ మాత ఇంకెంతగా వ్యథచెంది ఉంటుందా అనుకున్నా. అదే సమయంలో కృష్ణంరాజు ఈ ప్రాజెక్టుతో నా వద్దకు వచ్చారు. వాళ్లు తయారు చేసుకున్న సబ్జెక్టు, అందులో నాకు చెప్పిన పాత్ర బాగా నచ్చి చేయడానికి ఒప్పుకున్నా. వయసు పెరిగేకొద్దీ సామర్థ్యం పెరుగుతున్న సింగీతం గారి డైరెక్షనులో పనిచేయడం సంతోషంగా ఉంది. ఇమేజ్ గురించీ, రేంజ్ గురించీ ఆలోచించి సినిమాలు చేయను. నా మనసులో అనిపించింది చేసుకుంటూ వెళ్తుంటా. 25 నుంచి 30 రోజుల పాటు ఈ సినిమాకి పనిచేయబోతున్నా. ఇందులో నా పాత్రేమితో ఇప్పుడు చెప్పడం సరికాదు. ఇందులో నాకు హీరోయిన్లు ఉండరు. ఇది రెగ్యులర్ సాంగ్ అండ్ డాన్స్ సినిమా కాదు" అని చెప్పారు పవన్ కల్యాణ్.
డైరెక్టర్ సింగీతం మాట్లాడుతూ "ఇది విశిష్టమైన సినిమా. జీసస్ క్రిస్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. అయినా ఓ సాహసంగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. పిల్లలతో ఇదివరకు రామాయణం, భారతం తీశారు. ఇప్పుడు ఈ జీసస్ సినిమాని పిల్లలతో తీస్తున్నాం. పవన్ కల్యాణ్ ఇందులో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. జీసస్ పుట్టుక నుంచి శిలువ వేయడం వరకు ఇందులో ఉంటుంది" అని తెలిపారు.
నిర్మాత కృష్ణంరాజు మాట్లాడుతూ "ఇండియాలోని హయ్యస్ట్ బడ్జెట్ సినిమాల్లో ఇదొకటి అవుతుంది. తెలుగుతో బాటు హిందీ, మలయాళం, ఇంగ్లీషు భాషల్లో ఈ సినిమా తీస్తున్నాం. అక్టోబరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, వచ్చే యేడాది చివరలో సినిమా విడుదల చేస్తాం" అన్నారు.
జె.కె. భారవి రచన చేస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ: శేఖర్ వి. జోసెఫ్, ఆర్ట్: రవీందర్, మేకప్: క్రిస్టియానా టెన్స్ లే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శేషు.
Tuesday, December 29, 2009
Krishnam Raju (Actor)

First Film: Chilaka Gorinka (1966)
First Film as a villain: Nenante Nene (1968)
First Film as a producer: Krishnaveni (1974)
Got star image with the film 'Bhakta Kannappa' (1976).
Famous Films:
Amara Deepam (1977)
Manavoori Pandavulu (1978)
Katakatala Rudraiah (1978)
Sivamettina Satyam (1982)
Bobbili Brahmanna (1984)
Tandra Paparayudu (1986)
Ravana Brahma (1986)
First Film as a villain: Nenante Nene (1968)
First Film as a producer: Krishnaveni (1974)
Got star image with the film 'Bhakta Kannappa' (1976).
Famous Films:
Amara Deepam (1977)
Manavoori Pandavulu (1978)
Katakatala Rudraiah (1978)
Sivamettina Satyam (1982)
Bobbili Brahmanna (1984)
Tandra Paparayudu (1986)
Ravana Brahma (1986)
Subscribe to:
Posts (Atom)







