Showing posts with label LV Prasad. Show all posts

Thursday, November 5, 2015
Tuesday, February 3, 2015
Thursday, August 18, 2011
నోస్టాల్జియా: హీరో నుంచి విలన్ అయిన నవరస నటనా సార్వభౌమ
నవరస నటనా సార్వభౌమగా ఖ్యాతి పొందిన కైకాల సత్యనారాయణ విలన్ పాత్రలతో సుప్రసిద్ధులైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆయన తొలిగా నటించింది హీరోగా. హీరో నుంచి విలన్ ఎందుకయ్యారో ఆయన మాటల్లోనే...
"ఇంటర్మీడియేట్‌లో ఉండగా విజయవాడలో ఓ నాటకాల పోటీలో పాల్గొన్నా. ఆ పోటీకి న్యాయమూర్తుల్లో ఒకరైన గరికపాటి రాజారావు గారు వచ్చి నన్ను సినిమాలో హీరోగా పరిచయం చేస్తానన్నారు. ముందు డిగ్రీ సంపాదించాకే ఏదైనా అని చెప్పా. బీఏ అయిపోయాక కె.ఎల్. ధర్ అని ఎల్వీ ప్రసాద్ దగ్గరి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ నన్ను మద్రాసు రమ్మని ఉత్తరం రాశారు. బి.ఎ. సుబ్బారావుగారి దగ్గరకు వెళ్లి అసిస్టెంట్‌గా ఇవ్వమని అడిగితే ఆయన చక్రపాణిగారి వద్దకి పంపారు. ఆయన మళ్లీ కేవీ రెడ్డిగారి దగ్గరకి పంపారు. 15 రోజుల తర్వాత రమ్మని, చిన్న పాత్ర చేయమన్నారు. మర్నాడు వాయిస్ టెస్ట్ చేసి, 'యు ఆర్ సెలెక్టెడ్' అన్నారు. కానీ సంక్రాంతికి వెళ్లి తిరిగొచ్చేసరికి ఆ పాత్ర ఆర్. నాగేశ్వరరావుకి వెళ్లిపోయింది. కేవీ రెడ్డిగారు తర్వాతి చిత్రంలో ఇస్తానన్నారు. తర్వాత డి.ఎల్. నారాయణ గారి దగ్గరకు వెళ్తే ఆయన 'సిపాయి కూతురు' సినిమా తీస్తూ అందులో హీరో ఛాన్స్ ఇచ్చారు. అది ఫెయిలైంది. మళ్లీ గ్యాప్. ఇక వెళ్లిపోదాం అనుకుని.. మద్రాసు చూద్దామని తిరుగుతున్నా. ఇంతలో విఠలాచార్య గారు 'సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి' చిత్రానికి నా కోసం వెతుకుతున్నారు. నేను వెళ్లిన వెంటనే అగ్రిమెంట్ అయిపోయింది. రషెస్ అందరికీ నచ్చింది. పాతికవేల చెక్కిచ్చారు. విలన్‌గా చేస్తే బాగుంటుందని చెప్పి, నాకు తొలి విలన్ వేషం ఇచ్చారు విఠలాచార్య. 'అగ్గి పిడుగు' నుంచి రామారావు గారు, నేను మంచి కాంబినేషన్ అయ్యాం. ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశా."

Thursday, December 9, 2010
ఫోకస్: 1947 తర్వాత తెలుగు సినిమా
ఈ శతాబ్ద కాలంలో దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన, జనరంజకమైన మీడియాగా సినిమా ఖ్యాతికెక్కింది. తొలినాళ్లలో అది ఓ కళా ప్రక్రియ అయితే ఇవాళ అది పక్కా వ్యాపార పరిశ్రమగా మారిపోయింది. స్వాతంత్ర్యానంతరం ఈ అరవై ఏళ్ల పైచిలుకు కాలపు తెలుగు చలనచిత్ర రంగాన్ని ఓసారి పరిశీలించి చూస్తే కళాఖండాలనదగ్గ చిత్రాలు పదికంటే ఎక్కువ కనిపించవు. తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడానికి పనికివచ్చేది నిర్మాణమవుతోన్న చిత్రాల సంఖ్య గురించే. హిందీ చిత్రాలకంటే అధిక సంఖ్యలో ప్రతియేటా తెలుగులో సినిమాలు నిర్మాణవుతున్నాయి. వాటిలో విమర్శకి నిల్చునేవి అతి స్వల్పం. ఐతే దేశం గర్వించదగ్గ నటులు, దర్శకులు మనకి ఉన్నారని చెప్పుకునే భాగ్యం లభించింది. దర్శకుల్లో ఎల్వీ ప్రసాద్, బీఎన్ రెడ్డి, నిర్మాతల్లో బి. నాగిరెడ్డి, డి. రామానాయుడు, నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగంలో దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఎస్వీ రంగారావు, చిత్తూరు నాగయ్య, ఎన్‌టీ రామారావు వంటి నటులు; రేలంగి, రమణారెడ్డి వంటి మహా కమెడియన్లు, కన్నాంబ, భానుమతి, సావిత్రి, సూర్యకాంతం వంటి గొప్ప నటీమణులూ; గూడవల్లి రామబ్రహ్మం, కేవీ రెడ్డి, పి. పుల్లయ్య, వేదాంతం రాఘవయ్య, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, కె. విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు వంటి దిగ్దర్శకులు మనకి లభించారు.
మొదట్లో- అంటే 60వ దశకం వరకు తెలుగులో పౌరాణిక చిత్రాలు, మాయా మంత్రతంత్రాల జానపద చిత్రాలే రాజ్యం చేశాయి. సామాజిక స్పృహతో తీసిన చిత్రాలు చాలా తక్కువ. అయితే 'దేవదాసు', 'మాయాబజార్', మహాకవి కాళిదాసు' వంటి కళాఖండాలనదగ్గ సినిమాలు అప్పుడు వచ్చాయి. రామారావు, నాగేశ్వరరావు అగ్ర హీరోలుగా నిలిచారు. తారల్లో భానుమతి, సావిత్రి అగ్రస్థాయికి చేరుకున్నారు. 1953లోనే 'చండీరాణి'కి దర్శకత్వం వహించి తెలుగులో తొలి దర్శకురాలయ్యారు భానుమతి. 1954 వరకు వచ్చిన చిత్రాల్లో ఏ ఒక్కటీ వంద రోజులదాకా ఆడలేదు. 1955లో తాపీ చాణక్య దర్శకత్వం వహించిన 'రోజులు మారాయి' చిత్రం తొలిసారిగా వంద రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలిచింది. ఇది సామాజిక దృష్టితో తీసిన చిత్రం కావడం విశేషమే. స్వాతంత్ర్యానికి ముందు కమర్షియల్ దృష్టితో తీసిన సినిమాలు కనిపించవు. ఆ తర్వాతే 1950లో విజయా సంస్థ తీసిన 'షావుకారు' చిత్రంతో ఈ వాణిజ్య పోకడలు కనిపిస్తాయి. ఈ చిత్రంతోనే జానకి నటిగా తెరంగేట్రం చేశారు. 1964లో తొలి తెలుగు వర్ణ చిత్రం 'లవకుశ' వచ్చింది. దీనికి పి. పుల్లయ్య దర్శకుడు. అంజలీదేవి, ఎన్‌టీ రామారావు సీతారాములుగా నటించిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగా అనేక కొత్త రికార్డుల్ని నెలకొల్పింది. ఈ యేడాదే ఓ తెలుగు నటుడికి అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఆ నటుడు ఎస్వీ రంగారావు. జకార్తాలో ఆఫ్రో ఏషియన్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించిన 'నర్తనశాల'లో కీచకుడి పాత్రకి గాను ఆ పురస్కారం లభించింది.
తొలి సాంఘిక రంగుల చిత్రం 1965లో వచ్చింది. అందరూ కొత్త తారలతో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ఆ చిత్రం 'తేనె మనసులు'. హీరో కృష్ణ పరిచయమయ్యింది ఈ సినిమాతోనే. (ఇంకావుంది)

Wednesday, August 25, 2010
Nostalgia: LV Prasad replaced Gopichand

ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో 1945లో విడుదలైన 'గృహప్రవేశం' సినిమాని నిజానికి డైరెక్ట్ చేయాల్సింది ప్రఖ్యాత రచయిత త్రిపురనేని గోపీచంద్. 'లక్ష్మమ్మ' సినిమాని డైరెక్ట్ చేయాడానికి ముందే 'పెంకి పిల్ల' అనే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు గోపీచంద్. మరో డైరెక్టర్ కె.ఎస్. ప్రకాశరావు ఈ సినిమాని నిర్మించారు. అయితే సారథి స్టూడియోస్ భాగస్వామ్యంలో నిర్మించడం వల్ల ఆ బానరునే ఉపయోగించారు. ఈ సినిమా పెట్టుబడి రు. 60 వేలు. ఇందులో సగం సారథి వాళ్లు పెడితే, మిగతా సొమ్ముని ప్రకాశరావు, గోపీచంద్, ఎం.ఎస్. చౌదరి కలిసి పెట్టారు. దర్శకత్వ బాధ్యతలు గోపీచంద్ తీసుకున్నారు. తనకు డైరెక్షన్ చాన్స్ ఇస్తేనే హీరోగా నటిస్తానని ఎల్.వి. ప్రసాద్ తేల్చిచెప్పడంతో గోపీచంద్ ని ఒప్పించి ప్రసాద్ కి డైరెక్షన్ చాన్స్ ఇచ్చారు ప్రకాశరావు. 'పెంకి పిల్ల' పేరుని 'గృహప్రవేశం'గా మార్చింది ప్రసాదే. ఈ సినిమాలో భానుమతి హీరోయిన్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో దర్శకుడిగా బిజీ అయ్యారు ప్రసాద్.
Thursday, December 31, 2009
Tatineni Prakasa Rao (Director)
Prakasa Rao was born in Kapileswarapuram, Krishna District. He worked as assistant and associate director for LV Prasad.
He worked for Vijaya Productions's 'Shavukaru' and KV Reddy's 'Patala Bhairavi' and done a small role in the later film.
His directorial ventures in Telugu are like 'Parivartana', 'Palletooru' and 'Jayam Manade'.
He directed 25 films in Hindi.
In Tamil, he directed the legendary actors like Sivaji Ganeshan, Gemini Ganeshan and MGR.
He directed nearly 60 films in all languages.

Subscribe to:
Posts (Atom)