Showing posts with label suhasini. Show all posts

Wednesday, May 28, 2014
Friday, March 4, 2011
హిట్.. హిట్.. హుర్రే!: నువ్వు నాకు నచ్చావ్-2
ఒకరితో నిశ్చితార్థం జరిగిన అమ్మాయి, తనకు తెలీకుండానే మరొకర్ని ప్రేమిస్తే.. ఆ అమ్మాయి ఎవర్ని పెళ్లి చేసుకోవాలి? ఆమె ప్రేమని పొందిన యువకుడూ ఆమెని అమితంగా ప్రేమించి, పెద్దల్ని కష్టపెట్టకూడదనే ఒకే కారణంతో మౌనంగా ఉండిపోవడం ఎంతవరకు సమంజసం? ఇంతకీ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా, మనసుకి నచ్చిన వాళ్లని మనువాడాలా? ఎన్ని ప్రశ్నలు! ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రం!! మనసులు కలవని అమెరికా సంబంధం కంటే మనసుకి నచ్చిన మనూరబ్బాయే ఎంతో మేలని చెప్పిన ఈ చిత్రాన్ని తిరుగులేని విధంగా దీవించారు ప్రేక్షకులు. చేసిన వ్యాయానికి రెట్టింపు పైగా ఆదాయాన్ని సమకూర్చిపెట్టారు. ఈ సీరియస్ విషయాన్ని సీరియస్‌గా కాక, వినోదాల విందుగా చిత్రించిన దానికి దక్కిన ప్రయోజనం ఇది.
'కథ తక్కువ కథనం ఎక్కువ' తరహాకి చెందిన 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రం మూడు గంటలపైగా నిడివి ఉన్నా బోర్ కొట్టకపోవడానికీ, ఆద్యంతం ఆహ్లాదాన్ని పంచడానికీ కారణం చకచకా పరుగులెత్తిన సన్నివేశాలూ, జరజరా ఉరకలెత్తిన సంభాషణలూ. చిత్రంలోని దాదాపు అన్ని సన్నివేశాలూ సహజంగానే తోస్తాయి. ఏ సన్నివేశాన్ని తీసుకున్నా 'అవును. నిజంగా కూడా ఇలాగే కదా జరిగేది' అనిపించడమే ఈ చిత్రం ప్రత్యేకత.
చాలా సినిమాల్లో కనిపించినట్లు ఈ సినిమాలో నందిని, వెంకీలది 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' కాదు. ఏ బాధలూ లేకుండా సరదాగా జీవితాన్ని గడిపే కుర్రాడు వెంకీ అయితే ఇంకో రెండు నెలల్లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లే స్థితిలో ఉన్న చక్కని చుక్క నందిని. ఆమె తన తండ్రి స్నేహితుని కూతురనీ, మరొకరితే నిశ్చితార్థం జరిగిందనీ వెంకీకి తెలుసు. అందుకే ఆమెని మొదట మరోభావంతో అతను చూడలేదు. ఉడుకు వయసు కారణంగా ఇద్దరూ ఒకర్నొకరు ఆటపట్టించుకుంటూ ఉంటారు. మొదట అతడంటే చులకన భావం ఉన్న నందు అతడి మనసెంత స్వచ్ఛమైందో గ్రహించాక తనకు తెలీకుండానే క్రమంగా అతడి పట్ల ఆకర్షితురాలవుతుంది. ఇక్కడ్నించీ ఇద్దరి మనసుల్లోని సంఘర్షణని దర్శకుడు ఎంతో నేర్పుగా సెల్యులాయిడ్ మీద చిత్రించాడు.
భారతీయ సంప్రదాయం ప్రకారం మనసు ఎవరి మీదున్నా మనువాడిన వాడే స్త్రీకి సర్వస్వం. నిశ్చితార్థం అంటే సగం పెళ్లయిపోయినట్లే. కాబోయే వరుడి మీదే అమ్మాయి దృష్టంతా లగ్నం కావాలి. ఆ నిశ్చితార్థం అయ్యాక మరో మగాడు ఆమె జీవితంలో ప్రవేశించడమన్నది మన సెంటిమెంట్‌కి విరుద్ధమైన సంగతి. ఆ యాంటీ సెంటిమెంట్ వ్యవహారాన్ని అందరిచేతా ఔననిపించాలి. ఇక్కడ కథనం ఏమాత్రం బేలెన్స్ తప్పినా అభాసవుతుంది. రచయిత, దర్శకుడి పనితనం ఎలాంటిదో బయటపడేది ఇలాంటి సున్నిత సందర్భాల్లోనే. ఆ విషయంలో విజయభాస్కర్, త్రివిక్రం జంటగా విజయం సాధించారు.
తన మనసు బయటపెట్టినా, ఎంతగా ప్రయత్నిస్తున్నా వెంకీ నుంచి ఆశించిన స్పందన రానందుకు బాధపడుతూ 'ఒక్కసారీ చెప్పలేవా నువ్వు నచ్చావనీ..' అని పాడుతుంది నందు. దానికి సమాధానమిస్తూ పాట చివరలో నందూని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోబోయి తమాయించుకుని వొదిలేస్తాడు వెంకీ.
"ఎందుకిలా చేస్తున్నావ్ నువ్వు? ఒక్క క్షణం చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తావ్. ఒక్క క్షణం అస్సలు పరిచయం లేనట్లు దూరంగా ఉండిపోతావ్. ఒక్కోసారి నీతో ఏదైనా మాట్లాడాలనిపిస్తుంది. ఒక్కోసారి ఏం మాట్లాడాలన్నా భయమేస్తుంది. ఎందుకు? నువ్వే బాధపడతావ్. నువ్వే ఓదారుస్తావ్. ఒక్కోసారి నవ్విస్తావ్. ఒక్కోసారి ఏడిపిస్తావ్. నన్నెందుకిలా హింసిస్తున్నావ్? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావ్? అసలు నా లైఫ్‌లోకి ఎందుకొచ్చావ్? వై వెంకీ? ఎందుకిలా చేస్తున్నావ్? చెప్పు" అని అతడి గుండెల మీద తలపెట్టి ఏడుస్తుంది నందు.
ఒక అబ్బాయిని పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి అతడు తనకు కాసేపు దగ్గరగా, మరికాసేపు దూరదూరంగా ఉండటాన్ని తట్టుకోలేక వేసిన ఈ ప్రశ్నలు ప్రేక్షకుల గుండెని తడి చేయకుండా ఉంటాయా? జీవితంలో ప్రేమలో పడిన ఎవరైనా ఆ పాత్రలతో, ఆ సన్నివేశాలతో సహానుభూతి చెందకుండా ఉంటారా? అంతదాకా ఆ పాత్రలు తెరనిండా చేసిన అల్లరిలో, చిలిపి చేష్టల్లో తమని తాము చూసుకున్న ప్రేక్షకులు ఈ ఆర్ద్రమైన సన్నివేశాన్ని కూడా సొంతం చేసుకున్నారు. నవ్వుల్లో ముంచెత్తే సన్నివేశాల్నే కాదు, హృదయాన్ని తడిచేసే సన్నివేశాల్నీ కల్పించగలనని త్రివిక్రం నిరూపిస్తే, ఆ సన్నివేశాల్ని అంతే హృద్యంగా తీయగలనని విజయభాస్కర్ నిరూపించాడు.
ఇక ఈ సినిమాలో వినోదాన్ని పంచే సన్నివేశాలకు కొదవ లేదు. వెంకటేశ్, సునీల్ కాంబినేషన్‌లో వచ్చే ప్రతి సన్నివేశమూ నవ్వులు పూయిస్తుంది. అన్నిటికీ మించి ప్రధానమైన హీరో అల్లరివాడైతే ఎంత వినోదం! ఎంత అహ్లాదం!! చక్కని కామెడీ టైమింగ్ ఉన్న హీరోల్లో మొదటి వరుసలో నిలిచే వెంకటేశ్‌కి అల్లరి పాత్ర లభిస్తే చెడుగుడు ఆడకుండా ఉంటాడా? వెంకీ పాత్రలో విపరీతమైన అల్లరి చేశాడు. తెరనిండా నవ్వుల జడివాన కురిపించాడు. నలభయ్యో పడిలో పడినా పదిహేడేళ్ల పరువాల చిన్నది ఆర్తీ సరసన పాతికేళ్ల కుర్రాడిలానే కనిపించి మెప్పించాడు. త్రివిక్రంలోని హాస్యప్రియుడు యమ సీరియస్‌గా ప్రవర్తించే మూర్తి (ప్రకాశ్‌రాజ్) పాత్రతో కూడా ఓ సందర్భంలో ఆపుకోలేని నవ్వుని సృష్టించాడు. హాలీవుడ్ సినిమా 'మీట్ ద పేరెంట్స్' ప్రేరణతో అతను కల్పించిన డైనింగ్ టేబుల్ సీన్ ఇప్పటికీ కళ్లముందు మెదిలి పెదాలపై నవ్వులు మొలిపిస్తుందన్నది నిజం. అమ్మ మీద ప్రేమ ఉన్న మూర్తి ఆమె మీద కవిత చదువుతుంటే వెంకటేశ్ ప్రదర్శించే హావభావాలు చూడాల్సిందే.
ఈ సినిమా విజయంలో ఆర్తీ అగర్వాల్‌దీ కీలక భాగస్వామ్యమే. నందిని పాత్రలో ముగ్ధమోహనంగా కనిపించడమే కాక, ఆ పాత్రలో మమేకమై నటించి, సగటు ప్రేక్షకుణ్ణి సమ్మోహితుణ్ణి చేసింది. వెంకటేశ్ కంటే వయసులో ఐదేళ్లు చిన్నవాడైన ప్రకాశ్‌రాజ్ హీరోయిన్ తండ్రిగా నడివయసు పాత్రలో బాగా రాణించాడు. ఎమ్మెస్ నారాయణ, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సుదీప, ఆషా సైనీ, పృథ్వీ తమ పాత్రలకు న్యాయం చేశారు.
రెండు మూడు సన్నివేశాల్లోనే కనిపించినా సుహాసిని పాత్రని ఉపయోగించుకున్న తీరు కూడా ముచ్చట వేస్తుంది. నందు మేనత్త అంటే మూర్తి చెల్లెలి పాత్ర వేసింది సుహాసిని. తన నిశ్చితార్థానికి కాకుండా తర్వాతెప్పుడో వచ్చిన మేనత్తని నందు ప్రశ్నిస్తే "పెళ్లయిన రోజు నుంచి మనం కలలు కనే హక్కుని కోల్పోతాం. కేవలం పిల్లల్ని కంటానికి మాత్రమే పనికొస్తాం. పెళ్లయ్యాక ఆడపిల్ల ఇల్లు మారుతుంది. ఊరు మారుతుంది. ఇంటిపేరు మారుతుంది. కానీ మనసెందుకు మారదు?.. మనం ఆడుకున్న బొమ్మలు, మనం పెంచుకున్న మొక్కలు, మనవాళ్లతో చెప్పుకున్న కబుర్లు, ఆ జ్ఞాపకాలు.. మనల్నెందుకు వెంటాడాలి? మనల్నెందుకు ఏడ్పించాలి? ఈ పెళ్లిళ్లెందుకవ్వాలి? మనం అసలు ఆడపిల్లలుగా ఎందుకు పుట్టాలి?" అని ఆవేదన చెందే సుహాసినితో మహిళా ప్రేక్షకులు బాగా సహానుభూతి చెందారు.
ఇక ఈ చిత్రంలోని పాటలు మనసుకి ఎంత ఉల్లాసాన్నిచ్చాయో చాలామందికి తెలిసిన సంగతే. కోటి అందించిన స్వరాలకు సీతారామశాస్త్రి సాహిత్యం తోడై పాటలన్నీ హిట్టయ్యాయి. 'ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి', 'నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది', 'ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా', 'నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు', 'ఒక్కసారీ.. చెప్పలేవా నువ్వు నచ్చావనీ' పాటల్లో ఏది జనం నోళ్లలో నానలేదని చెబుతాం! భువనచంద్ర రాసిన ఒకే పాట 'ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా'ది కూడా అదే బాణీ. చిత్రీకరణ విషయంలోనూ ఈ పాటలది అగ్ర తాంబూలమే. రవీంద్రబాబు కెమెరా కళ్లు పాటలన్నింటినీ అందంగా చిత్రించాయి. ఆయా సన్నివేశాలు బాగా పండటానికి అతను తీసిన క్లోజప్ షాట్స్ దోహదం చేశాయి. కొత్తమ్మాయి ఆర్తీ అభినయ సామర్థ్యాన్ని ఆ క్లోజప్సే పట్టించాయి. ఈ సినిమాకి నేపథ్య సంగీతమూ ఒక ప్లస్సే. మూడు గంటల నాలుగు నిమిషాల ఈ సినిమా ప్రేక్షకులకి విసుగు పుట్టించకుండా నవ్వుల నావలా సాగడంలో తోడ్పడిన మరో అంశం అత్యంత ప్రతిభావంతులైన ఎడిటర్లలో ఒకరైన శ్రీకరప్రసాద్ ఎడిటింగ్ నేర్పు. సినిమా అంతా 'కలర్‌ఫుల్'గా భాసించడానికి పేకేటి రంగా కళా నైపుణ్యమూ కారణమే. ఇలా అన్ని విభాగాలూ చక్కగా పనిచేసినందునే 113 ప్రింట్లతో విడుదలైన 'నువ్వు నాకు నచ్చావ్' 93 కేంద్రాల్లో యాభై రోజులు, 57 కేంద్రాల్లో వంద రోజులు నడిచింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది.
కాలేజీ రోజుల్లో అలాగే ఉండేవాణ్ణి
-వెంకటేశ్
సినిమాలో ఈచ్ అండ్ ఎవ్విరి సీన్ నన్ను బాగా ఆకట్టుకుంది. త్రివిక్రం ఈ కథని రెండున్నర గంటల సేపు చెప్పాడు. ఏ కథకీ వెంటనే ఓకే చెప్పని నేను 'నువ్వు నాకు నచ్చావ్' కథ వినగానే ఇమ్మీడియేట్‌గా చేసేద్దామన్నా. ఈ సినిమాలో నేనెంత అల్లరి చేశానో చూశారు కదా. కాలేజీ రోజుల్లో నేనలాగే ఉండేవాణ్ణి. పరీక్షల్లో కాపీ కొట్టడం, అమ్మాయిల్ని కామెంట్ చేయడం.. ఇప్పుడవన్నీ ఎందుకులెండి. అప్పటికీ, ఇప్పటికీ నాలో మార్పు చూసుకుంటే చాలా ఆశ్చర్యమనిపిస్తుంటుంది.
ఈ సినిమా రిలీజయ్యాక మొదట డివైడ్ టాక్ వచ్చింది. 'ఈ ఒక్క సెంటర్లోనే ఆడుతోంది. మిగిలిన సెంటర్లలో కలెక్షన్లు అస్సలు లేవు' అంటూ మాట్లాడేవాళ్లు ఎప్పుడూ చాలామందే ఉంటారు. హిట్టయిన 90 శాతం సినిమాలకు ఇలాంటి టాకే. తర్వాత 'నువ్వు నాకు నచ్చావ్' ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. ఇట్స్ ఎ క్లీన్ ఎంటర్‌టైనర్. చూస్తున్నంతసేపూ అందులో ఇన్వాల్వ్ అయిపోయే వాళ్లే ఎక్కువ.
అప్పట్లో చాలామంది హీరోల పరిచయ సన్నివేశాల్ని చూపించాలంటే.. చేతిని కళ్లకు అడ్డంగా పోనిచ్చి ఫేస్ చూపించడం, కట్ చేస్తే నలభైమంది డాన్సర్లతో డాన్స్ చేయించడం.. ఇది ఓ ఫ్యాషన్‌గా ఉండేది. ఈ పద్ధతిని మార్చాలనుకున్నా. అదే విషయాన్ని దర్శకుడు విజయభాస్కర్‌కి చెప్పా. అలా సికిందరాబాద్‌లో దిగాల్సి ఉండగా నాంపల్లి వద్దే ట్రైన్ దిగటాన్ని నా ఓపెనింగ్ సీన్‌గా చిత్రీకరించి, నా పాత్ర స్వభావాన్ని తెలిపేశాడు.
(వచ్చే వారం 'మనసంతా నువ్వే' ముచ్చట్లు)

Friday, February 25, 2011
హిట్.. హిట్.. హుర్రే...!: నువ్వు నాకు నచ్చావ్
తారాగణం: వెంకటేశ్, ఆర్తీ అగర్వాల్, ప్రకాశ్‌రాజ్, చంద్రమోహన్, సుహాసిని, సుధ, ఎమ్మెస్ నారాయణ, హేమ, సునీల్, తనికెళ్ల భరణి, సిజ్జు, సుదీప, గణేశ్, ఆషా సైనీ, పృథ్వీ, బ్రహ్మానందం, బాబూమోహన్, మల్లికార్జునరావు, చిట్టిబాబు, కల్పనారాయ్
కథ, మాటలు: త్రివిక్రం
పాటలు: సీతారామశాస్త్రి, భువనచంద్ర
సంగీతం: కోటి
గానం: ఎస్పీ బాలు, కుమార్ సాను, చిత్ర, హరిణి, శ్రీరాం ప్రభు, టిప్పు
ఛాయాగ్రహణం: కె. రవీంద్రబాబు
కూర్పు: ఎ. శ్రీకరప్రసాద్
కళ: పేకేటి రంగా
నృత్యాలు: సుచిత్రా చంద్రబోస్, సరోజ్‌ఖాన్, రాజశేఖర్
సమర్పణ: సురేశ్ ప్రొడక్షన్స్
నిర్మాత: స్రవంతి రవికిశోర్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయభాస్కర్
బేనర్: శ్రీ స్రవంతి మూవీస్
విడుదల తేది: 6 సెప్టెంబర్ 2001
పదేళ్ల క్రితం అమెరికాలో ఉద్యోగమన్నా, అమెరికా అల్లుడన్నా మహా క్రేజ్. ఈ పరిణామం మన సమాజంలో తలెత్తడానికి కారణమైంది సాఫ్ట్‌వేర్ బూం. దాన్ని దృష్టిలో ఉంచుకుని 'అమెరికా' వెంపర్లాట కూడదనీ, ప్రేమానుబంధాలే ముఖ్యమనీ చెబుతూ వచ్చిన ఓ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుని, అంతకుమించిన ఆహ్లాదాన్ని పంచి, బాక్సాఫీసు వద్ద విజయ బావుటా ఎగరేసింది. ఆ సినిమా 'నువ్వు నాకు నచ్చావ్'. ఇమేజ్‌ని పట్టించుకోకుండా ప్రతి చిత్రంలోనూ కొత్తదనం కోసం తపించే కథానాయకుడు వెంకటేశ్ ఒక్క ఫైటూలేని ఈ సినిమా చేసి, అందర్నీ ఆశ్చర్యపరచారు. విడుదలకు ముందు ఈ సినిమాకి అంచనాలెన్నో. కారణం కాంబినేషన్! దీనికి ముందు ఏడాది క్రితం కొత్త తారలు నటించగా వచ్చిన 'నువ్వే కావాలి' అనే సినిమా ఓ ప్రభంజనాన్నే సృష్టించిది. దానికి దర్శకుడు కె. విజయభాస్కర్, రచయిత త్రివిక్రం. ఆ ఇద్దరితో కలిసి వెంకటేశ్ చేసిన సినిమా కావడమే 'నువ్వు నాకు నచ్చావ్'కి క్రేజ్‌ని తీసుకొచ్చింది. పైగా 'నువ్వే కావాలి' ఫేం స్రవంతి రవికిశోర్ దీనికీ నిర్మాత. ఇది 3 గంటల 9 నిమిషాల నిడివి సినిమా. అందువల్ల ఓ అరగంట నిడివినైనా తగ్గించి, విడుదల చేయమని చాలామంది శ్రేయోభిలాషులు చెప్పారు. కానీ విజయభాస్కర్ తెరమీదకు తెచ్చిన సినిమా మీద సమర్పకుడు సురేశ్‌బాబు, నిర్మాత రవికిశోర్ పూర్తి నమ్మకాన్ని ఉంచారు. నిడివి తగ్గించకుండా రిలీజ్ చేశారు. విజయం సాధించారు. నిర్మాత నుంచి ఎగ్జిబిటర్ దాకా అందరికీ మంచి లాభాలు తీసుకొచ్చి 2001 సూపర్‌హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది 'నువ్వు నాకు నచ్చావ్'. సుమారు 7 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా 16 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది.
అనంతర కాలంలో నెంబర్‌వన్ స్థాయికి ఎదిగిన ఆర్తీ అగర్వాల్ పరిచయమయ్యింది ఈ చిత్రంతోటే. వెంకటేశ్ సరసన రూపలావణ్యాలతోటే కాక, అభినయంతోనూ ఆర్తీ తెలుగు ప్రేక్షకుల హృదయాలకు గాలం వేసింది. "హీరోయిన్ నందిని పాత్రకి కొత్తమ్మాయిని పరిచయం చేయాలనుకున్నాం. సినిమాలో నందిని మాత్రమే కనిపించాలి కానీ, హీరోయిన్ కనిపించకూడదు. చాలామంది అమ్మాయిల్ని చూశాం. అప్పుడే బాలీవుడ్ సినిమా 'పాగల్‌పన్'లో హీరోయిన్‌గా కనిపించిన కొత్తమ్మాయి మా దృష్టికి వచ్చింది. న్యూజెర్సీలో తల్లిదండ్రులతో పాటు ఉంటున్న ఆమె ఆ సినిమా చేసి, మళ్లీ అక్కడకి వెళ్లిపోయిందని తెలిసింది. ఆమెని పిలిపించాం. ఇక నందిని ఆమే అని డిసైడ్ అయిపోయాం. అలా ఆర్తీ అగర్వాల్ తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది" అని చెప్పారు నిర్మాత రవికిశోర్.
సినిమాలో కీలకమైన నందిని తండ్రి మూర్తి పాత విషయంలో చెప్పుకోదగ్గ సంగతొకటుంది. ఆ పాత్రని ప్రకాశ్‌రాజ్‌తోటే చేయించాలని నిర్మాత, దర్శకుడు సంకల్పించారు. సరిగ్గా అదే టైంలో ప్రకాశ్‌రాజ్ మీద 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) నిషేధం నడుస్తోంది. దాంతో అతని బదులు మరొకర్ని తీసుకోక తప్పని స్ఠితి. "మేం మాత్రం ఆయన కాకుండా మరొకర్ని మూర్తి పాత్రలో ఊహించలేకపోయాం. అందుకని ఆయన పాత్ర వచ్చే సీన్లు మినహా మిగతా సినిమా అంతా తీసేశాం. నిషేధం ఎత్తేశాక 17 రోజుల కాల్షీట్‌తో తన పోర్షన్ పూర్తిచేశాడు ప్రకాశ్‌రాజ్" అని అప్పటి విశేషాన్ని జ్ఞాపకం చేసుకున్నారు రవికిశోర్.
కేవలం ప్రేక్షకుల రివార్డులతోటే సరిపెట్టలేదు ఈ సినిమా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు నందులు ఈ సినిమా ఖాతాలో చేరాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఉత్తమ వినోదాత్మక చిత్రంతో పాటు సుచిత్రకు ఉత్తక కొరియోగ్రాఫర్‌గా, సుహాసినికి ఉత్తమ సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, త్రివిక్రంకు ఉత్తమ సంభాషణల రచయితగా, సవితారెడ్డికి ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా నందులు దక్కాయి. సమకాలీన చిత్రాల్లో టీవీలో ఎక్కువసార్లు ప్రసారమయ్యిందీ, అత్యధిక శాతం వీక్షించిందీ ఈ సినిమానే అనడంలో అతిశయోక్తి లేదు. 'స్వీట్ అండ్ క్యూట్ ఫిల్మ్'గా పేర్కొనదగ్గ ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా మనసుకి ఆహ్లాదమే ఆహ్లాదం.
కథా సంగ్రహం:
నందిని అలియాస్ నందు (ఆర్తీ అగర్వాల్)కి పెళ్ళి నిశ్చితార్థం ఏర్పాటు చేస్తాడు తండ్రి మూర్తి (ప్రకాశ్‌రాజ్). ఆ సమయంలోనే అక్కడకి ఆయన సన్నిహిత మిత్రుడైన శేఖరం (చంద్రమోహన్) కొడుకు వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ (వెంకటేశ్) ఉద్యోగార్థం వస్తాడు. ప్రసాద్ (సిజ్జు)తో నందు నిశ్చితార్థం జరుగుతుంది. రెండు నెలల తర్వాత పెళ్లని ముహూర్తం ఖాయం చేసుకుంటారు. మూర్తి వాళ్ల ఔట్‌హౌస్‌లో దిగుతాడు వెంకీ. అతనూ, నందూ ఒకర్నొకరు ఆటపట్టించుకుంటూ ఉంటారు. వెంకీకి ఉద్యోగం వస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ నందు మనసులో వెంకీ చోటు చేసుకుంటాడు. ఓసారి ఇంట్లోని ఆడవాళ్లంతా గుడికి వెళ్తుంటే తోడుగా వెంకీ కూడా వెళతాడు. అక్కడ 'నువ్వంటే నాకిష్టం. నువ్వు నాకు నచ్చావ్' అని చెబుతుంది నందు. బిత్తరపోతాడు వెంకీ. ఇక్కడికి వచ్చేప్పుడు తండ్రి "వాడి స్నేహం పోతే భరించలేనురా. నువ్వక్కడకు వెళ్లి బాగుపడకపోయినా ఫర్వాలేదు. కానీ నీ వల్ల మా స్నేహం పాడవకుండా ఉంటే అంతే చాలు" అంటూ చెప్పిన మాటలు జ్ఞాపకమొస్తాయి. నందుకి దూరంగా ఉండటమే మంచిదనుకుని బ్యాగ్ సర్దుకుని వెళతాడు. రైల్వే స్టేషనులో మూర్తి ప్రత్యక్షమై అతణ్ని ఇంటికి తీసుకొస్తాడు.
ఊటీలో జరుగుతున్న నందు స్నేహితురాలు ఆషా (ఆషా సైనీ) పెళ్లికి వెంకీని తీసుకువెళ్తారు నందు, ఆమె బాబాయి కూతురు పింకీ. ఆషా పెళ్లవుతుంది. అక్కడ వాటర్ వరల్డ్ బాగుంటుందనీ, వెళ్లమనీ ఆషా చెబితే ముగ్గురూ వెళతారు. మధ్యలో కారు చెడిపోయిన బ్రహ్మానందం వాళ్ల కారెక్కుతాడు. వాటర్ వరల్డ్ దగ్గర చేయీ చేయీ కలిపి పట్టుకున్న వెంకీ నందూల ఫోటో తీస్తాడు బ్రహ్మానందం. నందుకి వెంకీ మరింత సన్నిహితమవుతాడు. నందు పెళ్లి దగ్గర పడుతుంది. మగపెళ్లివారు వచ్చేస్తారు. వెంకీ గదిలోకి వస్తుంది నందు. అతను ఆశ్చర్యపోతే "వెంకీ.. నేననే నీకిష్టమా, కాదా? నిజం చెప్పు" అనడుగుతుంది. "నీకు ప్రేమ కావాలి. మీ నాన్నకి పరువు కావాలి. మా నాన్నకి మీరు కావాలి. అంటే ఈ పెళ్లి జరగాలి. నువ్వెళ్లిపోవాలి. నన్ను మర్చిపోవాలి" అంటాడు వెంకీ.
మగపెళ్లివారి చేతుల్లో వెంకీ, నందూ కలిసి ఉన్న ఫోటో పడుతుంది. అది ఊటీలో బ్రహ్మానందం తీసిన ఫోటో. అది చూసి ఈ పెళ్లి చేసుకోనంటాడు ప్రసాద్. అయితే ఇది మంచి సంబంధమనీ, దీన్నడ్డం పెట్టుకుని ఇంకో కోటి రూపాయలు మూర్తి నుంచి వసూలు చేసుకోవచ్చనీ చెబుతాడు తండ్రి (తనికెళ్ల భరణి). అతని బంధువులు ఆ ఫోటోని మూర్తి చేతిలో పెడతారు. వాళ్లని తిడతాడు మూర్తి. దాంతో వారు వెళ్లిపోతారు. సంగతి తెలిసి రైల్వే స్టేషన్‌కి వెళ్లి ఆ ఫోటో అబద్ధమనీ, తనకీ నందూకీ ఏ సంబంధమూ లేదనీ చెబుతాడు వెంకీ. నందూ దేవత అనీ, ఈ పెళ్లిని జరిపించనీ వాళ్ల కాళ్లు పట్టుకోబోతాడు.
"ఈ పెళ్లే కాదు. దానికసలు పెళ్లే జరగదు. జరగనివ్వను. అదొక మహా పతివ్రత" అంటా ప్రసాద్ తండ్రి అతణ్ని నెట్టేస్తాడు. పెళ్లివారి ప్రవర్తననీ, వెంకీ వాళ్లని బతిమలాడటాన్ని చూసిన మూర్తి వెంకీని ఆగమంటాడు. పెళ్లికొడుకుని తన ఇంటి వాచ్‌మన్‌గా కూడా పనికిరాడంటూ వాళ్లని పొమ్మంటాడు. "ఐ యాం ఎ ఫూల్. నా అల్లుడు అమెరికాలో ఉన్నాడో, లేదోనని చూశాను కానీ, నా కూతురి మనసులో ఉన్నాడా, లేదా అని చూడలేదు. ఇలాంటివాణ్ని పక్కనపెట్టుకుని ఎక్కడెక్కడో వెతికా. ఐయాం సారీ వెంకీ" అని అతణ్ని కావలించుకుంటాడు. వెంకీ, నందూ ఒక్కటవుతారు.
ఆ రెండు పాయింట్లతో ఈ సినిమా తీశాం
-స్రవంతి రవికిశోర్
కథ ఎక్కువగా ఒక ఇంట్లోనే జరుగుతుంది. అందువల్ల ఔట్‌డోర్‌లోనూ కొంత కథ జరిగేటట్లు చూస్తే బాగుంటుందని సురేశ్‌బాబు సూచించారు. అప్పుడు ఊటీ ఎపిసోడ్ వచ్చి చేరింది. ఆషాసైనీ పెళ్లి తతంగం, బ్రహ్మానందం ఎపిసోడ్ అలా వచ్చి చేరాయి. న్యూజిలాండ్‌లో పాటలు తీసేప్పుడు 104 డిగ్రీల జ్వరంలో ఉండికూడా స్టెప్పులేశారు వెంకటేశ్. అలాగే క్లైమాక్స్ సీన్ చేసేప్పుడు ఆర్తీకి కూడా బాగా జ్వరం. అయినా ఎంతో నిబద్ధతతో పనిచేసింది. సినిమాకి కోటి మ్యూజిక్ ఎస్సెట్. పాటలన్నీ హిట్టే. రీరికార్డింగ్‌కి 26 రోజుల టైం తీసుకున్నారు కోటి. టీవీలో ఎన్ని వందలసార్లు వచ్చినా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారంటే, ఆ సినిమా ఇచ్చే ఆహ్లాదం వల్లనే.
ప్రధానంగా రెండు పాయింట్ల మీద ఈ సినిమా చేశాం. అప్పట్లో అమెరికా క్రేజ్ బాగా ఎక్కువ. దాన్ని దృష్టిలో ఉంచుకుని అమ్మాయికి అమెరికా సంబంధం తేవడం కంటే, మనసుకి నచ్చినవాణ్ని తీసుకొస్తే ఆమె సుఖపడుతుందని చెప్పడం ఒక పాయింటైతే, తల్లిదండ్రులకు దూరంగా ఉండంటం కంటే సొంతూళ్లో ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్లవద్ద ఉండటమే ఆనందకరమని చెప్పడం రెండో పాయింట్.
త్రివిక్రం, విజయభాస్కర్ కాంబినేషన్ గొప్పగా వర్కవుట్ అయిన సినిమాల్లో ఇదొకటి. సన్నివేశాల చిత్రణలో విజయభాస్కర్ టైమింగ్‌ని తక్కువ చెయ్యలేం. దానికి మేకింగ్ వాల్యూస్ తోడయ్యాయి.
'ఈ నీలి గగనాన' పాటను భువనచంద్ర రాస్తే, మిగతా అన్ని పాటల్నీ సీతారామశాస్త్రి రాశారు. 'ఒక్కసారి చెప్పలేవా' పాటను ఆయన రాసిన తీరు అమోఘం. అందులో ఎంత అర్థముంది! ఏ పాటనైనా అలవోకగా రాసే ఆయన ఆ ఒక్కపాటకు ఆరు రాత్రులు కష్టపడ్డారు. ఇప్పటి రచయితల్లో కథని ఆయన జీర్ణించుకున్నట్లు ఎవరూ జీర్ణించుకోరు. ఆయన పాటలు కథతో ట్రావెల్ చేస్తాయి. ఆయనతో పనిచేయడమన్నది గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్.
(వచ్చే వారం 'నువ్వు నాకు నచ్చావ్' విజయానికి దోహదం చేసిన అంశాలు)

Thursday, November 18, 2010
సినిమా: లేటు వయసులో సుహాసిని అందాలు!
భర్త పేరుపొందిన గొప్ప డైరెక్టర్ అయినా తను కూడా సొంత అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు తాపత్రయపడే నటి సుహాసిని. అందుకే తమిళంలో చాలా రోజుల క్రితమే డైరెక్టర్‌గా కూడా మారింది. తెలుగులో ఎంతో కాలం నుంచి తల్లి పాత్రలు వేస్తూ ప్రేక్షకులకు సన్నిహితంగా వుంటూ వస్తోన్న ఆమె తాజాగా ఓ సినిమాలో ముదురు నాయిక పాత్రని చేస్తుండటం విశేషం. అదీ రాజేంద్ర ప్రసాద్ సరసన. ఆ ఇద్దరూ కలిసి 'భలేమొగుడు భలేపెళ్లాం' అనే సినిమాలో టైటిల్ రోల్స్ చేస్తున్నారు. కన్నడ డైరెక్టర్ దినేశ్‌బాబు రూపొందిస్తోన్న ఈ సినిమాని జొన్నాడ రమణమూర్తి నిర్మిస్తున్నారు. బట్టల్ని పొదుపుగా ఉపయోగించే గ్లామర్ డాల్ కావేరీ ఝా కూడా ఇందులో ఓ పాత్ర చేస్తోంది. చిత్రమేమంటే కావేరీతో పాటీపడుతూ కొన్ని సన్నివేశాల్లో సుహాసిని గ్లామర్ డ్రెస్సులతో కనిపించబోవడం. ఆమె ధరించిన ఓ డ్రస్సులో అయితే ఎద పొంగులు కూడా దర్శనమిస్తున్నాయి. కుర్ర వయసులోనూ ఆమె ఇలా ఎక్స్‌పోజింగ్ చేయలేదు. ఈ ముదురు వయసులో ఆమె అలాంటి డ్రస్సుల్లో కనిపించనుండటమే ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేక్షకులు ఈ గ్లామరస్ సుహాసినిని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సిందే.
Thursday, November 4, 2010
Subscribe to:
Posts (Atom)