Showing posts with label varun sandesh. Show all posts
Showing posts with label varun sandesh. Show all posts
Friday, May 25, 2012
షాహిద్ ప్రేయసి!
తెలుగులో రాంచరణ్ సరసన 'చిరుత'లోనూ, వరుణ్‌సందేశ్ జోడీగా 'కుర్రాడు'లోనూ కనిపించినప్పటికీ ప్రేక్షకుల్ని అలరించినలేకపోయిన నేహా శర్మ బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మొదట ఇమ్రాన్ హష్మి సరసన 'క్రూక్'లో కనిపించిన ఈ అందాల తార ఇప్పుడు 'తేరీ మేరీ కహాని'లో హీరో షాహిద్ కపూర్ ప్రేయసి పాత్రలో దర్శనమివ్వబోతోంది. "కునాల్ కోహ్లి డైరెక్ట్ చేస్తున్న 'తేరీ మేరీ కహాని'లో ఓ అతిథి పాత్ర చేస్తున్నా. ఆ సినిమా మూడు తరాల కథతో తయారవుతోంది. నేను షాహిద్ సరసన 2012 తరానికి చెందిన అమ్మాయిగా నటించా. కథానుసారం ఇద్దరమూ లండన్ యూనివర్శిటీలో చదువుకుంటాం. అక్కడ ఒకరిపట్ల ఒకరం ఆకర్షనలో పడతాం. అయితే ఆ తర్వాత ఎవరికి వాళ్లం వేరేవాళ్లతో ప్రేమలో పడతాం'' అని తెలిపింది నేహ. 2011 సెప్టెంబర్‌లో ఆమె పాల్గొన్న సన్నివేశాల్ని చిత్రీకరించారు. జూన్ 22న విడుదల కానున్న ఈ చిత్రంలో షాహిద్ సరసన ప్రధాన నాయికగా ప్రియాంకా చోప్రా నటించింది.
Saturday, November 5, 2011
'ప్రియుడు' మీద నమ్మకం పెట్టుకున్న నటి
చూపులకి అక్క అమృతా రావ్ని గుర్తుకుతెచ్చే ప్రీతికా రావ్ 'ప్రియుడు' సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. నటి కాకముందు ప్రీతిక ఓ ఫిల్మ్ జర్నలిస్ట్, మోడల్ కావడం గమనార్హం. 'ప్రియుడు'లో ఆమె వరుణ్ సందేశ్ జోడీగా కనిపించబోతోంది. అయితే ఆమె హైదరాబాద్‌కి తొలిసారి వచ్చింది ఈ సినిమా షూటింగ్ కోసం కాదు. అక్క అమృత, తల్లితో కలిసి 'అతిథి' సినిమా షూటింగ్ సందర్భంగా తొలిసారి వచ్చింది. ఆ సినిమాలో మహేశ్ సరసన అమృత హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ప్రీతిక హీరోయిన్‌గా పరిచయమైన సినిమా ఆర్య సరసన నటించిన తమిళ చిత్రం 'చిక్కు బుక్కు'. మణికందన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2010లో రిలీజైంది. ఓ డైలీలోని ప్రీతిక రాసిన కాలంలో ఆమె ఫోటోచూసి మణికందన్ 'చిక్కు బుక్కు'లో అవకాశమిచ్చాడు.
నిజానికి ప్రీతిక టెన్త్ క్లాస్ చదివేప్పుడే తెలుగు సినిమాలో ఆఫర్ వచ్చింది. అయితే అప్పుడు చదువు మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఆ ఆఫర్‌ని తిరస్కరించింది. ఇప్పుడు వివిధ దేశాల్లో 50 దాకా కమర్షియల్ యాడ్స్ చేసిన ప్రీతిక ఇది సరైన సమయంగా భావించి తెలుగులో అడుగుపెట్టింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పేసుకుని, పరుగులు పెట్టాలని ఆమె భావించడం లేదు. మంచి పాత్రలే చేయాలనేది ఆమె ఉద్దేశం. హిందీ సినిమాల్లోకి వెళ్లడానికి తెలుగు ఓ స్టెప్పింగ్ స్టోన్‌గా ఉపయోగపడుతుందని కూడా ఆమె అనుకోవడం లేదు. ముంబై చిత్రసీమ మాదిరిగానే తెలుగు చిత్రసీమ కూడా చాలా పెద్దదనీ, ప్రస్తుతం ఎన్నో తెలుగు సినిమాలు అక్కడ రీమేక్ అవుతున్నాయనీ ఆమె అంటోంది. 'ప్రియుడు' సినిమా తనకి తెలుగులో బ్రేక్ ఇస్తుందని గట్టిగా నమ్ముతుందామె.

Friday, September 16, 2011
న్యూస్: 'ప్రియుడు'గా 'హ్యాపీడేస్' ఆశిస్తున్న హీరో
మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'బ్రమ్మిగాడి కథ'తో ఓ మోస్తరు విజయాన్ని దక్కించుకున్న కుర్ర హీరో వరుణ్ సందేశ్ త్వరలో 'ప్రియుడు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. 'హ్యాపీడేస్' సినిమాలోని నలుగురు హీరోల్లో మెయిన్ హీరోగా నటించి అందుకు తగ్గట్లే ఇవాళ ఆ నలుగురిలో ఎక్కువ సక్సెస్ సాధించిన వరుణ్ డ్రగ్స్ వివాదంలోనూ ముందున్నాడు. అతను డ్రగ్ ఎడిక్ట్ అయినట్లు బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే తాను అలాంటి వాటికి బహు దూరమని వరుణ్ ఖండించాడు. కొంత కాలంగా టాలీవుడ్‌ని డ్రగ్ రాకెట్ పీడిస్తోంది. కొంతమంది సీనియర్ హీరోలతో పాటు ఎక్కువమంది కుర్ర హీరోలు డ్రగ్స్‌కి బాగా అలవాటు పడ్డారని ఫిలింనగర్ కోడై కూస్తోంది. వరుణ్ రూపంలో కనిపిస్తున్న మార్పులు కూడా అతడు డ్రగ్స్‌కి బానిసయ్యాడేమోననే అనుమానాలు కలిగిస్తున్నాయని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు కూడా. ఏదేమైనా సినిమా కెరీర్ బాగా సాగినంత కాలం అతడికి వచ్చే నష్టమేమీ లేదు. ప్రస్తుత చిత్రం 'ప్రియుడు'లో అతడి సరసన ప్రీతికారావు అనే కొత్తమ్మాయి నటిస్తోంది. ఆమె మరెవరో కాదు, తెలుగులో మహేశ్ జోడీగా 'అతిథి'లో నటించిన అమృతారావు చెల్లెలు! ప్రీతికతో పాటు 'కొత్త బంగారులోకం' నాయిక శ్వేతాబసు కూడా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా శ్రావణ్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. యూత్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో 'హ్యాపీడేస్', 'కొత్త బంగారులోకం' స్థాయి విజయాన్ని ఆశిస్తున్నాడు వరుణ్.
Wednesday, June 29, 2011
ఇంటర్వ్యూ: వరుణ్ సందేశ్
నా కెరీర్‌లో నిలిచిపోయే 'బ్రమ్మిగాడి కథ'
"ఇందులో కష్టాల్లో ఉన్న వాళ్లని ఆదుకునే యువకుడిగా కనిపిస్తా. ఇది నా కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అని చెప్పగలను'' అని చెప్పారు వరుణ్ సందేశ్. వి. ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రజత్ పార్థసారథి నిర్మించిన చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించారు. జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా వరుణ్ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...
నా కెరీర్‌లో తొమ్మిదో చిత్రం 'బ్రమ్మిగాడి కథ'. ఇది 36 గంటల్లో జరిగే కథ. పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్. కామెడీతో పాటు యాక్షన్ కూడా ఉంటుంది. స్క్రీన్‌ప్లే మీద ఆధారపడిన కథ. అది చాలా వైవిధ్యంగా ఉంటుంది.
కమర్షియల్ ఎంటర్‌టైనర్
'మీ శ్రేయోభిలాషి', 'మనోరమ' వంటి సినిమాలు తీసిన ఈశ్వర్‌రెడ్డి తొలిసారి చేసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్. అయినా ఇది మీనింగ్‌ఫుల్ సినిమా. ఓ సందేశం కూడా ఉంటుంది. షూటింగంతా హైదరాబాద్‌లోనే జరిగింది. మమ్మల్ని హైదరాబాదంతా పరుగులు పెట్టించారు డైరెక్టర్.
'యాల యాల' ఐటమ్
కోట చాలా మంచి సంగీతాన్నిచ్చారు. 'యాల యాల' అనే ఐటమ్ సాంగ్ చాలా పెప్పీగా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (నేపథ్య సంగీతం)కి 25 రోజులు వెచ్చించి, చాలా బాగా ఇచ్చారు కోటి. ఇందులో నేను ఫైట్స్ చేశా. అన్నీ ఎమోషనల్ ఫైట్సే. ఒకే ఒక్క ఫైట్‌కి రోప్స్ వాడారు. మిగతావాటిని నేచురల్‌గానే చేశాం.
కష్టాల్లో ఆదుకుంటా
ఇందులో నాది పరిణతి చెందిన పాత్ర. కష్టాల్లో ఉన్న వాళ్లని ఆదుకునే యువకుడిగా కనిపిస్తా. ఇదివరకు నేను చేసిన జోవియల్ రోల్స్‌కు భిన్నంగా సెటిల్డ్‌గా ఉండే పాత్ర. నా పాత్రని కానీ, మిగతా పాత్రల్ని కానీ చాలా బాగా తీర్చిదిద్దిన డైరెక్టర్ ఈశ్వర్‌రెడ్డికే క్రెడిట్ అంతా దక్కుతుంది. ఇది నా కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అని చెప్పగలను.
కొత్త సినిమా
దీని తర్వాత యు.కె. అవెన్యూస్ నిర్మిస్తున్న సినిమాలో చేస్తున్నా. ఎం.ఎస్. రాజు బేనర్‌లోనూ, డైరెక్టర్ సుకుమార్ వద్దా పనిచేసిన శ్రవణ్ దీనికి డైరెక్టర్. అమృతారావ్ చెల్లెలు ప్రీతికా రావు హీరోయిన్.
Friday, November 26, 2010
Thursday, November 11, 2010
సినిమా: ప్రమాదంలో వరుణ్ సందేశ్ కెరీర్!
'హ్యాపీడేస్'తో ఘనంగా తెరంగేట్రం చేసి, 'కొత్త బంగారులోకం'తో తెలుగు చిత్రసీమలో బంగారు సోపానం వేసుకున్నట్లు కనిపించిన బక్క కుర్రాడు వరుణ్ సందేశ్ కెరీర్ అప్పుడే ప్రమాదంలో పడిపోయింది. తొలి రెండు సినిమాల తర్వాత అతను చేసిన నాలుగు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫట్‌మనడమే దీనికి కారణం. ఆ నాలుగు.. 'ఎవరైనా ఎపుడైనా', 'కుర్రాడు', 'మరో చరిత్ర', 'హ్యాపీ హ్యాపీగా'.
వీటిలో 'ఎవరైనా ఎపుడైనా' సినిమాని నిర్మించింది ప్రతిష్టాత్మక సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్. 'కుర్రాడు' తీసింది హిట్ సినిమాల నిర్మాణ సంస్థగా పేరొందిన ఆనంది ఆర్ట్ క్రియేషన్స్. 'మరో చరిత్ర'ని నిర్మించింది తాను పట్టిందల్లా బంగారమనే పేరు తెచ్చుకున్న దిల్ రాజు. వీటిలో 'మరో చరిత్ర' సినిమా మరీ దారుణంగా ఫ్లాపయ్యింది. 'హ్యాపీ హ్యాపీగా' సినిమాతో కచ్చితంగా హిట్టు కొడతానని ఎంతో కాన్ఫిడెన్సుతో వరుణ్ చెప్పిన మాటలు నిజంకాలేదు. ఆ సినిమాని కూడా ప్రేక్షకులు మరో ఆలోచన లేకుండా తిప్పికొట్టారు.
'హ్యాపీడేస్'తో యువత ఆరాధ్య తారగా మారిన అతని కెరీరు అంతలోనే ఇలా ప్రమాదంలో పడటం చిత్రమే. కొండంత ఆశతో చదువుని కూడా పణంగా పెట్టి అమెరికానుంచి వచ్చేసిన అతనికి తోడుగా అతని తండ్రి సైతం మంచి ఉద్యోగాన్ని వదులుకుని కొడుకు కోసం హైదరాబాద్ వచ్చేశాడు. వరుణ్ చేసే సినిమాల విషయంలో ఆయనదే ప్రముఖ పాత్ర. కానీ తన కొడుకు కెరీరుకి ఎలాంటి సినిమాలు పనికొస్తాయనే విషయంలో ఆయన జడ్జిమెంట్ సరిగా ఉండటం లేదనీ, అందుకే వరుణ్ క్రేజ్ వేగంగా మసకబారుతున్నదనీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈనెల 12న వస్తున్న 'ఏమైంది ఈవేళ' సినిమా మీదే అతని భవితవ్యం ఆధారపడి ఉంది. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ నాయికగా నటించిన ఈ సినిమా ద్వారా సంపత్ నంది దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ఆడితేనే వరుణ్ మరికొంత కాలమైనా హీరోగా అవకాశాలు పొందుతాడు. లేదంటే.. చెప్పేదేముంది!

Thursday, September 2, 2010
Movies: Varun Sandesh's image falling down

వరుణ్ సందేశ్ పరిస్థితి ప్రస్తుతం ఏం బాగున్నట్లు లేదు. తొలి రెండు సినిమాలు - 'హ్యాపీడేస్', 'కొత్త బంగారులోకం' సూపర్ హిట్లవడంతో కుర్రకారు ఆరాధ్యతారగా మారిన అతనికి ఇంతవరకు మరో సక్సెస్ దక్కలేదు. 'ఎవరైనా ఎపుడైనా', 'కుర్రాడు', 'మరో చరిత్ర'తో పాటు లేటెస్ట్ ఫిల్మ్ 'హ్యాపీ హ్యాపీగా' కూడా చెట్టేక్కేసింది. ఈ చివరి సినిమా మీద అతను చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ విషయంలో ఎంతో నమ్మకాన్ని కనపర్చాడు. కానీ ప్రేక్షకులు మరోవిధంగా భావించారు. కలెక్షన్లు ఆశించిన రీతిలో లేకపోవడంతో ఎలాగైనా సినిమాని బతికించుకోవాలని నిర్మాతలు కష్టపడుతున్నారు. ఆ సినిమా ఫలితం తర్వాత వరుణ్ ఇమేజ్ మీద నీలినీడలు పరచుకుంటున్నాయి. ప్రస్తుతం అతను హీరోగా రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయి. హీరో ఇమేజ్ మీదే ఆధారపడి బిజినెస్ నడిచే ఇండస్ట్రీ కాబట్టి వాటి బిజినెస్ ఎలా జరగుతుందో చూడాలి. ఏదేమైనా తన కెరీర్ విషయమై వరుణ్ జాగ్రత్త పడాల్సిన సమయమిదే.
Monday, August 30, 2010
Movies: Neha Sharma opposite with Emraan Hashmi

తెలుగులో రాంచరణ్ సరసన 'చిరుత'లో, వరుణ్ సందేశ్ సరసన 'కుర్రాడు'లో నటించిన నేహా శర్మ ఇప్పుడు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ లో ఆమె తొలి సినిమా హీరో కిస్సుల కింగ్ ఇమ్రాన్ హష్మి. అన్నదమ్ములు మహేశ్ భట్, ముఖేష్ భట్ లకు చెందిన విశేష్ ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మించింది. ఆ సినిమా పేరు 'క్రూక్ - ఇట్స్ గుడ్ టు బి బాడ్'. మోహిత్ సూరి డైరెక్టర్. 'ఫ్యాషన్' ఫేమ్ అర్జన్ బజ్వా మరో కీలక పాత్ర చేసిన ఈ సినిమాని రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దారు. విదేశాల్లోని, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న జాతి వివక్ష దాడుల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. అక్టోబర్ 8న ఈ సినిమాని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో రెండు క్రేజీ సినిమాలు చేసినా క్రేజ్ సంపాదించుకోలేకపోయిన నేహా ఇప్పుడు బాలీవుడ్ లో అయినా పేరు తెచ్చుకుంటుందో, లేదో చూడాలి.
Subscribe to:
Posts (Atom)