Showing posts with label manoj. Show all posts

Saturday, March 19, 2016
Saturday, November 15, 2014
Friday, October 10, 2014
Thursday, September 11, 2014
Wednesday, June 18, 2014
Saturday, June 30, 2012
హై వోల్టేజ్ కేరక్టర్‌లో బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ నటించిన చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'. మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్నారు. శేఖర్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. దీక్షాసేథ్ నాయిక. డా.ఎం.మోహన్‌బాబు సమర్పిస్తున్నారు. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతోంది. ఈ చిత్రం గురించి నిర్మాత లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ "విజయవంతమైన చిత్రానికి కావాల్సిన అన్ని హంగులతో మా చిత్రం సర్వసన్నద్ధమవుతోంది. మా అన్నయ్య బాలకృష్ణగారి పాత్రకి హై ఓల్టేజ్ స్పందన వస్తుందనడంలో అనుమానం లేదు. మహిళా ప్రేక్షకులకు, యువతకు విపరీతంగా నచ్చుతుంది. మనోజ్ మంచి పెర్‌ఫార్మర్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో సక్సెస్‌ఫుల్ ప్రామిసింగ్ స్టార్‌గా ఎదుగుతాడు. బోబోశశి సంగీతానికి మంచి స్పందన వస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో కీలక పాత్రలో నేను నటించాను. వచ్చేనెల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు. ప్రభు, సోనూసూద్ తదితరులు ఇతర పాత్రధారులు.
Thursday, June 21, 2012
'దేనికైనా రెడీ'లో ప్రభాస్ నాకు డబ్బింగ్ చెబుతున్నాడు
"ఇందులో నేను నా తరానికి చెందిన నాకిష్టమైన హీరో ప్రభాస్‌ని ఇమిటేట్ చేస్తుంటా. సందర్భానుసారం అతని గొంతుతో మాట్లాడుతుంటా. ఆ డైలాగ్స్‌కి ప్రభాస్ స్వయంగా డబ్బింగ్ చెబుతున్నాడు '' అని చెప్పారు మంచు విష్ణు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా. మోహన్‌బాబు నిర్మిస్తున్న 'దేనికైనా రెడీ'లో ఆయన హీరోగా నటిస్తున్నారు. హన్సిక నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. మంగళవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా జరిపిన సంభాషణలో ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలతో పాటు, మరికొన్ని ఆసక్తికర విషయాల్ని తెలియజేశారు విష్ణు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
'దేనికైనా రెడీ' మూడు పాటలు మినహా సినిమా పూర్తయింది. తమ్ముడు మనోజ్ సినిమా 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' విడుదలయ్యాక ఆ మూడు పాటలూ తీస్తాం. జూలై చివరలో పాటల్నీ, ఆగస్టులో సినిమానీ విడుదల చేస్తాం. యూరప్‌లో రెండు పాటల్నీ, హైదరాబాద్‌లో ఓ పాటనీ తీద్దామనుకుంటున్నాం. ఒకవేళ యూరప్‌కి వెళ్లకపోతే, వాటిని కేరళలో తీస్తాం.
అమ్మ సెంటిమెంట్
ఇది ఫ్యామిలీ నేపథ్యంలో నడిచే వినోదాత్మక చిత్రం. కథంతా కర్నూలులో జరుగుతుంది. ఈ సినిమా లైన్ బీవీఎస్ రవి చెబితే, అతనితో కలిసి కోన వెంకట్, గోపి మోహన్ స్క్రిప్టు డెవలప్ చేశారు. మాటలు మరుధూరి రాజా రాశారు. 'ఢీ'కి తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశంతో దానికి ట్యాగ్‌లైన్‌గా ఉపయోగించిన 'దేనికైనా రెడీ'నే టైటిల్‌గా పెట్టాం. ఈ సినిమాకి ప్రధాన బలం హ్యూమర్. దానితో పాటు చక్కని సెంటిమెంట్ కూడా ఉంది. అది తల్లీ కొడుకుల సెంటిమెంట్. నా తల్లిగా సీత, తండ్రిగా సుమన్ చేశారు. నా తల్లి హిందు అయితే, తండ్రి ముస్లిం. హన్సిక తండ్రిగా ప్రభు చేశారు. విలన్‌గా కోట శ్రీనివాసరావు చేశారు.
ఇందులోనూ బ్రహ్మానందమే
ఈ సినిమాని 'ఢీ'కి సీక్వెల్ అనొచ్చు. 'ఢీ' కంటే పది రెట్లు ఎక్కువ కామికల్‌గా ఉంటుంది. 'ఢీ'కి బ్రహ్మానందం కేరక్టర్ ఎంత ఎస్సెట్ అయ్యిందో తెలిసిందే. ఇందులోనూ ఆయన నాతో పాటే ఉంటారు. 'ఢీ' కంటే పది రెట్లు ఎక్కువ కామెడీ ఆ కేరక్టర్‌లో ఉంది. అందులో 'రావుగారూ నన్ను ఇన్‌వాల్వ్ చెయ్యకండి' అనే మేనరిజమ్‌తో నవ్వించిన ఆయన ఇందులోనూ ఓ మేనరిజమ్‌తో తెగ నవ్విస్తారు. హన్సికతో మొదటిసారి పనిచేశా. ఇప్పటివరకూ నేను పనిచేసిన హీరోయిన్లందరిలోకీ బ్యూటిఫుల్ గర్ల్. ప్రొఫెషనల్‌గా బ్రిలియంట్. ఆమెతో పనిచేయడం నాకెంతో సౌకర్యంగా అనిపించింది. శ్రీను వైట్ల తర్వాత అంత కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి అని చాలామంది అన్నారు. ఆయన్ని అనుకున్నప్పుడు శ్రీను వైట్ల కూడా 'వెరీగుడ్ చాయిస్ విష్ణు. ఆయన బ్రిలియంట్‌గా చేస్తారు' అని చెప్పారు. ఆయనకు మ్యూజిక్ సెన్స్ కూడా బాగా ఎక్కువ. 'ఢీ'కి శ్రీను గారితో ఎంతగా ఎంజాయ్ చేశానో, ఆయన తర్వాత ఇప్పటివరకు నేను ఎంజాయ్ చేసిందీ, అంత కాన్ఫిడెంట్‌గా ఉందీ ఈ సినిమాకే.
ఆశ్చర్యపరిచే విషయాలున్నాయి
ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలున్నాయి. ఇందులో నేను నా తరానికి చెందిన నాకిష్టమైన హీరోని ఇమిటేట్ చేస్తుంటా. సందర్భానుసారం అతని గొంతుతో మాట్లాడుతుంటా. ఆ డైలాగ్స్‌కి ఆ హీరోనే డబ్బింగ్ చెప్పబోతున్నాడు. అతనెవరో కాదు ప్రభాస్. అలాగే కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన విక్రమ్ (ఎమ్మెస్ నారాయణ కుమారుడు)ను యంగ్ విలన్‌గా పరిచయం చేస్తున్నాం. సినిమాలో ఆరు పాటలుంటాయి. ఇప్పటికి రెండు పాటల్ని తీశాం. ఒకటి మాంటేజ్ సాంగ్‌గా వస్తుంది. చక్రి మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా సన్నిహిత మిత్రుడు, దేశంలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన యువన్‌శంకర్ రాజా రెండు పాటలకు ట్యూన్లు ఇచ్చారు. అందుకు ఆయనకి థాంక్స్ చెప్పుకుంటున్నా. ఇక యాక్షన్ సన్నివేశాల్ని సెల్వ మాస్టర్ ఆధ్వర్యంలో చేశాం. నేనెంతో ఇష్టపడి చేశా. ఇటీవలే క్లైమాక్స్ ఫైట్ చేశాం. చాలా గొప్పగా వచ్చింది. మొత్తం నాలుగు ఫైట్లు. ఒకటి తిరుపతిలో, ఒకటి కాళహస్తిలో, రెండు హైదరాబాద్‌లో తీశాం.
తమిళంలోనూ అడుగేస్తున్నా
ఈ సినిమా నుంచి తమిళంలోకి అడుగు పెట్టబోతున్నా. ఇక ప్రతి సినిమా తమిళంలోనూ రిలీజ్ చేస్తాం. బాలీవుడ్‌లోకి ఇప్పుడే వెళ్లే అవకాశం లేదు. ఇంట గెలిచాక అప్పుడు రచ్చ సంగతి చూద్దాం. నాలుగేళ్ల తర్వాత ఇతను తెలుగు నటుడనీ, అతను తమిళ నటుడనీ, హిందీ నటుడనీ భేదాలు ఉండవు. నటుడికి భాషాభేదం అనేది తొలగిపోతుంది. ఉత్తరాది వాళ్లు కూడా కేరక్టర్లకి ఇక్కడి నటుల్ని తీసుకోవాల్సిందే. నా కెరీర్‌లో 'ఢీ' ఒక్కటే బిగ్ హిట్. 'వస్తాడు నా రాజు' రాంగ్ టైమ్‌లో రిలీజ్ కావడం వల్ల ఫెయిలైంది. 'దేనికైనా రెడీ' మీద చాలా నమ్మకంతో ఉన్నాం. దీని తర్వాత నాన్నగారి సలహాలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా నా కెరీర్‌ను ప్లాన్ చేసుకోబోతున్నా.
నలుగురు హీరోల సినిమా
'దేనికైనా రెడీ' తర్వాత 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మరో సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నా. ఇందులో నేను కాకుండా మరో ముగ్గురు నా తరానికి చెందిన హీరోలుంటారు. అంటే మొత్తం నలుగురు హీరోలు. విలన్ కేరక్టర్‌ను నాన్నగారు చేస్తారు. సురేందర్‌రెడ్డి సినిమాలకి సహ దర్శకుడిగా పనిచేసిన తూప్రాన్ శ్రీను చెప్పిన స్క్రిప్టు చాలా బాగా నచ్చింది. అతన్ని శ్రీను వైట్ల పంపించారు. ఇది కామెడీ యాక్షన్ ఫిల్మ్. రెగ్యులర్ సినిమాల తరహాలో హీరోయిన్‌తో డ్యూయెట్లు పాడుకోవడం వంటివి ఇందులో ఉండవు. ఇలాంటి స్క్రిప్టులు అరుదుగా వస్తాయి. రెండు వారాల్లోగా మిగతా ముగ్గురు హీరోలెవరో ప్రకటిస్తాం. వాళ్లు నా స్నేహితులే.
బాలయ్యకు హ్యాట్సాఫ్
నేను, మనోజ్ కలిసి నటించడం ఇప్పుడల్లా జరగదు. అది కష్టం. ఏమన్నా అవకాశాలుంటే అది కె. రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసే పౌరాణిక చిత్రం 'రావణ'లో ఉన్నాయి. కచ్చితంగా చెప్పలేను. అందులో నాన్నగారు టైటిల్ రోల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. హీరోగా మనోజ్ కెరీర్‌కీ, నిర్మాతగా లక్ష్మి కెరీర్‌కీ 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమా చాలా ముఖ్యం. అందుకే దాని మీద చాలా కాన్‌సన్‌ట్రేట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మనోజ్ చేసినవి సన్నని లైన్‌మీద నడిచిన కథలే. అంతా అతని షోనే కనిపిస్తుంది. తొలిసారి అద్భుతమైన కథలో చేస్తున్నాడు. బాలకృష్ణ గారి కేరక్టర్ హైలైట్ అవుతుంది సినిమాకి. ఆయన ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నందుకూ, ఆ పాత్రని చేసిన విధానానికీ హ్యాట్సాఫ్. ఈ తరహా పాత్ర చెయ్యడం ఆయనకు ఇదే తొలిసారి.

Saturday, August 27, 2011
న్యూస్: తెలుగు సినిమాలో శ్రీలంక అందం!
ఓ తెలుగు సినిమా ద్వారా తొలిసారిగా ఓ శ్రీలంక అమ్మాయి హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ఆ సినిమా 'మిస్టర్ రాస్కెల్' కాగా, ఆ అమ్మాయి నదీషా హేమమాలి. చక్కని ముఖ వర్చస్సు, మంచి ఫిజిక్ ఉన్న నదీషా ఈ సినిమాలో పరుచూరి రవీంద్రనాథ్ సరసన నటించింది. ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో కనిపించిన ఆమెకి ఆడిషన్ నిర్వహించి ఈ సినిమాకి ఎంపిక చేశారు రచయితలు పరుచూరి బ్రదర్స్. ఇందులో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆమె మనోజ్ సినిమా 'ప్రయాణం' ద్వారా పరిచయమైన పాయల్ ఘోష్ అలియాస్ హారిక. ఇప్పటివరకు ప్రోమోస్‌లో పాయల్ స్టిల్సే ఎక్కువగా కనిపిస్తూ వచ్చాయి. అయితే దీనికి నదీషా పెద్దగా బాధ పడటం లేదు. "ఈ సినిమాలో ప్రేమ కోసం తపించే మధుమతి అనే ఇంపార్టెంట్ కేరక్టర్ చేశా. హీరోతో షేర్ చేసుకున్న ఓ ఇంటిమేట్ సీన్‌ని మర్చిపోలేను. ఆ సీనులో అడవిలో ఓ పాము నా పక్క నుంచి జరజరా పాక్కుంటూ వెళ్తుంది. నేను భయంతో హీరోని కావలించుకుంటా" అని ఆమె తెలిపింది. తెలుగు వాళ్లు చాలా ఆదరాభిమానాలు చూపిస్తున్నారనీ, అయితే తెలుగు భాష పలకడం తనకి కాస్త కష్టంగా ఉందనీ నిజాయితీగా చెప్పింది ఈ సింహళీ బ్యూటీ. తమిళ దర్శకుడు ఆర్.వి. ఉదయశంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి బ్యాడ్ టాక్ నడుస్తున్నా నదీషా మాత్రం అందరి దృష్టిలో పడింది. రానున్న రోజుల్లో ఆమె మరికొన్ని తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Friday, August 5, 2011
న్యూస్: మంచి సినిమాలకే నందులు!
గతంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకే ఎక్కువ అవార్డుల్ని కట్టబెడుతూ వచ్చిన నంది అవార్డుల జ్యూరీ గత యేడాది నుంచీ అర్థవంతమైన, మంచి చిత్రాలకు అవార్డులనిస్తూ 'నంది'కి గౌరవాన్ని కల్పిస్తోంది. 2010 సంవత్సరానికి దర్శకుడు ఎన్. శంకర్ ఆధ్వర్యంలోని జ్యూరీ ప్రకటించిన అవార్డులు ఈ సంగతిని స్పష్టం చేశాయి. ఈసారి ఉత్తమ అవార్డులు మూడూ విమర్శకుల ప్రశంసల్ని పొందిన సినిమాలకే రావడం గమనార్హం. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క ప్రధాన పాత్రలు పోషించగా క్రిష్ డైరెక్ట్ చేసిన 'వేదం' ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుగుకోగా, 2009 సంవత్సరంలో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని పొందిన 'సొంత ఊరు' దర్శకుడు పి. సునీల్‌కుమార్‌రెడ్డి మత్స్యకారుల దయనీయ జీవితాన్ని ఆవిష్కరించిన 'గంగపుత్రులు' ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సునీల్‌కుమార్‌రెడ్డికే ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కడం గమనార్హం. ఇక తృతీయ ఉత్తమ చిత్రంగా సాయికుమార్, శర్వానంద్, సందీప్ నటించగా దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'ప్రస్థానం' నిలిచింది. ప్రజాదరణ పొందిన చిత్రంగా నిజంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన రాజమౌళి చిత్రం 'మర్యాద రామన్న'ని జ్యూరీ ఎంపిక చేసింది. గతంలో ఈ కేటగిరీలో చాలా చోట్ల అసలు రిలీజే కాని 'పెళ్లాం పిచ్చోడు' అనే రాజేంద్రప్రసాద్ సినిమాని ఎంపిక చేసిన సంగతి జ్ఞాపకం చేసుకుంటే జ్యూరీ ఈసారి ఎంత వాస్తవికంగా పనిచేసిందో అర్థమవుతుంది. అలాగే సకుటుంబంగా చూడదగ్గ ఉత్తమ చిత్రం అవార్డుని చంద్రసిద్ధార్ట్ డైరెక్ట్ చేసిన 'అందరి బంధువయ'కు ప్రకటించారు. సమాజంలో నైతికత, మానవత్వం ముఖ్యమని చెప్పిన ఈ సినిమాని విమర్శకులు ఎంతగానో అభిమానించారు. ఇక జాతీయ సమగ్రతా చిత్రంగా బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణరావు రూపొందించిన 'పరమవీరచక్ర'కు ఇచ్చారు.
వ్యక్తిగత అవార్డుల విషయానికొస్తే ఉత్తమ నటుడి అవార్డు బాలకృష్ణకు దక్కింది. 2001 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 'నరసింహనాయుడు' పాత్ర పోషణకు గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న ఆయన మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆ అవార్డును పొందడం విశేషమే. 'పరమవీరచక్ర'కు కాకుండా, చాలా కాలం తర్వాత ప్రేక్షకాభిమానాన్ని పొందిన 'సింహా'లో చేసిన రెండు పాత్రలకు గాను ఈ అవార్డు ఆయనకు లభించడం గమనార్హం. 2011 సంక్రాంతికి విడుదలైనా, 2010లోనే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన 'అలా మొదలైంది'లో అద్భుతంగా అభినయించిన నిత్యమీనన్ ఉత్తమ నటిగా ఎంపికవగా, ఆ చిత్రాన్ని జన రంజకంగా మలిచిన నందినీరెడ్డి ఉత్తమ తొలిచిత్ర దర్శకురాలిగా నిలిచింది. 'సింహా"కి చక్కని సంగీతాన్నిచ్చిన చక్రి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. తొలి చిత్రమే అయినా 'మర్యాద రామన్న'లో విశేషంగా రాణించిన నాగినీడు ఉత్తమ విలన్‌గా అవార్డును అందుకోనున్నారు. ఇలా అనేక అవార్డులు పారదర్శకంగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

Monday, July 25, 2011
న్యూస్: మనోజ్ కెరీర్‌కి ప్రేక్షకులు ఊ కొడతారా?
ఇప్పటివరకు హీరోగా ఎనిమిది సినిమాల్లో నటించిన మంచు మనోజ్ కెరీర్‌లో ఎన్ని హిట్లున్నాయి? సరిగ్గా చెప్పాలంటే ఒక్కటే. అది 'బిందాస్'. 2010 మొదట్లో వీరు పోట్ల తొలిసారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిజానికి మరింత హిట్టవ్వాల్సింది కానీ నాలుగు వారాల తర్వాత కలెక్షన్లు తగ్గిపోయాయి. అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద అప్పటికే మంచి వసూళ్లను అది రాబట్టింది. క్రిష్ డైరెక్షన్‌లో నటించిన 'వేదం' అందరి ప్రశంసలూ పొందింది కానీ కమర్షియల్‌గా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అందులో వివేక్ చక్రవర్తి పాత్రలో మనోజ్ నటనని విమర్శకులు మెచ్చారు. మొదట్లోనే డైలాగ్ డిక్షన్‌లో స్పష్టత సాధించిన మనోజ్ హావభావాల్లోనూ పరిణతి కనపర్చాడు. హీరోగా తొలి సినిమా 'దొంగ దొంగది'లోనే తన నటనతో అతను ఆకట్టుకున్నాడు. మరైతే అతనికి ఎందుకు హిట్లు దక్కడం లేదు? ఎంచుకుంటున్న సబ్జెక్టులే అందుకు కారణం. ఆఖరుకి కె. రాఘవేంద్రరావు వంటి గొప్ప సీనియర్ డైరెక్టర్ కూడా పాత చింతకాయ సబ్జెక్టుతోటే 'ఝుమ్మంది నాదం' తీయడంతో పాటలు తప్ప మరేమీ ఆకట్టుకోక ఆ సినిమా ఫ్లాపయ్యింది. ఈ నేపథ్యంలో మనోజ్ రెండు రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా', రెండు 'మిస్టర్ నోకియా'. మొదటి సినిమాని శేఖర్ రాజా అనే కొత్త దర్శకుడు తీస్తుంటే, రెండే సినిమాని 'అసాధ్యుడు' (కల్యాణ్‌రాం హీరో), 'జంక్షన్' (పరుచూరి రవిబాబు హీరో) వంటి సూపర్ డిజాస్టర్లను రూపొందించిన అనిల్‌కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. అనిల్‌కృష్ణ ఈ సినిమాకి తన పేరుని 'అని' అంటూ మార్చుకున్నాడు. ఫెయిల్యూర్లు వచ్చిన వాళ్లెందుకు పేరు మార్చుకుంటారో తెలిసిందే కదా. ఈ సినిమాలతో అయినా కమర్షియల్ హీరోగా మనోజ్ తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకో గలుగుతాడా?
Thursday, July 21, 2011
న్యూస్: హీరో అవుతున్న మరో బాల నటుడు
'ఛత్రపతి'లో చిన్నప్పటి ప్రభాస్, 'అతడు'లో చిన్నప్పటి మహేశ్, 'లక్ష్మీ'లో చిన్నప్పటి వెంకటేశ్ జ్ఞాపకమున్నారా? ఆ ముగ్గురూ ఒక్కరే. అతను మనోజ్ నందం. నిన్నటి దాకా మాస్టర్ మనోజ్ అనిపించుకున్న అతను ఇప్పుడు మనోజ్ నందం పేరుతో హీరోగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అతను హీరోగా పరిచయం కాబోతున్న సినిమా పేరు 'తొలిసారిగ...'. ఇటీవలే ఈ సినిమా పాటలు మార్కెట్లోకి వచ్చాయి. ఆగస్టులో ఈ సినిమా విడుదల కాబోతోంది.
"తొమ్మిదేళ్ల క్రితం 'నువ్వు లేక నేను లేను' సినిమాలో హీరో తరుణ్ తమ్ముడిగా నటించడం ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన నేను బాల నటుడిగా 27 సినిమాలు చేశా. చివరగా టీనేజ్ వయసులో '18, 20 లవ్ స్టోరీ'లో నటించి, ఇప్పుడు 'తొలిసారిగ...'తో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నా" అని అతను తెలిపాడు. పవన్‌కల్యాణ్, వెంకటేశ్ సినిమాల్ని బాగా ఇష్టపడుతూ తాను కూడా వారిలా హీరో అవ్వాలనే కలతో ఈ రంగంలోకి వచ్చిన మనోజ్ కాస్త పెద్దవాడయ్యాక కమలహాసన్ నటనతో స్ఫూర్తిపొందాడు. ఆయన చేసే దాంట్లో సగమైనా చేయగలిగే స్థాయికి చేరుకోవాలనేది ఇప్పుడతని ఆశయం. ఇటు క్లాసికల్, అటు వెస్టర్న్ డాన్సులు రెండూ నేర్చుకున్న అతను కరాటేలో బ్లాక్‌బెల్ట్ హోల్డర్. ప్రస్తుతం యాదగిరిగుట్టలోని మాట్రిక్స్ కాలేజీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న 19 యేళ్ల మనోజ్ 'తొలిసారిగ...'తో హీరోగా ప్రేక్షకుల ఆదరణని పొందుతాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

Friday, July 16, 2010
Friday, July 9, 2010
'Vedam' as 'Vaanam' in Tamil
తెలుగులో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'వేదం' సినిమా తమిళంలో 'వానమ్' పేరుతో రూపొందనున్నది. ఈ సినిమాని ఢైరెక్ట్ చేయడానికి ఎట్టకేలకు ఒరిజినల్ మూవీ డైరెక్టర్ క్రిష్ అంగీకరించాడు. తెలుగులో చేసిన పాత్రల్నే అనుష్క, మనోజ్ చేస్తుండగా, అల్లు అర్జున్ చేసిన పాత్రని 'వానమ్'లో శింబు చేస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తుండగా, నీరవ్ షా సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నాడు. గురువారం (జూలై 8) జరిగిన ఫోటో షూట్ శింబుకి థ్రిల్ కలిగించింది. శనివారం ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నది.
Thursday, July 8, 2010
Telugu Cinema Quiz-2
1. 'పప్పు'లో హీరో?
2. 'యమగోల'లో విలన్?
3. 'ద్రోహి'లో కమల్‌హాసన్ భార్య?
4. 'మానసవీణ మధుగీతం' పాట ఏ సినిమాలోనిది?
5. 'భక్త కన్నప్ప'గా నటించిందెవరు?
6. 'బిందాస్'లో మనోజ్ సరసన నాయిక?
7. 'రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా' పాట ఏ సినిమాలోనిది?
8. 'చిన్నమాట ఒక చిన్నమాట' అంటూ 'మల్లెపూవు'లో పాడిన గాయని?
9. రవిరాజా పినిసెట్టి డైరెక్షన్‌లో చిరంజీవి, రాధిక, భానుప్రియ కలిసి నటించిన ఫిల్మ్?
10. శోభన్‌బాబు 'ఇల్లాలు ప్రియురాలు'లో ఇల్లాలు సుహాసిని, మరి ప్రియురాలు?
జవాబులు:
1. కృష్ణుడు
2. రావు గోపాలరావు
3. గౌతమి
4. పంతులమ్మ
5. కృష్ణంరాజు
6. షీనా
7. గోరంతదీపం
8. పి. సుశీల
9. జ్వాల
10. ప్రీతి
Tuesday, July 6, 2010
Manoj and Anushka in Tamil 'Vedam'

క్రిష్ దర్శకత్వంలో రూపొంది ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'వేదం' సినిమా తమిళంలో రీమేక్ కాబోతోంది. ఈ సినిమా తమిళ రీమేక్ హక్కుల్ని మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ పొందిన సంగతి తెలిసిందే. తెలుగులో రాక్‌స్టార్ వివేక్ చక్రవర్తిగా నటించిన మంచు మనోజ్ తమిళంలోనూ అదే పాత్రను చేయబోతున్నాడు. ఇక అల్లు అర్జున చేసిన కేబుల్ రాజు పాత్రని శింబు చేయబోతున్నాడు. తెలుగులో చేసిన వాళ్లలో మనోజ్ కాకుండా అమలాపురం సరోజగా సెక్స్ వర్కర్ రోల్ చేసిన అనుష్క కూడా తమిళంలో చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాని డైరెక్ట్ చేయాల్సిందిగా క్రిష్‌ని అడుగుతున్నారు. మనోజ్, అనుష్కలతో పాటు శింబు కూడా క్రిష్‌పై వత్తిడి తీసుకు వస్తున్నారు. ఈ విషయంపై నేను క్రిష్‌ని అడిగితే తానింకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పాడు. 'వేదం' హిందీ వెర్షన్‌కి డైరెక్షన్ చేయమని కూడా తనని అడుగుతున్నారనీ, అయితే తాను ఎవరికీ ఇంకా మాట ఇవ్వలేదనీ క్రిష్ తెలిపాడు. ప్రస్తుతం తాను కొత్త స్క్రిప్ట్ పనిలో ఉన్నానన్నాడు.
Tapsi.. The Golden Girl

తెలుగు చిత్రసీమలో ఇప్పుడు ఎక్కువమంది జపం చేస్తున్న పేరు తాప్సీ. జూలై 1న విడుదలైన 'ఝుమ్మంది నాదం' సినిమా ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. సినిమాలో ఆమె అందచందాలు.. ముఖ్యంగా ఆమె ముఖారవిందం.. అందర్నీ ఆకట్టుకున్నాయి. మంచు మనోజ్ హీరోగా శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మంచు లక్ష్మిప్రసన్న నిర్మించిన ఈ సినిమాకి డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు. హీరోయిన్లని ఆయన ఎంత అందంగా చూపిస్తారో అందరికీ తెలిసిందే. అయితే స్వతహాగా అందాలరాశి అయిన తాప్సీ సోయగాలు ఈ సినిమాలో మరింత సుందరంగా దర్శనమిచ్చాయి. పాటల్లో తాప్సీని చూసేందుకు రెండు కళ్లు చాల్లేదని కుర్రకారు చెబుతున్నారు. ఒకప్పుడు దివ్యభారతి, టాబు, సిమ్రాన్, నిన్న ఇలియానా తర్వాత ఒకే ఒక సినిమాతో సూపర్‌హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నది తాప్సీనే. వరుసపెట్టి ఆమెకి వస్తున్న ఆఫర్లే అందుకు నిదర్శనం. హీరోలు ఆమె పట్ల తెగ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. 'ఝుమ్మంది నాదం' రిలీజ్‌కి ముందుగానే ఆమె నాలుగు సినిమాలకి సంతకం చేసిందనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్. వాటిలో రెండు సినిమాల సంగతులు తెలిశాయి. మరో రెండు సినిమాలేవో తెలియాల్సి ఉంది. తెలిసిన వాటిలో ఒకటి ప్రభాస్ సినిమా, రెండొది విష్ణు సినిమా. ప్రభాస్‌తో తాప్సీ నటించే సినిమాని దిల్ రాజు నిర్మిస్తుంటే, 'సంతోషం', 'సంబరం', 'స్వాగతం' చిత్రాల దర్శకుడు దశరథ్ రూపొందిస్తున్నాడు. ఇక మంచు విష్ణుతో ఆమె నటిస్తున్న సినిమాని 24 ఫ్రేంస్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా హేమంత్ మధుకర్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు.
ఇంతకీ ఎవరీ తాప్సీ? ఆమె పంజాబీ. అసలు పేరు తపసీ పన్ను. అందరూ తాప్సీ అని పిలుస్తుండటంతో అదే తెరపేరుగా మారిపోయింది. న్యూఢిల్లీలోని జి.టి.బి.ఐ.టి.లో ఇంజనీరింగ్ చదివిన తాప్సీ కాలేజీ రోజుల్లోనే తన డాన్స్ పర్ఫార్మెన్స్‌తో ఢిల్లీవాసుల్ని అలరించేసింది. యుఎస్ఐ, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, వర్ధమాన్, కోకాకోలా వంటి సంస్థలకు మోడల్‌గా పనిచేసే అవకాశాలు దక్కించుకుంది. అంతేనా.. 2008 మిస్ ఇండియా పోటీల్లో 'మిస్ ఫ్రెష్ ఫేస్', 'మిస్ బ్యూటిఫుల్ స్కిన్' అవార్డుల్ని గెలుచుకుంది. కమర్షియల్ యాడ్స్‌లో ఆమె రూపలావణ్యాల వల్లే తెలుగులో 'ఝుమ్మంది నాదం'లోనూ, తమిళంలో 'అదుకాలం'లోనూ అవకాశాలు సంపాదించేసింది. నిజానికి ధనుష్ హీరోగా నటిస్తున్న 'అదుకాలం'లో మొదట నాయికగా త్రిషని ఎంపిక చేశారు. అయితే చివరి నిమిషంలో ఆ అవకాశాన్ని తాప్సీ సంపాదించేసింది. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్‌లో వచ్చే అవకాశాలున్నాయి. తెలుగులో 'ఝుమ్మంది నాదం'లో నటించేప్పుడే నిర్మాత లక్ష్మిప్రసన్నతో ఆమెకి గట్టి అనుబంధమే ఏర్పడింది. అందుకే ఆమెని తన 'ట్రూ మెంటర్'గా చెబుతోంది తాప్సీ. అందుకు తగ్గట్లే ఆమె సూచనల్ని పాటిస్తూ తెలుగులో మంచి కెరీర్ కోసం చేతులు చాస్తోంది. ఆమెకు వస్తున్న అవకాశాలు చూస్తుంటే నేటి టాప్ హీరోయిన్లకు అసూయపుట్టక తప్పదు.
Saturday, June 19, 2010
Ninna 'Gamyam'.. Nedu 'Vedam'
మూసలోపడి కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకి అప్పుడప్పుడు ఎవరో ఒక దర్శకుడు రేపటి మీద ఆశని రేకెత్తిస్తూ వస్తున్నాడు. శేఖర్ కమ్ముల, సాయికిరణ్ అడివి, జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) వంటి దర్శకులు సృజనాత్మకపరంగా తెలుగు సినిమాని ఓ మెట్టుపైకి తీసుకెడతారనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. 'మినిమం గ్యారంటీ' ఉచ్చులో పడకుండా మన సినిమాల్లో చెప్పని కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. 'గమ్యం' సినిమా వచ్చినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. జీవితంలోని వెలుగునీడల్ని, జీవిత సారాంశాన్ని ఇంత అందంగా తియ్యగల దర్శకులు తెలుగులో ఉన్నారా! అన్నదే ఆ ఆశ్చర్యానికి కారణం. ఆవారాగా, ఆకతాయిగా తిరిగే గాలి శీను తనకు ఎదురైన అనుభవాలనుంచి నేర్చుకున్న పాఠాలతో ఎలా ఆఖరుకి త్యాగమూర్తిగా మిగిలాడో చూసి, కళ్లతో పాటు గుండెనీ తడిచేసుకున్నాం. గాలి శీను కళ్ల ముందు నుంచి ఇంకా అదృశ్యమవకుండానే ఇప్పుడు మరో కేబుల్ రాజు ఆ స్థానంలో వచ్చి నిల్చున్నాడు. 'వేదం'లో కేబుల్ రాజుని చూస్తే 'గమ్యం'లోని గాలి శీను జ్ఞాపకమొస్తాడు. ఆకతాయితనంలో గాలి శీనుని మించినవాడు కేబుల్ రాజు. డబ్బుకోసం ఎదుటివాళ్లని బోల్తాకొట్టించడంలో మొనగాడు. డబ్బున్న అమ్మాయి ప్రేమని పొంది, రంగుల కలల్లో విహరిస్తున్నవాడు. ఒకప్పుడు అందరూ ఈసడించుకున్నవాళ్లే, చీదరించుకున్నవాళ్లే చివరాఖరుకి అతడు చేసిన త్యాగానికి
కదిలిపోయి జేజేలు పలికారు. జీవన వాస్తవం అంటే అదే. 'గమ్యం'తో ఎంతగా ఆశ్చర్యపరిచాడో, 'వేదం'తో అంతగానూ అబ్బురపరిచాడు క్రిష్‌లోని డైరెక్టర్. 'గమ్యం'కి మూలం 'మోటార్ సైకిల్ డైరీస్' అన్నారు. 'వేదం'కి ప్రేరణ ఆరేళ్ల క్రితం ఆస్కార్ అవార్డులు పొందిన 'క్రాష్' అంటున్నారు. కావచ్చు. కాకపోవచ్చు. ఒకవేళ అది నిజమేననుకున్నా, ఎంతమంది దర్శకులు ఎన్ని సినిమాల్ని కాపీ కొట్టలేదు. కానీ తెలుగుతనానికి దగ్గరగా, అందంగా, ఆర్ద్రంగా వాటిని మలిచిందెంతమంది? ఆ కళేదో, ఆ విద్యేదో క్రిష్ నేర్చాడనుకోవాలి. తన సినిమాలు హాలీవుడ్ నుంచో, మరో వుడ్ నుంచో వండినవి కాదని అంటాడు క్రిష్. కావాలంటే తన కథల, తన పాత్రల మూలాలు నిజ జీవితంలోనూ, సాహిత్యంలోనూ ఉన్నాయంటాడు. 'వేదం'లో తను సృజించిన ఐదు ప్రధాన పాత్రలే కాక, మిగతా చిన్న చిన్న పాత్రలు కూడా మన కళ్లముందు కనిపించేవేనంటాడు.
'వేదం'అఓ ఐదు ప్రధాన పాత్రలూ ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవే కాదు, వాటి కథలూ భిన్నమైనవే. సంపన్న కుటుంబానికి చెందిన వివేక్ చక్రవర్తి (మంచు మనోజ్) అనే రాక్‌స్టార్, మధ్య తరగతికి చెందిన ముస్లిం యువకుడు రహీముద్దీన్ ఖురేషి (మనోజ్ బాజ్‌పేయి), దిగువ తరగతికి చెందిన కేబుల్ రాజు (అల్లు అర్జున్), పూట గడవడమే కష్టమైన చేనేత కార్మికుడు రాములు (నాగయ్య), సమాజమంతా ఈసడించుకునే, రాత్రి జీవితం మాత్రమే ఉండే వేశ్య అమలాపురం సరోజ (అనుష్క).. ఒక్కొక్కరిది ఒక్కో కథ, ఒక్కో వెత.
తల్లి సైనికుడిగా చూడాలనుకుంటే రాక్‌స్టార్ కావాలనుకున్న వివేక్ చక్రవర్తిలోని స్వార్థం అతణ్ణి ఏ పరిస్థితుల్లో నిలిపిందో, ఆ పరిస్థితుల నుంచి పాఠం నేర్చుకున్న అతను చివరికి అమ్మ గర్వపడే స్థాయికి ఎలా చేరుకున్నాడో చూసి సంతృప్తిపడతాం. దైనందిన జీవితంలో కేబుల్ రాజు వంటి వ్యక్తులు తగలని వాళ్లం ఉండం. కానీ అలాంటివాళ్లు మనకి ఏ సినిమాలోనూ కనిపించలేదు. అందుకే రెబల్‌గా, చిలిపిగా, ఆకతాయిగా కనిపించే పక్కా మాస్ క్యారెక్టర్ కేబుల్ రాజుని మొదట కోపగించుకుంటాం. తర్వాత అతణ్ణి భుజాలమీద పెట్టుకుంటాం. "రాములు కథ అనుకున్నప్పుడు ఒక వృత్తి పనివాణ్ణిగా చూపించాలనుకున్నా. ఇటీవలి కాలంలో సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు హెడ్‌లైన్స్‌లో నిలిచాయి. కథకి రెలటివిటీగా ఉంటుందని రాములుని చేనేత కార్మికుడిగా చూపించా" అని చెప్పాడు క్రిష్. తనకు హైదరాబాద్‌లో ఎదుగుదల ఉండదనీ, అందుకని దుబాయ్ వెళ్లి సంపాదించి, మెరుగైన జీవనం గడపాలనుకునే రాహీముద్దీన్ ఖురేషి లాంటి మధ్యతరగతి జీవులు ఎక్కడ వెతికినా కనిపిస్తారు. అమలాపురం సరోజ పాత్ర సృష్టి వెనుక బాలగంగాధర్ తిలక్ 'ఊరి చివరి ఇల్లు'లోని పాత్ర ప్రేరణ ఉందంటాడు క్రిష్. ఒక వేశ్య అయినా పిల్లవాడికి పాలిచ్చే సరోజని చూసినప్పుడు ఎవరూ ఆమెలో శృంగారాన్ని చూడకపోవడం అతని దర్శకత్వ చాతుర్యానికి నిదర్శనం. ఈ పాత్రల్ని తెరమీద ధరించిన వాళ్లంతా వాటికి న్యాయం చేకూర్చడం వల్ల ఆ పాత్రలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా కేబుల్ రాజుగా అల్లు అర్జున్, సరోజగా అనుష్క తమ నటనతో ఆ పాత్రలకి వన్నెతెచ్చారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో వివేక్ చక్రవర్తి పాత్రలో మనోజ్ హావభావాలు ఒక పట్టాన మరచిపోలేం. అలాగే పటేల్ దగ్గరున్న మనవణ్ణి విడిపించుకుని, అతడి చేయి పట్టుకుని నడిపించుకువెళ్లే రాములులోని రేపటి మీద ఆశ మనల్ని కదిలిస్తుంది. క్రిష్ మనసులోని దృశ్యాలకి జ్ఞానశేఖర్ కెమెరా ఇచ్చిన తెరరూపం అత్యున్నత స్థాయిలో ఉందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. అతడికిది తొలి సినిమా అంటే నమ్మడం కష్టం. పాటల్లో కంటే కీరవాణి కీబోర్డు నేపథ్య సంగీతానికి బాగా ఉపకరించింది. ఆయా సన్నివేశాల్లోని మూడ్ ఎలివేట్ అయ్యింది ఆయన సంగీతం వల్లే. ఎడిటింగ్‌ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఐదు కథల్ని బిగి సడలకుండా, బోర్ కొట్టించకుండా ఆసక్తికరంగా కూర్చడం కత్తిమీద సాము. ఆ పనిని శ్రావణ్ నైపుణ్యంగా చేసుకుపొయ్యాడు. మూస సినిమాల్నే ఇష్టపడే వాళ్ల సంగతేమో కానీ కమర్షియాలిటీని మిస్ కాకుండానే కొత్తదనం కురిసే సినిమాల్ని చూడాలనుకున్న వాళ్లకి 'వేదం' తొలకరి జల్లులాంటిదే.

Subscribe to:
Posts (Atom)