Showing posts with label amitabh bachchan. Show all posts

Friday, April 10, 2015
Saturday, October 18, 2014
Sunday, October 12, 2014
Tuesday, September 30, 2014
Friday, September 26, 2014
Sunday, June 8, 2014
Wednesday, December 4, 2013
Wednesday, July 10, 2013
బాలీవుడ్‌లో రీమేకులు, సీక్వెళ్లు
రానున్న రోజుల్లో బాలీవుడ్‌లో రాబోతున్న కొన్ని రీమేక్స్, సీక్వెల్స్ సినీ ప్రేమికుల్లో అమితాసక్తి రేకెత్తిస్తునాయి. వాటిపై ఓ లుక్కేస్తే...
జంజీర్: 1974లో విడుదలైన 'జంజీర్' సినిమాలో ఇన్‌స్పెక్టర్ విజయ్‌గా యాంగ్రీ యంగ్‌మేన్ పాత్ర చేసిన అమితాబ్ బచ్చన్ రాత్రికి రాత్రి స్టార్ హీరోగా అవతరించారు. విజయ్ పాత్రను కొత్తగా రూపొందించిన అపూర్వ లఖియా 'జంజీర్' 2013 సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో రాంచరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
దిల్ హై కి మాన్తా నహీ: హాలీవుడ్ క్లాసిక్ ఫిల్మ్ 'ఇట్ హ్యాపెండ్ వన్ నైట్' ఆధారంగా రూపొందిన 'దిల్ హై కీ మాన్తా నహీ' సినిమాలో అమీర్‌ఖాన్, పూజాభట్ జంటగా అలరించారు. ఇప్పుడు ఆ సినిమా రీమేక్‌కి పూజాభట్ డైరెక్టర్ కావడం విశేషం. ఆమె చెల్లెలు అలియాభట్, ఇమ్రాన్ హష్మి జంటగా నటించబోతున్నారు.
మాసూం: ఎరిక్ సీగల్ పుస్తకం 'మేన్, వుమన్ అండ్ చైల్డ్' ఆధారంగా నసీరుద్దీన్‌షాతో శేఖర్ కపూర్ రూపొందించిన 'మాసూం' క్లాసిక్ ఫిలింగా పేరుపొందింది. గత ఏడాది 'చిట్టగాంగ్' సినిమాతో జాతీయ అవార్డు పొందిన వేదవ్రత పైన్ ఈ సినిమాకి రీమేక్ చేయాలని ప్లాన్ చేస్టున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖి ప్రధాన పాత్ర చేయనున్నాడు.
సాజన్: మాధురీ దీక్షిత్, సంజయ్‌దత్, సల్మాన్‌ఖాన్ నటించిన సూపర్‌హిట్ ముక్కోణ ప్రేమకథ చిత్రం 'సాజన్'ను నేటి తరం తారలతో సీక్వెల్ చేయనున్నట్లు ఆ సినిమా దర్శకుడు లారెన్స్ డి'సౌజా తెలిపాడు.
బోర్డర్: 1997లో వచ్చిన జె.పి. దత్తా సినిమా 'బోర్డర్' ప్రేక్షకుల, విమర్శకుల ఆదరణ పొందింది. ఇప్పుడు వివిధ యుద్ధ వీరుల జీవితాలతో 'బోర్డర్'కు మూడు సీక్వెల్స్ తీస్తానని ఆయన ప్రకటించారు.
ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్: రాహుల్ బోస్, మల్లికా షెరావత్ వంటి ఆసక్తికర జంటతో రూపొందిన 'ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్' చెప్పుకోదగ్గ రీతిలో విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా తయారవుతున్న 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్'లో విద్యా బాలన్, ఫరాన్ అఖ్తర్ జంటగా నటిస్తున్నారు.
ఇష్కియా: కొత్త దర్శకుడు అభిషేక్ చౌబీ రూపొందించిన 'ఇష్కియా' అంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ వూహించలేదు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా తయారవుతున్న 'దేద్ ఇష్కియా'లో మాధురీ దీక్షిత్, హుమా ఖురేషి, అర్షద్ వార్సి, నసీరుద్దీన్‌షా నటిస్తున్నారు.
ధూం: యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించగా ఒకదాన్ని మించి ఒకటి సూపర్‌హిట్టయిన్ 'ధూల్' సీరిస్‌లో మూడోదైన 'ధూల్ 3' కోసం ఈ యేడాది ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. అమీర్‌ఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కట్రీనా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్‌చోప్రా నటిస్తున్నారు.
విశ్వరూప్: కమల్‌హాసన్ రూపొందించగా 2012లో విడుదలైన 'విశ్వరూప్' ఎంతటి వివాదాన్ని సృష్టించిందో మనకు తెలుసు. ఇప్పుడు దేశాంతర ఉగ్రవాదంపై కమల్ రూపొందిస్తున్న 'విశ్వరూప్ 2' వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
క్రిష్: హృతిక్ రోషన్‌ను సూపర్ హీరోగా చూపిస్తూ రాకేశ్ రోషన్ రూపొందిస్తున్న సినిమా 'క్రిష్ 3'. నవంబర్‌లో రానున్న ఈ సినిమాలో వివేక్ ఓబరాయ్, కంగనా రనౌత్ నెగటివ్ రోల్స్ చేస్తున్నారు.

Wednesday, October 12, 2011
స్పెషల్ స్టోరీ: ఎవర్‌గ్రీన్ యాంగ్రీ యంగ్‌మ్యాన్!
యాంగ్రీ యంగ్‌మ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎవరంటే ఠక్కున స్ఫురించే పేరు అమితాబ్ బచ్చన్. తన కెరీర్‌లో రొమాంటిక్ హీరోగా, కమెడియన్‌గా, 'షరాబీ'గా, డ్రమటిక్ హీరోగా, ఇప్పుడు వయసుమళ్లిన వ్యక్తిగా... ఎన్నో పాత్రలు చేసినా యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గానే ఆయన ప్రేక్షకుల ఆరాధ్యతారగా మారారనడంలో సందేహం లేదు. 1970, '80ల్లో చేసిన అనేక సినిమాల్లో 'విజయ్'గా కనిపించి, విజయ సోపానాలు అధిరోహించి, తన సినీ జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు అమితాబ్. ఇందులో 'విజయ్' పాత్ర సృష్టికర్తలైన సలీమ్ (ఖాన్) - జావెద్ (అఖ్తర్) ద్వయం పాత్ర ఎంతో ఉంది. ఈ విజయ్ పాత్రల్ని ఓసారి పరిశీలిస్తే, వాటికీ, మహాభారతంలోని కర్ణ పాత్రకీ సారూప్యత కనిపిస్తుంది. చిన్నతనంలోనే అన్యాయానికి గురైన యువకుడిగా ఆ పాత్రల్లో దర్శనమిచ్చారు అమితాబ్. 'జంజీర్'లో చిన్నప్పుడే తల్లిదండ్రుల హత్యని కళ్లారా చూసిన ఆయన, అవివాహిత పుత్రుడిగా, తండ్రి ఎవరో తెలీకుండా పెరిగిన యువకుడిగా 'త్రిశూల్'లో కనిపించారు. 'దీవార్'లో అయితే ఓ గొడవలో మొత్తం కుటుంబాన్నే కోల్పోయినవాడిగా కనిపించారు. ఇలాంటి నేపథ్యాలతో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా రూపొందాడు 'విజయ్'. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దుష్టుల అంతం చూసే ఆ పాత్రతో ప్రేక్షకులు సహానుభూతి చెందారు. విజయ్ నవ్వితే వారూ నవ్వారు. విజయ్ ఏడిస్తే వారూ ఏడ్చారు. అతను దుష్టుల్ని వెంటాడి వేటాడి చంపుతుంటే తామే వాళ్లని చంపుతున్నట్లు ఆ పాత్రలో మమేకమయ్యారు. ఆ పాత్రల పోషణతో అంతగా ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేశారు అమితాబ్.
అప్పుడే కాదు, అరవై ఏళ్లు దాటినా కూడా ఆయన పట్ల ప్రేక్షకుల్లో అభిమానం తగ్గలేదనడానికి ఆయన చేసిన సినిమాలే నిదర్శనం. 'సర్కార్', 'కభీ అల్విదా నా కెహనా', 'నిశ్శబ్డ్', 'చీనీ కుమ్', 'భూత్‌నాథ్', 'సర్కార్ రాజ్', 'పా', 'ఆరక్షణ్' వంటి ఒకదానికొకటి పూర్తి భిన్నమైన చిత్రాలతో ఆయన ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసల్ని పొందారు. 'పా' చిత్రంలో చూపులకి అరవై ఏళ్ల వృద్ధుడిగా కనిపించే పన్నెండేళ్ల పిల్లాడి పాత్రను అమోఘంగా పోషించి, జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించడం అపూర్వం. ఇక ఇటీవలే 69 సంవత్సరాల వయసులో 'బుడ్డా... హోగా తేరా బాప్' సినిమాలో యాక్షన్ రోల్ చేసి అబ్బుర పరచడం అమితాబ్‌కే చెల్లింది. ఎన్నిసార్లు ఆరోగ్య సమస్యలు తలెత్తినా మొక్కవోని దీక్షతో, అంకితభావంతో, చలాకీతనంతో నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న బిగ్ బి రానున్న రోజుల్లో మరిన్ని వైవిధ్యభరిత పాత్రలతో మనల్ని ఆశ్చర్యపరచడం ఖాయం.
(అక్టోబర్ 11న అమితాబ్ 70వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా)

Wednesday, July 6, 2011
న్యూస్: ఐశ్వర్య వల్లే 'హీరోయిన్' ఆగింది
ఐశ్వర్యారాయ్ ఇప్పుడు గర్భవతి. ఎంతోమందికి, ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ కుటుంబానికి ఇది సంతోషకరమైన వార్త. పెళ్లయి చాలా కాలమవుతున్నా, ఐశ్వర్య ఇంకా గర్భం దాల్చలేదేమిటనేది కూడా వార్తయిన సందర్భంలో తన కోడలు ఐదు నెలల గర్భవతి అనే సంగతి ప్రపంచానికి మొదటగా అమితాబే తెలిపాడు. అయితే ఈ వార్త కొంతమందికి అశనిపాతమైంది. అది 'హీరోయిన్' సినిమా యూనిట్‌కి. ఆమె గర్భవతి అనే సంగతి తమందరికీ దిగ్భ్రాంతి కలిగించిందని ఆ సినిమా దర్శకుడు మధుర్ భండార్కర్ వాపోతున్నాడు. ఆమె వల్ల 'హీరోయిన్' సినిమా ఆగిపోయింది. అందులో ఆమే హీరోయిన్. ఆమె గర్భవతి అని తెలిసి కొద్ది రోజులైనా ఇప్పటివరకు మౌనంగా ఉన్న మధుర్ ఇప్పుడు నోరు విప్పాడు. "ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు. ఒకటిన్నర సంవత్సరం నుంచీ ఈ ప్రాజెక్టు కోసం నా నెత్తురు ధారపోస్తూ వచ్చా. మాతృత్వం అనేది ఏ స్త్రీకైనా పరిపూర్ణత్వాన్నిస్తుందని నాకు తెలుసు. మాతృమూర్తి కాబోతున్న స్త్రీకి ఆరోగ్య పరిరక్షణ ఎంతో ముఖ్యం. ఆమెని ఇబ్బందికర స్థితికి గురిచెయ్యాలని నేననుకోను. 'హీరోయిన్' మామూలు సినిమా కాదు. 40 లొకేషన్లలో, భారీ జనం మధ్య క్లిష్టమైన సన్నివేశాలతో తీయాల్సిన సినిమా. నా కథలో హీరోయిన్ని జనం చుట్టుముట్టి ఇబ్బంది పెట్టే సీన్లు, శరీరాన్ని కష్టపెట్టే సీన్లు, అడల్ట్ కంటెంట్ వంటివి ఉన్నాయి. నా హీరోయిన్ తెరమీద సిగరెట్ తాగుతుంది. ఒకవేళ ఆమె తాగకపోయినా, అదే సీన్లో మిగతా నటులు సిగరెట్లు తాగుతుంటారు. ఇది గర్భవతికి మంచిది కాదు. 'హీరోయిన్' తీస్తున్నట్లు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా మే 13న ప్రకటించాం. జూన్ 7న షూటింగ్ ప్రారంభించాం. ఈ మధ్యలో 24 రోజుల వ్యవధి ఉంది. కానీ ఐశ్వర్య ఎప్పుడూ తను గర్భవతిననే సంగతి మాకెవరికీ చెప్పలేదు. అందరితో పాటే మేం కూడా న్యూస్ చానల్స్ ద్వారానే తెలుసుకున్నాం. అప్పటికి ఎనిమిది రోజుల షూటింగ్ కూడా జరిగింది. విషయం వినగానే మేమంతా షాక్‌కి గురయ్యాం. తప్పనిసరి స్థితిలో ఆ సినిమాని ఆపేశాం'' అని అతను వివరించాడు.
Saturday, July 2, 2011
న్యూస్: చిరంజీవి ఊగిసలాట
మెగాస్టార్ చిరంజీవి ఊగిసలాట ధోరణి మరోమారు స్పష్టమైంది. 149వ సినిమా 'శంకర్‌దాదా జినాదాబాద్' తర్వాత 150వ సినిమా చేస్తానని ఓసారి, చేయనని ఓసారి పలుమార్లు చెబుతూ వచ్చిన చిరంజీవి నాలుగు రోజుల తర్వాత ఇక సినిమాలకి పూర్తిగా గుడ్‌బై చెప్పి, రాజకీయాల్లోనే కొనసాగుతాననీ, సినిమాల సంగతి తన కుమారుడు రాంచరణ్ చూసుకుంటాడనీ తేల్చి చెప్పారు. కానీ జూన్ 30 రాత్రి ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఏర్పాటైన 'బుడ్డా హోగా తేరా బాప్' ప్రీమియర్ షోలో పరిస్థితి మరోసారి మారింది. అందులో చిరంజీవి 149 సినిమాలతో ఆగిపోవడం ఏమీ బాగాలేదనీ, 150వ సినిమా చేస్తే బాగుంటుందనీ అమితాబ్ బచ్చన్ అనడం, రాంగోపాల్ వర్మ కూడా దానికి వంత పాడటం, ఆ సినిమాని తనే డైరెక్ట్ చేస్తానని పూరి జగన్నాథ్ చెప్పడంతో వెంటనే మనసు మార్చేసుకున్నారు. వర్మ పర్యవేక్షణలో, పూరి డైరెక్షన్లో, అమితాబ్ ఓ గెస్ట్ రోల్ చేస్తే తాను నటిస్తానని కమిటైపోయారు. చిరంజీవి 150వ సినిమా చేస్తే గనుక తాను గెస్ట్ రోల్ చేస్తానని అమితాబ్ అప్పటికప్పుడే చెప్పేశారు.
ఈ ప్రహసనమంతా చూసినవారు చిరంజీవి రెండు రోజుల్లోనే ఇలా తన మనసు మార్చుకోవడం చూసి ముక్కుమీద వేలేసుకున్నారు. మాటిమాటికీ ఇలా మాటలు మార్చేవాడు, కమిట్‌మెంట్ లేనివాడు ఎలా నాయకుడిగా రాణిస్తాడని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఈ ఊగిసలాడే ధోరణి వల్లే రాజకీయాల్లో ఆయన సక్సెస్ కాలేకపోతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. తిరుపతిలో అత్యంత ఆర్భాటంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ఎన్నికల్లో నిల్చుని, 18 సీట్లలో మాత్రమే తన పార్టీని గెలిపించుకో గల్గిన చిరంజీవి పాలకొల్లులో స్వయంగా ఓడిపోవడం ఆయనతో సహా అందర్నీ దిగ్భ్రమగొల్పగా, పార్టీ పెట్టిన రెండేళ్లలోనే ఏ పార్టీమీద కోపంతో కొత్త పార్టీ పెట్టారో, అదే కాంగ్రెస్‌లోనే దాన్ని కలిపేయడం ఆయన చపల మనస్థత్వానికి గట్టి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు సినిమా చేయాలా, వద్దా అనే విషయంలోనూ ఆయనలో స్పష్టత కొరవడిందనీ, ఒక్క మాట మీద నిల్చునే దృఢ సంకల్పం ఆయనలో లేదనీ దీనివల్ల స్పష్టమవుతున్నదనీ వాళ్లు తేల్చి చెబుతున్నారు. ఇక ''అన్నయ్య 150వ సినిమా చేస్తారు, దాన్ని చరణ్ నిర్మిస్తాడు'' అని నాగబాబు ప్రకటించడం కొసమెరుపు.

Monday, June 6, 2011
Subscribe to:
Posts (Atom)