Showing posts with label shriya. Show all posts
Showing posts with label shriya. Show all posts
Wednesday, May 28, 2014
Wednesday, December 18, 2013
Sunday, June 10, 2012
విలువైంది పోగొట్టుకున్నా
కాన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ప్రతి ఏటా ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఇదివరకు సీరియస్ సినిమా ప్రియులే దీనిపట్ల ఆసక్తి చూపించేవారు. ఇప్పుడు కమర్షియల్ సినిమా ప్రియులు కూడా ఆ ఫెస్టివల్ అంటే మక్కువ చూపుతున్నారు. అంతటితో ఆగకుండా అక్కడకి వెళ్తున్నారు. అలాంటి వారిలో అందాల తార శ్రియ కూడా చేరిపోయింది. ఇటీవల కాన్స్‌కు వెళ్లిన శ్రియ అక్కడ తీపి, చేదు అనుభవాలు- రెండింటినీ చవిచూసింది. "కాన్స్‌లో ఎన్నో మంచి మంచి సినిమాలు చూశా. ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన సినిమా ప్రియుల్ని కలుసుకుని, వాళ్లతో మాట్లాడటం మరచిపోలేని అనుభవం'' అని చెప్పింది శ్రియ. మరి చేదు అనుభవం ఏమిటి? "ఈ ఫెస్టివల్ విషయంలో నాకున్న ఒకే కంప్లయింట్ నా వాలెట్ పోవడం. దాంతో పాటు నా క్రెడిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, డైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నా. అది నా ఫేవరేట్ వాలెట్'' అని వాపోయింది శ్రియ.
Thursday, December 22, 2011
బిగ్ స్టోరీ: బాలీవుడ్ పొమ్మంది.. టాలీవుడ్ రమ్మంది!!
రెండు దశాబ్దాల నుంచీ తెలుగులో పరభాషా హీరోయిన్‌లే రాజ్యం చేస్తున్నారని మనకు తెలుసు. కన్నడ నటి సౌందర్యను మినహాయిస్తే మిగిలినవాళ్లలో ఎక్కువమంది బాలీవుడ్ తిరస్కారానికి గురై అక్కడి నుంచి వచ్చినవాళ్లే కావడం గమనార్హం. నిన్న మొన్నటిదాకా తెలుగు తెరపై నగ్మా, అంజలా ఝవేరీ, సిమ్రాన్, సోనాలీ బెంద్రే, ఆర్తీ అగర్వాల్, శ్రియ, రీమాసేన్, జెనీలియా ఓ వెలుగు వెలగగా ఇప్పుడు కాజల్ అగర్వాల్, తమన్నా, హన్సిక, శ్రుతిహాసన్ రాణులుగా చలామణీ అవుతున్నారు.
ఎనభైల చివర్లో బాలీవుడ్ భామల్ని నిర్మాతలు తెలుగులోకి తీసుకు రావడమనే ట్రెండ్ మొదలైంది. దాంతో పాటే హీరోయిన్‌కూ, వ్యాంప్‌కూ మధ్య ఉండే గీత చెరిగిపోయి, హీరోయిన్‌లో వ్యాంప్ మిళితమైపోయింది. వ్యాంప్ వేసే పొట్టి దుస్తులు హీరోయిన్ వొంటిమీదకు చేరాయి. హీరో సరసన ఓ 'ఆడబొమ్మ'గా రూపుదాల్చిందామె. 'కలియుగ పాండవులు' (1986)తో ఖుష్బూ, 'కిరాయి దాదా' (1987)తో అమల, 'సామ్రాట్' (1987)తో సోనం టాలీవుడ్‌కు పరిచయమై బాలీవుడ్ నుంచి హీరోయిన్ల దిగుమతి అనే ధోరణికి తెరతీశారు. అప్పట్నించీ టాలీవుడ్‌లో బాలీవుడ్ తారల ప్రవాహం మొదలైంది. 'ఖయామత్ సే ఖయామత్ తక్' సినిమాతో దేశవ్యాప్తంగా యువతరంలో గుబులురేపిన జుహీ చావ్లా 'ముగ్గురు కొడుకులు' (1988)లో నటించి, తెలుగు ప్రేక్షకుల ఆదరణని చూరగొంది. రాజీవ్ రాయ్ డైరెక్షన్‌లో వచ్చిన బాలీవుడ్ సినిమా 'విశ్వాత్మ'తో హీరోయిన్‌గా పరిచయమైనా, ప్రేక్షకుల గుర్తింపుపొందని దివ్య భారతి 'బొబ్బిలి రాజా' సినిమాతో టాలీవుడ్‌లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తమ తొలి హిందీ సినిమాల్లో పేరు తెచ్చుకోకముందే తెలుగులో ప్రీతీ జింటా 'ప్రేమంటే ఇదేరా'తో, అమీషా పటేల్ 'బద్రి'తో తెలుగులో సక్సెస్ సాధించారు. వీరిలో కొంతమంది తారలు అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ రాణించగా, కొంతమంది తారలు బాలీవుడ్‌లో ఫయిలై, తెలుగులో టాప్ స్టార్లుగా రాణిస్తూ వచ్చారు. పర్ఫార్మెన్స్ కంటే గ్లామర్, ఎక్స్‌పోజింగ్ హీరోయిన్‌కు ప్రాథమిక అర్హత కావడంతో కొత్త ధోరణికి ద్వారాలు తెరుచుకున్నాయి. దివ్యభారతి తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా నగ్మా పేరు తెచ్చుకుంది. సల్మాన్‌ఖాన్ సరసన 'బాజీ' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆమె 'పెద్దింటల్లుడు' (1991) చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి కనిపించింది. 'కిల్లర్', 'ఘరానా మొగుడు' (1992) సినిమాలతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. అప్పట్నించీ బాలీవుడ్ భామలకు తెలుగులో మరింత గిరాకీ.
మధుబాల, అంజలా ఝవేరీ, సాక్షి శివానంద్, సిమ్రాన్, రీమాసేన్, శ్రియ, ఆర్తీ అగర్వాల్ వంటివాళ్లు తెలుగు తెరకు పరిచయమై వరుస అవకాశాలు పొందుతూ వచ్చారు. హిందీలో 'తేరే మేరే సప్నే' తర్వాత సరైన అవకాశాలు రాని సిమ్రాన్ తమిళంలో సక్సెస్ సాధించి, తెలుగులో 'కలిసుందాం రా' (2000) వంటి సూపర్ హిట్ సినిమాతో తారాపథానికెగసింది.
ఇక 'ఇష్టం' వంటి ఫ్లాప్ సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించిన శ్రియ 'సంతోషం' హిట్టయ్యాక వెనుతిరిగి చూడలేదు. కానీ బాలీవుడ్‌లో స్థానం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సోనాలీ బెంద్రేకు హిందీలో 'సర్ఫరోష్' మినహా చెప్పుకోవడానికి మరో సినిమా ఏదీ లేదు. కానీ తెలుగులో తొలిసారి 'మురారి' సినిమాలో నటించాక ఆమెకు ఇక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది. ఒక్క 'పలనాటి బ్రహ్మనాయుడు' తప్పితే ఆమె నటించిన తెలుగు సినిమాలన్నీ విజయం సాధించాయి.
'చిత్రం', 'మనసంతా నువ్వే' సినిమాల్లో మంచి పాత్రలు చేసి, యువతరాన్ని ఉర్రూతలూగించిన రీమాసేన్ అనంతరం సెక్స్ సింబల్‌గా పేరు తెచ్చుకుంది. ఫర్దీన్‌ఖాన్ సరసన ఆమె చేసిన హిందీ సినిమా 'హం హో గయే ఆప్కే' డిజాస్టర్ కావడంతో బాలీవుడ్‌లో ఆమెకు చోటు లభించలేదు. హిందీలో 'పాగల్‌పన్'తో తెరంగేట్రం చేసిన ఆర్తీ అగర్వాల్‌కు మరో బాలీవుడ్ అవకాశం అందని ద్రాక్షే అయింది. కానీ తెలుగులో చేసిన తొలి సినిమా 'నువ్వు నాకు నచ్చావ్'తో ఇక్కడి యువత ఆరాధ్య తారగా మారింది. ఇప్పుడు వీళ్లంతా కళా విహీనమైతే వారి స్థానాల్లో జెనీలియా, కాజల్ అగర్వాల్, హన్సిక, తమన్నా, శ్రుతిహాసన్ వచ్చారు.
'తుఝే మేరీ కసం'తో జెనీలియా, 'క్యూన్.. హో గయా నా'తో కాజల్ అగర్వాల్, 'ఆప్ కా సురూర్'తో హన్సిక, 'చాంద్ సా రోషన్ చెహ్రా'తో తమన్నా, 'లక్'తో శ్రుతిహాసన్ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అయితే ఆ సినిమాల తర్వాత వారికి అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో దక్షిణాదివైపు చూపు సారించారు. తెలుగులో వరుస అవకాశాలతో యూత్ ఐకాన్స్‌గా మారిపోయారు. ఈ అయిదుగురిలో కాజల్, తమన్నా చక్కని అవకాశాలతో అగ్ర నాయిక రేసులో దూసుకుపోతున్నారు. జెనీలియాకు పదేళ్ల తర్వాత బాలీవుడ్ ఛాన్సులు తలుపు తడుతున్నాయి. కమలహాసన్ కూతురు శ్రుతిహాసన్‌కు ఇప్పుడిప్పుడే అగ్ర హీరోలతో పనిచేసే అవకాశాలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆమె టాప్ స్టార్‌గా అవతరించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
బాలీవుడ్ నుంచి ఇంతమంది వెల్లువగా వస్తుంటే, మన తెలుగు తారల సంగతేంటి? సహజంగానే ఈ పరభాషా తారలతో మనవాళ్లు పోటీపడలేక పోతున్నారు. ఇంకోవిధంగా చెప్పాలంటే మన హీరోలే వాళ్లకు తమ సరసన చోటు కల్పించేందుకు ముందుకు రావడం లేదు. అందువల్లే తెలుగమ్మాయిలు అర్చన, మాధవీలత, స్వాతి, బిందుమాధవి కెరీర్ 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్నట్లు ఉంది. తెలుగులో రాణిస్తున్న ఉత్తర భారతీయ అమ్మాయిలు బాలీవుడ్‌లో రాణించలేకపోతుంటే, మన తెలుగు తారలు తెలుగులోనే కాదు ఇంకెక్కడా కూడా రాణించలేక పోతున్నారు. ఇద్దరి మధ్యా కనిపిస్తున్న తేడా అదే.
Saturday, August 6, 2011
న్యూస్: 'రంగం' తర్వాత 'రౌద్రం'!
మెగా సూపర్‌గుడ్ మూవీస్ అధినేత ఆర్.బి. చౌదరి కుమారుడు జీవా తమిళంలో నటించిన సూపర్‌హిట్ ఫిల్మ్ 'కో' తెలుగులో 'రంగం' పేరుతో విడుదలై ఇక్కడ కూడా ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 75 కేంద్రాల్లో 75 రోజులు ఆడిన ఈ సినిమా ఆగస్ట్ 20వ తేదీతో 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. ఆర్.బి. చౌదరి ప్రకారం ఇది 20 సెంటర్లలో శత దినోత్సవం జరుపుకోబోతోంది. ఇందులో ఫొటో జర్నలిస్ట్ అశ్విన్‌గా జీవా నటన అందర్నీ ఆకట్టుకుంది. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో జీవా తాజా చిత్రం 'రౌథిరం'ని 'రౌద్రం' పేరుతో అనువదిస్తున్నారు చౌదరి. రెండు భాషల్లో ఒకేసారి ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందాల తార శ్రియ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా గోకుల్ పరిచయమవుతున్నాడు. ప్రీతి జంగియాని, ప్రకాశ్‌రాజ్, జయప్రకాశ్‌రెడ్డి ప్రధాన పాత్రధారులైన ఈ సినిమా ఆగస్టులోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. చౌదరి పెద్ద కుమారుడు రమేశ్ హీరోగా నిలదొక్కుకోక పోయినా చిన్న కుమారుడు జీవా ఆ లోటును తీరుస్తుండటం గమనార్హం. తమిళంలో మంచి హీరోగా రాణిస్తున్న అతను ఇప్పుడు 'రంగం'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోనూ చోటు పొందాడు. 'రౌద్రం'తో అతను మరింతగా తెలుగువాళ్లని అలరిస్తాడేమో చూడాలి.
Wednesday, July 20, 2011
న్యూస్: శత దినోత్సవ హీరో!
చిన్న హీరోల్లో మినిమం గ్యారంటీ హీరో ఎవరు? నిస్సందేహంగా నరేశ్. అదే 'అల్లరి' నరేశ్! రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఏకైక హీరో. 'అందాల రాముడు', 'మర్యాద రామన్న' సినిమాలతో సునీల్ కూడా కామెడీ హీరోగా సక్సెస్సయినా అతను నరేశ్ లాగా పూర్తి స్థాయి హీరో ఇంకా కాలేదు. కమెడియన్‌గా కొనసాగుతూనే ఉన్నాడు. నరేశ్ ఇతర హీరోల సినిమాల్లో నటిస్తున్నా వాటి సంఖ్య చాలా తక్కువ. ప్రధానంగా అతణ్ణే ఆధారం చేసుకుని ప్రొడ్యూస్ అవుతున్న సినిమాలే ఎక్కువ. అతడి చివరి ఆరు సినిమాల్లో ఫ్లాపయిన ఒకే సినిమా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'శుభప్రదం'. వంశీ తీసిన 'సరదాగా కాసేపు' యావరేజ్ అయితే మిగతా నాలుగు.. 'బెట్టింగ్ బంగార్రాజు', 'కత్తి కాంతారావు', 'అహ నా పెళ్లంట', 'సీమటపాకాయ్' అందరికీ లాభాలు తీసుకొచ్చాయి. 'అహ నా పెళ్లంట' ఇటీవలే శతదినోత్సవం జరుపుకుంది. ఇప్పటి రోజుల్లో అర్థ శతదినోత్సవమే గొప్పనుకుంటే శత దినోత్సవం జరుపుకోవడం నిజంగా విశేషమే. త్వరలో 'సీమటపాకాయ్' కూడా ఆ బాటలోనే 100 రోజులు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం నవ్వించడమే కాదు, ఏడిపించగలనని కూడా 'గమ్యం'తో అతను నిరూపించుకున్నాడు. ఇక త్వరలో అతను ఓ ఇంటరెస్టింగ్ సినిమా చేయబోతున్నాడు. గ్లామరస్ హీరోయిన్ శ్రియ అతనితో జోడీ కట్టబోతోంది. నారాయణ అనే కొత్త డైరెక్టర్ రూపొందించే ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తండ్రి ఈవీవీ సత్యనారాయణ మరణించడంతో నరేశ్ కెరీర్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటాడనే సందేహాలు పొడచూపుతున్న సమయంలో అతడికి వస్తున్న సినిమాలు ఆ అనుమానాల్ని పారదోలుతున్నాయి. ఇక నరేశ్ చేయాల్సిందల్లా క్రమశిక్షణతో మెలగడమే.
Friday, July 1, 2011
Friday, June 24, 2011
Friday, October 29, 2010
Wednesday, September 29, 2010
Tuesday, September 7, 2010
Tuesday, August 31, 2010
Movies: Shriya - The outdated actress

నేడు తెలుగు చిత్రసీమలో టాప్ హీరోయిన్లు ఎవరంటే.. అనుష్క, జెనీలియా, ఇలియానా, కాజల్ అగర్వాల్. తమన్నా కూడా ఆ రేసులోకి రావాలని గట్టి ప్రయత్నమే చేస్తోంది. వీళ్లంతా ఆరేడేళ్లలోపు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లే. టాప్ రేంజిని ఎంజాయ్ చేసి, అంతలోనే డిమాండ్ తగ్గిపోయిన తారల ఉదాహరణలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. లేటెస్టుగా తీసుకుంటే మొన్న వచ్చిన రవితేజ సినిమా 'డాన్ శీను'లో హీరోయిన్ గా నటించిన శ్రియ కెరీర్ ఎలా సాగింది? మూడేళ్ల క్రితం వచ్చిన 'శివాజి'లో రజనీకాంత్ సరసన మెరుపులా మెరిసినా తెలుగులో ఆమెకి హీరోయిన్ అవకాశం వచ్చింది మళ్లీ 'డాన్ శీను'లోనే.
తొమ్మిదేళ్ల క్రితం 'ఇష్టం'తో తెలుగులో తెరంగేట్రం చేసిన శ్రియకు 'సంతోషం', 'నువ్వే నువ్వే', 'ఠాగూర్' సినిమాలు గిరాకీ తెచ్చాయి. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆమె గిరాకీని క్రమేణా క్షీణింపజేశాయి. 'శివాజి' తర్వాత ఆమె ఓ తెలుగు సినిమాలో హీరోయినుగా చేయడానికి మూడేళ్ల కాలం పట్టిందంటే కారణం, ఆమెని 'ఔట్ డేటెడ్ హీరోయిన్'గా పరిశ్రమ భావించడమే. ఈ మధ్యకాలంలో ఆమె ఐటమ్ సాంగ్స్ చేస్తూ కాలం గడిపేసింది. 'డాన్ శీను' రిలీజై వారాలు గడిచిపోయినా 28 ఏళ్ల ఈ ఢిల్లీ సుందరి ఇప్పటిదాకా మరే తెలుగు సినిమాకీ హీరోయినుగా సంతకం చేయలేదు. గణాంకాల ప్రకారం నాలుగేళ్లు కూడా టాప్ రేంజిని ఎంజాయ్ చేయలేకపోయింది శ్రియ.
Wednesday, August 25, 2010
Interview: Shriya
"రవితేజ మామాలు యాక్టర్ కాదు. అన్‌బిలీవబుల్ యాక్టర్. ఈ సినిమా తర్వాత ఆయనకి పెద్ద అభిమానినైపోయా'' అని చెప్పారు అందాల తార శ్రియ. ఆర్.ఆర్. మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించిన 'డాన్ శీను'లో ఆమె రవితేజ సరసన నాయికగా ప్రేక్షకుల్ని అలరించారు. గోపీచంద్ మలినేని డైరెక్టర్. ఈ సినిమా సక్సెస్‌ని సాధించిన సందర్భంగా శ్రియ పత్రికలవారితో మాట్లాడారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
నాలుగేళ్ల తర్వాత ఓ మంచి సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ అయినందుకు ఆనందంగా ఉంది. 'డాన్ శీను' చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్. మా అమ్మతో కలిసి ఈ సినిమా చూశా. భాషతో కొంత సమస్య ఉన్నా సినిమా మొదలై పూర్తయ్యేదాకా నవ్వుతూనే ఉన్నా.
ఒకటే నవ్వు
గోపీచంద్ చాలా బాగా పిక్చరైజ్ చేశాడు. డైరెక్టర్‌గా తొలి సినిమానే ఇంత బాగా తియ్యడం నమ్మశక్యం కాని సంగతి. సినిమాలో మలుపుల్ని బాగా వర్కవుట్ చేశాడు. అతను స్క్రిప్టు చెప్పేప్పుడే నవ్వుతూ ఉండిపోయా. షూటింగ్ చేసేప్పుడు కూడా ప్రతిరోజూ సెట్స్‌మీద నవ్వుతూనే ఉండేదాన్ని. సినిమాలో అంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. నేను ఈ సినిమా చేయడానికి కారణం అదే. నిర్మాతలు చాలా సపోర్టివ్ అంట్ హెల్ప్‌ఫుల్. నన్నో యువరాణిలా చూసుకున్నారు.
రాజా రాజా రవితేజ
రవితేజ మామాలు యాక్టర్ కాదు. అన్‌బిలీవబుల్ యాక్టర్. ఈ సినిమా తర్వాత ఆయనకి పెద్ద అభిమానినైపోయా. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. బ్రహ్మానందంతో చాలా కాలం తర్వాత కలిసి పనిచేయడం హ్యాపీ. అలాగే అలీ, వేణుమాధవ్‌లతో కూడా. అలీ బాల నటుడిగా మొదలుపెట్టి ఇప్పటిదాకా ప్రతి సినిమాలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడం అమేజింగ్. మణిశర్మ మ్యూజిక్ బాగా నచ్చింది. 'రాజా రాజా రవితేజ' పాటంటే మరీ మరీ ఇష్టం.
నా గ్లామర్ రహస్యం
నాది ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పాటు కామెడీ మిళితమైన పాత్ర. అందరూ నేను ఇదివరకటికంటే ఇందులో మరింత గ్లామరస్‌గా కనిపించానని అంటున్నారు. నా ఆరోగ్యానికీ, గ్లామరస్‌గా కనిపించడానికీ కారణం నేను క్రమం తప్పకుండా చేసే యోగా, మెడిటేషన్ అనుకుంటా. వాటితో పాటు మేకప్‌మాన్, హెయిర్ స్టయిలిస్ట్, సినిమాటోగ్రాఫర్‌ల పనితనం కూడా తోడయ్యింది.
ప్రతి పాత్రా భిన్నమైనదే
ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి సినిమా ఒకదానికొకటి భిన్నమైనదే. చేసిన ప్రతి పాత్రా భిన్నమైనదే. ఎక్కువగా పక్కింటమ్మాయి తరహా పాత్రలు చేశా. వాటితో పోల్చుకుంటే 'డాన్ శీను'లో చేసిన దీపు పాత్ర వైవిధ్యమైంది.
ఐటమ్ సాంగ్స్ చేశా
తెలుగులో ఎందుకు నాకు గ్యాప్ వస్తున్నదో నాకు తెలీదు. మధ్యమధ్యలో ఐటమ్ సాంగ్స్ చేశా. పవన్ కల్యాణ్ 'కొమరం పులి'లోనూ నాదో ఐటమ్ సాంగ్ ఉంది.
తెలుగులో కమిట్ కాలేదు
ప్రస్తుతం తమిళంలో ఆర్యతో 'చికు బుకు' చేస్తున్నా. అలాగే ఓ బాలీవుడ్ సినిమాతో పాటు దీపా మెహతా డైరెక్షన్‌లో ఓ ఇంగ్లీషు సినిమా చేస్తున్నా. తెలుగులో ఇంకా ఏమీ కమిట్ కాలేదు.
Sunday, August 22, 2010
Movies: North rejects South heroines

సౌత్ ఇండియన్ హీరోయిన్లకి బాలీవుడ్డులో స్థానం దక్కడం లేదు. ఉత్తరాది ప్రేక్షకుల ఆదరణ లభించడం లేదు. ఇదివరలో శ్రీదేవి, జయప్రదకు ఈ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు అక్కడి ప్రేక్షకుల టేస్ట్ మారినట్టుంది. సౌత్ హీరోయిన్లంటే మొహం చాటేస్తున్నారు. అది శ్రియ అయినా, అసిన్ అయినా, త్రిష అయినా ఒకటే.. ఎవరినీ అభిమానించి ఆదరించడం లేదు. ఈ మార్పు 2007లో శ్రియతో మొదలైంది. ఆమె 'ఆవారాపన్'తో హిందీలో అరంగేట్రం చేసి తిరుగుముఖం పట్టింది. ఆ తర్వాత 2008లో 'జానే తూ యా జానే నా'తో జెనీలియాకి ఈ పరిస్తితే ఎదురైంది. ఆ తర్వాత 'గజిని'తో అసిన్, ఇప్పుడు 'ఖట్టా మీఠా'తో త్రిష కూడా తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఈలోగా ఇటు మాతృభాషలోనూ డిమాండ్ తగ్గిపోయి త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు వీళ్లందరూ. దీన్నించి నేర్చుకోవాల్సిన పాఠమేంటి? టౌను పక్కకెళ్లద్దురో డింగరీ అనేకదూ! లేకపోతే రెంటికీ చెడ్డ రేవడి అవుతారు.
Saturday, August 21, 2010
Movies: Shriya's Exposing
రవితేజ సినిమా 'డాన్ శీను'తో మళ్లీ తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన హీరోయిన్ శ్రియ అందాల ఆరబోత వ్యవహారం ఇప్పుడు ఫిలింనగరులోని చర్చల్లో నలుగుతోంది. తెరమరుగవుతున్న తారలు ప్రేక్షకుల దృష్టిలో పడాలంటే ఇంతకన్నా మార్గం లేదా? శ్రియని గతంలో పక్కింటమ్మాయి పాత్రల్లో చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ స్థాయి దేహ ప్రదర్శనతో చూడలేక పోతున్నారనీ, సినిమాకి ఇదే మైనస్ అయ్యిందనీ ఓ డిస్ట్రిబ్యూటర్ ఆవేదన. విడుదలైన మూడోరోజుకే వసూళ్లు పడిపోవడానికి కారణమిదేనంటూ విశ్లేషణ. కానీ దీనికి ముందు 'మల్లన్న'లోనూ శ్రియ ఈ విధంగానే కనిపించింది. అది డబ్బింగ్ సినిమా కావడం వల్ల ప్రేక్షకులంతగా పట్టించుకోలేదేమో కానీ, ఇప్పుడు తెలుగులోనూ ఇలా దర్శనమివ్వడం జీర్ణించుకోలేకపోతున్నారని పైన చెప్పుకున్న డిస్ట్రిబ్యూటరే కాదు, ఫిలింనగర్ విశ్లేషకులూ అంటున్నారు.
Sunday, August 1, 2010
Sunday, July 25, 2010
Thursday, July 22, 2010
Subscribe to:
Posts (Atom)





































