Showing posts with label prabhu deva. Show all posts
Showing posts with label prabhu deva. Show all posts
Tuesday, January 28, 2014
Sunday, May 27, 2012
హారర్ సినిమాలు ఇష్టం
బాలీవుడ్‌లో వరుసగా రెండు యాక్షన్ సినిమాలు డైరెక్ట్ చేసిన ప్రభుదేవా ఇప్పుడు జనాన్ని భయపెట్టే హారర్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. సల్మాన్‌ఖాన్, ఆయేషా తకియా జంటగా రూపొందించిన 'వాంటెడ్' ('పోకిరి' రీమేక్)తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అతను దాని తర్వాత అక్షయ్‌కుమార్, సోనాక్షి సిన్హా జంటగా 'రౌడీ రాథోర్' ('విక్రమార్కుడు' రీమేక్)ను రూపొందించాడు. కొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండూ యాక్షన్ సినిమాలే. "నా కంటే ఎక్కువగా జనం నేను యాక్షన్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. కానీ నాకేమో హారర్ సినిమాలు చేయాలంటే ఇష్టం'' అని తెలిపాడు ప్రభుదేవా. దక్షిణాదిలో కానీ బాలీవుడ్‌లో కానీ టీమ్ బాగుండటం ముఖ్యమనీ, టీమ్ బాగుంటే చివరకు ఓ స్పానిష్ సినిమానైనా తీసేయొచ్చనీ అతనంటాడు.
ఒరిజినల్‌లో రవితేజ చేసిన పాత్రకు 'రౌడీ రాథోర్'లో అక్షయ్‌కుమార్ సరిగ్గా సరిపోయాడనేది అతని అభిప్రాయం. "అతనికి టైలర్‌మేడ్ కేరక్టర్ కావడం వల్లే అక్షయ్‌ను ఆ పాత్రకు ఎంచుకున్నా. అతనేవిధంగా చేశాడో తెరపై మీరే చూస్తారు. అతనితో పనిచేయడం గొప్పగా భావిస్తున్నా. అతను దర్శకుడి నటుడు'' అని చెప్పాడు ప్రభుదేవా.
Tuesday, November 8, 2011
తొమ్మిదేళ్లు... తొమ్మిది మంది కొత్త దర్శకులు!
కొత్త దర్శకులంటే సిద్ధార్థ్‌కి మోజెక్కువ. అందుకే తొమ్మిదేళ్ల కెరీర్‌లో సరిగ్గా తొమ్మిది మంది కొత్త దర్శకులతో పనిచేశాడు. ఈ వరుసలో వస్తున్న అతడి తదుపరి సినిమా 'ఓ మై ఫ్రెండ్'తో కరీంనగర్‌కి చెందిన వేణుశ్రీరాం దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ఇదే సినిమాతో కేరళకు చెందిన రాహుల్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఆడియో సక్సెస్ అవడంతో ఈ సినిమా విజయంపై సిద్ధుతో పాటు నిర్మాత దిల్ రాజు చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాడు. తమ బేనర్‌లో ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు వచ్చాయనీ, కానీ 'ఓ మై ఫ్రెండ్' గ్రేట్ ఫిల్మ్ అవుతుందనీ గొప్పగా చెప్పాడు. సిద్ధు విషయానికొస్తే అతడి 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో ఫేమస్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డైరెక్టర్‌గా అవతారమెత్తి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. ఆ తర్వాత కాలంలో సిద్ధు నటించిన 'చుక్కల్లో చంద్రుడు' ద్వారా మణిరత్నం శిష్యుడు శివకుమార్, 'బొమ్మరిల్లు' ద్వారా భాస్కర్, 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ద్వారా డాలీ, 'ఓయ్!'తో ఆనంద్ రంగా, 'బావ'తో రాంబాబు, 'అనగనగా ఓ ధీరుడు'తో సూర్యప్రకాశ్, '180'తో జయేంద్ర డైరెక్టర్లుగా పరిచయమయ్యారు. వీరిలో ప్రభుదేవా, భాస్కర్ మాత్రమే సక్సెసయ్యారు. '180' సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని సిద్ధు గట్టిగా నమ్మాడు. అయితే విమర్శకుల ప్రశంసలు పొందిన స్థాయిలో ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్ని గెలవలేకపోయింది. ఇప్పుడు 'ఓ మై ఫ్రెండ్'తోనైనా అతడికో హిట్టు వస్తుందేమో చూడాలి.
Wednesday, July 6, 2011
న్యూస్: నయనతార కెరీర్ ముగిసినట్లేనా?
కేరళ కుట్టి నయనతార నట జీవితం ఇక ముగిసినట్లేనా? ప్రస్తుతానికైతే అవుననే చెప్పాలి. ఆమె చివరి చిత్రాన్ని తెలుగులోనే చేసింది. అది 'శ్రీరామరాజ్యం'. ఇందులో ఆమె రామాయణ గాథలోని సీత పాత్ర చేసింది. ఒక పౌరాణిక సినిమాతో కెరీర్‌కి ఆమె ముగింపు పలుకుతుండటం విశేషమనే చెప్పాలి. అందుకే చివరి రోజు షూటింగులో ఆమె బాగా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టేసుకుంది కూడా. ఆఖరి రోజు ఆమె పాల్గొన్న చివరి సీను ముగియగానే అక్కడున్న యూనిట్ సభ్యులంతా ఆమెపై పూల వర్షాన్ని కురిపించారు. నిర్మాత సాయిబాబు స్వయంగా ఆమె మీద పూలు చల్లి రెండు చేతులతో నమస్కరించారు. అందరికీ దండం పెడుతూ, కళ్ల నుంచి చెంపలమీదికి నీళ్లు కారుతుండగా దర్శకుడు బాపు పాదాలకి నమస్కరించింది నయనతార. ఆయన ఆమెని ఆశీర్వదించారు. ఈ సినిమా యూనిట్‌ని వీడిపోతున్నానన్న బాధో, ఇదే చివరి సినిమా అనే ఆవేదనో కానీ ఆమె మొత్తానికి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీరామునిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సీతారాములుగా ఆ ఇద్దరూ తెరమీద కనిపిస్తారనేది ఆసక్తికరం. ఇదివరకు 'లవకుశ'లో సీతారాములుగా అంజలీదేవి, ఎన్‌టీ రామారావు అమోఘంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు అదే కథతో తీసిన 'శ్రీరామరాజ్యం'లో బాలకృష్ణ, నయనతార ఆ పాత్రల్లో ఆకట్టుకునే అవకాశాలున్నాయి. 'సింహా'లో ఆ ఇద్దరూ ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. మొదట 'శ్రీరామరాజ్యం'లో చేయడానికి నయన వెనుకాడింది. ప్రభుదేవాతో పెళ్లి నిర్ణయం జరిగాక సినిమాలకి గుడ్‌బై చెబుతున్నట్లు ఆమె ప్రకటించింది. అయితే బాలకృష్ణ ఆమెనే సీతగా కోరుకోవడం, దర్శకుడు బాపు కావడం వల్లే ఆమె చివరి నిమిషంలో సీతగా నటించేందుకు అంగీకారం తెలిపింది. యూనిట్ వర్గాల ప్రకారం ఆ పాత్రని ఆమె సమర్థంగా పోషించింది. అందుకే తృప్తికరంగా సినిమాలకు సెలవు చెప్పింది నయనతార. ఈ సినిమా తర్వాత ఆమె తెరమీద కనిపించే అవకాశాలు లేనట్లే.
Thursday, September 2, 2010
Movies: Where is Nayantara?

ఇవాళ కేరళ కుట్టి నయనతారది తెలుగులో టాప్ రేంజే అయినా ఆశ్చర్యంగా ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ప్రభుదేవాని పెళ్లి చేసుకుని సినిమాలకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉంది కాబట్టి కొత్తగా ఆమె సినిమాలని ఒప్పుకోవడం లేదని అంటున్నారు. అయితే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నందువల్లే ఆమె అవకాశాల్ని లేత హీరోయిన్లు లాగేసుకుంటున్నారని ఫిలింనగర్ వర్గాల వాదన. ఐదేళ్ల క్రితం వచ్చిన 'చంద్రముఖి'లో రజనీకాంత్ కి జోడీగా తళుక్కున మెరిసిన ఈ 26 సంవత్సరాల అందాల భామ 'లక్ష్మీ', 'దుబాయ్ శీను', 'తులసి' సినిమాలతో పాటు ఈ ఏడాది 'అదుర్స్', 'సింహా' సినిమాల్లో అబ్బాయ్, బాబాయ్ లతో అంటే జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణలతో స్టెప్పులేసి అలరించింది. అయినప్పటికీ ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా లేకుండా పోయింది.
Friday, August 27, 2010
Gossip: Prabhudeva follows Prakash Raj's foot steps

ప్రకాశ్ రాజ్ బాటలో నడవాలని ప్రభుదేవా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొన్ననే బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మని ప్రకాశ్ పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రకాశ్ కి ఇది రెండో పెళ్లి. అతని మాదిరిగానే నయనతార మెళ్లో మూడు ముళ్లు వేయాలని ప్రభుదేవా భావిస్తున్నాడు. అందుకు తగ్గట్లే నయనతార సైతం కొత్తగా ఏ సినిమాకీ సంతకం చేయలేదు. తెలుగులో వచ్చిన ఓ పెద్ద అవకాశాన్ని కూడా ఆమె తిరస్కరించింది. ప్రస్తుతం చేస్తున్న తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్ని పూర్తిచేసి, పెళ్లితో సినిమాలకి గుడ్ బై చెప్పనున్నట్లు వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది డిసెంబరులోనే ప్రభు, నయన్ దంపతులయ్యే అవకాశముంది.
Subscribe to:
Posts (Atom)



