Showing posts with label sonam kapoor. Show all posts
Showing posts with label sonam kapoor. Show all posts

Thursday, September 16, 2010

బాలీవుడ్: హిందీ 'ఇటాలియన్ జాబ్'లో సోనమ్ కపూర్


హాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'ద ఇటాలియన్ జాబ్' బాలీవుడ్ లో రీమేక్ కాబోతోంది. దర్శక ద్వయం అబ్బాస్-ముస్తాన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం వాళ్లు చేస్తున్న అన్వేషణ ఫలించింది. ఆ అవకాశం సోనమ్ కపూర్ ని వరించింది. అంతకుముందు ఈ పాత్రకు కరీనా కపూర్, కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రాలను వారు సంప్రదించారు. కానీ డేట్స్ ప్రాబ్లెమ్ వల్ల వాళ్లు చేయలేమన్నారు. మొదట సోనమ్ కి సైతం అదే సమస్య వచ్చింది. పంకజ్ కపూర్ డైరెక్ట్ చేస్తున్న 'మౌసమ్' సినిమా కోసం ఆమె కాల్శీట్లు బ్లాక్ అయివున్నాయి. దాంతో సోనమ్ తండ్రి అనిల్ కపూర్ రంగంలోకి దిగాడు. పంకజ్ కపూర్ తో మాట్లాడాడు. ఫలితంగా అబ్బాస్-ముస్తాన్ సినిమాకి సోనమ్ డేట్స్ అడ్జెస్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు పంకజ్.
హాలీవుడ్ లో మొదట 1969లోనూ, తర్వాత 2003లోనూ వచ్చిన 'ద ఇటాలియన్ జాబ్' రెండు సార్లూ సూపర్ హిట్టయ్యింది. 2003 వెర్షన్ లో చార్లీజ్ థెరాన్ చేసిన పాత్రను ఇప్పుడు సోనమ్ చేయబోతోంది.