Showing posts with label kamalini mukherjee. Show all posts
Showing posts with label kamalini mukherjee. Show all posts
Friday, September 26, 2014
Saturday, December 17, 2011
ప్రివ్యూ: రామాచారి
విజయవంతమైన 'గోపి గోపిక గోదావరి' తర్వాత వేణు, కమలిని ముఖర్జీ జంటగా నటించిన సినిమా 'రామాచారి'. 'ఈడో పెద్ద గూఢచారి' అనేది ట్యాగ్‌లైన్. ఇదివరకు 'సిద్ధు.. ఫ్రం సికాకుళం', 'సీతారాముల కల్యాణం.. లంకలో' చిత్రాల దర్శకుడు జి. ఈశ్వర్‌రెడ్డి (ఈశ్వర్ ఘనాపాటి) ఈ సినిమాకి దర్శకుడు. ఎస్.పి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై పి. వెంకట శ్యాంప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ బేనర్‌లో వేణుకి ఇది ఆరో సినిమా. తనకు ఇదివరకు హిట్లని అందించిన కామెడీని నమ్ముకుని ఈ సినిమా చేశాడు వేణు. మలయాళంలో దిలీప్ హీరోగా నటించగా హిట్టయిన 'సి.ఐ.డి. మూస'కి ఇది రీమేక్. వాస్తవానికి ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు పొందారు. ఆయనను కన్విన్స్ చేసి, ఆ హక్కులు తీసుకుని 'రామాచారి' తీశారు వేణు, శ్యాంప్రసాద్. టైటిల్‌కు తగ్గట్లు వేణు ఇందులో రామాచారి అనే డిటెక్టివ్‌గా నటిస్తే, ఓ ఫ్లోరిస్ట్ కేరక్టర్‌ను కమలిని పోషించింది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ఎస్సెట్ అని దర్శకుడు చెబుతున్నాడు. 2012 జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.
సుత్తివేలు, బాలయ్య, మురళీశర్మ, రాజ్‌ప్రేమి, ప్రభు, హర్షవర్ధన్, ఇందూ ఆనంద్, రమాదేవి, ఆనంద్, లిరీష తారాగణమైన ఈ సినిమాకు కథ: ఉదయ్‌కృష్ణ, సి.బి.కె. థామస్, మాటలు: వి. విక్రంరాజ్, డొంగ్రోత్ నాగరాజు, రైటర్ మోహన్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: సతీశ్, కొరియోగ్రఫీ: శేఖర్, ప్రసన్న.
Saturday, December 10, 2011
బిగ్ స్టోరీ: ఎదగని హీరో!
ఆరడుగుల మించి పొడగరీ, స్ఫురద్రూపీ అయిన హీరో అతను. డైలాగులు చెప్పడంలో మంచి టైమింగ్, కామెడీ పండించగల నేర్పు అతని సొంతం. అయినా పన్నెండేళ్ల క్రితం 'స్వయంవరం' అనే సినిమాతో హీరోగా పరిచయమై, ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నా కెరీర్ పరంగా ఎక్కడివాడక్కడే నిల్చుండిపోయాడు. అతను వేణు! ఈశ్వర్ ఘనాపాటి (జి. ఈశ్వరరెడ్డి) డైరెక్ట్ చేయగా త్వరలో విడుదలవుతున్న 'రామాచారి... ఈడో పెద్ద గూఢచారి' సినిమా తన కెరీర్‌కు ఊపునిస్తుందని అతను గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈశ్వర్ ఇదివరకు 'సిద్ధు.. ఫ్రం సికాకుళం', 'సీతారాముల కల్యాణం.. లంకలో' సినిమాల్ని రూపొందించాడు. 'రామాచారి' సినిమా మలయాళంలో దిలీప్ నటించిన సూపర్ హిట్ మూవీ 'సి.ఐ.డి. మూస'కు రీమేక్.
విజయబాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'స్వయంవరం' (1999) సినిమా అనూహ్యంగా బాక్సాఫీసు వద్ద విజయం పొందడంతో అందులో తొలిసారి హీరోగా కనిపించిన వేణు పేరు యువతలోనూ, ఫ్యామిలీ ప్రేక్షకుల్లోనూ నానింది. జి. రాంప్రసాద్ రూపొందించిన 'చిరునవ్వుతో' (2000) చిత్రం అతణ్ణి ప్రేక్షకులకి మరింత సన్నిహితం చేసింది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలు ఫ్లాపయ్యేసరికి ఒక్కసారిగా వెనుకపడిపోయాడు. 2001 ఆఖర్లో అర్జున్, జగపతిబాబు హీరోలుగా వచ్చిన 'హనుమాన్ జంక్షన్' సినిమాలో మూడవ హీరోగా నటించినప్పటికీ, కామెడీ నటనతో ఆకట్టుకోగలిగాడు. తర్వాత సంవత్సరం మామూలే.
2003లో 'పెళ్లాం ఊరెళితే', 'కల్యాణరాముడు', 'ఖుషీఖుషీగా' సినిమాల బాక్సాఫీసు విజయంతో ఊరడిల్లిన అతనికి మళ్లీ ఒక హిట్టంటూ దక్కింది 2007లో శ్రీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన 'యమగోల మళ్లీ మొదలైంది' సినిమాతోటే. వీటిలో అతడు సోలో హీరోగా కంటే కాంబినేషన్‌తోనే ఎక్కువగా సక్సెస్ అయ్యాడు. ఇంతదాకా సాఫ్ట్, కామెడీ హీరో పాత్రలూ, సెకండ్, థర్డ్ హీరో పాత్రలూ చేస్తూ రావటాన అతడికంటూ ఓ ఇమేజ్ రాలేదు.
2009లో వంశీ దర్శకత్వంలో సోలో హీరోగా చేసిన 'గోపి గోపిక గోదావరి' సినిమా పేరుకి హిట్టయ్యిందే కానీ వేణుకి దానివల్ల దక్కిన ప్రయోజనం ఏమీ లేదు. దాన్ని కమలినీ ముఖర్జీ సినిమా, వంశీ సినిమాగానే అందరూ చెప్పుకున్నారు. ఇటీవల చార్మి జతగా చేసిన 'మాయగాడు' మీద అతడు పెట్టుకున్న నమ్మకం వమ్మయింది. ఇప్పుడు అతడి ఆశలన్నీ 'రామాచారి' మీదనే ఉన్నాయి.
ఇప్పటివరకు వేణుకి కలిసివచ్చింది ఎక్కువగా కామెడీ సినిమాలే. 'రామాచారి' అలాంటి కామెడీ మీద ఆధారపడిన సినిమా. ఇందులో అతడి సరసన రెండోసారి కమలిని నాయికగా చేసింది. 'గోపి గోపిక గోదావరి' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేయడం ఒక ప్లస్ పాయింటే. పోతే ఈ సినిమాని ఎస్.పి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్ నిర్మించింది. ఈ బేనర్‌లో వేణుకి ఇది ఆరో సినిమా కావడం గమనార్హం. అంటే ఇది అతనికి సొంత బేనర్ వంటిదే.
కాగా వేణు ఇప్పుడు కేరక్టర్ ఆర్టిస్టుగానూ నటించేందుకు అంగీకరించడం ఆసక్తికర పరిణామం. ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న 'దమ్ము'లో అతను ఎన్టీఆర్ బావగా నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదలయ్యాక అతడికి ఆ తరహా అవకాశాలు మరిన్ని వచ్చే వీలుంది. ఓ వైపు హీరోగా, మరోవైపు కేరక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ కొనసాగిస్తున్న శ్రీహరి బాటలో నడిస్తే అతడికి వచ్చే నష్టమేమీ ఉండదు. పైగా ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు రావచ్చు కూడా. ఏదేమైనా తనకంటూ మార్కెట్ సృష్టించుకోగలిగే హీరోయే ఇవాళ చిత్రసీమలో మనగలుగుతాడు. లేదంటే మనుగడ కోసం నిరంతర పోరాటం తప్పదు.
Sunday, August 28, 2011
న్యూస్: కమలినికి కొత్త అవకాశాల్లేవ్!
బెంగాలీ భామ కమలినీ ముఖర్జీ ప్రాభవం టాలీవుడ్‌లో దాదాపు అంతరించినట్లే కనిపిస్తోంది. 'ఆనంద్', 'స్టైల్', 'గోదావరి', 'గమ్యం', 'గోపి గోపిక గోదావరి' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా సన్నిహితమైన ఆమె ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. వాటిలో 'పోలీస్ పోలీస్', 'మా అన్నయ్య బంగారం', 'నాగవల్లి', లేటెస్టుగా 'విరోధి' వంటివున్నాయి. అందంకంటే అభినయాన్నే ఎక్కువ నమ్ముకున్న ఆమెకి టాప్ హీరోలతో చేసే అవకాశాలు రాలేదు. వెంకటేశ్ సినిమా 'నాగవల్లి' చేసినా అది ఆయన సరసన హీరోయిన్ పాత్ర కాదు. నీలకంఠ డైరెక్ట్ చేసిన 'విరోధి'లో ఆమెది పేరుకు హీరోయిన్ పాత్రయినప్పటికీ మరీ చిన్న పాత్ర కావడం, పైగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలవడం వల్ల ఆమెకి ఏమాత్రం ప్రయోజనం కలగలేదు. ప్రస్తుతం ఆమె నటించిన 'రామాచారి' సెప్టెంబరులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఒకే పాజిటివ్ అంశం 'గోపి గోపిక గోదావరి' తర్వాత వేణు, ఆమె కలిసి నటించడం. వాళ్ల కలయికలోని తొలి సినిమా హిట్టవడం వల్ల 'రామాచారి'కి అది ప్లస్ అవుతుందని నిర్మాత, దర్శకుడు భావిస్తున్నారు. అయితే ఇంతవరకు దానికి బిజినెస్ జరగకపోవడం గమనార్హం. అందుకే ఆగస్టులోనే రిలీజ్ కావలసిన ఆ సినిమా సెప్టెంబరుకి వాయిదా పడింది. ఈ సినిమా ఆడితేనే కమలినికి టాలీవుడ్‌లో మరో అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
Saturday, August 6, 2011
న్యూస్: 'రామాచారి' నవ్విస్తాడా?
'మాయగాడు' సినిమా గురించి వేణు ఎంత గొప్పగా చెప్పాడో అందులో రవ్వంతైనా అది జనాల్ని మెప్పించలేకపోయింది. లాయర్ లీలాకృష్ణ లీలలు వారికి బోర్ కొట్టించాయి. ఛార్మి అందాల ప్రదర్శన కూడా వృథా అయ్యింది. దాంతో 'రామాచారి' మీద దృష్టి సారించాడు వేణు. ఈ సినిమాని ఆయన సొంత బేనర్‌లాంటి ఎస్.పి. ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. 'సిద్ధు ఫ్రం సికాకుళం', 'సీతారామ కల్యాణం.. లంకలో' ఫేం జి. ఈశ్వర్ దర్శకుడు. రెండు పాటలు తప్ప మిగతా షూటింగ్ అయిపోయిన ఈ సినిమాని ఆగస్టులోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దిలీప్, భావన జంటగా నటించిన మలయాళ హిట్ ఫిల్మ్ 'సిఐడి మూస'కి ఇది రీమేక్. 'గోపి గోపిక గోదావరి' వంటి మ్యూజికల్ హిట్ తర్వాత వేణు, కమలినీ ముఖర్జీ జంటగా నటిస్తున్న సినిమా ఇది. ఆ సినిమాలో తమ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందనీ, 'రామాచారి'కీ అది ఎస్సెట్ అవుతుందనీ వేణు ఆశిస్తున్నాడు. మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అయిన ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. అన్నీ బాగానే ఉన్నా 'రామాచారి' అనే టైటిలే ఇంటరెస్టింగ్‌గా లేదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కథకి ఆ టైటిలే సరైనదని నిర్మాత, దర్శకుడితో పాటు వేణు సైతం భావిస్తున్నాడు. ఈ సినిమా అయినా హిట్టయ్యి, తనకి లైఫ్‌నిస్తుందని అతను ఆశిస్తున్నాడు.
Wednesday, November 17, 2010
Friday, November 5, 2010
ఫోకస్: 2010 ముగింపైనా సంతోషాన్నిస్తుందా? (చివరి భాగం)
భయపెట్టనున్న 'చంద్రముఖి-2'
డిసెంబరులో రాబోతోన్న మరో సీనియర్ టాప్ హీరో సినిమా 'నాగవల్లి'. వెంకటేశ్ కథానాయకుడు. 'చంద్రముఖి-2'గా ప్రచారం పొందుతోన్న ఈ సినిమా కన్నడ హిట్ ఫిల్మ్ 'ఆప్త రక్షక'కి రీమేక్. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన సీనియర్ తమిళ డైరెక్టర్ పి. వాసు తెలుగు చిత్రాన్నీ రూపొందిస్తున్నారు. బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ్, కమలినీ ముఖర్జీ, శ్రద్ధాదాస్ వంటి తారలు కనిపించనుండటం విశేషం. వెంకటేశ్ మునుపటి చిత్రాలు 'నమో వెంకటేశ', 'ఈనాడు' ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలమైన నేపథ్యంలో 'నాగవల్లి' సినిమా ఫలితంపై ఆసక్తి నెలకొంది. సస్పెన్స్, మిస్టరీకి వినోదాన్ని జోడించిన ఈ చిత్రం డిసెంబర్ తొలివారంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'రక్త చరిత్ర-2' వస్తోంది
'రక్త చరిత్ర' ఘన విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టీ దాని సీక్వెల్ 'రక్త చరిత్ర-2' మీదపడుతోంది. తొలి సినిమా విడుదలైన నెలరోజుల్లోపలే నవంబర్ 26న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు వర్మ ప్రకటించడం క్యూరియాసిటీని మరింత పెంచింది. తొలి భాగంలో కనిపించని మద్దెలచెరువు సూరి పాత్ర రెండో భాగంలో కనిపించనుండటం, ఆ పాత్రని తమిళ స్టార్ నటుడు సూర్య చేయడం ఆ సినిమా విలువని అమాంతం పెంచేసింది. సూర్య భార్య పాత్రలో ప్రియమణి నటించిన ఈ సినిమాలో పరిటాల రవి, మద్దెలచెరువు సూరి మధ్య ఘర్షణ ప్రధానం. రవి పాత్రలో ఇప్పటికే వివేక్ ఓబరాయ్ అందరి ప్రశంసలూ పొందిన సంగతి తెలిసిందే. తొలి భాగంకంటే ఈ రెండో భాగం మరింత విజయాన్ని సాధించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే సీక్వెల్స్ నిర్మాణం వేగం పుంజుకోవడం ఖాయం.
వివాదాల 'కత్తి'
ఇటీవల 'కత్తి' టైటిల్ పై వివాదం చెలరేగడం గుర్తుండే వుంటుంది. 'కత్తి' అనే టైటిల్ని ఫిలింఛాంబర్ వద్ద డైరెక్టర్ గుణశేఖర్ రిజిస్టర్ చేయించాడు. రవితేజ హీరోగా ఆ పేరుతో సినిమా రూపొందించేందుకు ఆయన సంకల్పించాడు. ఈ టైటిల్ రిజిస్టర్ అయ్యింది మాత్రం వైవీఎస్ చౌదరికి చెందిన బొమ్మరిల్లు బ్యానరులో. అంటే ఈ సినిమాకి నిర్మాత చౌదరే. కానీ 'కత్తి' పేరుతో మరో రెండు సినిమాలు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో ఒకటి అల్లరి నరేశ్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ రూపొందిస్తోన్న 'కత్తి కాంతారావు' కాగా, మరొకటి 'కల్యాణ్ రామ్ కత్తి'. వీటిలో రెండో సినిమా టైటిల్ పైనే గుణశేఖర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. కారణం టైటిలులో 'కల్యాణ్ రామ్' అన్న పేరుని ఇంగ్లీషులో చిన్న అక్షరాలతో ఉంచి, 'కత్తి'ని పెద్దక్షరాలతో డిజైన్ చేయించడం. గుణశేఖర్ అభ్యంతరాల్ని ఏమాత్రం ఖాతరుచేయని కల్యాణ్ రామ్ ఆ టైటిలునే ఖాయం చేసుకున్నాడు. సొంత బేనర్ యన్.టి.ఆర్. ఆర్ట్స్ పై మల్లికార్జున్ డైరెక్షనులో హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని ఆయన నిర్మించాడు. సనాఖాన్ నాయికగా నటించిన ఈ చిత్రం నవంబర్ ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'కత్తి' వివాదాన్ని ఇంకా జనం మరచిపోకముందే వస్తున్నందున ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తుందనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. పైగా 'అతనొక్కడే' తర్వాత కల్యాణ్ రామ్ కి చెప్పుకోదగ్గ సినిమా ఇంతదాకా రాలేదు. అందుకే ఎంతో కసితో అతను ఈ సినిమా చేశాడు.
'బ్రోకర్'పైనా ఆసక్తి
స్టార్ హీరోలు లేకపోయినా, స్టార్ డైరెక్టర్ తీయకపోయినా కుతూహలాన్ని రేపుతున్న మరో సినిమా 'బ్రోకర్'. నవంబర్ లేదా డిసెంబరులో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పోషించాడు. అంతే కాదు, ఈ చిత్రానికి దర్శకుడు కూడా అతనే. నేటి సమాజంలో 'బ్రోకర్' అనేవాడు లేకుండా ఏ పనీ జరగడం లేదనే సంగతిని వ్యంగ్యంగా చిత్రిస్తూ రూపొందిస్తోన్న ఈ చిత్రంలో అర్పీ నెగటివ్ రోలులో కనిపించబోతున్నాడు. శ్రీహరి సైతం ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్స్ సినిమా పతాకంపై స్వయంగా డైరెక్టర్ అయిన మద్దినేని రమేశ్ నిర్మిస్తున్నారు.
వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఈ రెండు నెలల్లో రాబోతున్నాయి. వీటిలో మూడు నాలుగు సినిమాలైనా సక్సెసయితే 2010ని చిత్రసీమ హ్యాపీగా ముగించినట్లవుతుంది. అలా జరుగుతుందా? చూద్దాం.

Wednesday, September 22, 2010
రివ్యూ: క్రిష్ తొలి సినిమా 'గమ్యం'

సజావుగా సాగిన 'గమ్యం'
సినిమా కళ పట్ల అభిమానం, అభిరుచి వున్న దర్శకుల వల్ల తెలుగులో అప్పుడప్పుడు మంచి సినిమాలు వస్తూ వున్నాయి. ఇటీవలి కాలంలో కొత్తగా ఆలోచిస్తూ సినీ రంగంలోకి అడుగుపెడుతున్న దర్శకులు ఎక్కువవుతున్నారు. వారిలో రాధాకృష్ణ జాగర్లమూడి కూడా చేరతాడని చెప్పాలనిపిస్తుంది 'గమ్యం' చూశాక. ఫార్ములా చట్రంలో కాకుండా తాననుకున్న పాయింట్‌ని కొత్తగా చెప్పాలనే తాపత్రయం రాధాకృష్ణలో కనిపిస్తుంది. నటీనటుల ఎంపికలో కూడా అతను ఈ ధోరణిని కనపర్చాడు. శర్వానంద్ ప్రధాన హీరో అయితే, నరేష్ సైడ్ హీరో. కమలినీ ముఖర్జీ హీరోయిన్. నిజంగా ఆసక్తి కరమైన కాంబినేషన్. శుక్రవారం (ఫిబ్రవరి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకీ, సిద్ధార్థుడి (బుద్ధుడి) కథకీ ఒక పోలిక వుంది. అదేమంటే...
కథ:
చెప్పుకోవడానికి ఇందులో కథంటూ పెద్దగా ఏమీ లేదు. తనని వదలి వెళ్లిన కథానాయిక కోసం కథానాయకుడు జరిపే అన్వేషణ ఈ సినిమా. ఆ గమ్యాన్ని చేరుకునే క్రమంలో అతను పొందిన అనుభవాల మాలిక ఈ సినిమా. అభిరామ్ (శర్వానంద్) పదివేల కోట్ల రూపాయల ఆస్తికి వారసుడైన సంపన్న యువకుడు. ఒకసారి అతడికి జానకి (కమలిని) అనే అందమైన మెడికో తారస పడుతుంది. ఆమెని వారం రోజుల్లో ప్రేమలో పడేస్తానని తన మిత్రుడితో పందెం కడతాడు అభి. ఆమెకు 'ఐ లవ్ యు' చెబుతాడు. ఆమె నవ్వి ఊరుకుంటుంది. ఆమెతో పరిచయం పెంచుకుని తన బర్త్‌డే పార్టీకి పిలుస్తాడు. అభి తనకోసం ఎందుకు తిరుగుతున్నాడనే నిజం అక్కడ జానకికి తెలుస్తుంది. అభిని ఏవగించుకుంటుంది. పందెం కట్టింది నిజమే గానీ, ఇప్పుడు నిజంగానే ప్రేమిస్తున్నానంటాడు అభి. అక్కణ్ణించి కారులో వస్తున్న ఇద్దరి మధ్య వాదులాట జరుగుతుంది. కారు కంట్రోల్ తప్పి ఒక స్త్రీని ఢీకొంటుంది. కళ్లువిప్పితే ఆసుపత్రిలో వుంటాడు అభి. జానకి అతణ్ణి వదిలి వెళ్లిపోతుంది. తనకోసం వెతకొద్దని ఉత్తరం రాస్తుంది. కానీ అభికిప్పుడు జానకి నిజంగా కావాలి. ఆమె కోసం బయలుదేరతాడు. మధ్యలో ఒక మోటారు వాహనాల దొంగ గాలి శీను (నరేష్) తారసపడతాడు. అభి వద్ద కనిపించిన ఖరీదైన మోటార్ బైకుని దొంగిలించాలని శీను కూడా అతనితో ప్రయాణిస్తాడు. అక్కణ్ణించి ఆ ఇద్దరూ ఎన్నో అనుభవాలు పొందుతారు. ఆ అనుభవాలేమిటి? ఆ ఇద్దరూ తమ తమ గమ్యాల్ని చేరుకున్నారా? జానకి ఏమయ్యింది? అనేది మిగతా సినిమా.
కథనం:
అంతఃపురం వీడి బయటి లోకంలోకి అడుగుపెట్టిన సిద్ధార్థుడు అక్కడి భయంకరమైన స్థితుల్ని చూసి బిత్తరపోతాడు. చావు బతుకుల గురించి ప్రత్యక్షంగా చూసి చలించిపోతాడు. నిజమైన జీవితమంటే ఏమిటో తెలుసుకుంటాడు. జన్మకి అర్ధాన్ని అన్వేషించే క్రమంలో సన్యాసి అవుతాడు. జ్ఞానోదయంతో బుద్ధుడిగా మారతాడు. బుద్ధుడిగా మారకముందు ప్రపంచంలో గౌతముడికి ఎదురైన అనుభవాల ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని 'గమ్యం' కథని మలిచాడు దర్శకుడు రాధాకృష్ణ. కాకపోతే కథానాయకుడి అన్వేషణ తన నాయక కోసం. ప్రేమ కోసం. అయినప్పటికీ ఆ అన్వేషణలో కథానాయకుడు లోకం తీరు ఎలా వుందో తెలుసుకుంటాడు. జీవితం అంటే ఏమిటో తెలుసుకుంటాడు. మనిషికీ, మనిషితనానికీ అర్ధం తెలుసుకుంటాడు. ప్రేమంటే ఏమిటో, ప్రేమించడమంటే ఏమిటో తెలుసుకుంటాడు. తన చేతుల మీదుగా ఒక జననం, ఒక మరణం చూస్తాడు. కథానాయకుడు అభిరామ్ పొందే ఈ అనుభవాల కోసం దర్శకుడు కల్పించిన సన్నివేశాలు ప్రశంసనీయంగా వున్నాయి. మొదట్లో రిలేషన్‌షిప్స్ అన్నీ ఆబ్లిగేషన్స్ అనుకున్న అభిరామ్ చివరకు వచ్చేసరికి అనుబంధాల్లోని ఆత్మీయతని ఆస్వాదిస్తాడు. అలా ఆ పాత్ర మారే క్రమాన్ని చూపించడంలో దర్శకుడు ఎంతో మెచ్యూరిటీని కనపర్చాడు. ఆ పాత్రలో ఆ పరిణామానికి కారణమైన గాలి శీను పాత్రనీ చక్కగా తీర్చిదిద్దాడు. అభిరామ్, శీను మధ్య స్నేహానుబంధం పెనవేసుకునే తీరు ఆకట్టుకుంటుంది. కలిసి ప్రయాణించే క్రమంలో ఆ ఇద్దరి స్వభావాల్లోనూ మార్పు వస్తుంది. అందుకే ఒకచోట విజయచందర్ చేత "జంతువులు మారవు. మారని వాడు మనిషి కాడు" అనిపిస్తాడు దర్శకుడు. గ్రామాల్లో రికార్డింగ్ డాన్సులు ఎలా జరుగుతాయో చూపించిన అతను అక్కడ రికార్డింగ్ డాన్సర్‌కి కూడా మనసు, ఆత్మగౌరవం వుంటాయనే సన్నివేశాన్ని కల్పించిన తీరు ప్రశంసనీయం. అలాగే నక్సలైట్లు అడవుల్లోంచి జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజోపయోగ పనులు చేయాలని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు. అభిరామ్ అన్వేషణకి కారణమైన జానకి పాత్ర ఆకట్టుకుంటుంది. అయితే ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించిన దర్శకుడు ఆమె పాత్రని ఇంకా విపులంగా చిత్రించివుంటే సినిమాకి మరింత ఆకర్షణ చేకూరేది. పాటల చిత్రీకరణ విషయంలోనూ రాధాకృష్ణ జాగ్రత్త వహించాడు. కథ నడకకి అవి అడ్డుపడకుండా చూసుకున్నాడు. రవీంద్రభారతిలో కమలిని బృందం చేత చేయించిన నృత్యం యువతని సైతం ఆకట్టుకుంటుంది. నరేష్ పాత్రలో వినోదాన్ని చొప్పించిన దర్శకుడు బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణలను సందర్భోచితంగా వాడుకున్నాడు. కథనం విషయంలో ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని రూపొందించింది కొత్త దర్శకుడంటే నమ్మడం కష్టం.
నటీనటుల అభినయం:
'వెన్నెల', 'అమ్మ చెప్పింది' సినిమాల్లో ప్రతిభావంతంగా నటించిన శర్వానంద్ 'గమ్యం'లో అభిరామ్‌గా పరిణతి చెందిన అభినయాన్ని ప్రదర్శించాడు. కథ ప్రకారం పాత్ర ఎలా పరిణతి చెందుతూ వస్తుందో దానికి తగ్గట్లు అతను హావభావాలు ప్రదర్శించాడు. వాచకంలో ఇంకాస్త శ్రద్ధ వహిస్తే హీరోగా రానున్న రోజుల్లో రాణించగలుగుతాడు. ఏమైనా ఈ సినిమాతో హీరోగా అతనికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. గాలి శీనుగా సైడ్ హీరో పాత్రని చేయడానికి నరేష్ అంగీకరించి, మంచిపనే చేశాడు. ఆ పాత్ర స్వభావానికి నరేష్ అతికినట్లు సరిపోయాడు. ఈమధ్య చేసిన సినిమాలతో నిరాశపరచిన అతను ఇందులో మాత్రం మంచి మార్కులు కొట్టేశాడు. మొదట్లో అల్లరి చిల్లరగా కనిపించి కాలక్షేపాన్ని అందించిన అతను చివర్లో కళ్లల్లో నీళ్లు తెప్పిస్తాడు. కమలిని నటనా సామర్థ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. జానకి పాత్రకి పూర్తి న్యాయం చేకూర్చింది. సినిమాలో ప్రధానమైనవి ఈ మూడు పాత్రలే. మిగతావి ఇలా వచ్చి అలా పోతాయి. ఆ పాత్రల్లో ఆయా నటులు.. అభిషేక్ (శర్వానంద్ మిత్రుడు), బ్రహ్మానందం, ఎమ్మెస్, ఎల్బీ శ్రీరామ్, విజయచందర్, హేమ వగైరా.. రాణించారు.
టెక్నీషియన్ల పనితనం:
కథ, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు రాధాకృష్ణ తన పనిని శ్రద్ధగా చేస్తే, సంభాషణల్ని నాగరాజు గంధం సందర్భోచితంగా ప్రయోగించాడు. కథనానికి ఆయన మాటలు బాగా వుపకరించాయి. ప్రధానంగా నరేష్ నోట పలికే మాటలు ప్రేక్షకులకి రిలీఫ్‌నిస్తాయి. జీవితం గురించి చెప్పే సందర్భాల్లోనూ ఆయన కలం చురుగ్గా పనిచేసింది. ఇ.ఎస్. మూర్తి, అనిల్ కలిసి కూర్చిన సంగీతం ఓకే. నేపథ్య సంగీతం యాప్ట్‌గా వుంది. ఈ సినిమాకి ప్రధాన బలాల్లో ఒకటి సినిమాటోగ్రఫీ. యువకుడైన దర్శకుడి మనసుని గ్రహించినట్లు సీనియర్ సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు కెమెరా సన్నివేశాల్లోని మూడ్‌ని బాగా క్యాప్చర్ చేసింది. సన్నివేశాలకు తగ్గట్లు నేపథ్యాన్ని సృష్టించడం అంత తేలికైన పనికాదు. కళా దర్శకుడు రాజీవ్ నాయర్ ఆ పనిని మెరుగ్గా చేసుకుపోయాడు. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా వుంది.
బలాలు, లోపాలు:
అభిరామ్, గాలి శీను పాత్రలు, ఆ పాత్రల్లో శర్వానంద్, నరేష్ అభినయం, కథనం, సంభాషణలు, సంగీతం, సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వం బలాలు. కమలిని పాత్ర నిడివి తక్కువ కావడం, ప్రథమార్ధంలో ఆకర్షణీయమైన సన్నివేశాలు తక్కువ కావడం, క్లైమాక్స్ ముందరి లీడ్ సన్నివేశాలు.. లోపాలు. ఓవరాల్‌గా చూస్తే కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులని ఈ సినిమా సంతృప్తి పరుస్తుంది.
Saturday, July 31, 2010
Subscribe to:
Posts (Atom)