Showing posts with label lakshmi rai. Show all posts
Showing posts with label lakshmi rai. Show all posts
Saturday, November 26, 2011
బాలకృష్ణ నాయనమ్మగా జయసుధ!
ఇప్పటివరకు హీరోలకు అమ్మగా కనిపిస్తూ వచ్చిన సహజనటి జయసుధ తొలిసారిగా ఓ హీరోకి నాయనమ్మగా కనిపించబోతున్నారు. అదీ తన సమవయస్కుడైన సీనియర్ హీరో బాలకృష్ణకు. 'అధినాయకుడు' సినిమాలో ఆమె నాయనమ్మ పాత్రని చేస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం.ఎల్. కుమార్‌చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఆయన తాత, తండ్రి, మనవడిగా నటిస్తున్న సినిమా కూడా ఇదే. ఇందులో తాత పాత్ర సరసన జయసుధ నటిస్తున్నారు. "అంటే మేం జంటగా నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. ఒకే సినిమాలో ఆయనకు భార్యగా, తల్లిగా, నాయనమ్మగా నటిస్తుండటం గమ్మత్తైన అనుభవం. 'శివరంజని'లోనే మేం జంటగా నటించాల్సింది తప్పిపోయింది" అని జయసుధ తెలిపారు. మిగతా ఇద్దరి పాత్రల సరసన లక్ష్మీరాయ్, సలోని నటిస్తున్నారు. ఇలాంటి విశేషాలున్న 'అధినాయకుడు' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Monday, August 15, 2011
న్యూస్: పరుచూరి మురళికి 'మహదేవనాయుడు'తో కలిసి వస్తుందా?
ఇదివరకు నితిన్, ఇలియానా జంటగా రూపొందించిన 'రెచ్చిపో' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ పరుచూరి మురళి ఆశలన్నీ 'మహదేవనాయుడు' సినిమాపైనే ఉన్నాయి. ఇందులో బాలకృష్ణ హీరో కావడంతో చాలా జాగ్రత్తగా సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 'సింహా' వంటి ఇటు అవార్డులూ, రివార్డులూ పొందిన సినిమా తర్వాత బాలయ్య చేసిన 'పరమవీరచక్ర' అట్టర్‌ఫ్లాపైన సంగతి తెలిసిందే. అందుకే 'మహదేవనాయుడు' సినిమా హిట్టవ్వాల్సిన అవసరం హీరో, దర్శకుల ఇద్దరికీ ఉంది. కీర్తి క్రియేషన్స్ బేనర్‌పై ఎం.ఎల్. కుమార్‌చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదివరకు ఇదే బేనర్‌లో జగపతిబాబుతో 'పెదబాబు', గోపీచంద్‌తో 'ఆంధ్రుడు' సినిమాలు చేశాడు మురళి. ఆ రెండూ బాగానే ఆడాయి. కలిసి వచ్చిన బేనర్‌లో మురళి ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలనే తపనతో ఆచితూచి పనిచేస్తున్నాడు. అందుకే మొదట దసరాకి రిలీజవుతుందనుకున్న ఈ సినిమా తాజాగా సంక్రాంతికి పోస్ట్‌పోన్ అయినట్లు సమాచారం. ఇందులో బాలయ్య త్రిపాత్రాభినయం చేస్తుండగా, ఆయనతో ముగ్గురు తారలు జతకడుతున్నారు. వారిలో లక్ష్మీరాయ్, సలోని ఆయనతో తొలిసారి నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఛార్మికి బాలయ్యతో ఇది రెండో సినిమా. ఇదివరకు ఆమె 'అల్లరి పిడుగు' సినిమాలో నటించింది. ఈ సినిమాతో బాలకృష్ణ-మురళి కాంబినేషన్ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి.
Monday, July 4, 2011
న్యూస్: 'కాంచన'గా ఆడ పాత్రలో లారెన్స్?
రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన 'కాంచన' తెలుగు, తమిళ భాషల్లో రాబోతోంది. దర్శకుడిగా ఇది లారెన్స్ ఐదో సినిమా. ఇదివరకు అతను మాస్, స్టైల్, డాన్, ముని సినిమాల్ని రూపొందించాడు. వీటిలో 'మాస్' ఒక్కటే పెద్ద హిట్. 'స్టైల్'తో 100 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తానని ఆ సినిమా నిర్మాత లగడపాటి శ్రీధర్ చెప్పినవి కాకి కబుర్లేనని తేలిపోయింది. 'డాన్', 'ముని' సినిమాలు బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించాయి.
హారర్, కామెడీ, సెంటిమెంట్ మేళవింపుతో అతను తీసిన 'ముని' ప్రేక్షకులకి కొత్త అనుభూతినిచ్చిందనేది నిజం. అందువల్లే దానికి సీక్వెల్ తీయాలని అతను భావించాడు. అలా ఇప్పుడు 'కాంచన'ని రూపొందించాడు. మొదట ఈ సినిమాలో 'కాంచన' పాత్రని అనుష్కతో చేయించాలని అతను తలచాడు. కానీ ఆమె స్థానంలో తనే స్వయంగా నటించాడు! అవును. అతను ఈ సినిమాలో లేడీ గెటప్పుతో విభిన్నంగా కనిపించి, ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేయబోతున్నాడు. అలాగే ఇప్పటివరకు గ్లామరస్ గర్ల్‌గానే ముద్రపడ్డ లక్ష్మీరాయ్ ఈ సినిమాలో భిన్నమైన కేరక్టర్లో కనిపించనున్నది. తెలుగులో ఈ సినిమాని బెల్లంకొండ సురేశ్ విడుదల చేస్తుండటం గమనార్హం. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. కాగా తెలుగులో 'డాన్' తర్వాత 'రెబల్' సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు లారెన్స్. ఇందులో ప్రభాస్ హీరో కాగా; అనుష్క, దీక్షాసేథ్ హీరోయిన్లు.

Thursday, October 28, 2010
Subscribe to:
Posts (Atom)