|
Showing posts with label bapu. Show all posts
Showing posts with label bapu. Show all posts
Tuesday, September 2, 2014
Saturday, June 28, 2014
Cinema: Extraordinary Writer Mullapudi Venkata Ramana
ఆయన మాట రమణీయం
నాటకంలో విజువల్ కన్నా శబ్దానికి ప్రాధాన్యం ఎక్కువ. కారణం సినిమాలోలా దూరంగా ఉన్నవాళ్లకు రంగస్థలం మీద నటులు సరిగా కనిపించరు. అందుకని సంభాషణలు ఎక్కువ ఉండాలి. అదే సినిమా విషయానికి వస్తే ఒక విజువల్‌తో వంద మాటలు పలికించవచ్చు. అంటే ఒక బొమ్మ వంద మాటల పెట్టు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సంభాషణలు రాసినవాళ్లు చరిత్రలో గొప్ప రచయితలుగా నిలిచారు. అలాంటి అరుదైన సినీ రచయిత ముళ్లపూడి వెంకటరమణ. 'అందరికీ నచ్చే స్థాయిలో, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటేనే అది మంచి స్క్రిప్టు' అని ఆయనే ఒకచోట చెప్పారు. అలాంటి మంచి స్క్రిప్టులు ఆయన కలం నుంచె అనేకం జాలువారాయి.
"నేను డైలాగ్ రైటర్ అయినప్పటికీ మొదట మనసులో బొమ్మ గీసుకుని దానికెంత కావాలో అంతే డైలాగులు రాస్తాను'' అని రమణ చెప్పుకున్నారు. బాపుతో జట్టు కట్టకముందే ఆయన పలు ఉత్తమ చిత్రాలకు కథ, సంభాషణలు సమకూర్చారు. 'సాక్షి' నుంచి 'శ్రీరామరాజ్యం' వరకు ఆయన బాపుతో ప్రయాణించారు. ఎన్నో కళాఖండాల రూపకల్పనలో బాపు సగమైతే, తను మరో సగమయ్యారు. రమణ స్క్రిప్టులో స్పష్టంగా కనిపించే అంశం ఎక్కడ మాట అవసరమో అక్కడే డైలాగ్ రావడం. ఆయన రచన చేసిన సినిమాల్లో హీరోల కంటే విలన్లే ఎక్కువగా మాట్లాడతారు. ఉదాహరణకు 'ముత్యాల ముగ్గు' తీసుకోండి. అందులో హీరో హీరోయిన్లు శ్రీధర్, సంగీత ఎక్కువగా మాట్లాడరు. విలన్ రావు గోపాలరావు తెగ మాట్లాడేస్తుంటాడు. ఆ పాత్రకు మాటే ఊపిరి. అయినప్పటికీ ఆ పాత్ర 'ఆకాశంలో మర్డర్ జరిగినట్టు లేదూ' అంటూ విజువల్‌తోనే పరిచయమవుతుంది. అప్పటివరకు రావు గోపాలరావు వేరు. 'ముత్యాల ముగ్గు' నుంచి రావు గోపాలరావు వేరు. ఆ సినిమా కంటే ముందు మరో సినిమాలో ఇదే తరహా విలన్ కేరక్టర్ మనకు కనిపిస్తుంది. ఆ సినిమా 'బుద్ధిమంతుడు' కాగా, ఆ విలన్ నాగభూషణం. ఆయన వేసిన పాత్రపేరు ప్రెసిడెంట్ శేషాద్రి. చేసేవి తప్పుడు పనులు కావడంతో, వాటిని కప్పిపుచ్చడానికి అబద్ధాలనూ, మోసాన్నీ ఆశ్రయిస్తూ తెగ వాగేస్తూ ఉంటాడు. ఆ పాత్రను నాగభూషణం అభినయించిన తీరు అనితర సాధ్యం.
గుడికీ, బడికీ మధ్య పోటీ
బాపు-రమణ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో 'బుద్ధిమంతుడు'ది విశిష్ట స్థానం. ఈ చిత్రానికి రమణ కథ, మాటలు రచిస్తే, బాపు దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఈ కథలో రమణ ఆస్తికతకూ, నాస్తికతకూ మధ్య, గుడీకీ, బడికీ మధ్య పోటీ పెట్టారు. ఆస్తికతకు, నాస్తికతకు ప్రతీకలుగా నిలిచిన ఇద్దరు అన్నదమ్ములు - మాధవయ్య, గోపి (నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం) పాత్రలను సృష్టించారు. ఈ రెండింటిలో ఆయన ఏ పాత్రవైపు మొగ్గారనేది ఆసక్తికరం. ఆస్తికుడైన మాధవయ్యను అమాయకుడిగా మలిచిన రమణ నాస్తికుడైన గోపిని మొదట నీతి నిజాయితీలు కలిగిన వాడైనప్పటికీ జల్సారాయుడిగా మలిచారు. 'భూమ్మీద సుఖపడితే తప్పులేదురా.. బులపాటం తీర్చుకుంటే తప్పులేదురా' అంటూ సావాసగాళ్లతో ఖుషీఖుషీగా తిరిగే అతను అన్యాయాన్ని సహించలేడు. నిజాయితీని వదలడు. నాయిక పాత్ర రాధ (విజయనిర్మల)తో ప్రణయం కారణంగా జల్సాలకు స్వస్తి చెప్పి 'బుద్ధిమంతుని'గా మారతాడు గోపి. ఆ తర్వాతే అతనికి కష్టాలు మొదలవుతాయి. అపార్థంతో రాధ దూరమవుతుంది. అన్న మాధవయ్య "వాళ్ల కులమేమిటి? మన కులమేమిటి? వర్ణ సంకరం చేస్తావా? మన గౌరవ మర్యాదలు మంట గలుపుతావా?'' అని తమ్ముడి మీద కేకలేస్తాడు. అన్న కాళ్లమీద పడి క్షమాపణలు చెప్పమంటుంది తల్లి. "అమ్మా. నేను తప్పులు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్నంత కాలం నన్ను హెచ్చరించడానికి కూడా ఎవరికీ ధైర్యం లేకపోయింది. ఇప్పుడు తప్పులు దిద్దుకుని బుద్ధిమంతుడనై మంచి దారిన నడవబోతే అందరూ తలో రాయీ వేస్తున్నారు. నేనెవరికి క్షమాపణ చెప్పుకోవాలమ్మా. దేనికోసం క్షమాపణ చెప్పుకోవాలి. ఆనాడు తప్పులు చేసినందుకా? ఈనాడు బుద్ధిగా ఉన్నందుకా? చెప్పమ్మా'' అంటాడు గోపి ఆవేదనగా.నిజం రాణిస్తుంది
తన వద్దకు వచ్చిన రాధ, దేవుని నగలను తనే దొంగిలించాడన్నట్లు మాట్లాడితే "నీటిబొట్టు ఇసుకలో పడితే ఇంకిపోతుంది. సముద్రంలో పడితే ఆనవాలు లేకుండా పోతుంది. అదే ముత్యపు చిప్పలో పడితే ముత్యమై ప్రకాశిస్తుంది. నిజం కూడా అంతే. సమయం, సందర్భాన్ని బట్టి రాణిస్తుంది'' అని బాధపడతాడు గోపి. దేవుడు ఉన్నాడని నిరూపించడానికి మాధవయ్య "సరిగ్గా ఈ రాత్రి పన్నెండు గంటలకు గుడి గోపురం మీదున్న కలశం పైకి లేస్తుంది. నా స్వామి అసత్యం కాదు. మహిమ ముమ్మాటికీ జరుగుతుంది. అలా జరగని పక్షంలో నా స్వామి పాదాలపై నా ప్రాణం విడుస్తాను" అని భీకర ప్రతిజ్ఞ చేస్తాడు. అన్నయ్య చనిపోకూడదనీ, భక్తుల విశ్వాసం వమ్ము కాకూడదనీ, గుడి వెనుకనుంచి పైకెక్కి, గోపురం కలశాన్ని పైకి లేపి, దించుతాడు గోపి. దీనిని చూసిన మాధవయ్య దేవుణ్ణీ, తననూ, భక్తుల నమ్మకాన్నీ అవమానించావని తమ్ముణ్ణి తూలనాడతాడు. "అన్నయ్యా. నేను మనిషిని. చదువు సంస్కారం లేని సామాన్యుణ్ణి. దేవుడు ఉన్నాడో, లేడో అని విమర్శించే శక్తిలేని వాణ్ణి. నాకు తెలిసిన దేవుడు నా అన్నయ్యే. నా అన్నయ్యను దక్కించుకోవాలనుకున్నాను అంతే. ఇది మోసమే అయితే, అపచారమే అయితే, దైవ ధిక్కారమే అయితే నీ ఇష్టమొచ్చిన శిక్ష విధించు'' అంటాడు. ఇలా గోపి పాత్రను ఆదర్శవంతంగా, అదే సమయంలో శక్తిమంతంగా మలచారు రమణ.మానవసేవే మాధవసేవ
ఆస్తికులంతా మంచివాళ్లు కారు, నాస్తికులంతా చెడ్డవాళ్లు కారు అని రమణ ఈ కథతో నిరూపించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. గుడికీ, బడికీ మధ్య పోటీ పెట్టినా ఊరికి రెండూ కావాలనిపిస్తారు. అందుకు తగ్గట్లే పరమభక్తితో, అమాయకత్వంతో మూఢునిలా వ్యవహరించిన మాధవయ్యలో పరివర్తన కలిగేట్లు ఆ పాత్రను మలిచారు. తన ముందు ప్రత్యక్షమైన కృష్ణునితో తన తమ్ముడు భ్రష్టుడైపోయాడనీ, వర్ణ సంకరానికి కూడా ఒడిగట్టాడనీ ఆవేదన చెందుతాడు మాధవయ్య. 'మరైతే నువ్వు వర్ణ సంకరం చెయ్యడం లేదా?' అని ప్రశ్నించిన కృష్ణుడు (శోభన్‌బాబు) "నేను క్షత్రియుల ఇంటి పుట్టాననీ, గోపాలుర ఇంట పెరిగాననీ నువ్వెరుగవా?'' అనడుగుతాడు. మాధవయ్యకు జ్ఞానోదయం కలుగుతుంది. "సర్వాంతర్యామివి. నా అజ్ఞానాన్ని మన్నించు. అన్ని జీవుల్లోనూ, అన్ని జాతుల్లోనూ నీవేనని, అంతా ఒక్కటేననీ నాకు తెలియజెప్పావు. ఈ క్షణం నుంచీ సర్వ కులాలనూ, సర్వ మతాలనూ సమానంగా గౌరవిస్తాను'' అంటాడు. తమ్ముడితో "మానవసేవే మాధవసేవ. మానవ కోటి సుఖ సంతోషాలే భగవంతునికి నిజమైన ఆనందం'' అని చెబుతాడు. కథకు ప్రయోజనం ఉండాలని నమ్మే రచయిత కాబట్టే రమణ తన కథల్లో మంచికి పెద్దపీట వేసి, మంచి విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తారు. సందర్భానికి తగ్గట్లుగా ఈ చిత్రంలో ఆయన రాసిన సంభాషణలు గొప్పగా రాణించాయి. నటీనటులు కూడా తమ పాత్ర పరిధుల మేరకు వాటిని పలికి, సంభాషణలు రక్తికట్టేలా చేశారు.'ఆమ్యామ్యా' ఇందులోనిదే
ఈ సినిమాలో రామలింగం (అల్లు రామలింగయ్య) లంచం ఆశిస్తూ చెప్పే 'ఆమ్యామ్యా' అనే మాట నేటికీ లంచానికి పర్యాయపదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ పదం సృష్టికర్త తాను కాననీ, సినిమాలో ఆ మాట పలికిన అల్లు రామలింగయ్యదేననీ రమణ చెప్పారు. "ఆ మాట నా ఎక్కౌంటులో పడిపోయింది. నాకు పేరొచ్చేసింది'' అని ఆయన రాసుకున్నారు. నేడు ఆయన మన మధ్య లేకపోయినా రమణీయమైన ఆయన మాటలు మన హృదయాల్లో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. మాధవయ్య, గోపి పాత్రల్లో అక్కినేని నాగేశ్వరరావు, శేషాద్రిగా నాగభూషణం ప్రదర్శించిన అభినయం, రమణ సంభాషణలు, బాపు దర్శకత్వ ప్రతిభ, మిగతా సాంకేతిక నిపుణుల సామర్థ్యం కలిసి 'బుద్ధిమంతుడు'ను వంద రోజుల సినిమాగా నిలబెట్టాయి. విడుదలై నెల తిరక్కుండానే 60 వేలు ఓవర్‌ఫ్లో వచ్చిందంటే 1969లో అది చాలా పెద్ద మొత్తమే.- ఆంధ్రజ్యోతి డైలీ, జూన్ 28, 2014
Wednesday, December 25, 2013
Friday, November 18, 2011
అప్పుడు 'లవకుశ'.. ఇప్పుడు 'శ్రీరామరాజ్యం'
అందరి కళ్లూ ఇప్పుడు 'శ్రీరామరాజ్యం' మీదే. గురువారం (17) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఇటు సినీ వర్గాల్లో, అటు సామాన్య ప్రజానీకంలో అమితాసక్తి వ్యక్తమవుతోంది. 'శ్రీకృష్ణార్జున విజయం' (1996) తర్వాత నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న పౌరాణిక చిత్రం ఇదే. ఉత్తరరామ చరిత్ర ఆధారంగా తండ్రీ కొడుకులు సి. పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వంలో రూపొందిన 'లవకుశ'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీసు ఫలితం తెలుగులో తిరిగి పౌరాణిక చిత్రాల రూపకల్పనపై ప్రభావం చూపబోతోంది. ఈ చిత్రం విజయం సాధిస్తే మరిన్ని పౌరాణిక చిత్రాల నిర్మాణానికి ఊతం లభిస్తుందని విశ్లేషకులు నమ్ముతున్నారు.
ఈ సందర్భంగా అఖండ విజయం సాధించిన మునుపటి చిత్రంతో, ప్రస్తుత చిత్రాన్ని పోల్చడం సహజం. 26 కేంద్రాల్లో విడుదలైన 'లవకుశ' అన్ని కేంద్రాల్లోనూ వంద రోజులు ఆడి, తెలుగులో రూ. కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా (టిక్కెట్ రేట్లు పావలా నుంచి ఒక రూపాయి ఉన్న కాలంలో) రికార్డు పుటలకెక్కింది. 18 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ జనాభా మూడు కోట్లు కాగా, ఈ చిత్రాన్ని 1.98 కోట్ల మంది చూసినట్లు అంచనా. అలాంటి 'లవకుశ'లో సీతారాములుగా అంజలీదేవి, నందమూరి తారకరామారావు ఎంత గొప్ప స్థాయిలో రాణించారో, అభినవ సీతారాములుగా ఎంతగా నీరాజనాలు అందుకున్నారో అప్పటి జనానికి తెలుసు. ముఖ్యంగా శ్రీరామునిగా ఎన్టీఆర్ రూపం జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది 'లవకుశ'లో ఆయన పోషించిన ఆ పాత్రతోనే.
త్రేతాయుగంలో శ్రీరాముడు ఇలాగే ఉండేవాడేమోనని భ్రమించే రీతిలో ఆయన జనాన్ని సమ్మోహహితుల్ని చేశారు. ఇప్పుడు ఆ పాత్రని బాలకృష్ణ ఎలా చేశారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. రూపపరంగా చూస్తే, ఎన్టీఆర్ వంటి సమ్మోహనశక్తి లేకపోయినా ఆయన తర్వాత రాముని పాత్రలో ఇమడ గలిగేది బాలకృష్ణే అనే అభిప్రాయం సర్వత్రా ఉంది. శ్రీరాముని రూపంలోని బాలకృష్ణ స్టిల్స్ ఆ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి. 'లవకుశ'లో సీతగా అంజలీదేవి ప్రభావమూ అసామాన్యమైనదే. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా ఒదిగిపోయారు. లక్ష్మణుడు తనని అడవులకు పంపిన కారణం తెలిశాక ఆమె పలికించిన కరుణ రసం ఎప్పటికీ మన హృదయాల్ని తాకుతూనే ఉంటుంది. ఇక పతాక సన్నివేశాల్లో ఆమె అభినయం అపూర్వమనే చెప్పాలి. అలాంటి పాత్రను ఇప్పుడు నయనతార చేయడమే ఒక విచిత్రం. తన కాలానికి అంజలి గొప్పనటిగా అప్పటికే పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ నయనతార తెలుగు నటి కాదు. తెలుగు భాష సరిగా తెలీదు కూడా. అయినా ప్రచార చిత్రాల్లో సీతగా ఆమె ఆహార్యం చక్కగా ఉంది. ఇప్పటికే 'సింహా' చిత్రంలో బాలకృష్ణ, నయనతార జంట ప్రేక్షకుల్ని అలరించింది. అప్పటివరకు గ్లామర్ రోల్స్‌కి పేరుపొందిన నయనతార ఆ సినిమాల్లో చీరల్లో హుందాగా కనిపించిన తీరే ఇప్పుడు సీత పాత్రకు ఎంపిక చేసేందుకు దోహదం చేసింది. అంజలిని ఆమె ఏ తీరున మరిపిస్తుందన్నది చూడాల్సిందే.
ఇక చిత్రంలో కీలకమైంది లక్ష్మణుని పాత్ర. మునుపటి చిత్రంలో ఆ పాత్రని కాంతారావు అమోఘంగా పోషించారు. సీతను అడవులకు పంపాలని శ్రీరాముడు నిర్ణయించినప్పుడు, ఆ బాధ్యత తనమీదే పడ్డప్పుడు కాంతారావు ప్రదర్శించిన నటన అత్యుత్తమం. ఇప్పుడు ఆ సన్నివేశాల్లో శ్రీకాంత్‌ని మనం చూడబోతున్నాం. ఆయన ఓ పౌరాణిక పాత్రను పోషించడం ఇదే ప్రథమం. వాల్మీకిగా చిత్తూరు నాగయ్యను చూసిన కళ్లతో అక్కినేని నాగేశ్వరరావును చూడటం అపురూపం. నటులుగా ఇద్దరూ ఏ స్థాయి నటులో మనకు తెలిసిందే.
ఇదంతా తెరమీద మనం చూడబోయే వ్యవహారం కాగా తెరవెనుక దర్శకత్వాన్ని ప్రస్తావించుకోవడం సందర్భోచితం. 'లవకుశ'ను తలపెట్టింది సి. పుల్లయ్య. అయితే అకస్మాత్తుగా సినిమా మధ్యలో ఆయన మరణించడంతో ఆ బాధ్యతను గొప్పగా నెరవేర్చారు ఆయన కుమారుడు సి.ఎస్. రావు. అలా తండ్రీకొడుకులు ఒక పౌరాణిక చిత్రరాజాన్ని తెలుగు దేశానికి అందిస్తే, ఇప్పుడు ఆ పని నిర్వహించింది ఇప్పటికే ఎన్నో కళాఖండాల్ని అందించిన బాపు. సహచరుడు ముళ్లపూడి వెంకటరమణ ఈ సినిమా మధ్యలో అర్ధంతరంగా స్వర్గస్తులైతే, ఒంటిగానే తాననుకున్న రీతిలో 'శ్రీరామరాజ్యం'ను తీర్చిదిద్దారు బాపు. ఎనభై ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఏకాగ్రతతో ఈ చిత్రాన్ని ఆయన మలచిన తీరుకు ఆ సినిమా యూనిట్ అంతా జేజేలు పలుకుతున్నారు.
దీంతో పాటు సంగీతాన్నీ ప్రస్తావించుకోవాలి. 'లవకుశ' విజయంలో ఘంటసాల సంగీత బాణీలకూ ప్రత్యేక స్థానముంది. 'శ్రీరామరాజ్యం'కు ఆ బాధ్యతని అత్యంత సమర్ధంగా నిర్వహించారు ఇళయరాజా. ఇవన్నీ ఒకెత్తయితే పౌరాణికాలు తియ్యాలంటేనే బెంబేలెత్తే ఈ రోజుల్లో ఖర్చుకు వెరవకుండా, భారీ రిస్కుకు దడవకుండా ఈ సినిమాని నిర్మించి అందరి దృష్టినీ ఆకర్షించారు యలమంచిలి సాయిబాబా. ఇన్ని విశేషాలున్న 'శ్రీరామరాజ్యం' ఏ రీతిన ఆడుతుందో, 'లవకుశ'ను ఎంతగా మరిపిస్తుందో వేచి చూడాల్సిందే.
Tuesday, September 20, 2011
వార్తల్లో వ్యక్తి: అక్కినేని నాగేశ్వరరావు
అభినయ వాల్మీకి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాంఘిక చిత్రాల కథానాయకుడిగా అత్యున్నత స్థాయిని అందుకున్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అనేది జగద్విదితం. పౌరాణిక చిత్రాల కథానాయకుడిగా ఎన్టీ రామారావు అద్భుతంగా రాణిస్తుండటంతో తనంతట తానుగా వాటినుంచి తప్పుకుని సాంఘిక చిత్రాలతోనే అజరామర కీర్తిని సొంతం చేసుకున్నారు అక్కినేని. తొలినాళ్లలో జానపద హీరోగా రాణించినా 'లైలా మజ్ను', 'దేవదాసు' వంటి విషాదాంత ప్రేమకథలతో ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకుని, ప్రేమకథాచిత్రాల నాయకుడిగా ప్రేక్షకుల్లో తిరుగులేని ఇమేజ్ పొందారు.
మలిదశలో ఆయన చేసిన మరో రెండు విషాదాంత ప్రేమకథాచిత్రాలు 'ప్రేమాభిషేకం', 'మేఘసందేశం' ఈ సంగతినే రుజువు చేశాయి. అయితే వీటిలో ఆయన పాత్రలు ఒకదానికొకటి పూర్తి భిన్నమైనవి కావడం గమనించదగ్గ అంశం. సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు మరో తెలుగు హీరో పోషించలేదనడం నిస్సందేహం. అక్కినేని చేసిన పౌరాణిక చిత్రాలు పదికి మించవు. చేసిన ప్రతి పౌరాణిక పాత్రలోనూ రాణించినా, ఆ తరహా చిత్రాలు ఆయన ఎక్కువ చేయకపోవడం తెలుగు సినిమాకి ఓ లోటుగానే భావించాలి. ప్రస్తుతం ఆయన బాపు రూపొందిస్తున్న 'శ్రీరామరాజ్యం' చిత్రంలో రామాయణ గాథని రచించిన వాల్మీకి పాత్రని పోషిస్తున్నారు. అడవుల పాలైన సీతకు ఆశ్రయమిచ్చి, అక్కడ ఆమె జన్మనిచ్చిన కవల పిల్లలు లవకుశులకు విద్యాబుద్ధులు, విలువిద్య నేర్పిన గురువు వాల్మీకిగా ఆయన నటన ఎలా ఉంటుందో చూడాలని ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ గమనించదగ్గ విశేషమేమంటే కథానాయకుడిగా అక్కినేని తొలి పాత్ర శ్రీరాముడు కావడం. ఆ సినిమా 1944లో వచ్చిన 'సీతారామ జననం'. ఘంటసాల బలరామయ్య రూపొందించిన ఈ చిత్రంలో శ్రీరామునిగా నాగేశ్వరరావు ఎలా నటిస్తాడోనని ఆయన్ని ఎరిగినవారంతా కొంత ఆసక్తిగా, కొంత అపనమ్మకంగా ఎదురుచూశారు. ఎందుకంటే అప్పటివరకు రంగస్థలంపై ఆడ పాత్రలే చేస్తూ వచ్చిన ఆయన ఎకాఎకి శ్రీరామ పాత్ర చేయడమంటే మాటలు కాదు కదా (అంతకుముందు 1941లో ఆయన 'ధర్మపత్ని'లో ఓ చిన్న పాత్ర చేశారు). కానీ ఆ పాత్రలో ఆయన అందరి అంచనాల్ని మించి రాణించారు.
ఆ తర్వాత కాలంలో ఆయన 'మాయాబజార్'లో అభిమన్యుడిగా, 'భూకైలాస్'లో నారదునిగా, 'చెంచులక్ష్మి'లో విష్ణుమూర్తిగా, 'శ్రీ కృష్ణార్జున యుద్ధం'లో అర్జునునిగా నటించి, మెప్పించారు. 'జయభేరి'లో 'రావోయి రాస విహారీ' పాటలో శ్రీకృష్ణుని వేషంలోనూ బాగున్నారనిపించుకున్నారు. నాగయ్య చిత్రం 'భక్త రామదాసు'లో మరోసారి విష్ణుమూర్తిగా అతిథి పాత్రలో కనిపించారు. వీటితో పాటు 'సతీ సావిత్రి'లో సత్యవంతుడిగానూ అక్కినేని మెప్పించారు. ఇలా చేసిన ప్రతి పౌరాణిక పాత్రలోనూ రాణించిన అక్కినేని మరిన్ని పౌరాణిక చిత్రాలు చేసినట్లయితే తెలుగు సినిమాకి మేలు చేకూరి ఉండేది. ఆ మేరకు ఆయన సేవల్ని పౌరాణిక సినిమా కోల్పోయిందనే చెప్పాలి. ఇప్పుడు 87 సంవత్సరాల వయసులో ఆయన 'శ్రీరామరాజ్యం'లో వాల్మీకిగా నటిస్తుండటం ముదావహం.
ఈ పాత్రలో ఆయన అద్భుతంగా రాణిస్తారనడంలో ఏమాత్రం సందేహించాల్సిన పనిలేదు. బాపు రూపకల్పనలో శ్రీరామునిగా బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రాన్ని యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నందువల్ల త్వరలోనే అభినవ వాల్మీకిని మనం తిలకించవచ్చు.
(సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు 88 ఏట అడుగు పెడుతున్న సందర్భంగా)

Monday, September 19, 2011
బిగ్ స్టోరీ: నేను రావణబ్రహ్మను!
రావణబ్రహ్మ... రామాయణ కథకి ప్రతినాయకుడు. మాహాసాధ్వి సీతను పెళ్లాడకోరి, ఆమెని అపహరించి, అశోకవనంలో ఉంచి, రామునితో తలపడి కదనరంగంలో అశువులు బాసిన మహా శివభక్తుడు. లంకాధీశుడు. భారతీయ తెరపైనే అద్భుతమనదగ్గ రీతిలో, తమదైన ప్రత్యేక శైలితో అభినయించి ఆ పాత్రకి అమరత్వాన్ని ప్రసాదించిన నటులు ఇద్దరు. ఒకరు ఎన్టీ రామారావు, మరొకరు ఎస్వీ రంగారావు. ఇప్పుడు ఆ పాత్రని పోషించేందుకు ఉత్సాహం చూపిస్తున్న నటుడు మోహన్‌బాబు. ఆయనని రావణావతారంలో చూపించేందుకు సిద్ధమవుతున్న దర్శకుడు కె. రాఘవేంద్రరావు. ఆ సినిమా షూటింగ్ మొదలయ్యేది 2012 ప్రథమార్థంలో.మోహన్‌బాబు 'రావణ' సినిమా చేస్తానన్న ప్రకటనతో తెలుగులో భక్తిరస, పౌరాణిక చిత్రాల మీద ధ్యాసమళ్లినట్లే కనిపిస్తోంది. సాధారణంగా సోషల్ సినిమాల కంటే ఇలాంటి భక్తి, పౌరాణిక చిత్రాలకు ఖర్చు తడిసి మోపెడవుతుంది. కారణం ఆ కాలపు వాతావరణాన్ని సృష్టించడానికి భారీ సెట్లు నిర్మించాల్సి రావడం, కాస్ట్యూమ్స్, అలంకరణ సామగ్రి తయారుచేయించడం. అయితే ఆయా పాత్రల్ని పోషించాలన్న సంకల్పమే తెలుగులో ఆ తరహా చిత్రాల నిర్మాణానికి దారితోస్తోంది. అటువంటి సినిమాలతో, అటువంటి 'లార్జర్ దేన్ లైఫ్' కేరక్టర్లతో చరిత్రలో నిలిచిపోవచ్చనే కోరిక కూడా ఇందుకు కారణమే. రావణబ్రహ్మ అనగానే మనకి 'భూకైలాస్' (1958), 'సీతారామ కల్యాణం' (1961) చిత్రాల్లోని ఎన్టీ రామారావు, 'ఇంద్రజిత్' (1961), 'సంపూర్ణ రామాయణం' (1972) చిత్రాల్లోని ఎస్వీ రంగారావు జ్ఞాపకమొస్తారు. ఆ పాత్రల్ని మరికొంతమంది పోషించినా ఆ ఇద్దరే ఆ పాత్రకి వన్నె తెచ్చారు. ఆ పాత్రలో ఆమోఘంగా రాణించారు.
సాంఘిక పాత్రలకీ, పౌరాణిక పాత్రలకీ స్పష్టమైన తేడా ఒకటుంది. సోషల్ కేరక్టర్లో వేసే కుప్పిగంతులు పౌరాణిక పాత్రలకి చెల్లుబాటు కావు. పౌరాణిక పాత్ర పోషణలో నటుడికి ప్రధానంగా కావలసినవి ఆంగిక, వాచికాభినయాలు. ఈ రెండింటిలోనూ ఆరితేరినవాళ్లు కాబట్టే ఎస్వీఆర్, ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. చిత్రమేమంటే రావణ పాత్రని ఏ మాత్రమూ పోలికలేని విధంగా ఆ ఇద్దరూ వేర్వేరు తరహాల్లో పోషించడం. సామర్ల వెంకట రంగారావు పోషించిన రావణాసురుడు మనకి పరమ క్రూరునిగా, కిరాతకునిగా, స్త్రీలోలునిగా కనిపిస్తే, నందమూరి తారకరామారావు అభినయించిన రావణుడు కథానాయకుడి తరహాలో కనిపించాడు. 'ఇంద్రజిత్' (దీనికి 'సతీ సులోచన' అనే పేరు కూడా ఉంది) చిత్రంలో క్రూరత్వానికి తోడు పుత్ర వాత్సల్యం కలిగిన రావణునిగానూ ఎస్వీఆర్ దర్శనమిచ్చారు. ఆ పాత్రలో ఆయన ప్రదర్శించిన హావభావాలూ, కదలికలూ చూసి ఆ పాత్ర పోషణని అలా చెయ్యడం మరొకరికి సాధ్యం కాదన్నారు. చేసిన ప్రతి పాత్రకూ ప్రశంసలందుకోవడం మాటలు కాదు. అయినా పాత్ర పాత్రకీ ఆయన అడుగు ముందుకేయడానికి కారణం, కళారాధకునిగా ఆయనలో ఉన్న అసంతృప్తే. 'మీ ఉత్తమ పాత్ర ఏది?' అనే ప్రశ్నకు 'ఇంకా నేను ఉత్తమ పాత్ర చెయ్యలేదు' అనే సమాధానమే చివరిదాకా ఆయన నోటినుంచి వచ్చింది. ఎంత అద్భుతంగా నటించిన పాత్రయినా ఆయనకు మాత్రం అద్భుతంగా కనిపించలేదు. అన్నిటికన్నా ఆత్మవిమర్శకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే రంగారావు తాను ధరించబోయే పాత్ర మనస్తత్వాన్నీ, ప్రవర్తననీ, అనుభవాల్నీ బాగా అవగాహన చేసుకుని, ఆ పాత్రని ఎలా పోషించాలో నిర్ణయించుకునేవారు. అందుకే రావణ పాత్రలోని రౌద్ర, బీభత్స, కరుణ రసాల్ని అద్భుతంగా పోషించగలిగారు. 'రంగారావుతో సమంగా నటించే నటులుండవచ్చు. కానీ అంతకన్నా బాగా నటించగలవారు మాత్రం లేరు' అనే ప్రశంసలు పొందారు.
ఓ పాత్ర చేయడానికి ఆయన చూపించే అంకితభావం కూడా ఆశ్చర్యపరుస్తుంది. బాపు రూపొందించిన 'సంపూర్ణ రామాయణం'లో రావణ పాత్ర చేసే సమయంలో ఆయన దురలవాట్లకు దూరంగా ఉన్నారు. అద్భుతమైన నటనతో చిత్రానికి వన్నె తెచ్చారు. అప్పట్లో రూ. 17.5 లక్షల వ్యయంతో రూపొందించిన ఆ సినిమా నిర్మాతలకు సిరులు కురిపించిందంటే బాపు, రమణల కాంబినేషన్‌తో పాటు రావణ పాత్రని ఎస్వీఆర్ పోషించిన తీరు కూడా ప్రధాన కారణమని విమర్శకులు ముక్తకంఠంతో పలికారు.
తెలుగులో శ్రీరాముడి పాత్ర పోషణకంటే ముందుగానే పురాణ వాఙ్మయంలో అతి భయంకరమైన ప్రతినాయకుడిగా పేరుపొందిన రావణుడ్ని నాయక స్థాయికి చేర్చింది నిస్సందేహంగా ఎన్టీ రామారావే. 'భూకైలాస్'లో ప్రత్యక్షమైన అందమైన రావణాసురుడికి ప్రేక్షక జనం విజయాన్ని చేకూర్చిపెట్టారు. స్రీలోలుడిగా కాక వేద వేదాంగాలు ఔపోసన పట్టిన విద్యాధికుడిగా ఈ చిత్రంలో కనిపించి సమాజానికి ఎదురీదారు ఎన్టీఆర్.
"కథానాయకుడి వేషాలే వేయడం చాలామందికి గొప్ప. కాని ప్రతినాయకుడి పాత్రలను కూడా మంచివాటిగా మలిచి జనాదరణ పొందింది ఒక్క ఎన్టీఆరే'' అన్న అక్కినేని నాగేశ్వరరావు మాటలు పూర్తిగా నిజం. భారతదేశ చలనచిత్ర రంగం మొత్తాన్ని జల్లెడపట్టి వెతికినా నాయకుడై ఉండి రావణ, దుర్యోధన వంటి ప్రతి నాయక పాత్రలు ధరించి అందరి మెప్పూ పొందిన ఏకైక నటుడు రామారావు. ఎస్వీ రంగారావు ఉండగానే ఆ పాత్రల్ని మెప్పించడం అసామాన్యం.
'సీతారామ కల్యాణం' పూర్తిగా ఎన్టీఆర్ అభిరుచి మేరకు తీసిన చిత్రం. ఆయనలోని భావ విప్లవానికీ, నూతన ప్రయోగానికీ అందులోని రావణ పాత్ర ప్రతీక. కవిరాజు త్రిపురనేని రామస్వామిచౌదరిలోని భావ విప్లవ ప్రభావం, రావణుడు దుష్టుడు కాడనీ, ఆత్మాభిమానం, వ్యక్తిత్వం ఉన్నవాడనీ చెప్పిన ద్రావిడోద్యమ ప్రభావం ఆ పాత్రమీద కనిపిస్తుంది. ఈ చిత్రంలో 'కానరార కైలాస నివాస' అని ప్రారంభమయ్యే సుదీర్ఘ శివస్తుతిలో ఎన్టీఆర్ అభినయ విన్యాసాన్ని చూసి తీరాల్సిందే. సీతారాముల కల్యాణాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఈ చిత్రంలో అపూర్వమనదగ్గ రీతిలో దశముఖ ప్రదర్శన చేశారు. భక్తి ఆధారంగా మౌఢ్యం పరిఢవిల్లుతుందని సోదాహరణంగా చూపించారు. ఈ రెండు సినిమాల్లోనే కాక 'శ్రీకృష్ణ సత్య' (1971), 'శ్రీరామ పట్టాభిషేకం' (1978) చిత్రాల్లోనూ రావణ పాత్రలో కనిపించారు ఎన్టీఆర్.
ఆ మహానటులతో పాటు రావణ పాత్రని తీగెల వేంకటేశ్వర్లు (సీతా కల్యాణము - 1934), మునిపల్లె సుబ్బయ్య (సతీ సులోచన - 1936), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (మైరావణ - 1939), ఎం.వి. సుబ్బయ్యనాయుడు (భూకైలాస్ - 1940), రాజనాల (మైరావణ - 1964), కైకాల సత్యనారాయణ (సీతా కల్యాణం - 1976), నాగబాబు (శ్రీరామదాసు - 2006)లో పోషించారు. అందరూ బాలలతో గుణశేఖర్ రూపొందించిన 'రామాయణం' (1997)లో ఆ పాత్రని స్వాతి అనే అమ్మాయి పోషించడం విశేషం.
అయితే ఇవాళ రావణ పాత్ర చేయడానికి మోహన్‌బాబుని పురికొల్పింది నిస్సందేహంగా ఎన్టీఆర్, ఎస్వీఆర్ అనే చెప్పవచ్చు. అందుకే "రావణుడి కథాంశంతో గతంలో చాలా సినిమాలొచ్చినా, రావణావతారానికి సంబంధించిన పూర్తి వృత్తాంతంతో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నది రావణుడి పాత్ర ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించే సినిమా. ఆయన జననం నుంచి మరణం వరకూ ఈ కథ సాగుతుంది. ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి మహానటులు చేసిన పాత్రను నేను చేయబోతున్నా. వారి స్థాయికి ఏమాత్రం తగ్గకుండా నా స్టైల్‌లో ఆ పాత్ర రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తా'' అని చెప్పారు మోహన్‌బాబు. ఆయన సంకల్పం సఫలీకృతం కావాలని ఆశిద్దాం.
Sunday, September 18, 2011
ఇంటర్వ్యూ: 'శ్రీరామరాజ్యం' నిర్మాత సాయిబాబు
'శ్రీరామరాజ్యం'కు శ్రీకారం ఎలా జరిగింది?
- ఓ ఆదివారం మధ్యాహ్నం రామసాయిమందిరం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. రాముడు గురించి సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న భావన అప్పుడే వచ్చింది. వెంటనే నా స్నేహితుడిని రమ్మని కబురుపెట్టాను. ఐదు నిమిషాల్లో వచ్చాడు. విషయం చెప్పగానే వెంటనే ముళ్ళపూడి రమణగారితో మాట్లాడించారు. వెంటనే బయలుదేరి చెన్నై వెళ్ళాం. మరుసటి రోజు బాపు-రమణగార్లను కలిశాం. అక్కడి నుంచి ఇళయరాజాగారిని కలిశాం. 'శ్రీరామరాజ్యం' శ్రీకారం చుట్టుకున్న వైనమిది.
ఇప్పటి రోజుల్లో పౌరాణికమంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. అనుకున్న బడ్జెట్‌లో తీయగలిగారా?
- మెరుపులాంటి ఆలోచన రావడమే తరువాయిగా అన్నీ హుటాహుటిన కుదిరాయి. ఈ చిత్రం పరిధి విస్తృతమైంది కాబట్టి ద్విభాషా చిత్రంగా తెరకెక్కించమని చాలా మంది సలహా ఇచ్చారు. సీత పాత్రకు ముందు మేం మాధురీదీక్షిత్‌ను సంప్రదించాం. తెలుగు, హిందీల్లో చిత్రీకరిస్తేనే నటిస్తానని చెప్పింది. కానీ ద్విభాషా చిత్రమంటే తెలుగుతనం మరుగునపడే ప్రమాదముంది. పలు చోట్ల రాజీపడాలి. సంగీతం నుంచి సన్నివేశాల వరకు ఎక్కడో ఏదో అడ్డు తగులుతూనే ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే బడ్జెట్ గురించి ఆలోచించలేదు. సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రామాయణాన్ని తెరకెక్కించాలన్నదే నా సంకల్పం అని బాపుగారితో చెప్పాను.
'లవకుశ' అని గాక 'శ్రీరామరాజ్యం' అనే టైటిల్ పెట్టడంలో ఉద్దేశం?
- ముళ్ళపూడివారు కొన్ని హిందీ పౌరాణిక చిత్రాల పేర్లు చెబుతూ మధ్యలో 'శ్రీరామరాజ్య్' అని అన్నారు. 'శ్రీరామరాజ్యం'... పేరు చాలా బాగుంటుంది కదా. మన చిత్రానికి ఆ పేరే ఖరారుచేసుకుందాం అనుకున్నాం. నెల్లోపే పాటల రికార్డింగ్ పనులు కూడా మొదలయ్యాయి.
జొన్నవిత్తులతోనే అన్ని పాటలూ రాయించారెందుకు?
- 'అందరి బంధువయ భద్రాచల రామయ్యా...' అని జొన్నవిత్తుల అంతకుముందే ఓ పాట రాశారు. అంతకన్నా సరళంగా ఇంకెవరు రాయగలరు? అనిపించింది. అందుకే ఆయనతో అన్ని పాటలూ రాయించాం. ఇళయరాజాగారి బాణీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మా పాటల్ని ఇవాళ యువతే ఎక్కువగా ఇష్టపడుతోంది. అంత తాజాదనం గుబాళిస్తోంది గీతాల్లో.
చిత్రంలో మీకు బాగా నచ్చిన సన్నివేశం?
- మొదటి రోజు బాలకృష్ణగారు షూటింగ్‌లో ఉన్నారు. నేను కారు దిగి వెళ్తున్నాను. సీతాదేవిని భూదేవి తనతో తీసుకెళ్లే సన్నివేశమది. ముఖంలో పలు భావాలను పలికిస్తూ నటించాలి. దూరం నుంచి బాలకృష్ణ నటన చూస్తే చాలా ముచ్చటేసింది. ఆ తర్వాత ఆయన ఎన్ని సన్నివేశాలు చేసినా, నేను చూసినా... నాకు నచ్చింది తొలి సన్నివేశమే.
సీతారాములుగా నయనతార, బాలకృష్ణ నటన గురించి ఏం చెబుతారు?
- పూర్తిగా పాత్రలో లీనమై నటించే నటుడు బాలయ్య. ఈ చిత్రంలో నటించినన్నాళ్ళూ ఆయనలో ఏదో తేజస్సు కనిపించేది. అది దినదినప్రవర్ధమానమైనట్టు అనిపించింది. రాముడి పాత్రలో ఆయన్ని చూసిన కొంతమంది యువకులు 'అచ్చం రామారావుగారిలా ఉన్నారు కదా' అనడం స్వయానా నేనే విన్నాను. చాలా ఆనందమనిపించింది. అంతే భక్తి శ్రద్ధలతో నయనతార నటించింది. సీత పాత్ర చేసినన్నాళ్ళూ తను శాకాహారమే తీసుకుంది. ఏరోజూ గుడికెళ్ళకుండా సెట్‌కు రాలేదు. నేను చూసిన వారందరిలోకీ నయనతార గొప్ప వ్యక్తిత్వమున్న అమ్మాయి. తన వృత్తికి పూర్తి న్యాయం చేసే తరహా మనిషి.
వాల్మీకి పాత్రని చేయడానికి అక్కినేని గారు అంత సులువుగా ఒప్పుకున్నారా?
- అసలు ఈ చిత్రాన్ని ఎందుకు తీయాలనిపించింది అని ఆయన అడిగారు. 'ప్రతి మనిషికీ ఓ తృప్తి ఉంటుంది. ఈ సినిమా తీస్తే నేను తృప్తిగా ఉంటాను. రామాయణాన్ని ఎవరూ మర్చిపోకూడదు. రామచరిత్రలో లేనిది లేదు. ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ముల సఖ్యత, సుపరిపాలన, ఈర్ష్యా ద్వేషాలకు అతీతంగా మసలడం.. అంటూ అన్ని విషయాలు అందులో ఇమిడి ఉన్నాయి. విశ్వం ఉన్నంతకాలం రాముడుంటాడని నా నమ్మకం ' అని చెప్పాను. పెద్దాయన పాత్రను చేయడానికి అంగీకరించారు. వాల్మీకి పాత్రకు వందశాతం సరిపోయారు.
మిగతా పాత్రధారుల గురించి చెబుతారా?
- తక్కువ సన్నివేశాల్లో కనిపించినా జనకుడి పాత్రలో మురళీమోహన్ అచ్చుగుద్దినట్టు సరిపోయారు. లక్ష్మణుడి పాత్రకు శ్రీకాంత్ అయితే బాగుంటుందని అనుకున్నాం. చానాళ్ళు ఆయన కాల్షీటు కుదరలేదు. కానీ ఆఖరినిమిషంలో శ్రీకాంత్ కూడా మా యూనిట్‌లో కలవడం ముదావహం. లవకుశుల నుంచి... ప్రతి పాత్రధారీ ఈ చిత్రంలో చాలా గొప్పగా చేశారు.
సాంకేతికంగా ఈ సినిమా ఎలా ఉంటుంది?
- నేననుకున్నట్టు బాపుగారు కావ్యంలాగా తీర్చిదిద్దారు. ముళ్ళపూడివారి కథాకథనాల్ని తెరమీద అద్భుతంగా ఆవిష్కరించారు. సాంకేతికంగా ఎక్కడా వెనకడుగేయలేదు. షూటింగ్ జరిగిన 85 రోజులూ జిమ్మీజిప్ మా దగ్గరే ఉంది. నాలుగు ప్రత్యేకమైన సెట్‌లు వేశాం. ఏ ఫ్రేమ్ చూసినా చాలా గొప్పగా, కనులపండువగా ఉంటుంది. పాటలను అత్యంత సౌందర్యవంతంగా తెరకెక్కించారు బాపుగారు. ఆద్యంతం భారీతనంతో తీర్చిదిద్దాం.
సినిమాని ఎప్పుడు విడుదల చేస్తున్నారు?
ప్రస్తుతం నేపథ్యసంగీతం పనులు జరుగుతున్నాయి. హంగేరి రాజధాని బుడాఫెస్ట్‌లో ట్రాక్ మిక్సింగ్ కార్యక్రమాలు త్వరలో ఉంటాయి. హంగేరి నుంచి ఎనిమిది మంది సభ్యులు ఇప్పుడున్న రీరికార్డింగ్ బృందంతో త్వరలో కలుస్తారు. మరోవైపు గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తి కావచ్చాయి. ఇక డీఐ, డీటీయస్ పనులున్నాయి. వాటిని కూడా ముగించి అక్టోబర్ లోపు చిత్రాన్ని ప్రేక్షకులకు కనువిందు చేయాలనుకుంటున్నాం.

Thursday, September 1, 2011
బిగ్ స్టోరీ: మోహన్‌బాబు రావణావతారం!
'శ్రీరామరాజ్యం''లో బాలకృష్ణని రామావతారంలో బాపు చూపిస్తే, మోహన్‌బాబుని రావణావతారంలో చూపించాలని దిగ్దర్శకుడు కె. రాఘవేంద్రరావు సంకల్పించారు. రావణాసురునిగా మోహన్‌బాబు నటించే సినిమా షూటింగ్ మొదలయ్యేది 2012 ప్రథమార్థంలో. ప్రస్తుతం తెలుగులో భక్తి రస చిత్రాలు, పౌరాణిక చిత్రాల మీద ధ్యాస మళ్లినట్లే కనిపిస్తోంది. సాధారణంగా సోషల్ సినిమాల కంటే ఇలాంటి భక్తి, పౌరాణిక చిత్రాలకి ఖర్చు ఎక్కువవుతుంది. కారణం అప్పటి వాతావరణానికి తగ్గట్లు సెట్లు నిర్మించాల్సి రావడం, కాస్ట్యూమ్స్ తయారు చేయించడం. నాగార్జున నటించిన 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' సినిమాలకు మంచి పేరొచ్చింది. అయితే చాలామంది జనానికి తెలీని విషయం ఆ రెండూ కాస్ట్ ఫెయిల్యూర్లే. 'అన్నమయ్య'ని మించి 'శ్రీరామదాసు'కు కమర్షియల్‌గా ఎక్కువ నష్టాలు వచ్చాయి. అయితే సంకల్పమే అలాంటి తరహా సినిమాల నిర్మాణానికి దారితీస్తోంది. అటువంటి సినిమాలతో చరిత్రలో నిలిచిపోవచ్చనే ఆశే దానికి కారణం. రావణాసురుని పాత్ర అనగానే మనకి 'భూకైలాస్'లోని ఎన్టీ రామారావు, 'సంపూర్ణ రామాయణం'లోని ఎస్వీ రంగారావు జ్ఞాపకం వస్తారు. ఆ పాత్రల్లో ఆ ఇద్దరూ అమోఘంగా రాణించారు. ఆ ఇద్దరూ మినహా ఇంతదాకా మరొకరు ఆ పాత్రలో రాణించలేదు. ఇప్పుడు అలాంటి రావణుని పాత్ర చేయాలని విలక్షణ నటునిగా పేరుపొందిన మోహన్‌బాబు సంకల్పించారు. ఇప్పుడు హఠాత్తుగా ఆ పాత్రని చేయాలనే తలంపు ఆయనకు కలగడానికి 'శ్రీరామరాజ్యం' ప్రేరణ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
"రావణుడు 'నవమబ్రహ్మ'. బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తూ వైరి విజయానికి ముహూర్తాన్ని నిర్ణయించి, తన మరణాన్ని తానే ఆహ్వానించిన ధర్మనిరతుడు. రాముడు పితృవాక్య పరిపాలకుడైతే... రావణుడు మాతృవాక్య పరిపాలకుడు. శివాంశసంభూతుడు. శ్రీహరి పథాన్ని త్వరితగతిన చేరాలని తపించిన అపర హరిభక్తుడు. ఆ మహనీయుడి కథాంశంతో గతంలో చాలా సినిమాలొచ్చినా, రావణావతారానికి సంబంధించిన పూర్తి వృత్తాంతంతో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నది రావణుడి పాత్ర ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించే సినిమా. ఆయన జననం నుంచి మరణం వరకూ ఈ కథ సాగుతుంది. ఎన్టీఆర్, ఎస్వీఆర్ లాంటి మహానటులు చేసిన పాత్రను నేను చేయబోతున్నాను. వారి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా నా స్టైల్‌లో ఈ పాత్ర రక్తికట్టించడానికి ప్రయత్నిస్తాను" అని చెప్పారు మోహన్‌బాబు.
ఈ సినిమాకి సంబంచించిన మరో విశేషం, ఇందులో కేవలం తెలుగు నటులే కాకుండా, భారత దేశంలో పేరెన్నికగన్న నటులు నటించనుండటం. కారణం దీనికి భారీ బడ్జెట్ అవుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రేక్షకులకి సుపరిచితులైన నటులు ఇందులో పాత్రధారులైతే కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లోనూ దీన్ని విడుదల చేసే అవకాశం ఉంటుంది కనుక. త్రీడీ కెమెరాను ఉపయోగించి, అత్యాధునిక టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకోవడం కూడా అందుకే.
"ఎలాంటి పాత్రనైనా తనదైన నటనాపటిమతో మెప్పించగల నటుడు మోహన్‌బాబు. ఎన్టీఆర్ తర్వాత అంతటి సంభాషణా పటిమ గల నటుడు ఆయన మాత్రమే. ఈ సినిమాతో తనలోని నవరసాలను ఆవిష్కరించబోతున్నారాయన. మా కాంబినేషన్‌లో వచ్చిన 'అల్లుడుగారు', 'అల్లరిమొగుడు', 'మేజర్ చంద్రకాంత్' చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఆ వరుసలోనే వాటికన్నా మరింత అత్యద్భుతంగా ఈ సినిమా నిలుస్తుందని మా నమ్మకం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాం'' అని తెలిపారు రాఘవేంద్రరావు.

Thursday, August 25, 2011
ఇంటర్వ్యూ: జె.డి. చక్రవర్తి
"ఖాన్‌దాదాగా బ్రహ్మానందం విశ్వరూపం చూపించారు. ఈ సినిమాని నేనెలా ప్రేమించానో, ఆయనా అంతగా ప్రేమించారు. అయితే ఆయన వల్ల నాకు నష్టం జరిగింది'' అని చెప్పారు జె.డి. చక్రవర్తి. చక్రవర్తి ప్రొడక్షన్స్, ఫస్ట్ చాయిస్ మీడియా హౌస్ సంయుక్తంగా నిర్మించిన 'మనీ మనీ మోర్ మనీ' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడంతో పాటు ఓ కీలక పాత్రనీ చేశారు. కె. సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతున్న సందర్భంగా చక్రవర్తి చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
ఎంత పబ్లిసిటీ చేసినా ప్రేక్షకులు ముందే నిర్ణయించుకుంటారండీ. వాళ్లకి ఆ సినిమా మీద ఇంటరెస్ట్ ఉండాలి. అంతే. సినిమా బాగుందనే టాకే వాళ్లని థియేటర్లకి తీసుకువస్తుంది. కొన్ని సినిమాలకి ఎంత పబ్లిసిటీ ఇచ్చినా జనం రారు. కొన్నింటికి పెద్దగా లేకపోయినా జనం చూస్తారు.
ఇది స్క్రీన్‌ప్లే సీక్వెల్
ఇది సీక్వెలే కానీ మునుపటి వాటిలాంటి సినిమా కాదు. ఇది స్టోరీ సీక్వెల్ కాదు, స్క్రీన్‌ప్లే సీక్వెల్. 'మనీ' నుంచి కొన్ని పాత్రలు తీసుకున్నా. వాటి ప్రోగ్రెస్ ఉంటుంది కానీ కథ కొత్తది. ఈ కథ 2009లో మొదలవుతుంది. రియల్ ఎస్టేట్‌లో బాగా సంపాదించిన ఖాన్‌దాదా 2011కు వచ్చేసరికి డబ్బంతా పోగొట్టుకుని ఉంటాడు. కాకపోతే జూబ్లీహిల్స్‌లో అతనికి పెద్ద ఇల్లుంటుంది. అప్పులపాలై దాన్ని అమ్మేసుకుందామని అనుకుంటుంటాడు. ఆ టైమ్‌లో నలుగురు వ్యక్తులు అతని ఇంట్లో ప్రవేశించి, అతన్ని ఎలా ఆడుకున్నారనేదే కథ. ఆ తర్వాత ఆ ఇంట్లోకి ఎంతోమంది వస్తారు. వాళ్లందరి నుంచీ ఎదురైన సమస్యని ఖాన్‌దాదా ఎలా పరిష్కరించుకున్నాడనేది క్లైమాక్స్. ఖాన్‌దాదా ఇంట్లో ప్రవేశించే నలుగురు కిడ్నాపర్లుగా నేను, బ్రహ్మాజీ, ముకుల్‌దేవ్, కెవిన్ (మోడల్) నటించాం. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఫిల్మ్. డబుల్ మీనింగ్స్, అసభ్యకరమైన మాటలు, సన్నివేశాలు ఉండవు.
బ్రహ్మానందం విశ్వరూపం
ఈ సినిమాలో ఎవరూ కామెడీ చెయ్యరు. సందర్భాలే కామెడీని సృష్టిస్తాయి. ఖాన్‌దాదాగా బ్రహ్మానందం విశ్వరూపం చూపించారు. ఈ సినిమాని నేనెలా ప్రేమించానో, ఆయనా అంతగా ప్రేమించారు. అయితే ఆయన వల్ల నాకు నష్టం జరిగింది. ఎలాగంటే ఆయన నటిస్తున్నప్పుడు 'కట్' చెప్పడం మర్చిపోయేవాణ్ణి. అలా నెగటివ్ ఎక్కువ ఖర్చయింది. ఆయన నటనలో ఎన్ని కోణాలున్నాయో అప్పుడు అర్థమైంది. ఖాన్‌దాదా ఇంట్లో, అతని చుట్టూ తిరిగే కథ కాబట్టి ఫోకస్ అంతా ఆయనమీద ఉండటం సహజం.
వాటిని ఇష్టపడి చెయ్యలేదు
'హోమం', 'సిద్ధం' నా తరహా సినిమాలు కావు. వాటిని నేను ఇష్టపడి చెయ్యలేదు. నాకు కామెడీ ఇష్టం. అందుకే బాపు, కె. విశ్వనాథ్ సినిమాలకంటే రాఘవేంద్రరావు, జంధ్యాల సినిమాలు ఎక్కువ ఇష్టం. నిజానికి నవ్వించడం కష్టమైన ప్రక్రియ. 'మనీ మనీ మోర్ మనీ' నా తరహా సినిమా. మనం అన్ని సినిమాల్ని కాక కొన్ని సినిమాల్నే ఎంజాయ్ చేస్తాం. అలాగే నేను చేసిన వాటిలో కొన్నింటినే ఎంజాయ్ చేశా. 'కాశి', 'సూరి, 'సర్వం' (తమిళం) వంటివి సరిగా ఆడలేదు. కానీ వాటిని ఎంజాయ్ చేశా. 'ఎగిరే పావురమా', 'హోమం' వంటివాటిని నేను ఎంజాయ్ చెయ్యలేదు. ఇక్కడ ఎంజాయ్ చెయ్యడమనేది ఆ సినిమా మేకింగ్‌కి సంబంధించింది. ఇప్పుడు 'మనీ మనీ మోర్ మనీ' మేకింగ్‌ని బాగా ఎంజాయ్ చేశా.
ఇదే తొలిసారి
ఒక సినిమాకి సీక్వెల్ రావడమనేది నాకు తెలిసి దేశం మొత్తం మీద 'మనీ మనీ'తోటే మొదలు. ఇప్పుడు సెకండ్ సీక్వెల్ రావడం ఇదే తొలిసారి. తొలి రెండు సినిమాలకి దర్శకుడు శివనాగేశ్వరరావు. నేను 'మనీ మనీ మోర్ మనీ' టైటిల్ రిజిస్టర్ చేసిన రెండు రోజులకి ఆయన నుంచి ఫోన్ వచ్చింది. 'మనీ మనీ మోర్ మనీ'తో ఇంకో సినిమా చేద్దామనుకుంటున్నానని ఆయన చెప్పారు. నేను నవ్వేసి, ఆల్రెడీ టైటిల్ రిజిస్టర్ చేశాననీ, సినిమా స్టార్ట్ చేస్తున్నాననీ చెప్పా. ఆయన 'ఆల్ ద బెస్ట్' చెప్పారు.
నాది బాధ్యతారాహిత్యం
నా కెరీర్‌కి నాదే బాధ్యత. తెలుగులో వరుసగా మంచి హిట్లిచ్చి బూమ్‌లో ఉండగా రాము గారు (రాంగోపాల్‌వర్మ) రమ్మనగానే ఇక్కడన్నీ వదిలేసి బాంబే వెళ్లిపోయా. 'సత్య' సినిమా చేశా. ఆయన దగ్గరే ఉన్నా. ఇదంతా పరిణతి లేక, బాధ్యతారాహిత్యంతో చేసింది. నా కెరీర్‌ని ఎలా మలచుకోవాలన్నది నా చేతిలో పని. కానీ నేనప్పుడు అలా చెయ్యలేదు. అయితే జరిగినదానికి నేనేమీ బాధపడట్లేదు.

Friday, August 5, 2011
న్యూస్: అక్కినేనిగారూ ఇది సభ్యతేనా?
అక్కినేని నాగేశ్వరరావు దేశం గర్వించే మహానటుడు. 'దేవదాసు' పాత్రని ఆయన పోషించినట్లుగా ఇంకెవ్వరూ పోషించలేదనే కీర్తి పొందినవారు. ఆరున్నర దశాబ్దాలుగా అలుపన్నది లేకుండా ఇంకా నటిస్తూనే ఉన్నారు. చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉంటానని తన అంకిత భావాన్ని ప్రదర్శించే అసలు సిసలు కళాకారుడు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బాపు 'శ్రీరామరాజ్యం'లో వాల్మీకిగా నటిస్తున్నారు. అలాంటి ఆయన అదుపుతప్పి, అసభ్యకర రీతిలో మాట్లాడటమేమిటా అని అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. మీడియా అంతా పాల్గొన్న ఓ ఆడియో వేడుకలో, టెలివిజన్‌లో ప్రత్యక్షప్రసారమవుతున్న ఆ కార్యక్రమంలో ఆయన ఆడవారి వక్షస్థలం గురించి కొద్దిసేపు అలాగే మాట్లాడటం అందర్నీ బిత్తరపోయేలా చేసింది. కొంతమంది ఆయన మాటల్ని ఎంజాయ్ చేసినా ఎక్కువమంది అంత పెద్దవారు, అందరూ గౌరవించే స్థాయిలో ఉన్నవారు అలా మాట్లాడవచ్చునా? అని పెదవి విరిచారు. గురువారం (ఆగస్ట్ 4) రాత్రి ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన 'దగ్గరగా.. దూరంగా...' ఆడియో వేడుకలో ఈ సందర్భం చోటు చేసుకుంది. ఇందులో అందరికంటే చివరగా సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన మధ్యలో అకస్మాత్తుగా 'అమాయకురాలు' సినిమా సంగతి ప్రస్తావిస్తూ అందులో నాయిక కాంచనని తను హత్తుకునే సన్నివేశం గురించి చెప్పుకొచ్చారు. "ఆ సమయంలో నిర్మాత మధుసూదనరావు గారు లేరు. నేను, కాంచన ఒకరినొకరం తన్మయత్వంతో గట్టిగా హత్తుకోవాలి. ఆ సీనులో ఆమె 'బ్రెస్ట్స్' కదిలాయి. ఈ సంగతి నాకెలా తెలుస్తుంది? రషెస్ చూసిన మధుసూదనరావు గారు నన్ను పిలిచారు. 'నీకు బుద్ధుందా? అంత గట్టిగా వత్తుకోవాలా? ఆ బ్రెస్ట్స్ చూడు ఎలా కదిలాయో. చూసుకోవద్దా?' అనరిచారు. అప్పట్లో అసభ్యతకు తావు లేకుండా అంత జాగ్రత్త తీసుకునేవారు. ఇప్పుడు అలాంటివేమీ లేవు. అయినా ఇప్పుటి హీరోయిన్లవి కదులుతున్నా అవి నిజమైనవో, కాదో.. ఇప్పుడు కృత్రిమమైనవేవో తొడుక్కుంటున్నారుగా" అని చెప్పుకొచ్చారు. ఆయన ఈ మాటలు చెప్పేప్పుడు ఆయన పక్కనే ఆ సినిమా హీరోయిన్ వేదిక ఉంది. వేడుకకి వచ్చిన వాళ్లలో ఆడవాళ్లు ఉన్నారు. ఆయన ఇలా సినిమాల్లో అసభ్యత గురించి మాట్లాడుతూ, తనే అసభ్యంగా మాట్లాడటం వాళ్లని తలలు దించుకునేలా చేసింది. "ఆడవాళ్ల వక్షస్థలం గురించి అది మాట్లాడే సందర్భమేనా? ముసలాయనకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీకుండా పోతోంది" అనే కామెంట్లు వినిపించాయి.
Thursday, July 28, 2011
విశ్లేషణ: క్రేజీ సినిమాలొస్తున్నాయ్!
సినిమా ప్రియుల్ని రానున్న ఐదు నెలల కాలం కనువిందు చేయనున్నది. క్రేజీ హీరోల, డైరెక్టర్ల సినిమాలు కొన్ని రిలీజవుతుండటమే దీనికి కారణం. మొదట ఆగస్ట్ 5న రాం హీరోగా నటించిన 'కందిరీగ' విడుదలవుతోంది. దీంతో కలుపుకుంటే ఈ యేడాది ఆఖరులోగా సుమారు 15 క్రేజీ సినిమాలు విడుదలవుతున్నాయి. సినిమాటోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలకు పనిచేసిన సంతోష్ శ్రీనివాస్ 'కందిరీగ'తో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'మస్కా' తర్వాత రాం, హన్సిక మరోసారి జతకట్టగా, 'యువత' ఫేం అక్ష మరో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు ఎంటర్‌టైన్‌మెంటే ప్రధాన బలం. 'రెడీ' తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేని రాం 'కందిరీగ'తో హిట్ కొట్టాలని తపిస్తున్నాడు.
నాగచైతన్య, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'దడ' సినిమా విడుదల కోసం చాలామందే వేచి చూస్తున్నారు. ఆగస్టు 12న రానున్న ఈ సినిమాతో అజయ్ భుయాన్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. అమెరికా నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలోని ఫైట్స్‌ని ఇంటర్నేషనల్ మాస్టర్స్ కంపోజ్ చేయడం గమనార్హం. హీరోయిన్ కాజల్‌ని ఆపద నుంచి రక్షించే యువకునిగా నటించిన నాగచైతన్య ఈ సినిమాతో మాస్ ఇమేజ్‌ని ఆశిస్తున్నాడు.
ఇప్పటివరకు అనిశ్చితిలో ఉన్న మహేశ్ 'దూకుడు' విడుదల ఓ కొలిక్కి వచ్చినట్లు అగుపిస్తోంది. ఆగస్టు 26న ఈ సినిమా విడుదలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రోజు కాకపోయినా సెప్టెంబర్ తొలి వారంలోనైనా 'దూకుడు' వస్తుందని ఆశించవచ్చు. 'ఖలేజా' తర్వాత మహేశ్ నటిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకుడు. సమంత నాయికగా నటిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో అంబరాన్నంటుతున్న అంచనాలున్న సినిమా ఇదే. 'పోకిరి' తర్వాత హిట్‌లేని మహేశ్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు.
సెప్టెంబర్‌లో రెండు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవి బాబాయ్, అబ్బాయ్ సినిమాలు కావడం విశేషం. ఆ సినిమాలు బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం', ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'. 'శ్రీరామరాజ్యం'లో సీతారాములుగా నయనతార, బాలకృష్ణ నటిస్తుండగా, బాపు దర్శకత్వం వహిస్తున్నారు. అలనాటి అజరామర చిత్రం 'లవకుశ'కు ఇది రీమేక్. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుందనీ, తద్వారా పెద్ద విజయాన్ని సాధిస్తుందనీ సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'ఊసరవెల్లి'పై ప్రేక్షకుల్లో ఎటువంటి అంచనాలున్నాయో విడమర్చి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ కేరక్టరైజేషన్ హైలైట్‌గా రూపొందుతున్న ఈ సినిమా 'కిక్' తర్వాత సురేందర్‌రెడ్డి సృజనాత్మక శక్తికీ, ఎన్టీఆర్ ఇమేజ్‌కీ ఓ పరీక్ష కానున్నది. వాళ్లిద్దరి కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన 'అశోక్' హిట్ అనిపించుకోలేక పోయింది. ఆ అసంతృప్తిని 'ఊసరవెల్లి'తో పారదోలాలని ఆ ఇద్దరూ గట్టి పట్టుదలతో ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర చినీ చిత్ర బేనర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. 'రాఖీ' తర్వాత ఎన్టీఆర్‌తో దేవిశ్రీ ప్రసాద్ పని చేస్తున్న ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్ కావడం గమనార్హం.
ఇక అక్టోబర్‌లో ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు రిలీజవుతున్నాయి. అవి నాగార్జున 'రాజన్న', వెంకటేశ్ మలయాళ 'బాడీగార్డ్' రీమేక్. 'రగడ' వంటి కమర్షియల్ హిట్, 'గగనం' వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం తర్వాత నటిస్తున్న 'రాజన్న' నాగార్జున కెరీర్‌లో మరో కీలకమైన చిత్రం కానున్నది. 1940-50 నాటి నేపథ్యంలో రజాకార్ల దురాగతాల మీద తిరుగుబాటు బావుటా ఎగురవేసిన 'రాజన్న' అనే పోరాట యోధుని కల్పిత కథతో ఈ చిత్రాన్ని వి. విజయేంద్రప్రసాద్ రూపొందిస్తున్నారు. ఇందులోని యాక్షన్ సన్నివేశాల్ని ఆయన కుమారుడు, నేటి టాప్ డైరెక్టర్ రాజమౌళి తీస్తున్నాడు. నాగార్జునకి జోడీగా స్నేహ నటిస్తున్న ఈ సినిమాతో నాగార్జున కీర్తి నటునిగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంది.
'రాజన్న'కు పోటీగా వస్తున్న వెంకటేశ్ సినిమా 'గంగ - ద బాడీగార్డ్'. 'తులసి' తర్వాత సరైన హిట్టులేని వెంకటేశ్ కొంత పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నారు. 'డాన్ శీను' ఫేం గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ బేనర్‌పై బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ త్రిషకు బాడీగార్డ్‌గా కనిపించనున్నారు వెంకటేశ్. మలయాళ హిట్ ఫిల్మ్ 'బాడీగార్డ్'కి ఇది రీమేక్. ఈ సినిమాతో కమర్షియల్ హిట్ సాధించ గలననే నమ్మకం ఆయనలో కనిపిస్తోంది.
నవంబరులో మూడు సినిమాలు వచ్చే అవకాశాలున్నాయి. రాంచరణ్ 'రచ్చ' వాటిలో ఒకటి. 'ఏమైంది ఈవేళ' ఫేం సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాని రాంచరణ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాడు. 'మగధీర' తర్వాత చేసిన 'ఆరెంజ్' అట్టర్‌ఫ్లాప్ కావడమే దీనికి కారణం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. నవంబరులో రాని పక్షంలో డిసెంబరులోనైనా ఈ సినిమా రిలీజవుతుంది.
వేణు శ్రీరాంని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మిస్తున్న 'ఓ మై ఫ్రెండ్' నవంబరులోనే వస్తుందని అంటున్నారు. ఇందులో హీరో సిద్ధార్థ్ కాగా, హీరోయిన్లు శ్రుతి హాసన్, హన్సిక. 'అనగనగా ఓ ధీరుడు' నుంచి సిద్ధార్థ్, శ్రుతి హాసన్ మధ్య రొమాన్స్ జరుగుతున్నదనే ప్రచారం నేపథ్యంలో అందరి కళ్లూ ఈ సినిమా మీదున్నాయి. నిజానికి ఇందులో మొదట తననే తీసుకున్నారనీ, తర్వాత సిద్ధు పట్టుబట్టి తన ప్లేస్‌లో శ్రుతిని తీసుకునేలా చేశాడనీ నిత్య బహిర్గతం చేసిన సంగతి ప్రస్తావనార్హం.
చిరంజీవి కేంపు నుంచి వస్తున్న మరో హీరో సినిమా నవంబర్‌లోనే రిలీజవబోతోంది. అతను చిరంజీవి మేనల్లుడు సాయి ధరంతేజ్ కాగా ఆ సినిమా 'రేయ్'. స్వీయ నిర్మాణంలో బొమ్మరిల్లు పతాకంపై వైవీఎస్ చౌదరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 'దేవదాసు' తర్వాత తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అనడంతో ఈ సినిమాని చాలా శ్రద్ధపెట్టి తీస్తున్నాడు చౌదరి. ఇందులో ధరంతేజ్ సరసన శుభ్ర అయ్యప్ప నాయికగా పరిచయం కాబోతోంది.
ఇక డిసెంబర్‌లో మరిన్ని రసవత్తర చిత్రాలు ఒకదానితో మరొకటి ఢీకొననున్నాయి. లారెన్స్ డైరెక్షన్‌లో కృష్ణంరాజు, ప్రభాస్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్న 'రెబెల్', నాగార్జున హీరోగా శ్రీనివాసరెడ్డి రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'ఢమరుకం', గోపీచంద్, తాప్సీ జంటగా కృష్ణవంశీ తీస్తున్న 'మొగుడు' ఈ నెల్లో రానున్నాయి. విష్ణువర్ధన్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'కాళీ' కూడా డిసెంబర్లో వచ్చే అవకాశాల్ని తోసిపుచ్చలేం.
ఇన్ని సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుండటంతో ఏ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది, ఏది తిరస్కారానికి గురవుతుంది.. అన్నది ఆసక్తికర అంశం. 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వ్యయంతో తయారవుతున్న ఈ సినిమాలు విజయాన్ని సాధిస్తే తెలుగు సినీ పరిశ్రమ కళకళలాడుతుంది. అయితే విడుదలైన క్రేజీ సినిమాలన్నీ విజయాన్ని సాధించిన దాఖలా ఇంతదాకా లేదు కాబట్టి ఈసారీ అది పునరావృతమవుతుందనడంలో సందేహం లేదు. ఎటొచ్చీ బంతి ఉండేది ప్రేక్షకుడి కోర్టులోనే. చూద్దాం అతడు ఎటువంటి తీర్పునిస్తాడో...

Wednesday, July 27, 2011
న్యూస్: తండ్రి లాగే రామునిగా బాలయ్య అలరిస్తాడా?
వరుసగా ఏడు ఫ్లాపుల తర్వాత వచ్చిన సూపర్ హిట్ మూవీ 'సింహా'తో జూలు విదిల్చాడు నందమూరి బాలకృష్ణ. తన పని అయిపోయిందని జరుగుతున్న ప్రచారానికి ఆ సినిమాతో జవాబిచ్చాడు. అయితే ఆ వెంటనే వెటరన్ డైరెక్టర్ దాసరి నారాయణరావు 150వ సినిమా 'పరమవీరచక్ర' చేసి పొరబాటు చేశాడు. ప్రేక్షకులు ఆ సినిమాని నిర్ద్వంద్వంగా తిరస్కరించినా ఇప్పటికీ అది తన దృష్టిలో గొప్ప సినిమానే అని గొప్పలు చెబుతూనే ఉన్నారు దాసరి. దాని సంగతి పక్కన పెడితే ఇప్పుడు బాలకృష్ణ మూడు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో బాపు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం' ప్రధానమైంది. ఎన్టీఆర్ ఒకప్పటి చిత్రరాజం 'లవకుశ' ఆధారంగా కొద్దిపాటి మార్పులు చేర్పులతో ఈ సినిమా తీస్తున్నారు. దివంగత ముళ్లపూడి వెంకటరమణ సంభాషణలు రాసిన ఈ చిత్రంలో రామునిగా బాలకృష్ణ నటిస్తుంటే, ఆయన సరసన సీతగా అందాల తార నయనతార నటించడం విశేషం. సూపర్‌హిట్ మూవీ 'సింహా' తర్వాత వారు కలిసి పనిచేసిన సినిమా కావడంతో ఈ జోడీ తప్పకుండా మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. తన చివరి కాల్షీట్ రోజు నయనతార ఈ సినిమా సెట్స్ మీద భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఇందులో వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణునిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్ నటిస్తుండటంతో సినిమాకి స్టార్ వాల్యూ కూడా ఏర్పడింది. ఇది కాక పరుచూరి మురళి డైరెక్షన్‌లో తయారవుతున్న సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు బాలకృష్ణ. ఇటీవలే సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ నిర్దేశకత్వంలో 'హర హర మహదేవ' సినిమా మొదలైంది. ఈ సినిమాలతో, ముఖ్యంగా 'శ్రీరామరాజ్యం'తో బాలయ్య తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తాడని ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు నెరవేరుతాయా?
Friday, July 22, 2011
న్యూస్: ఛార్మి 'మంత్రం' పారడం లేదు!
లేడీ ఓరియంటెడ్ మూవీ 'మంత్ర' తర్వాత ఛార్మి హీరోయిన్‌గా నటించిన ఏ తెలుగు సినిమాని ప్రేక్షకులు ఆదరించారు? ప్చ్.. ఏమీ లాభం లేదు. 'మంత్ర' (2007) తర్వాత ఛార్మి వైభవం మసకబారుతూ వచ్చింది. ఈ మధ్యలో ఆమె బాపు దర్శకత్వంలో 'సుందరకాండ', వి. ఈశ్వరరెడ్ది దర్శకత్వంలో 'మనోరమ', కొత్తవాడైన రమణ దర్శకత్వంలో 'సై ఆట', 'మంత్ర' ఫేం తులసీరాం దర్శకత్వంలో 'మంగళ', ప్రేంరాజ్ డైరెక్ట్ చేసిన 'నగరం నిద్రపోతున్న వేళ' వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఆమెకి కమర్షియల్ సక్సెస్‌ని అందించలేదు. కొద్ది రోజుల తేడాతో ఇటీవల వచ్చిన 'నగరం నిద్రపోతున్న వేళ', 'మాయగాడు' సినిమాలు రెండూ ప్రేక్షకుల నుంచి కనీసపు స్పందన కరువవడంతో డిజాస్టర్ అయ్యాయి. గుడ్డిలో మెల్ల ఏమంటే పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో అమితాబ్‌తో కలిసి నటించిన హిందీ సినిమా 'బుడ్డా.. హోగా తేరా బాప్' ఆమెకి బాలీవుడ్‌లో కాస్త గుర్తింపును తెచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్టయ్యిందంటూ మీడియా మొదట్లో తెగ హడావుడి చేసినా, వారాంతం తర్వాత చూసుకుంటే కలెక్షన్లు బాగా డౌనయ్యాయి. ఏదేమైనా దానికి పెట్టిన పెట్టుబడి మాత్రం వచ్చేసింది. ప్రస్తుతం ఛార్మి శ్రీకాంత్ సరసన 'సేవకుడు' చిత్రంలో నటిస్తోంది. దీనికి వి. సముద్ర దర్శకుడు. ఈ సినిమా కూడా ఆడకపోతే ఛార్మిని పట్టించుకునేవాళ్లు కరువైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Wednesday, July 6, 2011
న్యూస్: నయనతార కెరీర్ ముగిసినట్లేనా?
కేరళ కుట్టి నయనతార నట జీవితం ఇక ముగిసినట్లేనా? ప్రస్తుతానికైతే అవుననే చెప్పాలి. ఆమె చివరి చిత్రాన్ని తెలుగులోనే చేసింది. అది 'శ్రీరామరాజ్యం'. ఇందులో ఆమె రామాయణ గాథలోని సీత పాత్ర చేసింది. ఒక పౌరాణిక సినిమాతో కెరీర్‌కి ఆమె ముగింపు పలుకుతుండటం విశేషమనే చెప్పాలి. అందుకే చివరి రోజు షూటింగులో ఆమె బాగా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టేసుకుంది కూడా. ఆఖరి రోజు ఆమె పాల్గొన్న చివరి సీను ముగియగానే అక్కడున్న యూనిట్ సభ్యులంతా ఆమెపై పూల వర్షాన్ని కురిపించారు. నిర్మాత సాయిబాబు స్వయంగా ఆమె మీద పూలు చల్లి రెండు చేతులతో నమస్కరించారు. అందరికీ దండం పెడుతూ, కళ్ల నుంచి చెంపలమీదికి నీళ్లు కారుతుండగా దర్శకుడు బాపు పాదాలకి నమస్కరించింది నయనతార. ఆయన ఆమెని ఆశీర్వదించారు. ఈ సినిమా యూనిట్‌ని వీడిపోతున్నానన్న బాధో, ఇదే చివరి సినిమా అనే ఆవేదనో కానీ ఆమె మొత్తానికి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీరామునిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సీతారాములుగా ఆ ఇద్దరూ తెరమీద కనిపిస్తారనేది ఆసక్తికరం. ఇదివరకు 'లవకుశ'లో సీతారాములుగా అంజలీదేవి, ఎన్‌టీ రామారావు అమోఘంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు అదే కథతో తీసిన 'శ్రీరామరాజ్యం'లో బాలకృష్ణ, నయనతార ఆ పాత్రల్లో ఆకట్టుకునే అవకాశాలున్నాయి. 'సింహా'లో ఆ ఇద్దరూ ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. మొదట 'శ్రీరామరాజ్యం'లో చేయడానికి నయన వెనుకాడింది. ప్రభుదేవాతో పెళ్లి నిర్ణయం జరిగాక సినిమాలకి గుడ్‌బై చెబుతున్నట్లు ఆమె ప్రకటించింది. అయితే బాలకృష్ణ ఆమెనే సీతగా కోరుకోవడం, దర్శకుడు బాపు కావడం వల్లే ఆమె చివరి నిమిషంలో సీతగా నటించేందుకు అంగీకారం తెలిపింది. యూనిట్ వర్గాల ప్రకారం ఆ పాత్రని ఆమె సమర్థంగా పోషించింది. అందుకే తృప్తికరంగా సినిమాలకు సెలవు చెప్పింది నయనతార. ఈ సినిమా తర్వాత ఆమె తెరమీద కనిపించే అవకాశాలు లేనట్లే.
Wednesday, December 16, 2009
Vijaya Nirmala (Actress and Director)
Vijaya Nirmala is acted in more than 250 films and directed 47 films so far.
She entered in the film world as a child artiste at the age of 7 years. She first acted in a Tamil film, starred by TR Mahalingam.
Her last film as a child artiste is 'Panduranga Mahatyam'.
Vijaya Nirmala acted as a female lead first time in a Malayali film, starred by star actor Prem Nazir, at the age of 16 years.
Her first Telugu film as a heroine is BN Reddy's 'Rangula Ratnam'.
Bapu's 'Sakshi' is her third Telugu film.
'Kavitha', the Malayali film is her first directorial venture.
'Meena' is her first Telugu film as a director.
Before marriage, she acted in 50 films and after marriage, she has done more than 200 films.

Subscribe to:
Posts (Atom)