Showing posts with label vb rajendra prasad. Show all posts
Showing posts with label vb rajendra prasad. Show all posts
Saturday, December 10, 2011
జగపతిబాబుకి లలితకళాభూషణ బిరుదు
కళలను, కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో డా.టి.సుబ్బరామిరెడ్డి ఏర్పాటు చేసిన టిఎస్ఆర్ లలితకళాపరిషత్ నరసరావుపేట జోన్ డిసెంబర్ 11న ప్రారంభమవుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో జగపతిబాబును లలితకళాభూషణ బిరుదుతో సత్కరించనున్నట్లు టి.సుబ్బరామిరెడ్డి చెప్పారు. అలాగే మూడు తరాల చలనచిత్ర ప్రముఖుడు, దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ను కూడా ప్రత్యేకంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో వాణిశ్రీ, బ్రహ్మానందం, డా.రాజశేఖర్, జీవిత, ప్రియమణి, శియాగౌతమి, గిరిబాబు, గీతాంజలి, పరుచూరి వెంకటేశ్వరరావు, పి.విజయబాబు తదితరులు పాల్గొంటారు. సాలూరి వాసూరావు, నాగూర్‌బాబు, అంజనా సౌమ్య పాల్గొనగా ఎల్.ఆర్.ఈశ్వరి సినీ సంగీత విభావరి జరుగుతుంది.
Subscribe to:
Posts (Atom)
