ఎడ్లబండి పల్లంలోకి వచ్చింది. ఒక్కసారిగా జోడెద్దులు జోరందుకున్నాయి.
దాంతో పట్టుతప్పిన కావేరి వెనక్కి తూలింది. రామచంద్ర పట్టుకోనట్లయితే కింద
పడిపోయేదే. "అమ్మో" అంటూ రామచంద్ర గుండెల మీద తలవాల్చి అతన్ని గట్టిగా
పట్టేసుకుంది.
అబ్బాయిని గట్టిగా పట్టుకొని కూర్చో అమ్మాయ్" అన్చెప్పింది రామచంద్ర తల్లి
రత్నాంబ. సిగ్గుపడింది కావేరి. సరిగా కూర్చొని, పక్కనే ఉన్న కర్రను
పట్టుకుంది. బండిలో కూర్చొని ఉన్న మిగతా ఆడాళ్లు ఆ జంటను చూసి ముసిముసి
నవ్వులు నవ్వుకున్నారు.
ఆ బండే కాదు, ఎన్నో బళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా పోతున్నాయి,
నాగార్పమ్మ శిడి ఉత్సవాన్ని చూడ్డానికి. నాగార్పమ్మ (నాగవరపమ్మ) అంటే గ్రామ
దేవత. రైలుకట్ట మీదుగా కొత్త కాల్వ బ్రిడ్జి దాటి జీడిమామిడి తోటల మధ్య
నుంచి ఇసుకలో పోతే అల్లంత దూరంలో మామిడి తోటల మధ్య కొలువు తీరిన నాగర్పమ్మ
గుడికెళ్లాలంటే సొన దాటుకుని పోవాలి. ఎంత ఎండాకాలమైనా నీళ్లుండటం ఆ సొన
విశేషం. ఎడ్ల బళ్లు సొన అవతల ఆగిపోయాయి. బళ్లు తోలేవాళ్లు బళ్లనీ,
ఎద్దుల్నీ అక్కడి మామిడి చెట్లకి కట్టేసి, ఎద్దుల ముందు గడ్డిమోపులు
పడేస్తున్నారు.
మగాళ్లు ఫ్యాంట్లు, ఆడాళ్లు చీరలు మోకాళ్ల దాకా ఎత్తి పట్టుకుని సొనలో
దిగారు. చీరెత్తి పట్టుకోవాలంటే ఎక్కడ లేని సిగ్గూ, బిడియం ఆవరించాయి
కావేరిని. "నా వల్ల కాదు" అంది చిన్నగా రామచంద్రతో.
"అయితే చేతుల్లో ఎత్తుకొని తీసుకెళ్లేదా?" అన్నాడు సరదాగా కన్నుగీటుతా.
"ష్" అంటా కళ్లతో కాస్త కోపాన్ని అభినయించి, చీర కుచ్చిళ్లు కాస్త ఎత్తి
పట్టుకుని నీళ్లలోకి దిగింది. చల్లగా తగిలాయి నీళ్లు. ఆమె చేయి పట్టుకొని,
చిన్నగా నడిపిస్తూ ఇవతలకి తీసుకు వచ్చాడు రామచంద్ర.
"అబ్బా" అంది కావేరి.
"ఏంటి?" కంగారుగా అడిగాడు.
"కాలిమీద ఏదో కుట్టింది."
ఏదో అర్థమైనట్లు ఆమెను అక్కడే ఉన్న బండరాయి మీద కూర్చోబెట్టి, ఆమె కాలిని
చేతుల్లోకి తీసుకుని చూశాడు. పిక్కమీద నల్లగా జలగ! గట్టిగా లాగేసి, టక్కున
నీళ్లలోకి విసిరేశాడు. అప్పటికే అది నెత్తురు తాగిన దానికి గుర్తుగా ఎర్రటి
చార.
"ఏంటది?" అడిగింది.
"అది జలగ. సిటీ అమ్మాయివి కదా, ఇప్పటి దాకా చూసుండవు. అవునా" అన్నాడు. అవునన్నట్లు తలూపింది.
"ఏం కాదుగా?" అడిగింది, కాలివంక చూసుకుంటా.
"ఏం కాదు. నేనున్నానుగా" ధైర్యం చెప్పాడు.
గుడివద్ద గోలగోలగా అరుపులూ, "నాగార్పమ్మకీ జై" అన్న కేకలూ వినిపించాయి.
"రా.. రా..." అంటూ అమెను అటు తీసుకుపోయాడు.
శిడిమానును పైకి లేపుతున్నారు. పెద్ద దూలానికి చివర బోను, ఆ బోనులో మేక.
దూలాన్ని పూర్తిగా పైకిలేపారు. పూజారి ఏవో మంత్రాలు చదివి, "కానీయండి"
అనగానే అక్కడున్న జనం చేతుల్లోని పూలు, అరటిపళ్లు పైకి విసిరి
వేస్తున్నారు. వాటిలో కొన్ని బోనుకీ, దాని లోపల ఉన్న మేకకీ తగులుతున్నాయి.
రామచంద్ర, కావేరి కూడా పూలు విసిరారు.
"భలే ఉంది ఈ ఆచారం. ఆ మేకనే చేస్తారు?" అడిగింది కావేరి.
"అమ్మవారికి బలిస్తారు. అలా చేస్తే ఊళ్లో బాగా వానలు పడతాయనీ, కరువు కాటకాలు ఉండవనీ జనం నమ్మకం" చెప్పాడు.
"అయ్యో పాపం మేక" అంది జాలిగా.
"ఇప్పుడు నయం. దాని మీదకు పూలు విసిరేస్తున్నారు. ఒకప్పుడైతే టెంకాయలు విసిరేసేవాళ్లు. అవి తగిలి ఆ మేక ఎంత నరకం అనుభవించేదో."
"మరి టెంకాయల బదులు పూలెందుకేస్తున్నారు?"
"దానికో చిన్న కథుంది. వింటానంటే చెబుతా."
"సరే"
వాళ్లమ్మకు చెప్పి కావేరిని గుడి వెనకున్న మామిడి తోటలోకి తీసుకుపోయాడు రామచంద్ర. ఒక చెట్టుకింద శుభ్రం చేసుకుని కూర్చున్నారు.
"ఇంత ఎండలోనూ ఎంత హాయిగా ఉందిక్కడ. ఇలాంటి చోట ఇల్లు కట్టుకొని ఉంటే ఇంకెంత బావుంటుందో" అంది కావేరి, అతడి భుజం మీద తలవాల్చి.
"అమ్మాయిలో భావుకత్వం ఉబుకుతుందే" అన్నాడు, గాలికి ముఖం మీద పడుతున్న ఆమె ముంగురుల్ని సరిచేస్తా.
"సరే సరే. ఇందాకటి కథ చెప్పు" అంది, అతడి చేతిమీద గీతలూ గీస్తా.
గొంతు సవరించుకున్నాడు రామచంద్ర. "దాదాపు ఇరవై ఏడేళ్ల కింద జరిగిన కథ.. కాదు సంఘటన ఇది.." అంటా మొదలు పెట్టాడు.
* * *
పదేళ్ల కొడుకు చిన్నాని వెంటబెట్టుకుని
వెళ్లాడు మల్లయ్య, నాగార్పమ్మ శిడి ఉత్సవానికి. శిడిమాను తిప్పడానికి కొంత
సమయం పడుతుందని తెలిసి గుడెనక ఉన్న తమలపాకుల తోటలోకెళ్లారు తండ్రీ
కొడుకులు.
వాళ్లమాదిరే కొంతమంది ఆ తోటలో తిరుగుతూ
కాలక్షేపం చేస్తుంటే, ఇంకొంతమంది పేకాడుతూ కూర్చున్నారు. చిన్నాకి ఆ తోటలో
ఉంటే చాలా హాయిగా అన్పిచ్చింది. తమలపాకుల పాదులు, పందిళ్లకు పాకిన తమలపాకుల
తీగలు, మధ్యమధ్యలో మామిడి చెట్లు, ఆ పాదులకు ఆనుకొని మొదలైన అరటి తోటలు..
బయట మండిపోతున్న రోహిణీ కార్తె ఎండలకు విరుద్ధంగా చల్లటి వాతావరణం.
అక్కణ్ణించి కదలాలనిపించలేదు.
"నాన్నా. నాకా మావిడికాయ కావాలి"
అనడిగాడు చిన్నా, ఓ చెట్టుకు కనిపిస్తున్న మామిడికాయను చూపిస్తా.
తిరనాళ్లకొచ్చే జనం దులిపేస్తారనే భయంతో తోటలోని మామిడికాయల్ని రెండు రోజుల
ముందే యజమాని కోసేశాడు. కనిపించలేదేమో ఆ ఒక్క మామిడికాయ మిగిలిపోయింది.
మల్లయ్య ఎగిరాడు కానీ ఆ కాయ అందలేదు.
"చెట్టెక్కి కోస్తా" అన్నాడు చిన్నా. "సరే"నని కొడుకుని చెట్టెక్కించాడు మల్లయ్య.
కష్టపడి ఆ కాయని ఎట్లాగో పట్టుకొని
కోశాడు చిన్నా. కిందకు దిగుతున్న అతడికి గుడి దగ్గిర శిడిమాను
పైకిలేస్తున్న సన్నివేశం కనిపించింది.
"నాన్నా. అక్కడ మేకను పైకి లేపుతున్నారు" అని చెప్పాడు.
"అదేరా శిడి. తొందరేం లేదులే. నెమ్మదిగా
దిగు" చెప్పాడు మల్లయ్య. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఆదరాబాదరాగా దిగేంతలో
కాలు పట్టుతప్పింది. సర్రున జారిపోయాడు చిన్నా. నయం. కిందపడలేదు. మొదలు
నుంచి కొమ్మలు వేరయ్యే చోట పడ్డాడు. ఒక కొమ్మని గట్టిగా పట్టుకున్నాడు,
కిందపడకుండా.
"అరెరే..." అంటా కొడుకుని కిందికి దించాడు మల్లయ్య.
చేతిమీద చల్లగా ఏదో పడింది. చూస్తే
నెత్తుటి చుక్క. అప్పటికే చేయి చూసుకుంటున్నాడు చిన్నా. ఎడమచేయి మధ్యలో
చర్మం చీరుకుపోయి ఎర్రగా కనిపిస్తోంది. ఆ నెత్తుటి వెనుక తెల్లటి చర్మం.
గబగబా దగ్గర్లో ఉన్న ఏదో మొక్క ఆకుల్ని
కొన్ని తుంచి, వాటిని గట్టిగా వొత్తాడు. రసం బొట్లు బొట్లుగా గాయం మీద
పడ్డాయి. మంటతో "అమ్మా" అన్నాడు చిన్నా.
"ఓర్చుకో. దెబ్బ తొందరగా మానిపోతుంది ఈ రసంతో" ధైర్యం చెప్పాడు మల్లయ్య.
ఇద్దరూ శిడిమాను కాడికి పోయారు. శిడి
పూర్తిగా పైకిలేచింది. దూలాన్ని కింద స్తంభానికి గట్టిగా కట్టేశారు. బోనులో
ఉన్న మేక మొహాన పసుపు, కుంకుమ బొట్లు. మెడలో దండ.
ఏవో మంత్రాలు చదువుతా "కానియ్యండి" అన్నాడు పూజారి.
మరుక్షణం అక్కడే ఉన్న ఒక పెద్దాయన,
చేతిలోని టెంకాయని గట్టిగా విసిరాడు. అది మేక మొహంవేపు బోనుకు గట్టిగా
తగిలింది. ఠప్పున పగిలింది కాయ. ముక్కలు చెల్లా చెదురుగా పడ్డాయి. మేక
భయంతో "మే.. మే.." అనరిచింది.
ఆ తర్వాత అక్కడున్నవాళ్లంతా టెంకాయలు
మేకమీదికి విసురుతున్నారు. విపరీతమైన భయంతో మేక అదేపనిగా అరుస్తోంది.
బోనుకు తగిలి పగిలిన కొబ్బరి చిప్పలు కొన్ని దాని వొంటికి తగులుతున్నాయి.
అది కేకలు పెడుతుంటే కిందనున్న జనం కేరింతలు కొడుతున్నారు. రాక్షసానందంతో
ఈలలు వేస్తున్నారు. చూసిన చిన్నా "అయ్యో పాపం మేక" అన్నాడు జాలిగా.
మేక పడుతున్న బాధ చూస్తుంటే చిన్నారి
చిన్నా గుండెను ఎవరో మెలి తిప్పుతున్నంత బాధగా ఉంది. పొట్టలో దేవినట్లుగానూ
ఉంది. కళ్లముందు ఒక ప్రాణమున్న మేకని అట్లా కొట్టి హింసిస్తూ అక్కడి జనం
ఎట్లా ఆనందం పొందుతున్నారో అతడికి అర్థం కావడం లేదు.
"నాన్నా, పాపం ఆ మేకని అట్లా
బాధపెట్టడమెందుకు? చూడు అదెట్లా వొణికిపోతోందో. ఒకేసారి దాన్ని
చంపెయ్యొచ్చు కదా?" అడిగాడు తండ్రిని బాధగా.
కొడుక్కి ఏమని చెబుతాడు మల్లయ్య. "అది ఆచారంరా అబ్బాయ్. మనం ఏమీ చెయ్యలేం. ఆచారాన్ని మార్చలేం" అన్నాడు.
తండ్రి మాటలు చిన్నాకి నచ్చలేదు. కానీ
తండ్రి ఈ విషయంలో ఏమీ చెయ్యలేడనే సంగతి అర్థమైంది. మేక పడుతున్న కష్టం,
దాని కదలికల్లో తెలుస్తున్న మరణ భయం అతడి చిట్టిగుండెని నిలవనీయకుండా
చేస్తోంది.
ఆ పనిని ఎట్లాగైనా అడ్డుకోవాలి. మేకని
కాపాడాలి. కానీ ఎట్లా? కింద వందలమంది జనం.. ఎక్కడెక్కణ్ణించో వొచ్చి ఈ
దారుణమైన పనిని చూస్తా ఆనందం పొందుతున్న వాళ్లని ఎట్లా ఆపడం?
చిన్నా ప్రాణం కొట్టుకుపోతోంది. ఒకటే
ధ్యాస. ఆ దారుణాన్ని ఆపాలి. మేకని ఆ హింస నుంచి కాపాడాలి. ఎక్కణ్ణించి
వొచ్చిందో అంత మొండి ధైర్యం!
తండ్రి చేతిని వొదిలించుకుని సర్రున పరిగెత్తాడు. మల్లయ్య తేరుకునేలోపే శిడిమాను దూలం వొద్దకు చేరుకున్నాడు.
"రేయ్ చిన్నా.. అబ్బాయ్.. ఆగరా..
ఎక్కడికి?" అంటా వెంటపడ్డాడు మల్లయ్య. అక్కడి జనం ఆశ్చర్యంగా, కళ్లు
పెద్దవి చేసుకుని చూస్తున్నంతలోనే దూలం మీదికి ఎగిరి, పైన పడుకుని, గట్టిగా
పట్టుకున్నాడు. బల్లిలా దానిపై పాక్కుంటూ పోయాడు.
మల్లయ్య గుండె గుభేల్మంది. ఓవైపు జనం
శిడిమాను మీదికి టెంకాయలు విసిరి కొడుతూనే ఉన్నారు. అవి చిన్నాకి తగిలితే..
వొణికిపోయాడు. వొళ్ళంతా చెమట్లు పట్టేశాయి.
"రేయ్ అబ్బాయ్. ఏం చేస్తున్నావ్.
కిందికి దిగరా. ప్రెమాదంరా. దెబ్బలు తగుల్తాయిరా" అని కేకలు పెట్టాడు. జనం
గోలలో అతడి మాటలు చిన్నాకి వినిపించలేదు. వినిపించినా పట్టించుకునే
స్థితిలో లేడు.
దూలంపైన పాక్కుంటూ బోను దగ్గరకు
చేరుకున్నాడు చిన్నా. అసలే అంతకుముందు చెట్టుమీద జారి చీరుకుపోయిన చెయ్యి.
పాకుతుంటే రాపిడై నెత్తురు కారుతోంది. బాధను పంటి బిగువున ఓర్చుకుంటా
బోనుని పట్టుకున్నాడు. టెంకాయలు విసరొద్దని అడ్డంగా చేయ్యి ఊపాడు.
అతణ్ణి చూస్తున్నా, జనం టెంకాయలు విసరడం ఆపలేదు.
"అయ్యా ఆపండి. టెంకాయలు విసరమాకండి" అని గట్టిగా అరుస్తున్నాడు మల్లయ్య
ఏడుస్తా. అంతలోనే జరగరానిది జరిగిపోయింది. ఒక టెంకాయ నేరుగా చిన్నా తలని
బలంగా తాకింది. "అమ్మా" అని కేకేశాడు. అతడి చేతులు బోనుని వొదిలేశాయి.
పట్టు తప్పిపోయింది. ఆమైనే కిందపడ్డాడు.
"అబ్బాయ్ చిన్నా" అని పెద్దగా అరుస్తా చేతులు చాపాడు మల్లయ్య. నేరుగా అతడి
చేతుల్లో పడ్డాడు చిన్నా. అంత పైనుంచి పడటంతో, ఆ బరువుని తట్టుకోలేక
మల్లయ్య కిందపడ్డాడు. నయం. రాయిపై పడకుండా ఇసుకలో పడ్డాడు. ఒక్కసారిగా
అక్కడ కోలాహలం. ఎవరో ఆపినట్లే టెంకాయల ప్రవాహం ఆగిపోయింది. అంతా ఆ
తండ్రీకొడుకుల చుట్టూ మూగారు. చిన్నా నుదుటి మీంచి ధారగా నెత్తురు. అతడు
స్పృహలో లేడు. ఒకాయన నాడి చూశాడు.
"పిల్లాడు బతికే ఉన్నాడు" అన్నాడు. ఇంకొకతను గబగబా ఏదో ఆకుపసరు చిన్నా తలపై పిండాడు.
మంటకి అటూ ఇటూ కదిలాడు చిన్నా.
"వేలెడంత లేడు. ఎంత పని చేశాడు. ఎందుకెక్కాడు శిడిమీదికి?" అందరి నోటా ఇవే మాటలు.
* * *
"ఆ రోజుతో శిడిమాను మీదికి టెంకాయలు
విసరడం ఆగిపోయి, పూలదండలు విసరడం మొదలయ్యింది. అప్పట్నించీ ప్రాణభయంతో మేక
అరుపులు లేవు. దాని బలి ఆగిపోకపోవచ్చు. కానీ గంటలకొద్దీ అది పడే హింస
మాత్రం ఆగింది" చెప్పి ఆగాడు చతుర్వేది.
"ఇదంతా నీకెట్లా తెలుసు? అంతా చూసినట్లే చెప్పావు" అడిగింది కావేరి.
"నాకు తెలుసు. నేను చూశా" అన్నాడు సన్నగా నవ్వుతూ.
ఏదో గుర్తుకు వొచ్చినట్లు అతడి నుదుటి
వొంక పరీక్షగా చూసింది. నుదుటిపై జుట్టు మొదలయ్యే చోట నల్లటి గాయం మచ్చ.
గబుక్కున అతడి డమ చెయ్యి పట్టుకొని చూసింది. మోచేతి పైభాగంలో పెద్ద గాయం
గుర్తు.
"అమ్మదొంగా.. చిన్నా.." అంది కావేరి అతడి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి అటు ఇటూ కుదుపుతా..
- - గోతెలుగు డాట్ కాం ఆన్‌లైన్ వార పత్రిక, 5 జూన్ 2015.
Showing posts with label fiction. Show all posts

Friday, April 27, 2018
Short Story: JWALA
మొదటిసారి చూసినప్పుడే ప్రతిమ తెలివైన పిల్ల
అనిపించింది. అప్పుడామెకు పదహారేళ్లు ఉంటాయి. పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్
మీదుగా నడచుకుంటూ జీడిమామిడి తోట కాడికి కల్పనతో కలిసి వెళ్తున్నప్పుడో,
లేదంటే ఇద్దరం కలిసి ద్విపాత్రల నాటకాలను రిహార్సల్స్ వేస్తుంటేనో తను తరచూ
కనిపిస్తుంటుంది.
ఓ వైపు జూనియర్ కాలేజీలో జువాలజీ లెక్చరర్‌గా పనిచేస్తూ, మరోవైపు ఏకపాత్ర నాటికలూ, కల్పనతో కలిసి రెండేళ్ల నుంచీ ద్విపాత్రల నాటికలూ, నాటకాలూ వేస్తూ వస్తున్నా. ఈ రెండేళ్లలో రెండు నాటకాలు ఢిల్లీలోని సంగీత నాటక అకాడమీలో ప్రదర్శనకు నోచుకోవడం, ఆ విషయం పత్రికల్లో, టీవీ చానళ్లలో ప్రముఖంగా రావడంతో మా ప్రాంతంలో అధ్యాపకుడిగానే కాకుండా, రంగస్థల కళాకారుడిగా కూడా నా పరపతిని పెంచింది. కల్పన కూడా మంచి కళాకారిణి అనే పేరొచ్చింది.
నా ఆనందాన్ని ఆవిరి చేస్తూ కల్పన ప్రాణాంతక బ్రైన్ కేన్సర్‌కు గురయ్యింది. కొంత కాలంగా రంగువెలిసిపోయిన బొమ్మలాగా తయారయ్యింది. హైదరాబాద్‌లో పేరొందిన కేన్సర్ హాస్పిటల్‌కు తీసుకుపోయాను. ఆమె జబ్బుని నయం చేయడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆమె సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయినవాళ్లు, ఇప్పుడు సానుభూతి వ్యక్తం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు కూడా ఆమె చెంపలు నునుపుగానే ఉన్నా, వాటిలో జీవం కనిపించడం లేదు. ఒకప్పుడు మృదువుగా, పిరుదుల దాకా వేలాడుతూ ఆమె అందానికి తావి అబ్బినట్లుగా ఉండే జుట్టు పెళుసుగా, కురచగా మారింది. ఆ స్థితిలోనూ ఆమె స్టేజిపై నటిస్తోంది. అయితే ఒకప్పటి అల్లరి ఆమెలో లేదు. నన్ను ప్రేమలో పడేసి, మా పెద్దల్ని ఎదిరించి నేను పెళ్లి చేసుకునేదాకా వదిలిపెట్టలేదు తను. అట్లాంటి కల్పన ఇలా అయిపోతున్నందుకు మనసులో ఎంత వేదనా, తుఫానూ చెలరేగుతున్నాయో!
ఓ ఆదివారం మధ్యాహ్నం, సాయంత్రంగా మారబోతున్న వేళ.. సూర్యుడు కిందికి దిగుతున్నాడు. పడమటి ఆకాశం ఎర్రనవుతోంది. ఆ సంధ్య వెలుగులో సముద్రానికి అభిముఖంగా నిల్చుని కల్పనకు వీపు చూపిస్తూ, రావణునిగా అభినయిస్తున్నా. కల్పనది మండోదరి పాత్ర.ఆ సమయంలో కల్పనకు ఎదురుగా కాస్తంత దూరంలో నిల్చొని, ఇటువైపే చూస్తోంది ఓ అమ్మాయి. డైలాగులు చెబుతూ కల్పన వైపు చూసినప్పుడు, నా కళ్లల్లో మెరుపులా ఆ అమ్మాయి తళుక్కుమంది. నేను ప్రశ్నార్థకంగా ఆమె వంక చూస్తా, "ఎవరా అమ్మాయి?" అనడిగా కల్పనను.
"ఈ దగ్గర్లోనే ఉంటుంది" అని ఆగి, "నీ పేరు ప్రతిమ కదూ?" అనడిగింది కల్పన. ఆమె కాస్తంత సిగ్గుపడుతూ తలూపింది."ఓ.. నువ్వేనా ప్రతిమ అంటే" అన్నాను, నేను తలాడిస్తూ. అదివరకే ఒకట్రెండు సందర్భాల్లో ఆమె ప్రస్తావన తెచ్చింది కల్పన."రత్నా టీచర్ చెప్పింది. నాకు సాయంగా ఉంటావా?" అడిగింది కల్పన. "ఆ సంగతి చెప్పడానికే వచ్చానండీ. మీ ఇంట్లో పని చేస్తాను" అంది ప్రతిమ."మా ఇంట్లో పెద్దగా పనులేమీ ఉండవు. నా పనులు నేను చేసుకుంటా. నువ్వు కల్పనకు సాయంగా ఉంటే చాలు" అని చెప్పాను.
కల్పన పనులు చూసుకోడానికి మా ఇంటికి వచ్చేసింది ప్రతిమ. ఆమె నేను పనిచేసే కాలేజీలోనే అటెండర్‌గా చేసి, రిటైరయిన వెంకట్రామయ్య మనవరాలేనని కల్పన ద్వారా తెలిసింది. ఊళ్లో ఓ చిన్న పెంకుటింట్లో తాతా మనవరాళ్లు ఉంటున్నారు. ఆమెకు ఐదారేళ్ల వయసున్నప్పుడు ఆమె అమ్మానాన్నలు ఏదో యాత్రకు వెళ్లొస్తూ, బస్సు ప్రమాదంలో చనిపోయారు. ప్రతిమ చిన్నపాటి గాయాలతో బతికింది. అప్పుడు వాళ్లు కరవదిలో ఉండేవాళ్లు. ఆ వయసులోనే ఆమెను తన వద్దకు తెచ్చేసుకున్నాడు వెంకట్రామయ్య. మూడేళ్ల క్రితం ప్రతిమ వాళ్ల అమ్మమ్మ కూడా పోయింది.
నేను జీడిమామిడి తోటలోకి ప్రాక్టీస్‌కి వెళ్లినప్పుడల్లా ఆడవాళ్లిద్దరూ భోజనం వేళకు క్యారేజ్ పట్టుకుని అక్కడకు వొచ్చేవాళ్లు. నేను పాత్రాభినయం చేస్తుంటే చూస్తూ కూర్చునేవాళ్లు. ప్రతిమ ఏదైనా మాట్లాడబోతే "ష్.. మాట్లాడకు. ఆయనకు డిస్టర్బెన్స్" అనేది కల్పన, నోటిపై వేలుపెట్టి. నా ప్రాక్టీస్ అయిపోయాక, సముద్రం ముందు కూర్చుని అలల్నీ, దూరంగా కనిపించే పడవల్నీ చూస్తూ కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఉవ్వెత్తున ఉరుకుతూ ఒడ్డుని తాకి వెనక్కి మళ్లే అలల్ని పట్టుకోడానికి ప్రయత్నించేది ప్రతిమ. ఒడ్డుని అలలు తాకినప్పుడు వచ్చే సవ్వడి నా చెవులకు సంగీతం. రోజులు గడుస్తున్నాయి. ప్రతిమ మా ఇంటి సభ్యురాలు అయిపోయింది. మా ఇంట్లో ఆమెకు బాగానే ఉంటున్నట్లు, కల్పన అనారోగ్యం ఒక్కటే ఆమెకు విచారం కలిగిస్తున్నట్లు గ్రహించాను. జబ్బుతో బాధపడుతూ కల్పన మంచం మీద పడుకుని ఉన్నప్పుడు కూడా నేను "ఇంతకు ముందెప్పుడూ ఇంత అందంగా నువ్వు కనిపించలేదురా. నీ బుగ్గలు ఎర్రగా ఎట్లా మెరుస్తున్నాయో. తొందర్లోనే నీకు నయమైపోతుంది" అనేవాణ్ణి. ఆమె బుగ్గలు రంగు మార్చుకుంటున్న సంగతి నిజం. కానీ అది ఆరోగ్యానికి సంకేతం కాదు. ఆమె బుగ్గలు ఎర్రగా కాదు, తెలుపు-పసుపు కలిసిన పచ్చరంగులోకి మారుతున్నాయి. నిన్నటి మెరుపుతీగ కళావిహీనమైపోతోంది. కల్పనతో నేననే మాటలకు ప్రతిమ కళ్లలో కొచ్చన్ కనిపించేది. 'ఆమె జబ్బును నువ్వు సీరియస్‌గానే పట్టించుకుంటున్నావా?' అని అవి ప్రశ్నిస్తున్నట్లుండేవి.
తన అనారోగ్యం కారణంగా ద్విపాత్రల నాటకాలను పక్కనపెట్టి, ఏక పాత్రల మీదే దృష్టిపెడుతున్నాను. ఎందుకు తనకు ఆ ఆలోచన వచ్చిందో, "ప్రతిమ కళ్లు చూశావా. ఆమెలో చక్కని నటి ఉందని నాకనిపిస్తోంది. మాట్లాడకుండానే ఆ కళ్లు ఎన్ని భావాలు పలికిస్తాయో. నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ పిల్ల ఆసక్తిగా చూడ్డం గమనించాను. తయారుచేస్తే నీకు స్టేజిపై చక్కని జోడీ అవుతుంది" అంది కల్పన.
నేను కలవరపడ్డాను. తను ఆ చివరి మాటని యథాలాపంగా అన్నదా, కావాలని అన్నదా? నా మొహంలో భావాలు ఆమెకు తెలీకుండా జాగ్రత్తపడ్డాను.
"నువ్వన్నది నిజమే కానీ, వాళ్ల తాతయ్య ఏమంటాడో. ఆయనకు చెప్పకుండా చేయడం బాగోదు" అన్నాను.
"ఆ సంగతి నేను చూసుకుంటాలే" అంది కల్పన.
ఆమె రోజురోజుకూ బలహీనమైపోతోంది. నాకు భోజనం తెచ్చే ఓపిక్కూడా ఉండట్లేదు. మొదట్లో ప్రతిమ ఒక్కతే వొస్తుండటం చూసి, ఆమె వెనక కల్పన కోసం వెతికేవాణ్ణి. తను కనిపించకపోతే నిరాశపడేవాణ్ణి. శిశిర రుతువు పోయి, వసంత రుతువు తిరిగేసరికి ప్రతిమ ఒంటరి రాకకు అలవాటుపడ్డాను.
నా ప్రాక్టీస్ అయ్యాక కొన్నేసిసార్లు తోటలో నేలమీదకి వాలిన జీడిమామిడి కొమ్మల మీద కూర్చుని, ఆకుల చాటు నుంచి వొచ్చే నులివెచ్చని సంధ్య కిరణాల్లో మా దేహాలు తడుస్తుంటే, మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్లం.
"ప్రతిమా, నీకు తెలుసా? నా ఇన్‌స్పిరేషన్ కల్పన. తనకేమైనా అయితే ఇక నటిస్తానని నేననుకోవట్లేదు" అన్నాను.
చప్పున ఆమె ఒళ్లు వొణకడం తెలిసింది.
"చావు మనందర్నీ ఏదో ఓ రోజు పలకరిస్తుంది. దాన్ని మనం ఒప్పుకోక తప్పదు. అసలు చావంటే ఏమిటండీ? జీవితానికి ఇంకో వైపే కదా" అంది.
నేను ఆశ్చర్యపోతూ.. కాదు.. కాదు.. షాకై ఆమె మొహం వొంక చూశా. పదహారేళ్ల ఈ టీనేజ్ అమ్మాయికీ, ఆమె మాటలకీ ఏమన్నా పొంతన ఉందా? తన మాటల్లో జీవిత సత్యాన్ని ఆవిష్కరించింది. బహుశా చిన్నతనంలోనే తన అమ్మానాన్నల చావును చూసినందున, ఆమెకు ఈ పరిణతి వొచ్చిందా?
ఎదురుగా సాగరుడు.. జీవితానికి ప్రతీకగా.. పడుతూ, లేస్తూ ఒడ్డును ఒరుసుకుని, వెనక్కి మళ్లుతున్న అలలు జీవిత నాటకంలోని తెరలు.
రెండేళ్లు గడిచాయి, నెమ్మదిగా, భారంగా. కల్పన ఇప్పుడు ఎక్కువగా మంచంపైనే ఉంటోంది. కీమోథెరపీ కూడా అయ్యింది. చివరి ఆశలు మిగిలాయి. ప్రతిమతో ప్రైవేటుగా ఇంటర్మీడియేట్ పాసయ్యింది. ఆమెకు నేను, కల్పన టీచర్లం. ప్రతిమ వొద్దంటున్నా వినిపించుకోకుండా ఆమె పద్దెమిదో పుట్టినరోజును సెలబ్రేట్ చేసింది కల్పన. నా చేత కేక్ తెప్పించి, ఆమెతో కట్ చేయించింది. ప్రతిమ చాలా సిగ్గుపడింది. "గౌతం, ప్రతిమను చూడు.. ఎంత పెద్దదైపోయిందో. ఇప్పుడు తను సంపూర్ణ యవ్వనవతి. మేజర్" అంది కల్పన, మురిపెంగా.నేను ప్రతిమ వొంక చూశా. నిజం. అయస్కాంతంలాంటి ఆకర్షణ శక్తితో, పూర్ణాకృతి సంతరించుకున్న అందాలతో వెలిగిపోతోంది ప్రతిమ. నేను నటుణ్ణి. నా ఫీలింగ్స్‌ను బయటపెట్టకుండా చాలా మామూలుగా చూసినట్లు చూసి, పెదాల మీద సన్నటి నవ్వు తెచ్చుకుని, తల తిప్పేశా.సాధ్యమైనంత ఎక్కువ సమయం కల్పనతో గడుపుతూనే తెన్నేటి సూరి 'చెంఘీజ్‌ఖాన్' పుస్తకం ఆధారంగా ఏక పాత్ర నాటకాన్ని రాసుకున్నా. ఆ పుస్తకం చదివినప్పట్నించీ, ఎలాగైనా దాన్ని ఏకపాత్ర నాటకంగా ప్రదర్శించాలనే కోరిక బలపడుతూ వొచ్చింది. ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, పట్టుదలతో తయారుచేశాను. ఇక దాన్ని ప్రాక్టీస్ చేసి, స్టేజిమీదకు వెళ్లడమే తరువాయి.
ఆ రోజు.. నేను 'చెంఘిజ్‌ఖాన్'ను ఆవాహన చేసుకొని అభినయిస్తున్నా. నా చేతులు, కాళ్లు రిథమిగ్గా కదులుతున్నాయి. తీక్షణమైన ఏకాగ్రతతో కళ్లతో భావాలు పలికిస్తున్నా. నోటి నుంచి పదునైన బాకుల్లాంటి మాటలు విసురుతున్నా.
ఒక్కసారి కడలి మారుతం చల్లగా వొంటిని తాకింది. కళ్లు మూసుకుని, తలను వెనక్కు వంచా. చప్పున వెచ్చగా నరాల్లో నెత్తురు పరుగులు పెట్టింది.నా వెనుక, నేలమీదికి వాలిన చెట్టు కొమ్మమీద కూర్చుని, కాళ్లు రాయి మీదపెట్టి, నన్నే తదేకంగా చూస్తోంది ప్రతిమ! ఎంత ముచ్చటగా ఉంది! మొదటిసారి ఓ మగాడిలా ఆమెను చూశా. నేను తన వొంక చూస్తున్నా, ఆమె కళ్లు వాల్చలేదు, తలతిప్పలేదు. ఎప్పుడూ నా వొంక అలా ఆమె చూడలేదు.
ఒక్క నిమిషం అలాగే చూసి, నవ్వుతూ "ప్రతిమా! ఏదో ఓ రోజు నువ్వు మంచి నటివి అవుతావు. నేను నిన్ను నటిని చేస్తాను" అన్నాను.అప్పటిదాకా ఏదో లోకంలో ఉన్నదానికి మల్లే ఉలిక్కిపడింది. కొద్ది క్షణాలు.. కళ్లు కళ్లు కలుసుకున్నాయి. మొదట సంతోషం, అంతలోనే తెలీని ఆందోళన ఆమె మొహంలో...
"నేను నమ్మను. మీ మాటల్లో సీరియస్‌నెస్ లేదు. ఊరకే అంటున్నారు" అంది.
నేను దొరికిపోయాను. ఇబ్బందిగా అనిపించి, మొహం తిప్పుకున్నా. సిగ్గుపడ్డా. ఆ పూట బలవంతంగా ఆమెనూ భోజనానికి కూర్చోబెట్టా. ఇంకో రెండు గంటలకల్లా నా ప్రాక్టీస్ ముగించేశా.ఇద్దరం కలిసి ఇంటివేపు నడుస్తున్నాం. ఒక్క మాటా లేదు మా మధ్య. ఇద్దరికీ తెలుస్తోంది, మా మనసులు సిగ్గుపడుతున్నాయని.
ఇల్లు దగ్గిరపడింది. తెరిచిన కిటికీలోంచి, ఎత్తు దిండుమీద తలపెట్టి పడుకుని మమ్మల్ని అల్లంత దూరం నుంచే కల్పన చూసిందనుకుంటా. ఆమె మొహం నెత్తురులేకపోవడం వల్ల తెల్లగా పాలిపోయి వున్నా, దానిపై చిరునవ్వు, కొంచెం ఎమోషన్ కనిపిస్తున్నాయి. మా ఇద్దర్నీ కలిపి చూడ్డం ఆమెకు ఆనందాన్నిచ్చిందా? అపరాధ భావన వంద రెట్లు పెరిగిపోయింది నాలో.
నేను ఆ గదిలోకి వెళ్లగానే "గౌతం, నీకు లెటర్ వొచ్చింది" అని ఇచ్చింది కల్పన. ఉత్తరం తెరిచి చూడగానే ఆనందం, ఆ వెంటనే కాస్తంత దిగులూ కలిగాయి. మిన్నియాపొలిస్ (అమెరికా)లోని ప్లేరైట్స్ సెంటర్ నన్ను మెక్‌నైట్ థియేటర్ ఆర్టిస్ట్ ఫెలోషిప్ కోసం ఎంపిక చేసింది. అంటే సర్టిఫికెట్‌తో పాటు ఏకంగా 25,000 డాలర్లు బహుమతిగా అందజేస్తారు. 15 లక్షల రూపాయలు! నిజంగా ఎంత సంతోషకరమైన వార్త! ఎంత అరుదైన ఘనత!! కానీ...
"అయితే తొందర్లోనే యు.ఎస్. వెళ్లబోతున్నావన్న మాట" అంది కల్పన, సంతోషపడ్తూ.
తల అడ్డంగా ఊపాను. "లేదు. దీని గురించి ఆలోచించాలి" అన్నాను.
"నువ్వు వెళ్తున్నావ్. నన్ను చూసుకోడానికి ప్రతిమ ఉంది" అని తేల్చేసింది కల్పన.
క్యాబ్‌లో కూర్చోడానికి వెళ్తూ ప్రతిమ చేతిపై చేయి ఆంచి, "ప్రతిమా, తనని జాగ్రత్తగా చూసుకో. ఎప్పటికప్పుడు విషయాలు చెప్తుండు" అని చెప్పాను.
ఆమె తలూపింది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడానికి క్యాబ్ కదిలింది. కిటికీ వేపు చూశా. నాకు తెలుసు, నన్ను కల్పన తనివితీరా చూసుకుంటూ ఉంటుందని.
నేను మిన్నియాపొలిస్‌లో ఫెలోషిప్ అందుకుని, ముంబైలో అడుగుపెట్టానో, లేదో సంగీత నాటక అకాడమీ నుంచి విషాద వార్త. నన్నూ, ఈ లోకాన్నీ శాశ్వతంగా వొదిలేసి వెళ్లిపోయింది నా కల్పన.
ఫెలోషిప్ తీసుకున్న వెంటనే నేను ఫోన్‌చేసి చెప్పినప్పుడు ఆమె బలహీనంగానైనా ఎంత సంతృప్తిగా నవ్విందో జ్ఞాపకమొచ్చి, కళ్లల్లోంచి నీళ్లు ఉబికుబికి వొచ్చాయి.
ఇంటికి ఫోన్ చేశాను. ఏడుస్తూ చెప్పింది ప్రతిమ - "చివరి క్షణం దాకా మిమ్మల్నే తలుచుకుంది."
శ్మశానంలో కల్పన నిర్జీవ దేహాన్ని ఖననం చేస్తుంటే గుండె పగిలిపోయినట్లయింది. ఆమెతో పాటు నాలోని ఓ భాగమేదో వెళ్లిపోయింది. చిత్రమేమంటే కర్మకాండలు జరిగినంతసేపూ నేనేడ్వలేదు. ఇంట్లోనూ ఏడ్వలేదు. కల్పన వాళ్లమ్మా నాన్నలు వెళ్లిపోయారు. ఇంట్లో ఉన్నంతసేపూ కల్పన ఏ పడగ్గది మంచంపైన చివరి శ్వాస తీసుకుందో, ఆ గది కిటికీ దగ్గర కూర్చొని సముద్రాన్ని అట్లా చూస్తూ కూర్చుంటున్నా. ఇంట్లోంచి బయటికొస్తే గమ్యం తెలీకుండా ఊరికే అలా నడచుకుంటూ వెళ్లి, ఎప్పుడో తిరిగొచ్చేవాణ్ణి. క్లాస్ రూంలో లెసన్స్ ఎలా చెప్తున్నానో నాకే తెలీదు.
దేన్నైనా మరిపించగల శక్తి ఒక్క కాలానికే ఉందనుకుంటా. కల్పన పోయాక కూడా ప్రతిమ రోజూ ఇంటికొస్తోంది. ఇంటి పనులతో పాటు వంటచేసి పెడుతోంది. అయితే ఆమె ఉనికిని గమనించనట్లుగానే ప్రవర్తిస్తున్నా. నాకు ఏ లోటూ లేకుండా చూడాలనే తపన ఆమెలో కనిపిస్తున్నా, తెలీనట్లే ఉంటున్నా.
వేసవి ప్రతాపం చూపిస్తున్న రోజుల్లో ఓ సాయంకాలం ఉన్నట్లుండి ఈదురు గాలులు మొదలయ్యాయి. సెకన్లలో వాన జడివానగా మారింది. ఎక్కడా ఆగడానికి ఆస్కారం లేదు. తడిసి ముద్దయి, ఇంటికొచ్చాను. ధడేలున తలుపు తోసి, విసురుగా లోపలికొచ్చాను. బట్టలు నానిపోయి, వొంటికి అతుక్కుపోయాయి. నుదుటిపై పరుచుకున్న జుట్టును వెనక్కి తోసి, చొక్కా విప్పబోతుంటే నా దగ్గరకొచ్చి సాయం చెయ్యడానికి ప్రయత్నించింది ప్రతిమ. నేను ఆమె వొంక చురుగ్గా చూశాను.
"ముద్దగా తడిసిపోయారు. ఒళ్లు ఎట్లా వొణికిపోతోందో చూడండి" అంటా చొక్కా తీయబోయింది.
ఆమైనే విసురుగా ఆమెను అవతలకు తోసేశా. "నన్నిలా వొదిలేయ్. నా ఒంటి మీద బట్టలు తీసుకోవడం నాకు చేతనవును" అన్నా, అరిచినట్లే. చొక్కా తీసి పక్కనే ఉన్న కుర్చీపై పడేశా. షూస్ విప్పడానికి కిందికి వొంగా. ఒళ్లు వొణికిపోతుండటంతో లేసులు విప్పడానికి వేళ్లు సహకరించలేదు. అట్లాగే కుర్చీలో కూలబడ్డా. వెచ్చదనం కోసం రెండు చేతులూ ముడుచుకున్నా. పళ్లు పటపటమంటున్నాయ్. కళ్లు మూసుకున్నా. ప్రతిమ షూ లేసులు విప్పడం తెలిసి, కళ్లు తెరిచా.
"వేణ్ణీళ్లు పెడతాను, స్నానం చేద్దురు గానీ. ఈలోగా తల తుడుచుకోండి" అని టవల్ అందించబోయింది ప్రతిమ. నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
"నీ ఉద్దేశమేంటి? కల్పన ప్లేస్‌లోకి వొద్దామనుకుంటున్నావా? అది నీ తరం కాదు. కల్పనే నా సర్వస్వం. ఆమె ప్లేస్‌లోకి ఎప్పటికీ ఎవరూ రాలేరు" అనరిచా.
ప్రతిమ ఏమాత్రం తొణకలేదు, బెణకలేదు. పైగా నా మనసు చదివిన దానికిమల్లే "ఎందుకట్లా గంభీరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడైనా తనివితీరా ఏడ్వండి" అంది.
నా గొంతులో ఏదో అడ్డుపడినట్లయింది.
"ఎంతటి నల్ల మబ్బులకైనా తెల్లటి అంచు తప్పకుండా ఉంటుంది. జీవిత లక్ష్యం చైతన్యం" అంది మళ్లీ తనే. ఈ మాటలు ప్రతిమవి కావు, కల్పనవి. ఆమె నోటివెంట ఆ మాటలు ఎన్నిసార్లు విన్నానో.ఓ రకమైన భావోద్వేగంతో ఊగిపోతూ, ప్రతిమ నడుము చుట్టూ చేతులేసి, ఆమె గుండెల మధ్య తలదాచుకున్నా.
"ప్రతిమా, నన్నేం చెయ్యదలచుకున్నావ్?" అనడిగా, పూడుకుపోయిన గొంతుతో. ఆమె మాట్లాడలేదు. తలను పైకి జరిపి మెడమీద పెదాలతో రుద్దాను. ఆమె దేహాన్ని నా రెండు చేతులూ గట్టిగా పెనవేసుకుపోయాయి. ఆమె నన్ను నెట్టేయలేదు. సముదాయిస్తున్నట్లుగా నా భుజం మీద చిన్నగా తడుతూ, "మాస్టారూ" అంది.
చప్పున ఎవరో ఛెళ్లున చెంపమీద చరిచినట్లనిపించింది. తెలివి తెచ్చుకొని, గభాల్న ఆమెను వొదిలేసి, దూరంగా జరిగా. "నువ్వేం చేస్తున్నావ్? నన్ను సెక్స్‌లో దింపాలని అనుకుంటున్నావా. ఇన్ని రోజుల నుంచీ నువ్వు కోరుకుంటోంది ఇదేగా. కల్పన పోకముందు కూడా నీ కళ్లల్లో నేను చూశాను. అవునా, కాదా?" అని గద్దించా, మండుతున్న కళ్లతో.
ప్రతిమ నా మొహంలోకి ఓసారి చూసింది. సిగ్గుతో, అవమానంతో ఆమె మొహం కందగడ్డలా మారిపోయింది. ఆ వెంటనే ఏడుస్తూ బయటకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది.
ఆమెపై నేను చేసిన భయంకర ఆరోపణకు కారణమేంటో ఆమెకు తెలిసే అవకాశం లేదు. నేనంటే ఆమెకు విపరీతమైన ఆరాధన. కల్పన ఎన్నోసార్లు ఆ విషయం చెప్పింది. 'ఆ.. చిన్నపిల్ల కదా' అని తేలిగ్గా తీసేస్తూ వొచ్చేవాణ్ణి. కల్పన పోయాక నాకు తోడుగా ఉండాలనేది ఆమె ఆరాటం. అది సరైన పని కాదనీ, ఆమెను దూరం పెట్టాలనీ నా పోరాటం.
ఆమె దగ్గరగా ఉంటే నాలోని లైంగిక జ్వాల అదుపు తప్పుతోన్న సంగతి నాకు స్పష్టమవుతోంది. ఆమెను అవమానించడానికి ఇదొక్కటే కారణం కాదు. "నిజమేమిటో నాకు తెలీదు. కానీ మీకూ, ఆ పనిపిల్లకీ మధ్య ఏదో నడుస్తోందని జనం అనుకుంటున్నారనేది నిజం" అని కల్పన వాళ్ల నాన్న అన్న మాటలు నేనెలా మరచిపోగలను?
జనం మాటలు నిజం చెయ్యాలనే కోరిక నాకే మాత్రమూ లేదు. ప్రతిమను పెళ్లి చేసుకుని ఆమెకు గొప్ప జీవితాన్ని ప్రసాదించడానికి నేనేమీ గొప్పవాణ్ణి కాదు. అందుకే ఆమెను అవమానించాను. దాన్ని అర్థం చేసుకోగలిగే వయసు కానీ, పరిణతి కానీ ప్రతిమలో ఉన్నాయని నేననుకోను. ఇప్పటికైతే నాకు కల్పన జ్ఞాపకాలు చాలు. ఆ జ్ఞాపకాలతో, ఆమె ఇచ్చిన స్ఫూర్తితో కళాకారుడిగా నేను ఎక్కాల్సిన మెట్లు ఎక్కగలననేది నా నమ్మకం.
- గోతెలుగు డాట్ కాం ఆన్‌లైన్ వార పత్రిక, 3 ఏప్రిల్ 2015.

Thursday, April 28, 2016
Short Story: Champion
ఛాంపియన్
"రేపటి నుంచి జరిగే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ సమరంలో ప్రపంచ ఛాంపియన్ ఆండ్రి లిబకోవ్ భారత గ్రాండ్‌మాస్టర్ 20 సంవత్సరాల అనంత ముఖేష్‌తో తలపడబోతున్నాడు. గత పోటీలలో సయితం భారత గ్రాండ్‌మాస్టర్ అయిన చేతన్ పద్మనాభన్‌ను 18 ఎత్తులలో ఓడించిన లిబకోవ్ ఈసారి మరింత సునాయాసంగా ముఖేష్‌ను ఓడించగలనన్న ధీమాతో ఉన్నాడు. లిబకోవ్‌తో పోల్చుకుంటే ముఖేష్‌కు అంతర్జాతీయ అనుభవం తక్కువ. భారత చేస్ క్రీడారంగంలో తారాజువ్వలా దూసుకొచ్చి వరల్డ్ చేస్ ఛాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ రౌండ్లలో విజయం సాధించినప్పటికీ లిబకోవ్ ముందు అతడి దూకుడుకు పగ్గాలు పడే అవకాశమే ఎక్కువగా ఉంది. పద్నాలుగు సంవత్సరాలుగా ప్రపంచ చెస్ రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న లిబకోవ్ మళ్లీ టైటిల్‌ను నిలబెట్టుకోగలనన్న ధీమాను వ్యక్తం చేశాడు. అతణ్ణి ఓడించడమంటే పొట్టేలు కొండను ఢీకొన్నట్లే ఉంటుంది.."
పేపర్ చదువుతున్న అనంత ముఖేష్ ఓసారి వాచీవంక చూసుకున్నాడు. సాయంత్రం 4 గంటలు. ఎదురుగా కూర్చున్న తన స్నేహితుడు, సెకండ్ అయిన చేతన్ పద్మనాభన్ వంక చూశాడు. "చూశావా ఈ పేపర్! అతడితో నేను పోటీపడ్డం పొట్టేలు కొండను ఢీకొన్నట్లు ఉంటుందట."
"చూశాను. నువ్వు కేవలం ప్రపంచ ఛాంపియన్‌షిప్పుకి క్వాలిఫై అయిన ఆటగాడివేగా. పైగా నీ ప్రత్యర్థి పద్నాలుగేళ్లుగా వరల్డ్ ఛాంపియన్ అయిన వ్యక్తి. అతడితో ఆడటం ఎట్లా ఉంటుందో పోయిన ఛాంపియన్‌షిప్పులో అనుభవించినవాణ్ణి."
చేతన్ చెప్తున్నదాంట్లో తప్పేమీ లేదు. అతడేమీ లిబకోవ్ తరపున వకాల్తా పుచ్చుకున్నవాడు కాడు.
"అయినా సరే. నువ్వు నీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడబోతున్నావు. గెలుపు ఎప్పుడూ ఒక్కడి సొత్తేమీ కాదు."
* * *
సెప్టెంబర్ 10. ఉదయం 10.30 గంటలు. లిబకోవ్, ముఖేష్‌లిద్దరూ పోటీ జరిగే గదిలోకి ప్రవేశించారు. టేబుల్ మీద చెస్ బోర్డూ, పావులూ సిద్ధంగా ఉన్నాయి. మొదటి గేం, మొదటి ఎత్తు వేసే ఛాన్సు లిబకోవ్‌కే దక్కింది. అతడి మొహంలో చిరునవ్వు తొంగిచూసింది. ముఖేష్ కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. మొదటి ఎత్తు వేయబోయే ముందు "నేను మొదటిసారి ప్రపంచ ఛాంపియన్‌ని అయినప్పుడు నువ్వు ప్రైమరీ స్కూలు కూడా దాటి ఉండవనుకుంటాను. అయితే యాభయ్యేళ్ల తర్వాత నువ్వు నీ మనవళ్లతో నాతో పోటీచేసిన విషయం మాత్రం గొప్పగా చెప్పుకోవచ్చు" అన్నాడు లిబకోవ్ నవ్వుతూనే.
ముఖేష్ ఏమీ బదులు చెప్పలేదు.
లిబకోవ్ తెల్లపావులతో రూయిలోపెజ్ విధానంతో గేంను మొదలుపెట్టాడు. ముఖేష్ డ్రాగన్ వేరియేషన్‌ను ఎంచుకున్నాడు. ఐదు ఎత్తులు వేయడంతోటే లిబకోవ్‌కు అర్థమైంది - తన చిన్నారి ప్రత్యర్థి సత్తా ఏమిటో. పోయిన ఛాంపియన్‌షిప్పులో డ్రాగన్ వేరియేషన్ విధానంతోనే చేతన్ పద్మనాభన్‌ను ఓడించాడు లిబకోవ్. ఇప్పుడు మొదటి గేంలోనే ముఖేష్ ఆ తరహా ఆటను ఎంచుకొన్నాడు. ఇదంతా ఇప్పుడు ముఖేష్‌కు సెకండ్‌గా ఉన్న చేతన్ వ్యూహంలో భాగమని వెంటనే లిబకోవ్‌కు అర్థమైపోయింది. మొదట్లో కనిపించిన నెర్వస్‌నెస్ ముఖేష్‌లో మచ్చుకైనా లేదు. చాలా ఏకాగ్రతతో ఆడుతున్నాడతను. 26 ఎత్తుల తర్వాత తను గెలిచే అవకాశం మచ్చుకైనా కనిపించకపోవడంతో లిబకోవ్ 'డ్రా'కు అంగీకరించక తప్పలేదు. పోటీని అమితాసక్తితో తిలకిస్తున్న ప్రేక్షకుల్లు, చెస్ క్రీడాకారులు చప్పట్లు చరిచారు. ఆటని సాంతం చూసిన ఓ అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ "మొదట నల్లపావులతో ఆడుతూ 'డ్రా' చేసిన ముఖేష్‌కిది గొప్ప ఆశావహమైన ప్రారంభం" అని వ్యాఖ్యానించాడు.
ముఖేష్ తన సీట్లోంచి లేస్తూ లిబకోవ్ వంక చూశాడు. లిబకోవ్‌లో అసహనం చోటు చేసుకున్నట్లు అతడి ముఖంలో స్పష్టంగా ప్రతిఫలిస్తుండటం గమనించాడు. బయటకు రావడంతోటే యాపిల్ జ్యూస్‌తో ఎదురయ్యాడు చేతన్. "కంగ్రాట్స్.. ఇది నీకు మొదటి విజయం లాంటిది. అయితే ఇక్కడినుంచి నువ్వు మరీ జాగ్రత్తగా ఆడాలి" అని చెప్పాడు.
ముఖేష్‌కు తెలుసు, పోయిన ఛాంపియన్‌షిప్పులోనూ ఇదే రీతిలో చేతన్ మొదటి గేంలో లిబకోవ్‌ను నిలువరించినప్పుడు పత్రికలన్నీ ఆకాశానికెత్తేశాయి. రికార్డ్ స్థాయిలో మొదటి ఎనిమిది గేముల్నీ 'డ్రా' చెయ్యగలిగిన చేతన్ 9వ గేంలో లిబకోవ్‌పై నెగ్గి సంచలనం సృష్టించాడు. అయితే కష్టకాలంలోనూ అమిత స్థైర్యాన్ని ప్రదర్శించగల లిబకోవ్ మరుసటి గేంలోనే విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవడమే గాక 20 గేంల పోటీని 18 గేంలలోనే ముగించి విజయం సాధించాడు. ఒకసారి ఓడితే ఆ ప్రభావం మిగిలిన గేంల మీద కూడా పడుతుందనటానికి చేతన్ నిదర్శనం. లిబకోవ్ లాంటి క్రీడాకారుడి విషయం వేరు. ఓడినకొద్దీ ప్రతీకారంతో రగిలే వ్యక్తి అతను. ఈ సంగతిని ముఖేష్‌కు ముందుగానే వివరించాడు చేతన్. లిబకోవ్ ఆడిన గేములన్నింటినీ శ్రద్ధగా విశ్లేషించి చెప్పాడు.
* * *
సెప్టెంబర్ 11. అసహనంగా కనిపిస్తున్నాడు లిబకోవ్. అతడి ప్రతి చర్యలోనూ అది కనిపిస్తోంది. చూసే వాళ్లందరూ అతను టెన్షన్లో ఉన్నాడని ఇట్టే చెప్పేస్తారు. అతడు కోరుకుంటున్నదీ అదే. మిగతా వాళ్ల సంగతి కంటే తన ఎదురుగా ఉన్న ముఖేష్ తనని అలాగే అనుకోవాలని అతడి వాంఛ. ఎదుటివాళ్లను ఏదో ఓ రకంగా బోల్తా కొట్టించడానికి అతడెంచుకునే మార్గాల్లో ఇదొకటి. అసహనంతో ఉండేవాళ్లు త్వరగా ఆటపై పట్టుకోల్పోతారన్న చిన్న పాయింట్ మీదే అందరూ బేస్ అవుతారనీ, అలా అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తారనేది లిబకోవ్ వ్యూహం. బోర్డుమీద పావులు కదులుతున్నాయి.. ముఖేష్ తెల్ల పావులు త్వరగా, లిబకోవ్ నల్ల పావులు నిదానంగా!
15వ ఎత్తు. ముఖేష్ తన శకటాన్ని లిబకోవ్ గుర్రానికి గురిపెట్టాడు. అంతటా నిశ్శబ్దం. సూదిపడితే వినపడేంత నిశ్శబ్దం. గుర్రాన్ని పక్కకి తప్పిస్తే కింగ్‌కి 'చెక్' అవుతుంది. కింగ్‌ని జరపడానికి ఎటూ దారిలేని స్థితి. ఇంతవరకూ లిబకోవ్ అట్లాంటి స్థితిని ఎదుర్కోలేదు. మరోవేపు మినిస్టర్ కాచుకుని ఉన్నాడు. ఒక్కసారిగా ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులు. లిబకోవ్ మౌనంగా రిజైన్ చేసి తన గదికి వెళ్లిపోయాడు. ముఖేష్ సెకండ్ చేతన్‌తో ప్రొఫెషనల్ చెస్ అసోసియేషన్ సభ్యుడు స్టీవ్ బెకర్ అన్నాడు - "కొద్ది రోజుల్లో కొత్త ఛాంపియన్ అవతరించడం ఖాయం."
* * *
సెప్టెంబర్ 12. ఒక దినపత్రికలో స్పోర్ట్స్ కాలం - ".. అతిపెద్ద ఓటమి. ఇరవయ్యేళ్ల కుర్రాడి చేతిలో ప్రపంచ ఛాంపియన్, కంప్యూటర్‌నే ఓడించిన మేధావి పరాజయం. కేవలం 15 ఎత్తుల్లోనే ఆండ్రీ లిబకోవ్‌ను రెండవ గేంలోనే ఓడించి భారత గ్రాండ్‌మాస్టర్ అనంత ముఖేష్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఏమి జరిగిందో అర్థంకాని స్థితిలో లిబకోవ్ మౌనంగా బయటకు వెళ్లిపోయాడు. ఈ సంఘటనతో ముఖేష్ చెస్ క్రీడాభిమానుల హృదయాల్ని దోచుకున్నాడు. రెండవ గేంలో అతడు ఆటపై పూర్తి పట్టు సాధించాడు. అతనిలోని ఆత్మవిశ్వాసం, ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసే వైనం చూస్తుంటే ప్రపంచ ఛాంపియన్ కాగల అర్హతలు అన్నీ అతనిలో ఉన్నాయనిపిస్తున్నది..". కాఫీ తాగడం పూర్తిచేసిన ముఖేష్ ఆ ఆర్టికల్‌ను కట్‌చేసి డైరీలో దాచుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌పై ఒక గేంలో విజయం సాధించడం గొప్ప సంతృప్తినిస్తుంది. అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రమాదకరమైంది. అది అనుకోని తప్పుల్ని చేయిస్తుంది. ఏకాగ్రతని దెబ్బతీస్తుంది. పొగడ్తలు కూడా సంపూర్ణ విజయానికి అడ్డంకులే. అందుకే అన్ని గేంలూ పూర్తయ్యేవరకు పేపర్ చూడకూడదని నిశ్చయించుకున్నాడు.
సెప్టెంబర్ 25. వాతావరణం భిన్నంగా ఉంది. అద్దాల గదిలో ఆట జరుగుతుంటే పెద్ద సంఖ్యలో ఉన్న ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి ఆటను చూస్తున్నారు. 20 గేంల పరంపరలో అది 11వ గేం. 10వ గేంలో ఎట్టకేలకు లిబకోవ్ 64 ఎత్తుల్లో విజయం సాధించడంతో స్కోరు 5-5 అయ్యింది. అంతకుముందు జరిగిన 7 గేంలూ డ్రా అయ్యాయి. అయితే 10వ గేంలో లిబకోవ్ నల్ల పావులతో ఆడినప్పటికీ విజయం సాధించడంతో 11వ గేంకు ప్రాధాన్యం వచ్చింది.
రష్యన్ గ్రాండ్‌మాస్టర్ వాసిలీ రుబ్కోవ్ దీనిపై వ్యాఖ్యానిస్తూ "లిబకోవ్ రిథంలోకి వచ్చేశాడు. గత ఛాంపియన్‌షిప్ ఫలితం పునరావృతం కాబోతున్నది" అని అప్పుడే తేల్చేశాడు. అప్పటి పోటీలో చేతన్ పద్మనాభన్ 10వ గేంలో ఓడాక మళ్లీ తేరుకోలేకపోయాడు.
ముఖేష్ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. తెల్లటి ప్యాంటూ, షర్టూ, పైన నేవీ బ్లూ కోటు వేసుకున్నాడు. ముందు కోటు మధ్యలో నుంచి ఎర్రని టై కనిపిస్తున్నది. లిబకోవ్ తన వ్యూహానికి భిన్నమైన ఆటను ప్రారంభించాడు. అలా చేయడం ద్వారా ప్రత్యర్థిలో కంగారు పుట్టించడం అతడి వ్యూహం. ముఖేష్‌లో ప్రశాంతత చెక్కుచెదరలేదు. లిబకోవ్ ఎంత దూకుడుతో ఆడుతున్నాడో అంత వేగంతోనూ అతను సమాధానం చెప్తూ వచ్చాడు. ఆ గేములో ఫలితం ఎటూ తేలలేదు. గేంను డ్రా చేసిన వెంటనే లిబకోవ్ చిన్నగా నవ్వుతూ ముఖేష్‌కు షేక్‌హ్యాండిచ్చి "బాగా ఆడావు" అని అభినందించాడు. అందులో ఎలాంటి తిరకాసూ లేదు. నిజంగానే ముఖేష్ ఆ గేమును గొప్పగా ఆడాడు. లిబకోవ్ తప్పనిసరిగా ఆ గేములోనూ గెలుస్తాడని భావించిన పలువురు చెస్ క్రీడా విశ్లేషకులు సైతం ముఖేష్ ఆటతీరును అభినందించకుండా ఉండలేకపోయారు. అనంత ముఖేష్‌ను 'ఎ.కె.'గా పిలవడం మొదలుపెట్టారు.
ఈలోగా పత్రికలవారు ముఖేష్‌ను కలిశారు. "మిస్టర్ ముఖేష్! మీరు మెదడు బదులు కంప్యూటర్ పెట్టుకొని వచ్చారేమిటి?" అని ఓ విలేకరి నవ్వుతూ ప్రశ్నించాడు.
ముఖేష్ కూడా నవ్వాడు. "అదేం లేదు."
"అయితే మీరు ఇంత వేగంగా ఎత్తులు ఎలా వేయగలుగుతున్నారు?"
"ఏకాగ్రత మూలంగా."
"ప్రపంచ చెస్ రంగంలోకి ఉన్నట్లుండి ఎలా ఊడిపడ్డారు?"
అతని వంక ఓ క్షణం అలాగే చూశాడు. బహుశా అతనికి తెలీకపోయుండొచ్చనుకొని చిరునవ్వుతో "నేను మూడేళ్ల నుంచీ భారత జాతీయ ఛాంపియన్‌ని. రెండేళ్ల క్రితమే ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్పును సాధించాను" చెప్పాడు.
"కానీ మీరు ఒక్కసారిగా సీనియర్ ఛాంపియన్‌షిప్పులో ఫైనల్స్‌కి ఎలా చేరుకోగలిగారు?".
ముఖేష్ పక్కనే ఉన్న చేతన్ వంక చూశాడు. "నాకు సరైన మార్గదర్శి లభించడం వల్ల."
"ఎవరతను?"
"చేతన్.. చేతన్ పద్మనాభన్. నా సెకండ్."
* * *
అక్టోబర్ 7. ముఖేష్‌కు సూచనలిస్తున్నాడు చేతన్. అప్పుడతను గురువైతే ముఖేష్ శిష్యుడు. చేతన్ చెప్తున్న ప్రతి అంశాన్నీ జాగ్రత్తగా వింటున్నాడు. ట్రాన్స్‌లోకి వెళ్లిపోయిన వాడిలాగా మరో ధ్యాస లేకుండా చెప్తున్నాడు చేతన్. ఇద్దరి మధ్యా ఉన్న చదరంగం బోర్డు గళ్లపై పావులు చకచకా దిశలు మార్చుకుంటున్నాయి.
రెండు సంవత్సరాల నుంచీ ముఖేష్‌ని తీర్చిదిద్దుకుంటూ వస్తున్నాడు. ప్రపంచ జూనియర్ చెస్ కిరీటాన్ని సొంతం చేసుకున్న రెండో భారతీయుడిగా ముఖేష్ అవతరించడంతోటే చేతన్ నిర్ణయించుకున్నాడు.
పోయిన ఛాంపియన్‌షిప్పులో లిబకోవ్ గెలవడంతోటే తన వంక చూసి పరిహాసంగా నవ్వడం అతడి హృదయంలో ఇంకా మెదులుతూనే ఉంది. అందుకే తను ఏర్పరచుకున్న లక్ష్యానికి ఆయుధంగా ముఖేష్‌ని ఎంచుకున్నాడు. ఓటమిలోనూ చెక్కుచెదరని ప్రశాంతత ముఖేష్‌లో కనిపించడం అతణ్ణి ఆకట్టుకున్నది. లిబకోవ్‌ని ఛాలెంజ్ చేసే క్రమంలో ముఖేష్‌ని దగ్గరుండి ఒక్కొక్క మెట్టే ఎక్కించాడు. ఎక్కడా తప్పటడుకు వేయకుండా అనుకున్నది అనుకున్నట్లే సాధిస్తూ వచ్చాడు ముఖేష్. చివ్వరి మెట్టుదాకా చేరుకున్నాడు. ఆఖరి మెట్టు కూడా విజయవంతంగా ఎక్కగలిగితే అతడికి అంతకుమించిన ఆనందం లేదు.
మరుసటి రోజునే ఛాంపియన్‌షిప్‌లో ఆఖరి గేం జరగబోతున్నది. స్కోరు 9.5-9.5గా ఉంది. లిబకోవ్ డ్రా చేసి 10 పాయింట్లు పొందితే చాలు.. ప్రపంచ చెస్ కిరీటం మళ్లీ అతడి వశమవుతుంది. ముఖేష్ మాత్రం ఛాంపియన్‌షిప్ గెల్చుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిందే!
అటువంటి సమయాల్లో సహజంగా రెండో వ్యక్తిపైనే ఒత్తిడి అధికంగా ఉంటుంది. "ఒత్తిడిని ఎదుర్కోవడంలో భారతీయులు బలహీనం" అన్న లిబకోవ్ పలుకులు చేతన్ స్మృతిపథంలో మెదులుతున్నాయింకా.
"రేపు నువ్వు భారతదేశానికి గొప్ప కానుకని ఇవ్వబోతున్నావు" - ముఖేష్ భుజంతట్టి చెప్పాడు చేతన్.
'నేను నీకిచ్చే గురుదక్షిణ అదే' అనుకున్నాడు ముఖేష్. ఆ రాత్రి అతడికి హాయిగా నిద్రపట్టింది.
* * *
అక్టోబర్ 8. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్. ఆటగాళ్లిద్దరూ దర్పంగా అద్దాల గదిలోకి ప్రవేశించారు. లిబకోవ్ ముఖంలో ఎలాంటి కంగారూ లేదు. కేవలం 'డ్రా'తో కాకుండా 20వ గేంలో గెలుపుతో ఛాంపియన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలని అతడు కోరుకుంటున్నాడు. గెలుపు సాధ్యమనే ధీమాతో అతడున్నాడు.
మరోవైపు అదే నవ్వు, అదే ప్రశాంతమైన ముఖంతో కనిపిస్తున్నాడు ముఖేష్. ప్రపంచ చదరంగ ఛాంపియన్‌షిప్ చరిత్రలో డిఫెండింగ్ ఛాంపియన్‌ని ఎదుర్కొనే ఛాలెంజర్‌గా అవతరించిన రెండో భారతీయుడిగా అతడు అప్పటికే చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. అయితే తొలి ఛాంపియన్ గౌరవం దక్కాలంటే తాను ఎంత ప్రతిభ చూపించాలో అతడు ఆలోచించడం లేదు. యుద్ధానికి సర్వసన్నద్ధమై వచ్చిన సైనికుడిలా లేడతను. పోరాటానికి వచ్చిన వ్యక్తిని సైతం మిత్రుడిగా చేసుకునే గొప్ప తేజస్సు అతడిలో వెలుగుతున్నది.
ఆట మొదలయ్యింది. 10 ఎత్తుల వరకూ మామూలుగానే సాగింది. ముఖేష్ సెంటర్ కౌంటర్ డిఫెన్స్‌ను ఎంచుకోవడం లిబకోవ్‌ను కొద్దిసేపు విస్మయపరిచింది. అది చేతన్‌కు అత్యంత ప్రీతికరమైన వ్యూహం. లిబకోవ్ మాత్రం ప్రయోగాలకు పూనుకోకుండా డ్రాగన్ సిసిలియన్‌నే అనుసరించాడు.
రెండు గంటలు గడిచాయి. ముఖేష్‌కు నాలుగు బంటులు మిగలగా, లిబకోవ్‌కు ఒక బంటు అదికంగా ఉంది. అతడు ఆధిక్యంలోకి వెళ్తున్నట్లు ప్రేక్షకులు తేల్చేశారు. రష్యన్ గ్రాండ్‌మాస్టర్ రుబ్కోవ్ తనకు కాస్త దూరంలో ఉన్న చేతన్ పద్మనాభన్ వంక చూశాడు. అతని ముఖంల్లో ఎలాంటి భావమూ కనిపించలేదు. ఎదురుగుగా జరుగుతున్న ఆటను తిలకించడంలో అతడు నిమగ్నమై ఉన్నాడు.
వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ముఖేష్ ఓ శకటాన్ని కోల్పోగా లిబకోవ్ గుర్రం ఒకటి బోర్డు నుంచి తప్పుకుంది. ముఖేష్ బంటుని తెల్లగడిలోంచి నల్లగడిలోకి జరిపాడు చాలా క్యాజువల్‌గా. లిబకోవ్ కళ్లు పెద్దవయ్యాయి. అందులో వ్యూహం ఏమిటన్నది పది నిమిషాలపాటు ఆలోచించినా అతడికి అర్థం కాలేదు. తలెత్తి ముఖేష్‌ని చూశాడు. ఏదో అనీజీగా ఉన్నట్లనిపించింది. మరోసారి బోర్డువంక చూసి ఆ బంటుని మరో గుర్రంతో కబళించాడు. ముఖేష్ వద్ద మూడు బంటులు మిగిలాయి. మరో రెండు ఎత్తులయ్యాయి. ముఖేష్ తన తెల్ల శకటంతో నల్ల గుర్రాన్ని 'స్మాష్' చేశాడు. లిబకోవ్‌కు తలపట్టుకోవాలనిపించింది. బలవంతంగా నిగ్రహించుకున్నాడు. అప్పటికే అతడు పెదవులు బిగించడం రష్యన్ గ్రాండ్‌మాస్టర్ రుబ్కోవ్ గమనించాడు. అతడి ముఖంలో రంగులు మారాయి.
40 నిమిషాలు గడిచాయి. లిబకోవ్ వద్ద రెండు శకటాలు, ఒక ఏనుగు, మినిస్టర్, మూడు బంట్లు మిగలగా, ముఖేష్ వద్ద ఒక శకటం, రెండు ఏనుగులు, రెండు గుర్రాలు, మినిస్టర్, రెండు బంట్లు మిగిలాయి. గుర్రంతో లిబకోవ్ కింగ్‌కు 'చెక్' చెప్పి కుర్చీలోంచి లేచాడు ముఖేష్. ఆట మధ్యలో అతడింతవరకూ అలా లేవడం జరగలేదు. ఆట ఏమీ ముగింపుకు రాలేదు. లిబకోవ్ ఆలోచిస్తున్నాడు. వెంటవెంటనే వ్యూహరచన చేశాడు. ముఖేష్ గుర్రాన్ని లిబకోవ్ ఏనుగు పక్కకు తప్పించింది.
గంట గడిచింది. బోర్డుమీద ఆధిక్యత ఎవరిదన్నది చూస్తున్నవాళ్లకు అర్థం కాలేదు. నలభై ఐదవ ఎత్తు. లిబకోవ్ మినిస్టర్‌ని ఇరకాటంలో పెట్టాడు ముఖేష్. ప్రొఫెషనల్ చెస్ అసోసియేషన్ సభ్యుడు స్టీవ్ బెకర్ "గొప్ప ఎత్తు" అనరిచాడు. లిబకోవ్ గట్టిగా తన 'మినిస్టర్'ని పట్టుకున్నాడు. గత్యంతరమే లేదు. అతడు మినిస్టర్‌ని పోగొట్టుకున్నాడు - ముఖేష్ శకటానికి బదులుగా.
యాభై ఒకటవ ఎత్తు వేశాడు ముఖేష్. పోటీ చూస్తున్న చేతన్ ఒక్కసారిగా ఉద్వేగం అణచుకోలేక పక్కనే ఉన్న స్టీవ్‌ని కావలించుకున్నాడు. పద్నాలుగు సంవత్సరాలు ప్రపంచ చెస్ క్రీడారంగాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన గొప్ప మేధావి ఆండ్రీ లిబకోవ్ నిస్సహాయంగా ఓటమిని ఒప్పుకుంటూ అలాగే కూర్చుండిపోయాడు. రెండు నిమిషాల పాటు అక్కడ మరో రకమైన శబ్దమేమీ వినిపించలేదు, ప్రేక్షకుల చప్పట్లు తప్ప. అందరి నోళ్లలోనూ "ఏకే.. ఏకే.." అనే మాటే.
ముఖేష్ బయటకు రావడంతోటే చేతన్ గట్టిగా అతణ్ణి కావలించుకొని నుదిటిపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అనుకున్నది సాధించానన్న తృప్తి అతడి కళ్లల్లో కనిపించింది. "నా గురుదక్షిణ చెల్లించాను" అన్నాడు ముఖేష్.
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకుంటూ తన విజయాన్ని తన సెకండ్ అయిన చేతన్ పద్మనాభన్‌కు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు ముఖేష్.
* * *
అక్టోబర్ 8. దినపత్రికలోని స్పోర్ట్స్ కాలం. "ప్రపంచ చెస్ వేదికపై కొత్త ఛాంపియన్ ఆవర్భవించాడు. ఒక సుదీర్ఘ శకం ముగిసి కొత్త శకం మొదలయ్యింది. 14 సంవత్సరాల పాటు చెస్ రారాజుగా వెలిగిన రష్యన్ గ్రాండ్‌మాస్టర్ ఆండ్రీ లిబకోవ్ అక్టోబర్ 8న తన ఛాంపియన్ హోదాని 20 సంవత్సరాల 'వండర్ బాయ్' ముఖేష్‌కు కోల్పోయాడు. ఆఖరి గేం వరకూ సాగిన పోటీలో 10.5-9.5 పాయింట్ల తేడాతో లిబకోవ్‌పై ముఖేష్ అద్భుత విజయం సాధించాడు. అతడు తన విజయాన్ని చేతన్ పద్మనాభన్‌కు అంకితమిచ్చి తమ మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని చాటుకున్నాడు. ఇద్దరు భారతీయుల కృషి ఫలితంగా ప్రపంచ చేస్ రంగంలో భారతదేశం శిఖరాగ్రాన్ని చేరుకున్నది.."
పేపర్ చూస్తున్న చేతన్ పద్మనాభన్ అనుకున్నాడు - 'లిబకోవ్! ఇప్పుడు గెలించింది ముఖేష్ కాదు, నేను! భారతీయుల్లోనూ ఒత్తిడిని స్థైర్యంతో ఎదుర్కొని విజయం సాధించే మొనగాళ్లున్నారని ఒప్పుకుంటావనుకుంటాను.'
- ఈనాడు ఆదివారం, 21 జూలై 1996
Thursday, March 24, 2016
Short Story: Palayanam (Retreat)
కథ: పలాయనం
రోజులన్నీ ఒక్కలాగే నడుస్తుండటంతో మార్పు కావాలని హృదయం ఆరాటపడుతోంది. జీవితానికి మార్పు చాలా అవసరమనీ, మార్పే లేకపోతే జీవితం నిస్సారమవుతుందనీ అనుభవానికి వచ్చింది. నాలాంటి దానికైతే మార్పు మరీ అవసరమనుకుంటాను. కొన్ని మార్పులు సంతోషాన్నిస్తే చాలా మార్పులు విషాదాన్ని మిగులుస్తాయి. అయినా కానీ మార్పు కావాల్సిందే.
కాలేజీ రోజుల్లో మార్పు కోసం ఎన్నడూ తాపత్రయపడలేదు. ఆ రోజులు ఎట్లా గడచిపొయ్యాయో! మళ్లీ మళ్లీ ఆ రోజులు రావాలని ఎంతగా హృదయం క్షోభించినా, ఆశించినా నా కోసమని అవి వెనక్కి రావు కదా!
జగన్‌తో ఆ కాలమంతా ఎప్పటికీ మరవలేని మధురస్వప్నంలా నిలిచిపోయింది. ఆ వెంటనే నా పిరికితనమూ నన్ను వెక్కిరిస్తుంది.

సైకిల్ మీదనే కాలేజీకి పోయేదాన్ని. అట్లా ఓ రోజు సైకిల్‌పై పోతుంటే జగన్ చిన్నగా నవ్వాడు. అతను కాలేజీకి నడిచివచ్చేవాడు. జగన్ నవ్వినా నాకు నవ్వాలని తోచలేదు. అయినా కానీ నాకు తెలీకుండానే, నా ప్రయత్నమేమీ లేకుండానే నా పెదాల మీదికి నవ్వు వచ్చేసింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. జగన్ నవ్వితే బాగుంటుంది. అంత నిర్మలంగా నవ్వే మగాడు ఇంతదాకా నాకు తారసపడనే లేదు. అతను నవ్వితే ఏదో ఆనందం హృదయంలో కలగడం నాకే చిత్రంగా తోచింది.
అప్పట్నించీ మా మధ్య 'పలకరింపు నవ్వులు' మొదలయ్యాయి.
'రేణుక నా వంక చూసి ఒక్క నవ్వు విసిరితే చాలును' అనుకునే అల్ప సంతోషులు.. జగన్ అది సాధించేసరికి అసూయతో కుళ్లుకోడం నాకు తెలుస్తూనే ఉంది.
నవ్వులతో పాటుగా మా మధ్య మాటలు కూడా మొదలయ్యాయి. ఏ రోజునైనా జగన్‌తో క్యాంపస్‌లో మాట్లాడుతుంటే కాలేజీ మొత్తం మా వంకే తిరిగి చూస్తోందని నేను గమనించాను. అయినా నేను సిగ్గుపడలేదు, భయపడలేదు. సాధారణ ఆడవాళ్లకు మల్లే ఇంటి బయట ఏ పరాయి మగాడైనా పలకరిస్తే కుచించుకుపోయే, భయపడి దిక్కులు చూసే రకాన్ని కాను గనక చాటుమాటున ఎవరేమనుకున్నా నేను ఖాతరు చేయదలచుకోలేదు. 'చూస్తే చూడనీ' అనే నా రెబల్ మనస్తత్వాన్ని జగన్ అమితంగా ఇష్టపడ్డాడు.
కాలేజీలో చేరిన రెండో యేడు కాలేజీ మేగజైనులో నేనొక వ్యాసం రాశాను. ఈ పురుషాధిక్యపు సొసైటీలో పురుషులు స్త్రీలనెట్లా వంచించి అణచి వేస్తున్నారో లోకంలో యథార్థంగా జరుగుతోన్న ఇన్సిడెంట్లు కొన్నింటిని ఉదహరిస్తూ ఈ మగవాళ్ల మనస్తత్వాన్ని చెండాడేశాను. స్త్రీలు కూడా తమకు జరుగుతున్న అన్యాయాన్ని తామే తెలుసుకోలేని స్థితిలో ఉన్నారనీ, ఆ స్థితి నుంచి వాళ్లు బయటపడి ఆలోచనలు చేసే దిశగా పయనిస్తేనే కానీ స్త్రీకి సొంత జీవనం అనేది ఏర్పడదనీ నా హృదయంలోని వ్యథనంతా అందులో వ్యక్తం చేశాను.
చిత్రమేమంటే ఇది చదివి నాపై యుద్ధానికి వచ్చింది మగవాళ్లు కాదు, నా స్నేహబృందంలోని ఆడవాళ్లే. నా రాతల్ని నా మీదికే తిప్పికొట్టాలని వాళ్లు ప్రయత్నించారు. నేను చలించలేదు. నవ్వుతో "మనం చేసే తప్పుల్ని మనమే తెలుసుకోలేని స్థితిలో మనమున్నాం. నా మీదికి మీరిట్లా యుద్ధానికి వొచ్చినప్పుడే అది తెలుస్తోంది" అన్నాను. అప్పటికి మళ్లీ ఎవరూ నోరెత్తలేదు.

నా బలవంతంపై జగన్‌ను కన్యాశుల్కం సినిమాకి తీసుకుపోయాను. అయిపోయాక అందులోని నటులు తమ పాత్రలకెట్లా న్యాయం చేశారో చర్చించుకుంటూ వస్తున్నాం.
ఇట్లా మాట్లాడుకుంటుండగానే ఊహించని విధంగా ఉరుములూ, మెరుపులూ లేకుండానే వర్షపు చినుకులు మొదలయ్యాయి.
ఆందోళనగా నేను జగన్ వొంక చూశాను. అతడి మొహంలో ప్రశాంతత చెక్కు చెదరకుండా ఉంది. చినుకులు కాస్తా జడివానగా మారాయి. తలదాచుకునేందుకు దగ్గర్లో షెల్టర్ వంటిదేమీ కనిపించకపోవడం చేత వేగంగా నడుస్తున్నాం. అంతలోకి జగన్ రూం వచ్చేసింది. అక్కడకి మా ఇంటికి చేరాలంటే ఎంతలేదన్నా పది నిమిషాలు పడుతుంది.
జగన్ రూం తాళం తీస్తుంటే "నేను ఇంటికి వెళ్లిపోతాను జగన్" అన్నాను.
"ఇంట్లోకిరా. తగ్గినాక వెళ్లొచ్చు కదా" అన్నాడు నావంక చూస్తా. కానీ వాన తగ్గుతుందా ఇప్పట్లో...?
నేనిక రెట్టించలేదు. మౌనంగా జగన్‌తో రూంలోనికి నడిచాను. ఇంతకు ముందు చాలా సార్లు అక్కడికి వచ్చి ఉన్నా ఇప్పటి స్థితి వేరు. నాలో ఏదో తెలీని కలవరం కలుగుతోంది. ఒళ్లు మొత్తం తడవడంతో వొణికిపోతున్నాను చలితో. వర్ష బిందువులు తలమీంచి జారి బుగ్గల్ని స్పృశిస్తూ జాకెట్లోకి జారటం తెలుస్తోంది.
మగవాడు కాబట్టి మొహమాటమేమీ లేకుండా జగన్ పొడిబట్టల్లోకి మారాడు. మరి నేనో? ఏమీ తోచకుండా ఉంది.. ఆ నిమిషాన. తలుపువద్ద నిల్చొని బయట వానని చూస్తున్నా.
"రేణుకా!" అని జగన్ పిలవడంతో వెనక్కి తిరిగాను.
"బట్టలు మార్చుకుంటావా. జలుబు చేస్తుందేమో అట్లానే ఉంటే. మరి నా వద్ద ఆడవాళ్ల బట్టలు లేవు" అని తన చొక్కా, పైజమా ఇవ్వబోయాడు.
"వద్దు జగన్. తల తుడుచుకోడానికి టవల్ ఇవ్వు చాలు" అన్నాను, చిన్న గొంతుతో.
"ఏయ్.. సిగ్గుపడుతున్నావ్ కదూ. సరే నీ ఇష్టం" అంటూ టవల్ ఇచ్చాడు. తను బాత్‌రూంలోకి పోయి వచ్చాడు.
ఈ లోపల తల తుడవడం పూర్తిచేసి అతడు బయటకు రావడంతోనే నేను బాత్‌రూంలోకి పోయి తడిసిన బట్టల్ని పిండుకున్నాను.
బయట వర్షం ఆగకుండా పడ్తూనే ఉంది. నేను మళ్లీ తలుపు వద్ద నిల్చున్నాను. జగన్ చాపపై కూర్చున్నాడు బాధేమీ లేకుండా. నాకేమో అనీజీగా ఉంది, ఇట్లాంటి స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని.
"తగ్గేదాకా అక్కడే నిల్చుంటావా?"
'ఏం చేయమన్నావ్ మరి?' అన్నట్లు చూశాను, జగన్ చూపులో ఏదో తేడా అవుపించింది. ఎందుకో అర్థమవడంతోనే అంత వణుకులోనూ ఒళ్లు ఝల్లుమంది. చలి స్థానంలో వేడి రాజుకుంటోంది. నాకే ఇట్లా ఉంటే, పాపం మగాడు.. ఊరకనే ఉద్వేగపడే జగన్‌కు ఎట్లా ఉందో. నా నుంచి ఎట్లాంటి సంకేతం అందిందో.. చాపపై కూర్చున్నవాడల్లా చప్పున లేచి నా దగ్గరకు వచ్చేశాడు. నాకంతా ఇది ఏదో కలలో జరుగుతున్నట్లుందే కానీ వాస్తవమన్నది స్ఫురించకుండా ఉంది.
నా ఎదురుగా నిల్చొని భుజాలమీద చేతులు వేశాడు జగన్. అతని చేతిపై నా చేయి వేసి అతని కళ్లలోకి చూశాను. నాపై అధికారమంతా తనదేనన్నట్లు చూస్తున్నాడు. తెలుస్తూనే ఉందిప్పుడు నాకు, నా నరాలు నా స్వాధీనం తప్పిపోతున్నాయని. ఏం చెయ్యను? 'ఛీ.. దుర్మార్గుడా. ఇదా నీ అసలు రూపం' అంటూ చెంప పగలగొట్టేదాన్నే మరొకరైతే. నా ముందున్నది జగన్ అయినప్పుడు, అతనే నా జీవితం అనుకున్నప్పుడు ఎట్లా అనను, ధిక్కరించను?
అట్లానే నా తలని అతని ఛాతీపై వాల్చేసి కావలించుకున్నాను. నా నుదురుని ముద్దాడి "రేణుకా! ఐ లవ్ యూ" అన్నాడు నాపై ఆరాధననంతా తన కంఠంలోకి తెచ్చుకొని.
మాట్లాడకుండా మరింత గట్టిగా అతణ్ణి వాటేసుకున్నాను.
"ఆలస్యమైతే ఇంట్లో కోప్పడతారేమో."
"పడితే పడనీ. నీ తర్వాతనే ఏదైనా, ఏమైనా."
"రేణూ!".. జగన్ కంఠంలో వొణుకు స్పష్టంగా తెలుస్తోంది. ఇంక అతణ్ణి నమ్మకుండా ఉంటానికి వేరే ఆధారం అవసరమేంటి నాకు? నేనేమైపోయినా చింతలేదు నాకు. అతడి కావలింతల్లోని హాయి ముందు ఇంట్లో మావాళ్లు పెట్టే చీవాట్లు ఎంతనీ!
"నేను స్వార్థపరుణ్ణి కాలేను. పద.. వాన వెలుస్తున్నట్టే ఉంది."
అవును, వాన వెలుస్తోంది. కానీ.. కానీ. తనకు ఇంక నేనేమీ అడ్డు చెప్పనని తెలిసికూడా.. జగన్.. ఇట్లాంటి గొప్ప ప్రేమికుడు ఎట్లాంటి పుణ్యం చేసుకుంటే దక్కుతాడు నాకు!
ఆనందంతో ఒళ్లు ఊగిపోతుంటే అతడి పెదాలని గట్టిగా ముద్దు పెట్టుకొని వొదిలాను.

అదే పోవడం. మళ్లీ ఆ రూంలో అడుగు పెట్టలేదు. జగన్‌కు దూరమవుతానని అప్పుడే గనక నా మనసులో మెదిలినట్లయితే అక్కడనే ఉండి ఉందును. అనుకొని ఏం ఉపయోగం?
అంతా నాకు అనుకూలంగా జరుగుతుందనే భ్రమలో ఉంటిని. నా మాటకు, జగన్ మీది నా ప్రేమకు నాన్న విలువనిస్తాడనే అనుకుంటిని. అంతదాకా ఇంట్లో నాకు విరుద్ధంగా ఏమీ జరగక పోవడంతో ఆ నమ్మకం నాలో స్థిరపడింది. అందుకనే జగన్ విషయంలో నాన్న నాపై కోపంగా విరుచుకు పడ్డప్పుడు షాక్ తిన్నాను.
నేను మళ్లీ జగన్‌ని కలుసుకోకుండా చెయ్యడంలో ఆయన విజయం సాధించాడు. అంతటితో తృప్తి పడకుండా మరొకరితో నాకు పెళ్లి నిశ్చయం చేశాడు. ఎంత ఎదురు తిరిగీ ప్రయోజనం లేకపోయింది.
ప్రేమ కోసం ప్రాణ త్యాగానికీ, ఆత్మ త్యాగానికీ సిద్ధపడ్డ స్త్రీల ఆత్మల్లో ఏ ఒక్కటీ నాపై కనికరం చూపకపోవడంతో నా ప్రేమని నాలోనే అణచి పెట్టుకున్నాను. అట్లా నేను దీక్షితులుకి భార్యగా మారాల్సి వచ్చింది.
తిరిగి ఇన్నినాళ్లకు నేను జగన్‌ని చూడగలుగుతానని కలనైనా తలచలేదు. అతడు కనిపించకపోయినా బాగుండేది. తిరిగి నాలో అశాంతి రేకెత్తకుండా ఉండేది. దీక్షితులుతో ఈ జీవితాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎట్లాగో గడిపేసేదాన్ని. మళ్లా అవుపించి నన్ను పిచ్చిదాన్నే చేసేశాడు జగన్.
నాకెంత మాత్రమూ ఇంటరెస్ట్ లేదు, మ్యారేజ్‌డేని సెలబ్రేట్ చేసుకోడం. మూడేళ్లు గడిచాయి మా పెళ్లయి. ఏం ఉపయోగం, వ్యర్థంగా, ఏ మాత్రమూ తృప్తనేదే లేకుండా గడిచింది ఈ కాలం.
ఈ నాలుగో పెళ్లిరోజుకు దీక్షితులు తన ఆఫీస్ స్టాఫ్‌కు పార్టీ ఏర్పాటు చేశాడు. ముందుగా నాకు చెప్పినట్లయితే ఎట్లాగైనా కేన్సిల్ చేయించి ఉందును. అందరికీ పార్టీ అని చెప్పేసినాక తర్వాత ఒచ్చి 'ఇట్లా చెప్పాను' అంటే ఏం మాట్లాడను? ఇట్లా పార్టీ ఇవ్వడానికి కారణం ఒక్కటే తట్టింది. నేను కడుపుతో ఉండటం.
స్టాఫంతా వొచ్చినట్లుంది. బెడ్‌రూంలో ఉన్న నాకు దాని తాలూకు సందడి వినిపిస్తోంది. దీక్షితులు వొచ్చి "మా వాళ్లంతా వొచ్చేశారోయ్, నీదే ఆలస్యం. రా, వెళ్దాం" అన్నాడు.
ఐదో నెలే కాబట్టి పొట్ట పెద్ద ఎత్తుగా లేదు. అయినా కానీ అట్లా అందరి ముందూ దిష్టిబొమ్మలా నిల్చోవాలంటే నా మనసొప్పింది కాదు. సిగ్గూ, బిడియమూ మీదికి వొచ్చి పడ్డాయి. పోకపోతే బాగోదు కనుక తప్పనిసరై అతని వెనుక నడిచాను.
అప్పుడే.. అప్పుడే.. జగన్ అవుపించాడు. నన్ను ముందుగానే గమనించి కాబోలు అందరికీ కాస్త ఎడంగా ఒక మూలగా నిల్చొని ఉన్నాడు. అతని వంక నన్ను చూడనివ్వకుండా ఎవరో అడ్డొచ్చారు. దాదాపు స్టాఫంతా నాకు తెలుసు. జగన్ ఎప్పుడు జాయినయినట్లు? అందుకు జవాబన్నట్లు జగన్ దగ్గరకు నన్ను తీసుకువెళ్లాడు దీక్షితులు.
అంతదాకా ఎటో చూస్తున్నట్లున్న జగన్ నా వొంక చూపు తిప్పాడు.
"ఇతనేవరో తెలుసా రేణూ! జగన్.. జగన్మోహన్. గొప్ప ఆర్టిస్టులే. అతను రాసిన నాటకానికి ఈ ఏడాది అవార్డ్ కూడా వచ్చింది తెలుసా. నా దగ్గర జాయినయ్యి రెండు నెల్లే అయినా నాకు మిగతా వాళ్లందరికంటే దగ్గరయ్యాడు" అని చెప్తూ, "జగన్.. ఈమె రేణుక. నా వైఫ్" అంటూ అతనికి పరిచయం చేస్తుంటే జగన్ చిన్నగా నవ్వాడు. అర్థం కాక.. ముందు అతనివొంకా, తర్వాత నా వొంకా చూశాడు దీక్షితులు.
జగన్ నవ్వడంతో నాలో గొప్ప శాంతి కదలాడింది. ఏదో భారమంతా నాలోంచి పోయినట్లు ఫీలయ్యాను. వెంటనే నేనూ సన్నగా నవ్వాను.
"ఏమిటి మీ ఇద్దరికీ ఇదివరకే పరిచయముందా?" అనడిగాడు. ఆ గొంతులో ఆసక్తే తప్ప మరెలాంటి అనుమానమూ లేదు. అట్లా అనుమానపడే వ్యక్తి కాదని నాకు తెలుసు.
"ఒక్క పరిచయమేనా.." అంటూ ఆగి జగన్ వొంక చూశాను. జగన్ కళ్లల్లో అంతులేని ఆశ్చర్యం ఒక్కమారుగా తొంగిచూసింది. నేనట్లా అనగలనని ఊహించలేదనుకుంటాను.
"అవన్నీ ఇప్పుడెందుకులే రేణుకా" అని నన్ను అడ్డుకుంటూ "తనూ, నేనూ ఒక్క కాలేజీలోనే చదివాం" అని దీక్షితులుతో అన్నాడు.
"మరేమిటి తను 'ఒక్క పరిచయమేనా' అని ఆపేసింది". దీక్షితులుకు తెలుసుకోవాలన్న ఆరాటం వొదల్లేదు. అతని ఆఫీస్ మైండ్‌కు ఇట్లాంటి సంగతులు అందకుండా ఉన్నాయి.
"నీతో పెళ్లి కాకుండా ఉన్నట్లయితే, పరిస్థితులు అనుకూలించినట్లయితే మా ప్రేమ ఫలించి ఉండేది" అన్నాను నిర్భయంగా, నిబ్బరంగా.
నన్నాపలేకపోయినందుకు విచారపడ్తూ తలవంచుకున్నాడు జగన్. అదీగాక తన బాస్ భార్యకు తను మాజీ ప్రేమికుణ్ణని తెలిసిపోవడం కొంత కారణం.
"ఇంతదాకా ఈ సంగతి నాకు చెప్పలేదే రేణూ" అని, మళ్లీ జగన్ వేపు తిరిగి "అయితే చాలా ముఖ్యమైన వ్యక్తివి నాకు" అన్నాడు.
జగన్‌కు అక్కడ నిలవాలనిపించలేదేమో "ముందు పార్టీ సంగతి చూడండి" అన్నాడు. అప్పుడు స్పృహ తెలిసి "మాటల్లో అసలు సంగతే మరిచాను" అంటూ వెళ్లాడు దీక్షితులు.
"ఎందుకతనికి అట్లా చెప్పావు?" అనడిగాడు జగన్ నా వంక కాకుండా ఎటో చూస్తూ.
"తప్పేమీ చెప్పలేదే."
"కానీ అందువల్ల చిక్కులన్నీ నీకేగా."
"దీక్షితులు అటువంటి మనిషి కాడులే. దేనికీ ఫీలవడు."
"ఏమిటి! నేను నీ ఒకప్పటి లవర్‌నని తెలిసినా కూడానా!"
"మన మధ్య ఆ వర్షం కురిసిన రోజు నాటి విషయం చెప్పినా ఫీల్ కాని మనిషి అతడు."
"అది కూడా చెప్పేశావా?! అయితే నీకు ఎలాంటి ప్రాబ్లెమూ లేదన్న మాట. అందుకే కాస్త ఒళ్లు కూడా చేశావు" అన్నాడు, అప్పుడు పరిశీలనగా నన్ను చూస్తూ. తర్వాత ఆలోచనలో పడినట్లు మౌనంగా ఉండిపోయాడు. మళ్లీ అతను పెదవి విప్పలేదు.
పార్టీ అయ్యాక మాత్రం "వస్తాను" అని చెప్పి పోతుంటే "నువ్వు మాత్రం ఉండాలోయ్" అని ఆపడానికి యత్నించాడు దీక్షితులు.
"నాకు ఓ ముఖ్యమైన పని ఉంది.. ఈ రాత్రికి" అంటూ తప్పించుకుపోయాడు జగన్.
పక్కమీద పడుకొని జగన్ గురించే ఆలోచిస్తున్నా.
దీక్షితులు నా మీదికి ఒంగి బుగ్గపై ముద్దు పెట్టుకొని, "ఏమిటిట్లా దీర్ఘాలోచనలు చేస్తున్నావ్. జగన్ గురించేనా?" అనడిగాడు. ఆ గొంతులో జెలసీ కానీ, ఎగతాళి కానీ ఏమీ లేవు. చాలా క్యాజువల్‌గా ఉంది.
"అవును. ఇంకా బ్రహ్మచారిగా ఉండి ఏం సాధించగలడా అని."
"నీ మూలంగానే అనుకుంటా కదూ, అతడు పెళ్లి చేసుకోంది. పాపం ఎట్లా ప్రేమించాడో నిన్ను. ఎందుకు మీరు పెళ్లి చేసుకోలేకపోయారు?"
మా ప్రేమని కలిసి అనుభవించింది ఎంతకాలమనీ చెప్పడానికి. అయినా ఎట్లా విడిపోయామో దీక్షితులుకు చెప్పాక రిలీఫ్‌గా అనిపించింది.
"పాపం జగన్ మాత్రం పూర్ ఫెలో" - దీక్షితులు గొంతులో సానుభూతి తొంగిచూసింది.
"నేనో?"
"పెద్ద ఆఫీసర్ భార్యవి. నీకేం లోటు?" అంటూ మీదికి రాబోతుంటే తోసేశాను - "వద్దు ఇప్పుడు" అంటూ.
"మూడాఫ్ అయ్యిందా, సరే అయితే."
ఆ రాత్రంతా జాగారమే అయ్యింది. కాలేజీ, అప్పటి ప్రేమ.. అంతా సినిమా రీలుమల్లే కళ్లముందు మెదిలింది.

సరిగ్గా వారం గడిచాక నాకు ఉత్తరం వొచ్చింది జగన్ నుంచి. ఉత్తరం ఎందుకా! అని ఆశ్చర్యపడ్తూ తెరిచాను.
"నేను వెళ్లిపోతున్నాను. ఎక్కడ మళ్లీ నీ ఆకర్షణలో పడిపోతానో అనే భయంతోటే. మరి కొద్ది రోజులుంటే చాలు, నీ పిచ్చిలో మళ్లీ పడిపోతాను. అక్కడ ఉంటే నీ దగ్గరకు రాకుండా ఉండలేను. ఒకప్పటి సంగతేమో కానీ, ఇప్పుడు నీ ముందు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమని మొన్ననే తెలిసొచ్చింది. నువ్వు సంతోషంగా ఉన్నావు. అది చాలు నాకు. నా వల్ల నీకెలాంటి ఇబ్బందీ రాకూడదు. మీ ఆయన మంచివాడే కావొచ్చు. కానీ మా మగాళ్లు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. అందుకే ఈ పలాయనం. నేను రిజైన్ చేసినట్లు ఈసరికి దీక్షితులు నీకు చెప్పే ఉంటారనుకుంటాను. మళ్లీ కనపడనని ఆశిస్తూ - జగన్."
చప్పున కళ్లెమ్మట నీళ్లొచ్చాయి. జగన్.. ఎందుకింత తొందరపడ్డావ్? అప్పుడప్పుడైనా నిన్ను చూసుకోవచ్చని ఎంతగా ఆశపడ్డాను?.. ఇంతకీ నా జీవితం ఇట్లా ఉండాలని రాసుంటే ఎన్ననుకునీ ఏం లాభం?

- మయూరి వీక్లీ, 12 ఆగస్టు 1994.
Sunday, March 15, 2015
Big Story: Tegani Galipatam
2002 ఆగస్టు 15.
సికింద్రాబాద్ స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్‌లోంచి దిగి ఆటో ఎక్కేలోగా తడిసి ముద్దయ్యాడు శేఖర్. ఇంటికి వొచ్చేసరికి అరగంట. ఆటో దిగాడు. గజగజా వొణికిపోతున్నాడు. ఆతడి కోసమే ఎదురుచూస్తో కమలిని. ఆ వాన నీళ్ల సవ్వడిలోనూ ఆటో ఆగిన చప్పుడు ఆమె చెవులకు. ఇంట్లోంచి ఒక్క పరుగున బయటకు వొచ్చింది. ఆటోవాలాకు డబ్బులిచ్చి, గేటు తీస్తున్నాడు శేఖర్. తల గిర్రున తిరిగింది. కాళ్లు సత్తువ కోల్పోయాయి.
అతని స్థితి చూసి, ప్రమాదం శంకించి, ఒక్క ఉదుటున అతడి వొద్దకు వొచ్చింది. ఆమె పట్టుకోబోయినట్లయితే కింద పడిపోయేవాడే. అతడి తడి ఒళ్లు కొలిమిలో పెట్టిన కర్రులా సలసలా కాలిపోతోంది. అతడి చేతిని తన భుజం మీద వేసుకొని, నెమ్మదిగా నడిపించుకుంటూ ఇంట్లోకి – కమలిని.
శేఖర్ నిల్చోలేకపోతున్నాడు. తనను కమలిని పట్టుకోవడం, ఇంట్లోకి తీసుకురావడం తెలుస్తూనే ఉంది. ఆమెకు దూరంగా జరగాలని మనసు కోరుకుంటుంటే, శక్తి చాలడం లేదు దేహానికి. ‘శ్రీనాథ్‌గాడి కింద నలిగిన ఆమె దేహానికి తన దేహం రాచుకోవడమా?’. తల నరాలు చిట్లినంత నొప్పి. తెలివితప్పిపోయాడు.
ఆమెకు కాళ్లూ చేతులూ ఆడలేదు. అతడికి చలిజ్వరమని తెలుస్తోంది. తమాయించుకుంటూ – చకచకా అతడి బట్టలు విప్పేసింది. రగ్గు కప్పింది. తల తుడిచింది, టవల్‌తో. రెండు అరచేతుల్నీ రుద్దింది. జ్వరాలూ, తలనొప్పులూ, వొంటినొప్పులూ, జలుబులూ, గాయాలూ వంటి వాటికి వేసే మందులెప్పుడూ ఇంట్లో సిద్ధం. వాటిలోంచి పారాసెట్మాల్ టాబ్లెట్ తీసి, వేసింది. అప్పుడు ఆమె కళ్లు పరిశీలనగా, అతడి మొహంలోకి.
మనిషి బాగా తగ్గిపోయాడు. కళ్లు, బుగ్గలు లోతుకుపొయాయి. రగ్గు తీసి చూసింది. పొట్ట వీపుకు అతుక్కుపోయినట్లు డొక్కలు స్పష్టంగా. అతను కదిలాడు. రగ్గు కప్పింది. మంచం మీద పడుకోబెట్టింది. కొన్ని క్షణాల తర్వాత, అతను పలవరిస్తున్నాడు. ఆ పలవరింతలు ఆమె గుండెల్లో బాకుల్లా సూటిగా గుచ్చుకున్నాయి. కళ్లళ్లోంచి నీళ్లు ఉబికుబికి వొచ్చాయి. వెక్కిళ్లు. ఏడుస్తూనే అతడి అరచేతులూ, అరికాళ్లూ రుద్దుతూ – ఆమె. ఎన్ని కన్నీటి చుక్కలు రగ్గుమీద పడి ఇంకాయో!
* * *
కొంత కాలం వెనక్కి.
1997 ప్రారంభ రోజులు.
శేఖర్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఆరేళ్లయిపోయింది. ఇంతదాకా ఏ ఉద్యోగంలోనూ కుదురుగా ఉండలేకపోయాడు. ఈ ఆరేళ్లలో తన చదువుకు సంబంధంలేని ఉద్యోగాలూ చేశాడు. గవర్నమెంట్ జాబ్‌కు యత్నిద్దామంటే రిక్రూట్‌మెంట్లే లేవు. కేంద్రంలో ఐక్య ఫ్రంట్ ప్రభుత్వం అనిశ్చితిలో. రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అనిశ్చితిలో. ఎక్కడైనా ఒకటీ, అరా జాబ్స్ పడుతున్నా, ‘ఆమ్యామ్యా’ ప్లస్ రికమండేషన్ ఉంటే తప్ప వొచ్చే స్థితి లేదు. శేఖర్‌లాంటి ‘ఎందుకూ పనికిరాని’ నిజాయితీపరుడికి ఆ అవకాశం అసలే లేదు.
ఉద్యోగం వేటలో భాగంగా విజయవాడలో ఉంటున్న మేనమామ వరసయ్యే నరసింహం ఇంటికొచ్చాడు శేఖర్. అక్కడికి రావడం అది మొదటిసారేమీ కాదు. కానీ ఆ రోజు – అతడి జీవితాన్ని మలుపు తిప్పిన రోజు!
నరసింహం కూతురు కమిలిని. గతంలో వాళ్లు బాపట్లలో ఉండే కాలంలో, అక్కడే ఇంజనీరింగ్ చదివాడు శేఖర్. పేరుకు హాస్టల్లో ఉంటున్నా, వాళ్లింట్లోనే ఎక్కువ కాలం గడిపాడు. శని, ఆదివారాలు అక్కడే పడుకునేవాడు. సాధారణంగా భర్త తరపు చుట్టాలంటే నరసింహం భార్య వరలక్ష్మికి గిట్టేదు. చిత్రంగా శేఖర్ ఆమె ఆదరణకు నోచుకున్నాడు. ఒళ్లు దాచుకోకుండా పనిచేసే తత్వం అతడిది. బయటి పనులే కాదు, వంట పనిలోనూ సాయం చేసే అతడి గుణం నచ్చడంతో, అతడిపై అభిమానం చూపేది వరలక్ష్మి.
శేఖర్ ఫస్టియర్‌లో ఉన్నప్పుడు పెద్దమనిషయ్యింది కమలిని. అతడక్కడ నాలుగేళ్లున్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. మానసికంగానూ దగ్గరయ్యారు. ‘శేఖరే నా మొగుడు’ – మనసులో ఆనాడే కమలిని నిర్ణయం. ఇప్పటిదాకా బయటపెట్టలేదు. హోదాపరంగా, ఆర్థికపరంగా కమలిని వాళ్లు శేఖర్ వాళ్లకంటే పైమెట్టు. ఇది అతడికి బాగా తెలుసు. ఆమె ముందు అతనూ బయటపడలేదు. ధైర్యం చెయ్యలేకపొయ్యాడంటే కరెక్ట్.
కమలినికి సంబంధాలు చూస్తున్నారు. తన అన్న కొడుకుతో కూతురి పెళ్లి చెయ్యాలనేది వరలక్ష్మి కోరిక. అతగాడంటే కమలినికి ఇష్టంలేదు. ఆ సంగతి తల్లికి చెప్పాలంటే ఆమెకు జంకు.
అట్లాంటి రోజుల్లో ఆ ఇంటికొచ్చాడు శేఖర్. ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. నరసింహం, వరలక్ష్మి డాబామీదకెళ్లారు, పడుకోవడానికి. కాసేపటికి వాళ్లిద్దరూ వాదులాడుకుంటున్న సంగతి కింద హాల్లో ఉన్న అతడికి తెలుస్తోంది. ‘పెళ్లి’ అనే మాట తప్ప మిగతా మాటలు అర్థం కాలేదు.
టైం పదిన్నర. తన గదిలోంచి బయటకొచ్చింది కమలిని. మనసులో భయం స్థానంలో తెలీని తెగువ. నవారు మంచం మీద అటూ ఇటూ పొర్లుతూ శేఖర్. అతని మనసు స్థిమితంగా లేదు. ఆమెకు తెలిసింది. కొద్ది క్షణాల ఊగిసలాట. మనసుకి ధైర్యం చెప్పుకుని అతని మంచం కాడికి ఆమె. మంచం కోడు కాలికి తగిలి అలికిడి. కళ్లు తెరిచి, అటు చూసి గతుక్కుమన్నాడు శేఖర్. గబాల్న లేచి కూర్చున్నాడు.
“ఏంటి కమ్మూ?” చిన్న గొంతుతో, శేఖర్.
కొద్ది క్షణాల మౌనం.
“నన్నేం చెయ్యదలచుకున్నావ్?” – కమలిని.
ఏం చెప్పాలో తోచలేదు. ఆమె దేనిగురించి అడుగుతోందో తెలుసు. చుట్టూ చీకటి. హృదయంలో మిణుకుమిణుకుమంటూ సన్నటి వెలుగు. తనకు కమలిని కావాలి. కావాల్సిందే.
“నీకు నిజంగా నేనంటే అంత ప్రేమా?” – శేఖర్.
మౌనం. మళ్లీ అడిగాడు.
“ఎందుకు మళ్లీ మళ్లీ అడుగుతావ్? నిన్ను ప్రేమిస్తున్నాననీ, నీతోనే నా జీవితమనీ నీకు తెలీదూ? నోటితో చెబితే కానీ తెలుసుకోలేని మొద్దబ్బాయివా?” – ఆమె గొంతు పూడుకుపోయింది.
ఆమె ఏడుస్తోందని తెలుస్తోంది. అతడిలో కంగారు. డాబామీద పడుకున్న వాళ్ల అమ్మానాన్నలకు వినిపిస్తే?
“ప్లీజ్ ఏడవకు కమ్మూ. నాకు తెలుసు, నేనంటే నీకిష్టమని. నాకూ నువ్వన్నా ప్రేమే. కానీ ఎట్లా? నేనింకా ఏ జాబ్‌లోనూ సెటిలవలేదు. ఇంకా వెతుక్కోవడంలోనే ఉన్నా. ఇప్పటి రోజుల్లో జాబ్ దొరకడం కష్టంగా ఉంది. ఒకవేళ జాబ్ దొరికినా మీ నాన్నలా సంపాదించలేను. వొచ్చినదాంతో సర్దుకుపోయే మెంటాలిదీ నాది. కష్టాల్ని భరించడం చిన్నప్పట్నించీ అలవాటైనవాణ్ణి. నీ స్థితి వేరు. నువ్విక్కడ యువరాణిలా పెరిగావ్. నన్ను చేసుకుంటే నీ కలలు నిజం కాకపోవచ్చు. నన్ను చేసుకుంటే సుఖంగా ఉండలేవు. నువ్వేది కావాలంటే అది తెచ్చివ్వలేను. నేను ఆలోచిస్తోంది అదే. మనిద్దరికి మ్యాచ్ కాదనేది నా అభిప్రాయం. ఆలోచించు” – వాస్తవికంగా శేఖర్.
“నువ్వుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు.”
“ఇంకోసారి బాగా ఆలోచించు. తర్వాత కష్టపడతావ్.”
“ఇంక ఆలోచించడానికేమీ లేదు శేఖర్.”
“అయితే మనం పెళ్లి చేసుకుందామంటావ్?”
“నీకు కాకుండా నన్నెవరికి కట్టబెట్టినా బతకను” – శేఖర్ కళ్లల్లోకి చూస్తూ, స్థిరంగా కమలిని.
“అయితే నేను నీవాణ్ణే. మనం పెళ్లి చేసుకుందాం.”
ఆమె చేతినందుకుని చటుక్కున తన మీదికి లాక్కున్నాడు. అతను కింద, ఆమె పైన. ఆమె స్తనాలు అతని ఛాతీని ఒత్తుకుంటుంటే.. నెత్తురు వేడెక్కుతూ.. ఆమె కింది పెదవి మీద బలంగా ముద్దు పెట్టుకున్నాడు. నరాలు వశం తప్పుతూ.. అంతలోనే స్పృహ తెలిసి…
“అమ్మో, ఏమో అనుకున్నా. బుద్ధావతారానివేం కాదు.” – అతన్ని విడిపించుకుని, సన్నగా నవ్వుతూ తుర్రున తన గదిలోకి కమలిని.
వాళ్ల పెళ్లికి మొదట మొండికేసింది వరలక్ష్మి. తండ్రీ కూతుళ్లు ఒక్కటయ్యారు. ఒప్పుకోక తప్పలేదు. శేఖర్, కమిలిని పెళ్లి విజయవాడలో గొప్పగా చేశాడు నరసింహం.
* * *
1997 ఏప్రిల్.
హైదరాబాద్‌లోని పంజాగుట్ట కాలనీలో రెండు గదుల పోర్షన్‌లో కొత్తజంట కాపురం. వాళ్లొచ్చిన నాలుగో రోజు సిటీ అంతా గడబిడ. నడిచే పాట గద్దర్‌పై గుర్తుతెలీని కిరాతకుల కాల్పులు. ఆయన ఛాతీ కుడిభాగంలో, పొట్టలో, కుడిచేతిలో – మొత్తం మూడు బుల్లెట్లు. అయినా మృత్యుంజయుడు గద్దర్.
ఆయనంటే విపరీతమైన అభిమానం శేఖర్‌కు. నిమ్స్‌లో ఉన్న ఆయన్ను అతి కష్టమ్మీద చూసొచ్చాడు. అదివరకు ఓసారి చీరాల మున్సిపల్ హైస్కూల్ గ్రౌండులో అందరిలాగే తనూ ఆ ఆవేశంలో, ఆ ఉద్రేకంలో, ఉద్వేగంలో కొట్టుకుపోయాడు. స్టేజి కింద గద్దర్‌తో కరచాలనం చెయ్యడం, తనను తాను పరిచయం చేసుకోవడం, బాగా చదువుకొమ్మని ఆయన చెప్పడం అతడి జీవితంలోనే మరచిపోలేని క్షణాలు. అప్పటి గద్దర్ ఇంకా శేఖర్ కళ్లల్లో…
తూటాల దెబ్బతిని, ఒంటిమీద కట్లతో, బెడ్‌మీద నీరసంగా.. ప్రజా ఉద్యమ నౌక. దుఃఖం ఆగలేదు శేఖర్‌కు. రెండు రోజుల దాకా మామూలు మనిషి కాలేకపోయాడు. తనకే తుపాకి తూటాలు తగిలినంత బాధ. కమలిని అనురాగంలో తెరిపినపడ్డాడు. ప్రాణాపాయం నుంచి గద్దర్ బయటపడ్డాడనీ, తేరుకుంటున్నాడనీ పత్రికల్లో చదివి, సంతోషపడ్డాడు. ఎప్పటిలా ఉద్యోగాన్వేషణ.
రాష్ట్రంలో, దేశంలో ఎటు చూసినా ఏదో ఒక అలజడి. దేవెగౌడ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణ. ఉన్నపళాన కూలింది ఐక్య ఫ్రంట్ గవర్నమెంట్. పది రోజుల తర్వాత మళ్లీ అదే గవర్నమెంట్. ఈ సారి ప్రధాని, గుజ్రాల్. రాష్ట్రంలో.. ఆర్టీసీ సమ్మె. ఇంటర్వ్యూలకు తిరగడానికి బస్సులు లేక శేఖర్‌కు నానా తిప్పలు.
నరసింహం నుంచి ఉత్తరం – జన్మభూమి పనులు మొదలు కాబోతున్నాయనీ, ఇంటరెస్ట్ ఉంటే ఆ పనులు ఇప్పిస్తాననీ, ఏ విషయం వెంటనే ఫోన్ చెయ్యమనీ.
శేఖర్ సంగతి అటుంచితే, కమలినికి మళ్లీ అటెళ్లడంలో ఆసక్తి లేదు. తను, శేఖర్.. హైదరాబాద్‌లో జాలీ లైఫ్! శేఖర్‌కు జాబొస్తే జోరుగా, హుషారుగా షికార్లు!! కులాసాగా కాలం!!! తమ మధ్య ఇంకో మనిషంటూ ఉండకూడదు.
“ఆ పనులు ఎన్ని రోజులుంటాయ్ కనుక. మళ్లీ ఏదైనా జాబ్ చూసుకోవాల్సిందేగా. ఇంట్రెస్ట్ లేదని నాన్నకు చెప్పు” – కమలిని.
శేఖర్‌లోనూ అదే రకమైన ఆలోచన. కష్టమో, నష్టమో కొద్ది రోజులు ఓపిక పడితే ఇంత పెద్ద సిటీలో ఉద్యోగం దొరకదా. ఇక్కడే ఉంటే ఉద్యోగావకాశాలు తెలుస్తుంటాయి.
మావయ్యకు ఫోన్ చేశాడు. జన్మభూమి వర్క్స్ మీద ఇంటరెస్ట్ లేదనీ, ఇక్కడే ఉండి ఉద్యోగం చూసుకుంటాననీ చెప్పాడు.
మే నెల. శేఖర్‌కు ఉద్యోగం, ఓ పేరుపొందిన హాస్పిటల్లో మెయింటెనెన్స్ ఇంజనీర్‌గా. ఇదివరకు చేసిన ఉద్యోగాలతో పోలిస్తే, ఇది నచ్చింది. కొద్ది రోజుల్లోనే అతడి సామర్థ్యం, పనిపై అతడి అంకితభావం హాస్పిటల్ ఛైర్మన్‌కు నచ్చాయి.
జీవితం చకచకా, హాయిగా. అతడి ప్రేమలో ఉక్కిరిబిక్కిరవుతూ కమలిని. పని ఒత్తిడితో అతడెప్పుడైనా ఆలస్యంగా ఇంటికి వొస్తే ఏడుస్తూ, అతని గుండెల మీద వాలిపోతూ – ఆమెకు పుట్టిల్లే జ్ఞాపకం రావట్లేదు.
సుఖంగా రెండేళ్లు. ఒక్కటే అపశృతి. 1998 ఆగస్టులో నెలతప్పిన కమలినికి నాలుగో నెలలో అబార్షన్. శేఖర్ అనురాగంలో త్వరగానే కోలుకుంది. అతడి శాలరీ వెయ్యి రూపాయలు పెరిగింది. దాన్ని వెక్కిరిస్తూ మార్కెట్లో అన్ని వస్తువుల రేట్లూ పెరిగాయి. ఇంటి రెంట్ పెరిగింది. కమలిని కోరికల చిట్టా మరింత పెరిగింది. ఆమెలో క్రమంగా అసహనం, అసంతృప్తి పెరుగుతున్నాయి.
హాస్పిటల్లో పని ఒత్తిడి. శేఖర్‌కు ఊపిరి సలపడం లేదు. హాస్పిటల్ విస్తరణ పనులు. ఆదివారాలూ అతడికి డ్యూటీ. నెలలో ఒక్క ఆదివారం ఇంటిపట్టున ఉంటున్నాడేమో. ఆ ఒక్క రోజైనా ఎక్కడికీ తిరక్కుండా, ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటుంది అతడి శరీరం. కమలిని పడనివ్వదు. అన్ని రోజులూ ఒక్కతే ఇంటిపట్టున ఉంటున్న తనను ఆ ఒక్క రోజైనా బయటకు ఎక్కడికైనా షికారుకు తీసుకెళ్లమనేది ఆమె డిమాండ్. చాలా న్యాయమైన డిమాండ్. కాదనలేడు. కానీ, షికారుకు అతని మనసు, శరీరం సహకరించట్లేదు. షికార్లని ఆస్వాదించలేకపోతున్నాడు. అతడి స్థితితో ఆమెకు నిమిత్తం లేదు. ఆ ఒక్క రోజునూ ఆమె ఆస్వాదిస్తోంది. గోల్కొండ, చార్మినార్, జూపార్క్, ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్, టాంక్‌బండ్, బిర్లా టెంపుల్, సుల్తాన్ బజార్, ఫిలింనగర్, కొత్తగా ఏర్పడిన రామోజీ ఫిలింసిటీ కలియతిరిగింది. ఆమె మనసు నాట్యం చేసింది, నెమలిలా. అదంతా ఆ ప్రదేశాల్లో ఉన్నప్పుడే. అక్కణ్ణించి ఇవతలకు వొస్తే.. మనసంతా వెలితి వెలితిగా…
బైకుల మీదా, కార్లలో తిరిగే యువ జంటలను చూస్తూ వాళ్లదెంత సుఖవంతమైన జీవితం అనుకుంటే ఆమె మనసు చిన్నబోతోంది. శేఖర్ బైకుని నడుపుతుంటే, వెనక కూర్చొని అతని నడుము చుట్టూ చేతులేసి, అతని వీపుమీద తలవాల్చితే ఎంత హాయిగా ఉంటుంది! ఎప్పుడొస్తుందో ఆ రోజు – అనుకుని ఉసూరుమంటోంది.
“మా నాన్నని అడిగితే డబ్బు సర్దుబాటు చేస్తాడు. బైకు కొనొచ్చుగా” – కమలిని.
“అత్తింటి నుంచి ఏమీ ఆశించకూడదని మన పెళ్లి కాకముందే నా నిశ్చితాభిప్రాయం. అలా తీసుకోవడం నా మనస్తత్వానికి విరుద్ధం. ఇప్పుడు బైకు అవసరం ఏముంది? అవసరం వొచ్చినప్పుడు ఎలాగో కష్టపడి కొంటాలే. అప్పటిదాకా సర్దుకుపోవాలమ్మాయ్” – నవ్వుతూ తేలిగ్గా, శేఖర్.
తేలిగ్గా తీసుకోలేకపోయింది కమలిని.
“బైకుల మీదా, స్కూటర్ల మీదా ఝామ్మని పోతున్న జంటల్ని చూస్తుంటే నాకెంత కష్టంగా ఉంటోందో తెలుసా? నాక్కూడా అలా తిరగాలని ఉండదూ? మా నాన్నను అడగాలే కానీ, చిటికెలో సమకూర్చి పెట్టడూ? అయినా లోకంలో నీలాంటివాణ్ణి ఎక్కడా చూళ్లేదు. అతి మంచితనం, నిజాయితీ ఈ సొసైటీలో పనికిరావ్ శేఖర్. ఇంజనీర్‌వి. కావాలనుకుంటే ఎంత సంపాదించొచ్చు! నువ్వు తప్ప అందరూ సంపాదించుకునేవాళ్లే” – నిష్ఠూరంగా కమలిని.
శేఖర్ మొహంలో నవ్వు మాయం. ఒంట్లోని నెత్తురంతా మొహంలోకి వొచ్చినట్లుగా ఎరుపు.
“ప్లీజ్ కమ్మూ. ఇంకోసారి నా దగ్గిర ఇట్లాంటి మాటలు అనొద్దు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మన పెళ్లికి ముందు ఏమన్నావో. నేనుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదన్నావ్. ఇప్పుడు దానికి పూర్తి ఆపోజిట్‌గా బిహేవ్ చేస్తున్నావ్” – కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ శేఖర్.
కమలిని గొంతు పూడుకుపోయింది, వేదనతో. కళ్లల్లో నీళ్లు. ఆ క్షణం శేఖర్ ఆమె మొహంలోకి చూసినట్లయితే, ఆ కళ్లు ఏం మాట్లాడుతున్నాయో తెలిసేదేమో.
2000 సంవత్సరపు రోజులు.
హైదరాబాద్ యమ స్పీడ్‌గా డెవలప్ అవుతోంది. ఇదివరకు అబిడ్స్, కోఠీ మాత్రమే మెయిన్ షాపింగ్ సెంటర్లు. ఇప్పుడు అమీర్‌పేట, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, చందానగర్, దిల్‌సుఖ్‌నగర్, బేగంపేట, ప్యాట్నీ పెద్ద షాపింగ్ సెంటర్లయ్యాయి. ఎటు చూసినా షాపింగ్ మాల్సే. బట్టల దుకాణాలూ, జ్యూయెలరీ షాపులూ, ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూంలూ. డిస్‌ప్లేలలో కళ్లుచెదిరే చీరలూ, చుడీదార్లూ, నెక్లెస్‌లూ, చెయిన్‌లూ.. కమలిని కళ్లు పెద్దవవుతున్నాయి, వాటిని చూస్తూ. వాటిలో ఆమె కళ్లకు నచ్చుతున్నవెన్నో. కానీ, కమలినికి హృదయాన్నిచ్చిన శేఖర్ జిగేల్‌మంటున్న ఖరీదైన చీరల్నీ, నగల్నీ ఇవ్వలేకపోతున్నాడు. ఆమెలో ఇదివరకు ఉన్న సంతోషం, హుషారు క్రమేపీ తగ్గిపోతున్నాయి.
కావాలనుకున్నవి దక్కకపోతే అసంతృప్తి తీవ్రమై మనల్ని దహించివేస్తుంది. మనసు కంట్రోల్ తప్పుతుంది. మంచి, చెడు విచక్షణ లోపిస్తుంది. కమలినిది సరిగ్గా ఇదే స్థితి.
కమలినిలో మార్పును గమనిస్తున్న శేఖర్, ఆమెను కాస్తయినా సంతోషపెట్టాలని అప్పుడప్పుడూ చార్మినార్‌కో, సుల్తాన్‌బజార్‌కో తీసుకుపోతున్నాడు. గాజులూ, ఒన్ గ్రాం గోల్డ్ నగలూ, చుడీదార్‌లూ కొనిస్తున్నాడు. కమలిని కోరుకుంటోంది వాటిని కాదు. అయినా అయిష్టంగానే, అసంతృప్తిగానే వేసుకుంటోంది, వాటిని.
ఇంజనీరంటే ఎంతో కొంత బెటర్ లైఫ్‌ను ఎంజాయ్ చేయొచ్చని ఆశించింది కమలిని. కొత్త మోజు తగ్గిపోయాక ఆమె కలలన్నీ కల్లలవుతున్నాయ్. మనసులో ఎడతెగని వేదన. ఈ జీవనశైలి కారణంగా తనపై ఆమెకు ప్రేమ తగ్గిపోతుందని అస్సలు ఊహించలేకపోయాడు శేఖర్. అతను ఊహించనిదే జరిగింది. కమలినిలో చిరాకులూ, పరాకులూ. శేఖర్ విషయంలో నిర్లక్ష్యం. ఆమె ఆశించింది ఈ జీవితమైతే కాదు.
* * *
ఆదిలాబాద్ హాస్పిటల్ కోసం ప్లాన్ ప్రకారం మార్కింగ్ చేయించి, భూమి పూజ ఏర్పాట్లు చేసే పనిని శేఖర్‌కు అప్పగించాడు ఛైర్మన్. అక్కడ వారం రోజులు దాకా ఉండాల్సి రావచ్చు.
“మా అమ్మానాన్నల్ని రమ్మని చెప్పేదా?” – శేఖర్.
“అవసరం లేదులే. వారం రోజులేగా. ఎలాగో గడిపేస్తా” – కమలిని.
వారం అనుకున్నది నాలుగు రోజుల్లో పూర్తి. ఐదో రోజు సాయంత్రానికి హైదరాబాద్‌లో శేఖర్. ఇంటికొచ్చేసరికి చీకటి పడుతోంది. ఆశ్చర్యపోయాడు. తలుపులకు తాళం కప్ప. ఆలోచించి, భరత్‌నగర్‌కు వెళ్లాడు. అక్కడ అతని చిన్నమ్మ వాళ్లుంటున్నారు. దగ్గరి బంధువైన ఆమె తప్ప కమలినికి తెలిసిన వాళ్లెవరూ ఆ దగ్గరలో లేరు.
“ఏరా గుర్తొచ్చామా. మీ మొగుడూ పెళ్లాలు ఈ వైపే రావడం మానేశారే. వొచ్చిన కొత్తలో రెండు మూడు సార్లు వొచ్చి పోయారంతే. నువ్వంటే సరే. తీరికలేని ఉద్యోగం అనుకో. ఇంట్లో ఉండి ఆ అమ్మాయి ఒక్కతే ఏం చేస్తోంది? ఇటేపొస్తే ఇద్దరికీ కాలక్షేపం అవుతుంది కదా. అయినా ఇప్పుడు చీకటి పడ్డాక వొచ్చావేం?” – చిన్నమ్మ.
కమలిని అక్కడకు రాలేదన్న మాట.
“చిన్నమ్మా! అలా అంటావనే ఇలా వొచ్చాను, నేరుగా ఆఫీసు నుంచి. కమలినికి చెబుతాలే, వీలున్నప్పుడల్లా ఇక్కడకొచ్చి కాలక్షేపం చెయ్యమనీ” – బలహీనంగా నవ్వాడు శేఖర్.
ఐదు నిమిషాల తర్వాత అక్కణ్ణించి బయటపడ్డాడు. కడుపులో పేగుల సొద. పొద్దున నాలుగిడ్లీలు తినడమే. చిన్నమ్మ భోజనం చేసి వెళ్లమంటే, ఇంటివొద్ద కమలిని ఎదురు చూస్తుంటుందని వొద్దన్నాడు. మధ్యహ్నం నుంచీ కడుపులో ఏమీ పోలేదు.
రోడ్డు మీదకొచ్చాడు. షేరింగ్ ఆటోలో అమీర్‌పేట చౌరస్తాలో దిగాడు. ఇమ్రోజ్ హోటల్లో కార్నర్ టేబుల్ కాడ కూర్చున్నాడు. ఎదురుగా రోడ్డు నాలుగువేపులా కనిపిస్తోంది. పరోటా ఆర్డర్ చేసి, కమలిని ఎక్కడికి వెళ్లుంటుందా అని ఆలోచిస్తున్నాడు. ఫ్లాష్! కళ్లకు కమలిని కనిపించి, మాయమైంది. తల విదిల్చాడు. అపనమ్మకంగా చూశాడు.
ఆనంద్ బజార్ షాప్ ముందు ఆగిన ఆటోలో కమలిని! కమిలినే!! ఆమె పక్కన.. ఎవడు? ఎవడో కాదు, శ్రీనాథ్! తమ పక్క పోర్షన్‌లో ఉంటున్న బ్యాచిలర్. చక్కగా తయారై ఉంది కమలిని. శ్రీనాథ్‌తో నవ్వుతూ కబుర్లు చెబుతోంది కమలిని. ఒకరి భుజం ఒకరు రాసుకుంటూ, కొత్త జంటల్లాగా, ప్రేమికుల్లాగా, సన్నిహితంగా – శేఖర్ కళ్లకే శక్తి ఉంటే, క్షణాల్లో ఆ ఇద్దరూ బూడిదైపోవాల్సిందే.
గ్రీన్ సిగ్నల్. ఆటో కదిలింది. ఎందుకో.. తను వాళ్లకు కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు శేఖర్. ఎక్కణ్ణించి వొస్తున్నారు? అట్నుంచి వొస్తున్నారంటే బేగంపేటో, సికింద్రాబాదో వెళ్లుంటారు. షికారుకెళ్లారా? సినిమాకెళ్లారా?
దెబ్బకు ఆకలి చచ్చింది. కడుపు రగులుతోంది కోపంతోటీ, అవమానంతోటీ. స్వతహాగా సౌమ్యుడు శేఖర్. కానీ ఈ అవమానం ఎలా తట్టుకోవడం? తల పగిలిపోతోంది. ఎవేవో పిచ్చి అలోచనలు. ఎందుకు బతకడం? ఏ బస్సుకిందో, లారీకిందో పడితే?
బయటకు నడిచాడు. వెనుక నుంచి సర్వర్ పిలుస్తున్నాడు. పట్టించుకునే స్థితిలో లేడు. బస్సెక్కాడు. తమ కాలనీకి కాదు. భాగ్యనగర్ కాలనీకి. అనితా అపార్ట్‌మెంట్స్‌లో ఉండే మిత్రుని దగ్గర ఆ రాత్రి గడిపాడు.
* * *
పొద్దున తొమ్మిది. ఇంటికొచ్చాడు, చెప్పుల చప్పుడు వినవచ్చేలా నడుస్తూ. తలుపు తట్టబోయాడు. తెరుచుకుంది. ఎదురుగా కమలిని, నవ్వుతూ! క్షణం.. నవ్వు మాయం! ఆమె కళ్లల్లో తత్తరపాటు!!
‘శ్రీనాథ్‌గాడు వొచ్చుంటాడనే ఆనందంతో తలుపు తీసిందన్న మాట’ – మనసులో కసిగా శేఖర్.
బలవంతాన కమలిని మొహంలో నవ్వు.
“అరె శేఖర్. రా రా. సర్‌ప్రైజ్.. చేసేశావ్. వారం అన్నావ్‌గా. ఐదో.. రోజే వొచ్చాశావేం. పోనీలే మంచి.. పని చేశావ్. ఈ ఐదు రోజులూ తోచక చచ్చి..పొయ్యాననుకో.”
శేఖర్ మొహంలో నిర్లిప్తపు నవ్వు. ఆమె గమనించలేదు. చూపులు ఎక్కడో. అతను కోపం, ఆవేశం ప్రదర్శించలేదు. ఎలాంటి అనుమానాన్నీ వ్యక్తం చెయ్యలేదు.
“తొందరగా పనైపోయింది. ఇక అక్కడ ఉండటమెందుకని వొచ్చేశా. నువ్వసలు ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు కదూ, ఇప్పుడే వొచ్చేస్తానని” – శేఖర్.
లోపలికెళ్లాడు, ఆమె జవాబు కోసం చూడకుండా. బట్టలు మార్చుకున్నాడు.
* * *
2001 మార్చి.
మనసు కుదుటపడట్లేదు. కుదుటపడ్డానికి యత్నిస్తున్నాడు. కమలినిపై అతడి ప్రేమలో మార్పులేదు. ఉంటే అది ప్రేమ కాదు కదా.
ఆ శ్రీనాథ్‌కూ, కమలినికీ ఏం సంబంధం? ఎట్లాంటి సంబంధం? కమలిని ఉద్దేశమేంటి? ఏం చేయాలనుకుంటోంది? ఆమే, తనూ ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు. పైగా తనను పెళ్లి చేసుకొమ్మని అడిగిందే కమలిని. ఆమె ఎందుకు ఇట్లాంటి పనిచేసింది?.. పిచ్చెక్కుతోంది శేఖర్‌కు.
సాధ్యమైనంత వరకు నిజాయితీగా బతుకుతూ, కమలినితో జీవితాన్ని ఆస్వాదిస్తూ, పిల్లలు పుట్టాక తనూ వాళ్లలో ఒకడై, వాళ్లను ఆడిస్తూ, తను ఆడుతూ, వాళ్లను తాననుకున్నట్లు తీర్చిదిద్దుతూ బతకాలని ఎంతగా ఆశించాడు. కమలిని కొట్టిన ఒక్క దెబ్బతో అతడి ఆశలన్నీ ధ్వంసం.
జీవితమంటే నాటకమనీ, మనమంతా అందులో పాత్రధారులమనీ ఎక్కడో చదువుకున్న మాటలు జ్ఞాపకానికొచ్చాయి. ఇదేం నాటకం! ఇలాంటి నాటకంలో తన పాత్రేమిటి? నాటకాల్లో వేషాలు వేసేవాళ్లు బయట తిరిగేప్పుడు రంగులు తుడిచేసుకుంటారు. తనేమో ఇంటా, బయటా రంగులు వేసుకునే తిరగాలా? తనకంటే వాళ్లు చాలా బెటర్.
మనసులో థామస్ మెదిలాడు. ఈ మధ్యే అతను తమ హాస్పిటల్ నుంచి కొట్టాయం మెడికల్ కాలేజీకి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా వెళ్లాడు. వెళ్లేప్పుడు “ఓసారి కేరళకు రా బ్రదర్. నీకు మళ్లీ ఇక్కడకు రావాలనిపించదు” అన్నాడు తనతో. అతడిది కేరళలోని కోజికోడ్.
థామస్‌కు ఫోన్ చేశాడు.
“వాట్ ఎ కో ఇన్సిడెన్స్” – థామస్.
“ఏమిటి?” – శేఖర్, కాస్త ఆశ్చర్యంగా.
“నీకు కాల్ చేయాలని ఇంతకు కొద్దిసేపటి క్రితమే అనుకున్నా” – థామస్.
“విషయమేంటి?” – శేఖర్, ఒకింత కుతూహలంగా.
“మా కాలేజీలో సీనియర్ మెయిన్‌టెనెన్స్ ఆఫీసర్ జాబ్ ఖాళీ అయ్యింది. నువ్వే జ్ఞాపకమొచ్చావు. ఇక్కడకు వొచ్చే ఆలోచన ఉంటే చెప్పు. మా వాళ్లకు చెప్పి పెడతాను. ఇంతకీ నువ్వెందుకు చేశావో చెప్పు.”
“సడన్‌గా జ్ఞాపకమొచ్చావు. చాలా రోజులైంది కదా, ఓసారి పలకరిద్దామని చేశా.”
“ఓకే. మరిక్కడకు వొచ్చే ఆలోచన ఉందా?”
“అక్కడ బాగుంటుందంటే వొచ్చేస్తా.”
“అయితే.. డన్.”
కేరళకు వెళ్తున్నానని కమలినికి చెప్పాడు శేఖర్.
“ఇప్పుడక్కడి దాకా వెళ్లాల్సిన పనేముంది?” – కమలిని.
“మంచి ఆఫర్. శాలరీ కూడా ఎక్కువే. నీక్కావాల్సింది కూడా అదేగా” – శేఖర్.
అతని మాటల్లోని శ్లేష ఆమె మెదడుకు చేరలేదు.
“ఏమో నాకైతే అక్కడకు వెళ్లడం ఇష్టం లేదు.”
“సరే. ఇక్కడ ఓ నెల రోజులు సెలవు పెడతా, ఏదో కారణం చెప్పి. కొట్టాయంలో బాగుందో, లేదో తెలుసుకోడానికి ఈ నెల సరిపోతుంది కదా. నచ్చకపోతే వొచ్చేస్తా. నచ్చితే అక్కడే.”
“సరే నీ ఇష్టం.”
“కావాలనుకుంటే ఈ నెల రోజులు నీకు తోడుగా మీ అమ్మను పిలిపించుకో.”
“చూస్తాలే. అమ్మ ఇక్కడకొస్తే నాన్నకు కష్టమవుతుంది. నాలుగు రోజులుండి పొమ్మంటే ఇబ్బంది ఉండదు కానీ, నెల రోజులంటే ఇబ్బందే. సరేలే. ఎలాగో నేనే సర్దుకుపోతాను. అంతగా బోర్‌కొడితే అప్పుడు చూసుకోవచ్చులే.”
‘ఇబ్బంది వాళ్లకా, నీకా?’ – అడుగుదామనుకున్నాడు. పైకి “నీ ఇష్టం” అని ఊరుకున్నాడు.
కొట్టాయం వెళ్లాడు. నెల రోజులు గడిచాయి. శ్రీనాథ్‌తో కలిసి హాయిగా తిరుగుతోంది కమలిని. ఇంట్లోనే అతనితో కులాసాగా కబుర్లు చెబుతోంది. ఇలా జరుగుతుందని శేఖర్‌కూ తెలుసు. తెలిసీ తనెందుకు ఇలా చేస్తున్నట్లు? ఎందుకు ఇలాంటి అవకాశం అనాయాసంగా ఆమెకు కల్పించినట్లు? ఆమెకు అడ్డు కాకూడదనా? తన చేతకానితనాన్ని నిరూపించుకోడానికా? లేక ఆమెను పరీక్షించడానికా? తేల్చుకోలేకపోయాడు.
* * *
చిత్రమైన స్థితిలో కొట్టుమిట్టాడుతూ కమలిని. శ్రీనాథ్‌తో షికార్లకు వెళ్తున్నా అతడితో శారీరక సంబంధం పెట్టుకోలేదు. ఒకసారి ఆటోలో గోల్కొండకు వెళ్తుంటే ఆమె నడుం మీదుగా చేయిపోనిచ్చి బ్లౌజ్ మీద నుంచే ఆమె గుండ్రటి స్తనాన్ని పట్టుకొని వొత్తాడు శ్రీనాథ్. ఆమైనే ఉలిక్కిపడి అతడి చేతిని తోసేసింది.
“ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఇంక నీతో ఎక్కడికీ రాను” అని చెప్పింది మందలింపుగా. మిర్రర్‌లోంచి ఆటోడ్రైవర్ ఆసక్తిగా చూస్తున్నాడు. చూసి, వెనక్కి తగ్గాడు శ్రీనాథ్.
ఇంకోసారి – ఇద్దరూ ఇంట్లో కలిసి భోజనం చేస్తున్నారు. తన మొహం వొంక అదేపనిగా అతడు చూస్తుంటే “ఏమిటి?” – ఆమె.
మూతి పక్కన ఏదో అంటిందన్నట్లు సైగ చేశాడు. వేలుపెట్టి చూసుకుంది. ఏమీ తగల్లేదు.
“నీకు కనిపించదులే” – శ్రీనాథ్.
వేలిని ఆమె మూతివొద్దకు తెస్తున్నట్లుగా తెచ్చి, చటుక్కున తన మొహం వొంచి తన ఎంగిలి పెదాలతో, ఈమె ఎంగిలి పెదాలను గట్టిగా ఒత్తేశాడు.
గట్టిగా తోసేసి “ఇంకోసారి ఇలా చేస్తే నీకూ నాకూ కటీఫ్” – విసురుగా, కోపంగా కమలిని.
ఆమె మనసేమిటో అర్థంకాక అతను తికమక. తనతో సినిమాలకూ, షికార్లకూ తిరగడానికి ఏమాత్రం సంకోచించని ఆమె, చేతులు పట్టుకున్నా, అప్పుడప్పుడూ ఒళ్లూ ఒళ్లూ రాసుకున్నా పట్టించుకోని ఆమె, అంతకుమించి తనను ఎందుకు దగ్గరకు రానీయట్లేదు? తనెక్కడకు తీసుకుపోతే అక్కడకు వొచ్చే ఆమె, కులాసాగా ఎన్ని కబుర్లయినా చెప్పే ఆమె, కనీసం ముద్దు కూడా ఇవ్వదెందుకని? తనను వాడుకుంటోందా? ‘సరే. ఇట్లా ఎంతకాలం దూరం పెడుతుందో అదీ చూద్దాం’ – మనసులో.
“నీకు కోపం వొస్తే.. సారీ.. నిన్ను చూస్తూ ముద్దు పెట్టుకోకుండా ఉండలేకపోయా. ఇంకెప్పుడూ.. నువ్వు కావాలన్నా ముద్దు పెట్టుకోనులే” – శ్రీనాథ్.
భోజనం పూర్తయ్యేదాకా వాతావరణం గంభీరం. అతడి మనసు కష్టపడిందని అర్థమైంది. ‘నేను మరీ అంత విసురుగా మందలించాల్సింది కాదు.. అమ్మో.. అలా గట్టిగా కోప్పడకపోతే అలుసైపోనూ.. ఇంకా ఇంకా చనువు తీసుకోడూ..’ – మనసులో, కమలిని.
నిజానికి ఇప్పుడే రోజులు హాయిగా గడుస్తున్నట్లున్నాయి ఆమెకు. హైదరాబాద్‌లో చూడాలనుకున్న చోట్లన్నీ ఒకటికి రెండుసార్లు చూసేసింది. ఏ సినిమా కావాలంటే ఆ సినిమాకు తీసుకుపోతున్నాడు శ్రీనాథ్. హుస్సేన్‌సాగర్ జలాల్లో జోరుగా స్పీడ్ బోటింగ్ చేసింది. గోల్కొండలో సౌండ్ అండ్ లైట్ షో చూసి చిన్నపిల్లలా సంబరపడింది. జూపార్క్ అంతా కలియతిరిగి అక్కడి జంతువుల్నీ, పక్షుల్నీ పలకరించింది. ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్, లుంబినీ పార్క్, బొటానికల్ గార్డెన్స్, దుర్గం చెరువు రిసార్ట్స్‌లో విహరించింది. బిర్లా ప్లానిటోరియం చూసి ఆశ్చర్యపోయింది.
ఇవన్నీ ఒకెత్తు, షాపింగ్స్ ఇంకో ఎత్తు. పంజాగుట్ట మీనాబజార్‌లో షిఫాన్ చీర, పోలీస్ కంట్రోల్ రూం దగ్గరున్న కళాంజలిలో డిజైన్ శారీ, బేగంపేట షాపర్స్ స్టాప్‌లో టైటాన్ వాచ్, లైఫ్‌స్టైల్‌లో శాండల్స్, బషీర్‌బాగ్ జగదాంబ జ్యూయెలర్స్‌లో ముత్యాల హారం.. కొనిచ్చాడు శ్రీనాథ్. వారానికోసారి సాయంవేళ ఏ చట్నీస్‌కో, టచ్ ఆఫ్ క్లాస్‌కో, స్వాగత్‌కో, అనుపమకో వెళ్లి తినొస్తున్నారు.
కమలినికి జీవితం చాలా సుఖంగా, హాయిగా. ఇవేవీ శేఖర్‌తో తీరేవి కావు. అయినా ఏదో వెలితి, ఏదో అసంతృప్తి – కమలిని మనసును చికాకుపెడుతూ…
నెలకోసారి శేఖర్ వొస్తున్నాడు. ఆమెతో ముభావంగా గడుపుతున్నాడు. పేరుకు మొగుడూ పెళ్లాలు. మునుపటి దగ్గరితనమైతే లేదు. ఏమీ ఎరగనట్లే ఆమె ముందు నటించాల్సి రావడం శేఖర్‌కు చాలా కష్టం. పక్కనే శ్రీనాథ్‌తో తిరుగుతూ, శేఖర్ ఉన్నప్పుడు అతని తోడిదే లోకం అన్నట్లు గడపాలంటే కమలినికి మహా కష్టం.
* * *
శేఖర్‌లో కొత్త దిగులు. కమలిని తనను వొదిలేసి ఆ శ్రీనాథ్‌గాడితో లేచిపోతే? తన జీవితం సంగతి తర్వాత, కమలిని జీవితం ఏమై పోతుంది? పెళ్ళాం లేచిపోతే ఆ మొగుడిపై సొసైటీకి సానుభూతి. లేపుకుపోయిన వాడు కూడా బాగానే ఉంటాడు. ఆ లేచిపోయిన స్త్రీకే కష్టాలన్నీ. శూలాల్లాంటి మాటలతో గుచ్చిగుచ్చి పొడుస్తుంది లోకం. మోజు తీరాక ఆ మగాడు వొదిలేస్తే, ఆ స్త్రీ జీవితం మరింత ఘోరం, నరకం. అనాదిగా సంఘం ఇంతే.
కొట్టాయంలో ఆడా, మగా జంట కనిపిస్తే చాలు, శేఖర్ హృదయంలో క్షోభ. ఈ మధ్య ‘మిన్సార కణవు’ అనే తమిళ సినిమా చూశాడు. అందులో అరవింద్‌స్వామి చెప్పిన డైలాగులు అతని చెవుల్లో గింగురుమంటున్నాయి. కాజోల్‌ని తనను ప్రేమించేట్లు చెయ్యమని ప్రభుదేవాను ప్రాధేయపడతాడు అరవింద్. సరేనని కాజోల్‌ని పరిచయం చేసుకుంటాడు ప్రభు. ఇద్దరూ స్నేహితులవుతారు. అరవింద్ గురించి గొప్పగా చెప్పి, అతడిపై ఆమెకు ప్రేమ పుట్టించాలని చూస్తుంటాడు ప్రభు. చిత్రంగా అరవింద్‌ను కాకుండా ప్రభును ప్రేమిస్తుంది కాజోల్. ఇది తెలిసి ఆవేదనతో ఊగిపోతాడు అరవింద్. “నీ దగ్గర ఉన్నదేంటి? నా దగ్గర లేనిదేంటి?” అని ప్రభుదేవాను అడుగుతాడు.
ఇప్పుడు ఆ మాటలే పదేపదే జ్ఞప్తికొస్తున్నాయి. ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చూసి శ్రీనాథ్‌వైపు ఆకర్షితురాలైంది కమలిని? ఏ మాత్రం సంకోచం లేకుండా అతనితో ఎలా తిరుగుతోంది? తనేం లోటు చేశాడు? తిండికీ, బట్టకీ కరువు లేదే? అడపాదడపా ఆమె తీసుకెళ్లమన్న చోటుకు తీసుకుపోతూనే వొచ్చాడు కదా.
అంటే ఆమెకు తృప్తిలేదు వీటితో. ఇంకా ఇంకా కావాలి. తనకంటే ఆర్థికంగా లేనోళ్లు ఈ సొసైటీలో ఎన్నో లక్షలమందే.. కాదు.. కాదు.. కోట్లమంది. తమ ఆర్థిక స్థితిని అర్థం చేసుకొని, అందుకు తగ్గట్లుగా వాళ్లు బతకడం లేదా? సర్దుకుపోవట్లేదా? కమలినికి ఇలాంటి చెడుపని చేయడానికి ఎలా మనసొప్పింది? ఇదే ప్రశ్న ఆమెను అడగాలనుకున్నాడు, అడగలేకపోయాడు.
2002 మొదలు. ఈ మధ్యలో కమలినికి డబ్బు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. అప్పటికే మొబైల్ ఫోన్లు మార్కెట్లో వినియోగంలోకి ఎక్కువగా వొచ్చినా, ఇంకా అతను సమకూర్చుకోలేదు. ఎప్పుడైనా ఫోన్‌లో మాట్లాడుకోవచ్చని, అతన్నయినా ఒక మొబైల్ కొనుక్కోమని ఆమె చెబుతుంటే, దాటవేస్తూ వొస్తున్నాడు. అతనికి తెలీని సంగతి ఏమంటే, ఈ కాలంలో కమలిని హృదయానికి ప్రశాంతత అనేది లేకుండా పోయిందని. ఆమెకు చీరల మీదా, అలంకరణల మీదా, షికార్ల మీదా మోజెక్కువైనా, శ్రీనాథ్‌తో కొద్దో గొప్పో ఆ మోజు తీర్చుకుంటున్నా, అతడి చేష్టలు ఆమెకు భయాన్ని కలిగిస్తున్నాయి.
ఆమెకు అర్థమవుతోంది – అతను తన కోరికలు తీరుస్తోంది, కేవలం తన శరీరంపై కాంక్షతోనే అని. తన దేహంపై సున్నితమైన చోట్లను తాకుతూ అతను ఆనందం పొందుతున్నాడు. తన రొమ్ముల్ని రెండు మూడు సందర్భాల్లో వొత్తాడు. అప్పుడు తన దేహం వొణికిపోయింది – మైకంతోటో, మైమరపుతోటో కాదు – భయంతో, జుగుప్సతో.
ఏమీ ఆశించకుండా తను కోరుకున్నవాటిని అతనెందుకు అమర్చిపెడతాడు? అతన్నుంచి తను కోరుకున్నవి పొందుతున్నప్పుడు, తన నుంచి అతను ఆశించకుండా ఎందుకుంటాడు? ఆ తెలివి తనకెందుకు లేకపోయింది?
తను ప్రేమగా ఉంటే, తనకు కావాల్సినవన్నీ శ్రీనాథ్ అమర్చిపెడతాడని ఊహించుకుందే కానీ, అతను తన దేహాన్నే కోరుకుంటాడని ఊహించలేక పోయిందెందుకని? అతడితో పరిచయమైన రోజు నుంచీ, ఈ రోజు దాకా చూసుకుంటే తన కోరికలు కొన్ని తీరాయనేది నిజమే. కానీ, వాటితో అప్పటికి తాత్కాలికంగా సంతోషం కలిగినా, తర్వాత్తర్వాత ఏదో తెలీని అశాంతి వేధిస్తూ వొస్తోంది. శేఖర్‌తో అందమైన జీవితాన్ని కలలు కన్నది. ఆ కలలు నెరవేరడం లేదని షోకిల్లారాయుడైన శ్రీనాథ్‌కు దగ్గరైంది.
నగలూ, ఖరీదైన చీరలూ కొనిపెట్టలేకపోయినా శేఖర్ తనను ప్రేమించాడు. తన బాధ అతడి బాధ. ఎట్లా లాలించేవాడు! తనకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకోవాలని తపించేవాడు. తనను దగ్గరకు తీసుకున్నప్పుడల్లా అతడి స్పర్శలో, అతడి ఊపిరిలో ఎంతటి అనురాగం!
కొంతకాలంగా శేఖర్ తనతో అంటీ అంటనట్లుగా ఉంటున్నాడు. ప్రేమగా పలకరించడం లేదు. దగ్గరకు రాకుండా దూరదూరంగా మసలుతున్నాడు. అంటే.. అంటే.. తన విషయం శేఖర్‌కు తెలిసిపోయిందా? అందుకనే అట్లా దూరంగా మసలుకుంటున్నాడా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అనిపించడమేమిటి? అదే నిజం. లేకపోతే అట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు?
ఆందోళనా, ఆవేదనా కలిసి.. కమలిని ఒంటిలో వొణుకు. తన వ్యవహారం తెలిసి కూడా ఒక్క మాటా అడగకుండా, ఒక్క మాటా అనకుండా ఎలా ఉండగలుగుతున్నాడు? నిజంగా తెలిసుంటుందా? తెలీకపోతే అతడి ప్రవర్తనకు అర్థం? శేఖర్‌కు తెలుసో, తెలీదో.. పోనీ. ఇకముందు అతడిని మోసం చెయ్యకూడదు. కానీ.. ఇప్పటిదాకా చేసిన తప్పుడు పనులో? అతడి ముందు తన తప్పును వొప్పుకొని క్షమించమని అడగొద్దా? తను శేఖర్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకొని అతడితోనే లోకమని అబద్ధాలాడి, ఇంకొకరితో తిరుగుతోంది. దీన్నెలా సరిదిద్దుకోవాలి?.. కమలిని తల పగిలిపోతోంది.
శనివారం రాత్రి కొట్టాయం నుంచి వొచ్చాడు శేఖర్. భోజనాలయ్యాయి. తను చేసిన పిచ్చి పనులు చెప్పుకొని, క్షమించమని అడగాలని చెబుతోంది కమలిని మనసు. ధైర్యం చాల్లేదు. దానికి బదులుగా “నేను కూడా నీతో వొచ్చేస్తా. నువ్వక్కడ, నేనిక్కడ.. ఇట్లా ఎంత కాలం? నువ్వొచ్చేదాకా వారాల పాటు ఎదురుచూస్తూ ఉంటం నా వల్ల కావట్లేదు” – ఆమె.
అతనిలో కాస్తంత ఆశ్చర్యం. నవ్వొచ్చింది. ఆమెకు కనిపించకుండా పెదాల మాటున అదిమిపెట్టి “ఇప్పుడు నేనుంటున్న ఇంట్లో కుదరదు. ఒక్కటే గది. ఇద్దరికీ సౌకర్యంగా ఉండే ఇల్లు చూస్తా. అప్పుడు వొద్దువుగానీలే” – అతను.
దూర ప్రయాణం చేసి అలసివుంటంతో నిద్ర ముంచుకువొస్తోంది. వెళ్లి పడుకున్నాడు. ఆ పూట అతడితో కాసేపు కబుర్లు చెప్పాలనీ, మనసు విప్పాలనీ కమలిని ఆరాటం.
“ఏమైనా కబుర్లు చెప్పకూడదూ? కొట్టాయం ఎట్లా ఉందో, అక్కడి మనుషులు ఎట్లా ఉంటారో, నీకు అక్కడ ఎట్లా అనిపిస్తున్నదో చెప్పొచ్చు కదా. ఎప్పుడూ రావడం, అలసిపోయానని పడుకోడం. నిన్ను ఇబ్బంది పెట్టకూడదని ఇన్నాళ్లూ నేను ఏమీ అడగలేదు. ఇవాళ పౌర్ణమి. డాబా పైకెళ్లి పడుకొని, కాసేపు కబుర్లు చెప్పుకుందాం” – కమలిని.
తట్టింది, అతడి భుజంపై. లేద్దామనుకున్నాడు. మనసు ఎదురు తిరిగింది. ఆమె నటిస్తోందనీ, తనకు అనుమానం రాకుండా ప్రేమ వొలకబోస్తోందనీ ఊహ.
“ఇప్పుడు కాదు, ఇంకోసారి చూద్దాంలే. నిద్ర ఆగట్లేదు” – శేఖర్. ఆవులించాడు. కళ్లు మూసుకున్నాడు.
కమలినికి తన్నుకొస్తోంది, ఏడుపు. చప్పుడు చెయ్యకుండా డాబా పైకెళ్లి చాపమీద పడుకుంది. ఆమె కన్నీళ్లతో తడిసి దిండు ఉక్కిరిబిక్కిరి.
* * *
ఇప్పుడు కోజికోడ్‌లోని సెంట్రల్ లైబ్రరీకి బానిస శేఖర్. ప్రపంచ సాహిత్యం చదువుతుంటే ఇంకా ఇంకా విశాలమవుతూ మనసు. అక్కడికెళ్లే సమయం చిక్కకపోతే కొట్టాయంలోని పబ్లిక్ లైబ్రరీకెళ్లి ఇంగ్లీష్ పత్రికలు చూస్తున్నాడు.
కొట్టాయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వెన్నిమాల, మాతృమాల అనే కొండ ప్రాంతాలకు వెళ్లి సాయంత్రాలు కాలక్షేపం చేస్తున్నాడు. థామస్ మరింత దగ్గరయ్యాడు. అతను లేకుండా ఒంటరిగా వెళ్లాలనుకున్నప్పుడు లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకాన్ని తీసుకుపోయి, అక్కడ చదువుకుంటుంటే మనసు వెలిగిపోయేది.
కొట్టాయం దగ్గరలోనే ఉన్న తిరునక్కర మహాదేవ ఆలయం (శివాలయం)కు అప్పుడప్పుడూ వెళ్లొస్తున్నాడు.
అక్కడ మరో రెండూళ్లు తెగ నచ్చేశాయ్. ఒకటి కల్లర, రెండు రామాపురం. కల్లరలో ఎటు చూసినా యేర్లు, వరిపొలాలు, ప్రాచీన గుళ్లు, చర్చిలు. ఎళుమంతురూత్ యేటిలో పడవపై ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మైమరచిపోయాడు.
రామాపురం ఓ చారిత్రక స్థలం. రామాపురత్తు అనే యోధుడి జన్మభూమి. ప్రఖ్యాత మలయాళ రచయిత్రి లలితాంబిక నివసించిన ఊరు. అక్కడ రామాలయం ఉంది. ఆ గుడికి చుట్టూ మూడు కిలోమీటర్ల దూరంలో భరత, లక్ష్మణ, శతృఘ్న గుడులున్నాయి. అన్నింటినీ దర్శించాడు. లలితాంబిక రాసిన ఏకైక నవల ‘అగ్నిసాక్షి’ ఫేమస్ అనీ, దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వొచ్చిందనీ తెలుసుకొని, దాని ఇంగ్లీష్ అనువాదం చదివాడు.
“ఏమిటి విషయం?” – థామస్, ఒక రోజు.
“ఏ విషయం?” – శేఖర్.
“సెలవులు వొస్తున్నా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నావ్. పుస్తకాలు తెగ తిరగేస్తున్నావ్. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చుట్టబెట్టేస్తున్నావ్. ఏంటి కత?” – థామస్.
బలహీనంగా నవ్వుతూ, మౌనంగా శేఖర్.
“నువ్వెళ్లకపోతే పోయావ్. నీ వైఫ్‌నైనా తీసుకొచ్చేయొచ్చుగా. నువ్విక్కడ, ఆమేమో అక్కడ. ఏం బాలేదు. ఇట్లా ఎంత కాలం?” – థామస్.
“ఆమె కూడా అదే అంటోంది. చూడాలి” – శేఖర్.
థామస్ ఇక పొడిగించలేదు. నిజానికి అతను శేఖర్‌తో మాట్లాడాలనుకున్నది ఆ విషయం కాదు.
“శేఖర్, నేను ‘నవజీవన్’ అనే ఓ సేవా సంస్థను ప్రారంభించాలనుకుంటున్నా. దానికి నా స్నేహితులు, సన్నిహితుల నుంచి సహకారం ఉంటే సక్సెస్‌ఫుల్‌గా చేస్తాననే నమ్మకం ఉంది” – థామస్.
“నవజీవనా. బాగుంది. దానితో ఏం చేద్దామని?” – శేఖర్.
“అనాథలు, శారీరక, మానసిక వికలాంగులు ఎంతోమంది అనారోగ్యాలతో సరైన వైద్యం లభించక చచ్చిపోతున్నారు. అలాంటి వాళ్లకు మన హాస్పిటల్లోనే ట్రీట్‌మెంట్ ఇప్పించి, ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది నా ఉద్దేశం. కేవలం వైద్యమే కాదు, వాళ్లకు ప్రేమానురాగాల్నీ అందించాలి. తద్వారా వాళ్లకు అందరిలా జీవితాన్ని కొనసాగించే ఏర్పాటు చెయ్యాలనేది నా సంకల్పం” – థామస్.
“ఎంత గొప్ప సంకల్పం!” – శేఖర్, అప్రయత్నంగా.
అతనిలో చాలా సంభ్రమం. ఇట్లాంటి ఆలోచన థామస్‌కు ఎట్లా వొచ్చింది? తనేమో సొంత సమస్యతో తెగ సతమతమైపోతూ, దాన్నుంచి ఎట్లా బయటపడటమా అని ఆలోచిస్తుంటే, థామస్ నలుగురికీ మంచి చేసే పని గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచన రావడం సరే, దాన్ని ఆచరణలోకి తీసుకు రావాలంటే ఎంత శ్రమ చెయ్యాలి! ఎంత ఓపిక కావాలి!!
“ఆలోచనదేముంది శేఖర్. ఆచరణ ముఖ్యం. వాళ్ల వైద్యానికి అయ్యే ఖర్చును భరించాలి. అందుకోసం నా జీతంలో పాతిక వంతును దీనికోసం కేటాయించాలని నిర్ణయించుకున్నా. పైగా ఇక్కడున్నంత కాలం వాళ్లకు ఆహారాన్ని ఏర్పాటుచేయడం కూడా ప్రధానమే. అందుకే నిత్యాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాలి. ఇప్పటికే కొంతమంది నెలనెలా కొంత విరాళంగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అంతేకాదు. మన నర్సింగ్ కాలేజీ స్టూడెంట్స్, మెడికల్ స్టాఫ్ కూడా ఖాళీ టైంలో పేషెంట్స్‌కు ఉచితంగా సేవ చేస్తామని మాటిచ్చారు” – థామస్.
అతని ముందు తాను మరుగుజ్జు అయిపోయిన భావన శేఖర్‌లో.
“నువ్వు తలపెట్టింది చిన్న పనికాదు థామస్. నీకు సంసారముంది. పిల్లలున్నారు. సొంత కుటుంబం చూసుకోడానికే కష్టమైపోతోందని అందరూ చెబుతుంటారు. అట్లాంటిది ఇతరుల కోసం ఇంత పెద్ద పని తలకెత్తుకోడం, దాని కోసం టైం కేటాయించడం మామూలు విషయం కాదు. దానికి ఎంతో గొప్ప మనసు కావాలి. నీది ఖచ్చితంగా గొప్ప మనసు. నీకు నేనెలా ఉపయోగపడగలనో చెప్పు. తప్పకుండా చేస్తా” – శేఖర్.
థామస్ మొహంపై నవ్వు. “మరీ అంతగా పొగడకోయ్. ఇది నేనొక్కణ్ణే చేస్తున్నానా. చాలామంది సాయం తీసుకుంటున్నా. నువ్వనుకుంటున్నట్లు ఇది ఇప్పటికిప్పుడు నాలో కలిగిన ఆలోచన కాదు. నేను కుర్రాడిగా ఉన్నప్పట్నించీ ఉన్నదే. ఓ రోజేమైందో తెలుసా? మా నాన్నకు విపరీతమైన కడుపునొప్పి వొచ్చింది. మా ఊళ్లో ఆస్పత్రి లేదు. జిల్లా ఆస్పత్రికెళ్లాలంటే పది కిలోమీటర్లు ప్రయాణించాలి. నాన్నను బస్సులో తెచ్చేసరికి హాస్పిటల్ మూసేశారు, టైం అయిపోయిందని. ఆ రోజంతా ఆస్పత్రి వరండాలోనే ఉన్నాం. కడుపునొప్పితో విలవిల్లాడుతున్న నాన్నను పరీక్షించిన డాక్టర్ వెంటనే ఆపరేషన్ చెయ్యాలన్నాడు. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు మా వద్ద లేదు. ఈ విషయం తెలుసుకొని హాస్పిటల్లో ఉన్న పేషెంట్సే తలా కొంచెం చందాలు వేసుకొని ఆదుకున్నారు. మానవత్వాన్ని ఆ రోజు నేను ప్రత్యక్షంగా చూశా. అప్పుడే అనుకున్నా. ఆపదలో ఉన్న పేషెంట్స్‌ను ఎలాగైనా ఆదుకోవాలని. ఇప్పటికి అది కొలిక్కి వొచ్చింది. సరే.. ఈ పనిలో నువ్వెలా భాగం కావాలనుకున్నా సంతోషమే. డబ్బు సాయం చెయ్యొచ్చు. అనాథలను హాస్పిటల్‌కు తేవడంలో మాకు తోడ్పాటునీయొచ్చు” – వివరంగా, థామస్.
“రెండూ చేస్తా. నీకేమైనా అభ్యంతరమా?” – మనస్ఫూర్తిగా, శేఖర్.
‘నవజీవన్’ పని మొదలైంది. మొదటి రోజు అన్నదానానికి కిలో బియ్యం సరిపోయింది. నెల రోజులు గడిచేసరికి అది పది కిలోలకు పెరిగింది. రోగుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన వాళ్ల కోసం ఓ అద్దె ఇల్లు తీసుకున్నారు. దానికి ‘నవజీవన్ భవన్’ అనే పేరు పెట్టారు. ఇప్పుడు శేఖర్‌కు ఖాళీ సమయం ఉండట్లేదు. హాస్పిటల్ డ్యూటీ అవగానే నవజీవన్ భవన్‌కు వొచ్చేస్తున్నాడు.
జబ్బు నయం అయిన అనాథ పిల్లలను ఎర్నాకుళంలోని శిశుభవన్‌కు తీసుకెళ్లే బాధ్యతను అతనే చూసుకుంటున్నాడు. ఈ పనిలో పడి రెండు నెల్లపాటు హైదరాబాద్ రావడానికి అతనికి వీలు చిక్కలేదు.
* * *
రోజురోజుకూ పెరిగిపోతోంది, కమలిని మనసులో అశాంతి. శేఖర్ ప్రవర్తనతో పిచ్చిపడుతుందేమో అన్నట్లుంది. తన విషయం అతడికి తెలిసిపోయిందనే నమ్మకం గట్టిపడింది. అంతకు ముందే దూరం పెట్టేసింది శ్రీనాథ్‌ను.
ఒకసారొచ్చి “ఏమైంది నీకు? పద. స్వాగత్‌కు వెళ్దాం. నీ బాధేంటో చెబ్దువు గానీ” – శ్రీనాథ్.
“ముందు ఇక్కణ్ణించి వెళ్లు. పిచ్చి తలకెక్కి ఇంతదాకా నీతో తిరిగింది చాలు. ఇంకొంచెంసేపు ఇక్కడే ఉన్నావంటే అల్లరి పెడుతున్నావని గోలచేస్తా” – కమలిని, స్థిరంగా.
‘నువ్వూ, నేనూ కలిసి తిరగడం ఇక్కడివాళ్లకంతా తెలుసు. గోల చేసుకో. ఎవరూ నమ్మరు’ అందామనుకున్నాడు. ఆమె మొహంలోని నిజాయితీ ఆపేసింది. తనను ఇంతదాకా శారీరకంగా ఆమె హద్దుల్లోనే ఉంచిందన్న నిజం జ్ఞాపకమొచ్చింది. ఆమె వొంక అలాగే కొన్ని క్షణాలు చూసి, మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు.
అతడు తనకు కొనిచ్చిన వస్తువులన్నింటినీ అతడింట్లో పడేసి వొచ్చింది కమలిని.
* * *
2002 ఆగస్ట్ 7. ఉదయం నుంచీ ఒకటే వాన ముసురు. గద్దర్ ఇంటి ముందు ఆగింది ఆటో. కమలిని దిగింది. ఆ టైంలో ఇంట్లోనే గద్దర్. హాల్లో నలుగురైదుగురు రచయితలు, కవులు. అప్పటి రాజకీయాల గురించీ, సాహిత్యం గురించీ చర్చ. మధ్యమధ్యలో గద్దర్‌తో పాటు ఇంకో కవి నోటివెంట ఆశువుగా పాటలు. ఎవరో యువతి గబగబా గేటు తీసుకుని రావడం హాల్లోంచి చూశాడు గద్దర్. తలుపు తెరిచే ఉంటంతో నేరుగా హాల్లోకొచ్చి గద్దర్‌కు నమస్కారం పెట్టింది కమలిని.
“దండాలు తల్లీ. ఎవరమ్మా నువ్వు. అట్లా కూర్చో” – చాప చూపిస్తూ, గద్దర్.
అక్కడున్నోళ్లంతా చాపలపైనే కూర్చుని ఉన్నారు. ఆమెకు గద్దర్ తప్ప మిగతా వాళ్లెవరూ తెలీదు. కమలినిలో మొహమాటం. గమనించాడు గద్దర్.
“వీళ్లంతా మనవాళ్లేనమ్మా. మంచి రచయితలు, కవులు. మొహమాటపడకుండా చెప్పు” – గద్దర్.
“నా పేరు కమలిని అండీ. మీరంటే మా ఆయనకు చాలా ఇష్టం” – కమలిని.
“అవునా. ఎవరు మీ ఆయన?” – గద్దర్.
“శేఖర్. మీరప్పుడు నిమ్స్ హాస్పిటల్లో ఉంటే మిమ్మల్ని చూసొచ్చిందాకా నిలవలేకపోయాడండీ” – కమలిని.
“మంచిది తల్లీ. ఎందుకొచ్చావో చెప్పు. ఆ పోరగాడికేమీ కాలేదు కదా. అతను లేకుండా ఒక్కదానివే వొచ్చావంటే ఏదో పెద్ద గడబిడ అయ్యుంటుంది” – గద్దర్.
ఏడుపు తన్నుకొచ్చింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
“ఈ తల్లికి నిజంగానే ఏదో కష్టమొచ్చినట్టుంది గద్దరన్నా. ఫర్లేదు చెల్లెమ్మా. మేమంతా నీ అన్నల్లాంటోళ్లమే. నీ బాధేందో చెప్పరాదే” – ఒకతను.
“గోరటి ఎంకన్న పేరు వినుంటావులే తల్లీ. ఇతనే ఆ ఎంకన్న. చెప్పు బిడ్డా. శేఖర్ ఏడున్నాడు?” – గద్దర్.
ధైర్యం తెచ్చుకొని పది నిమిషాల్లో తన కథంతా చెప్పింది.
“నేను తప్పుచేశాను. దాన్ని దిద్దుకోవాలనుకుంటున్నా. ఎలాగో తెలీడం లేదు. రెండు నెలలు దాటిపోయింది. మనిషి రావట్లేదు. నాలుగైదు రోజుల క్రితం ఫోన్‌చేసి అడిగితే వొస్తానన్నాడు. అతను రాలేదు కానీ మనియార్డర్ వొచ్చింది. తను నా మొహం చూడ్డానిక్కూడా ఇష్టపడట్లేదని అర్థమైంది. నాకు శేఖర్ కావాలి. అతనెక్కడెంటే నేనూ అక్కడే. అతన్ని ఇంకెప్పుడూ కష్టపెట్టే పని చెయ్యను. ఆ విషయం నేను చెబితే నమ్మడు. మీరు చెబితే నమ్ముతాడు. మీరు ఆయనకు దేవుడికిందే లెక్క. అందుకే వెతుక్కుంటూ మీ వద్దకొచ్చాను” – కమలిని.
రెండు మూడు నిమిషాల నిశ్శబ్దం. గద్దర్ వద్దకు ఈ రకమైన పంచాయితీ ఇదివరకెప్పుడూ రాలేదు. కమలిని గొంతులో, మొహంలో నిజాయితీ తోచింది అందరికీ.
“అన్నా, ఈ బిడ్డ చేసిన తప్పు తెలుసుకుంది. ఇక నుంచీ మంచిగా ఉంటానంటోంది. సాయం చెయ్యన్నా” – వెంకన్న.
గద్దర్ నవ్వాడు. కమలిని తలమీద చేయేసి “నిజం నిన్ను నీడగా వెంటాడుతున్నదే తల్లీ. ఇవాళ నువ్వే కాదు, ఎంతోమంది మార్కెట్ మాయలోపడి విలాసాలకు బానిసలవుతున్నారమ్మా. జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అనుబంధాల్నీ, ఆత్మీయతల్నీ విస్మరిస్తున్నారు. నువ్వు చాలా త్వరగానే నీ తప్పు తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. శేఖర్ సంగతి నేను చూసుకుంటా. అన్నంతినెళ్లు తల్లీ” – గద్దర్.
* * *
మరోసారి ఆగస్ట్ 15కి. తెల్లవారితే 16.
ఒంటిమీదున్న రగ్గుతీసి అవతలకు నెట్టాడు శేఖర్. ఒళ్లంతా చెమట్లు. పక్కకు చూశాడు. కమలిని లేదు. లేచాడు. విపరీతమైన నీరసం. గద్దర్ ఫోన్ చేయడం, రాత్రి తను రావడం, కమలిని తనకు సపర్యలు చెయ్యడం.. అన్నీ జ్ఞాపకానికొచ్చాయి. ఆమె కన్నీటి చుక్క తన చేతిపైపడ్డం జ్ఞాపకానికొచ్చింది. ఆమె తప్పు తెలుసుకుందా? పశ్చాత్తాపపడుతోందా? లేక తన స్థితికి బాధపడుతోందా? ఆమె దుఃఖానికి రెండూ కారణమేనా?
మంచం మీంచి దిగాడు. ముందు గదిలో వెల్తురు. చప్పుడు చెయ్యకుండా కిటికీ రెక్కను నెమ్మదిగా తెరిచాడు. కింద కూర్చొని పేపర్‌పై ఏదో రాస్త్తూ, కమలిని. మధ్య మధ్య కళ్లు తుడుచుకుంటూ…
ఆ ఒక్క దృశ్యం.. ఆ ఒకే ఒక్క దృశ్యం.. ఎన్నో విషయాలు చెప్పింది. సందేహమే లేదు. ఈ కమలిని, మునుపటి కమలిని కాదు. తన కమ్ము!
ఆమెపై ప్రేమ ఉప్పెనలా తోసుకువొస్తుంటే.. తన కళ్లు తడవటం అతడు గమనించలేదు. ఒళ్లు స్వాధీనంలో లేని విషయం పట్టించుకోలేదు. తలుపు తోశాడు. “కమ్మూ!” అంటా ఒక్క ఊపున వెళ్లాడు. ఆమెలో ఉలికిపాటు. రాస్తున్న పేపర్‌ను దాచబోయింది, కంగారుగా. పేపర్ ఆమె మాట వినలేదు. చేతిలోంచి జారి కిందకి.
ఆమె తియ్యబోతుంటే, చటుక్కున దాన్నందుకున్నాడు. ఆమె కన్నీళ్లతో తడిసిన ఆ పేపర్‌లోని అక్షరాల వెంట అతని కళ్లు పరుగులు.
“శేఖర్ నన్ను క్షమించు. నీకు తీరని ద్రోహం చేశాను. నువ్వెంత మంచివాడివి. నాపై ఎంత ప్రేమ చూపావు. కానీ నేను ఆడంబరాల్లో, షోకుల్లో సుఖముందనే భ్రమల్లో మునిగాను. నీ ప్రేమను నిర్లక్ష్యం చేశాను. ఎండమావుల వెంట పరుగులు పెట్టాను. నా సంగతి తెలిసి కూడా తెలియనట్లు ఉంటున్నావని అర్థమైంది. నీ స్థానంలో ఇంకెవరున్నా అదే రోజు నాతో తెగతెంపులు చేసుకునేవాడు. లేదంటే ఆ చెంపా, ఈ చెంపా వాయించేవాడు. నీది అతి మంచితనం. నేను దారి తప్పుతున్నానని తెలిసి కూడా ఆ బాధను నీలోనే దాచుకొని, ఎంతగా కుమిలిపోతున్నావో, ఎంత నరకయాతన అనుభవిస్తున్నావో. ‘ఇట్లాంటిదాన్నా.. నేను ప్రేమించి పెళ్లి చేసుకుందీ’ అని ఎంతగా వేదన చెందుతున్నావో. నీ బాధ, వేదన న్యాయమైనవి. మానసికంగా నిన్నెంత క్షోభపెట్టానో తలచుకుంటుంటే నాపై నాకే పరమ అసహ్యం వేస్తోంది. నిజమైన సుఖమేమిటో, ప్రేమేమిటో తెలిసేసరికి నువ్వు నాకు చాలా దూరమైపోయావ్. నేను తప్పు చేశాననేది నిజం. కానీ నేను వ్యభిచారం చెయ్యలేదు. నీతో జరగని సరదాలను తీర్చుకోవాలనుకున్నానే కానీ ఈ శరీరాన్నీ, మనసునీ నీకు తప్ప ఇంకెవరికీ అర్పించలేదు. సంజాయిషీ కోసం ఈ సంగతి చెప్పడం లేదు. నీకు నిజం తెలియాలనే చెబుతున్నా. ఇదే సంగతి నువ్వు అభిమానించే గద్దర్‌గారికి చెప్పి, కొంత ఉపశమనం పొందాను. ఆయన మాటతోనే ఇప్పుడు నువ్వొచ్చావని తెలుసు. కానీ ఇందాక నువ్వు పలవరించినప్పుడు అర్థమైంది, నీ హృదయం ఎంతగా గాయపడిందో, ఎంతగా క్షోభించిందో. ‘కమ్మూ, ప్రేమ అంటే నమ్మకం, ప్రేమ అంటే భరోసా అనుకున్నా. నువ్వేమో డబ్బులోనూ, ఆడంబరాల్లోనూ, సరదాలు, షికార్లలోనూ ప్రేమ ఉందనుకుంటున్నావ్. నన్నేందుకు మోసం చేశావ్?’ అని నిద్రలోనే అడిగావ్. నీతో కలిసి బతికే అర్హత నాకులేదని అర్థమైంది. అందుకే…”
అంతవరకే రాసింది. ఆ తర్వాత కన్నీటి చుక్క పడ్డట్లు తడిసింది పేపర్. కమలిని వొంక చూశాడు శేఖర్. తల అవతలకు తిప్పుకొని ఉంది, తన మొహం అతడికి చూపించే ధైర్యంలేక.
తన ప్రమేయం ఏమీ లేకుండానే, తనేమీ అనకుండానే ఆమె తన తప్పు తెలుసుకుంది. కమలిని ఇప్పుడు మారిన మనిషి. ఆమెకు ఏం చేస్తే ఆనందం కలుగుతుందో అది చెయ్యలేడా?
ఆమె ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. ఆమె తలను చేతుల్లోకి తీసుకున్నాడు. “కమ్మూ, నన్ను వొదిలిపెట్టి నీ దారిన నువ్వు పోదామనుకుంటున్నావా? నేనేమైపోవాలనుకున్నావ్?” అంటా ఆమె పెదాలపై, నుదుటిపై ముద్దుపెట్టుకున్నాడు. తడిసిన కన్నులను పెదాలతో అద్దాడు. కన్నీటి చుక్కలు ఉప్పగా ముద్దాడాయి. రెండు చేతులూ అతడి వీపు వెనుగ్గా పోనిచ్చి మళ్లీ ఎవరైనా తమను వేరు చేస్తారేమోననే భయం ఉందేమో అన్నట్లుగా గట్టిగా, బలంగా శేఖర్‌ను వాటేసుకుంది కమలిని.

- సారంగ అంతర్జాల వారపత్రిక, 25 ఫిబ్రవరి 2015
Saturday, August 30, 2014
Short Story: Sarangi Vadyagadu Maa Mavayya
కథ:
సారంగి వాద్యగాడు మా మావయ్య
మా మావయ్య సారంగి మా గొప్పగా వాయిస్తాడు. మావయ్యంటే మా అమ్మకి అన్న. మావయ్యకు సంగీతమంటే ప్రాణం. ఉద్యోగం నిమిత్తం ఉత్తరప్రదేశ్‌కి పోయినప్పుడు జహీర్‌ఖాన్ అనే ఆయన దగ్గర సారంగి వాద్యం నేర్చుకొన్నాడు. సారంగి మీద వయొలిన్ స్వరాలు కూడా పలికించే మొనగాడు మా మావయ్య. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. నేనింకా హైస్కూలుకు వెళ్లకముందే మా అత్తయ్య చనిపోయింది. దాంతో కూతుళ్లిద్దర్నీ తనే తల్లీ తండ్రీ అయ్యి ఏ లోటూ లేకుండా పెంచాడు మావయ్య. బాగా చదువు చెప్పించాడు. అయితే చీరాల్లో పనిచేస్తున్నప్పుడు ఆయన పెద్ద కూతురు వినీల ఇంట్లోంచి వెళ్లిపోయింది. వెళ్లిపోయిందంటే మనవాళ్లు సాధారణంగా అంటుంటారే.. 'లేచిపోయింది' అనీ.. అలా అన్నమాట. చీరాల్లోనే ఉండే ఒక డబ్బున అబ్బాయి ప్రేమలో పడి, పెద్దవాళ్లకు చెప్పా పెట్టకుండా గుళ్లో పెళ్లిచేసుకొని అతనితో వెళ్లిపోయింది. అప్పుడు మావయ్య ఎంత బాధపడ్డాడో. తన ప్రాణం పోయినట్లే విలవిల్లాడాడు. కొద్ది రోజులు ఎవరితోనూ.. అఖరుకి తన చిన్న కూతురు భావనతోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. పలకరించడానికి వెళ్లిన మా అమ్మతో "అదేంది అట్లా చేసింది? తల్లిలేని పిల్లలు కదా అన్జెప్పి వాళ్లని ఎండకి కందకుండా ఎట్లా పెంచాను. నా పరువిట్లా తీసుద్దని అనుకోలేదు" అన్నాడు.అమ్మ "దానికి నువ్వేం చేస్తావులే అన్నయ్యా. నీ మీద గౌరవం ఉంటే అది ఈ పని ఎందుకు చేసుద్ది? నువ్వు దిగులు పెట్టుకోమాక" అని సముదాయించబోతే, "ఆడెవడో దానికి మాయమాటలు చెప్పి తీసకపొయ్యాడు. అది తప్పకుండా ఎప్పటికైనా వొచ్చుద్ది చూడు" అన్నాడు కూతుర్ని వెనకేసుకొస్తా. అమ్మ బిత్తరపొయ్యింది. ఆ తర్వాత చాలా మంది మావయ్యతో వినీల చాలా సంతోషంగా ఉందనీ, ఆమె మాంగారు బాగా ఉన్నోళ్లనీ, మీ అల్లుడు శానా మంచోడనీ చెప్పేతలికి "మంచోడైతే నాకు చెప్పి పెళ్లి చేసుకుంటాడు కానీ ఇట్టా లేవదీసుకపోతాడా" అని పైకని, లోపల్లోపల చాలా సంతోషపడ్డాడు. వినీల సంగతి వాళ్లు ఒకటి చెబితే, ఇంకో రెండు సంగతులడిగి, గోడకి తగిలించిన మా అత్తయ్య పటం ముందు నిల్చొని "ఏమనుకోమాక. అప్పుడది అట్టాంటి పన్జేసిందని తిట్టా. ఇప్పుడది సుఖంగా ఉందని తెలిశాక కూడా తిడ్తానా. దాన్సుఖమే కదా నాకు కావాల్సింది. నీకు సంతోషమే కదా" అన్నాడు.
కొన్ని నెలలు గడిచిపొయ్యాయి. ఒకరోజు మా అమ్మతో "పెద్దదాని బాధ్యత తీరిపోయింది. అది సుఖంగా ఉంది అంతే చాలు. రెండో దానికి ఓ మంచి సంబంధం చూసి చేస్తే ఇంక నాకే దిగులూ ఉండదు" అన్నాడు మావయ్య. ఆ సంగతి నాకు చెప్పిందమ్మ. ఆ తర్వాత రోజే ఆదివారం రావడంతో నేను మావయ్య వాళ్లింటికెళ్లా. నన్న్ను చూడ్డంతోటే భావన కళ్లు మెరిశాయి. నాకు తెలుసు భావనకి నేనంటే ఎంతిష్టమో. "మావయ్యా, నేను భావనని పెళ్లి చేసుకుంటా" అని చెప్పేశా. మామూలుగా అయితే ఎవర్నన్నా మధ్యవర్తుల్ని పంపించి సంబంధం అడిగిస్తుంటారు. సొంత బంధువులైనా సరే. నాకట్లా చెయ్యడం ఇష్టం లేదు. అందుకే డైరెక్టుగా చెప్పేశా. అప్పుడు మావయ్య కళ్లు వెలిగాయి.
"ఏరా రాఘవా. నిజంగానే అంటున్నావా, తమాషా చేస్తున్నావా?" అనడిగాడు మావయ్య. ఎందుకంటే ఇప్పుడు ఆయనకంటే మాకు ఆస్తులెక్కువ. మా నాన్న బట్టల వ్యాపారంలో బాగా సంపాదించాడు. చీరాల్లో మాకు రెండు బట్టల దుకాణాలున్నాయి. వాటిలో ఓ షాపుని నన్ను చూసుకొమ్మని నాన్న చెప్పాడు కానీ, నాకు ఇష్టం లేక రైల్వేలో ఉద్యోగం చేస్తున్నా.
"పెళ్లి విషంలో కూడా తమాషా చేస్తానా మావయ్యా. నాకు భావన అంటే ఇష్టం. తనకీ ఇష్టమైతే చేసుకుంటా" అన్నా, అక్కడే ఉన్న భావన వంక ఆరాధనగా చూస్తా. మావయ్య భావన వంక చూశాడు. అప్పుడు భావన "రాఘవని చేసుకోవడం నాకిష్టమే" అంది, కొంచెం సిగ్గుపడతా. మావయ్య మా పెళ్లిని మా గొప్పగా చెయ్యాలని నిర్ణయించుకొన్నాడు. పెద్ద కూతురి పెళ్లి తానెలాగూ చెయ్యలేకపోయాడు కాబట్టి ఈ చివరి పెళ్లినైనా ఘనంగా చెయ్యాలనేది ఆయన కోరిక. నాకేమో సింపుల్‌గా చేసుకోవాలనుంది. కానీ మావయ్య పడనియ్యలేదు.
"పెళ్లనేది జీవితంలో ఒక్కసారే కదరా వొచ్చేది. నాకు ఈ పెళ్లి తప్ప వేరే ఖర్చేముంది? మీ అంత లేకపోయినా నేను సంపాదించింది కూతుళ్లకి గాక ఎవరికియ్యను? దీనికి మాత్రం అడ్డు చెప్పకురా" అన్నాడు బతిమాలుతున్నట్లు.
దాంతో సరేననక తప్పలేదు. చీరాల ఏరియాలోనే ఖరీదైన కల్యాణ మండపాన్ని మాట్లాడాడు మావయ్య. ఇంకొద్ది రోజుల్లో పెళ్లనంగా ఓ మధ్యాహ్నం పూట మావయ్య, భావన బలవంతపెడితే వాళ్లతో పాటు భోజనం చేస్తున్నా. అప్పుడే తలుపు దగ్గిర ఎవరో వచ్చిన అలికిడి.
"ఎవరూ, లోపలికి రండి" అని కేకేశాడు మావయ్య. ఒక స్త్రీ లోపలికొచ్చింది. ముగ్గురం తినడం ఆపి ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టాం. ఆ వొచ్చింది వినీల!
"నాన్నా" అని మావయ్య దగ్గరకొచ్చింది. ఆయనకి నోటెంట మాట రావడం లేదు. చాలాకాలం తర్వాత పెద్దకూతురు కనిపించేటప్పటికి ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తోచనట్లు కట్టెలా ఉండిపోయాడు.
నేనే "మావయ్య ఏంటట్లా మాట్లాడకుండా చూస్తున్నావ్, వినీల వొస్తే" అన్నా ఉండబట్టలేక. అయినా ఆయన్లో ఉలుకూ పలుకూ లేదు. అట్లానే చూస్తున్నాడు వినీల వొంక. భావన "అక్కా, ఎంతకాలమైందే నిన్ను చూసి. యెట్టా ఉన్నావే" అని ఓ చేత్తో వాటేసుకుంది.
అప్పుడు చూడాలి మావయ్య మొహం. ఆనందంతో కళ్లెమ్మట నీళ్లు. "ఇన్నాళ్లకు నాన్నని చూడాలనిపించిందా బంగారు తల్లీ" అని వినీలని దగ్గరకు తీసుకున్నాడు. ఇట్లాంటి ఎమోషనల్ సీన్లని సినిమాల్లో చూడ్డమే కానీ నిజ్జంగా చూడ్డం అప్పుడే నాకు.
నిజం చెప్పొద్దూ.. అప్పుడా తండ్రీకూతుళ్ల సీను చూస్తుంటే నాక్కూడా ఏడుపొచ్చింది కానీ బలవంతాన అపుకున్నా.
"సారీ నాన్నా.. సారీ నాన్నా..." అంతకంటే మాట్లాడలేకపోయింది వినీల. మాతో పాటు తను కూడా తృప్తిగా భోంచేసింది. మా పెళ్లి సంగతి తెలిసి రాకుండా ఉండలేకపోయానంది. భావన, నేను పెళ్లి చేసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.
మా పెళ్లికి ముహూర్తాలు పెట్టారు. మాఘమాసంలో చివరి సోమవారం భావన మెళ్లో మూడు ముళ్లూ వేశా. ఆ పెళ్లికి వినీల, వాళ్లాయనా, ఆమె అత్తామామలు కూడా వొచ్చారు. అప్పుడు మావయ్య ఆనందం అంతా ఇంతా కాదు. వినీల వాళ్లాయన పేరు చంద్రశేఖర్. అతను వినీలను అంటిపెట్టుకునే తిరుగుతున్నాడు. వాళ్లను చూసి "చూడముచ్చటైన జంట" అంది మావయ్యతో అమ్మ. అప్పుడు మావయ్య కళ్లు తృప్తిగా మెరిశాయి. వినీల వాళ్లను చూసి కొంతమంది చాటుమాటుగా చెవులు కొరుక్కుంటున్న సంగతి చూసి కూడా ఆయన పట్టించుకోలేదు. 'అల్లుడి కులమేదైతేనేం, కూతురు సుఖంగా ఉంది. అంతే చాలు' అన్నాడు.
పెళ్లయి పదహార్రోజుల పండగ అయినాక మా అందర్నీ భోజనానికి పిలిచాడు చంద్రశేఖర్. ఆ ఆలోచన వినీలదేనని మా అందరికీ తెలుసు. మావయ్య వెళ్లాలా, వొద్దా అని వొకటే మల్లగుల్లాలు పడ్డాడు. "వెళ్లకపోతే అక్క బాధపడుద్ది నాన్నా. వెళ్దాం" అని పట్టుబట్టింది భావన. నేనూ, అమ్మ కూడా తనను సపోర్ట్ చేశాం.
వినీల వాళ్లింటి దగ్గిర ఊహించనంత మర్యాదలు జరిగాయి. వినీల అత్తామామలు మాపై చూపిన ఆదరంతో మావయ్య అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. అంతదాకా బాగా డుబ్బున్నోళ్లకు తలపొగరు ఉంటుందనీ, తమకంటే తక్కువ స్థాయివాళ్లను చులకనగా చూస్తారనీ నాకూ ఓ అభిప్రాయం ఉండేది. వాళ్లను చూశాక నా అభిప్రాయం సవరించుకున్నా, బాగా ఆస్తిపరుల్లోనూ కొంతమంది మంచివాళ్లుంటారని.
ఆ ఇంట్లోని ప్రతిగదినీ దగ్గరుండి చూపించింది వినీల. అంతసేపూ భావన చేయిపట్టుకునే ఉంది. అన్నీ విశాలమైన గదులు. హాలు సంగతైతే చెప్పనక్కరలేదు. అంత పెద్ద ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండటాన్ని మేం గమనించాం. డైనింగ్ హాల్లోకి వెళ్లాక ఆశ్చర్యపోయాం. అక్కడ పదిమంది కూర్చునేంత పెద్ద టేబుల్ ఉంది. అప్పటికే వాటిపై భోజన ఏర్పాట్లు చేసున్నాయి. పెద్దవాళ్లంతా.. వినీల అత్తామామలు, మా అమ్మానాన్నలు, మావయ్య ఒకేపు కూర్చుంటే, కుర్రాళ్లం.. వినీల, చంద్రశేఖర్, భావన, నేను.. ఇంకోయేపు ఎదురెదురుగా కూర్చున్నాం.
ఆ ఇంట్లో పనివాళ్లయిన ఇద్దరు మొగుడూ పెళ్లాలున్నారు. వాళ్లు ముందుగానే టేబుల్ మీద తొమ్మిది వెడల్పాటి అరిటాకులు వేసి, గాజు గ్లాసులో మంచినీళ్లు పోసి ఉంచారు. భోజన పదార్థాలన్నీ టేబుల్ మధ్యలో ఉంచిన పాత్రల్లో పొగలు కక్కుతున్నాయి, వేడివేడిగా. వినీలే స్వయంగా అందరికీ వడ్డిస్తుంటే చంద్రశేఖర్ ఆమెకు అవీ ఇవీ అందిస్తూ వచ్చాడు. మేం తృప్తిగా, సుష్టుగా భోంచేశాం. భోజనాలయ్యాక అందరం ఇంటిముందున్న చెట్లకింద నీడలో వేసిన కుర్చీల్లో కూర్చున్నాం. కొద్దిసేపటి దాకా అక్కడ వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు కావడం వల్ల కావచ్చు మేం కలివిడిగా ఉండలేకపోతున్నాం. గాలి చల్లగా వీస్తున్నా.. ఏదో అసౌకర్యం.
అప్పుడే వినీలకు చంద్రశేఖర్ దేనికోసమో సైగచేయడం గమనించా. లోపలికి వెళ్లిన వినీల తెచ్చిన వస్తువును చూసి అందరం ఆశ్చర్యపోయాం. అది సారంగి! మావయ్యయితే వెడల్పయిన కళ్లతోటి దానివొంక చూశాడు. ఆ సారంగి కొత్తదని దాని మెరుపు చెబుతోంది. వినీల దాన్ని చంద్రశేఖర్‌కిచ్చింది. వినీల వొంక నవ్వుతా చూసి సారంగి తీగను మీటాడు చంద్రశేఖర్. అది శ్రావ్యంగా మోగింది. మావయ్య ఆశ్చర్యంలో మునిగితేలుతుండగా యమునా రాగంలో ఒక పాత సినిమా పాట పాడుతూ సారంగి వాయిస్తున్నాడు చంద్రశేఖర్. అది మావయ్యకు ఎంతో ఇష్టమైన పాట. ఒక పల్లవీ, ఒక చరణం పూర్తయ్యాయి. ఆ పాట, ఆ వాద్యం తప్ప మరే చప్పుడూ అక్కడ లేదు.
మేం పరిసరాల్ని మర్చిపోయి అతడి పాటనీ, మధురమైన సారంగి వాద్యాన్నీ ఆస్వాదిస్తున్నాం, ఆ ఎండలో నీడపట్టున. అంతలో ఏదో అపశృతి. పాటకూ, వాద్యానికీ లంకెలేకుండా. సంగీత జ్ఞానం లేని మాకు కూడా అది తెలిసిపోయింది. చప్పున మావయ్య "తాళం తప్పింది అల్లుడుగారూ" అన్నాడు అప్రయత్నంగా. చంద్రశేఖర్ చేతిలోని సారంగి ఆగిపోయింది. "మీ వాద్యం వినాలని ఉంది మావయ్యగారూ" అన్నాడు. నాకెందుకో అతను కావాలనే తాళం తప్పాడనీ, మావయ్యచేత సారంగి వాయించడానికి అలా చేశాడనీ అనిపించింది.
"కానియ్ నాన్నా" అంది వినీల మావయ్య బెరుకును పోగొట్టాలని. అప్పుడు మావయ్య ఆ పాటలోని రెండో చరణాన్నీ, పల్లవినీ సారంగి వాయిస్తూ అద్భుతంగా పాడాడు. సారంగి వాద్యంలోని తీయదనాన్ని మాకందరికీ పంచాడు. "సూపర్.. సూపర్‌గా పాడారు మావయ్యగారూ" అని చంద్రశేఖర్ చప్పట్లు కొడితే, మిగతా అందరం అతనితో జత కలిశాం. దాంతో మావయ్య కాస్త సిగ్గుపడ్డాడు. సారంగిని చూస్తూ దాని తీగలు సవరించాడు. చంద్రశేఖర్‌కు దాన్ని తిరిగివ్వబోయాడు. అతను "మీ వద్దే ఉంచండి మావయ్యా. ఇది మీకు నా గిఫ్ట్" అన్నాడు. మావయ్యకు ఆశ్చర్యమూ, ఆనందమూ.. రెండూ కలిగాయి.
"మీరు నాకు కానుక ఇవ్వడమేమిటి అల్లుడుగారూ.. నేనే మీకివ్వాలి. ఇంత గొప్పింటికి నా కూతురు కోడలైనా మీకేమీ ఇవ్వలేకపోయా" అన్నాడు మావయ్య కృతజ్ఞత నిండిన గొంతుతో.
"ఎందుకివ్వలేదు మీరు. పెద్ద కానుకే ఇచ్చారుగా" అన్న చంద్రశేఖర్ మాటలకు అందరం అతనివొంక ఆసక్తిగా చూశాం. అతను వినీల చేయిపట్టుకొని "ఇదుగో ఆ కానుక" అన్నాడు. అతని మంచి మనసుకు మావయ్యతో పాటు మేం కూడా చాలా చాలా సంతోషించాం.
"అవునూ.. మీకు సారంగి ఎలా వొచ్చు?" అడిగా కుతూహలం ఆపుకోలేక.
"నేను ఉస్మానియా యూనివర్శిటీలో చదివేప్పుడు జాహెద్ అనే అతను నాకు మంచి ఫ్రెండ్. వాడిది ఉత్తరప్రదేశ్. వాడి దగ్గర సారంగి ఉండేది. బాగా వాయిస్తాడు. వాడివద్దే ఏదో కొద్దిగా నేర్చుకున్నా. పెళ్లయ్యాక వినీల చెప్పింది, మావయ్యకు సారంగి అంటే బాగా ఇష్టమని. జాహెద్‌కు ఫోన్‌చేశా. ఇది పంపించాడు" చెప్పాడు చంద్రశేఖర్. అప్పుడు మావయ్య కళ్లు చెమర్చకుండా ఉండలేకపోయాయి. చంద్రశేఖర్ రెండు చేతులూ పట్టుకొని "సారీ బాబూ" అన్నాడు.
"ఎందుకు మావయ్యాగారూ?"
"మా అమ్మాయిని నాకు తెలీకుండా, చెప్పకుండా పెళ్లిచేసుకొని తీసుకుపొయ్యావని నిన్ను ఎన్ని మాటలన్నానో. నీ మంచి మనసు చూశాక, నేనెంత తప్పు చేశానో అర్థమైంది."
"లేదు మావయ్యాగారూ. మా ప్రేమ సంగతి మీకు చెప్పకుండా నిజంగా తప్పుచేసింది నేనూ, వినీలా. మీరు మా పెళ్లికి ఒప్పుకోరనే సందేహంతోటే మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. తనను మా ఇంటికి తీసుకుపోయా. అప్పుడు ఓ తండ్రిగా మీరెంత బాధపడి ఉంటారో. మీరే మమ్మల్ని క్షమించాలి."
అదరి హృదయాలూ తేలికైపోయాయి.
ఇప్పుడు మావయ్య మా పిల్లల్నీ, వినీల పిల్లల్నీ దగ్గర కూర్చోబెట్టుకొని ఆ సారంగి వాయిస్తూ, వాళ్లకు నేర్పిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు హాయిగా.
- 4 ఏప్రిల్ 2010, ఆదివారం ఆంధ్రప్రభ
Subscribe to:
Posts (Atom)