Showing posts with label akshay kumar. Show all posts
Showing posts with label akshay kumar. Show all posts

Friday, September 26, 2014

Sunday, May 27, 2012

హారర్ సినిమాలు ఇష్టం


బాలీవుడ్‌లో వరుసగా రెండు యాక్షన్ సినిమాలు డైరెక్ట్ చేసిన ప్రభుదేవా ఇప్పుడు జనాన్ని భయపెట్టే హారర్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. సల్మాన్‌ఖాన్, ఆయేషా తకియా జంటగా రూపొందించిన 'వాంటెడ్' ('పోకిరి' రీమేక్)తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అతను దాని తర్వాత అక్షయ్‌కుమార్, సోనాక్షి సిన్హా జంటగా 'రౌడీ రాథోర్' ('విక్రమార్కుడు' రీమేక్)ను రూపొందించాడు. కొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండూ యాక్షన్ సినిమాలే. "నా కంటే ఎక్కువగా జనం నేను యాక్షన్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. కానీ నాకేమో హారర్ సినిమాలు చేయాలంటే ఇష్టం'' అని తెలిపాడు ప్రభుదేవా. దక్షిణాదిలో కానీ బాలీవుడ్‌లో కానీ టీమ్ బాగుండటం ముఖ్యమనీ, టీమ్ బాగుంటే చివరకు ఓ స్పానిష్ సినిమానైనా తీసేయొచ్చనీ అతనంటాడు.
ఒరిజినల్‌లో రవితేజ చేసిన పాత్రకు 'రౌడీ రాథోర్'లో అక్షయ్‌కుమార్ సరిగ్గా సరిపోయాడనేది అతని అభిప్రాయం. "అతనికి టైలర్‌మేడ్ కేరక్టర్ కావడం వల్లే అక్షయ్‌ను ఆ పాత్రకు ఎంచుకున్నా. అతనేవిధంగా చేశాడో తెరపై మీరే చూస్తారు. అతనితో పనిచేయడం గొప్పగా భావిస్తున్నా. అతను దర్శకుడి నటుడు'' అని చెప్పాడు ప్రభుదేవా.

Friday, May 25, 2012

అసిన్ హ్యాట్రిక్ హిట్?

బాలీవుడ్‌లో రెండు వరుస హిట్లు సాధించిన అసిన్ హ్యాట్రిక్ హిట్ మీద కన్నేసింది. ఆమె హీరోయిన్‌గా నటించిన 'రెడీ', 'హౌస్‌ఫుల్ 2' ఒకదాన్ని మించి ఒకటి ఘన విజయం సాధించాయి. రానున్న 'బోల్ బచ్చన్' కూడా హిట్టయితే హ్యాట్రిక్ పూర్తవుతుందనేది ఆమె ఆశ. ఇవన్నీ కామెడీలు కావడం గమనించదగ్గ అంశం. "సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్ వంటి స్టార్లు ఉండటం 'రెడీ', 'హౌస్‌ఫుల్ 2' సినిమాలకు బాగా ఉపయోగపడింది. 'బోల్ బచ్చన్'లో అజయ్ దేవగన్ ఉన్నాడు. అన్నిటికీ మించి ఇది సందర్భానుసారం నడిచే కామెడీ సినిమా. ఇలాంటి సినిమాలకి అసిన్ సరిగ్గా సరిపోతుంది'' అని తెలిపారు ఓ ట్రేడ్ విశ్లేషకుడు. అయితే ఇవి కామెడీ సినిమాలైనా ఒకదానికొకటి భిన్నమైనవి. 'హౌస్‌ఫుల్ 2'లో ఉన్నది స్లాప్‌స్టిక్ కామెడీ అయితే, 'బోల్ బచ్చన్' సిట్చువేషనల్ కామెడీ అనీ, ఈ రెండు సినిమాల్లో భిన్నమైన బాడీ లాంగ్వేజీతో నటించాననీ అసిన్ తెలిపింది. ఈ రెండు కామెడీలు ఒకదానికొకటి భిన్నమైనవైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఒకే విధమైన ఫలితాన్ని చూపిస్తాయని ఆమె నమ్ముతోంది. డైరెక్టర్ రోహిత్‌శెట్టితో అజయ్ దేవగన్ కాంబినేషన్ ఇప్పటివరకు సూపర్ సక్సెస్ అవడం కూడా ఈ సినిమాపై అసిన్ నమ్మకానికి ఓ కారణం.