Showing posts with label surender reddy. Show all posts
Showing posts with label surender reddy. Show all posts
Friday, August 21, 2015
Tuesday, December 23, 2014
Saturday, November 30, 2013
Tuesday, July 9, 2013
Saturday, October 15, 2011
బిగ్ స్టోరీ: హవా తగ్గిన పరభాషా దర్శకులు!
ఇంతకాలం తెలుగు సినిమాల్లో పరభాషా నాయికలు, పరభాషా విలన్లతో పాటు పరభాషా దర్శకుల హోరు ఎక్కువయ్యిందని వాపోతూ వచ్చాం. తెలుగు వాళ్లని పట్టించుకోవడం లేదని బెంగపడుతూ వచ్చాం. ఇప్పుడు ఆ బాధ దర్శకుల విషయంలో పడాల్సిన అవసరం లేదు. మళ్లీ మన దర్శకులకి రోజులొచ్చాయి. ఎస్.ఎస్. రాజమౌళి, పూరి జగన్నాథ్, వి.వి. వినాయక్, శ్రీను వైట్ల, త్రివిక్రం, సుకుమార్, సురేందర్‌రెడ్డి, సంపత్ నంది, శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకులు రాణిస్తుండటంతో ఇతర భాషల నుంచి వచ్చే దర్శకుల తాకిడి ఇటీవల తగ్గింది. కొంత కాలం క్రితం తెలుగు దర్శకులపై కంటే ఇతర భాషా దర్శకులపైనే మన హీరోలు, నిర్మాతలు నమ్మకం పెట్టుకున్నట్లు కనిపించింది. తమిళ కథలు, తమిళ దర్శకులే శరణ్యమన్నట్లు మన హీరోలు, నిర్మాతలు అప్పట్లో వ్యవహరించారు. ప్రస్తుతం టాప్ హీరోల్లో పవన్‌కల్యాణ్, ప్రభాస్ మాత్రమే తమిళ దర్శకులతో పనిచేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విష్ణువర్థన్ 'పంజా' తీస్తుంటే, ప్రభాస్‌తో రాఘవ లారెన్స్ 'రెబల్' తీస్తున్నాడు.
ఇదివరలో తెలుగులో మంచి డిమాండ్ ఉన్న పి. వాసు, విక్రమన్, సురేశ్‌కృష్ణలను ఇప్పుడు తెలుగు హీరోలెవరూ పట్టించుకోవడం లేదు. 'ఏ మాయ చేసావె' హిట్ తర్వాత కూడా గౌతం మీనన్ వెంట మన వాళ్లెవరూ పడటం లేదు. 'ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే' హిట్ తర్వాత కూడా సెల్వరాఘవన్ మళ్లీ తెలుగు వైపు దృష్టిపెట్టలేదు. 'సత్యం'తో ధూంధాంగా తెలుగులోకి వచ్చిన మలయాళీ సూర్యకిరణ్‌ని ఎవరూ పట్టించుకోవడం లేదు. 'ప్రియమైన నీకు', 'అమ్మాయి బాగుంది' సినిమాల దర్శకుడు బాలశేఖరన్ ఏమయ్యాడో తెలీదు. 'నాని', 'పులి' సినిమాల ఫెయిల్యూర్‌తో ఎస్.జె. సూర్య పత్తాలేకుండా పోయాడు. తెలుగులోనే దర్శకత్వంలో ఓనమాలు దిద్దుకున్న బొమ్మరిల్లు భాస్కర్ తమిళుడైనా అతన్ని తెలుగువాడిగానే ట్రీట్ చేయాలి. తమిళం వైపు చూపు సారించకుండా తెలుగులోనే కెరీర్ వెదుక్కుంటున్న కరుణాకరన్‌కూ మినహాయింపు ఇవ్వొచ్చు.
ఓ వైపు హీరోయిన్లు, ఇంకోవైపు విలన్లు, సైడు విలన్లు, కేరక్టర్ ఆర్టిస్టులు, మరోవైపు రీమేక్‌లు తెలుగు సినీ పరిశ్రమపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటే సృజనాత్మక రంగమైన దర్శకత్వం కూడా దిగుమతికి గురికావడం తెలుగు సినీరంగంలోని భావ దారిద్ర్యాన్ని పట్టిస్తున్నదని నిన్నటిదాకా బాధపడినవాళ్లు ఇప్పుడు ఒకింత ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్నటి స్థితిపై "తెలుగు సినిమా చూస్తే ఏమున్నది గర్వకారణం... సమస్తం పరభాషా వాసనమయం" అంటూ శ్రీశ్రీని అనుకరిస్తూ మాట్లాడిన కవులు ఇప్పుడు తెలుగు దర్శకులకి మంచి రోజులు రావడంతో ఖుషీ అవుతున్నారు.
తెరముందు నాయకుడు హీరో కావచ్చు. తెరవెనుక నాయకుడు (కెప్టెన్) మాత్రం దర్శకుడే. అటువంటి నాయకత్వ స్థానంలో మనవాళ్లని కాకుండా ఇతర భాషలవాళ్లకి పెద్దపీట వేయడం ఏమంత న్యాయం? 'ప్రతిభ ఎవరిలో ఉన్నా ప్రోత్సహించాలి. అందుకు భాషా భేదం అడ్డుకాకూడదు' అంటారు కొంతమంది. నిజమే. అయితే అది కొంతవరకే. ఒకరిద్దర్ని అలా తీసుకు రావడంలో తప్పులేదు. అయితే అదేపనిగా ఒకరి తర్వాత మరొకర్ని దిగుమతి చేసుకుంటూ పోతుంటే మన దర్శకులు ఏం కావాలి? మనవాళ్లు తీసే సినిమాలన్నీ ఫెయిలయ్యి, పరాయి దర్శకుల సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతుంటే.. సరేననుకోవచ్చు. అలా ఏమీ జరగడం లేదు. పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతగా హీరోలు, నిర్మాతలు పర భాషా దర్శకులవైపు చూపు సారిస్తూ రావడం వల్లే వాళ్ల హవా నడిచింది. ఇప్పుడు వాళ్ల చేతుల్లో విజయాన్ని అందించే మంత్రదండమేదీ లేదని తెలియడంతో తిరిగి తెలుగు దర్శకులకి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ ట్రెండు మనకి మంచిదే.

Friday, October 14, 2011
న్యూస్: 'ఊసరవెల్లి' ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్?!
మహేశ్ 'దూకుడు' తొలివారం రూ. 50 కోట్ల గ్రా, రూ. 35 కోట్ల షేర్ సాధించిందని నిర్మాతలు ప్రకటిస్తే, మాది అంతకంటే పెద్ద రికార్డ్ అంటూ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ప్రకటనలిచ్చారు. ఆయనిచ్చిన ప్రకటన ప్రకారం ఆ సినిమా తొలి వారం రూ. 56 కోట్ల గ్రాస్, రూ. 39 కోట్ల షేర్ సాధించింది. అంటే షేర్ విషయంలో 'దూకుడు' కంటే 'ఊసరవెల్లి' నాలుగాకులు ఎక్కువ చదివిందన్న మాట. తొలి వారం కలెక్షన్లలో ఇది ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్. చిత్రమేమంటే 'దూకుడు'ది జెన్యూన్ విజయమని (నిర్మాతలు ఎక్కువ కలెక్షన్లు ప్రకటించ వచ్చు గాక) ఇండస్ట్రీ, ట్రేడ్ వర్గాలు అంగీకరిస్తుంటే, 'ఊసరవెల్లి'ది జెన్యూన్ విజయమని ఆ వర్గాల్లో అత్యధికులు నమ్మడం లేదు. ఎందుకంటే 'ఊసరవెల్లి' ఆడుతున్న చాలా థియేటర్లలో కనిపిస్తున్న ప్రేక్షకుల సంఖ్యే దానికి ప్రబల నిదర్శనం. అయితే తమదే రికార్డ్ విజయమని చెప్పుకోవడానికి హీరోలు, వారి అభిమానులు తాపత్రయపడుతుంటే రికార్డులు బద్దలు కాకుండా ఉంటాయా? రానున్న రోజుల్లో 'పంజా', 'రచ్చ' సినిమాలకి ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయోననే కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ రికార్డుల దాహం ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందో తెలీదు కానీ ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ మాత్రం 'దూకుడు', 'ఊసరవెల్లి' నిర్మాతల మీద వేయి కళ్లు వేసి చూస్తున్నట్లు సమాచారం.
Wednesday, October 12, 2011
న్యూస్: అభిమానుల మధ్య రికార్డుల గోల!
మహేశ్ 'దూకుడు' బాక్సాఫీస్ వద్ద యమ దూకుడుతో దూసుకుపోతుంటే, ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'ని అంతకంటే హెచ్చు స్థాయిలో 'ప్రమోట్' చేయడానికి నానా హంగామా జరుగుతోంది. తొలిరోజు 'దూకుడు' రూ. 12 కోట్ల గ్రాస్ సాధించిందని దాని నిర్మాతలు ప్రకటిస్తే, 'ఊసరవెల్లి' ఏకంగా 15 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని దాని నిర్మాత ప్రకటించాడు. దీంతో ఇప్పుడు ఈ రెండు సినిమాల విషయంలో అభిమానులు 'రికార్డుల'పై దృష్టిపెట్టారు. 'దూకుడు'కి మార్నింగ్ షో నుంచే జెన్యూన్‌గా హిట్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. నిజంగానే అది సరికొత్త రికార్డులు సాధించే దిశగా వెళ్తుంటే, దాని నిర్మాతలు అది సాధించే రికార్డుల్నే హైలైట్ చేస్తూ రావడం మిగతా హీరోల అభిమానుల్లో పౌరుషాన్ని రగిల్చింది. 'ఊసరవెల్లి' విషయంలో అదే జరుగుతోంది. 'దూకుడు' కంటే తమ హీరో సినిమాయే పెద్ద హిట్టని చెప్పడానికి ఎన్టీఆర్ అభిమానులు హంగామా చేస్తున్నారు. అయితే విడుదలైన రోజే 'ఊసరవెల్లి'కి బ్యాడ్ టాక్ వచ్చింది. చాలామంది ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ పాత్రని డైరెక్టర్ సురేందర్‌రెడ్డి చూపించిన తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. 'ఊసరవెల్లి' వచ్చాక టాప్ హీరోల్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలో సురేందర్‌రెడ్డికి తెలీడం లేదనే వ్యాఖ్యలూ వినిపించాయి. ఇప్పటివరకు అతను కల్యాణ్‌రాం (అతనొక్కడే), రవితేజ (కిక్)కి మాత్రమే హిట్లివ్వగలిగాడు. ఎన్టీఆర్‌తో చేసిన 'అశోక్', మహేశ్‌తో చేసిన 'అతిథి' ఫ్లాపయ్యాయి. ఇప్పుడు 'ఊసరవెల్లి'తో అదే ట్రెండుని అతను కొనసాగించాడని విమర్శకులు అంటున్నారు. వీకెండ్‌లో బాగానే కలెక్ట్ చేసిన 'ఊసరవెల్లి' అసలు సత్తా సోమవారంతో తేలిపోయింది. చాలా థియేటర్లు సగం కూడా నిండలేదు. మరోవైపు మూడో వారంలో ఉన్న 'దూకుడు'కి సోమవారం కూడా థియేటర్ల వద్ద సందడి కనిపించింది. తమ హీరోల అభివృద్ధిని కాంక్షించే నిజమైన అభిమానులు చేయాల్సింది వాస్తవ స్థితిని యథాతథంగా గుర్తించడం, ఎదుటి హీరోల సినిమాలు హిట్టయితే మనస్ఫూర్తిగా అభినందించి, తమ వంతు సూపర్‌హిట్ వచ్చేదాకా సంయమనం పాటించడం. 'ఊసరవెల్లి' కాకపోతే 'దమ్ము' ఉంది. అది బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపవచ్చు. అప్పటిదాకా ఓపిక పట్టండి. లేకపోతే ఈ రికార్డుల గోల ముదిరిపోయి, ఏ సినిమా విడుదలైనా మొదట రికార్డులకే ప్రాధాన్యం ఇచ్చి ఊదరగొట్టే ప్రమాదం ఉంది. ఇది అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టిస్తుంది.
Monday, October 3, 2011
న్యూస్: 'దూకుడు'ని అడ్డుకోవడమే 'ఊసరవెల్లి' లక్ష్యం!
మొత్తానికి 'ఊసరవెల్లి'ని అక్టోబర్ 6న రిలీజ్ చేయడానికే నిర్మాత ఛత్రపతి ప్రసాద్ నిశ్చయించేశారు. ఈ సినిమా నిజంగా 6న వస్తుందా లేక, 13కి వాయిదా పడుతుందా? అనే సందేహం తలెత్తింది. ఎందుకంటే సెప్టెంబర్ 23న రిలీజైన మహేశ్ 'దూకుడు' రికార్డ్ కలెక్షన్లు సాధిస్తోంది. ఎక్కువ థియేటర్లలో ఆడుతోంది. అలాంటప్పుడు 'ఊసరవెల్లి'కి ఎక్కువ థియేటర్లు దొరుకుతాయా అనే సందేహం కలిగింది. పైగా 'ఊసరవెల్లి'కి మంచి కలెక్షన్లు రావాలన్నా ఒక వారం ఆలస్యంగా విడుదల చేస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల అభిప్రాయం ప్రకారం 'ఊసరవెల్లి' అక్టోబర్ 13న విడుదలైతే ఇటు దానికీ, అటు 'దూకుడు'కీ ప్రయోజనం ఉంటుందని వాళ్లు సూచిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మరో రకంగా తలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'దూకుడు' రికార్డులకి బ్రేక్ వెయ్యడంతో పాటు, టాలీవుడ్ నెంబర్‌వన్ రేసులో తానూ ముందున్నట్లు చెప్పాలనేది అతని అభిమతంగా ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'అశోక్' ఫెయిలైంది. ఇప్పుడు ఎలాగైనా సూపర్‌హిట్ కొట్టాలనే తపనతో ఆ ఇద్దరూ 'ఊసరవెల్లి'కోసం కృషిచేశారు. తప్పుకుండా ఈ సినిమా బిగ్ హిట్టవుతుందనే నమ్మకం ఎన్టీఆర్‌లో కనిపిస్తోంది. అందుకే ఆరునూరైనా అక్టోబర్ 6నే సినిమా విడుదల చేయాలని అతను పట్టుపట్టడంతో నిర్మాత ప్రసాద్ మరో దారిలేక విడుదలకు సిద్ధమయ్యారు. ఒక్కటి మాత్రం నిజం. 'ఊసరవెల్లి' రాక 'దూకుడు' రికార్డుల్ని ప్రభావితం చేయనున్నది. ఆ ప్రభావం థియేటర్ల సంఖ్య మీదా, కలెక్షన్ల మీదా కనిపించనున్నది. చూద్దాం, ఎన్టీఆర్ పట్టుదల చివరికి ఎలాంటి పరిస్థితుల్ని కల్పిస్తుందో...
Sunday, August 28, 2011
న్యూస్: రెండు హిట్లు, రెండు ఫ్లాపులు!
ఇప్పటివరకు నాలుగు సినిమాల్ని డైరెక్ట్ చేసిన సురేందర్‌రెడ్డి రెండు హిట్లు, రెండు ఫ్లాపులతో బ్యాలెన్స్‌గా ఉన్నాడు. తొలి సినిమా 'అతనొక్కడే', నాలుగో సినిమా 'కిక్'తో హిట్లు కొట్టిన అతను రెండు, మూడు సినిమాలైన 'అశోక్', 'అతిథి'లతో ఫ్లాపులు చవిచూశాడు. ఇప్పుడతను తన ఐదో సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా 'ఊసరవెల్లి'. అఫిషియల్‌గా ఆ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ హీరో. ఇదివరకు ఆ ఇద్దరూ కలిసి 'అశోక్' చేశారు. ఆ సినిమాతో పరాజయం పొందిన వాళ్లు 'ఊసరవెల్లి'తో ఆ చేదు అనుభవాన్ని మరచిపోవాలని ఆశిస్తున్నారు. విపరీతమైన వయొలెన్స్, ఏమాత్రం కొత్తదనం లేని కథ వల్లనే 'అశోక్' ఫ్లాపయ్యిందని సురేందర్‌రెడ్డి గ్రహించాడు. అందుకే 'ఊసరవెల్లి'ని 'కిక్' తరహాలోనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మలుస్తున్నాడు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. ఎన్టీఆర్, తమన్నా మధ్య వచ్చే సీన్లు యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తాయని ఆ సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సురేందర్‌కి పర్మనెంట్ రైటర్‌గా మారిన వక్కంతం వంశీ కథని అందించిన ఈ సినిమాకి 'బృందావనం' ఫేం కొరటాల శివ డైలాగ్స్ రాస్తున్నాడు. ఇదివరకు ఎన్టీఆర్ 'రాఖీ'కి సూపర్బ్ మ్యూజిక్‌నిచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి బాణీలనిస్తున్నాడు. 'ఛత్రపతి ప్రసాద్' నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా పేరుపొందిన మోడల్ విద్యుత్ జామ్వాల్, రాంగోపాల్‌వర్మ సినిమా 'కాంట్రాక్ట్' ఫేం ఆద్విక్ మహాజన్ టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. మొత్తానికి 'ఊసరవెల్లి'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాలనే సురేందర్‌రెడ్డి తపని ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.
Wednesday, August 24, 2011
న్యూస్: ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్!
పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 2012 ఏప్రిల్ నుంచి ఓ సినిమా చేయనున్న ఎన్టీఆర్ అంతకంటే ముందు శ్రీను వైట్ల డైరెక్షన్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ ఇద్దరి కాంబినేషన్ కలవడం ఇదే తొలిసారి. ఎన్టీఅర్, పూరి కాంబినేషన్ సినిమాని నిర్మించే పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ సినిమానీ నిర్మించబోతున్నాడు.
ఎన్టీఆర్ ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'ఊసరవెల్లి'తో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. "బోయపాటి డైరెక్షన్లో క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న సినిమా తర్వాత నేను చేసేది శ్రీను వైట్ల దర్శకత్వంలోనే. అతను చెప్పిన కథ ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. మా ఫస్ట్ కాంబినేషన్ ద బెస్ట్ అనిపించుకునేలా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తయారవుతుంది" అని ఎన్టీఆర్ తెలిపాడు.
మరోవైపు మహేశ్ హీరోగా తను రూపొందిస్తున్న 'దూకుడు' తర్వాత తను డైరెక్ట్ చేసేంది ఎన్టీఆర్‌నేనని శ్రీను వైట్ల తెలిపాడు. 'అతడు', 'దూకుడు' సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించిన గుహన్ ఈ సినిమాకీ పని చేయబోతున్నాడు. మొత్తానికి మంచి మంచి కాంబినేషన్స్ పట్టుకుంటూ నిర్మాత బండ్ల గణేశ్ వార్తల్లో వ్యక్తిగా మారాడు.

Sunday, August 21, 2011
న్యూస్: తెలుగులో మరిన్ని అవకాశాల కోసం...
మొదట 'కిక్'లో, తర్వాత 'కల్యాణ్‌రాం కత్తి'లో, తిరిగి 'వీర'లో తన పాత్రలతో ఆకట్టుకున్న తమిళ నటుడు శ్యాం అసలు పేరేమిటో తెలుసా? షంషుద్దీన్ ఇబ్రహీం. అవును అతను ముస్లిం. తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ అందాల నటుడు తెలుగులో రవితేజతో 'కిక్', 'వీర' సినిమాలు చేశాక అతనికి మంచి స్నేహితుడైపోయాడు. అయితే రవితేజని తాను 'భయ్యా' అని పిలుస్తానని అతను తెలిపాడు. తనకి ఇక నుంచీ పోలీసు పాత్రలు కాకుండా వేరే ఇంకేవైనా పాత్రలు ఇవ్వమని తెలుగు దర్శకుల్ని కోరుతున్నాడు. "కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు చేయడానికి నాకు అభ్యంతరం లేదుకానీ కంప్లీట్ విలన్ రోల్స్ అంటే చెన్నైలోని నా లేడీ ఫాన్స్ ఫీలవుతారు. వాళ్లు నన్ను లవర్ బాయ్‌గా చూడాలనుకుంటూ ఉంటారు" అని నవ్వేస్తాడు శ్యాం.
'కల్యాణ్‌రాం కత్తి'లో తను చేసిన ఎమోషనల్ సీన్లు చాలా బాగా వచ్చాయనీ, కానీ ఫైనల్ ఎడిటింగ్‌లో వాటిని కత్తిరించేశారని కాస్త బాధని వ్యక్తం చేశాడు. అయితే దాని గురించి అతడేమీ నెగటివ్‌గా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ సినిమా ఎప్పుడో జనం ముందుకు వచ్చేసింది. అతను మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలని ఆశిస్తున్నాడు. అయితే 'క్షేత్రం', 'బెజవాడ రౌడీలు' కాదనుకున్నాడు. ప్రస్తుతం అతను ఎన్టీఆర్ సినిమా 'ఊసరవెల్లి'లో చేస్తున్నాడు. 'కిక్'లో చేసేప్పుడు డైరెక్టర్ సురేందర్‌రెడ్డితో ఏర్పడిన స్నేహమే ఈ సినిమా అవకాశాన్నిచ్చింది. "సెప్టెంబర్ తర్వాత తెలుగు సినిమాలకు ఎక్కువ కాల్షీట్లు ఇద్దామనుకుంటున్నా" అని చెప్పాడు శ్యాం. 'ఊసరవెల్లి'తో పాటు '6' అనే ద్విభాషా చిత్రాన్ని అతను చేస్తున్నాడు. ఆ సినిమాని అతని కజినే నిర్మిస్తున్నాడు. 7 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో తయారవుతున్న ఈ సినిమాకి దురై దర్శకుడు. ఇదివరకు అతను శింబు హీరోగా 'తొట్టిజయ'ని డైరెక్ట్ చేశాడు. "ఈ సినిమాలో నేను నాలుగు గెటప్పుల్లో కనిపిస్తా. ఇందులోని కేరక్టర్ కోసం 15 కిలోల బరువు తగ్గా" అని చెబుతున్న శ్యాం తెలుగులో మరిన్ని అవకాశాలతో మరింత మంచి పేరు తెచ్చుకుంటాడేమో చూద్దాం.

Friday, July 8, 2011
న్యూస్: ఆ రెండింటితో ఎన్టీఆర్ టాప్ హీరో అయ్యేనా?
కొడాలి నాని తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యల కారణంగా 'అదుర్స్' సినిమా నైజాంలో నష్టపోవడం, దిల్ రాజు చెప్పిన రేంజిలో 'బృందావనం' హిట్టు కాకపోవడం, ఇక ఈ యేడాది విడుదలైన 'శక్తి' డిజాస్టర్ కావడంతో చిన్న ఎన్‌టీఆర్ మాంచి కసి మీదున్నాడు. ఎలాగైనా ఈసారి భారీ హిట్ కొట్టాలని తపిస్తున్నాడు. ప్రస్తుతం అతను రెండు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో చేస్తున్న 'ఊసరవెళ్లి' కాగా, మరోటి బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేస్తున్న పేరుపెట్టని చిత్రం. 'ఊసరవెళ్లి' షూటింగ్ యమ స్పీడుగా జరుగుతోంది. ఎలాగైనా దసరా సెలవులకి, అంటే సెప్టేంబర్ చివరకి 'ఊసరవెల్లి'ని ప్రేక్షకుల మధ్యకి తీసుకు రావాలని నిర్మాతలు కృషి చేస్తున్నారు. ఇందులో ఎన్‌టీఆర్ జోడీగా నేటి క్రేజీ హీరోయిన్ తమన్నా నటిస్తోంది. 'కిక్' వంటి హిట్ తర్వాత సురేందర్‌రెడ్డి తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇంతకంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉన్న సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తున్న సినిమా. కారణం వరుసగా మూడు హిట్ సినిమాల్ని (భద్ర, తులసి, సింహా) డైరెక్ట్ చేసిన బోయపాటి శ్రీను దీనికి దర్శకుడు కావడం. పైగా ఇందులో హీరోయిన్ శృతీహాసన్. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులతో తను టాప్ లీగ్‌లోకి మళ్లీ వస్తాననే నమ్మకం ఎన్‌టీఆర్‌లో నిండుగా కనిపిస్తోంది.
Thursday, September 16, 2010
Subscribe to:
Posts (Atom)