"నిజానికి ఇతర భాషల్లో సినిమాలు తీసి ఆర్థికంగా పోగొట్టుకున్నానే కానీ లాభపడలేదు. ఈ విషయంలో నా ఇద్దరు కొడుకులూ నన్నెప్పుడూ తప్పు పట్టలేదు. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి'' అని ఒకింత ఉద్వేగంగా చెప్పారు సీనియర్ ప్రొడ్యూసర్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, రాహుల్ హీరోలుగా; రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య హీరోయిన్లుగా సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై తాజాగా ఆయన నిర్మించిన చిత్రం 'ముగ్గురు'. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం చిత్రం ఈ నెల 19న విడుదలవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా సంభాషించారు రామానాయుడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
వైవిధ్యమైన కథతో రూపొందించిన వినోదాత్మక చిత్రం 'ముగ్గురు'. 2 గంటల 7 నిమిషాల సేపు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సినిమా నడుస్తుంది. ఈమధ్య విడుదలైన ఆడియోకు వెరీగుడ్ రిపోర్ట్ వచ్చింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ చాలా బాగుందంటున్నారు. మొత్తం ఆరు పాటలు. ఇప్పటికే మా బేనర్‌లో చాలా సినిమాలు చేసిన కోటి ఈ సినిమాకీ మంచి మ్యూజిక్‌నిచ్చాడు. రచయితలు సాహిత్యం బాగా రాశారు. థియేటర్ ట్రైలర్స్‌కూ స్పందన బాగుంది. తమ పాత్రలకి ఆర్టిస్టులందరూ న్యాయం చేశారు. ముగ్గురు హీరోలు, హీరోయిన్లు హుషారుగా నటించారు. ఈ సినిమాని 37 రోజుల్లోనే పూర్తి చేశాం. అందులో 23 రోజులు మలేషియాలో షూటింగ్ చేశాం. నాలుగు రోజులు కారంచేడులో చిత్రీకరించాం.
ఆదిత్య బాగా తీశాడు
డైరెక్టర్ ఆదిత్య సినిమాని బాగా తెరకెక్కించాడు. అతను 'ప్రేమించుకుందాం రా'తో మరో రెండు మూడు సినిమాలకి మా బేనర్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అతను సబ్జెక్ట్ చెప్పగానే బాగా నచ్చింది. చెప్పినదానికంటే బాగా తీశాడు. సాధారణంగా నా సినిమాని సెట్స్‌లో ఉండి గమనించడం అలవాటు కాబట్టి, ఆదిత్య ప్రతిభ ని సెట్స్ మీద చూశాను. వెరీగుడ్ డైరెక్టర్. నేను కథ బాగుంటేనే సినిమా తీస్తాను. ఇదివరకు కొన్ని సినిమాలు ఆడకపోవడానికి రకరకాల కారణాలున్నాయి. మునుపటి సినిమా 'ఆలస్యం అమృతం' కచ్చితంగా వంద రోజులు ఆడుతుందని తొలి కాపీ చూసినవాళ్లంతా అభిప్రాయపడ్డారు. చంద్రమహేశ్‌కి కచ్చితంగా హిట్ వస్తుందని ఆశించా. అయితే రాంగ్ టైమ్‌లో రిలీజ్ చెయ్యడం వల్లే అది ఆడలేదు.
అది విత్తనం, ఇది చెట్టు
ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలనీ, సక్సెస్ వచ్చినప్పుడు ఒదిగి ఉండాలనీ నేర్చుకున్నా కాబట్టి నేనెప్పుడూ ఫెయిల్యూర్స్‌కి భయపడలేదు. గతంలో 'ద్రోహి' ఫ్లాపయినప్పుడు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్నా. కె. బాపయ్యకి డైరెక్టర్‌గా అది తొలి చిత్రం. దానికి పెట్టిన పది లక్షలూ పోయాయి. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీతో 'ప్రేమనగర్' ప్లాన్ చేశా. దానికి పదిహేను లక్షలు ఖర్చుపెట్టాం. ఆ సినిమా జీవన్మరణ సమస్య. అది ఆడితే మద్రాసులోనే ఉంటాననీ, లేదంటే కేళంబాక్కం వెళ్లిపోతాననీ చెప్పా. ఎందుకంటే కేళంబాక్కంలో అప్పట్లో పొలాలు కొన్నా. అక్కడే వ్యవసాయం చేసుకోవాలనేది ఆలోచన. కారంచేడుకు మాత్రం పోకూడదనుకున్నా. ఎందుకంటే 'రామానాయుడు సినిమాల్లో అంతా పోగొట్టుకుని వచ్చేశాడురా' అనే మాటలు సొంతూరు వాళ్లనుంచి వినకూడదని. అయితే 'ప్రేమనగర్' పెద్ద హిట్టవడంతో కేళంబాక్కంకి వెళ్లాల్సిన పనిలేకపోయింది. అందుకే అంటుంటాను - మా సురేశ్ ప్రొడక్షన్స్‌కి 'రాముడు-భీముడు' విత్తనమైతే, 'ప్రేమగనర్' చెట్టు అని. ఈ రెండో సినిమాతో సినీ ఫీల్డ్‌లో నిలబడిపోయా. దాని హిందీ రీమేక్ 'ప్రేమనగర్'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టి, అక్కడా సక్సెసయ్యా. అదే సినిమాని తమిళంలో 'వసంత మాళిగై'గా తీసి అక్కడా హిట్టుకొట్టా. ఆ తర్వాత కెరీర్‌లో కొన్ని ఆటుపోట్లు ఎదురైనా నేను చలించలేదు. ముందుకు సాగుతూ వచ్చా.
ఈ ఏడాదే పంజాబీ సినిమా
ఇప్పటికి పన్నెండు భారతీయ భాషల్లో సినిమాలు తీశా. పంజాబీలో కూడా సినిమా తీస్తే, అన్ని భారతీయ భాషా సినిమాల్ని తీసిన నిర్మాతగా పేరు సంపాదించుకుంటా. ఈ ఏడాదే పంజాబీలో సినిమా తీయబోతున్నా. నిజానికి ఇతర భాషల్లో సినిమాలు తీసి ఆర్థికంగా పోగొట్టుకున్నానే కానీ లాభపడలేదు. సినిమా మీద తపనతోటే ఆ భాషల్లోనూ మంచి సినిమాలు తీయాలనుకుని తీశా. ఈ విషయంలో నా ఇద్దరు కొడుకులూ నన్నెప్పుడూ తప్పు పట్టలేదు. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి. పైగా వైజాగ్ స్టూడియోని చూసుకోవడానికి అక్కడకి వెళ్తానన్నా వాళ్లు ఒప్పుకోవడం లేదు. అందరం కలిసి ఇక్కడే ఉండాలని పట్టుబడుతున్నారు.
అన్ని రకాలుగా హ్యాపీ
తదుపరి సినిమాని భూపతిరాజా కథతో చెయ్యాలని అనుకుంటున్నా. అన్నీ కుదిరితే వెంకటేశ్ హీరోగా, ఆదిత్య దర్శకత్వంలో దాన్ని తీస్తా. ఆ తర్వాత నా మనవడు నాగచైతన్య హీరోగా వచ్చే ఏడాది జనవరి నుంచి మరో సినిమా ఉంటుంది. రానా హిందీలో బిజీ అయ్యేటట్లున్నాడు. ఇప్పుడక్కడ రాంగోపాల్‌వర్మ తీస్తున్న 'డిపార్ట్‌మెంట్'లో నటిస్తున్నాడు. సురేశ్‌బాబు మరో కొడుకు అభిరామ్ కూడా నటించేందుకు రెడీ అంటున్నాడు. రెండేళ్ల తర్వాత అతనూ హీరో అవుతాడు. 'మొదట మన బేనర్‌లోనే చేస్తా తాతా' అంటున్నాడు. నేను, నా తర్వాత నా కొడుకులు, ఇప్పుడు నా మనవళ్లు ఈ రంగంలోనే సక్సెస్ సాధించి, ముందుకెళుతుండటం ఎంతో సంతోషంగా అనిపిస్తుంటుంది. సినిమా రంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్నా. ఇక ప్రత్యేకంగా నేను సాధించాల్సిందంటూ ఏమీ లేదు.
Showing posts with label reema sen. Show all posts

Thursday, August 11, 2011
Sunday, July 17, 2011
న్యూస్: మూడేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టుకుంటున్న తేజ
సంచలన దర్శకుడు తేజ మూడేళ్ల సుదీర్ఘ విరామంతో మళ్లీ దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నాడు. చివరి సారిగా అతను డైరెక్ట్ చేసిన 'కేక' 2008 అక్టోబర్‌లో వచ్చింది. ఈ సినిమాతో ప్రసిద్ధ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిన్న కుమారుడు రాజా పరిచయమయ్యాడు. ఈ సినిమా ఎప్పుడొచ్చిపోయిందో జనానికి తెలీదు. అందుకే అతను మళ్లీ తెర మీద కనిపించలేదు. ఇక తేజ అయితే ఆ సినిమా ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి మూడేళ్లు టైం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయనతో సినిమా నిర్మించడానికి ముందుకొచ్చింది భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనందప్రసాద్. 'అమరావతి', 'వాంటెడ్' వంటి ఫ్లాపుల తర్వాత ఆయన తీయబోతున్న సినిమా ఇది. తేజ, ఆనందప్రసాద్ కాంబినేషన్ కుదిర్చింది అన్నే రవి. ఇదివరలో సినీ జర్నలిస్టుగా పనిచేసిన రవి ఇప్పుడు భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నాడు. తేజకు బాగా సన్నిహితుడు. అందుకే ఈ కాంబినేషన్ వీలుపడింది. తేజ డైరెక్ట్ చేయబోతున్న ఈ కొత్త సినిమాలో నలుగురు స్టార్ కమెడియన్లు మినహా మిగతా వాళ్లంతా కొత్తవాళ్లే నటించనున్నారు. దీని కోసం స్టార్ హంట్‌ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తన సినిమాలతో అనేకమందిని చిత్రసీమకు పరిచయం చేసిన తేజ ఈ సినిమాతో మరి కొంతమందిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఉదయ్ కిరణ్, రీమాసేన్, నితిన్, సదా, నవదీప్, సుమన్‌శెట్టి నుంచి ఎంతో మంది ఆయన ద్వారా టాలీవుడ్‌లో అడుగు పెట్టినవాళ్లే. ఈ కొత్త సినిమాతో పరిచయమైన వాళ్లలో ఎవరు లైంలైట్‌లోకి వస్తారో చూడాలి.
Sunday, July 3, 2011
న్యూస్: ఆదిత్యకు అగ్ని పరీక్ష 'ముగ్గురు'
దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఆశలన్నీ 'ముగ్గురు' మీదే ఉన్నాయి. 'ముగ్గురు' అనేది ఆయన డైరెక్ట్ చేస్తున్న కొత్త సినిమా. డి. రామానాయుడు ఈ సినిమా నిర్మాత. టైటిల్ రోల్స్‌ని నవదీప్, 'హ్యాపీడేస్' ఫేం రాహుల్, అవసరాల శ్రీనివాస్ పోషిస్తున్నారు. రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య హీరోయిన్లు. మొదట ఈ సినిమాకి '3 ఇడియట్స్' అనే టైటిల్ పెట్టి తర్వాత ఎందుకనో 'ముగ్గురు'గా మార్చారు. జంధ్యాల దర్శకత్వంలో ఒకప్పుడు రామానాయుడు నిర్మించిన సూపర్ హిట్ మూవీ 'అహ నా పెళ్లంట'కు ఇది సీక్వెల్ అని వినికిడి. దానికీ, దీనికీ తేడా... ఆ సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్ ఒక్కరే అయితే ఇందులో ముగ్గురు హీరోలు. దర్శకుడిగా ఆదిత్యకు ఈ సినిమా అగ్ని పరీక్ష. 'మనసంతా నువ్వే', 'నేనున్నాను' సినిమాల తర్వాత ఆయనకు మళ్లీ హిట్టు లేదు. నాగార్జునతో చేసిన రెండో సినిమా 'బాస్' నుంచి ఇటీవల సుమంత్‌తో చేసిన 'రాజ్' దాకా అన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టినవే. అందుకే ఈసారి మినిమం గ్యారంటీ ఉండే కామెడీ సబ్జెక్టుని ఎంచుకున్నాడు ఆదిత్య. కామెడీ ఆఫ్ ఎర్రర్స్‌తో నడిచే 'ముగ్గురు' కచ్చితంగా హిట్టయి, తన కెరీర్‌కి ఊపిరి పోస్తుందని ఆయన గట్టిగా నమ్ముతున్నాడు.
Saturday, March 19, 2011
హిట్.. హిట్.. హుర్రే..!: మనసంతా నువ్వే-2
చిన్ననాటి స్నేహితులు పెద్దవాళ్లయ్యాక ప్రేమికులు కావడం చాలా సినిమాల్లో చూశాం. చిన్నతనంలో స్నేహితులుగా విడిపోయిన ఓ అబ్బాయి, అమ్మాయి పెద్దయ్యాక ఒకర్నొకరు చూసుకోకపోయినా ఒకరిపట్ల మరొకరు విపరీతమైన ఆరాధనా భావాన్ని పెంచుకోవడం, తమ ఉనికి తెలీకుండా తమ పట్ల ఎదుటివాళ్లకి ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలని అనుకోవడం వైవిధ్యమైన పాయింట్. 'మనసంతా నువ్వే' ఘన విజయానికి దోహదం చేసిన ప్రధానాంశం ఇదే. నిర్మాత ఎమ్మెస్ రాజు ఇచ్చిన లైన్‌ని దర్శకుడు వి.ఎన్. ఆదిత్య, స్క్రిప్టు సహాయకుడు వీరు పోట్ల కలిసి డెవలప్ చేసి, కల్పించిన సన్నివేశాలూ, ఆ సన్నివేశాలకి పరుచూరి సోదరులు కూర్చిన సంభాషణలూ ఓ సున్నితమైన, భావోద్వేగపూరితమైన ప్రేమకథని సృజించాయి.
ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా సినిమాల్లో బలవంతపు ప్రేమలే ఎక్కువ. హీరోనో, హీరోయినో 'నువ్వు నన్ను ప్రేమించకపోతే చంపేస్తా', 'నన్ను కాకుండా ఇంకొకర్ని చూశావా?' అనే బెదిరింపులే కనిపిస్తాయి. ఆ బెదిరింపులతోటే ప్రేమలు పుట్టినట్లు ఆ సినిమాల్లో చూపిస్తారు. అట్లా ప్రేమ స్థాయిని దిగజార్చిన సినిమాలు వస్తున్న కాలంలో ఒకరిపట్ల మరొకరు గుండె నిండా ప్రేమ నింపుకొని, వేరే ఇంకే ఆకర్షణకీ లొంగని ప్రేమికుల కథ వస్తే, గుండెల మీద పన్నీటి జల్లు కురిసినట్లే కదా!
మ్యూజికల్ వాచ్‌తో మ్యాజిక్
చిన్నతనంలో అనుకి జ్వరం తగిలినప్పుడు చంటి గుళ్లోని ఆంజనేయస్వామి విగ్రహం తెచ్చి అను వద్ద పెడతాడు. "నువ్వు గుడికి రాలేవు కదా. అందుకని దేవుణ్ణే నీ దగ్గరకు తీసుకొచ్చా" అన్న చంటి మాటల్లోని అమాయకత్వం, నిజాయితీకి ముచ్చటపడని వాళ్లెవరు? ఆ పిల్లల స్నేహం మనసుకి హత్తుకుంటే, ఆ ఇద్దరూ విడిపోయే సన్నివేశం బాధ కలిగిస్తుంది. ఆ సన్నివేశాన్ని కల్పించిన కథకుడూ, వాటిని కదిలించేలా చిత్రీకరించిన దర్శకుడూ.. ఇద్దరూ అభినందనీయులే. విడిపోయిన ఇద్దరూ పెరిగి పెద్దవాళ్లయ్యాక తిరిగి కలవాలంటే ఏదో ఒక 'సంధాన కర్త' ఉండాలి. అది ఓ జ్ఞాపకం కావచ్చు, ఓ వస్తువు కావచ్చు, ఓ వ్యక్తి కావచ్చు. ఈ సినిమాలో అలాంటి 'సంధానకర్త'గా కనిపించేది ఓ మ్యూజికల్ వాచ్. ఎమ్మార్వోగా పనిచేసే తన తండ్రికి బదిలీ కావడంతో చంటి నుంచి విడిపోక తప్పని స్థితిలో అను అతనికి ఆ మ్యూజికల్ వాచ్ ఇచ్చి, తను జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దానితో ఆడుకొమ్మని చెబుతుంది. ఆ తర్వాత ఆ గడియారం కథలో ఓ మలుపుకి కారణమవుతుంది. ఆ గడియారాన్ని శ్రుతి (తనూరాయ్) వద్ద చూసి, ఆమె చెప్పిన మాటలు విని, చంటి అలియాస్ వేణు (ఉదయ్ కిరణ్)ని అపార్థం చేసుకుంటుంది అను. అలాగే ప్రీ క్లైమాక్స్‌లోనూ ఆ గడియారం తన వంతు పాత్ర పోషిస్తుంది. ఎంపీ కొడుకుతో అను పెళ్లి జరిగితేనే నీ చెల్లెలి పెళ్లి అనుకున్న ప్రకారం జరుగుతుందని అను తండ్రి వేణుని హెచ్చరిస్తే, చెల్లెలి కోసం తన ప్రేమని త్యాగం చేయాలనుకుంటాడు వేణు. అందుకే 'మనసంతా నువ్వే' సీరియల్ రచయిత్రి రేణు, తను ప్రేమించిన అను.. ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకున్న తర్వాత కూడా ఆ సంగతి ఆమెకి చెప్పకుండా "ఇప్పుడు నాకు ఆ అమ్మాయే (అను) గుర్తురావడం లేదు. అసలు ఉందో, లేదో తెలీని అమ్మాయి మీద ప్రేమేంటండీ రేణు గారూ. నా మనసంతా మీరే ఉన్నారండీ..." అంటాడు వేణు.
"అనూయే మీకు గుర్తు లేనప్పుడు తనిచ్చిన గడియారం మీ దగ్గర ఎందుకుంది?" అనడుగుతుంది అను. నిజమే కదా అంటూ ఆ గడియారాన్ని సముద్రంలోకి విసిరేస్తాడు వేణు. అప్పుడు అతడి చెంప చెళ్లుమనిపించి, "యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు" అంటా వెళ్లిపోతుంది అను. వేణు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. వాన కూడా మొదలవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే స్నేహితుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన సునీల్ ఒడ్డున నీళ్లలో కనిపిస్తున్న గడియారాన్ని తీసుకుని వేణు వద్దకొస్తాడు. అతణ్ణి చూసి లేని నవ్వుని మొహంలోకి తెచ్చుకుంటూ ఇప్పటిదాకా అను, తను కలిసి మాట్లాడుకున్నామనీ, తను చాలా హ్యాపీగా ఫీలయ్యిందనీ అంటాడు వేణు.
గడియారాన్ని వేణు చేతిలో పెట్టిన సునీల్ "రేయ్. అప్పుడప్పుడు వర్షం కూడా మనకి చాలా మేలు చేస్తుందిరా. మన కన్నీళ్లని ఎదుటివాళ్లకి కనిపించకుండా దాచేస్తుంది. నువ్వు ఆ అమ్మాయికి ఏ కన్నీళ్లు మిగిల్చావో భగవంతుడు నీకు ఆ కన్నీళ్లే మిగిల్చాడురా. ఏడవరా. వర్షం వెలిసిపోయేలోపు కడుపారా ఏడువ్" అంటాడు ఉద్వేగంగా. దాంతో సునీల్‌ని గట్టిగా వాటేసుకుని ఏడ్చేస్తాడు వేణు.
ఇట్లా ఆ మ్యూజికల్ వాచ్‌ని ఈ ప్రేమకథలోని మలుపులకు ఉపయోగించుకున్నారు. గమనించాల్సిన అంశమేమంటే ఓసారి అపార్థానికి కారణమైన ఆ గడియారం ఇంకోసారి ప్రేమికులిద్దరూ విడిపోవడానికి కారణమైంది. ఈ రెండో సన్నివేశం ప్రేక్షకుల్ని అమితంగా కదిలిస్తుంది. ముఖ్యంగా సునీల్ డైలాగులతో వేణు పాత్ర పట్ల సానుభూతి పెల్లుబుకుతుంది. చెల్లెలి కోసం ప్రేయసికి తనంతట తానుగా దూరమయ్యే అతని పరిస్థితి ఎవర్ని మాత్రం కదిలించదు! ఆ సన్నివేశంలో వానపడటం, ఆ వానలో సునీల్ వద్ద కన్నీళ్లని దాచుకోవాలని వేణు ప్రయత్నించడం, దాన్ని గమనించిన సునీల్ మన కన్నీళ్లని ఎదుటివాళ్లకు కనిపించకుండా వర్షం దాచేస్తుందని అనడం.. రచయిత సన్నివేశ కల్పనా చాతుర్యానికి ఓ చక్కని ఉదాహరణ.
కీలకం చర్చావేదిక సన్నివేశం
ఇవన్నీ ఒక ఎత్తయితే ఆ రోజుల్లో టెలివిజన్లో పాపులర్ అయిన 'ప్రజావేదిక' కార్యక్రమం తరహాలో ఈ సినిమాలో 'స్నేహం-ప్రేమ' అనే అంశంపై పెట్టిన చర్చావేదిక సన్నివేశం ఒక్కటీ ఒక ఎత్తు. సినిమా మొత్తానికీ కీలకమైంది ఈ ఎపిసోడే. కథ ప్రధానమైన మలుపు తిరిగేది ఆ ఎపిసోడ్‌లోనే. సాధారణంగా సినిమాలో చర్చావేదిక అంటే సగటు ప్రేక్షకుడి దృష్టిలో విసుగు పుట్టించే వ్యవహారం. కానీ దాన్ని జనరంజకం ఎలా చేయొచ్చో ఈ సినిమా చూపించింది. ఆ చర్చావేదికలో పాల్గొన్న అను ఒక్కసారి ఆడది మనసిస్తే జీవితాంతం అతని కోసం ఎదురుచూస్తుందంటూ ఆవేశంగా మాట్లాడుతుంది. వేణు, శ్రుతి ప్రేమించుకుంటున్నారనే అపోహే ఆమె ఆవేశానికి మూలం. ఆ తర్వాత తన చిన్ననాటి నేస్తం గురించీ, ఆమె మీద ప్రేమ గురించీ ఆ కార్యక్రమంలో చెప్పిన వేణు.. ఆ స్నేహితురాలు కలిస్తే తనెవరో చెప్పకుండా ఆమె మనసులో ఏముందో తెలుసుకుంటాననీ చెబుతాడు. 'తూనీగా తూనీగా' పాట పాడతాడు. దాంతో అనుకి అతడి పట్ల ఉన్న అపోహ పటాపంచలవుతుంది. తన పట్ల అతడికి ఉన్న ప్రేమ సంగతి తెలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోతుంది. తను ఎదురైతే అతను ఏం చేయదలచుకున్నాడో అదే ప్రయోగాన్ని అతడి మీద తనే చేయాలని నిర్ణయించుకుంటుంది. అప్పట్నించీ తనెవరో చెప్పకుండా వేణుకి ఆమె దగ్గరయ్యే విధానం, అతడితో ఆమె ఆడే దాగుడుమూతలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. తన చిన్ననాటి నేస్తాన్ని తెలుసుకోవడం కోసం రేణు పేరుతో 'మనసంతా నువ్వే' అనే సీరియల్ని అను రాయడం మరో ఆసక్తికర అంశం. ఇది రంగనాయకమ్మ 'రచయిత్రి' నవలని గుర్తు చేస్తుంది. ఆ నవలలో అనూరాధ అనే కలం పేరుతో రచనలు చేస్తుంది కథానాయిక విజయ. తన భార్యే అనూరాధ అనే సంగతి ఆమె భర్తకి తర్వాత తెలుస్తుంది. చిత్రమేమంటే 'రచయిత్రి' నవలా నాయిక కలం పేరు 'మనసంతా నువ్వే'లో నాయిక అసలు పేరు కావడం. కాకపోతే అ కథ వేరు, ఈ కథ వేరు.
సమష్టి కృషి ఫలితం
కథాకథనాలు రెండూ చక్కగా అమరడమే ఈ చిత్ర ఘన విజయానికి ప్రధాన కారణం. ఆ క్రెడిట్ కథా రచయిత ఎమ్మెస్ రాజు, సంభాషణల రచయితలు పరుచూరి సోదరులు, దర్శకుడు వి.ఎన్. ఆదిత్యకు దక్కుతుంది. తొలి సినిమా కావడం వల్లనేమో ఆదిత్యలోని 'ఫైర్' ప్రతి సన్నివేశ చిత్రణలోనూ కనిపిస్తుంది. ప్రధాన పాత్రలతో పాటు సపోర్టింగ్ కేరెక్టర్లనీ దర్శకుడు చక్కగా ఉపయోగించుకున్నాడు. హీరో స్నేహితుడిగా చేసిన సునీల్ పాత్ర, వీక్లీ ఎడిటర్ కూతురు శ్రుతి పాత్ర, అను తండ్రి గంగాధరం పాత్ర కథకి మంచి 'సపోర్ట్'నిచ్చాయి. ఆ పాత్రల్లో సునీల్, తనూరాయ్, తనికెళ్ల భరణి సరిగ్గా ఇమిడిపోయారు. ఇక హీరో వేణు పాత్రకి అతికినట్లు సరిపోయాడు ఉదయ్ కిరణ్. పాత్రలోని అమాయకత్వానికి మన పక్కింటబ్బాయిలా కనిపించే అతని ముఖం అచ్చుగుద్దినట్లు సరిపోయింది. అప్పటికే అతడికొచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ దీనికి మరింత వన్నె అద్దింది. నిజానికి అనూరాధ పాత్రకి రీమాసేన్ ఛాయిస్ కాదు. హీరో పాత్రలో ఉన్న భావోద్వేగాలన్నీ ఆ పాత్రలోనూ ఉన్నాయి. ముఖ్యంగా హీరోకి తన ఐడెంటిటీ తెలీకుండా నటించే సన్నివేశాల్లో 'అండర్‌ప్లే' అవసరం. ఆ విషయంలో రీమాసేన్ ఓ మోస్తరుగానే నటించింది. అయినా ఆమెని ఆ పాత్రలో ప్రేక్షకులు ఆమోదించడానికి కారణం, ఆ పాత్రలోని బలమే. ఇక ప్రత్యేక పాత్రలో సీతారామశాస్త్రి కనిపించేది స్వల్ప సమయమే అయినా తమవైన డైలాగులతో, 'వాయిస్'తో బలమైన ముద్ర వేశారు. చంద్రమోహన్, సిజ్జు వంటివాళ్లు పాత్రల పరిధుల మేరకు రాణించారు.
సినిమాకి సగం బలం సంగీతమే అనేది నానుడి. ఈ సినిమాకి సంబంధించి అది అక్షరాలా నిజం. అప్పుడే ఎగిసిన సంగీత కెరటం ఆర్పీ పట్నాయక్ ఈ సినిమా పాటలకి వినసొంపైన, ఆహ్లాదకరమైన బాణీలనిస్తే, పదాలతో ఆడుకునే సీతారామశాస్త్రి చక్కని సాహిత్యాన్నందించారు. 'తూనీగ తూనీగ ఎందాక పరిగెడతావే రావే నా వంకా', 'చెప్పనా ప్రేమా చెలిమి చిరునామా' (టైటిల్ సాంగ్) పాటలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే వుంటే, 'కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం', 'చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా', 'ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా' పాటలు మంచి హిట్టయ్యాయి. ఆర్పీ కూర్చిన నేపథ్య సంగీతమూ ప్రభావవంతమైందే. మిగతా సాంకేతిక నిపుణులూ తమ వంతు బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించారు. ముఖ్యంగా ఎస్. గోపార్‌రెడ్డి కెమెరా అత్యుత్తమ స్థాయి పనితనాన్ని ప్రదర్శించింది. ఆరంభ సన్నివేశాల్లో, సముద్రం ఒడ్డున సన్నివేశాల్లో, పాటల్లో అది ఎలా హొయలు పోయిందో చూసి తీరాల్సిందే. అరకు అందాల్ని లాఘవంగా ఒడిసిపట్టింది ఆ కెమెరా. దర్శకుడు ఆదిత్య చెప్పినట్లు కె.వి. కృష్ణారెడ్డి ఎడిటింగ్ ప్రతిభ ఈ సినిమా కథనానికి బిగువుని చేకూర్చిపెట్టింది. 'మనసంతా నువ్వే' అందరి మనసుల్నీ దోచుకుని, పెట్టుబడికి ఐదు రెట్ల ఆదాయాన్ని అందించిందంటే అది సమష్టి పనితనం వల్లే.
(వచ్చే వారం ఎన్‌టీఆర్ 'ఆది' చిత్ర విశేషాలు)

Friday, March 11, 2011
హిట్.. హిట్.. హుర్రే!: మనసంతా నువ్వే
తారాగణం: ఉదయ్ కిరణ్, రీమాసేన్, సిజ్జు, తనూరాయ్, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సునీల్, పరుచూరి వెంకటేశ్వరరావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, దేవదాస్ కనకాల, సుధ, రజిత, శివారెడ్డి, శివపార్వతి, కృష్ణవేణి, మాస్టర్ ఆనంద్ వర్ధన్, బేబీ జీబా, రఘునాథరెడ్డి, పావలా శ్యామల, శిరీష
కథ: ఎమ్మెస్ రాజు
స్క్రీన్‌ప్లే, రచన: పరుచూరి బ్రదర్స్
రచనా సహకారం: వీరు పోట్ల
పాటలు: సీతారామశాస్త్రి
ఛాయాగ్రహణం: ఎస్. గోపాల్‌రెడ్డి
కూర్పు: కె.వి. కృష్ణారెడ్డి
డాన్స్: సుచిత్రా చంద్రబోస్
కళ: రాజేశ్
డి.టి.ఎస్. మిక్సింగ్: డి. మధుసూదన్‌రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి. భాస్కరరాజు
నిర్మాత: ఎమ్మెస్ రాజు
దర్శకత్వం: వి.ఎన్. ఆదిత్య
బేనర్: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
నిడివి: 2 గంటల 37 నిమిషాలు
విడుదల తేది: 19 అక్టోబర్ 2001
గ్రాఫిక్స్‌ని నమ్ముకుని భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'దేవీ పుత్రుడు' చిత్రం బాక్సాఫీస్ వద్ద కుదేలవడంతో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎమ్మెస్ రాజు బాణీ మార్చాలనుకున్నారు. అందమైన ప్రేమకథని తెరకెక్కించాలని సంకల్పించారు. ఆ సమయంలో వి.ఎన్. ఆదిత్య అనే కుర్రాడి గురించి విన్నారు. డైరెక్టర్ జయంత్ సి. పరాంజీ వద్ద వరుసగా మూడు సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో పనిచేశాడు ఆదిత్య. అప్పటికే అతను తన స్నేహితుడైన త్రివిక్రం కథతో డైరెక్టర్ కావాలని ప్రణాళికలు వేస్తున్నాడు.
"ఎమ్మెస్ రాజు గారు కబురు పంపించిన వారం రోజులకి వెళ్లి కలిశా. ఆయనే ఓ లైన్ చెప్పారు. 'ఇది ప్రేమించుకుందాం రా సినిమా లైన్ సర్' అని చెప్పా. ఆయన నన్ను మెచ్చుకుని, అప్పుడు తన మనసులోని లైన్ చెప్పారు. ఆ తర్వాత పదిహేను రోజుల పాటు ఇద్దరం చాలా సినిమాల గురించి క్యాజువల్‌గా డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అంతాకా హీరో ప్రేమ విషయం స్నేహితులకి తెలియదన్నట్లుగా చూపించే సినిమాలే ఎక్కువగా వచ్చాయ్. కానీ ఎవరైనా తన ప్రేమని మొదటగా చెప్పుకునేది స్నేహితులకేననీ, సినిమాలో ఆ కోణం పెడితే బాగుంటుందనీ చెప్పా. ఆయన నన్ను హత్తుకుని 'నువ్వే నా డైరెక్టర్‌వి' అన్నారు. అడ్వాన్స్ ఇచ్చారు" అని ఆ రోజులు జ్ఞాపకం చేసుకున్నారు ఆదిత్య.
అలా ఎమ్మెస్ రాజు కథతో, పరుచూరి సోదరుల స్క్రీన్‌ప్లేతో, ఆదిత్య దర్శకత్వంలో తయారైన ప్రేమ కథాచిత్రం 'మనసంతా నువ్వే' 45 ప్రింట్లతో విడుదలై ఘన విజయం సాధించింది. కేవలం మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన సినిమా దానికి ఐదు రెట్లు అంటే 15 కోట్ల రూపాయల్ని వసూలుచేసి పెట్టింది. 'దేవీపుత్రుడు' కారణంగా ఎంతో డబ్బు పోగొట్టుకున్న ఎమ్మెస్ రాజు ఎంతో నమ్మకంతో సొంతంగా రిలీజ్ చేసి, అనూహ్యమైన ఫలితాన్ని పొందారు. అప్పటికే 'చిత్రం', 'నువ్వు నేను' వంటి వరుస హిట్లు సాధించి, యువతలో క్రేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ 'మనసంతా నువ్వే'తో హ్యాట్రిక్ సాధించాడు. 'లవర్ బాయ్' ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. 'చిత్రం'లో హీరో హీరోయిన్లుగా పరిచయమైన ఉదయ్ కిరణ్, రీమాసేన్ జోడీ ఈ సినిమాతో రెండో సూపర్ హిట్ కొట్టింది. అప్పట్లో ఎక్కడ విన్నా 'తూనీగా.. తూనీగా' పాటే. ఆ పాటతోటే 'పాడుతా తీయగా' ఫేం ఉష సినీ గాయనిగా తళుక్కున మెరిసిపోయింది. అలాగే టైటిల్ సాంగ్ 'చెప్పనా ప్రేమా చెలిమి చిరునామా' కూడా హిట్.
ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విశేషం మరోటుంది. ఇందులో పనిచేసిన సాంకేతిక నిపుణుల్లో ఏడుగురు తదనంతర కాలంలో దర్శకులయ్యారు. కథా రచయిత అయిన నిర్మాత ఎమ్మెస్ రాజు 'వాన'తో, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ 'అందమైన మనసులో'తో, సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్‌రెడ్డి 'నా ఆటోగ్రాఫ్'తో, కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్ 'పల్లకిలో పెళ్లికూతురు'తో, కో-డైరెక్టర్ శంకర్ కె. మార్తాండ్ 'ఎవరైనా ఎపుడైనా'తో, పబ్లిసిటీ డిజైనర్ రమేశ్‌వర్మ 'ఒక ఊరిలో'తో, రచనా సహకారం అందించిన వీరు పోట్ల 'బిందాస్'తో దర్శకులుగా పరిచయమయ్యారు.
కథా సంగ్రహం:
అరకులో చంటి, అనూరాధ ఇరుగుపొరుగు వాళ్లు. చంటివాళ్లు కడు బీదలైతే, అను తండ్రి గంగాధరం ఎమ్మార్వో. అంతస్తులు వాళ్ల దోస్తీకి అడ్డుకాలేదు. తండ్రికి ట్రాన్స్‌ఫర్ కావడంతో అను వెళ్లిపోతుంది. వెళ్లేప్పుడు చంటికి తన జ్ఞాపకంగా ఓ మ్యూజిక వాచ్ ఇచ్చి వచ్చే ఏడాది తన పుట్టినరోజున అక్కడి ఆంజనేయస్వామి గుడివద్ద కలుసుకుందామని చెబుతుంది అను. తల్లిదండ్రులిద్దరూ చనిపోయి అనాథ అయిన చంటి రైల్వే స్టెషన్లో ఇడ్లీలు అమ్ముకుని బతుకుతుంటాడు. ఓ రోజు రైలెక్కుతున్న ఓ పాప బంగారు గోలుసు జారి కిందపడిపోతే, దాన్ని తీసుకెళ్లి ఆ పాప తండ్రి మోహన్ (చంద్రమోహన్)కి ఇస్తాడు. చంటి అనాథ అని తెలుసుకుని ఆ కుటుంబం అతన్ని తమతోపాటు తీసుకువెళ్తుంది. చంటికి వేణు అని పేరు పెడతారు.
వేణు (ఉదయ్ కిరణ్)కి 22 యేళ్లు వస్తాయి. అతనికి సునీల్ (సునీల్) మంచి ఫ్రెండ్. పన్నెండేళ్ల నుంచీ ప్రతి ఏడాదీ అరకులోని ఆంజనేయస్వామి గుడికి వెళ్తూనే వుంటాడు వేణు. కానీ ఇంతవరకు అను తారసపడలేదు. చెల్లెలు రేఖ (శిరీష)ని కాలేజీ వద్ద ఎంపీ కొడుకు స్నేహితుడు అల్లరి పెడుతుంటే వాణ్ణి కొడతాడు వేణు. అతను ఓ సూపర్‌మార్కెట్లో దూరితే వెంటపడి కొట్టే క్రమంలో పొరపాట్న అతడి దెబ్బ ఆ సూపర్ మార్కెట్ ఓనర్‌కి తగులుతుంది. పోలీసులు వేణుని తీసుకుపోబోతుంటే కొట్లాట సంఘటనని షూట్ చేసిన ఓ టీవీ చానల్ ప్రతినిధి శ్రుతి (తనూరాయ్) నిజంచెప్పి అతణ్ణి విడిపిస్తుంది. అదివరకే వేణు, 'స్వాతి' ఎడిటర్ కూతురైన శ్రుతి స్నేహితులవుతారు. మలేషియాలో మేనమామ వద్ద ఉన్న అను (రీమాసేన్) చదువు పూర్తికాగానే ఇండియాకి తిరిగొస్తుంది.
తన చిన్నటి జ్ఞాపకాలతో స్వాతి వీక్లీలో 'మనసంతా నువ్వే' అనే సీరియల్ రాయడం ప్రారంభిస్తుంది అను. అది చూసి చంటి వస్తాడనేది ఆమె ఆశ. అతి తక్కువ కాలంలోనే ఆ సీరియల్ పాపులర్ అవుతుంది. వేణు చెల్లెలు రేఖకి పెళ్లిచూపులు జరుగుతాయి. ఆ పెళ్లికొడుకు తండ్రి ఎవరో కాదు. ఇదివరలో వేణువల్ల పొరపాట్న దెబ్బతిన్న సూపర్‌మార్కెట్ ఓనర్. వేణుని చూసి అతను ఆగ్రహంతో ఊగిపోయి, ఆ సంబంధం ఒద్దనుకుని వెళ్లిపోబోతాడు. అప్పుడు పొరబాట్న కొట్టాననీ, దయచేసి పెళ్లి ఆపకండనీ, తానసలు వాళ్ల కొడుకునే కాదనీ బ్రతిమలాడుతూ క్షమాపణలు కోరతాడు వేణు. అయితే వేణుని అవమానించినందుకు మోహన్ పెళ్లివాళ్లని తిట్టి పంపేస్తాడు. బాధలో ఉన్న వేణుని బార్‌కి తీసుకెళ్లి తనతో పాటు మందు తాగిస్తాడు మోహన్. డబ్బులు తక్కువవుతాయి. శ్రుతికి ఫోన్ చేస్తాడు వేణు. ఆమె వచ్చి డబ్బు కడుతుంది. మత్తులో ఆమెకి మ్యూజికల్ వాచ్ ఇస్తాడు వేణు. మరుసటిరోజు ఆ వాచ్‌ని గమనించి, దాని గురించి శ్రుతిని ఆరా తీస్తుంది అను. అది తన బాయ్‌ఫ్రెండ్ వేణు ఇచ్చాడని చెబుతుంది శ్రుతి. నిర్ఘాంతపోతుంది అను. వేణుని తప్పుగా అర్థం చేసుకుంటుంది. శ్రుతికి వాచ్ ఇచ్చాననన్న సంగతి జ్ఞాపకమొచ్చి ఆమె ఇంటికి వెళ్లి, ఆ వాచ్ తనకు చిన్ననాటి స్నేహితురాలు అను ఇచ్చిన సంగతి చెప్పి, తిరిగి తీసుకుంటాడు. టీవీ చానల్లో జరుగుతున్న 'స్నేహం-ప్రేమ' చర్చా కార్యక్రమంలో అను, వేణు పాల్గొంటారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సంధానకర్తగా వ్యవహరించే ఆ చర్చలో ప్రేమ సక్సెస్ అయినా, ఫెయిలైనా అందులో ఆడా, మగా ఇద్దరికీ సమాన పాత్ర ఉందంటూ, తన చిన్ననాటి స్నేహం గురించి చెబుతాడు వేణు. తన నేస్తం కలిస్తే తనెవరో చెప్పననీ, ఆమె మనసులో ఏముందో మొదట తెలుసుకుంటాననీ అంటాడు. అది విని అతడి మనసులో తనకున్న స్థానం అర్థమై ఆనందంతో ఉప్పొంగిపోతుంది అను. తన మీద అతడు చేయాలనుకున్న ప్రయోగాన్ని అతడిమీద తనే చేస్తుంది. తనెవరో చెప్పకుండా వేణుతో స్నేహం పెంచుకుంటుంది. వేణు కుటుంబానికీ సన్నిహితమవుతుంది. వేణు చెల్లెలికి మరో సంబంధం కుదురుతుంది.
అయితే అనుకోని రీతిలో తనతో వియ్యమందమంటూ ఎమ్మార్వోతో పెళ్లి ప్రపోజల్ పెడతాడు ఎంపీ (దేవదాస్ కనకాల). వియ్యమందితే వచ్చే 500 కోట్ల రూపాయల రైల్వే కాంట్రాక్టుకి ఆశపడి అనుని ఎంపీ కొడుక్కిచ్చి చేయడానికి ఆనందంగా ఒప్పుకుంటాడు గంగాధరం. తండ్రికి చంటితో తన ప్రేమ గురించి చెబుతుంది అను. 'మనసంతా నువ్వే' సీరియల్లో జరుగుతున్న సంఘటనలు చదివి రేణు, అను ఒక్కరే అని తెలుసుకుంటాడు వేణు. అనుని కలవడానికి తహతహలాడుతున్న వేణుని గంగాధరం కలిసి, నీ చెల్లి పెళ్లి జరగాలంటే ఎంపీ కొడుకుతో తన కూతురి పెళ్లి జరగాలనీ అంటాడు. ఇప్పటికే ఓసారి పెళ్లి ఆగిందనీ, ఈ పెళ్లి కూడా ఆగితే నీ తండ్రి గుండె ఆగిపోతుందనీ బెదిరిస్తాడు. చెల్లి కోసం తన ప్రేమని త్యాగం చెయ్యడానికి సిద్ధపడతాడు వేణు. ఆ తర్వాత ఏమయ్యింది? అను, వేణు ఎలా ఒక్కటయ్యారు? అనేది క్లైమాక్స్.
నేను దాన్ని పట్టుకోలేకపోయా
-వి.ఎన్. ఆదిత్య
అప్పట్లో పరుచూరి బ్రదర్స్ వద్ద వీరు పోట్ల అసిస్టెంట్‌గా ఉన్నాడు. నేను, వీరు స్క్రిప్ట్ వర్క్ చేశాం. మేం చేసిన వర్క్‌ని ఎప్పటికప్పుడు రాజు గారు చెక్‌చేసి, మమ్మల్ని సరైన ట్రాకులో పెడుతూ వచ్చారు. మరోవైపు గోపాలకృష్ణ గారు డైలాగ్ వెర్షన్ రాస్తూ వచ్చారు. స్క్రిప్టు పూర్తయ్యాక 'మహేశ్‌తో చేద్దామా?' అనడిగారు రాజు గారు. అది మహేశ్ వంటి మాస్ హీరోకి సరిపోదనీ, అప్పుడే లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుంటున్న ఉదయ్ కిరణ్ అయితే బాగుంటుందనీ చేప్పా. అలా అతను ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. చంటి పాత్రలోని అమాయకత్వానికి మన పక్కింటబ్బాయిలా కనిపించే అతని ముఖం అచ్చుగుద్దినట్లు సరిపోయింది.
ఆ రోజుల్లో టీవీలో గొల్లపూడి మారుతీరావు గారి 'ప్రజావేదిక' కార్యక్రమం సూపర్‌హిట్. సినిమాలో మేం పెట్టిన 'ప్రేమ-స్నేహం' చర్చావేదికకి ప్రేరణ అదే. మా ప్రేమకథకి కీలకమైంది ఆ ప్రజావేదిక సన్నివేశమే. అందులో ప్రయోక్తగా వ్యవహరించే పాత్రకి మారుతీరావు గారినే తీసుకోవాలనుకున్నాం. చివరికి సీతారామశాస్త్రి గారు దాన్ని అమోఘంగా చేశారు. ఆ సీనులో తను చెప్పే డైలాగ్స్‌తో పాటు ఉదయ్ డైలాగ్స్‌ని రాసింది ఆయనే. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌లో రీషూట్ లేని ఏకైక చిత్రం 'మనసంతా నువ్వే'. మీకో సంగతి చెప్పాలి. నేను పోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఉంటే, 'చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా' పాటలో కొంత భాగాన్ని రాజు గారే చిత్రీకరించారు. రీమాసేన్, సిజ్జు మధ్య ఎయిర్‌పోర్ట్ సీనుని తీసిందీ ఆయనే.
సినిమా విడుదలయ్యాక మారుతీరావు గారి నుంచి ఫోన్ వచ్చింది. సినిమాలోని ప్రతి షాట్ గురించీ ఆయన విశ్లేషిస్తూ, ప్రశంసిస్తూ మాట్లాడారు.
కృష్ణారెడ్డి ఎడిటింగ్ గురించి కూడా చెప్పాలి. ఎడిటింగ్ రూములో ఉన్నప్పుడు చివరలో ఎమోషన్స్ మిస్సయ్యాయని రాజు గారు, గోపాలకృష్ణ గారు భావించారు. అప్పుడు 'నీ స్నేహం..' పాటని మరో చోట కూడా 'కట్.. పేస్ట్' చేశారు కృష్ణారెడ్డి. దాంతో ఎమోషన్స్ బ్రహ్మాండంగా క్యారీ అయ్యాయి. నేను దాన్ని పట్టుకోలేకపోయా. రీ రికార్డింగ్‌తో ఆ సీన్ బాగా పండింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక 'నీ స్నేహం' సినిమా కోసం అందులో నటిస్తున్న కె. విశ్వనాథ్ గారు రాజు గారి ఆఫీసుకి వచ్చారు. 'ఏడయ్యా. నీ డైరెక్టర్ని పరిచయం చెయ్యవా?' అనడిగారు రాజు గార్ని. నన్ను పరిచయం చెయ్యగానే 'ఇంత చిన్నవాడివా. యాన్ యంగ్‌స్టర్ విత్ గుడ్ టేస్ట్' అని మెచ్చుకున్నారు. అలాగే ఓసారి చిరంజీవి గారింటికి నేను వెళ్లిన సమయంలో ఆయన 'మనసంతా నువ్వే'ని డీవీడీలో చూస్తున్నారు. స్క్రీన్‌ప్లే గురించి మాట్లాడి మెచ్చుకున్నారు. ఇలా చాలామంది పెద్దవాళ్ల నుంచి మంచి మంచి ప్రశంసలు అందుకున్నా.
(వచ్చే వారం 'మనసంతా నువ్వే' విజయానికి దోహదం చేసిన అంశాలు)

Saturday, October 23, 2010
Tuesday, June 22, 2010
Subscribe to:
Posts (Atom)