"యాక్టర్ కావాలనేది నా యాంబిషన్. అయ్యాను. యాక్టర్ కాకపోయుంటే అవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాణ్ణి. అంతకుమించి నేను ప్రత్యేకంగా వేరే లక్ష్యం ఏమీ పెట్టుకోలేదు'' అని చెప్పారు హీరో రామ్. తమన్నా జంటగా ఆయన నటిస్తున్న 'ఎందుకంటే ప్రేమంట!' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో శ్రీ స్రవంతీ మూవీస్ పతాకంపై రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి రామ్ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...
నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్ 'ఎందుకంటే ప్రేమంట!'. ఇదే సినిమాతో తమిళంలో పరిచయం కాబోతున్నా. ఏక కాలంలో రెండు భాషల్లో ఈ సినిమా చేశాం. తమిళ వెర్షన్ పేరు 'ఏన్ ఎండ్రాళ్ కాదల్ ఎన్బేన్'. ఇది తమిళంలో నేను నటించిన తొలి చిత్రం. ప్రేమ అనేది యూనివర్సల్ ప్లాట్. తెలుగు, తమిళ నేటివిటీకి సంబంధించిన చిన్న చిన్న మార్పులు తప్పితే ఈ రెండు సినిమాలు ఒకటే. తమిళంలో నేనే డబ్బింగ్ చెప్పా. చెన్నైలోనే పెరిగా కాబట్టి తెలుగుతో పాటు తమిళం కూడా నాకు బాగా వచ్చు. కథే బలం కథే ఈ సినిమాకి ప్రధాన బలం. ఓ అమ్మాయి ప్రేమలో పడిన అబ్బాయి ఆమె గురించి ఎంత స్థాయికి వెళతాడు, ఏం చేస్తాడనేది కథ. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ. ఫస్టాఫ్ స్విట్జర్లాండ్, పారిస్‌లోనూ, సెకండాఫ్ హైదరాబాద్‌లోనూ కథ నడుస్తుంది. పాటలు చాలా బాగా వచ్చాయి. 'నీ చూపులే' పాట సినిమాకి ప్రత్యేకాకర్షణ. సినిమా అంతా విజువల్ ఫీస్ట్.
సమాన పాత్రలు
కరుణాకరన్ లవ్ స్టోరీస్ బాగా తీస్తారు. లవ్ స్టోరీ అంటే హీరో హీరోయిన్లు ఇద్దరికీ సమాన పాత్రలు ఉంటాయి. అంటే తమన్నా నాతో సమానమైన పాత్ర చేసింది. ఆమె ఎలాంటి నటో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనిలేదు. ఇందులో నేను చేసింది నా వయసుకి సంబంధించిన పాత్రే. నన్ను ఇప్పటివరకూ ఎవరూ చూపించని విధంగా చూపించాడు దర్శకుడు. ఈ పాత్ర చేయడం కష్టంగానూ అనిపించింది, అదేవిధంగా ఉద్వేగంగానూ అనిపించింది. రిషి ('ఎ ఫిల్మ్ బై అరవింద్' ఫేమ్) మెయిన్ విలన్‌గా నటిస్తే, రచయిత కోన వెంకట్ మరో విలన్ కేరక్టర్ చేశారు.
బాలీవుడ్ ఆలోచన లేదు
సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఒకటి, భాస్కర్ డైరెక్షన్‌లో ఒకటి చేస్తున్నా. ప్రచారంలోకి వచ్చినట్లు శ్రీనివాస్‌తో నేను చేస్తోంది 'కందిరీగ 2' కాదు. కొత్త కథ. ఇంకా హీరోయిన్‌ని ఎంపిక చేయలేదు. భాస్కర్‌తో చేస్తున్నది ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉండే లవ్ స్టోరీ. ఇందులో కంప్లీట్ డిఫరెంట్ కేరక్టర్ చేస్తున్నా. ఈ సినిమా ద్వారా శుభా ఫుటేల్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. 'రెడీ' తర్వాత బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి. అయితే అక్కడికి వెళ్లాలనే ఆలోచన ఇప్పటివరకూ కలగలేదు.
Showing posts with label bommarillu bhaskar. Show all posts
Showing posts with label bommarillu bhaskar. Show all posts
Friday, May 25, 2012
Tuesday, November 8, 2011
తొమ్మిదేళ్లు... తొమ్మిది మంది కొత్త దర్శకులు!
కొత్త దర్శకులంటే సిద్ధార్థ్‌కి మోజెక్కువ. అందుకే తొమ్మిదేళ్ల కెరీర్‌లో సరిగ్గా తొమ్మిది మంది కొత్త దర్శకులతో పనిచేశాడు. ఈ వరుసలో వస్తున్న అతడి తదుపరి సినిమా 'ఓ మై ఫ్రెండ్'తో కరీంనగర్‌కి చెందిన వేణుశ్రీరాం దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ఇదే సినిమాతో కేరళకు చెందిన రాహుల్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఆడియో సక్సెస్ అవడంతో ఈ సినిమా విజయంపై సిద్ధుతో పాటు నిర్మాత దిల్ రాజు చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాడు. తమ బేనర్‌లో ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు వచ్చాయనీ, కానీ 'ఓ మై ఫ్రెండ్' గ్రేట్ ఫిల్మ్ అవుతుందనీ గొప్పగా చెప్పాడు. సిద్ధు విషయానికొస్తే అతడి 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో ఫేమస్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డైరెక్టర్‌గా అవతారమెత్తి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. ఆ తర్వాత కాలంలో సిద్ధు నటించిన 'చుక్కల్లో చంద్రుడు' ద్వారా మణిరత్నం శిష్యుడు శివకుమార్, 'బొమ్మరిల్లు' ద్వారా భాస్కర్, 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ద్వారా డాలీ, 'ఓయ్!'తో ఆనంద్ రంగా, 'బావ'తో రాంబాబు, 'అనగనగా ఓ ధీరుడు'తో సూర్యప్రకాశ్, '180'తో జయేంద్ర డైరెక్టర్లుగా పరిచయమయ్యారు. వీరిలో ప్రభుదేవా, భాస్కర్ మాత్రమే సక్సెసయ్యారు. '180' సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని సిద్ధు గట్టిగా నమ్మాడు. అయితే విమర్శకుల ప్రశంసలు పొందిన స్థాయిలో ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్ని గెలవలేకపోయింది. ఇప్పుడు 'ఓ మై ఫ్రెండ్'తోనైనా అతడికో హిట్టు వస్తుందేమో చూడాలి.
Saturday, October 15, 2011
బిగ్ స్టోరీ: హవా తగ్గిన పరభాషా దర్శకులు!
ఇంతకాలం తెలుగు సినిమాల్లో పరభాషా నాయికలు, పరభాషా విలన్లతో పాటు పరభాషా దర్శకుల హోరు ఎక్కువయ్యిందని వాపోతూ వచ్చాం. తెలుగు వాళ్లని పట్టించుకోవడం లేదని బెంగపడుతూ వచ్చాం. ఇప్పుడు ఆ బాధ దర్శకుల విషయంలో పడాల్సిన అవసరం లేదు. మళ్లీ మన దర్శకులకి రోజులొచ్చాయి. ఎస్.ఎస్. రాజమౌళి, పూరి జగన్నాథ్, వి.వి. వినాయక్, శ్రీను వైట్ల, త్రివిక్రం, సుకుమార్, సురేందర్‌రెడ్డి, సంపత్ నంది, శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకులు రాణిస్తుండటంతో ఇతర భాషల నుంచి వచ్చే దర్శకుల తాకిడి ఇటీవల తగ్గింది. కొంత కాలం క్రితం తెలుగు దర్శకులపై కంటే ఇతర భాషా దర్శకులపైనే మన హీరోలు, నిర్మాతలు నమ్మకం పెట్టుకున్నట్లు కనిపించింది. తమిళ కథలు, తమిళ దర్శకులే శరణ్యమన్నట్లు మన హీరోలు, నిర్మాతలు అప్పట్లో వ్యవహరించారు. ప్రస్తుతం టాప్ హీరోల్లో పవన్‌కల్యాణ్, ప్రభాస్ మాత్రమే తమిళ దర్శకులతో పనిచేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విష్ణువర్థన్ 'పంజా' తీస్తుంటే, ప్రభాస్‌తో రాఘవ లారెన్స్ 'రెబల్' తీస్తున్నాడు.
ఇదివరలో తెలుగులో మంచి డిమాండ్ ఉన్న పి. వాసు, విక్రమన్, సురేశ్‌కృష్ణలను ఇప్పుడు తెలుగు హీరోలెవరూ పట్టించుకోవడం లేదు. 'ఏ మాయ చేసావె' హిట్ తర్వాత కూడా గౌతం మీనన్ వెంట మన వాళ్లెవరూ పడటం లేదు. 'ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే' హిట్ తర్వాత కూడా సెల్వరాఘవన్ మళ్లీ తెలుగు వైపు దృష్టిపెట్టలేదు. 'సత్యం'తో ధూంధాంగా తెలుగులోకి వచ్చిన మలయాళీ సూర్యకిరణ్‌ని ఎవరూ పట్టించుకోవడం లేదు. 'ప్రియమైన నీకు', 'అమ్మాయి బాగుంది' సినిమాల దర్శకుడు బాలశేఖరన్ ఏమయ్యాడో తెలీదు. 'నాని', 'పులి' సినిమాల ఫెయిల్యూర్‌తో ఎస్.జె. సూర్య పత్తాలేకుండా పోయాడు. తెలుగులోనే దర్శకత్వంలో ఓనమాలు దిద్దుకున్న బొమ్మరిల్లు భాస్కర్ తమిళుడైనా అతన్ని తెలుగువాడిగానే ట్రీట్ చేయాలి. తమిళం వైపు చూపు సారించకుండా తెలుగులోనే కెరీర్ వెదుక్కుంటున్న కరుణాకరన్‌కూ మినహాయింపు ఇవ్వొచ్చు.
ఓ వైపు హీరోయిన్లు, ఇంకోవైపు విలన్లు, సైడు విలన్లు, కేరక్టర్ ఆర్టిస్టులు, మరోవైపు రీమేక్‌లు తెలుగు సినీ పరిశ్రమపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటే సృజనాత్మక రంగమైన దర్శకత్వం కూడా దిగుమతికి గురికావడం తెలుగు సినీరంగంలోని భావ దారిద్ర్యాన్ని పట్టిస్తున్నదని నిన్నటిదాకా బాధపడినవాళ్లు ఇప్పుడు ఒకింత ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్నటి స్థితిపై "తెలుగు సినిమా చూస్తే ఏమున్నది గర్వకారణం... సమస్తం పరభాషా వాసనమయం" అంటూ శ్రీశ్రీని అనుకరిస్తూ మాట్లాడిన కవులు ఇప్పుడు తెలుగు దర్శకులకి మంచి రోజులు రావడంతో ఖుషీ అవుతున్నారు.
తెరముందు నాయకుడు హీరో కావచ్చు. తెరవెనుక నాయకుడు (కెప్టెన్) మాత్రం దర్శకుడే. అటువంటి నాయకత్వ స్థానంలో మనవాళ్లని కాకుండా ఇతర భాషలవాళ్లకి పెద్దపీట వేయడం ఏమంత న్యాయం? 'ప్రతిభ ఎవరిలో ఉన్నా ప్రోత్సహించాలి. అందుకు భాషా భేదం అడ్డుకాకూడదు' అంటారు కొంతమంది. నిజమే. అయితే అది కొంతవరకే. ఒకరిద్దర్ని అలా తీసుకు రావడంలో తప్పులేదు. అయితే అదేపనిగా ఒకరి తర్వాత మరొకర్ని దిగుమతి చేసుకుంటూ పోతుంటే మన దర్శకులు ఏం కావాలి? మనవాళ్లు తీసే సినిమాలన్నీ ఫెయిలయ్యి, పరాయి దర్శకుల సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతుంటే.. సరేననుకోవచ్చు. అలా ఏమీ జరగడం లేదు. పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతగా హీరోలు, నిర్మాతలు పర భాషా దర్శకులవైపు చూపు సారిస్తూ రావడం వల్లే వాళ్ల హవా నడిచింది. ఇప్పుడు వాళ్ల చేతుల్లో విజయాన్ని అందించే మంత్రదండమేదీ లేదని తెలియడంతో తిరిగి తెలుగు దర్శకులకి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ ట్రెండు మనకి మంచిదే.

Friday, August 19, 2011
న్యూస్: 2012లో హీరోగా పరిచయం కానున్న వరుణ్‌తేజ్
రాంచరణ్, జెనీలియా జంటగా భాస్కర్ డైరెక్షన్‌లో తీసిన 'ఆరెంజ్' సినిమా షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు అంజనా ప్రొడక్షన్స్ అధినేత నాగబాబు. డిజాస్టర్ కావడంతో ఆ సినిమాకి పెట్టిన డబ్బంతా బూడిదలో పోసినట్లయ్యింది. ఈ సినిమా అనుభవం తర్వాత అతని అన్నదమ్ములైన చిరంజీవి, పవన్ కల్యాణ్ అతనికి సపోర్ట్‌గా నిలిచారు. తనకైనా, కల్యాణ్‌కైనా ఇప్పుడు చిరంజీవే తండ్రిలాంటివాడని తండ్రిని కోల్పోయిన ఆయన భావిస్తున్నారు.
త్వరలో నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ హీరోగా తెరమీదకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. "2012లో వాడు హీరోగా పరిచయమయ్యే సినిమా మొదలవుతుంది. ఈలోగా హీరోకి అవసరమైన అన్ని అంశాల్లోనూ వాడు తర్ఫీదు అవుతున్నాడు. అశ్వనీదత్ వాణ్ణి హీరోగా పరిచయం చేస్తారు. ఆ తర్వాత అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్‌లో నటిస్తాడు" అని ఆయన చెప్పారు. వరుణ్ భవిష్యత్ గురించి మాట్లాడుతూ "వాడికి మేం ప్లాట్‌ఫాం మాత్రం అమరుస్తాం. వాడు సక్సెస్ అయ్యేదీ, లేనిదీ వాడి ప్రతిభా పాటవాల మీదే ఆధారపడి ఉంటుంది. స్టార్ల కుటుంబం నుంచి వస్తున్నందువల్ల వాడి మీద ఆ వత్తిడి సహజంగానే ఉంటుంది. దాన్ని వాడు అధిగమించ గలగాలి" అని నిర్మొహమాటంగా ఆయన చెప్పారు.

Tuesday, August 16, 2011
న్యూస్: రానా, జెనీలియా జంట ఆకట్టుకుంటుందా?
దగ్గుబాటి రానా ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి తెలుగు సినిమా 'నా ఇష్టం' అయితే, మరొకటి హిందీ సినిమా 'డిపార్ట్‌మెంట్'. వీటిలో రెండోదాన్ని రాంగోపాల్‌వర్మ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. గమనించదగ్గ సంగతేమంటే రానా 'నా ఇష్టం' టైటిల్ వర్మ రాసిన పుస్తకం 'నా ఇష్టం' పేరే కావడం. ఇందులో రానా సరసన బక్క పలుచని భామ జెనీలియా నటిస్తోంది. ఈ సినిమాలో ఇదివరకు కనిపించిన దానికి భిన్నంగా మీసం లేకుండా లవర్ బాయ్ రోల్‌లో కనిపించనున్నాడు రానా. సుకుమార్, బొమ్మరిల్లు భాస్కర్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన ప్రకాష్ తోలేటి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. 'సింహా' వంటి సూపర్‌హిట్ మూవీ తర్వాత యునైటెడ్ మూవీస్ నిర్మిస్తుండటంతో 'నా ఇష్టం'పై అంచనాలు బాగానే ఉన్నాయి. చక్రి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కథ ఎక్కువగా మలేషియా బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. 'లీడర్', 'నేను నా రాక్షసి', బాలీవుడ్ సినిమా 'దం మారో దం' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో 'నా ఇష్టం' మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు రానా. మరి రానా, జెనీలియా జోడీని జనం ఆదరిస్తారా? వెయిట్ అండ్ సీ.
Thursday, November 4, 2010
ఫోకస్: 2010 ముగింపైనా సంతోషాన్నిస్తుందా? (మొదటి భాగం)
విజయాల కోసం మొహం వాచిపోతున్న తెలుగు చిత్ర పరిశ్రమ ఈ ఏడాది చివరినైనా సంతృప్తికరంగా ముగిస్తుందా? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. పేలవమైన ఆరంభాన్నిచ్చిన 2010లో ఇప్పటివరకు 'సింహా', 'డార్లింగ్', 'మర్యాదరామన్న', 'ఏమాయ చేసావె', 'వేదం', 'బిందాస్' వంటి అతికొద్ది సినిమాలు మాత్రమే ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా పరిటాల రవి జీవితంపై రాంగోపాల్ వర్మ రూపొందించిన 'రక్త చరిత్ర' విడుదలైన ఐదు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఐదు కోట్ల రూపాయలకు మించి వసూలుచేసి, హిట్టుగా నిలిచింది. రజనీకాంత్ 'రోబో' సూపర్ డూపర్ హిట్టయినా అది మన సినిమా కాదు. ఈ పరిస్థితుల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో రానున్న కొన్ని సినిమాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వీటిలో సగమైనా విజయాలను సాధిస్తే చిత్రసీమ కాస్తంతయినా సంతోషాన్ని పొందుతుంది. ఆ ఆసక్తికర సినిమాలేమిటో చర్చించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.
'ఆరెంజ్' మీదే అందరి చూపు
సందేహం అవసరం లేదు. ఈ రెండు నెలల్లో రాబోతోన్న సినిమాలన్నింటిలోకీ అత్యధిక శాతం ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తోన్న చిత్రం 'ఆరెంజ్'. సంచలనాల 'మగధీర' తర్వాత రాంచరణ్ హీరోగా నటించిన సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమా విషయంలో అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు సాధారణ ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాల్లో ముఖ్యమైనవి.. దీన్ని భాస్కర్ డైరెక్ట్ చేయడం, నాయికగా జెనీలియా నటించడం, తొలిసారి రాంచరణ్ లవర్ బాయ్ గా కనిపించబోవడం. పైగా ఈ చిత్రాన్ని నిర్మించింది చిరంజీవి సొంత బేనర్ అయిన అంజనా ప్రొడక్షన్స్. ఈ సినిమా హిట్టయితే భాస్కర్ కి హ్యాట్రిక్ లభించినట్లవుతుంది. అతని మునుపటి సినిమాలు రెండు.. 'బొమ్మరిల్లు', 'పరుగు' విజయాల్ని సాధించాయి. అయితే లవ్ స్టోరీతో తయారైన 'ఆరెంజ్'కి నిర్మాణ వ్యయం అదుపుతప్పి పోయిందని వినిపిస్తోంది. గ్రాఫిక్స్ ప్రధానంగా భారీతనంతో నిర్మాణమైన 'మగధీర' చిత్రానికే 38 కోట్ల రూపాయలు ఖర్చయితే, సాఫ్ట్ లవ్ స్టోరీతో తీసిన 'ఆరెంజ్'కి దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చయ్యిందని సమాచారం. మలేషియా, ఆస్ట్రేలియాల్లో ఎక్కువ భాగం షూటింగ్ జరగడం, పలు సన్నివేశాల్ని రీ షూట్ చేయడం వ్యయం అదుపు తప్పడానికి కారణమని తెలుస్తోంది. హారిస్ జయరాజ్ సంగీతం సమకూర్చగా ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాటలు ప్రజాదరణ పొందాయి. నవంబర్ ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ చిత్రం ద్వారా షాజన్ పదంసీ అనే మోడల్ సెకండ్ హీరోయినుగా పరిచయమవుతోంది.
'గగనం'లో 'రగడ'
డిసెంబర్ మాసమంటే సీనియర్ స్టార్ హీరో నాగార్జునకి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ నెలలో విడుదలైన ఆయన సినిమాలు అధిక శాతం విజయాన్నే చవిచూశాయి. 'మన్మథుడు', 'మాస్', 'కింగ్' వంటి సినిమాలు వాటిలో కొన్ని. ఆ సెంటిమెంట్ తోటే ఆయన సినిమా 'రగడ' డిసెంబర్ ద్వితీయార్థంలో విడుదలయ్యేందుకు సన్నద్ధమవుతోంది. మంచు మనోజ్ కి 'బిందాస్' రూపంలో తొలి విజయాన్ని అందించిన వీరు పోట్ల ఈ చిత్రానికి దర్శకుడు. 'సూపర్', 'డాన్' సినిమాల తర్వాత నాగార్జున సరసన ముచ్చటగా మూడోసారి అనుష్క నాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో రెండో నాయిక పాత్రని ప్రియమణి చేస్తోంది. కామాక్షి కళామూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో నాగార్జున ఇటు వినోదం, అటు యాక్షన్ మేళవించిన పాత్రని చేస్తున్నారు. మునుపటి సినిమా 'కేడి' అట్టర్ ఫ్లాపవడంతో ఈ సినిమాని ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అయితే దీనికంటే ముందుగా ఆయన నటించిన మరో సినిమా నవంబరులోనే విడుదల కాబోతోంది. ఆ చిత్రం 'గగనం'. చెప్పాలంటే తెలుగులో ఇదో ప్రయోగాత్మక చిత్రం. 1999లో జరిగిన కాందహార్ హైజాక్ సంఘటన ఆధారంగా తయారుచేసిన కథతో ఈ సినిమాని డైరెక్టర్ రాధామోహన్ రూపొందించాడు. ఎయిర్ కమాండరుగా నాగార్జున నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు చేశారు. పాటలు లేని ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ కూడా కనిపించదు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రాబోతోంది. (ఇంకావుంది)

Thursday, July 15, 2010
Tamil Directors Rules Tollywood

తెలుగు తెరపైకి పరభాషా దర్శకుల, ప్రత్యేకించి తమిళ దర్శకుల దండయాత్ర మళ్లీ మొదలైంది. నాలుగైదేళ్ల క్రితం ఇలాగే పరాయి దర్శకుల జోరు కొనసాగింది. తర్వాత వాళ్ల సినిమాలు చెప్పుకోదగ్గ ప్రభావం చూపకపోవడంతో అడపాదడపా మాత్రమే వాళ్లు కనిపిస్తూ వచ్చారు. 'ఏమాయ చేసావె', 'డార్లింగ్' సినిమాల హిట్లతో తమిళ దర్శకులకి మళ్లీ వచ్చింది మంచి డిమాండ్.
కళకి భాషాభేదం లేదనేది సత్యమే. అందరూ దాన్ని అంగీకరిస్తారు. కానీ అది మరొకరి అస్తిత్వానికి దెబ్బ తగిలేలా వుండకూడదు కదా. తెలుగు, తమిళ సినిమాల కారణంగా తమ సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారేసరికి కన్నఢిగులు ఏంచేశారు? పరభాషా సినిమాల మీద కావలసినన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. కర్ణాటకలో తెలుగు లేదా తమిళ లేదా హిందీ సినిమా ఏదైనా 15 ప్రింట్లకు మించి రిలీజ్ కాకూడదనేది వాళ్లు అనుసరిస్తున్న నిబంధన. లేకపోతే తమ కన్నడ సినిమాలు విడుదల చేసుకోడానికే థియేటర్లు దొరకని ప్రమాదాన్ని కొంత కాలం దాకా వారు ఎదుర్కొన్నారు.
ఒక భాషలో విడుదలయిన మంచి సినిమాని మరో భాషవాళ్లు చూడకూడదని ఎవరూ చెప్పరు. హాయిగా చూడొచ్చు. ఇప్పటికే హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల డబ్బింగ్ రూపాలు తెలుగులో తామర తంపరగా వస్తూ తెలుగు సినిమాలకి గట్టి పోటీదారులుగా నిలుస్తున్నాయి. చాలా సందర్భాల్లో తెలుగు సినిమాకి ఈ డబ్బింగ్ సినిమాల వల్ల థియేటర్లు దొరకని పరిస్థితి ఎదురవుతోంది. ఇదే తెలుగు సినిమా పరిశ్రమకి ప్రతికూల అంశమనుకుంటూ ఉంటే ఇప్పుడు ఏకంగా తెలుగు డైరెక్టర్ల అవకాశాల్ని తమిళులు తన్నుకుపోతున్నారు! దాన్ని మన హీరోలు ప్రోత్సహిస్తున్నారు!!
ఇవాళ పదికి మించిన తెలుగు సినిమాలు తమిళ డైరెక్టర్ల చేతుల్లో ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. వాటిలో మొదటగా పవన్ కల్యాణ్ సినిమా 'పులి' ఆగస్టు 12న రిలీజుకు సిద్ధమవుతోంది. దీనికి ఎస్.జె. సూర్య డైరెక్టర్. ఇదివరకు సూర్య, పవన్ కాంబినేషన్లో 'ఖుషి' వచ్చి సూపర్ డూపర్ హిట్టయ్యింది. దాంతో సహజంగానే 'కొమరం పులి' సినిమా మీద అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. 'బొమ్మరిల్లు'తో తెలుగులోనే కెరీర్ ఆరంభించిన తమిళుడు భాస్కర్, 'పరుగు' తర్వాత ఇప్పుడు రాంచరణ్ హీరోగా 'ఆరంజ్' సినిమా చేస్తున్నాడు. జెనీలియా, కొత్తమ్మాయి షాజన్ పదమ్సీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని అంజనా ప్రొడక్షన్స్ బ్యానరుపై నాగబాబు నిర్మిస్తున్నారు.
రాంచరణ్ తోటే మరో సినిమా 'మెరుపు' తీస్తున్న డైరెక్టర్ కూడా తమిళుడే. అతను ధరణి. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ కథానాయిక. ధరణికి ఇదే తొలి తెలుగు సినిమా కాదు. ఇదివరకు అతను పవన్ కల్యాణ్ హీరోగా 'బంగారం' సినిమాని డైరెక్ట్ చేశాడు. తెలుగులో నిర్మాత ఎ.ఎం. రత్నం కుమారుఢు రవికృష్ణ హీరోగా 'ముద్దుల కొడుకు' చిత్రాన్ని రూపొందించిన రాధామోహన్ ఇప్పుడు నాగార్జునతో 'గగనం'ని తీస్తున్నాడు. బ్రహ్మానందం ప్రధాన పాత్ర చేస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఆర్మీ కమెండోగా నటిస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు. ఆమధ్య దిల్ రాజు బ్యానరులోనే వచ్చిన 'ఆకాశమంత' డైరెక్టర్ కూడా రాధామోహనే. తమిళ డైరెక్టర్ పి. వాసు తెలుగువాళ్లకి కొత్తవాడేం కాదు. ఆయన తమిళంలో రూపొందించిన అనేక సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. స్వయంగా ఆయన కొన్ని తెలుగు సినిమాల్ని డైరెక్ట్ చేశారు. రజనీకాంత్ తో ఆయన తీసిన 'చంద్రముఖి' తెలుగులోనూ సూపర్ హిట్ అయిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడు వెంకటేశ్ తో ఆయన 'చంద్రముఖి-2' తీస్తున్నారు. అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ కూడా నటిస్తున్న ఈ సినిమా కన్నడంలో ఇటీవల విడుదలై సూపర్ హిట్టయిన 'ఆప్తకక్షక'కి రీమేక్. బెల్లంకొండ సురేశ్ ఈ సినిమాకి నిర్మాత. వరుణ్ సందేశ్, వేగ, శరణ్యా మోహన్ కాంబినేషనులో రూపొందుతున్న 'హ్యాపీ హ్యాపీగా' సినిమాని తమిళుడైన కొత్త డైరెక్టర్ ప్రియా శరణ్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో తమిళ డైరెక్టర్ కదిర్ తో 'కుదిరితే కప్పు కాఫీ' అనే సినిమా చేయబోతున్నాడు వరుణ్ సండేశ్. ఆగస్టులో షూటింగ్ మొదలయ్యే ఈ సినిమాని మహాగణపతి ఫిలిమ్స్ బ్యానరుపై ఎం. సుధాకర్ నిర్మిస్తున్నారు. 'హృదయం', 'ప్రేమదేశం', 'ప్రేమికుల రోజు' సినిమాలతో కదిర్ ఇప్పటికే తెలుగువాళ్లకి బాగా పరిచయం.
'ఘర్షణ', 'ఏమాయ చేసావె' సినిమాలను తెలుగులో తీసిన తమిళ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఇప్పుడు రానాని డైరెక్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తయారయ్యే ఈ సినిమాలో సమంతా హీరోయిన్. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. తెలుగులోనే కెరీర్ సృష్టించుకున్న తమిళ దర్శకుడు ఎ. కరుణాకరన్ 'డార్లింగ్' తర్వాత రాంచరణ్ తో సినిమా చేయడానికి కథ రెడీ చేసుకున్నాడు. అయితే రాంచరణ్ ప్రస్తుతం 'ఆరంజ్', 'మెరుపు' సినిమాలతో బిజీగా మారడంతో రామ్ తో సినిమా చెయ్యాడానికి ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. అలాగే 'మాస్', 'స్టైల్', 'డాన్' సినిమాల డైరెక్టర్ లారెన్స్ తెలుగులో ప్రభాస్ ని డైరెక్ట్ చెయ్యడానికి సిద్దమవుతున్నాడు. శ్రీ బాలాజీ సినిమా పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాలో అనుష్క హీరోయిన్. తమిళంలో అజిత్ తో 'బిల్లా'ని డైరెక్ట్ చేసిన విష్ణువర్థన్ తెలుగులో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. అతని తొలి తెలుగు సినిమాలో హీరో మరెవరో కాదు.. అల్లు అర్జున్. ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా నిర్మాణం కాబోతోంది.
ఇలా అనేక తెలుగు సినిమాలు ఇవాళ తమిళ డైరెక్టర్ల చేతుల్లో ప్రాణం పోసుకుంటున్నాయి. ఆమేరకు తెలుగు డైరెక్టర్లు అవకాశాలు కోల్పోయినట్లేగా. తమకి సబ్జెక్టు నచ్చడమే ముఖ్యం కానీ, డైరెక్టర్ ఏ భాష వాడనేది తమకు అనవసరమనేది మన హీరోల మాట. అంటే తెలుగు దర్శకులు చెబుతున్న కథలు వాళ్లకి నచ్చడం లేదనేదే దానికి అర్థం. ఈ విషయమై మన డైరెక్టర్లు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భవిష్యత్తులో టాలీవుడ్డులో తమిళ డైరెక్టర్ల పెత్తనమే చలామణీ అయ్యే ప్రమాదం ఉంది.
Subscribe to:
Posts (Atom)