Showing posts with label malladi. Show all posts
Showing posts with label malladi. Show all posts

Wednesday, November 3, 2010

నేటి పాట: రాగమయీ రావే (జయభేరి)

చిత్రం: జయభేరి (1959)
రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గానం: ఘంటసాల

పల్లవి:
రాగమయీ రావే అనురాగమయీ రావే   ||రాగమయీ||
రాగమయీ రావే
అనుపల్లవి:
నీలాల గగనాన నిండిన వెన్నెల   ||నీలాల||
నీ చిరునవ్వుల కలకలలాడగ    ||రాగమయీ||

చరణం 1:
చివురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే   ||చివురులు||
తనువై మనసై నెలరాయునితో
కలువలు కులికే సరసాలు నీవే
సరసాలు నీవే సరాగాలు నీవే    ||రాగమయీ||

చరణం 2:
సంజెలలో సంజెలలో హాయిగ సాగే చల్లనిగాలిలో
మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు
జిలుగే సింగారమైన
చుక్క కన్నెలు అంబరాన
చుక్క కన్నెలు అంబరాన
సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను
నవ పరిమళమే నీవు
రావే రాగమయీ నా అనురాగమయీ   |రావే||

చరణం 3:
నీడజూసి నీవనుకొని పులకరింతునే
అలవికాని మమతలతో కలువరింతునే
నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన
కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే
నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే
రావే రాగమయీ నా అనురాగమయీ   ||రావే||

Wednesday, September 15, 2010

నేటి పాట: అందానికి అందము నేనే (చివరకు మిగిలేది)


చిత్రం: చివరకు మిగిలేది (1960)
రచన: మల్లాది రామకృష్ణ శాస్త్రి
సంగీతం: అశ్వత్థామ
గానం: జమునారాణి

పల్లవి:
అందానికి అందము నేనే
జీవన మకరందము నేనే
తీగకు పూవును నేనే
పూవుకు తావిని నేనే ||తీగకు||
ధరణి అమరధామమై ఆనందము నేనే ||అందానికి||
చరణం 1:
వాలు కనుల చూపు నేనే చెంగల్వ తోరణాలు
ఆనాడు చిరునవ్వులే మల్లెవిరుల హారాలు
నా మేనే మెరుపు తీవ
నగుమోమే చందమామ ||నా మేనే||
నవరసాల సమ్మోహ సమ్మేళన నేనే ||అందానికి||
చరణం 2:
మలయానిల లాలనలో పదేపదే పరవశమై
మలయానిల లాలనలో పదేపదే పరవశమై
గానమేలు ఎలకోయిల గళ మధురిమ నేనే
గానమేలు ఎలకోయిల గళ మధురిమ నేనే
మాయని తీయందనాలు మన వరాలై
అవలీలగా జగమేలగా
మాయని తీయందనాలు మన వరాలై
అవలీలగా జగమేలగా
నవ చైతన్య సమ్మోహ సమ్మేళన నేనే ||అందానికి||