Wednesday, September 15, 2010
నేటి పాట: అందానికి అందము నేనే (చివరకు మిగిలేది)
చిత్రం: చివరకు మిగిలేది (1960)
రచన: మల్లాది రామకృష్ణ శాస్త్రి
సంగీతం: అశ్వత్థామ
గానం: జమునారాణి
పల్లవి:
అందానికి అందము నేనే
జీవన మకరందము నేనే
తీగకు పూవును నేనే
పూవుకు తావిని నేనే ||తీగకు||
ధరణి అమరధామమై ఆనందము నేనే ||అందానికి||
చరణం 1:
వాలు కనుల చూపు నేనే చెంగల్వ తోరణాలు
ఆనాడు చిరునవ్వులే మల్లెవిరుల హారాలు
నా మేనే మెరుపు తీవ
నగుమోమే చందమామ ||నా మేనే||
నవరసాల సమ్మోహ సమ్మేళన నేనే ||అందానికి||
చరణం 2:
మలయానిల లాలనలో పదేపదే పరవశమై
మలయానిల లాలనలో పదేపదే పరవశమై
గానమేలు ఎలకోయిల గళ మధురిమ నేనే
గానమేలు ఎలకోయిల గళ మధురిమ నేనే
మాయని తీయందనాలు మన వరాలై
అవలీలగా జగమేలగా
మాయని తీయందనాలు మన వరాలై
అవలీలగా జగమేలగా
నవ చైతన్య సమ్మోహ సమ్మేళన నేనే ||అందానికి||
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment