
వరుణ్ సందేశ్ పరిస్థితి ప్రస్తుతం ఏం బాగున్నట్లు లేదు. తొలి రెండు సినిమాలు - 'హ్యాపీడేస్', 'కొత్త బంగారులోకం' సూపర్ హిట్లవడంతో కుర్రకారు ఆరాధ్యతారగా మారిన అతనికి ఇంతవరకు మరో సక్సెస్ దక్కలేదు. 'ఎవరైనా ఎపుడైనా', 'కుర్రాడు', 'మరో చరిత్ర'తో పాటు లేటెస్ట్ ఫిల్మ్ 'హ్యాపీ హ్యాపీగా' కూడా చెట్టేక్కేసింది. ఈ చివరి సినిమా మీద అతను చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ విషయంలో ఎంతో నమ్మకాన్ని కనపర్చాడు. కానీ ప్రేక్షకులు మరోవిధంగా భావించారు. కలెక్షన్లు ఆశించిన రీతిలో లేకపోవడంతో ఎలాగైనా సినిమాని బతికించుకోవాలని నిర్మాతలు కష్టపడుతున్నారు. ఆ సినిమా ఫలితం తర్వాత వరుణ్ ఇమేజ్ మీద నీలినీడలు పరచుకుంటున్నాయి. ప్రస్తుతం అతను హీరోగా రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయి. హీరో ఇమేజ్ మీదే ఆధారపడి బిజినెస్ నడిచే ఇండస్ట్రీ కాబట్టి వాటి బిజినెస్ ఎలా జరగుతుందో చూడాలి. ఏదేమైనా తన కెరీర్ విషయమై వరుణ్ జాగ్రత్త పడాల్సిన సమయమిదే.
No comments:
Post a Comment