Saturday, September 18, 2010
సినిమా: రవితేజ చరిత్ర సృష్టిస్తాడా?
వరుసగా తొమ్మిదేళ్ల నుంచీ ప్రతి యేటా హిట్ కొడుతున్న రవితేజ 2010లో ఆ చాన్స్ మిస్సవుతాడా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. 2001లో 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం'తో హిట్లను మొదలుపెట్టిన రవితేజ 'ఇడియట్', 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' ('02), 'ఖడ్గం', 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' ('03), 'వెంకీ' ('04), 'భద్ర' ('05), 'విక్రమార్కుడు' ('06), 'దుబాయ్ శీను' ('07), 'కృష్ణ' ('08), 'కిక్' ('09) సినిమాలతో హిట్లను కంటిన్యూ చేశాడు. అయితే ఇప్పుడు ఆ పరంపరకి బ్రేక్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 2010లో అతని సినిమాలు రెండు - 'శంభో శివ శంభో', 'డాన్ శీను' విడుదలయ్యాయి కానీ అవి హిట్ అనిపించుకోలేక పోయాయి. దాంతో ఈ ఏడాది అతనికి హిట్ లభించే అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం హరీశ్ శంకర్ డైరెక్షనులో 'మిరపకాయ' సినిమా చేస్తున్నాడు రవితేజ. రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేథ్ హీరోయిన్లు. షూటింగ్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా జరిగి, అనుకున్న టైముకి గనక పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయితే డిసెంబరుకు ఆ సినిమా రావచ్చు. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా ఆ సినిమా విడుదల 2011కి వెళ్లే అవకాశాలున్నాయి. 'మిరపకాయ' డిసెంబరులో వచ్చి హిట్టయితేనే వరుసగా పదేళ్లపాటు హిట్లు కొట్టిన హీరోగా రవితేజ చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి హీరోల్లో వరుసగా తొమ్మిదేళ్లు హిట్లు కొట్టిన మొనగాడు రవితేజే. పదో యేట కూడా దాన్ని సాధిస్తే అదో మైలురాయిలా అతని కెరీరులో నిలిచిపోతుంది. చూద్దాం రవితేజ ఆ ఫీట్ ని చేయగలడో, లేడో..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment