Thursday, September 23, 2010

నేటి పాట: ఏ కులము నీదంటే (సప్తపది)


చిత్రం: సప్తపది (1981)
రచన: వేటూరి
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి

పల్లవి:
ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది ||ఏ కులము||

చరణం1:
ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనసౌతాది
అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది ||ఏడు|| ||ఏ కులము||

చరణం 2:
ఆది నుంది ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది ||ఆది||
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు
ఇన్ని మాటలు ||ఏ కులము||

1 comment:

karlapalem Hanumantha Rao said...

Behind the scene అన్నారు.. పాత వెనక జరిగిన కథను జత చేయటం సందర్భోచితం గా వుంటుంది గా యజ్న మూర్తి గారూ !