Showing posts with label aa naluguru. Show all posts
Showing posts with label aa naluguru. Show all posts
Tuesday, June 19, 2012
నారాయణరావు మాస్టారి కథ
ఇంతకుముందు దినపత్రిక ఎడిటర్ రఘురామ్ ('ఆ నలుగురు'), రాజాజీ ('మీ శ్రేయోభిలాషి') పాత్రల్లో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న రాజేంద్రప్రసాద్ తాజాగా నారాయణరావు మాస్టారుగా తెరమీద కనిపించబోతున్నారు. ఆయన ఆ పాత్ర పోషిస్తున్న 'ఓనమాలు' చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకుని విడుదల కోసం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. సన్‌షైన్ సినిమా పతాకంపై స్వీయ దర్శకత్వంలో కె. క్రాంతిమాధవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా గురించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "ఎన్నో సినిమాల్లో నటిస్తున్నా కొన్ని సినిమాలకే ఉద్వేగం, ఏదో చెయ్యాలన్న ఉత్సాహం కలుగుతుంది. అటువంటి ఉత్సాహం కలిగించిన సినిమా ఇది. ఇందులోని నారాయణరావు మాస్టారు పాత్ర నా మనసుకు బాగా నచ్చిన పాత్ర. ఎన్టీఆర్‌కి, ఎఎన్నార్‌కి వాళ్ల కెరీర్‌లో వయసుతో నిమిత్తం లేకుండా మంచి పాత్రలు దొరికాయి. అలా నాక్కూడా ఇదో మంచి అవకాశం. ఇవాళ మన సమాజానికి కచ్చితంగా కావాల్సిన అనుబంధాల్ని చెప్పే సినిమా'' అని చెప్పారు.
నిర్మాత, దర్శకుడు క్రాంతిమాధవ్ మాట్లాడుతూ "మనిషి ఓడలాంటివాడు. ఒడ్డుకు చేరితేనే ఓడకు ఎలాగైతే విలువ వస్తుందో, అలాగే మనిషి కూడా ఏదో ఓ విజయపు ఒడ్డుకు చేరితేనే విలువ. ఇందులో ఓ స్కూలు మాస్టారు ఎలాంటి ఒడ్డుకు చేరాడన్నది కథ. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం' అన్నారు.
ఈ చిత్రానికి కథ: తమ్ముడు సత్యం, మాటలు: ఖదీర్‌బాబు, సంగీతం: కోటి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కూర్పు: గౌతంరాజు, కళ: బాబ్జీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె. క్రాంతిమాధవ్.
Monday, September 5, 2011
న్యూస్: రాజేంద్రప్రసాద్ 'డ్రీం' ప్రాజెక్ట్!
సీనియర్ హాస్య కథానాయకుడు రాజేంద్రప్రసాద్ ఇప్పుడు హాస్యాన్ని కాకుండా ప్రయోగాల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 'ఆ నలుగురు' నుంచి ఆయనలో ఈ మార్పు కనిపిస్తోంది. ఆ మధ్య 'శ్రేయోభిలాషి'ని చేసిన ఆయన ఇప్పుడు 'డ్రీం' అనే మరో ప్రయోగాత్మక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో కొత్త టెక్నీషియన్లు టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. ఇదివరకు 'ఐ వోట్ ఫర్' అనే షార్ట్ ఫిలింకు నేషనల్ అవార్డ్ పొందిన భవానీ శంకర్ ఆ ఉత్సాహంతో ఈ సినిమాని సొంతంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. "కల్ట్ థ్రిల్లర్ కథాంశంతో ఇంతవరకూ తెలుగులో ఏ చిత్రం రాలేదు. ఆ తరహాలో రూపొందుతున్న తొలి సినిమా మాదే. సినిమాలోని సన్నివేశాలను సింగిల్ షాట్స్‌లో తీస్తున్నాం. టెక్నికల్ హైఎండ్ టీమ్‌తో రూపొందుతున్న ఎంటర్‌టైనర్ ఇది. ఓ ఆర్మీ మేజర్ అంతవరకూ జీవితంలో తను చేయాలనుకున్న పనులు రిటైర్ అయిన తరువాత ఒక్కొక్కటీ చేయడం మొదలుపెడతాడు" అని ఆయన చెప్పాడు. ఈ చిత్రంలో మరో 30 ప్రధాన పాత్రల్ని రంగస్థల నటులు చేస్తుండటం విశేషం.
సత్యజిత్‌రాయ్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన రవికుమార్ నీర్ల ఈ చిత్రానికి ఛాయాగ్రాహకునిగా, ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ స్కూల్‌కి చెందిన సంతోష్ సంగీత దర్శకునిగా పనిచేస్తున్నారు. అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ఆర్మీ మేజర్‌గా రాజేంద్రప్రసాద్ ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

Sunday, October 10, 2010
సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (1వ భాగం)
గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్లు ఒక్కొక్కటే మూతపడుతూ పట్టణాలు, నగరాల్లో మల్టీప్లెక్సుల సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు సినిమా నిర్మాణ ఫార్ములా క్రమేపీ మార్పుకు గురవుతోంది. 'స్టార్ మేనియా' ఇప్పటికీ కొనసాగుతున్నా కొత్త తరహా కథాకథనాలతో వస్తున్న సినిమాలు సైతం కొద్దో గొప్పో ఆదరణ పొందుతున్నాయి, 'మంచి సినిమా'గా పేరు తెచ్చుకుంటున్నాయి. చంద్రసిద్ధార్థ్, శేఖర్ కమ్ముల, రవిబాబు, దేవా కట్టా, సాయికిరణ్ అడివి, క్రిష్, చైతన్య దంతులూరి, మధుర శ్రీధర్ వంటి దర్శకులు మంచి సినిమా పట్ల ఆశలు రేకెత్తిస్తున్నారు.
'ఆ నలుగురు' ఆదర్శం
ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన 'ఆ నలుగురు' సినిమా ఈ నవ్య పంథాకు మార్గదర్శకంగా నిలిచిందని చెప్పాలి. చంద్రసిద్ధార్థ్ రూపొందించిన ఆ సినిమా 2004 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందడమే కాక, ఉత్తమ నటునిగా రాజేంద్రప్రసాద్ కీ, ఉత్తమ క్యారెక్టర్ నటునిగా కోట శ్రీనివాసరావుకీ అవార్డులు సంపాదించి పెట్టింది. అన్నింటికీ మించి ఆ సినిమాని చెప్పుకోదగ్గ రీతిలో ప్రేక్షకులు సైతం ఆదరించారు. తన సినీ జీవితంలో 'ఆ నలుగురు' సినిమా ఓ మైలురాయి లాంటిదని రాజేంద్రప్రసాద్ గర్వంగా చెప్పుకోవడమే ఈ సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతుంది. తన సంపాదనలో సగాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించే ఓ దినపత్రిక సంపాదకుడు రఘురామ్ తన మనసుకు విరుద్ధమైన పని చేయాల్సి వస్తే ఎలాంటి సంఘర్షణకు గురవుతాడు, అతడు చినిపోయాక కూడా అతని ఆత్మ ఎంతగా క్షోభిస్తుందనే అంశాన్ని హృద్యంగా చిత్రించిన విధానం అందరి ప్రశంసల్నీ పొందింది. మంచి సినిమా దర్శకుడిగా చంద్రసిద్ధార్థ్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే అతను కేవలం మంచి సినిమా దర్శకుడే కాదు, 'స్వతంత్ర సినిమా' దర్శకుడు కూడా. 'స్టార్' విలువ మీద ఆధారపడకుండా, నిర్మాత వత్తిళ్లకు తలొగ్గకుండా, తనేం తీయదలచుకున్నాడో, దాన్ని అందంగా, నాణ్యంగా సెల్యులాయిడ్ మీద చిత్రించేవాడూ, మార్కెట్లు, వర్తమాన ధోరణులు, అభిప్రాయాలు, ప్రేక్షకుల అంచనాలు, అమలులో ఉన్న సినిమా రూపకల్పన విధానాల ప్రభావం లేకుండా తీసేవాడూ స్వతంత్ర సినిమా దర్శకుడు అని సూత్రీకరిస్తాడు బాలీవుడ్ లో 'రఘు రోమియో' చిత్ర రూపకర్త రజత్ కపూర్. ఆ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో వచ్చిన 'హైదరాబాద్ బ్లూస్', 'మాన్సూన్ వెడ్డింగ్', 'సత్య', 'ఝంకార్ బీట్స్', 'దేవ్ డి', 'హరిశ్చంద్రాచ్చి ఫ్యాక్టరీ', 'ఖర్గోష్' వంటి సినిమాలు స్వతంత్ర సినిమా జెండాని నిలబెట్టేందుకు ఉపకరించాయి. వాటి తరహాలోనే తెలుగులో 'ఆనంద్', 'హ్యాపీడేస్', 'ఎ ఫిల్మ్ బై అరవింద్', 'వినాయకుడు', 'మంత్ర', 'అనసూయ', 'గమ్యం', 'బాణం', 'విలేజ్ లో వినాయకుడు', 'లీడర్', 'ప్రస్థానం', 'అందరి బంధువయ', 'వేదం' వంటి సినిమాలు మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. వీటిలో చాలావాటికి ప్రేక్షకాదరణ కూడా ఉండటం ఇక్కడ గమనించాల్సిన అంశం. (ఇంకావుంది)

Subscribe to:
Posts (Atom)