Showing posts with label vennela. Show all posts
Showing posts with label vennela. Show all posts

Thursday, October 20, 2011

న్యూస్: ఒకటిన్నర వినోదం 'వెన్నెల 1 1/2'

దేవాకట్టా దర్శకత్వం వెన్నెల చిత్రానికి 'వెన్నెల 1 1/2' పేరుతో సీక్వెల్ రాబోతుంది. లవ్ ప్లస్ లాఫ్ హోల్ క్యూబ్ మైనస్ లాజిక్ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. 'వెన్నెల' చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించి అందరినీ నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జీఆర్8(ఎయిట్) ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వాసు,వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల విదేశాల్లో పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ "వెన్నెల చిత్రానికి సీక్వెల్ నిర్మించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఊహించని ఎన్నో ఆశ్చర్యాలు ఈ చిత్రంలో వుంటాయి. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఇటీవలే విదేశాల్లో మరో షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నాం. త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న చివరి షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవుతుంది. నవంబరులో పాటలను, డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం. తప్పకుండా వెన్నెల తరహాలోనే వెన్నెల1 1/2 కూడా ప్రేక్షకులందరిని అలరిస్తుందనేనమ్మకం ఉంది'' అని అన్నారు. చైతన్య కృష్ణ, మోనాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆరు పాటలు, రెండు ఫైట్స్ వున్నాయి.
బ్రహ్మానందం, రఘుబాబు, మాస్టర్ భరత్, శ్రవణ్, గిరిధర్, హరీష్, వెన్నెల మధు, అగ్నేష్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కాశ్యప్, కెమెరా: సురేష్ భార్గవ్, ఫైట్స్: నందు, కెమెరా: సురేష్‌భార్గవ్, సాహిత్యం: కృష్ణచైతన్య, శ్రీమణి, సిరాశ్రీ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శివశంకర్.

Saturday, September 3, 2011

న్యూస్: మరో సీక్వెల్... డైరెక్టర్‌గా మరో కమెడియన్!

ఏవీఎస్ తర్వాత మరో హాస్యనటుడు డైరెక్టర్ అవతారం ఎత్తాడు. అయితే అతను మరీ జూనియర్. కానీ తన హాస్య నటనతో మంచి పేరే సంపాదించుకున్నాడు. అతను కిశోర్. దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'వెన్నెల' సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసి, ఆ సినిమా పేరుతో 'వెన్నెల' కిశోర్‌గా పాపులర్ అయిన అతడు. ఇప్పుడు అదే సినిమా సీక్వెల్‌తో డైరెక్టర్‌గా పరిచయమవుతుండటం విశేషం. తెలుగులో ప్రస్తుతం సీక్వెల్ సీజన్ నడుస్తోంది. 'గాయం 2', 'మనీ మనీ మోర్ మనీ' తర్వాత ఇప్పుడు 'వెన్నెల'కి సీక్వెల్ తయారవుతోంది. చిత్రమేమంటే ఈ సినిమాకి కిశోర్ 'వెన్నెల 2' అని గాక, 'వెన్నెల 1 1/2' (వెన్నెల వన్ అండ్ హాఫ్) అని పేరు పెట్టడం. 'లవ్ ప్లస్ లాఫ్ హోల్ క్యూబ్ మైనస్ లాజిక్' అనేది ట్యాగ్‌లైన్.
"నేను పరిచయమైన 'వెన్నెల'కి సీక్వెల్‌తో డైరెక్టర్ని కావడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులు ఊహించని ఎన్నో ఆశ్చర్యాలు ఇందులో ఉంటాయి. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తీస్తున్నా. హైదరాబాద్‌తో పాటు అమెరికా, బ్యాంకాక్, స్విట్జర్లాండ్‌లలో షూటింగ్ జరుపుతాం. చిత్రసీమలోని పేరుపొందిన కమెడియన్లందరూ ఇందులో ఉన్నారు. హీరో హీరోయిన్ల పేర్లని తర్వాత తెలియజేస్తాం" అని చెప్పాడు కిశోర్. ఈ సినిమాని జీఆర్ 8 ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై వాసు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'గాయం 2', 'మనీ మానీ మోర్ మనీ' సినిమాలు ఫ్లాపైన నేపథ్యంలో ఈ కామెడీ సీక్వెల్ ఎలా ఆడుతుందో చూడాల్సిందే.