Showing posts with label surya kiran. Show all posts
Showing posts with label surya kiran. Show all posts

Wednesday, August 25, 2010

Movies: 'Chapter' close for Surya Kiran!


నాగార్జున నిర్మించిన 'సత్యం' సినిమాతో తెలుగులో డైరెక్టరుగా గ్రాండుగా ఎంటరైన సూర్యకిరణ్ పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగాలేదు. ఉన్నదంతా ఊడ్చి భార్య కల్యాణి నిర్మాతగా అతను రూపొందించిన 'చాప్టర్ 6' సినిమా ఘోరంగా ఫ్లాపయ్యింది. చాలామందికి అసలు ఆ సినిమా రిలీజయ్యిందనే సంగతి కూడా తెలీదు. చెప్పాలంటే సూర్యకిరణ్ కెరీరులో 'సత్యం' తర్వాత చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ లేదు.'ధన 51', 'బ్రహ్మాస్త్రం' సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అట్టర్ ఫ్లాపయ్యాయి. ఇప్పుడు 'చాప్టర్ 6' వాటిని మించి పోయింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమే అయ్యింది. అయితే దీన్ని కొనేందుకు బయ్యర్లు ముందుకు రాకపోవడంతో విడుదలకు ఇంతకాలం పట్టింది. ఈ సినిమాలో సత్యభామ అనే మెయిన్ రోల్ చేసింది కల్యాణి. కాని ఆమెకి జోడీగా హరినాథ్ పొలిచర్ల కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తెలుగులో హీరోలు చాలామందే ఉండగా హరినాథ్ ని ఎంచుకోవడం చిత్రమే కదా. ప్రేమలోని ఆరు రంగుల్ని ఈ సినిమాలో చూపిస్తున్నానని, అందుకే టైటిల్ 'చాప్టర్ 6' అని పెట్టామని సినిమా విడుదలకు ముందు చెప్పాడు సూర్యకిరణ్. కానీ సినిమాలో రంగులు కాకుండా చుక్కలు కనిపించాయనేది ప్రేక్షకుడి మాట.