Showing posts with label janaki. Show all posts
Showing posts with label janaki. Show all posts

Thursday, November 18, 2010

నేటి పాట: కళ్లలో వున్నదేదో (అంతులేని కథ)

చిత్రం: అంతులేని కథ (1976)
రచన: ఆత్రేయ
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గానం: ఎస్. జానకి

పల్లవి:
కళ్లలో వున్నదేదో కనులకే తెలుసు
రాళ్లలో వున్న నీరు కళ్లకెలా తెలుసు
నాలో వున్న మనసూ నాకుగాక ఇంకెవరికి తెలుసు

చరణం 1:
నీటిలో ఆరే నిప్పును కానూ
నిప్పున కాగే నీరైన కానూ
ఏదీ కానీ నాలో రగిలే
ఈ అనలాన్నీ ఆర్పేదెవరో   ||కళ్లలో||

చరణం 2:
తానే మంటై వెలుగిచ్చు దీపం
చెప్పదు తనలో చెలరేగు తాపం
నే వెళ్లు దారి ఓ ముళ్లదారి
రాలేరు యెవరూ నాతో చేరి   ||నాలో||

చరణం 3:
వేసవిలోనూ వానలు రావా
కోవెల శిలకు జీవం రాదా
జరిగేనాడే జరుగును అన్నీ
జరిగిననాడే తెలియును కొన్నీ   ||నాలో||

Saturday, November 13, 2010

నేటి పాట: గోవిందా గోవిందా (మంచివాడు)

చిత్రం: జేబుదొంగ (1975)
రచన: ఆత్రేయ
సంగీతం: చక్రవర్తి
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి

అతడు: గోవిందా గోవిందా గుట్టుకాస్తా గోవిందా
లడ్డులాంటి పడుచుపిల్ల అర్ధరాత్రి దొరికిందంటే
అంతకన్నా షోకుందా ఇంతకన్నా ఛాన్సుందా

ఆమె: గోవిందో గోవిందా కుర్రవాడూ గోవిందా
పిల్లగాలికి గుబులురేగి పిచ్చిపిచ్చి వేషాలేస్తే
గూబ గుయ్యిమంటుందోయి జలుబు వదిలిపోతుందోయి

అతడు: దాచేస్తే దాగేదికాదు అందం
మార్చేస్తే మారేదికాదు రూపం
దోచుకోను దొరికేదికాదు అందం
మెచ్చుకుంటే లొంగేదికాదు రూపం
ఆడపిల్ల లింతేలే అడుగుతుంటే బెట్టేలే
మెల్లంగ మెత్తబడి పోతారులే

ఆమె: కొంటె కుర్రాళ్లింతేలే వెంటబడి వస్తార్లే
సై అంటే వెర్రిముఖం వేస్తారులే
ఆయ్ ఒక్కసారి సయ్యని చూదు - గోవిందా
ఆహ వచ్చాడయ్యా మొనగాడు గోవిందా    ||గోవిందా||

ఆమె: ఇమ్మంటే ఇచ్చేదికాదు మనసు
రమ్మంటే వచ్చేదికాదు వయసు
వద్దంటే ఉరికింది నాలో వయసు
వదలొద్దు అంటుంది నిన్నే మనసు

అతడు: చల్లగాలి వేస్తుంది చలి ముంచుకొస్తుంది
వేడెక్కి పోతుంది లోలోన
లోపలున్న చలిచలికి పైనవున్న వేడికి
జత కుదిరిపోతుంది మనలోన
ఇంతకన్నా ఏం చెప్పేది - గోవిందా
అహ ఎందుకింక నే నాగేది - గోవిందా    ||గోవిందో||

Thursday, September 9, 2010

నేటి పాట: 'సిరిసంపదలు' నుంచి

చిత్రం: సిరిసంపదలు (1962)
రచన: ఆత్రేయ
సంగీతం: మాస్టర్ వేణు
గానం: ఘంటసాల, ఎస్. జానకి


పల్లవి:
ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ
మారినదేమి చెలీ
ఆ కారణమేమి చెలీ
ఆ.. ఊ..
వింతకాదు నా చెంతనున్నది
వెండి వెన్నెల జాబిలి
నిండు పున్నమి జాబిలి ఓ..
చరణం 1:
మనసున తొణికే చిరునవ్వెందుకు
పెదవుల మీదికి రానీవు
అహో ఓహో అహా ఆ.. ||మనసున||
పెదవి కదిపితే మదిలో మెదిలే మాట
తెలియునని మానేవు ఊ.. ||వెండి||
చరణం 2:
ఆ.. ఆ.. ఓ.. ఆ.. ఆ.. ఊ.. ఊ..
కన్నులు తెలిపే కథలనెందుకు
రెప్పలార్చి ఏమార్చేవు ఆ.. ||కన్నులు||
చెంపలు పూచే కెంపులు నాతో నిజము
తెలుపునని జడిసేవు ఓహోహో.. ||వెండి||
చరణం 3:
అలుక చూపి అటువైపు తిరిగితే
అగుపడదనుకుని నవ్వేవు ఉహుహు.. ||అలుక||
నల్లని జడలో మల్లెపూలు
నీ నవ్వునకర్థము చూపేను ఆహా.. ||వెండి||