పవన్ కల్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్థన్ రూపొందిస్తున్న సినిమా 'పంజా'. తెలుగులో విష్ణువర్థన్‌కి ఇదే తొలి సినిమా. అజిత్‌తో తీసిన 'బిల్లా' డైరెక్టర్‌గా అతను తమిళంలో ప్రసిద్ధుడు. 'పంజా'లో పవన్ సరసన నాయికలుగా సారాజేన్ డయాస్, అంజలా లావణియా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. 'పులి' వంటి డిజాస్టర్ తర్వాత చాలా కసితో ఈ సినిమా చేస్తున్నాడు పవన్. 'పంజా'లో ఆయన గడ్డంతో కొత్త గెటప్పులో కనిపించబోతున్నాడు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని విష్ణువర్థన్ తీర్చిదిద్దుతున్నాడు. పవన్ 'ఖుషి' సినిమాలో మొదట కోల్‌కతా నేపథ్యం కనిపించిన సంగతి తెలిసిందే. అదివరకు చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమా కూడా ఇదే బ్యాక్‌డ్రాప్‌లో కనిపించింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. అదే సెంటిమెంట్ 'పంజా'కి వర్తిస్తుందని పవన్ అభిమానులు ఆశిస్తున్నారు. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ గొప్పగా వచ్చాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 'క్రిష్', 'మై నేం ఈజ్ ఖాన్', 'త్రీ ఇడియట్స్' సినిమాలకి పనిచేసిన యాక్షన్ డైరెక్టర్ శ్యాం కౌశల్ ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించడం విశేషం. యువన్ శంకర్‌రాజా సంగీతం మరో ఎట్రాక్షన్ కానున్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేయాలని నిర్మాతలు సంకల్పించారు. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బేనర్లపై నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నవంబర్‌లో పాటల్నీ, డిసెంబర్‌లో సినిమానీ విడుదల చేయడానికి వాళ్లు ప్లాన్ చేస్తున్నారు.
బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, అడివి శేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, ఝాన్సీ తారాగణమైన ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే: రాషుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్. వినోద్, ఎడిటింగ్: ఎ. శ్రీకరప్రసాద్, స్టయిలింగ్: అనూ వర్థన్, కథ, దర్శకత్వం: విష్ణువర్థన్.
Showing posts with label puli. Show all posts
Showing posts with label puli. Show all posts
Monday, October 17, 2011
Wednesday, July 13, 2011
న్యూస్: 'పవర్' చూపిస్తాడా?
పవన్ కల్యాణ్ 'జల్సా' తర్వాత మళ్లీ అంత హిట్ ఎప్పుడిస్తాడు? ఆయన్ని అభిమానించేవాళ్లు ఎదురుచూస్తున్నది దీని కోసమే. 'పులి' సినిమా డిజాస్టర్ కావడమే కాక, దాని నిర్మాత శింగనమల రమేశ్‌ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ హిట్ 'లవ్ ఆజ్ కల్'కి రీమేక్‌గా ఎంతో హైప్‌తో జయంత్ సి. పరాన్జీ డైరెక్షన్‌లో వచ్చిన 'తీన్‌మార్' సినిమా ఆశించిన రీతిలో ఆడియన్సుని ఆకట్టుకోవడంలో విఫలమైంది. అందువల్ల ఇప్పుడు పవన్ చేస్తున్న సినిమాల మీదే అందరి దృష్టి ఉంది. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఇద్దరిలో ఒకరైన పవన్ ఈ యేడాది చివరలో 'ద షాడో' (టైటిల్ మారవచ్చు)గా రాబోతున్నాడు. దీని డైరెక్టర్ విష్ణువర్ధన్. తెలుగువాడైనప్పటికీ తమిళంలోని హాట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న విష్ణువర్ధన్ రూపొందిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. నీలిమా నగేశ్, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాజీ మిస్ ఇండియా సారా జేన్ డయాస్, ముంబై మోడల్ అంజలీ లావణియా హీరోయిన్లు. యువన్‌శంకర్ రాజా మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమా మాఫియా నేపథ్యంలో నడిచే ఓ గ్యాంగ్‌స్టర్ కథ. 'లవ్ ఆజ్ కల్' తర్వాత మరో హిందీ హిట్ సినిమా 'దబాంగ్'కి రీమేక్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు పవన్. 'గబ్బర్ సింగ్' పేరుతో రూపొందే ఈ సినిమాని నటుడు గణేశ్‌బాబు నిర్మించనుండగా, హరీశ్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇవికాక యేసుక్రీస్తుపై సింగీతం శ్రీనివాసరావు రూపొందిస్తున్న పేరుపెట్టని సినిమాలో పవన్ ఓ ప్రత్యేక పాత్రని చేస్తున్నాడు. ఇందులో ప్రధాన పాత్రలన్నిట్నీ బాల తారలు చేస్తున్నారు. ఇది కమర్షియల్ సినిమా కాదు కాబట్టి ఈ సినిమాని మినహాయిస్తే.. 'ద షాడో', 'గబ్బర్‌సింగ్' సినిమాలతో పవన్ కల్యాణ్ తన 'పవర్'ని చూపిస్తాడని ఆశించొచ్చు.
Thursday, July 1, 2010
'Puli' Audio on 11 July and Movie on 12 Aug

పవన్ కల్యాణ్ హీరోగా ఎస్.జె. సూర్య డైరెక్ట్ చేస్తున్న 'పులి' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ఆడియో జూలై 11న రిలీజ్ కాబోతోంది. ఇక సినిమా ఎప్పుడు వస్తుందని అనుకుంటున్నారు? ఆగస్ట్ 12న. ఈ సినిమాకి ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. శింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా నికిషా పటేల్ హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. 'పులి' రిలీజ్ అవగానే పవన్ డైరీ ఖాళీ లేకుండా బిజీగా మారింది. 'లవ్ ఆజ్ కల్'కి రీమేక్‌గా తయారవుతున్న 'ఖుషీగా' సినిమా షూటింగ్‌తో అతను బిజీగా గడపనున్నాడు. ఈ సంగతిని పవన్ స్వయంగా ఇంతకుముందే ట్విట్టర్‌లో తెలిపాడు.
Subscribe to:
Posts (Atom)

