Showing posts with label nagarjuna. Show all posts
Showing posts with label nagarjuna. Show all posts
Wednesday, October 4, 2017
Thursday, January 14, 2016
Saturday, November 7, 2015
Sunday, December 28, 2014
Thursday, October 23, 2014
Wednesday, June 18, 2014
Cinema: Ram Gopal Varma.. The Experimental Technician
ప్రయోగాలకు వెరవని టెక్నీషియన్
ట్రెండ్‌సెట్టర్లకే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచి నాగార్జున, జగపతిబాబు, జె.డి. చక్రవర్తి వంటి నటులకు స్టార్‌డం కల్పించిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఇవాళ హిందీ చిత్రసీమకే అంకితమవడం విచారకరం. ఆరు పాటలు, ఐదు ఫైట్లు, వెగటు పుట్టించే ముతక హాస్య సన్నివేశాలు, ద్వంద్వార్థాల సంభాషణలు - ఇవే తెలుగు సినిమా అంటే.. అనే స్థితి నుంచి ఒక్కసారిగా సాంకేతిక అంశాలవైపు దృష్టి మరలింపజేసి తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని చూపించినవాడు వర్మ. కథ కంటే కథనానికే ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చి సూటిగా ప్రేక్షకుల హృదయాల్ని తాకేట్లుగా సన్నివేశాల్ని మలచడంలో వర్మ నిష్ణాతుడు. ఇందుకు మంచి ఉదాహరణ - 'క్షణ క్షణం'. కథగా చెప్పుకోడానికి ఏమీలేని ఈ సినిమాని కేవలం కథనంతో, సహజమని భ్రమింపజేసే సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించాడు. పాటల చిత్రీకరణలో కూడా వర్మ ప్రత్యేకత కనిపిస్తుంది. పాటల్లో నేపథ్యం (బ్యాక్‌గ్రౌండ్) ఎలా ఉండాలో కూడా ఈ సినిమాలో చూపించాడు వర్మ.ఒక్క 'శివ' చిత్రంతోటే వర్మ అగ్రశ్రేణి దర్శకుల జాబితాలో చేరిపోయాడు. పైగా అది మొదటి చిత్రం కూడా. ఆ సినిమా నాగార్జునకు స్టార్‌డం కల్పించి చిరంజీవి తర్వాత రెండో స్థానాన్ని సాధించిపెట్టింది. యువతలో 'శివ' సృస్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఆ సినిమా వల్ల యువత చెడిపోతున్నదని అప్పుడంతా గోలపెట్టినవాళ్లే. కాలేజీ కేంపస్‌లలో 'శివ' తరహాలో జరిగిన అల్లర్లు దీనికి మద్దతుగా నిలిచాయి. మొత్తానికి ఆ సినిమాతో వర్మ, నాగార్జున - ఇద్దరూ పరస్పర ప్రయోజనం పొందారు. ఐనా వర్మ సంతృప్తి చెందలేదు. అతడిలోని టెక్నీషియన్ నిరంతర శోధనలోనే ఉండేవాడు. 'క్షణ క్షణం' ఆ టెక్నీషియన్‌కు మరింత పదునుపెట్టింది. కాగా ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు స్ఫూర్తి రాజ్‌కపూర్ 'చోరీ చోరీ' అనిపిస్తుంది.
ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడో కానీ ఆదరణ చూపని తెలుగు ప్రేక్షకులను ఒప్పించే లక్ష్యంతో వర్మ 'రాత్రి', 'దెయ్యం' సినిమాలను తీశాడు. మనిషిలో అంతర్లీనంగా ఉండే భయాందోళనలు ఆ మనిషిని ఎలా కల్లోలపరుస్తాయో ఆ రెండు చిత్రాల్లో చూపించేందుకు ప్రయత్నించాడు వర్మ. 'దెయ్యం' విడుదలకు ముందు ప్రకటనల విషయంలోనూ కొత్త పుంతలు తొక్కాడు. ఐతే ఇవి రెండూ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేక పోయాయి.
అంతకు ముందు జగపతిబాబు హీరోగా 'గాయం' చిత్రాన్ని తీసి సక్సెస్ సాధించాడు వర్మ. సరైన సక్సెస్ లేక డౌన్ స్టేజ్‌కి చేరువవుతున్న సమయంలో జగపతిబాబుకు 'గాయం' ఊరటనివ్వడమే కాకుండా చిత్రసీమలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. రాంగోపాల్‌వర్మ డైరెక్షన్‌లో ఇది ఊర్మిళకు రెండో సినిమా. తొలి సినిమా 'అంతం' ఘోరంగా ఫ్లాపైంది. మచ్చుకైనా తెలుగుతనం కనిపించకపోవడం, హాలీవుడ్ స్టయిల్లో రూపొందించాలనే తాపత్రయంతో కథని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, కథనాన్ని సైతం చికాకు పరిచేలా తయారుచేయడం 'అంతం' బాక్సులన్నీ తిరుగుటపా కట్టడానికి కారణం. అయినా వర్మ పరాజయానికి కుంగిపోయే రకం కాదు. 'ప్రయోగాలకు స్వస్తిచెప్పి సాధారణ స్థాయిలో సినిమాలు తీసుకుందాం' అనుకొనే సాధారణ దర్శకుడు కాదు. అందుకనే తెలుగువాళ్లకే కాదు, దేశంలోని కోట్లాది ప్రజానీకానికి ఇలవేల్పు అయిన వెంకటేశ్వరస్వామి మీదే ప్రయోగం చేయాలనుకొని 'గోవిందా గోవిందా'ని తలపెట్టాడు. చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడే విమర్శలు వచ్చాయి. అయినా వెరవక చిత్రాన్ని పూర్తిచేశాడు. జయాపజయాల మాటెలా ఉన్నా చిత్రంలోని సన్నివేశాలు, పాటల చిత్రీకరణ వర్మలోని దర్శకత్వ ప్రతిభను చాటిచెప్పాయి. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు చేసిన 'కట్స్' వల్ల వర్మకి తెలుగు సెన్సార్ బోర్డు మీద కోపం వచ్చి "ఇక తెలుగు సినిమాలు చేయను" అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అయితే తర్వాత జె.డి. చక్రవర్తి, ఊర్మిళ జంటగా 'అనగనగా ఒక రోజు' అనే సినిమా మొదలుపెట్టాడు. "తెలుగు సినిమాలను తీయనన్నారుగా" అనడిగితే "ఆ స్టేట్‌మెంట్ ఇవ్వకముందే ఈ సినిమా మొదలైపోయింది" అన్నాడు. 'అనగనగా ఒక రోజు'తో బ్రహ్మానందం ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. సినిమా కూడా జనానికి నచ్చింది. అదే ఆఖరు - తెలుగు సినిమాకు వర్మ దర్శకత్వం వహించడం.
ముంబైకి వెళ్లి తీసిన తొలి సినిమా పెద్ద సంచలనం రేపింది. అది 'రంగీలా'. సినిమా రంగానికి వెళ్లిన ఓ సాధారణ యువతి స్టార్ అయినా కూడా సామాన్యుడైన తన పూర్వ స్నేహితుణ్ణే పెళ్లాడాలని నిర్ణయించుకోవడం ఈ సినిమా ఇతివృత్తం. 'రంగీలా ఆయిరే' పాట అప్పట్లో యువతని ఓ ఊపు ఊపింది. ఊర్మిళతోనే ఎక్కువగా సినిమాలు తీస్తుంటే ఇద్దరిమీదా గాసిప్స్ మొదలయ్యాయి. ఇలాంటివేమీ పట్టించుకొనే ఘటం కాదు కాబట్టి ఆ తర్వాత కూడా ఊర్మిళతో సినిమాలు తీస్తూనే వచ్చాడు వర్మ. 'కౌన్', 'సత్య', 'మస్త్', ఇప్పుడు 'జంగిల్' - వీటన్నింటిలోనూ ఊర్మిళనే హీరోయిన్. రెండే పాత్రలతో తీసిన మరో ప్రయోగాత్మక చిత్రం 'కౌన్' సక్సెస్ కాలేదు. దీంట్లో నటించిన మజోన్ బాజ్‌పేయి అంతకుముందు 'సత్య'తో వెలుగులోకి వచ్చాడు. మనోజ్ హీరోగా ఓ చిత్రాన్ని తీస్తానని చెప్పిన వర్మ చెప్పినట్లుగానే 'శూల్' తీశాడు. అయితే తాను నిర్మాతగా మాత్రమే ఉండి శిష్యుడైన నివాస్‌కు దర్శకత్వం అప్పజెప్పాడు. సినీ జగత్తు నేపథ్యంతోనే వర్మ తీసిన 'మస్త్' కూడా ఫ్లాపయింది. త్వరలో 'జంగిల్' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇందులో ఫిరోజ్‌ఖాన్ కొడుకు ఫర్దీన్‌ఖాన్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. వర్మ స్థాయిలోనే టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వస్తుందని అందరూ భావిస్తున్నారు.
తన సినిమాలతో కొంతమందికి స్టార్‌డంనీ, మరికొంతమంది కొత్తవాళ్లకి గుర్తింపునీ తీసుకువచ్చిన వర్మ చిత్రంలో నటించడానికి ఆరాటపడని వాళ్లుండరు. జె.డి. చక్రవర్తి, మనోజ్ బాజ్‌పేయి, అఫ్తాబ్ శివ్‌దాసాని, ఫర్దీన్‌ఖాన్ వంటి వాళ్లని తెరకి పరిచయం చేసినా కొంతమంది మంచి టెక్నీషియన్స్‌ని కూడా చిత్రసీమకు అందించాడు. అతడి శిష్యుడైన కృష్ణవంశీ ఇవాళ అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకడు. ఏమైనా హిందీ చిత్రసీమకే పూర్తిగా అంకితమైపోకుండా మాతృసీమ అయిన తెలుగు చిత్రసీమకూ సేవ అందించాలనీ, వర్మ తెలుగు చిత్రాలు తీస్తే బాగుండుననీ కొంతమందైనా అనుకుంటున్నారు.
- ఆంధ్రభూమి 'వెన్నెల', 26 మే, 2000
Sunday, June 8, 2014
Wednesday, May 28, 2014
Friday, January 3, 2014
Wednesday, December 18, 2013
Monday, December 16, 2013
Thursday, December 29, 2011
'అన్నపూర్ణ' ద్వారా పరిచయమైన తారలు, దర్శకులు
సతీమణి అన్నపూర్ణ అంటే అక్కినేని నాగేశ్వరరావుకు అమితమైన ప్రేమ. అందుకే హైదరాబాద్‌లో నిర్మించిన స్టూడియోకు ఆమె పేరే పెట్టారు. ఇక తమ నిర్మాణ సంస్థను కూడా 'అన్నపూర్ణ స్టూడియోస్' గానే వ్యవహరించారు. ఆ బేనర్ కింద అనేకమంది నటులు, దర్శకులు పరిచయమయ్యారు. వారిలో కొంతమంది అనంతర కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
* 1986లో నిర్మించిన 'విక్రమ్' చిత్రం ద్వారా నాగేశ్వరరావు, అన్నపూర్ణల చిన్న కుమారుడు నాగార్జున హీరోగా పరిచయమయ్యారు. హీరోయిన్‌గా శోభన తెలుగు తెరకు పరిచయమయ్యిందీ ఈ చిత్రంతోటే.
* 1989లో నిర్మించిన 'శివ' సినిమాతో తెలుగు సినిమా గతినే మార్చేసిన రాంగోపాల్‌వర్మ పరిచయమయ్యారు. అదే సినిమా హిందీ వెర్షన్‌తో ఇటు నాగార్జుననూ, అటు వర్మనూ బాలీవుడ్‌కూ పరిచయం చేసింది అన్నపూర్ణ సంస్థ.
* 1995లో నాగార్జున చిన్న కుమారుడు మాస్టర్ అఖిల్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ 'సిసింద్రీ'ని నిర్మించారు.
* 1998లో సమర్పించిన 'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి' చిత్రం ద్వారా దర్శకుడిగా వై.వి.ఎస్. చౌదరినీ, హీరోగా వెంకట్‌నూ పరిచయం చేశారు.
* 1998లోనే తీసిన 'చంద్రలేఖ' చిత్రంతో బాలీవుడ్ సుందరి ఇషా కొప్పికర్ హీరోయిన్‌గా పరిచయమయ్యారు.
* 1999లో తీసిన 'ప్రేమకథ' ద్వారా మనవడు (కూతురి కుమారుడు) సుమంత్‌ను హీరోగా, ఆంత్రమాలిని హీరోయిన్‌గా పరిచయం చేశారు.
* 2000 సంవత్సరంలో నిర్మించిన 'యువకుడు' ద్వారా నాయికగా భూమిక పరిచయమయ్యారు.
* 2003లో సమర్పించిన 'సత్యం' చిత్రంతో నాయికగా జెనీలియా తెలుగు తెరకు పరిచయం చేశారు. దర్శకుడిగా సూర్యకిరణ్‌కూ ఇదే తొలి చిత్రం.
* 2004లో తీసిన 'మాస్' చిత్రంతో కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకుడిగా మారారు.
* 2005లో సమర్పించిన 'సూపర్' సినిమాతో అనుష్క తెరంగేట్రం చేశారు. ఇదే సినిమాతో బాలీవుడ్ బ్యూటీ ఆయేషా తకియా తెలుగు తెరకు పరిచయమయ్యారు.
* 2008లో తీసిన 'పౌరుడు' ద్వారా రాజ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయమయ్యారు.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 29, 2011

Thursday, December 8, 2011
బిగ్ స్టోరీ: కొత్త అవతారం!
ఎన్నడూ లేనివిధంగా తెలుగు కథానాయకులు మూకుమ్మడిగా కొత్తదనం కోసం సిన్సియర్‌గా ప్రయత్నిస్తున్నారు. ఇదివరలో అడపాదడపా మాత్రమే మన హీరోలు కొత్త రూపంతో ప్రేక్షకుల ముందుకు ప్రత్యక్షమయ్యేవారు. ఇప్పుడు అలా కాదు. దాదాపు ప్రతి హీరో మూస పాత్రల నుంచి బయటపడి, కొత్త రూపంతో, కొత్త పాత్రతో ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. హిందీ, తమిళ, మలయాళ చిత్రాలతో పోలిస్తే తెలుగు చిత్రాల్లో ప్రయోగాలు తక్కువ, కొత్తదనం తక్కువ, వాస్తవికత తక్కువ... అనే అభిప్రాయం స్థిరపడిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే హీరోల దృక్పథాల్లో మార్పు వస్తోంది. దర్శకులు కమర్షియల్ కథల్లోనే కొద్దిగానైనా కొత్తదనం ఉండే పాత్రల చిత్రణ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా తెలుగు హీరోలు కొత్త రూపాలతో దర్శనమిస్తున్నారు.
పవన్ కల్యాణ్
ఈ నెల 9న వస్తున్న 'పంజా' చిత్రం పట్ల అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. కారణం, అది పవన్ కల్యాణ్ చిత్రం కావడం, అందునా ఆయన ఇదివరకెన్నడూ కనిపించని రీతిలో గడ్డంతో కనిపిస్తుండటం. తెలుగువాడైనప్పటికీ చెన్నైలో స్థిరపడి తమిళ చిత్రాలతో పాపులర్ అయిన విష్ణువర్ధన్ ఈ సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్‌గా పరిచయమవుతున్నాడు. స్టయిలిష్ టేకింగ్‌తో సినిమాలు రూపొందిస్తాడనే పేరున్న విష్ణు స్టయిలిష్ హీరోగా పేరున్న పవన్‌ను ఇప్పుడు 'పంజా'లో మాఫియా గ్యాంగ్ మెంబర్ జయదేవ్ పాత్రలో గడ్డంతో కొత్తగా చూపిస్తున్నాడు. ఈ కొత్త రూపంలో పవన్ మరింత స్టయిల్‌గా, సరికొత్త అందంతో కనిపిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
నాగార్జున
సమకాలీన హీరోలతో పోలిస్తే భిన్నమైన రూపాలతో ఎక్కువగా కనిపిస్తూ వస్తున్న హీరో నాగార్జున. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' పాత్రలతో మెప్పించిన ఆయన ఇప్పుడు తెలంగాణ పోరాట యోధుడు 'రాజన్న'గా ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి వి. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన మెలితిప్పిన మీసం, పొడవాటి కేశాలు, నుదుటన పొడవాటి తిలకం, మెడలో కండువాతో కొత్త రూపంతో కనిపిస్తున్నారు. స్వాతంత్య్ర పూర్వ కాలం నాటి నేపథ్యంతో తయారైన ఈ సినిమా నాగార్జున కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రం కాబోతోంది.
బాలకృష్ణ
ప్రయోగాలంటే నందమూరి బాలకృష్ణకు ఎంతో ప్రియం. 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' చిత్రాలు అందుకు మంచి ఉదాహరణలు. వాటితో పాటు కొన్ని చారిత్రక పాత్రలు, పౌరాణిక పాత్రలూ ఆయన ధరించారు. మొన్నటికి మొన్న 'సింహా'గా పొడవాటి బుర్ర మీసాలతో కనిపించి, ఆ పాత్రలో గొప్పగా రాణించిన ఆయన నిన్నటికి నిన్న 'శ్రీరామరాజ్యం'లో శ్రీరాముని పాత్రను అద్భుతంగా పోషించి, నేటి కాలంలో పౌరాణిక పాత్రలకు తను మినహా మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించారు. ఇప్పుడు జనవరిలో రాబోతున్న 'అధినాయకుడు' చిత్రంలో తాత, తండ్రి, మనవడుగా త్రిపాత్రాభినయం చేస్తూ ప్రేక్షక లోకంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తి కంబైన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ముఖ్యంగా తాత గెటప్‌లో బాలకృష్ణ ఆహార్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
రాజశేఖర్
భావోద్వేగపూరిత పాత్రలకు పెట్టింది పేరైన రాజశేఖర్ తన కెరీర్‌లో 'ఓంకారం', 'శేషు' వంటి చిత్రాల్లో వైవిధ్య పాత్రలు పోషించారు. తాజాగా ఆయన 'అర్జున'లో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం. కన్మణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్యనారాయణ అనే సామాన్య రైతుగా రాజశేఖర్ కనిపించబోతున్నారు. కొడుకు అర్జున్ సాయంతో సమాజానికి ఆయన ఏం చేంశాడనేది ఇందులోని ప్రధానాంశం. సూర్యనారాయణ పాత్రలో రాజశేఖర్ ప్రదర్శించే భావోద్వేగాలు సినిమాకి హైలైట్ అంటున్నారు.
జగపతిబాబు
కుటుంబ కథాచిత్రాల నాయకుడిగా పేరుపొందిన జగపతిబాబు ఆ ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలనెన్నింటినో పోషించారు. 'గాయం', 'హోమం' వంటివి అందుకు ఉదాహరణలు. ఇప్పుడు 'క్షేత్రం' చిత్రంలో ఆయన చేస్తున్న వీరనరసింహ రాయలు అనే పాత్ర అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మెలి తిప్పిన పొడవాటి బుర్ర మీసాలతో ఆయన కొత్తగా, భిన్నంగా కనిపిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జగపతిబాబు పాత్ర ప్రత్యేకాకర్షణ అనేది దర్శకుడు టి. వేణుగోపాల్ మాట.
రాజేంద్రప్రసాద్
పేరుకి హాస్య చిత్రాల కథానాయకుడే అయినా తన సుదీర్ఘ సినీ జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఆల్‌రౌండర్ అనిపించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్. 'ఎర్ర మందారం', 'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాషి' వంటి చిత్రాలు ఆయన నటనా వైదుష్యానికి నిదర్శనాలు. ఇటీవలే 'క్విక్‌గన్ మురుగన్'గా ప్రపంచ ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఇప్పుడు 'డ్రీమ్' చిత్రంలో సరికొత్త గెట ప్‌తో ఆకట్టుకుంటున్నారు. నూతన దర్శకుడు భవానీ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రంతో రాజేంద్రప్రసాద్ భిన్నమైన హెయిర్ స్టయిల్‌తో మరో ప్రయోగం చేస్తున్నారు.
రానా
ప్రయోగాలకు సీనియర్లే కాదు కుర్ర హీరోలు కూడా సై అంటున్నారు. అనేకమంది నేటి తరం హీరోలు సినిమా సినిమాకీ రూపం మార్చుకుంటూ వస్తుంటే తనూ అదే దారిలో పయనిస్తున్నానంటున్నారు రానా. 'లీడర్', 'నేను నా రాక్షసి' చిత్రాల్లో గడ్డంతో ఓ రకంగా కనిపించిన ఆయన ఇప్పుడు 'నా ఇష్టం' చిత్రంలో షేవ్ చేసిన గడ్డం, మీసంతో కొత్త రూపంతో కనిపించబోతున్నారు. జెనీలియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రకాశ్ తోలేటి దర్శకుడు.

Thursday, November 17, 2011
'రెబల్' మీద కన్నేసిన బయ్యర్లు
'రెబల్' సినిమా మీద అందరి దృష్టీ ప్రసరిస్తోంది. ఇందుకు రెండు కారణాలున్నాయి. 'డార్లింగ్', 'మిస్టర్ పర్‌ఫెక్ట్' వంటి రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడం ఒక కారణమైతే, 'కాంచన' వంటి సూపర్ హిట్ తర్వాత రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం రెండో కారణం. ఈ సినిమాతో ప్రభాస్ హ్యాట్రిక్ కొడతాడా, లేదా అనేది ఆసక్తికరమైన అంశం. అలాగే డైరెక్టర్‌గా తొలి సినిమా 'మాస్' తర్వాత తెలుగులో ఆ స్థాయి హిట్ లారెన్స్‌కి వస్తుందా అనేది మరో అంశం. 'మాస్' తర్వాత తెలుగులో లారెన్స్ 'స్టైల్', 'డాన్' సినిమాల్ని డైరెక్ట్ చేశాడు. లారెన్స్ స్వయంగా హీరోగా నటించిన 'స్టైల్' సినిమాతో రూ. 100 కోట్ల వ్యాపారం చేస్తానని దాని నిర్మాత లగడపాటి శ్రీధర్ చెప్పిన కబుర్లు ఉత్తుత్తివిగా తేలిపోయాయి. అందులో కనీసం 25 శాతం కూడా అది వసూలు చేయలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా శ్రీధర్‌కి ఒక్క పైసా లాభాన్ని ఇవ్వలేదు. దాని తర్వాత నాగార్జున హీరోగా లారెన్స్ డైరెక్ట్ చేసిన 'డాన్' సినిమా సైతం ఆశించిన రీతిలో ఆడలేదు. అయితే అతను తమిళంలో తీసిన 'ముని', 'కాంచన' సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి అటు తమిళం, ఇటు తెలుగులో లాభాలు ఆర్జించాయి. అతడి లేటెస్ట్ ఫిల్మ్ 'కాంచన' అయితే తెలుగులో దాన్ని రిలీజ్ చేసిన బెల్లంకొండ సురేశ్‌కి నాలుగింతల లాభాలు తెచ్చింది. ఈ నేపథ్యంలో తయారవుతున్న 'రెబల్' పట్ల బయ్యర్లు అమితాసక్తి వ్యక్తం చేస్తున్నారు. తమన్నా, దీక్షా సేథ్ నాయికలుగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇది హిట్టయితే ప్రభాస్, లారెన్స్ కెరీర్లు ముందుకు దూసుకుపోయినట్లే.
Sunday, November 13, 2011
బిగ్ స్టోరీ: హిందీలో మాట్లాడుతున్న మన స్టార్ హీరోలు
హిందీలో తెలుగు సినిమాల రీమేక్‌ల కాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. దానికి అదనంగా అక్కడ తెలుగు సినిమాల డబ్బింగూ ఓ వెల్లువలా మారడం నడుస్తున్న చరిత్ర. మన మెగా, సూపర్ స్టార్ల సినిమాల్ని కొనుగోలు చేసుకుని హిందీలోకి డబ్బింగ్ చేసుకుంటోంది బాలీవుడ్. ఇది థియేటర్లలో ప్రదర్శన కోసం కాదు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఏదో ఓ హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్లో ఏదో ఒక తెలుగు డబ్బింగ్ సినిమా ప్రసారమవుతూ కనిపిస్తోంది.
చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేశ్, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోల సినిమాల డబ్బింగులతో ముంబైలోని అంధేరీ, గుర్గావ్ వంటి ప్రాంతాలు డబ్బింగుల వాడలుగా మారిపోయాయి. ఈ ప్రాంతాల్లో తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ ఒక పరిశ్రమలా నెలకొంది. కేవలం గంటకు రూ. 200 నుంచి రూ. 1500 వరకు అద్దె ఉండే ఈ డబ్బింగ్ థియేటర్లలో అనువాద క్రతువు నిరంతరాయంగా నడుస్తోంది. తెలుగు సినిమాల్ని సాధ్యమైనంత హిందీ నేటివిటీకి దగ్గరగా తీసుకువచ్చే డబ్బింగ్ ఆర్టిస్టులతో అహోరాత్రులు కృషి జరుగుతోంది. ఈ క్రమంలో వందకు పైగా తెలుగు సినిమాలు హిందీలోకి డబ్బింగ్ అయ్యాయి. ఇంకా అవుతున్నాయి.
కలర్స్, సోనీ మాక్స్ చానళ్లకే కాదు, మధ్యాహ్నం పూట మరి కొన్ని మూవీ చానళ్ల ముడిసరుకు తెలుగు డబ్బింగులే. ఈ సినిమాల్లో మన స్టార్లు మరొక వాయిస్‌తో అచ్చమైన హిందీ మాట్లాడటం మనకి నవ్వు తెప్పిస్తుంటుంది కూడా. ఈ ట్రెండు ఎందుకు నడుస్తున్నదంటే - హిందీ సినిమాలు రోజురోజుకూ సూటిగా సాఫీగా కథ చెప్పే పద్ధతికి దూరమవుతుండటం. తెలుగు సినిమాల కథలు డైరెక్టుగా నడుస్తుండటం. తెలుగు సినిమాల్లో ఎమోషన్లు, డ్రామా ఇప్పుడొస్తున్న హిందీ సినిమాలకి మాదిరిగా కాక కుటుంబ ప్రేక్షకులకి నచ్చే మోతాదులో స్ట్రాంగ్‌గా ఉండటం.
అయితే బాలీవుడ్ సినిమాలతో పోల్చుకుంటే మన తెలుగు డబ్బింగులు ప్రాంతీయ భోజ్‌పురి సినిమాలతో సమానం. అంతకంటే వాటికి స్థాయీ, విలువా లేవు. కాకపోతే టెక్నికల్‌గా, మేకింగ్ పరంగా ఇవి భోజ్‌పురి సినిమా నిర్మాతలు కలలో కూడా ఊహించని భారీతనంతో ఉంటాయి. ఇంకా ఈ హిందీ చానళ్ల వీక్షకులకి బోనస్ ఏమిటంటే ఈ తెలుగు డబ్బింగుల్లో విలన్లు హిందీవాళ్లే కావడం. ముఖేశ్ రుషి, సాయాజీ షిండే నుంచి ప్రదీప్ రావత్, సోనూ సూద్ దాకా హిందీ ప్రేక్షకులకి తెలిసిన ముఖాలే ఉండటంతో అదొక ప్లస్ పాయింట్ అవుతోంది.
కొన్ని పాత్రల నేటివిటీ మార్పు పేరు మార్పుతో సులభంగా జరిగిపోతోంది. కమెడియన్ నల్లగా ఉంటే కాలూ (నల్లటివాడు) అని పేరు పెట్టేస్తారు. తెల్లగా ఉంటే సమస్య ఉండదు. అలా కొన్ని హిందీ నేటివిటీకి అతకని దృశ్యాలుంటే, అవి కథాగమనాన్ని దెబ్బతీయకపోతే తీసేస్తారు. గమనించదగ్గ సంగతేమంటే ఈ సినిమా టైటిల్స్‌లో టైగర్ అనే పదం ఎక్కువగా కనిపించడం. భవానీ ద టైగర్ (పలనాటి బ్రహ్మనాయుడు), ఇంద్ర ద టైగర్ (ఇంద్ర), టైగర్ ఎ ఒన్‌మేన్ ఆర్మీ (సుబ్బు) వంటివి అందుకు ఉదాహరణలు. మరికొన్ని టైటిల్స్ హిందీ హిట్ సినిమాల టైటిల్స్ గుర్తొచ్చేలా పెడతారు. ద రియల్ ఇండియన్ (ఒక్క మగాడు), డాన్ నెం.1 (డాన్), ఏక్ ఔర్ హిమ్మత్‌వాలా (అందరివాడు), అతిథి ఇంటర్నేషనల్ ఖిలాడీ (అతిథి), మేరీ జంగ్ (మాస్), విశ్వ (నేనున్నాను), రాబరీ (సూపర్), పెహలీ నజర్ కా పెహలా ప్యార్ (సంతోషం) వంటివి వాటిలో కొన్ని.
ప్రతినిత్యం మధ్యాహ్నం వేళ హిందీ చానళ్ల ప్రేక్షకులకి మంచి వినోద కాలక్షేపం అందిస్తున్న మన తెలుగు సినిమాలకి మరో ప్లస్ పాయింట్ కూడా ఉంది. వీటిలో హీరోయిన్లు హిందీవాళ్లే! ఏదేమైనా తెలుగు సినిమాల హిందీ డబ్బింగులతో మన స్టార్ల టాలెంట్ హిందీ ప్రేక్షకులకి - అదీ వాళ్ల ఇంటిల్లిపాదికీ పరిచయం కావడమంటే మామూలు విషయం కాదు.
Saturday, September 24, 2011
ప్రివ్యూ: రెబల్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రెబల్'లో ప్రధాన హీరోయిన్‌గా అనుష్క ప్లేస్‌లో తమన్నా చేస్తున్న సంగతిని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెండు షెడ్యూళ్లు చేసే వరకు హీరోయిన్‌గా అనుష్క నటించింది. అయితే డైరెక్టర్ రాఘవ లారెన్స్‌తో ఆమెకు విభేదాలు రావడంతో ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. ఈ విషయంలో అనుష్క తరపున హీరో నాగార్జున సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఫిలింనగర్‌లో ప్రచారంలోకి వచ్చింది. ఇందులో నిజమెంతున్నా అనుష్క తప్పుకుని ఆమె స్థానంలో తమన్నా రావడమనేది నిజం. రెండో హీరోయిన్‌గా పొడుగుకాళ్ల సుందరి దీక్షా సేథ్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌తో పాటు వైజాగ్, బ్యాంకాక్‌లోనూ జరుగుతోంది. ఈ సినిమాలో తొలిసారిగా ప్రభాస్ తండ్రిగా కృష్ణంరాజు నటిస్తుండటం విశేషం.
"ప్రభాస్, తమన్నా తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో ప్రభాస్ అందిస్తున్న సహకారం ఎప్పటికీ మరచిపోలేం. ఆయన కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ ఫిల్మ్. లారెన్స్ ఏ విషయంలోనూ రాజీపడకుండా కచ్చితంగా సూపర్‌హిట్ తీయాలన్న పట్టుదలతో ఈ చిత్రం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. టైటిల్‌కు తగ్గట్లుగా పవర్‌ఫుల్ సబ్జెక్టుతో 'రెబల్' రూపొందుతోంది'' అని చెప్పారు శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న జె. భగవాన్, జె. పుల్లారావు.
ఈ సినిమాలో తన రూపం వైవిధ్యంగా ఉంటుందని హీరో ప్రభాస్ తెలిపాడు. "టైటిల్‌కు తగ్గట్లుగా ఈ సినిమా స్టైలిష్‌గా, మాస్‌గా ఉంటుంది. షూటింగ్ చేస్తున్నప్పుడే మంచి కిక్ ఇస్తున్న ఈ చిత్రాన్ని లారెన్స్ అసాధారణంగా తీస్తున్నాడు'' అని ఆయన చెప్పాడు.
బ్రహ్మానందం, ముఖేష్‌రుషి, కెల్లీ దోర్జీ, సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, అలీ, చలపతిరావు, జయప్రకాశ్‌రెడ్డి, సుప్రీత్, జీవా తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: 'డార్లింగ్' స్వామి, సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, ఫైట్స్: రాం-లక్ష్మణ్, కళ: ఎ.ఎస్. ప్రకాశ్, కథ, కొరియోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్.

న్యూస్: నిందని చెరిపేసుకున్న శ్రీను వైట్ల
పెద్ద హీరోతో హిట్లివ్వలేక పోతున్నాడనే అపవాదుని ఎత్తకేలకు 'దూకుడు'తో అధిగమించాడు శ్రీను వైట్ల. 'దూకుడు'కి ముందు అతను చిరంజీవితో 'అందరివాడు', నాగార్జునతో 'కింగ్', వెంకటేశ్‌తో 'నమో వెంకటేశ' సినిమాల్ని డైరెక్ట్ చేశాడు. వీటిలో 'అందరివాడు' కేవలం కొందరివాడిగానే మిగలగా, 'కింగ్' పాక్షికంగానే టైటిల్‌ని జస్టిఫై చేయగలిగాడు. ఇక 'నమో వెంకటేశ' అయితే బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. పైగా ఈ సినిమాలో వెంకటేశ్‌ని మరీ జోకర్‌గా చూపించడం విమర్శలకి తావిచ్చింది కూడా. ఈ నేపథ్యంలో మహేశ్ వంటి సూపర్‌స్టార్‌తో సినిమా చేసే అవకాశం రావడంతో స్క్రిప్టు విషయంలో చాలా జాగ్రత్తపడ్డాడు శ్రీను. మహేశ్‌కి మాస్, క్లాస్ - రెండు వర్గాల్లో ఉన్న ఇమేజ్‌కి, తన స్టైల్ కామెడీ టచ్ ఇవ్వడంలో అతను తెలివిగా వ్యవహరించాడు. మహేశ్ అంటే ప్రేక్షకులు యాక్షన్ సన్నివేశాల్ని కోరుకుంటారు కాబట్టి అలాంటి సీన్లని పెడుతూనే, అతని కేరక్టర్లో వినోదాన్ని జోడించాడు. ఆఖరికి హీరోయిన్‌తో అతడి సన్నివేశాలు సైతం వినోదాన్ని అందించడంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా తెలంగాణా యాసని విలన్లకే పెడుతుంటారనే తెలంగాణావాదుల విమర్శల్ని దృష్టిలో పెట్టుకున్నట్లుగా మహేశ్ చేత అనేక సందర్భాల్లో, ప్రత్యేకించి విలన్లతో ఢీకొనేప్పుడు అతడి చేత తెలంగాణా యాసలో మాట్లాడించాడు. ఆ డైలాగుల్ని చెప్పడంతో మహేశ్ 100% సక్సెసయ్యాడు. ఇలా తెలంగాణావాదుల్ని సైతం తన పాత్రతో ఇంప్రెస్ చేయగలిగాడు మహేశ్. సమకాలీన పాపులర్ అంశాల్ని కూడా తన స్క్రిప్టులో జోడించడంలో ముందుండే శ్రీను ఓ సన్నివేశంలో బ్రహ్మానందం పాత్రచేత చెప్పించే 'ఎస్ఎంఎస్' రిక్వెస్ట్ థియేటర్లలో ఎంతగా నవ్వులు పూయించిందీ చూడొచ్చు. అలాగే అతడికి 'పద్మశ్రీ' అనే పేరు పెట్టడంలోనూ ఆ అవార్డులు ఎలా వస్తున్నాయో చెప్పాడు. అయితే ఎం.ఆర్. వర్మ చేత ఎడిటింగ్‌ని మరింత సమర్థంగా అతడు చేయించి ఉండాల్సింది. అలా జరిగితే లెంగ్త్ సమస్య వచ్చి ఉండేది కాదు. ఏదేమైనా మహేశ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ని ఇవ్వడంతో పాటు, పెద్ద హీరోతో హిట్ ఇవ్వలేడనే అపవాదుని చెరిపేసుకోవడంలో సఫలమయ్యాడు శ్రీను.
Saturday, September 3, 2011
న్యూస్: 'రాజన్న' రాకకి ముహూర్తం కుదిరింది
నాగార్జున టైటిల్ పాత్ర పోషిస్తున్న 'రాజన్న' సినిమా విడుదలకు తేదీ ఖరారయ్యింది. సెప్టెంబర్ 30న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి వి. విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. రాజమౌళి స్వయంగా ఇందులోని యాక్షన్ సన్నివేశాల్ని పర్యవేక్షిస్తే, కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇదివరకు అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌పై 'నిన్నే పెళ్లాడుతా', 'మన్మథుడు', 'మాస్' వంటి హిట్ సినిమాలు చేశారు నాగార్జున. 'సూపర్' వంటి యావరేజ్ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'రాజన్న'ని చేశారు.
"ఈ చిత్రంలోని రాజన్న క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. స్వాతంత్ర సమరయోధుడి కథ ఇది. అప్పటి యథార్థ సంఘటనలు కొన్నింటిని తీసుకుని తెరకెక్కిస్తున్నాం. విజయేంద్రప్రసాద్‌గారు చాలా బాగా డీల్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్‌లో రాజమౌళి కృషి సూపర్బ్. క్లైమాక్స్ ఈ సినిమాకు హైలైట్ అవుతుంది. కీరవాణిగారి సంగీతం ప్రాణం. అత్యంత కీలకమైన పాత్రలో ఎనిమిదేళ్ళ బేబి ఏని నటన సూపర్బ్. ఈ కథలో పాప పాత్రకు ప్రాముఖ్యత ఉంది. ఎన్నో సెట్లు వేసి స్వాతంత్య్ర పోరాటం నాటి వాతావరణాన్ని క్రియేట్ చేశాం. ఆర్ట్ డైరక్టర్ రవీందర్ సెట్స్‌ని అద్భుతంగా వేశారు. మా సంస్థలో వస్తున్న ప్రెస్టీజియస్ చిత్రమిది. చిత్ర నిర్మాణం పూర్తి కావచ్చింది. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. పేట్రియాటిక్ ఫీల్‌తో సాగుతుంది. నటుడిగా సంతృప్తినిచ్చిన సినిమా'' అని ఆయన చెప్పారు. సెప్టెంబర్ రెండో వారంలో ఆడియో విడుదల చేయబోతున్నారు.
కాగా ఈ సినిమాని ఆర్.ఆర్. మూవీమేకర్స్‌కు చెందిన ఆర్.ఆర్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తోంది. ఇదివరకు ఈ సంస్థ తమ తొలి ప్రయత్నంగా నాగచైతన్య సినిమా 'దడ'ని రిలీజ్ చేసి, నష్టాల పాలయ్యింది. 'రాజన్న'తో ఆ నష్టాన్ని పూడ్చుకుంటుందో, లేదో చూడాలి.

Thursday, September 1, 2011
బిగ్ స్టోరీ: మోహన్‌బాబు రావణావతారం!
'శ్రీరామరాజ్యం''లో బాలకృష్ణని రామావతారంలో బాపు చూపిస్తే, మోహన్‌బాబుని రావణావతారంలో చూపించాలని దిగ్దర్శకుడు కె. రాఘవేంద్రరావు సంకల్పించారు. రావణాసురునిగా మోహన్‌బాబు నటించే సినిమా షూటింగ్ మొదలయ్యేది 2012 ప్రథమార్థంలో. ప్రస్తుతం తెలుగులో భక్తి రస చిత్రాలు, పౌరాణిక చిత్రాల మీద ధ్యాస మళ్లినట్లే కనిపిస్తోంది. సాధారణంగా సోషల్ సినిమాల కంటే ఇలాంటి భక్తి, పౌరాణిక చిత్రాలకి ఖర్చు ఎక్కువవుతుంది. కారణం అప్పటి వాతావరణానికి తగ్గట్లు సెట్లు నిర్మించాల్సి రావడం, కాస్ట్యూమ్స్ తయారు చేయించడం. నాగార్జున నటించిన 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' సినిమాలకు మంచి పేరొచ్చింది. అయితే చాలామంది జనానికి తెలీని విషయం ఆ రెండూ కాస్ట్ ఫెయిల్యూర్లే. 'అన్నమయ్య'ని మించి 'శ్రీరామదాసు'కు కమర్షియల్‌గా ఎక్కువ నష్టాలు వచ్చాయి. అయితే సంకల్పమే అలాంటి తరహా సినిమాల నిర్మాణానికి దారితీస్తోంది. అటువంటి సినిమాలతో చరిత్రలో నిలిచిపోవచ్చనే ఆశే దానికి కారణం. రావణాసురుని పాత్ర అనగానే మనకి 'భూకైలాస్'లోని ఎన్టీ రామారావు, 'సంపూర్ణ రామాయణం'లోని ఎస్వీ రంగారావు జ్ఞాపకం వస్తారు. ఆ పాత్రల్లో ఆ ఇద్దరూ అమోఘంగా రాణించారు. ఆ ఇద్దరూ మినహా ఇంతదాకా మరొకరు ఆ పాత్రలో రాణించలేదు. ఇప్పుడు అలాంటి రావణుని పాత్ర చేయాలని విలక్షణ నటునిగా పేరుపొందిన మోహన్‌బాబు సంకల్పించారు. ఇప్పుడు హఠాత్తుగా ఆ పాత్రని చేయాలనే తలంపు ఆయనకు కలగడానికి 'శ్రీరామరాజ్యం' ప్రేరణ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
"రావణుడు 'నవమబ్రహ్మ'. బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తూ వైరి విజయానికి ముహూర్తాన్ని నిర్ణయించి, తన మరణాన్ని తానే ఆహ్వానించిన ధర్మనిరతుడు. రాముడు పితృవాక్య పరిపాలకుడైతే... రావణుడు మాతృవాక్య పరిపాలకుడు. శివాంశసంభూతుడు. శ్రీహరి పథాన్ని త్వరితగతిన చేరాలని తపించిన అపర హరిభక్తుడు. ఆ మహనీయుడి కథాంశంతో గతంలో చాలా సినిమాలొచ్చినా, రావణావతారానికి సంబంధించిన పూర్తి వృత్తాంతంతో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నది రావణుడి పాత్ర ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించే సినిమా. ఆయన జననం నుంచి మరణం వరకూ ఈ కథ సాగుతుంది. ఎన్టీఆర్, ఎస్వీఆర్ లాంటి మహానటులు చేసిన పాత్రను నేను చేయబోతున్నాను. వారి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా నా స్టైల్‌లో ఈ పాత్ర రక్తికట్టించడానికి ప్రయత్నిస్తాను" అని చెప్పారు మోహన్‌బాబు.
ఈ సినిమాకి సంబంచించిన మరో విశేషం, ఇందులో కేవలం తెలుగు నటులే కాకుండా, భారత దేశంలో పేరెన్నికగన్న నటులు నటించనుండటం. కారణం దీనికి భారీ బడ్జెట్ అవుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రేక్షకులకి సుపరిచితులైన నటులు ఇందులో పాత్రధారులైతే కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లోనూ దీన్ని విడుదల చేసే అవకాశం ఉంటుంది కనుక. త్రీడీ కెమెరాను ఉపయోగించి, అత్యాధునిక టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకోవడం కూడా అందుకే.
"ఎలాంటి పాత్రనైనా తనదైన నటనాపటిమతో మెప్పించగల నటుడు మోహన్‌బాబు. ఎన్టీఆర్ తర్వాత అంతటి సంభాషణా పటిమ గల నటుడు ఆయన మాత్రమే. ఈ సినిమాతో తనలోని నవరసాలను ఆవిష్కరించబోతున్నారాయన. మా కాంబినేషన్‌లో వచ్చిన 'అల్లుడుగారు', 'అల్లరిమొగుడు', 'మేజర్ చంద్రకాంత్' చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఆ వరుసలోనే వాటికన్నా మరింత అత్యద్భుతంగా ఈ సినిమా నిలుస్తుందని మా నమ్మకం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాం'' అని తెలిపారు రాఘవేంద్రరావు.

Subscribe to:
Posts (Atom)