నాగార్జున టైటిల్ పాత్ర పోషిస్తున్న 'రాజన్న' సినిమా విడుదలకు తేదీ ఖరారయ్యింది. సెప్టెంబర్ 30న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి వి. విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. రాజమౌళి స్వయంగా ఇందులోని యాక్షన్ సన్నివేశాల్ని పర్యవేక్షిస్తే, కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇదివరకు అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌పై 'నిన్నే పెళ్లాడుతా', 'మన్మథుడు', 'మాస్' వంటి హిట్ సినిమాలు చేశారు నాగార్జున. 'సూపర్' వంటి యావరేజ్ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'రాజన్న'ని చేశారు.
"ఈ చిత్రంలోని రాజన్న క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. స్వాతంత్ర సమరయోధుడి కథ ఇది. అప్పటి యథార్థ సంఘటనలు కొన్నింటిని తీసుకుని తెరకెక్కిస్తున్నాం. విజయేంద్రప్రసాద్‌గారు చాలా బాగా డీల్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్‌లో రాజమౌళి కృషి సూపర్బ్. క్లైమాక్స్ ఈ సినిమాకు హైలైట్ అవుతుంది. కీరవాణిగారి సంగీతం ప్రాణం. అత్యంత కీలకమైన పాత్రలో ఎనిమిదేళ్ళ బేబి ఏని నటన సూపర్బ్. ఈ కథలో పాప పాత్రకు ప్రాముఖ్యత ఉంది. ఎన్నో సెట్లు వేసి స్వాతంత్య్ర పోరాటం నాటి వాతావరణాన్ని క్రియేట్ చేశాం. ఆర్ట్ డైరక్టర్ రవీందర్ సెట్స్‌ని అద్భుతంగా వేశారు. మా సంస్థలో వస్తున్న ప్రెస్టీజియస్ చిత్రమిది. చిత్ర నిర్మాణం పూర్తి కావచ్చింది. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. పేట్రియాటిక్ ఫీల్‌తో సాగుతుంది. నటుడిగా సంతృప్తినిచ్చిన సినిమా'' అని ఆయన చెప్పారు. సెప్టెంబర్ రెండో వారంలో ఆడియో విడుదల చేయబోతున్నారు.
కాగా ఈ సినిమాని ఆర్.ఆర్. మూవీమేకర్స్‌కు చెందిన ఆర్.ఆర్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తోంది. ఇదివరకు ఈ సంస్థ తమ తొలి ప్రయత్నంగా నాగచైతన్య సినిమా 'దడ'ని రిలీజ్ చేసి, నష్టాల పాలయ్యింది. 'రాజన్న'తో ఆ నష్టాన్ని పూడ్చుకుంటుందో, లేదో చూడాలి.
No comments:
Post a Comment