Tuesday, September 27, 2011
న్యూస్: హీరోయిన్‌గా ఫెయిలైన చిన్న జేజమ్మ!
దివ్య అంటే ఎవరూ అంత త్వరగా గుర్తుపట్టక పోవచ్చు. కానీ 'చిన్న జేజమ్మ' అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అవును. 'అరుంధతి'లో చిన్నప్పటి అనుష్కగా నటించి భలేగా ప్రేక్షకుల్ని మెప్పించిన ఆ బేబీ దివ్య మూడేళ్లు తిరిగేసరికి హీరోయిన్ అవతారమెత్తేసింది. అందుకే 'నేను నాన్న అబద్ధం' సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకులు ఒకింత ఆసక్తిని ప్రదర్శించారు. అయితే ఆ ఆసక్తికి తగ్గట్లుగా సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేక పోతోంది. తొలివారం ఆంధ్ర, సీడెడ్‌లలో ఫర్వాలేదనిపించేట్లు ఉన్న కలెక్షన్లు నైజాం ఏరియాలో బాగా డల్‌గా ఉన్నాయి. హీరోయిన్ పాత్రలో దివ్య ఆకట్టుకోలేకపోవడం ఈ సినిమాకి మైనస్‌గా మారింది. ఇప్పుడే యవ్వనంలో అడుగుపెట్టిన దివ్య అందాల ప్రదర్శన కూడా ఎవర్నీ మెప్పించలేక పోతోంది. ట్రాన్స్‌పరంట్ బట్టల్తో బీచ్‌లలో ఆమె పరుగులు తీస్తుంటే ఎవరూ ఎంజాయ్ చేయలేకపోయారు. అయితే ఆమె అమాయక చూపులు, మొహంలో లేతదనం వారిని ఆకట్టుకోలేక పోలేదు. కానీ హీరోయిన్ పాత్ర పోషణలో ఆమె విఫలమైందనడంలో సందేహం లేదు. ఇళ్లల్లో పెద్దల ప్రేమ లభించకపోవడం, అభద్రతా భావం వల్ల అబ్బాయిలతో అమ్మాయిలు లేచిపోతున్నారని ఈ కథ చెబుతుంది. ఈ కథని చెప్పడంలో దర్శకుడు గోవింద్ వరహ కల్పించిన పాత్రలకి తగిన తారాగణం లేకపోవడం వల్ల అంటే మిస్ కేస్టింగ్ వల్ల కథ అనాసక్తంగా తయారైంది. హీరో పాత్ర చేసిన ఆనంద్ ('100% లవ్'లో సెకండ్ హీరో) మాత్రం తన అభినయంతో మెప్పించాడు. దివ్య ఇంకో రెండేళ్లపాటైనా విరామం తీసుకుని నటిస్తే బాగుంటుందని చెప్పొచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment