శేఖర్ కమ్ముల సినిమా 'హ్యాపీడేస్' ద్వారా ఓ హీరోగా పరిచయమైన రాహుల్
ప్రస్తుతం కెరీర్ క్రైసిస్ ఎదుర్కొంటున్నాడు. ఆ సినిమాతో టిపికల్ వాయిస్‌తో
అందర్నీ ఆకట్టుకున్న ఈ టైసన్ సినిమాలు 'రెయిన్‌బో', 'ముగ్గురు' రెండూ
బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఈ రెండింటికీ వి.ఎన్. ఆదిత్య డైరెక్టర్
కావడం గమనార్హం. వీటిలో 'రెయిన్‌బో'లో అతడు సోలో హీరో కాగా, 'ముగ్గురు'లో
టైటిల్‌కి తగ్గట్లే ముగ్గురు హీరోల్లో ఒకడిగా నటించాడు.
"మునుపటి రెండు సినిమాలతో పోలిస్తే నటుడిగా ఇప్పుడు మరింత మెరుగయ్యానని
అంటున్నారు. నా బలాలు, బలహీనతలు నాకు తెలుసు. తొలి సినిమాతో పోలిస్తే
ఇప్పుడు నా డైలాగ్ డిక్షన్ మెరుగైందనే పేరు వచ్చింది. అలాగే డాన్సుల్లోనూ
బెటరయ్యానని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా ఇంప్రూవ్
కావాలనుకుంటున్నా. దాని కోసం స్పెషల్ క్లాసులకెళ్తున్నా" అని అతను తెలిపాడు.
ప్రస్తుతం
రాహుల్ తమిళంలో 'ఉయిర్ మోళి' (ఆత్మ భాష) అనే చిత్రంలో సోలో హీరోగా
చేస్తున్నాడు. భారీ నిర్మాణ సంస్థ మీడియా వన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి
మనోరాజా డైరెక్టర్. 2012 జనవరిలో ఈ సినిమా రిలీజవుతుంది. ఇక తెలుగు
విషయానికి వస్తే "త్వరలో 'ఆవకాయ్
బిర్యాని' ఫేమ్ అనీశ్ కురువిల్లా డైరెక్షన్‌లో మల్టీస్టారర్
చెయ్యబోతున్నా. ఈ ఏడాది ఆఖరులోగా లేదా వచ్చే ఏడాది మొదట్లో అది ఉండొచ్చు. ఆ
సినిమాకి శేఖర్ కమ్ముల గారు నన్ను రికమెండ్ చేశారు. అనీశ్ కథ చెప్పారు.
అది సమకాలీన అర్బన్ థ్రిల్లర్. ఆ సినిమా ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నా"
అని చెప్పాడు రాహుల్. మొత్తానికి అతడి కెరీర్‌కి 'హ్యాపీడేస్' రావాలంటే మరి
కొంతకాలం ఆగక తప్పదు.
No comments:
Post a Comment