Showing posts with label bommarillu. Show all posts

Monday, July 2, 2012
ఎవరైనా చిన్న సినిమా అంటే నరికేస్తా
"ఎవరైనా చిన్న సినిమా అంటే నరికేస్తాను. ఎవరిది పెద్ద సినిమా? ఎవరు పెద్ద? సక్సెస్ ఈజ్ ద బిగ్. సక్సెస్ కంటే పెద్ద సినిమా మరోటి లేదు'' అని వ్యాఖ్యానించారు నూట యాభై చిత్రాల దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు. ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన 'ఈ రోజుల్లో' వంద రోజుల వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. "నాకు తెలిసి ఈ ఆరేడు సంవత్సరాల్లో నా మనసుకు నచ్చినవి మూడే మూడు సినిమాలు. ఒకటి 'బొమ్మరిల్లు', తర్వాత 'అలా మొదలైంది', ఇప్పుడు 'ఈ రోజుల్లో'. ఈ సినిమా కోసం ఒక్క వారానికే థియేటర్లు బుక్ చేశారు. 'ఇది వంద రోజులు ఆడుతుంది, ఆ ఫంక్షన్‌కి నేనొస్తాన'ని చెప్పాను. సినిమాని నేను ప్రేక్షకుడిగానే చూస్తా. సినిమాలో ఏడుపు సీన్లుంటే నా కళ్లవెంట నీళ్లొస్తాయి. నవ్వు సీన్లొస్తే చంటి పిల్లాడిలా నవ్వుతాను. నేను బడ్జెట్ గురించి మాట్లాడటం లేదు. ఆ రోజుల్లో కేవలం రూ. లక్షతో పాటలు లేకుండా, అక్కడక్కడా తప్పితే మాటలు కూడా లేకుండా తీసిన 'నీడ' పెద్ద సినిమానా? చిన్న సినిమానా? 110 రోజులాడింది. ప్రేక్షకులు ఏ సినిమాని ఆదరిస్తారో అదే పెద్ద సినిమా. ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టి తీసిన సినిమానో, అమెరికాలో షూటింగ్ చేసిన సినిమానో పెద్ద సినిమా కాదు. 'ప్రేమాభిషేకం' కంటే పెద్ద హిట్టు లేదు. దానికి ఊటీ కూడా వెళ్లలేదు. పాటలన్నీ విజయా గార్డెన్స్‌లోనే తీశాను. వాటికంటే గొప్ప సాంగ్స్ ఉన్నాయా, ఈ మధ్య వచ్చే సినిమాల్లో. ఈ రోజు కోట్లు గురించి మాట్లాడుతున్నారు. 'ఒసేయ్ రాములమ్మా' సినిమా నేల టిక్కెట్టు రూ. రెండు, పై టిక్కెట్లు రూ. 10 ఉన్న రోజుల్లో రూ. 22.5 కోట్లు వసూలు చేసింది. ఇవాళ రేట్ల ప్రకారం లెక్కేస్తే రూ. 220 కోట్లు అవుతాయి. రికార్డుల గురించి కాదు మాట్లాడుకోవాల్సింది, సినిమాల గురించి. 'ఈ రోజుల్లో' సినిమాలో కథలేదు. నిత్య జీవిత సత్యాలున్నాయి. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఎలా వాడేసుకుంటుంది, ఎలా తీసి అవతల పారేస్తుంది, ఎలా నాకేస్తుంది.. ఇదీ ఇందులో ఉంది. ఇవాళ ఏదైతే యూత్‌లో నడుస్తుందో, సమ సమాజంలో ఏం జరుగుతోందో.. దాన్ని వడపోసి, చక్కని స్క్రీన్‌ప్లేతో తీశాడు మారుతి. 'ఈ రోజుల్లో' వంటివి పది సినిమాలు వస్తే చాలు'' అని ఆయన చెప్పారు.
దిల్ రాజు మాట్లాడుతూ "చిన్న సినిమాలు తీసేవాళ్లకి ఇన్‌స్పిరేషన్ 'ఈ రోజుల్లో'. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యేలా చేసి సహకారం అందించాను. అన్ని తరగతుల ప్రేక్షకులు చూస్తే ఇంకా ఎక్కువగా రెవెన్యూ సాధించాల్సిన సినిమా'' అన్నారు. కేవలం 'ఈ రోజుల్లో' సక్సెస్‌ని మాత్రమే కాక దాని వెనుక ఉన్న ప్లానింగ్, కృషిని కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలని నిర్మాత కె. అచ్చిరెడ్డి సూచించారు. ఈ సినిమాకి పెట్టిన ఖర్చునీ, వచ్చిన కలెక్షన్లనూ చూస్తే ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పాలని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ చెప్పారు.
నిర్మాతల్లో ఒకరైన ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ "రచయిత స్వామిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రెండో సినిమా తియ్యబోతున్నాం. మేం తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతోనే సినిమాలు తీస్తాం'' అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ "డబ్బులున్నంత మాత్రాన సినిమాలు తియ్యకూడదు. సినిమాని ప్రేమించి తియ్యాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది. దాసరిగారి చేతులమీదుగా వంద రోజుల షీల్డు అందుకోవడం నా జీవితంలో జరిగిన అద్భుతం. ఇప్పుడు నా కథని నమ్మి బెల్లంకొండ సురేశ్ 'బస్‌స్టాప్' నిర్మిస్తున్నారు. అది పెద్దలు, పిల్లలు కూడా చూసి ఆనందించే పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం'' అని చెప్పారు.
ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ సభ్యులు, డిస్ట్రిబ్యూటర్లకు దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ్ వంద రోజులు షీల్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెల్లకొండ సురేశ్, ఎం.ఎల్. కుమార్‌చౌదరి, బి.ఎ. రాజు, సురేశ్ కొండేటి, దర్శకుడు రవికుమార్‌చౌదరి, రచయిత సంజీవి, మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ వాసు, డాక్టర్ దశరథరామిరెడ్డి, హీరోలు శ్రీ, సాయి, హీరోయిన్ రేష్మా, నిర్మాత శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్ ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tuesday, May 24, 2011
క్రేజీ కాంబినేషన్: ముగ్గురు మిత్రుల 'నిప్పు'
మద్రాసులో ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు కుర్రాళ్లు అనంతర కాలంలో తెలుగు చిత్రసీమలో తమకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆ ముగ్గురు... గుణశేఖర్, వై.వి.ఎస్. చౌదరి, రవితేజ. వీరిలో మొదటి ఇద్దరూ దర్శకులుగా రాణిస్తుండగా, మూడో వ్యక్తి స్టార్ హీరో హోదాని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి ఓ సినిమాకి పనిచేయబోతున్నారు.ఆ సినిమా పేరు 'నిప్పు'. రవితేజ హీరోగా నటించే ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా, బొమ్మరిల్లు పతాకంపై వైవీఎస్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సంగతిని చౌదరి ప్రకటించారు.
"అప్పట్లో నటి అనూరాధ తల్లి సరోజ గారింట్లో గుణశేఖర్ కింది రూములో ఉంటే, రవితేజ, నేను పై రూములో ఉండేవాళ్లం. అప్పట్లో చిత్రసీమలో అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఒకే ఇంట్లో ఉన్న మేం ముగ్గురం ఈ రోజు ఒకే సినిమాకి కలిసి పనిచేస్తుండటం ఆనందదాయకం. ఇది నాకు లభించిన అదృష్టంగా భావిస్తున్నా'' అని చెప్పారు. బొమ్మరిల్లు పతాకంపై తన దర్శకత్వంలో ఓ సినిమా, పేరు పొందిన దర్శకులతో ఓ సినిమా, కొత్త దర్శకులతో ఓ సినిమా.. ఇలా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నానన్నారు. "మా బేనర్‌లో భిన్న భిన్న కథలతో ఇతర దర్శకులతో సినిమాలు చేయాలనే నిర్ణయంతో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నా. నేనభిమానించే దర్శకులతో, వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ సినిమాలు నిర్మిస్తా''అని చెప్పారు. అందులో భాగంగా గుణశేఖర్ దర్శకత్వంలో 'నిప్పు' తీస్తున్నాననన్నారు.
"గుణశేఖర్‌లో రెండు పార్శ్వాలున్నాయి. అతి తక్కువ బడ్జెట్‌తో 'సొగసు చూడతరమా' వంటి సినిమాలు, భారీ బడ్జెట్‌తో 'ఒక్కడు' వంటి సినిమాలు తీయగలరు. నాకు సినిమా చేసి పెట్టమని ఆయన్ని అడిగా. చేస్తానని వెంటనే మాటిచ్చారు. తొమ్మిది నెలలు టైమ్ తీసుకుని 'నిప్పు' స్క్రిప్టు పని పూర్తి చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా నడిచే ఈ సినిమాలో రవితేజ కొత్త డైమన్షన్‌లో కనిపిస్తాడు. ఎన్టీఆర్ జయంతి రోజు ఈ నెల 28న 'నిప్పు' షూటింగ్ ప్రారంభిస్తున్నాం'' అని తెలిపారు వైవీఎస్.
ఈ చిత్రానికి ఆయన బావమరిది కిశోర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తారు. కాగా తన భార్య గీతకి ఏప్రిల్ 27న రెండో పాప పుట్టిందనీ, పాపకు ఏక్తా అని నామకరణం చేశామనీ, సహ నిర్మాతలుగా తన ఇద్దరు కుమార్తెలు యుక్త, ఏక్తా పేర్లు ఉంటాయని వైవీఎస్ చెప్పారు.

Wednesday, October 13, 2010
ఇంటర్వ్యూ: ఎన్టీఆర్
"ఇందులో నా పాత్ర పేరు కృష్ణ. ఒక యాక్టర్‌కి విందుభోజనం లాంటి పాత్ర. అన్ని రకాల ఎమోషన్స్, షేడ్స్ కలగలిపి ఉన్న పాత్ర. 'బృందావనం'లో మెయిన్ హైలైట్ ఎన్టీఆర్ కొత్తగా కనిపించడం'' అని చెప్పారు ఎన్టీఆర్. ఆయన హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు నిర్మించిన 'బృందావనం' ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకుడు. 'శక్తి' షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమా సెట్స్‌పై మంగళవారం ప్రత్యేక ఇంటర్వ్యూలో 'బృందావనం' గురించీ, అనేక ఇతర అంశాల గురించీ విపులంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
నా కెరీర్‌లో తిరిగి చూసుకుంటే మిగిలిపోయే సినిమా 'బృందావనం'. ఇంతదాకా రెగ్యులర్ ఫార్ములా సినిమాలు, మాస్ మసాలా సినిమాలు చేస్తూ వస్తున్నా. 'బృందావనం' కమర్షియల్ అంశాలు ఉంటూనే ప్రేమ, ఫ్యామిలీ అనుబంధాల మీద ఎక్కువ దృష్టి పెట్టి చేసిన సినిమా. 'బృందావనం' అనేది ఓ ఇంటిపేరు. బృందావనంలో కృష్ణుడు ఉంటే ఎంత కళకళలాడిపోతుంటుందో, ఇదీ అలా కళకళలాడే సినిమా. ఎలాంటి బృందావనంని ఎలాంటి బృందావనంగా నేను మార్చాననేదే ఈ సినిమాలోని ప్రధానాంశం.
విందుభోజనం లాంటి పాత్ర
ఇందులో నా పాత్ర పేరు కృష్ణ. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్. ఒక యాక్టర్‌కి విందుభోజనం లాంటి పాత్ర. అన్ని రకాల ఎమోషన్స్, షేడ్స్ కలగలిపి ఉన్న పాత్ర. బాగా కష్టపడి చేశాను. ఒక మంచి ప్రయత్నమైతే మేం చేశాం. ఎన్టీఆర్‌ని కొత్త కోణంలో చూపించిన సినిమా. అంతేకానీ సూపర్‌హిట్ సినిమా చెయ్యాలనే ఉద్దేశంతో చేసిన సినిమా కాదు. సక్సెస్‌లో టీమ్ వర్క్ ఎంత ఉంటుందో, ఫ్లాపులోనూ టీమ్ వర్క్ అంతే ఉంటుంది. అది ఏ ఒక్కరి క్రెడిటో కాదు. 'బృందావనం'లో మెయిన్ హైలైట్ ఎన్టీఆర్ కొత్తగా కనిపించడం. కొరటాల శివ డైలాగ్స్, తమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాని అందంగా మలిచాయి. పాటల్లో 'నిజమేనా నిజమేనా' బాగా ఇష్టం.
పోటాపోటీ నటన
కాజల్, సమంతా - ఇద్దరూ ప్రొఫెషనల్స్. భూమి, ఇందు పాత్రల్లో ఇద్దరూ బాగా కష్టపడ్డారు. పోటాపోటీగా చేశారు. ఇద్దరికీ మంచి భవిష్యత్ ఉంది. వాళ్లని కేవలం గ్లామర్ కోసం పెట్టుకోలేదు. పర్ఫార్మెన్స్‌కి కూడా స్కోప్ ఉన్న పాత్రలు వాళ్లవి. వాళ్లే కాదు, శ్రీహరి, ప్రకాశ్‌రాజ్ కూడా తాము తప్ప ఆ పాత్రల్ని ఇంకెవ్వరూ చేయ్యలేరనే అభిప్రాయం కలిగించే విధంగా చేశారు. కోట శ్రీనివాసరావుగారు అద్భుతంగా నటించారు. చాలా రోజులకి ఆయనలోని నటుణ్ణి పీక్ స్టేజ్‌లో చూశా. ఒక మంచి ఆర్టిస్టుకి మంచి పాత్ర ఇస్తే ఎలా చేస్తారో ఆయన నటన చూస్తే తెలుస్తుంది.
పెయింటింగ్‌లా తీశాడు
సినిమాని వంశీ చాలా బాగా తీశాడు. ఒక అద్భుతమైన దర్శకుడిగా తయారయ్యే లక్షణాలు అతనిలో కనిపిస్తు న్నాయి. చెప్పిన కథ కన్నా బాగా తీశాడు. ప్రతి ఫ్రేమ్‌ని ఒక పెయింటిం గ్‌లా, చాలా అందంగా తీశాడు. 'బ్యూటిఫుల్ పిక్చరెస్క్' అంటారే - అది 'బృందావనం'లో అడుగడుగునా కనిపిస్తుంది. నా వరకు అయితే వందకి వంద మార్కులు కొట్టేశాడు. 'మున్నా' రూపంలో అతని తొలి ప్రయత్నం ఫలించలేదంతే. అతను ఫ్లాప్ కాదు. 'మున్నా' స్క్రిప్టు ఫ్లాపయ్యిందేమో కానీ డైరెక్టర్‌గా పాసయ్యాడు. చాలా స్టైలిష్‌గా ఆ సినిమాని తీశాడు. అలాంటి డైరెక్టర్ మంచి కథ చేస్తే ఎలా ఉంటుందనేదానికి 'బృందావనం' ఒక నిదర్శనం. అంత బలమైన కథ ఇది.
రాజుకు సినిమా పిచ్చి
దిల్ రాజు సినిమా మీద తపన ఉన్న నిర్మాత. ఆయనకు సినిమా అంటే పిచ్చి, వ్యామోహం, వ్యాధి. ఎవరితో చేసినా ఒకే విధమైన తపనతో తీస్తారు. బ్యానర్ విలువ పెరగాలనే కించిత్ స్వార్థం కూడా అందులో ఉంటుంది. నాకు దర్శకుడే పనిచేయాలని ఉంటుంది. దర్శకుడికి మనం సలహాలు ఇవ్వాలే కానీ మన అభిప్రాయాల్ని అతని మీద రుద్దకూడదు. ఆ విషయంలో దర్శకుడికి రాజు చాలా స్వేచ్ఛనిచ్చారు. అమోఘంగా ఈ సినిమాని నిర్మించారు. అందుకే అద్భుతమైన టీమ్‌తో పనిచేసిన ఫీలింగ్ నాది.
గ్రాఫిక్స్ వల్లే ఆలస్యం
8న రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ సెన్సార్ అయ్యింది 7నే. అంటే 8న విడుదల చెయ్యడం అసాధ్యం. 14 విడుదల అనేది కావాలని చేసిన పోస్ట్‌పోన్ కాదు. అన్నీ మనకు అనుకూలంగా జరగవు. ఈ సినిమాకి సెట్స్‌మీద 130 రోజులు కష్టపడ్డాం. కొన్ని అనుకున్న టైమ్‌కి అవుతాయి. కొన్ని అవవు. గ్రాఫిక్స్ వల్లే పోస్ట్ ప్రొడక్షన్ కాస్త లేటయ్యింది. అందుకే రిలీజ్ డేట్ 14కి జరిగింది.
ప్రేక్షకుల కోసమే సినిమా
నా కెరీర్‌లో హిట్లు, ఫ్లాపులు చూశా. ఇప్పుడు వాటికి అతీతమై పోయా. మనం హిట్టవుతాయనుకున్నవి హిట్లవ్వవు. ఫ్లాపవుతాయనకున్నవి కావు. మనం చేసేది ప్రేక్షకుల కోసమే. ఒకే ఫార్ములాకి పరిమితమవుతున్నామా అనే భావన మొదలైంది. నాకు ఎన్టీ రామారావుగారు ఇన్‌స్పిరేషన్. ఆయన ఒకదానికొకటి పొంతనలేని ఎన్నెన్నో భిన్నమైన ప్రాతలు చేసుకుంటూ పోయారు. పౌరాణికాలు, జానపదాలు, సోషియో ఫాంటసీలు, సాంఘిక సినిమాల్లో సందేశాత్మకాలు, సెంటిమెంట్ సినిమాలు, వినోదాత్మక చిత్రాలు, మాస్ సినిమాలు, క్లాస్ సినిమాలు.. ఇలా ఎన్నో చేశారు. అందుకే ఆయన ఆల్‌రౌండర్ అయ్యారు. నాకు 'బొమ్మరిల్లు', 'కొత్త బంగారులోకం' సినిమాలు బాగా ఇష్టం. కానీ అలాంటివి చేయాలనుకున్నా చేయలేను. మాస్‌ని వొదులుకోకుండానే కొత్తకోణంలో, కొత్తరకంగా చెయ్యాలని చేసిన సినిమా 'బృందావనం'.
ఎవడి పని వాడిదే
నాకు కథ చెప్పిన తర్వాత ఫైనల్ నెరేషన్ అడుగుతా. అది నచ్చితే ఇక వదిలేస్తా. నాకు తెలిసింది యాక్టింగ్ ఒక్కటే. ఎవడి పని వాడు చెయ్యాలి. ఒక్కొక్కరిది ఒక్కో టాలెంట్. కథ పూర్తిగా వినేవరికే నా జోక్యం కానీ, ఇన్‌వాల్వ్‌మెంట్ కానీ ఉంటుంది. అప్పుడైనా సజెషన్స్ ఇస్తానే కానీ ఇలాగే ఉండాలని శాసించను.
ఆ రోజులు వేరు
థియేటర్లు మూత పడుతుండటానికీ, జనం థియేటర్లకు రాకపోతుండటానికి పది రకాల కోణాలుంటాయి. వాటిలో స్టార్ల సినిమాలు ఎక్కువగా లేకపోవడం కూడా ఒకటనేది నిజమే. ఎన్టీ రామారావు గారు ఓ ఏడాది పదిహేను సినిమాలు, కృష్ణగారు పద్దెనిమిది-ఇరవై సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. ఆ రోజులు వేరు. ఈ రోజులు వేరు. మనది ప్రపంచ మార్కెట్ ఉన్న సినిమా కాదు. హాలీవుడ్‌లో 'అవతార్', '2012' సినిమాలకు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అత్యున్నత ప్రమాణాలతో తీశారు. బ్రహ్మాండంగా ఆడాయి. అంత బడ్జెట్‌తో మనం సినిమాలు తియ్యలేం. అప్పట్లో 'యమగోల'ని రెండు మూడు నెలల్లో తీస్తే, ఇవాళ 'యమదొంగ' తియ్యడానికి ఏడాది పట్టింది. నా వరకు నేను ఏడాది మూడు సినిమాలు చెయ్యాలని అనుకుంటున్నా. అది జరుగుతుందో, లేదో తెలీదు. దర్శకులు, నిర్మాతల కృషి కూడా కావాలి. ఇది కేవలం ఆర్టిస్టులతో అయ్యే పనికాదు.
పబ్బులకు దూరం
'బృందావనం' నుంచి ఇప్పుడు చేసున్న 'శక్తి'కి వరుసగా 135 రోజులు షూటింగ్ చేశా. మధ్యలో అమ్మమ్మ చనిపోయినప్పుడు ఓ రెండు రోజులు మాత్రమే సెలవు తీసుకున్నా. నేనెంతగా పనిచేస్తున్నాననే దానికి ఇదో నిదర్శనం. ఎప్పుడైనా తీరిక దొరికితే ఇంట్లోనే ఉండి అమ్మతో ఎక్కువగా గడుపుతుంటా. నన్ను నన్నుగా చూసే అద్భుతమైన స్నేహితులు నాకు దొరికారు. వాళ్లలో ఇండస్ట్రీ లోపలి, బయటి వాళ్లిద్దరూ ఉన్నారు. నేను పబ్బులు, డిస్కోథెక్కులకు వెళ్లను. ఆ వాతావరణం నాకు నచ్చదు.
నేనింకా ఎదగాలి
'దానవీరశూరకర్ణ' వంటి పౌరాణికం చెయ్యాలంటే నేనింకా ఎదగాలి. రామారావుగారంత కాకపోయినా ఆయనలో కొంతైనా చెయ్యగలగాలి కదా. దుర్యోధనుడి పాత్ర చెయ్యడమంటే ఒక యుద్ధం చెయ్యడం లాంటిది. దానికి నేనింకా రెడీ కాలేదు. 'యమదొంగ'లో యముడిగా ఒక ప్రయత్నం లాంటిది చేశా. సక్సెస్ అయ్యా. అయితే నేనేం చేసినా రామారావుగారితో పోలిక వస్తుంది. చేస్తే ఆయనలో 80 శాతమన్నా సక్సెస్ చేయగలగాలి. నాలో ఆ పరిణతి ఇంకా రావాలి. పైగా అలాంటి సినిమా చెయ్యగల దర్శకుడు ఉండాలి, అలాంటి స్క్రిప్టు రావాలి. నిర్మాత కావాలి. చెయ్యగలననే ధైర్యం నాలో ఉండాలి.
వచ్చే మార్చిలో 'శక్తి'
ప్రస్తుతం 'శక్తి' షూటింగ్ జరుగుతోంది. తెలుగు చిత్రసీమలోని అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా అది తయారవుతోంది. 'శక్తి' శక్తిగానే ఉంటుంది. ఇందులో చాలా చాలా గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇంకా చాలా వర్క్ ఉంది. వచ్చే ఏడాది మార్చిలో వస్తుందనుకుంటున్నా. మరికొన్ని చర్చల స్థాయిలో ఉన్నాయి. ఫైనలైజ్ అయ్యాక వాటి వివరాలు చెబుతా.
పెళ్లి వచ్చే ఏడాది
నా పెళ్లి నవంబర్‌లో అనే ప్రచారం జరుగుతోంది. కానీ నవంబర్‌లో నా పెళ్లి లేదు. వచ్చే ఏడాది ఉంటుంది. ఎప్పుడనేది నేనే చెబుతా. నేను సాంప్రదాయక పెళ్లి చేసుకుంటున్నా. మా అమ్మా నాన్న వెతికి చూసిన సంబంధం. అలాగే పెళ్లి బట్టల కోసం బ్యాంకాక్ వెళ్లాననే ప్రచారంలో కూడా ఏమాత్రం నిజంలేదు. పెళ్లిలో నేను వేసుకునేవి కూడా సాంప్రదాయకమైనవే. సూటూ బూటూ వేసుకుని చేసుకోను. అభిమానుల మధ్య పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక. ఎంతవరకు వీలవుతుందో చూడాలి. లక్ష్మీ ప్రణతితో మాట్లాడుతుంటా కానీ కలవడం బాగా తక్కువ.

Tuesday, September 21, 2010
సినిమా: సిద్ధార్థ్ పని బాగుంది!

తెలుగు హీరోగానే తనని పరిగణించాలని కోరుకుంటున్న తమిళుడు సిద్ధార్థ్ ఆ లక్ష్యంలో భాగంగా తెలుగు ప్రేక్షకుల్లో తన ఇమేజిని పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. 2006లో వచ్చిన 'బొమ్మరిల్లు' తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ లేని అతను త్వరలో 'బావ'గా ఆకట్టుకోడానికి వస్తున్నాడు. బాలీవుడ్ లో 'రంగ్ దే బసంతి' (2006) తర్వాత చేసిన 'స్ట్రైకర్' సినిమా ఆడకపోవడంతో ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్ లోనే దృష్టిని కేంద్రీకరిస్తున్నాడు. 'బొమ్మరిల్లు' తర్వాత అతను చేసిన మూడు సినిమాలు - 'ఆట', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' (కెఐకెకె), 'ఓయ్'లలో - 'కెఐకెకె' ఓ మోస్తరుగా ఆడితే మిగిలిన రెండూ ఫ్లాపయ్యాయి. 'బావ'లో సిద్ధార్థ్ సరసన 'ఏం పిల్లో ఏం పిల్లడో' ఫేమ్ ప్రణీత నాయిక. కొత్త దర్శకుడు రాంబాబు డైరెక్టరుగా పరిచయమవుతున్న ఈ సినిమా దీపావళికి రానున్నది. ఈ సినిమా కాకుండా రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయి. వాటిలో ఒకటి కోవెలమూడి సూర్యప్రకాశ్ డైరెక్ట్ చేస్తున్న 'అనగనగా ఒక ధీరుడు' (ఇంకా నిర్ధారించలేదు), రెండోది జయేంద్ర డైరెక్ట్ చేస్తున్న '180'. లేటెస్టుగా సిద్ధార్థ్ తో మరో సినిమా చేయబోతున్నామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ సినిమా ద్వారా వేణు శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమ్వనున్నాడు. ఇలా చేతిలో నిండుగా సినిమాలతో తెలుగులో సిద్ధు పని బాగానే ఉంది.
Wednesday, June 16, 2010
Future awaits for 'Jessie'
యువతని "జెస్సీ తెలుసా?" అని అడిగి చూడండి. "ఎందుకు తెలీదు. అందుకే కదా కార్తీక్ (నాగచైతన్య) 'ఏమాయ చేసావె' అన్నాడు" అంటారు ఠక్కున. అంతలా జెస్సీ పాత్రతో ఆకట్టుకుంది, అలరించింది మృదుమధురంగా కనిపించే సమంత. అక్కినేని నాగేశ్వరరావు అంతటాయన్ని కూడా తన అభినయంతో మెప్పించిన ఆమె ఇప్పుడు ఒకదాని వెంట ఒకటిగా క్రేజీ హీరోల సినిమాల్లో ఎంపికవుతూ, తోటి తారలకు అసూయ రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఎన్‌టీఆర్ సరసన రెండో నాయికగా 'బృందావనం'లో నటిస్తున్న ఆమె మరో రెండు పెద్ద సినిమాల్లో నాయికగా ఎంపికైంది. వాటిలో మొదటిది అగ్ర కథానాయకుడు మహేశ్ సరసన కావడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. అలాగే 'బొమ్మరిల్లు' హీరో సిద్ధార్థ్‌తో దిల్ రాజు నిర్మించనున్న చిత్రంలోనూ ఆమె నాయికగా ఎంపికైంది. వేణు శ్రీరాం అనే దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నాడు. ఇలా క్రేజీ ప్రాజెక్టుల్లో నటించే అవకాశాలు పొందుతున్న సమంత పూర్వీకులు తెలుగువాళ్లే అయినా తల్లి మలయాళీ కావడం, పుట్టిందీ, పెరిగిందీ చెన్నైలో కావడం వల్ల తెలుగు తెలీకుండా పెరిగింది. చెన్నైలోని స్టేరీ మెల్లా కాలేజీలో బీకాం చదివేప్పుడు ఆమెకి మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో ఓ తమిళ సినిమాలోనూ నాయికగా ఎంపికై, డైరెక్టర్ గౌతం మీనన్ దృష్టిలో పడింది. మొదట సినిమాల్లో చెయ్యడానికి వెనుకాడి, చివరికి 'ఏమాయ చేసావె'తో పరిచయమయ్యింది. దాంతో ఆమె దశే తిరిగింది. రాత్రికి రాత్రే యువతరం ఆరాధ్య తారగా మారింది. అందుకు తగ్గట్లుగా పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తుండటంతో భవిష్యత్ టాప్ హీరోయిన్ ఆమే అంటున్నాయి సినీ వర్గాలు. ఇక కాజల్ అగర్వాల్ జాగ్రత్తగా ఉండాల్సిందే!
Subscribe to:
Posts (Atom)