Showing posts with label ghantasala. Show all posts
Showing posts with label ghantasala. Show all posts

Wednesday, November 3, 2010

నేటి పాట: రాగమయీ రావే (జయభేరి)

చిత్రం: జయభేరి (1959)
రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గానం: ఘంటసాల

పల్లవి:
రాగమయీ రావే అనురాగమయీ రావే   ||రాగమయీ||
రాగమయీ రావే
అనుపల్లవి:
నీలాల గగనాన నిండిన వెన్నెల   ||నీలాల||
నీ చిరునవ్వుల కలకలలాడగ    ||రాగమయీ||

చరణం 1:
చివురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే   ||చివురులు||
తనువై మనసై నెలరాయునితో
కలువలు కులికే సరసాలు నీవే
సరసాలు నీవే సరాగాలు నీవే    ||రాగమయీ||

చరణం 2:
సంజెలలో సంజెలలో హాయిగ సాగే చల్లనిగాలిలో
మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు
జిలుగే సింగారమైన
చుక్క కన్నెలు అంబరాన
చుక్క కన్నెలు అంబరాన
సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను
నవ పరిమళమే నీవు
రావే రాగమయీ నా అనురాగమయీ   |రావే||

చరణం 3:
నీడజూసి నీవనుకొని పులకరింతునే
అలవికాని మమతలతో కలువరింతునే
నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన
కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే
నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే
రావే రాగమయీ నా అనురాగమయీ   ||రావే||

Sunday, October 31, 2010

దీపావళి (1960)

తారాగణం: ఎన్టీ రామారావు, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్వీ రంగారావు, గుమ్మడి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి
రచన: సముద్రాల రాఘవాచార్య, గాలి బాలసుందరరావు
సంగీతం: ఘంటసాల
నిర్మాత: కె. గోపాలరావు
దర్శకుడు: ఎస్. రజనీకాంత్
బేనర్: అశ్వరాజ్ ప్రొడక్షన్స్
విడుదల తేది: 22 సెప్టెంబర్
కథ: భూదేవీ వరాహ మూర్తులకు జన్మించిన నరకాసురుడు (ఎస్వీ రంగారావు) ఘోర తపస్సు చేసి భూదేవి చేతిలో తప్ప మరెవ్వరిచే హతం కాలేననే వరాన్ని శివుని నుంచి పొందుతాడు. ఇంద్రాది దిక్పాలకుల్ని జయిస్తాడు. కృష్ణ భక్తుడైన నాగదత్తు (గుమ్మడి)ని మోసగించి ఆయన కుమార్తె వసుమతి (ఎస్. వరలక్ష్మి)ని వివాహమాడతాడు. తమకు పుట్టిన బిడ్డను తల్లి ఐన వసుమతి నుంచి వేరు చేస్తాడు. తనపై పగబట్టిన నాగదత్తుని నేత్రాలు తోడుతాడు. కృష్ణుని (ఎన్టీ రామారావు)పై పగబట్టి ద్వారకకు కృష్ణుని వేషంతో వచ్చి యువతుల్ని అపహరించుకు పోతాడు. ద్వారకావాసులు సత్యభామ (సావిత్రి)తో మొరబెట్టుకుంటారు, కృష్ణుని అదుపులో వుంచుకోమని. అంతవరకు సహనం వహించిన కృష్ణుడు లోక రక్షణార్థం నరకాసుర సంహారానికి సత్యభామా సమేతంగా బయలుదేరుతాడు. సత్యభామలో భూదేవి అంశ వున్నదనీ, నరక సంహారం సత్యవల్లనే కావాలనీ కృష్ణుని వల్ల గ్రహించిన రుక్మిణి (కృష్ణకుమారి) ఆ ఇరువురినీ విజయులై రమ్మని వీడ్కోలిస్తుంది. అటు నరకాసురుడూ సమర రంగానికి పయనమవుతాడు.
యుద్ధంలో కృష్ణుడు మూర్ఛపోయినట్లు నటిస్తాడు. నరకాసురుడు సత్యభామను అవమానిస్తాడు. నరకాసురునిపై అస్త్రం ప్రయోగిస్తుంది సత్యభామ. భూదేవియే సత్యభామ అని అవసాన దశలో నరకాసురుడు గ్రహించి క్షమాభిక్ష వేడుతాడు. నరకాసురుని చిరస్మరణీయం చేయాల్సిందిగా భూదేవి అర్థిస్తుంది. నరకాసురుని జ్ఞానజ్యోతికి చిహ్నంగా లోక వాసులంతా ఇంటింటా జ్యోతులు వెలిగించుకుని పండగ చేసుకొంటారనీ, ఆ పర్వదినమే 'దీపావళి'గా పిలువబడుతుందనీ చెప్పిన కృష్ణుడు ప్రాగ్జ్యోతీషపురంలో నరకాసురుని కుమారుని పట్టాభిషిక్తుని చేస్తానని మాట ఇస్తాడు.                      

Sunday, October 24, 2010

నేటి పాట: చెంగావి రంగు చీర (బంగారుబాబు)

చిత్రం: బంగారుబాబు (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

ఆమె: ఛీ.. ఛీ.. ఛీ..

అతడు: ఛా.. ఛా.. ఛా..
             చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
             దాని జిమ్మదియ్య అందమంతా చీరలోనే వున్నది

ఆమె: చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
           దాని జిమ్మదియ్య కొంగు కొంగు కలిపి చూడమన్నది

అతడు: మెరుపల్లె వచ్చింది నా యింటికి - నన్ను
              మెల్లంగ దించింది ముగ్గులోనికి

ఆమె: తలదాచుకొమ్మని తావిస్తినీ - పిల్ల
            దొరికింది చాలనీ ఇల్లాల్ని చేస్తివి..   ||చెంగావి||

అతడు: ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి - దాంతో
              వెర్రెత్తిపోయింది కుర్రవాడికి

ఆమె: పిచ్చివాడనే పేరుచాటున మాటువేసినావు
           పిల్లదాని పెదవిమీద కాటు వేసినావు...   ||చెంగావి||

అతడు: సరి.. సరి.. సరి..

ఆమె: సరసంలో పడ్డాడు యిన్నాళ్లకి - అబ్బో
           సంగీతం వచ్చిందీ బుజ్జిబాబుకి

అతడు: తెరచాటు తొలిగింది పరువానికి - అది
               పరవళ్లు తొక్కుతూ పాడింది నేటికి...   ||చెంగావి||

Saturday, October 23, 2010

నేటి పాట: ఒసె వయ్యారి రంగీ (పల్లెటూరి బావ)

చిత్రం: పల్లెటూరి బావ (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: టి. చలపతిరావు
గానం: ఘంటసాల

పల్లవి:
ఒసె వయ్యారి రంగీ - వగలమారి బుంగీ
ఊగిందే నీ నడుము ఉయ్యాల
ఆ వూపు చూస్తుంటే -
నే నోపలేకుంటే
పాడిందే నా మనసు జంపాల                
చరణం 1:
నీ చూపులో వుందే పిడిబాకు - దాని
పదునెంతో చూస్తానే -
నీ సెంపలో వుందే సిగురాకు - దాని
వగరెంతో సెబుతానే -
యీయేళ కాదని అనమాకు
ఇంకెన్నాళ్లే యీ కొలువు
నా రవ్వ - నా గువ్వ - నా మువ్వ -
ఓ రంగమ్మా - జివజివలాడిందే
మనసే - గుబగుబలాడిందే...   ||ఒసే||
చరణం 2:
ఎగిరెగిరి పడుతోందే నీ పైట,
    ఓహో యీపాటి చిరుగాలికే
ఉరికురికి వస్తోందే నీ వయసు,
    ఆహ నాతోటి జగడానికే
అదిరదిరి పడుతోంది నీ మనసు,
    వుత్తుత్తి సరసాలకే -
నా కన్న - నా చిన్న - నా పొన్న
ఓ రంగమ్మా - జివజివలాడిందే -
మనసే గుబగుబలాడిందే -   ||ఒసే||
చరణం 2:
కోటప్ప తిరణాల కెళ్లినపుడు -
    మనం కొన్నామె గుళ్లపేరు
అది రొమ్ముమీద అటూ యిటూ వూగుతుంటే
నాకు రిమ్మతెగులు రేగుతుందే -
పెళ్లయినవాణ్ణని జంకమాకు -
ఒకరికి యిద్దరైన వేడుకేలే -
నా చిట్టి - నా పొట్టి - నా పట్టి
ఓ రంగమ్మా ఏస్తానె మూడుముళ్లూ
రంగమ్మా ఏస్తానె మూడుముళ్లూ
ప్పిప్పి పిప్పీ డుండుం పిప్పిప్పీ డుండుండుం

Friday, October 22, 2010

నేటి పాట: మబ్బులు రెండు భేటీ అయితే (దేశోద్ధారకులు)

చిత్రం: దేశోద్ధారకులు (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

ఆమె: మబ్బులు రెండు భేటీ అయితే మెరుపే వస్తుంది
అతడు: మనసులు రెండు పేచీ పడితే వలపే పుడుతుంది
ఆమె: మూడు ముళ్లూ పడతాయంటె సిగ్గే మొగ్గలు వేస్తుంది
అతడు: ఆ మొగ్గలు పూచీ మూడు రాత్రులు తీయని ముద్రలు వేస్తాయి
             కన్నులు నాలుగు కలిశాయంటే పున్నమి వెన్నెల కాస్తుంది
ఆమె: ఆ వెన్నెల నాలుగు వారాలైనా తరగని వెలుగై వుంటుంది
           అయిదోతనమే ఆడజన్మకు అన్ని వరాలను మించింది
అతడు: ఆ వరాన్ని తెచ్చిన మగువే మగనికి ఆరో ప్రాణం అవుతుంది
             అడుగులు ఏడూ నడిచామంటే అనుబంధం పెనవేస్తుంది
ఆమె: ఆ అనుబంధం ఏడేడు జన్మలకు వీడనిబంధం అవుతుంది   ||మబ్బులు||                             

Thursday, October 21, 2010

నేటి పాట: చీకటి వెలుగుల రంగేళీ (విచిత్రబంధం)

చిత్రం: విచిత్రబంధం (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

పల్లవి:
చీకటి వెలుగుల రంగేళీ
జీవితమే ఒక దీపావళి - మన
జీవితమే ఒక దీపావళి
అందాల ప్రమిదల ఆనందజ్యోతుల
ఆశల వెలిగించు దీపాలవెల్లి    ||చీకటి||                        
చరణం 1:
అక్కయ్య కన్నుల్లో మతాబులు
ఏ చక్కని బావకో జవాబులు
మాటల్లో వినిపించు చిటపటలు
ఏ మనసునో కవ్వించు గుసగుసలు    ||చీకటి||
చరణం 2:
అల్లుళ్లు వస్తారు అత్తవారిళ్లకు
మరదళ్లు చేస్తారు మర్యాద వాళ్లకు
బావ బావ పన్నీరు - బావను పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు - వీసెడు గుద్దులు గుద్దేరు    ||చీకటి||
చరణం 3:
అమ్మాయి పుట్టింది అమాసనాడు
అసలైన గజదొంగ అవుతుంది చూడు
పుట్టినరోజున దొరికాడు తోడు
పున్నమినాటికి అవుతాడు జోడు    ||చీకటి||

Wednesday, October 20, 2010

నేటి పాట: ఎన్నాళ్లో వేచిన ఉదయం (మంచి మిత్రులు)

చిత్రం: మంచి మిత్రులు (1969)
రచన: సి. నారాయణరెడ్డి
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
గానం: ఘంటసాల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

ఎస్.పి.: ఎన్నాళ్లో వేచిన ఉదయం
             ఈనాడే.. ఎదురౌతుంటే   ||ఎన్నాళ్లో||
ఘంటసాల: ఇన్నినాళ్లు దాచిన హృదయం
                   ఎగిసి ఎగిసిపోతుంటే..
ఎస్.పి.: ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి                          
ఘంటసాల: ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి
ఎస్.పి.: మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని
             నీతికి నిలబడువానికి ఏనాటికి ఓటమి లేదని   ||నీతికి||
             నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలనివస్తే
             ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి   ||ఇంకా||
ఘంటసాల: నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
                   కత్తులు విసిరేవానిని, ఆ కత్తితోనె గెలవాలని  ||కత్తులు||
                   నేనెరిగిన చేదునిజం నీతో చెప్పాలని వస్తే
                   ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి    ||ఇంకా||
ఎస్.పి.: ఎన్నాళ్లో వేచిన ఉదయం
             ఈనాడే.. ఎదురౌతుంటే
ఘంటసాల: ఇన్నినాళ్లు దాచిన హృదయం
                   ఎగిసి ఎగిసిపోతుంటే..
ఎస్.పి.: ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి
ఘంటసాల: ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి

Wednesday, October 13, 2010

నేటి పాట: నిన్న మొన్న రేకువిప్పిన (బడిపంతులు)

చిత్రం: బడిపంతులు (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

అతడు: నిన్న మొన్న రేకువిప్పిన లేతమొగ్గా
నీకు ఇంతలోనే నన్ను చూస్తే అంత సిగ్గా

ఆమె: నిన్న మొన్న రెక్కలొచ్చిన గండు తుమ్మెదా
నీకు అంతలోనే నన్ను చూస్తే ఇంత తొందరా

అతడు: పరికిణీలు కట్టినప్పుడు లేని సొగసులు
నీ పైటకొంగు చాటున దోబూచులాడెను

ఆమె: పసితనాన ఆడుకున్న తొక్కుడు బిళ్లలు
నీ పరువానికి నేర్పినవీ దుడుకు కోర్కెలు   ||నిన్న||

అతడు: పాలబుగ్గలు పూచె లేత కెంపులు
వాలు చూపులందు దోచె వయసు జోరులు

ఆమె: చిరుత నవ్వులు ఒలికె చిలిపితనాలు
చిన్ననాటి చెలిమితీసె వలపుదారులు    ||నిన్న||

అతడు: ఇన్నాళ్లూ కళ్లుకళ్లు కలిపి చూస్తివి
ఇప్పుడేం రెప్పలలా రెపరెపన్నవి

ఆమె: ఇన్నాళ్లూ నీ కళ్లు వూరుకున్నవి
ఇపుడేవేవో మూగబాస లాడుచున్నవి   ||నిన్న||                      

Saturday, October 9, 2010

నేటి పాట: నువ్వు నేను ఏకమైనామూ (కొడుకు కోడలు)

చిత్రం: కొడుకు కోడలు (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

నువ్వూ - నేనూ ఏకమైనామూ -
ఇద్దరము, మనమిద్దరము ఒక లోకమైనాము
లోకమంతా ఏకమైనా - వేరు కాలేము, వేరు కాలేము -

అతడు: కళ్లు నాలుగు కలిపి మనము ఇల్లు కడదాము
ఆమె: అందులో మన చల్లచల్లని వలపు దీపం నిలుపుకుందాము
అతడు: పసిడి మనసుల పట్టెమంచం వేసుకుందాము
ఆమె: అందులో మన పడుచుకోర్కెల మల్లెపూలు పరుచుకుందాము   ||నువ్వు||

అతడు: చెలిమితో ఒక చలువ పందిరి వేసుకుందాము
ఆమె: కలల తీగల అల్లిబిల్లిగ అల్లుకుందాము
అతడు: ఆ అల్లికను మన జీవితాలకు పోల్చుకుందాము
ఆమె: ఏ ప్రొద్దుగాని వాడిపోని పువ్వులవుదాము -    ||నువ్వు||

అతడు: లేత వెన్నెల చల్లదనము - నువ్వు తెస్తావు
ఆమె: అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు
అతడు: సూర్యచంద్రులు లేని జగతిని సృష్టి చేద్దాము
ఆమె: అందులో ఈ సృష్టికెన్నడు లేని సొగసు మనము తెద్దాము    ||నువ్వు||                  

Monday, October 4, 2010

నేటి పాట: చేయీ చేయీ తగిలింది (కొడుకు కోడలు)

చిత్రం: కొడుకు కోడలు (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

అతడు: చేయీ చేయీ తగిలింది
హాయి హాయిగా వుంది

ఆమె: పగలు రేయిగా మారింది
పరువం వురకలు వేసింది     ||చేయీ||

అతడు: నీ వలపే తలుపును తట్టింది - నా
మనసుకు మెలుకువ వచ్చింది - నా
వయసుకు గడియను తీసింది

ఆమె: నీ పిలుపే లోనికి రమ్మంది
నా బిడియం వాకిట ఆపింది
నా సిగ్గే ముగ్గులు వేసిందీ    ||చేయీ||

అతడు: సిగ్గుతో నీవు నిలుచుంటే -
నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే
ఊపిరాడక నా మనసు
వుక్కిరి బిక్కిరి అయ్యింది -

ఆమె: వాకిట నేను నిలుచుంటే
ఆకలిగా నువు చూస్తుంటే
ఆశలు రేగి నా మనసు
అటు ఇటు కాక నలిగిందీ -    ||చేయీ||

ఆమె: నీ చూపే మెత్తగ పాకింది
నా చుట్టూ మత్తును చల్లింది
నిను చూస్తూ వుంటే చాలంది

అతడు: నీ సొగసే నిలవేసింది
నా మగసిరికీ సరితూగిందీ -
నా సగమును నీకు ఇమ్మందీ -    ||చేయీ||                

Friday, October 1, 2010

నేటి పాట: అనగనగా ఒక రాజు (ఆత్మబంధువు)

చిత్రం: ఆత్మబంధువు
రచన: సి. నారాయణరెడ్డి
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

ఆమె: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
అతడు: ఊహూ
ఆమె: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న    ||రాజు||   ||అనగనగా||
అతడు: ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువు సంధ్యలుండి గూడ చవటలయ్యారు
వట్టి చవటలయ్యారు
ఆమె: ||అనగనగా||
అతడు: పడక మీద తుమ్మముళ్లు పరచెనొక్కడు
అయ్యో ఇంటి దీపమార్పివేయ నెంచెకొక్కడు
తల్లీదండ్రులు విషమని తలచెనొక్కడు   ||తల్లీదండ్రులు||
పడుచు పెళ్లామె బెల్లమని భ్రమసెనొక్కడూ... భ్రమసెనొక్కడూ
ఆమె: ||అనగనగా||
అతడు: కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ
ప్రేమయనే పాలుపోసి పెంపు చేసెను   ||కొడుకులతో||
ఆమె: కంటిపాపకంటే ఎంతో గారవించెనూ   ||కంటిపాప||
దాని గుండెలోన గూడుకట్టి ఉండసాగెను.. తానుండసాగెను
అతడు: నాది నాది అనుకున్నది నీది కాదురా   ||అనగనగా||
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా   ||నాది నాది||
కూరిమి గలవారంతా కొడుకులేనురా   ||కూరిమి||
జాలిగుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా.. కుక్కమేలురా
అతడు + ఆమె: ||అనగనగా||                

Wednesday, September 29, 2010

Memories: Ghantasala Venkateswara Rao

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 1922 డిసెంబర్ 4న గుడివాడ వద్ద చౌటపల్లిలో జన్మించారు. తన సినీ జీవితంలో వంద సినిమాల వరకు సంగీత దర్శకత్వం వహించి, దాదాపు ఎనిమిది వేల పాటలు ఆలపించారు. ఆయన తొలి తిరుమల తిరుపతి ఆస్థాన గాయకులు.
సినిమాల్లో తొలిసారి ఘంటసాల బలరామయ్య రూపొందించిన 'సీతారామ జననం'లో ప్రభల సత్యనారాయణతో కలిసి కోరస్ పాడారు. ఆ సినిమాలో సీతాజననం సన్నివేశంలో నటించారు కూడా. దానికి గాను అప్పట్లో 10 రూపాయల పారితోషికాన్ని అందుకున్నారు.
సినిమా పాటలతో పాటు కరుణశ్రీ 'పుష్ప విలాసం', కుంతీ విలాపం ఖండ కావ్యం, శ్రీ శ్రీ 'పొలాలనన్నీ హలాల దున్నీ', గురజాడ 'పుత్తడిబొమ్మ పూర్ణమ్మ' వంటివి గానం చేశారు. ఆయనకు భారత ప్రభుత్వం 1970లో పద్మశ్రీ అవార్డ్ ఇచ్చి సత్కరించింది.              
ఆయన 'పరోపకారం', 'సొంత ఊరు', 'భక్త రఘునాథ్' అనే మూడు చిత్రాలు నిర్మించారు. మూడూ ఫ్లాపవడంతో లక్షల్లో నష్టపోయారు. 1953-54లో ఆరు లక్షల రూపాయల అప్పుల్లో పడ్డారు. 11 సంవత్సరాలు కష్టపడి 1965 నాటికి వాటినన్నింటినీ తీర్చగలిగారు. ఈ అప్పుల కారణంగా ఇంట్లో పనిమనిషినీ, చాకలినీ మాన్పించేశారు.
ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పినా వినకుండా పట్టుదలతో భగవద్గీత గానం చేశారు. కానీ హెచ్.ఎం.వి. వాళ్లు దాని రికార్డుల్ని విడుదల చేయక మునుపే ఆరోగ్యం మరింత క్షీణించి 1974 ఫిబ్రవరి 11న మరణించారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు చేతుల మీదుగా ఆయన ఆలపించిన భగవద్గీత రెండు లాంగ్ ప్లే రికార్డ్స్ విడుదలయ్యాయి.
ఆయన వివాహం మేనమామ కుమార్తె సావిత్రితో 1944 మార్చి 3న జరిగింది. ఆయనకు ఐదుగురు పిల్లలు.. విజయ్ కుమార్, రత్నకుమార్, శ్యామల, సుగుణ, శాంతి. సుగర్ వ్యాధితో విజయ్ కుమార్ 45 ఏళ్ల వయసులో మరణిస్తే ఆయన పిల్లల్ని కూడా రత్నకుమార్ చూసుకుంటున్నారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల సావిత్రమ్మ తమ ఇంటి కింది భాగం అద్దెకిచ్చి పైభాగంలోకి మారారు. తమ కారుని టాక్సీగా తిప్పడానికి ఇచ్చారు. హెచ్.ఎం.వి. వాళ్ల నుంచి ఇదివరకులా రాయల్టీ రావడం లేదు. తన నగల్ని అమ్మి ఆడపిల్లల పెళ్లిళ్లు చేశారు.

Tuesday, September 28, 2010

సినిమా: రెండు మూడు నెలల్లో సినిమా తీసే సత్తా ఉందా?

ఈ రోజుల్లో పెద్ద హీరోల సినిమాల్ని రెండేళ్ల పాటు తీస్తున్నారు. అందుకు చక్కని ఉదాహరణలు - పవన్ కల్యాణ్ 'కొమరం పులి', మహేశ్ 'ఖలేజా'. నిన్నటికి నిన్న రాంచరణ్ 'మగధీర' నిర్మాణానికి కూడా రెండేళ్లు పట్టింది. కానీ టాకీలు మొదలైన తర్వాత చాలాకాలం పాటు ఎంత పెద్ద హీరో సినిమా అయినా రెండు మూడు నెలల్లోతీసేవాళ్లు. దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య ఏ సినిమానైనా ఒకటిన్నర నెల లేదా రెండు నెలల్లో పూర్తి చేసేవాళ్లు.
దాదాపు ఒకేసారి నిర్మాణమై, విడుదలైన గోపీచంద్ 'లక్ష్మమ్మ', ఘంటసాల బలరామయ్య 'శ్రీ లక్ష్మమ్మ కథ' సినిమాలు రెండూ రెండు నెలల్లోనే తయారయ్యాయి. సుందర్ లాల్ నహతా (శ్రీ ప్రొడక్షన్స్) 'శాంతినివాసం' చిత్రాన్ని 3 నెలల్లో నిర్మించారు. షూటింగుకు పట్టిన కాలం కంటే ఎక్కువ కాలం అది థియేటర్లలో ప్రదర్శితమైంది. పెట్టుబడికి ఆరింతలు మించి నికర లాభం రావడం విశేషం. అదే నిర్మాత అక్కినేని, సావిత్రితో 'అభిమానం' (1960) సినిమాని రెండు నెలల్లోనే తీశారు. హేమాహేమీలు పనిచేసిన ఆ సినిమా రెండు నెలల్లో పూర్తి కావడం చిన్న విషయం కాదు.
నటీనటులందరూ ఆ సంస్థని అభిమానించడం వల్లా, ఆ సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ డబ్బు ఠంచనుగా ఇవ్వడంవల్లా, ముందే తారలకు కాల్షీట్లు ఎక్కువ కావాలని చెప్పి, అన్న ప్రకారం అన్ని కాల్షీట్లు నిర్విఘ్నంగా ఉపయోగించుకోవడం వల్లా, అన్నిటికీ మించి ప్లానింగ్ అండ్ పంక్చువాలిటీ వల్లా, ఒక సెట్టుపై పని ముగిసే లోగా మరో సెట్టు సిద్ధం చేసుకుని 'బ్రేక్' లేకుండా షూటింగ్ కొనసాగిస్తూ వున్నందువల్లా డైరెక్టర్ చిత్తజల్లు శ్రీనివాసరావు (సి.యస్. రావు) 'అభిమానం'ను రెండు నెలల్లో పూర్తి చేయగలిగాడు.
మరిప్పుడు అలాంటి వాతావరణం ఉందా? డబ్బుని తప్ప మంచి సంస్థనైనా అభిమానించే తారలున్నారా? అందరికీ ఠంచనుగా డబ్బిచ్చే నిర్మాతలు ఎంతమంది ఉన్నారు? పక్కా ప్లానింగ్, పంక్చువాలిటీ ఎంత మంది పాటిస్తున్నారు? బ్రేక్ లేకుండా షూటింగులు కొనసాగించే దర్శకులు ఉన్నారా? అలా లేనందునే ఇవాళ ఇష్టమొచ్చినన్ని రోజులు షూటింగులు జరుగుతూ నిర్మాతని నిలువునా ముంచుతున్నాయి.                          

Sunday, September 26, 2010

నేటి పాట: గొప్పోళ్ల చిన్నది (కొడుకు కోడలు)



చిత్రం: కొడుకు కోడలు (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల


పల్లవి: 
గొప్పోళ్ల చిన్నది - గువ్వల్లే వున్నది
కొండమీద కోతల్లే - చిక్కనంటది
చెట్టుకొమ్మల్లే - గుండెను వూపేస్తది     ||గొప్పోళ్ల||
చరణం 1:
నడుమెంత సన్నదో - నడకంత చక్కంది
చూపెంత చురుకైందో - రూపంత సొగసైంది
మనిషేమో దుడుకైంది - వయసేమో వుడుకైంది 
మనసెలా వుంటుందో - అది ఇస్తేనే తెలిసేది    ||గొప్పోళ్ల||
చరణం 2:
ఒంటరిగా వచ్చిందంటే - జంటకోసమే వుంటుంది
పేచీతో మొదలెట్టిందంటే - ప్రేమ పుట్టే వుంటుంది
కొమ్మనున్న దోరపండు - కోరుకుంటే చిక్కుతుందా? నాకు దక్కుతుందా?
కొమ్మబట్టి గుంజితేనే - కొంగులోకి పడుతుంది    ||గొప్పోళ్ల||
చరణం 3:
ఊరుకున్న కుర్రవాడ్ని - వుడికించి పోతుంది
మాపటికీ పాపమంతా వేపించుకు తింటుంది
ఒకచోట నిలవలేక - పక్కమీద వుండలేక -
ఆ టెక్కూ నిక్కూ తగ్గి -
రేపిక్కడికే తానొస్తుంది..    ||గొప్పోళ్ల||                            

Wednesday, September 22, 2010

నేటి పాట: ఎవ్వరికోసం ఈ మందహాసం (నర్తనశాల)


చిత్రం: నర్తనశాల (1963)
రచన: శ్రీ శ్రీ
సంగీతం: పి. దక్షిణామూర్తి
గానం: ఘంటసాల, పి. సుశీల

పల్లవి:
ఎవ్వరికోసం - ఈ మందహాసం
ఒకపరి వివరించవే - సొగసరీ
ఒకపరి వివరించవే!
అనుపల్లవి:
చెలిమి కోసం - చెలి మందహాసం!
ఏమని వివరింతునో - గడసరీ
ఏమని వివరింతునో
వలపులు చిలికే - వగలాడి చూపు!
పిలువక పిలిచే - విరహాల రేపు!!

చరణం 1:
ఎదలో మెదలే చెలికాని రూపు!
ఏవో తెలియని - భావాల రేపు!
ఈ నయగారం - ప్రేమసరాగం!
అందించు - అందరాని సంబరాలే ||ఎవ్వరికోసం||

చరణం 2:
పరుగులు తీసే - జవరాలి వయసు!
మెరుపై మెరసి - మరపించు మనసు!
ప్రణయము చిందే - సరసాల చందం!
ఇరువురినొకటిగ - పెనవేయు బంధం!
ఈ వయ్యారం - ఈ సింగారం!
చిందించు - చిన్ని చిన్ని వన్నెలెన్నో ||ఎవ్వరికోసం||

Monday, September 13, 2010

నేటి పాట: కాదు సుమా కల కాదు సుమా (కీలుగుఱ్ఱం)


చిత్రం: కీలుగుఱ్ఱం (1949)
రచన: తాపీ ధర్మారావు
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల, వక్కలంక సరళ

పల్లవి:
కాదు సుమా కల కాదు సుమా
కాదు సుమా కల కాదు సుమా
అమృత పానమును అమర గానమును
గగన యానమును కల్గినట్లుగా
గాలిని తేలుచూ సోలిపోవుటిది
కాదు సుమా కల కాదు సుమా
చరణం 1:
ప్రేమలు పూచే సీమల లోపల
ప్రేమలు పూచే సీమల లోపల
వలపులు పారే సెలయేరులలో
తేటి పాటలను తేలియాడితిని
కాదు సుమా కల కాదు సుమా
చరణం 2:
కన్నె తారకల కలగానముతో
కన్నె తారకల కలగానముతో
వెన్నెల చేరుల ఉయ్యాలలో
ఓ.. ఓ.. ఓహో.. ఓ.. ఓ.. ఒహో..
వెన్నెల చేరుల ఉయ్యాలలో
ఉత్సాహముతో ఊగుచుండుటిది
కాదు సుమా కల కాదు సుమా
చరణం 3:
పూల వాసనల గాలి తెరలలో
వలపు చీకటుల వన్నె కాంతిలో ||పూల||
ఆహా.. ఆ.. ఆ.. ఆహా.. ఆ.. ఆ..
దోబూచులాడుటిది
కాదు సుమా కల కాదు సుమా
కాదు సుమా కల కాదు సుమా

Saturday, September 11, 2010

నేటి పాట: తొలి వలపే పదే పదే (దేవత)


చిత్రం: దేవత (1964)
రచన: శ్రీశ్రీ
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
గానం: ఘంటసాల, పి. సుశీల

పల్లవి:
తొలి వలపే - పదే పదే మదిలో మల్లెలు విరిసే
యేమో అది యేమో - నీ పెదవుల విరిసే నవ్వుల అందాలు
అనుపల్లవి:
ఆ అందం - అనుబంధం - నీకై దాచిన
పూచిన కానుకలు!
నీ కన్నుల వెలిగే దీపాలు!
చరణం 1:
అవి నీ ప్రేమకు - ప్రతిరూపాలు! మన
అనురాగానికి హారతులు తొలి
సని, నినిగ - ఆ.. ఆ.. ఆ - మగనిగమ - ఆ.. ఆ.. ఆ..
గమ, గమ, గనీ, నీ పాద - ఆ.. ఆ.. ఆ..
చరణం 2:
యేలా ఈ వేళ - కడువింతగా!
తోచే తీయగా - మాయగా - ఈ జగమూ
యవ్వనము - అనుభవము - జతకూడిన వేళా!
కలిగిన వలపుల
ఈ రేయి పలికెనే స్వగతమూ
ఈనాడే - బ్రతుకున - శుభదినమూ!
ఈ తనువే - మనకిక చెరి సగము ||తొలివలపే||

Thursday, September 9, 2010

నేటి పాట: 'సిరిసంపదలు' నుంచి

చిత్రం: సిరిసంపదలు (1962)
రచన: ఆత్రేయ
సంగీతం: మాస్టర్ వేణు
గానం: ఘంటసాల, ఎస్. జానకి


పల్లవి:
ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ
మారినదేమి చెలీ
ఆ కారణమేమి చెలీ
ఆ.. ఊ..
వింతకాదు నా చెంతనున్నది
వెండి వెన్నెల జాబిలి
నిండు పున్నమి జాబిలి ఓ..
చరణం 1:
మనసున తొణికే చిరునవ్వెందుకు
పెదవుల మీదికి రానీవు
అహో ఓహో అహా ఆ.. ||మనసున||
పెదవి కదిపితే మదిలో మెదిలే మాట
తెలియునని మానేవు ఊ.. ||వెండి||
చరణం 2:
ఆ.. ఆ.. ఓ.. ఆ.. ఆ.. ఊ.. ఊ..
కన్నులు తెలిపే కథలనెందుకు
రెప్పలార్చి ఏమార్చేవు ఆ.. ||కన్నులు||
చెంపలు పూచే కెంపులు నాతో నిజము
తెలుపునని జడిసేవు ఓహోహో.. ||వెండి||
చరణం 3:
అలుక చూపి అటువైపు తిరిగితే
అగుపడదనుకుని నవ్వేవు ఉహుహు.. ||అలుక||
నల్లని జడలో మల్లెపూలు
నీ నవ్వునకర్థము చూపేను ఆహా.. ||వెండి||

Friday, September 3, 2010

Today's song from 'Patala Bhairavi'


చిత్రం: పాతాళభైరవి (1951)
రచన: పింగళి నాగేంద్రరావు
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల, పి. లీల

పల్లవి:
ఎంత ఘాటు ప్రేమయో
ఎంత తీవ్ర వీక్షణమో
ఎంత ఘాటు ప్రేమయో
కన్నుకాటు తిన్నదిగా కళలు విరిసెనే
నా మనసు మురిసెనే
నా మనసు మురిసెనే
ఎంత ఘాటు ప్రేమయో
ఎంత లేత వలపులో..
ఎంత చాటు మోహములో
ఎంత లేత వలపులో..
కన్నులలో కనినంతనె తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే
నా మనసు నిలిచెనే
ఎంత లేత వలపులో..
చరణం 1:
ఈ జాబిలి ఈ వెన్నెల
ఈ మలయానిలము ||ఈ జాబిలి||
విరహములో వివరాలను విప్పిచెప్పెనే
ఎంత ఘాటు ప్రేమయో..
చరణం 2:
ఓ జాబిలి ఓ వెన్నెల
ఓ మలయానిలమా ||ఓ జాబిలి||
ప్రియురాలికి విరహాగ్నిని
పెంపుజేయరే
ఎంత లేత వలపులో
ఎంత చాటు మోహములో
ఓ.. ఎంత లేత వలపులో..

Tuesday, November 3, 2009

Mirjapuram Raja (Producer and Director)

Mirjapuram Raja was born on 11 Nov, 1896 at Nuzvid, Krishna District. Meka Venkatramaiah Appa Rao Bahadur was his original name.
He established a film studio called Jaya Films at Alwarpet, Chennai.
'Jarasandha' was his first movie as a producer, directed by Chitrapu Narasimha Rao and starred by Vemuri Gaggaiah and MV Rajamma.
Actress C Krishnaveni was his second wife while Anuradha Devi, a producer, is their daughter.
Later Jaya Films turned as Sobhanachala Pictures. 'Bhatka Prahlada' was the first film on this new banner.
Raja turned as a director with the film 'Keelu Gurram', an ANR starred.
He introduced some great personlities to the film industry like Anjali Devi (Gollabhama), Chadalawada Narayana Rao (Jeevana Jyothi), NT Rama Rao (Manadesam), Ghantasala (Lakshmamma), Kamala Kotnis, Ramesh Naidu (Dampatyam), Tripuraneni Gopichand (Lakshamma), Jr. Sriranjani (Bheeshma), P. Leela (Manadesam) and Jikki.
His 'Keelu Gurram' created records at box-office as collected Rs. 40 Lakhs, which was a huge amount at that time. This was the first film dubbed into Tamil.
Raja died on 4 May, 1974.

FilmographyFilms made on Jaya Films:1. Jarasandha (1938)
2. Mahananda (1939)
3. Bhoja Kalidasa (1940)
4. Jeevana Jyothi (1940)
5. Daksha Yagnam (1941)
6. Samsara Narada (1942)

Films made on Sobhanachala Pictures:1. Bhakta Prahlada (1942)
2. Chenchu Lakshmi (1943)
3. Bheeshma (1944)
4. Gollabhama (1947)
5. Madalasa (1948)
6. Keelu Gurram (1949)
7. Lakshmamma (1950)
8. Tilottama (1951)
9. Prajaseva (1952)
10. Sahasam (1952)