చిత్రం: జయభేరి (1959)
రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గానం: ఘంటసాల
పల్లవి:
రాగమయీ రావే అనురాగమయీ రావే ||రాగమయీ||
రాగమయీ రావే
అనుపల్లవి:
నీలాల గగనాన నిండిన వెన్నెల ||నీలాల||
నీ చిరునవ్వుల కలకలలాడగ ||రాగమయీ||
చరణం 1:
చివురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే ||చివురులు||
తనువై మనసై నెలరాయునితో
కలువలు కులికే సరసాలు నీవే
సరసాలు నీవే సరాగాలు నీవే ||రాగమయీ||
చరణం 2:
సంజెలలో సంజెలలో హాయిగ సాగే చల్లనిగాలిలో
మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు
జిలుగే సింగారమైన
చుక్క కన్నెలు అంబరాన
చుక్క కన్నెలు అంబరాన
సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను
నవ పరిమళమే నీవు
రావే రాగమయీ నా అనురాగమయీ |రావే||
చరణం 3:
నీడజూసి నీవనుకొని పులకరింతునే
అలవికాని మమతలతో కలువరింతునే
నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన
కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే
నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే
రావే రాగమయీ నా అనురాగమయీ ||రావే||
No comments:
Post a Comment